అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రియ దర్శకత్వంలో తెరకెక్కించారు. జియో స్టూడియోస్, వైఎస్ఆర్ ఫిలింస్ బ్యానర్లపై యువన్ శంకర్ రాజా, జ్యోతి దేశ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మొదట ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనివార్య కారణాలతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
తాజాగా పొన్ ఒండ్రు కండేన్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ రోజు నుంచే స్ట్రీమింగా కానుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజవుతోంది. అంతే కాకుండా కలర్స్ టీవీ తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ చిత్రంలో దీపా శంకర్, సచ్చు కీలక పాత్రలు పోషించారు.
#PonOndruKanden is a light hearted fun film, with my buddies @iamvasanthravi and @AishuL_ , directed by @directorpriya_v and music by thalaivan @thisisysr 💥
The film is coming directly to your home, through @JioCinema and @ColorsTvTamil on April 14th. Watch it with your… pic.twitter.com/CMUBcWbNku— Ashok Selvan (@AshokSelvan) April 11, 2024
Comments
Please login to add a commentAdd a comment