![Ashok Selvan Keerthi Pandian Blue Star Movie Release Details - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/23/ashok-selvan.jpg.webp?itok=TPYp18-w)
ఈ హీరోహీరోయిన్ గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడా ఆ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ గురువారం బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సంగతులేంటి? అసలు ఈ హీరోహీరోయిన్ ఎవరనేది చూద్దాం.
(ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?)
క్రికెట్ నేపథ్య కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరబోతున్న తమిళ సినిమా 'బ్లూ స్టార్'. అశోక్ సెల్వన్, పృథ్వీ పాండియరాజన్, దివ్య దురైస్వామి, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోవింద వసంత సంగీతమందించారు. ఎస్. రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జనవరి 25న తమిళంలో విడుదల కానుంది. అయితే సినిమాలో జంటగా నటించిన అశోక్ సెల్వన్-కీర్తి పాండియన్.. నిజ జీవితంలో నాలుగు నెలల క్రితమే భార్యభర్తలయ్యారు. కాబట్టి ఈ సినిమా వీళ్లకు స్పెషల్ అని చెప్పొచ్చు.
1990లో తమిళనాడులోని కుంభకోణం ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'బ్లూ స్టార్' తీసినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. ఇందులో సమకాలిన రాజకీయాలతో పాటు ప్రేమ, వినోదం లాంటి కమర్షియల్ అంశాలకు కూడా చోటు ఉంటుందని చెప్పారు. చిన్న సినిమా కాబట్టి ఓటీటీలోకి వచ్చినప్పుడే తెలుగు వెర్షన్ రిలీజ్ కావొచ్చు.
(ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!)
Comments
Please login to add a commentAdd a comment