Ashok Selvan
-
డైరెక్ట్‌గా ఓటీటీకి ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రియ దర్శకత్వంలో తెరకెక్కించారు. జియో స్టూడియోస్, వైఎస్ఆర్ ఫిలింస్ బ్యానర్లపై యువన్ శంకర్ రాజా, జ్యోతి దేశ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మొదట ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనివార్య కారణాలతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తాజాగా పొన్ ఒండ్రు కండేన్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ రోజు నుంచే స్ట్రీమింగా కానుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజవుతోంది. అంతే కాకుండా కలర్స్ టీవీ తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ చిత్రంలో దీపా శంకర్, సచ్చు కీలక పాత్రలు పోషించారు. #PonOndruKanden is a light hearted fun film, with my buddies @iamvasanthravi and @AishuL_ , directed by @directorpriya_v and music by thalaivan @thisisysr 💥 The film is coming directly to your home, through @JioCinema and @ColorsTvTamil on April 14th. Watch it with your… pic.twitter.com/CMUBcWbNku — Ashok Selvan (@AshokSelvan) April 11, 2024 -
షాకింగ్.. థియేటర్లో కాకుండా నేరుగా టీవీలోకి వస్తున్న సినిమా
తమిళహీరోలు అశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇంతలో అందరికీ షాకిస్తూ నేరుగా టీవీలో విడుదల చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ సినిమాను కలర్స్ తమిళ్ అనే ఛానల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంటూ ప్రోమో కూడా వదిలింది. ఇలా చేశారేంటి? ఇది చూసిన వసంత్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. 'షాకింగ్‌గా ఉంది. ఇది నిజమేనా? జియో స్టూడియోస్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమాలో నటించినవారికిగానీ, డైరెక్టర్‌కుగానీ.. అసలు సినిమాతో సంబంధమున్న ఏ ఒక్కరికీ కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా టీవీలో రిలీజ్ చేస్తుండటం చాలా బాధగా ఉంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం.. థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా టీవీలోకి వస్తుందంటే మా మనసు ముక్కలవుతోంది. ఇంత మర్యాద చూపించారు పొన్ ఒండ్రు కండేన్ సినిమా టీమ్‌కు ఎవ్వరికీ ఈ విషయం తెలియకపోవడం నిజంగా విచారకరం. సోషల్ మీడియా ద్వారా అందరితోపాటు మాకూ ఒకేసారి టెలివిజన్ ప్రీమియర్ గురించి ఇంత మర్యాదగా, గొప్పగా చెప్పినందుకు జియో స్టూడియోస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి సినిమా కమర్షియల్ అంశాలకు సంబంధించిన విషయాల్లో ఆర్టిస్టులకు ఎటువంటి అధికారం ఉండదు. కానీ అందుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకునే హక్కు మాకుంది' అని రాసుకొచ్చాడు. దీంతో జియో స్టూడియో సదరు పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. Shocking !! Is this even True ?? Especially from a reputated and leading production house like @jiostudios. Extremely painful and disheartening to see the promo of #PonOndruKanden and announcement of World Satellite Premiere without any communication to @AshokSelvan,… https://t.co/Q4HT74Gyxx — Vasanth Ravi (@iamvasanthravi) March 14, 2024 -
మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య సినిమాలన్నీ ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే చాలా తర్వగానే వచ్చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలానే ఓ హిట్ సినిమా కూడా దాదాపు నెలలోనే రిలీజ్ కానుంది. అయితే ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందనే విషయం ఆసక్తికరంగా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా? స్ట్రీమింగ్ ఎప్పుడు? (ఇదీ చదవండి: వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్లో విజయ్-రష్మిక) జనవరి 25న తమిళంలో రిలీజైన సినిమా 'బ్లూ స్టార్'. క్రికెట్ నేపథ్యం ప్లస్ కులాల మధ్య అంతరాలు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. అశోక్ సెల్వన్, శంతను, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయింది. కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీలో 'బ్లూ స్టార్' స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అయితే ఈ చిత్రం.. టెంట్ కోట్టా, సింప్లీ సౌత్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఇలా ఓ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో రిలీజ్ కావడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కూడా ఉండొచ్చని టాక్. ఈ సినిమాలో నటించిన అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్.. గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జంటగా తొలి మూవీతోనే హిట్ కొట్టేశారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) #Bluestar, the much-anticipated political cricket movie, streaming from Feb 29 on Tentkotta.💙⭐#BluestaronTentkotta@officialneelam @beemji @lemonleafcreat1@chejai007 @AshokSelvan @imKBRshanthnu@prithviactor @iKeerthiPandian @Lovekeegam@that_Cameraman… pic.twitter.com/0SI76GsOPN — Tentkotta (@Tentkotta) February 23, 2024 -
ఓటీటీలోకి సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ప్రేమ కథలతో పాటు థ్రిల్లర్ చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటిది ప్రేమికుల దినోత్సవం రోజున ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుందో అలాంటి రొమాంటిక్ డ్రామా మూవీని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు హాట్‌స్టార్ తెలిపింది. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన 'సబా నాయగన్' స్ట్రీమింగ్కు రెడీగా ఉంది. ఇందులో కలర్ ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న 'చాందిని చౌదరి' ప్రధాన పాత్రలో నటించింది. భద్రమ్, మన్మధ లీల, పిజ్జా 2 సినిమాలతో 'అశోక్ సెల్వన్' హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కూడా అశోక్ సెల్వన్‌కు గుర్తింపు ఉంది. చాందినీ చౌదరితో కలిసి నటించిన సబా నాయగన్ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం, విశ్వరూపం 2' చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. తమిళంలో భారీ హిట్ అందుకున్న 'సబా నాయగన్' చిత్రం ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో విడుదల చేసింది. ఒక టికెట్‌కు నాలుగు సినిమాలు అంటూ 'జో,ఫైట్ క్లబ్, పార్కింగ్' ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయని.. 'సబా నాయగన్' ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా రానుందని హాట్‌స్టార్ తెలిపింది. ఈ చిత్రం కూడా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. 'సబా నాయగన్' సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్‌కు, ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు అక్కడ 3 స్టార్ రేటింగ్‌తో పాటు Imbd నుంచి 8.1 రేటింగ్ అందుకుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
పెళ్లి తర్వాత జంటగా తొలి సినిమా.. రెండు రోజుల్లో రిలీజ్
ఈ హీరోహీరోయిన్ గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడా ఆ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ గురువారం బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సంగతులేంటి? అసలు ఈ హీరోహీరోయిన్ ఎవరనేది చూద్దాం. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) క్రికెట్ నేపథ్య కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరబోతున్న తమిళ సినిమా 'బ్లూ స్టార్'. అశోక్ సెల్వన్, పృథ్వీ పాండియరాజన్, దివ్య దురైస్వామి, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోవింద వసంత సంగీతమందించారు. ఎస్. రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జనవరి 25న తమిళంలో విడుదల కానుంది. అయితే సినిమాలో జంటగా నటించిన అశోక్ సెల్వన్-కీర్తి పాండియన్.. నిజ జీవితంలో నాలుగు నెలల క్రితమే భార్యభర్తలయ్యారు. కాబట్టి ఈ సినిమా వీళ్లకు స్పెషల్ అని చెప్పొచ్చు. 1990లో తమిళనాడులోని కుంభకోణం ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'బ్లూ స్టార్' తీసినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. ఇందులో సమకాలిన రాజకీయాలతో పాటు ప్రేమ, వినోదం లాంటి కమర్షియల్ అంశాలకు కూడా చోటు ఉంటుందని చెప్పారు. చిన్న సినిమా కాబట్టి ఓటీటీలోకి వచ్చినప్పుడే తెలుగు వెర్షన్ రిలీజ్ కావొచ్చు. (ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!) -
పెళ్లి తర్వాత భర్తతో హీరోయిన్ తొలి సంక్రాంతి
చలనచిత్ర పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ జోడీ కట్టాయి. రీల్ పెయిర్‌గానే కాకుండా రియల్ పెయిర్‌గా గుర్తింపు పొందాయి. తమిళ హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ కీర్తి పాండియన్ ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ గతేడాది సెప్టెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత తొలిసారి సంక్రాంతి పండగను కలిసి జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కీర్తి పాండియన్, అశోక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అయితే సెట్స్‌లోనే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. తమకు అసలైన పొంగల్ జనవరి 25 రోజునే అంటోందీ జంట. ఎందుకంటే ఆ రోజు వీరు జంటగా నటించిన బ్లూస్టార్ మూవీ రిలీజ్ కానుంది. ఇకపోతే పిజ్జా 2, భద్రమ్ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారికీ పరిచయమ్యాడు అశోక్. 2020లో వచ్చిన ఓ మై కడవులే సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో అప్పటినుంచి అశోక్ క్రేజ్ పెరిగిపోయింది. ఈ మధ్యే పోర్ తొళిల్ అనే మూవీతో హిట్ కొట్టాడు. కీర్తి పాండియన్ విషయానికి వస్తే తుంబా, అన్బిర్కినియాల్ సినిమాలతో ఆకట్టుకుంది. అశోక్ నటించిన సభానాయగన్, కీర్తి నటించిన కన్నగి గతేడాది డిసెంబర్ 15న ఒకేసారి విడుదలవడం విశేషం. వీరిద్దరూ జంటగా నటించిన బ్లూస్టార్ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేతలు గణేశ్‌మూర్తి, జి.సౌందర్యలతో కలిసి నీలం ప్రొడక్షన్స్ అధినేత, దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) చదవండి: రోజురోజుకీ పెరుగుతున్న వసూళ్లు.. మూడు రోజుల్లో ఎంతొచ్చిందంటే? -
క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న యంగ్ హీరో సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లూస్టార్. ఈ చిత్రంలో నటి కీర్తి హీరోయిన్గా నటించింది. ఈ మూవీని లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేతలు గణేశ్‌మూర్తి, జి.సౌందర్యలతో కలిసి నీలం ప్రొడక్షన్స్ అధినేత, దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యుడు జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర వివరాలను తెలుపుతూ.. ఈతరం యువకులు పిచ్చిగా అభిమానించే క్రికెట్ క్రీడ, దాని చుట్టూ తిరిగే సంఘటనలు, ప్రేమ వంటి జనరంజకమైన కథాంశంతో తెరకెక్కించిన చిత్రం బ్లూస్టార్ అని పా.రంజిత్ చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి తమిళ్ అళగన్ సినిమాటోగ్రఫీ, గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. అశోక్‌సెల్వన్, కీర్తి వివాహానంతరం నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో శాంతను, పృథ్వీ, దివ్య ముఖ్యపాత్రలు పోషించారు. -
అరుదైన సంఘటన.. బాక్సాఫీస్ బరిలో స్టార్ కపుల్..!
ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్, నటి కీర్తి పాండియన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట ప్రస్తుతం పా రంజిత్ నిర్మిస్తున్న 'బ్లూ స్టార్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే.. ఇదిలా ఉండగా కోలీవుడ్‌లో భార్య, భర్తలే బాక్సాఫీస్ పోటీకి రెడీ అయ్యారు. అశోక్, కీర్తి నటించిన రెండు చిత్రాలు డిసెంబరు 15న బాక్సాఫీస్ వద్ద ఢీకొంటున్నాయి. అశోక్ సెల్వన్ నటించిన 'సబానాయగన్', కీర్తి పాండ్యన్ ప్రధానపాత్రలో వస్తోన్న కన్నగి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. నిజ జీవితంలో భార్యాభర్తలై వీరిద్దరి సినిమాలు ఓకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం కోలీవుడ్‌లో అరుదైన సంఘటన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ కార్తికేయ దర్శకత్వం వహించిన చిత్రం 'సబా నాయగన్'. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్, మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మరోవైపు షాలిన్ జోయా దర్శకత్వం వహించిన 'కన్నగి'లో కీర్తి పాండియన్ గర్భిణీ స్త్రీ పాత్రలో నటించింది. యశ్వంత్ కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో వెట్రి, అధేశ్వర్, అమ్ము అభిరామి, విద్యా ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. Husband vs Wife at the box office on December 15.@AshokSelvan's jolly entertainer #SabaNayagan and @iKeerthiPandian's intense drama #Kannagi to release on the same date. A unique juncture for the newlyweds 😀 pic.twitter.com/GCxI6IbKqh — Siddarth Srinivas (@sidhuwrites) November 26, 2023 View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) -
ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్.. భార్య ఎలా ఫీలైందో చెప్పిన హీరో
నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సభానాయగన్. ఇందులో నటి మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీఎస్ కార్తికేయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని క్లియర్ వాటర్ పిక్చర్స్ అధినేత అరవింద్ జయబాలన్, జీ సినిమా అధినేత అయ్యప్పన్ జ్ఞానవేల్, కెప్టెన్ మెగా ఎంటర్టైన్మెంట్ అధినేత కెప్టెన్ మేఘవానన్ కలిసి నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని, బాలసుబ్రహ్మణ్యం శిష్యుడు దినేశ్ పురుషోత్తమన్, ప్రభు రాఘవ్ కలిసి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 15వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చైన్నెలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు అశోక్ సెల్వన్ మాట్లాడుతూ సభానాయగన్ జాలీగా సాగే క్లీన్ ఎంటర్టైన్మెంట్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కామెడీ, డాన్స్ కోసం తాను చాలా రిహార్సల్స్ చేసినట్లు చెప్పారు. ఈ రెండు విషయాలు ఈ చిత్రంలో తనకు కొత్తగా అనిపించిందన్నారు. దర్శకులు ఇలాంటి కొత్త అవకాశాలను కల్పించినప్పుడే తమలాంటి నటులు వాటిని సద్వినియోగం చేసుకుంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో సన్నిహితంగా నటించడం గురించి అడుగుతున్నారని, అయితే అలా నటించడాన్ని తన భార్య కీర్తి ఏమాత్రం తప్పుగా భావించరని పేర్కొన్నారు. తొలిప్రేమ, పాఠశాల, జీవితం వంటివి మరిచిపోలేని అనుభవాలని అవి, మనసులోంచి తొలగించలేనివని అన్నారు. అలాంటి వాటిని మళ్లీ గుర్తు చేసే చిత్రంగా సభానాయగన్ ఉంటుందన్నారు. అంతే కాకుండా మీ మానసిక వేదనలకు ఒక మంచి వైద్యంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. చదవండి: ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను: మహేశ్‌బాబు -
ప్రియురాలి మెడలో మూడుముళ్లు వేసిన హీరో అశోక్ సెల్వన్, వీడియో వైరల్
-
ఘనంగా జరిగిన కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ వివాహం
తమిళసినిమా: సీనియర్ నటుడు అరుణ్‌పాండియన్ చిన్న కూతురు నటి కీర్తీపాండియన్కు నటుడు అశోక్సెల్వన్కు బుధవారం ఉదయం వివాహం జరిగింది. సూదుకవ్వుం, ఓ మై కడవులే, పోర్ తొళిల్ వంటి చిత్రాల్లో నటించిన అశోక్‌సెల్వన్, తుంబా, అన్బుక్కు కినియాళ్ వంటి చిత్రాల్లో నటించిన కీర్తీపాండియన్ల మధ్య చాలా కాలం క్రితమే ప్రేమ మొలకెత్తింది. ఇరు కుటుంబాల అనుమతితో వీరి వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. కాగా బుధవారం ఉదయం తిరునల్వేలి జిల్లా రెడ్డియార్ పట్టి సమీపంలోని ఇట్టేరి గ్రామంలో అరుణ్‌పాండియన్ ఫామ్ హౌస్‌లో వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు పాల్గొన్నారు. కాగా ఈ సినీ జంట పెళ్లి రిసెప్షన్ చైన్నెలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఆ తేదీని ఇంకా వెల్లడించలేదు. -
హీరోయిన్ను పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్
రీల్ లైఫ్‌లో జంటగా కనిపించి మురిపించిన కొందరు హీరోహీరోయిన్లు నిజ జీవితంలోనూ జోడీ కట్టిన సంగతి తెలిసిందే! తాజాగా అదే బాటలో పయనించాడు కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్. హీరోయిన్ కీర్తి పాండియన్‌తో ఏడడుగులు వేశాడు. బ్లూ స్లార్ మూవీలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 13న తమిళనాడులోని తిరునల్వేలిలో ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కీర్తి పాండియన్ కజిన్ రమ్య పాండియన్ ఈ కొత్త జంట ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపింది. 'ప్రియమైన కన్మని(కీర్తి) హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. ప్రియాతిప్రియమైన మాపిలై(అశోక్ సెల్వన్).. మా కుటుంబంలోకి స్వాగతం' అని రాసుకొచ్చింది. కాగా అశోక్, కీర్తి పాండియన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగినా వీరి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడన్‌గా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. జంటగా కొత్త జీవితం ఆరంభించబోతున్న దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే అశోక్ సెల్వన్ పిజ్జా 2, భద్రమ్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. తమిళంలో ఓ మై కడవులే సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టిన అతడు వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవలే పోర్ తొళిల్ అనే థ్రిల్లర్ మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అతడు బ్లూ స్టార్ సినిమా చేస్తున్నాడు. దీన్ని పా రంజిత్ నిర్మిస్తున్నాడు. Happy married life my dear Kanmani @iKeerthiPandian ♥️and welcome to our family our dearest Maapilai @AshokSelvan 🤗 pic.twitter.com/dvXXkJe3ma — Ramya Pandian (@iamramyapandian) September 13, 2023 “செம்புலப் பெயல் நீர் போல அன்புடை நெஞ்சம் தாம் கலந்தனவே.”#Grateful#AshoKee🔥 @iKeerthiPandian pic.twitter.com/TyQwuO7oGK — Ashok Selvan (@AshokSelvan) September 13, 2023 చదవండి: స్నేహకు క్రేజీ ఆఫర్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ హీరోకి జోడిగా -
ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరబోతుంది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తమిళ హీరో అశోక్ సెల్వన్ గురించి తెలుగు ప్రేక్షకులు కొంతమందికి తెలుసు. 'పిజ్జా 2', 'భద్రమ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో చాన్నాళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల్ని ఇతడు పలకరించాడు. కానీ పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయారు. అయితే 2020లో వచ్చిన 'ఓ మై కడవులే' హిట్ కావడం ఇతడికి చాలా ప్లస్ అయింది. దీని తర్వాత వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) అలానే గతేడాది ఏకంగా 5 సినిమాల్లో హీరోగా నటించాడు. ఓ రెండు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. ఇకపోతే మొన్నీ మధ్య 'పోర్ తొళిల్' అనే థ్రిల్లర్‌తో సూపర్‌హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'బ్లూ స్టార్' మూవీలో చేస్తున్న అశోక్ సెల్వన్.. ఇందులో తనతోపాటు నటిస్తున్న కీర్తి పాండియన్ని పెళ్లి చేసుకోబోతున్నాడట. సెప్టెంబరు 13న కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయం రూమర్ అయినప్పటికీ.. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా కీర్తి పాండియన్ ప్రస్తుతం హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. 'తుంబా', 'అన్బిర్కినియాల్' ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారిపోయింది. View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) -
'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
టైటిల్: పోర్ తొళిల్ నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్‌బాబు తదితరులు నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా దర్శకుడు: విఘ్నేశ్ రాజా సంగీతం: జేక్స్ బెజోయ్ ఎడిటర్: శ్రీజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్ శివాజీ విడుదల తేది: 2023 ఆగస్టు 11 (సోనీ లివ్) థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అలా కొన్నాళ్ల ముందు తమిళంలో విడుదలైన 'పోర్ తొళిల్' సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. సోనీ లివ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ స్టోరీకి తోడు సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) కథేంటి? క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇతడి దగ్గర డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాశ్(అశోక్ సెల్వన్) వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా ఉంటుంది. తిరుచ్చిలో జరిగిన ఓ మర్డర్ కేసు విచారణ బాధ్యత ఈ ముగ్గురికి అప్పగిస్తారు. దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చివరకు లోకనాథన్, ప్రకాశ్, వీణ... హంతకుడిని పట్టుకున్నారా? వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే 'పోర్ తొళిల్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా ఏదైనా సరే దాదాపుగా రెండే అంశాలు ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీటిలో ఏదో ఓ పాయింట్ ఆధారంగానే దాదాపు అన్ని మూవీస్ తీస్తుంటారు. 'పోర్ తొళిల్'కి కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. అయితే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే థ్రిల్. మూవీ చూస్తున్నంతసేపు మనకు అన్నీ తెలుసని అనుకుంటాం. కానీ ఏదో ఓ కొత్త ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మ్యాజిక్ అదే. ఫస్టాప్ విషయానికొస్తే.. రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ చోట యువతి శవం కనిపిస్తుంది. అలా ఫస్ట్ సీన్‌తోనే దర్శకుడు నేరుగా పాయింట్లోకి తీసుకెళ్లిపోయాడు. అనంతరం ఎస్పీ లోకనాథన్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్ పాత్రల పరిచయం. మనస్తత్వాలు డిఫరెంట్‌గా ఉండే ఈ ఇద్దరు కలిసి, ఓ మర్డర్ కేసు దర్యాప్తు చేయడం, ఈ క్రమంలోనే వీళ్లకు ఆధారాలు ఒక్కొక్కటిగా దొరకడం.. ఇలా స్టోరీ చకచకా పరుగెడుతూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఓ టెంపోలో సాగిన సినిమా.. సెకండాఫ్‌లో మాత్రం మంచి ట్విస్టులతో మరో రేంజుకి వెళ్లింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని మంచి థ్రిల్ ఇచ్చే సీన్స్‌తో ఎండ్ చేయడం బాగుంది. ఓవైపు లోకనాథన్, ప్రకాశ్... మర్డర్ కేసు దర్యాప్తు చేస్తుండగానే వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న సీన్స్ అన్నీ కూడా సాధారణ ప్రేక్షకుడికి క్లియర్‌గా అర్థమయ్యేలా ఉంటాయి. ఫీల్డ్ ట్రైనింగ్, హత్య ఎలా జరిగిందో వివరించడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ప్రకాశ్ అమాయకత్వంతో సింపుల్ కామెడీ మనల్ని నవ్విస్తుంది. సీన్స్ అన్నింటికీ క్లైమాక్స్‌కి లింక్ చేసిన విధానం బాగుంది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని కాకుండా చివర్లో ఓ సందేశం ఇచ్చారు. అయితే అది చూసిన తర్వాత నిజంగానే మనుషులు ఆ ఒక్క విషయం వల్ల సైకో కిల్లర్స్‌లా మారతారా అనే డౌట్ వస్తుంది. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కనిపించే పాత్రలు చాలా తక్కువ. కాకపోతే ప్రతి ఒక్కరినీ దర్శకుడు బాగా వాడుకున్నాడు. ఎస్పీ లోకనాథన్‌గా శరత్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌గా అశోక్ సెల్వన్ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రకాశ్ పాత్ర మొదట భయస్తుడిగా కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మారిపోతుంది. వీణగా నిఖిల్ విమల్ బాగానే చేసింది. ఈ పాత్రకు పెద్దగా స్కోప్ లేదనుకుంటాం. కానీ మూవీ చివరకొచ్చేసరికి ఈమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. కెన్నడీగా శరత్‌బాబు రోల్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. 'పోర్ తొళిల్' సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉంది. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా ప్రతిఒక్కరూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. రైటర్ ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, దర్శకుడు విఘ్నేశ్ రాజాతో కలిసి మంచి థ్రిల్లర్‌ని ప్రేక్షకులకు అందించారు. హీరోహీరోయిన్లు ఉన్నారు కదా అని లవ్ ట్రాక్ లాంటి వాటి జోలికి పోకుండా దర్శకుడు మంచి పనిచేశాడు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే 'పోర్ తొళిల్' బెస్ట్ ఆప్షన్. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?
నటుడు శరత్‌కుమార్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పోర్ తొళిల్. ఈ 4 ఎక్స్పిరిమెంట్స్, ఎప్రియస్ స్టూడియో సంస్థలతో కలిసి అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం ఇది. దర్శకుడు విఘ్నేష్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి నిఖిలా విమల్ కీలక పాత్ర పోషించారు. కలైసెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలో విలేకరులతో ముచ్చటించింది. శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. సీరియల్ హత్యల ఉదంతంతో సాగే ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. హత్యలను ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్ర కథ సాగుతుందన్నారు. నటుడు అశోక్ సెల్వన్ మాట్లాడుతూ.. థ్రిల్లర్ కథా చిత్రంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. దర్శకుడు విఘ్నేశ్ రాజు మాట్లాడుతూ.. చిత్రాన్ని 42 రోజులలో పూర్తి చేశామని, అందులో ఎక్కువ భాగం రాత్రి వేళ షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు తమ ఈగోల మధ్య సీరియల్ హత్యల మిస్టరీ ఎలా చేధించారు అన్నదే పోర్ తొళిల్ చిత్రమని చెప్పారు. -
అరేంజ్ మ్యారేజ్ నాకు సెట్ కాదు : నటుడు
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదుగుతున్న నటుడు అశోక్ సెల్వన్. ఓ మై కడవులే వంటి హిట్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన త్వరలో తెలుగు చిత్ర, పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాగా తాజాగా ఈయన నాలుగు పాత్రల్లో నటించిన చిత్రం నిత్తం ఒరువానం. నటి రీతువర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని ఆర్.కార్తీక్ దర్శకత్వంలో వైకామ్ 18 స్టూడియోస్, ఈస్ట్ రైజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నటుడు అశోక్ సెల్వన్ గురువారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ నిత్తం ఒరువానం తన ఫేవరెట్ చిత్రం అన్నారు. ఇందులో భిన్నమైన నాలుగు పాత్రలు పోషించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. కాగా ఇందులో ముగ్గురు హీరోయిన్లతో నటించడం గురించి అడుగుతున్నారని చెప్పారు. చిత్రంలో కథానాయికల ఎంపిక అన్నది దర్శకుడిదేనన్నారు. అలాగే తనతో కలిసి నటించిన హీరోయిన్లలో నచ్చిన నటి ఎవరిని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన టాలెంట్ ఉంటుందన్నారు. అదే విధంగా మంచీ చెడూ ఉంటాయన్నారు. తనకు అందరూ నచ్చిన వారేనని చెప్పారు. పెళ్లెప్పుడన్న ప్రశ్నకు కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయం ఇదనీ, తాను సినీ నేపథ్యం నుంచి గానీ, ఉన్నత కుటుంబం నుంచి గానీ రాలేదన్నారు. శ్రమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఆసమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, అయితే తన మనస్తత్వానికి పెద్దలు నిశ్చయించిన పెళ్లి సెట్ కాదని చెప్పారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మన్మధలీల చిత్రంలో నటించిన వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. మంచి హ్యూమరస్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకుల్లోకి వేరే మాదిరిగా వెళ్లిందన్నారు. అన్ని రకాల పాత్రలో నటించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రం తదుపరి విడుదల కానుందనీ చెప్పారు. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని అశోక్ సెల్వన్ చెప్పారు. -
ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న కోలీవుడ్ హీరో
ముగ్గురు ముద్దుగుమ్మలతో అశోక్ సెల్వన్ రొమాన్స్ చేస్తున్న చిత్రం 'నిత్తం ఒరు వానం'. ఈస్ట్ సంస్థ అధినేత శ్రీనిధి సాగర్ వైకాం 18 స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఆర్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అశోక్ సెల్వన్, నటి నీతువర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుత తమిళ సినిమాలో ట్రావెలింగ్ కథా చిత్రాలు రావడం అరుదని, అలాంటి వైవిధ్య భరిత కథా చిత్రంగా నిత్తం ఒరు వానం ఉంటుందన్నారు. ఇది మనో భావాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా మూడు ప్రాంతాలకు చెందిన మూడు వైవిధ్యమైన భావాలను చిత్రంలో పొందుపరినట్లు చెప్పారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండటం వల్ల ప్రేమ కథా చిత్రంగా అనిపించినా, అంతకుమించి జీవితానికి సంబంధింన సంతోషకరమైన విషయాలు చాలా ఉంటాయన్నారు. ఇందులో నటుడు అశోక్ సెల్వన్ చాలా చక్కగా నటించారని అదే విధంగా ముగ్గురు హీరోయిన్లకు సమానంగా పాత్రలు ఉంటాయని చెప్పారు. నటి రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ మొదలగు ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేశారని పేర్కొన్నారు. వీరి పాత్రలు మగువలకు బాగా నచ్చుతాయని చెప్పారు. చిత్రంలో చాలా పాజిటివ విషయాలను చేర్చినట్లు తెలిపారు. చిత్రం షూటింగ్ చెన్నై, చండీఘర్, మనాలి, గోపిÔశెట్టి పాళయం, కోల్కత్తా ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని, అయ్యనార్ చాయాగ్రహణం అందించారు. -
కోలీవుడ్ హీరోతో రొమాన్స్‌కి రెడీ అంటున్న చాందిని చౌదరి!
చాందిని చౌదరి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మన తెలుగమ్మాయి అయిన చాందిని మధురం వంటి షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లో సహానటి పాత్రలు పోషిస్తూ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవల ఆమె సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె నటించిన కలర్ ఫొటో ఉత్తమ ప్రాంతియ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎన్నికైన విషయం తెలిసిందే. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. త్వరలోనే ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘ఓ మై కడవులే’, ‘మన్మథ లీలై’ చిత్రాల హీరో అశోక్ సెల్వన్ సరసన నటించే చాన్స్ అందుకుంది. ఈ మూవీతో కమల్ హాసన్ శిష్యుడు సి.ఎస్ కార్తికెయన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కమల్ తెరకెక్కించిన విశ్వరూపం సీక్వెల్స్లోకు కార్తీకేయన్ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇప్పుడ స్వయంగా ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ ఈ సందర్భంగా కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘స్కూల్, కాలేజీ, పోస్ట్ కాలేజీకి సంబంధించిన కథ. ఓ యువకుడి జీవితంలోకి మూడు ఫేజెస్‌లో ముగ్గురు అమ్మాయిలు వస్తారు. రొమాంటిక్, కామెడీ నేపథ్యంలోనే మూవీ సాగనుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తాను కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది చాందిని. కాగా అశోక్ సెల్వెన్ తెలుగులో ‘నువ్విలా నువ్విలా’ చితంరలో నటించగా.. అశోక వనంలో అర్జున కళ్యాణంలో అతిథి పాత్రలో కనిపించాడు. -
‘హాస్టల్’ను మొదట వద్దనుకున్నాను: హీరో అశోక్ సెల్వన్
సాక్షి, చెన్నై: హాస్టల్ చిత్ర అవకాశాన్ని తొలుత అంగీకరించ వద్దనుకున్నానని నటుడు అశోక్ సెల్వన్ అన్నారు. ఈయన నటి ప్రియ భవాని శంకర్‌తో కలిసి నటించిన చిత్రం హాస్టల్. టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు అశోక్ సెల్వన్ మాట్లాడుతూ మలయాళ చిత్రానికి రీమేక్ అయినా ఈ చిత్ర అవకాశాన్ని తిరస్కరించాలని మొదట్లో అనుకున్నానన్నారు. అయితే టైడెంట్ ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో నటించానికి అంగీకరించానన్నారు. మలయాళ చిత్రాన్ని దర్శకుడు తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారని, చక్కని వినోద భరిత చిత్రంగా ఇది ఉంటుందని అశోక్ సెల్వన్ తెలిపారు. -
Keerthy Suresh: టీకా తీసుకున్న ‘మహానటి’.. ఫోటో వైరల్
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ కీర్తి సురేష్, హీరో అశోక్ సెల్వన్ చేరారు. వీరిద్దరు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ ఫోటోని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) అలాగే అశోక్ సెల్వన్ కోవిడ్ -19 టీకాను మే 22న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. తనకు చాలా సందేహాలు ఉన్నాయని, అయితే డాక్టర్లు, నిపుణులతో మాట్లాడి ఆ సందేహాలను నివృత్తి చేసుకున్నాను అని, ఆ తరువాత టీకా తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు View this post on Instagram A post shared by Ashok Selvan (@ashokselvan) -
నిహా పోయి మేఘా వచ్చె!
తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు వేసవిలో ప్రకటించారు నిహారిక. నూతన దర్శకురాలు స్వాతిని డైరెక్షన్లో అశోక్ సెల్వన్ హీరోగా నిహారిక హీరోయిన్గా ఈ సినిమా రూపొందాల్సింది. అయితే ఈ సినిమా నుంచి నిహారిక తప్పుకున్నారని తెలిసింది. ఆమె స్థానంలో ‘ఛల్ మోహన్ రంగ, లై’ సినిమాల్లో నటించిన మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారట. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవ్వాలి. అయితే కోవిడ్ వల్ల చిత్రీకరణలన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈలోగా పెళ్లి పనులతో డేట్స్ ఇష్యూ రావడంతో చిత్రబృందంతో మాట్లాడి సినిమానుంచి తప్పుకున్నారట నిహారిక. అక్టోబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. -
నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్
సాక్షి, హైదరాబాద్: అశోక్ సెల్వన్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో మెగా డాటర్ కొణిదెల నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ నటించనున్నారు. కెనన్యా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వాతిని తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట నిహారిక ఎంపికైంది. అయితే ఇటీవల నిహారిక నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఆమె పెళ్లి పీటల ఎక్కనున్న నేపథ్యంలో డేట్స్ లేకపోవడంతో ఈ చిత్రం నుంచి నిహారిక వైదొలగినట్లు సమాచారం. ఆమె స్థానంలో మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించింది. (చదవండి: నిహారిక - చైతన్యల నిశ్చితార్థం) దీనిపై నిర్మాత సెల్వకుమార్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర విభిన్నంగా ఉంటుందన్నారు. అందుకే తొలుత నిహారికను ఎంచుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ పాత్రకు హీరోయిన్ మేఘా ఆకాశ్ సరిగ్గా సరిపోతుందని దర్శకురాలు పేర్కొన్నారు. ఆ పాత్రకు మేఘా సరిపోతుందనిపించి వెంటనే ఆమెను సంప్రదించి కథను వివరించామన్నారు. తనకు కూడా కథ నచ్చడంతో ఒకే చెప్పిందన్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను ఖరారు చేసి వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. (చదవండి: నిహారిక ఎంగేజ్మెంట్: వైరల్ వీడియో) -
మరో తమిళ సినిమా
‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిహారిక కొణిదెల. ఇప్పుడు మరో తమిళ సినిమా అంగీకరించారు. తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ ముఖ్య పాత్రలో ఓ రొమాంటిక్ కామెడీ తెరకెక్కనుంది. స్వాతిని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇందులో నిహారిక హీరోయిన్గా నటించనున్నారు. పూర్తి స్థాయి కామెడీతో ఈ కథాంశం ఉండబోతోందట. ‘‘తమిళంలో మరో సినిమా చేయబోతున్నాను. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు నిహారిక. -
ఐశ్వర్యరాజేశ్ హౌస్ఓనర్ అవుతుందా?
తమిళసినిమా: నటి ఐశ్వర్య రాజేశ్ హౌస్ఓనర్ కావాలనే కల నెరవేరుతుందా? ఏమిటీ అసలు విషయం ఏమిటో చెప్పకుండా హౌస్ఓనర్ అదీ, ఇదీ అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇవా ళ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చాలా మంది కలిగేది సొంత ఇల్లు కలే. అలాంటి ఒక యువ దంపతుల డ్రీమే హౌస్ఓనర్. ఈ టిటైల్తో మహిళా దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అశోక్ సెల్వన్ హీరోగానూ, నటి ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్‌గానూ నటించనున్నారు. దీని గురించి దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ తెలుపుతూ అమ్మణి చిత్రం తరువాత తన తాజా చిత్రానికి గత ఏడాది తమిళ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన తుపాన్ నేపథ్యంలో ఒక చిత్రం చేయాలని భావించానన్నారు. అయితే అ దే సమయంలో తన కూతురు వివాహ నిశ్చి తార్థం జరగడంతో తన పెళ్లి తరువాత ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నానన్నారు. కాగా ఇటీవల ముంబయి వెళ్లినప్పుడు ఒక హిం దీ చిత్రాన్ని చూశానని తెలిపారు.ఆ చి త్రం తన ను చాలా ఆకట్టుకుందని, దాంతో ఆ చిత్ర నిర్మాతను కలిసి హక్కుల కోసం చర్చించినా, అది సెట్ కాలేదన్నారు.అయితే ఆ చిత్ర కథ మాత్రం తన మనసులోంచి పోలేదన్నారు.దీంతో ఆ చిత్ర స్ఫూర్తితో తానే ఒక కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. ఒక యువ దంపతుల సొంత ఇల్లు కల ఇతి వృత్తంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హౌస్ఓనర్ అనే టైటిల్‌ను నిర్ణయించి నట్లు తెలిపారు.చిత్ర షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ చెప్పారు. -
ఈ ప్రపంచాన్ని మార్చింది వారే!
ఈ ప్రపంచాన్ని మార్చిన వారిలో పలువురు మధ్య బెంచ్ విద్యార్థులేనని దర్శకుడు సీజే.జ్ఞానవేల్ పేర్కొన్నారు. నటుడు సూర్య అగరం ఫౌండేషన్‌లో ముఖ్య నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూటత్తిల్ ఒరుత్తన్. అశోక్ సెల్వన్, ప్రియాఆనంద్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక సత్యం సినిమా హాల్లో జరిగింది. చిత్ర ఆడియోను సీనియర్ నటుడు శివకుమార్ సమక్షంలో నటుడు సూర్య ఆవిష్కరించగా నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ నిరంతర శ్రమజీవి అని పేర్కొన్నారు. తన అగరం ఫౌండేషన్‌కు పేరును పెట్టింది ఈయనేనని తెలిపారు. ఈ ఫౌండేషన్ విజయంలో ఆయన పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. తనకు నటుడిని దాటి మంచి పేరు రావడానికి కారణం కూడా జ్ఞానవేలేనని నటుడు సూర్య చెప్పారు. అనంతరం చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ మాట్లాడుతూ తాను పత్రికారంగం నుంచి వచ్చానని.. అందులో గడించిన అనుభవమే ఈ చిత్రం అని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కథకు స్ఫూర్తి నటుడు కార్తీనేనని ఆయన తెలిపారు. తాను ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా తాను తన కుటుంబంలో మధ్యముడిగా పుట్టడం వల్ల ఎవరూ తనను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారన్నారు. అన్నయ్య పెద్దవాడు కావడంతో అమ్మకు ఆయనంటే ప్రేమ అని, అందరి కంటే చిన్నది కావడంతో చెల్లెలంటే నాన్నకు ప్రేమ అని చెప్పారన్నారు. ఆయన చెప్పిన విషయాలనే ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ఈ కూటత్తిల్ ఒరుత్తన్ అని దర్శకుడు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప వారంతా మధ్య బెంచ్‌లో కూర్చునే వాళ్లేనని, అరుుతే వారిని మనం పెద్దగా గుర్తించడం లేదని దర్శకుడు జ్ఞానవేల్ అన్నారు.