షాకింగ్‌.. థియేటర్‌లో కాకుండా నేరుగా టీవీలోకి వస్తున్న సినిమా | No Theatre Release for Pon Ondru Kanden, Vasanth Ravi Expressed his Shock | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. ఒక్కమాట చెప్పకుండా డైరెక్ట్‌గా టీవీలోకి.. హీరో ఆవేదన

Published Fri, Mar 15 2024 10:46 AM | Last Updated on Fri, Mar 15 2024 10:59 AM

No Theatre Release for Pon Ondru Kanden, Vasanth Ravi Expressed his Shock - Sakshi

తమిళహీరోలు అశోక్‌ సెల్వన్‌, వసంత్‌ రవి, హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పొన్‌ ఒండ్రు కండేన్‌'. త్వరలో థియేటర్లలో రిలీజ్‌ చేయాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసింది. కానీ ఇంతలో అందరికీ షాకిస్తూ నేరుగా టీవీలో విడుదల చేయనున్నట్లు ‍ప్రకటన వెలువడింది. చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌ ఈ సినిమాను కలర్స్‌ తమిళ్‌ అనే ఛానల్‌లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంటూ ప్రోమో కూడా వదిలింది.

ఇలా చేశారేంటి?
ఇది చూసిన వసంత్‌ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. 'షాకింగ్‌గా ఉంది. ఇది నిజమేనా? జియో స్టూడియోస్‌ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమాలో నటించినవారికిగానీ, డైరెక్టర్‌కుగానీ.. అసలు సినిమాతో సంబంధమున్న ఏ ఒక్కరికీ కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా టీవీలో రిలీజ్‌ చేస్తుండటం చాలా బాధగా ఉంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం.. థియేటర్‌లో రిలీజ్‌ చేయకుండా నేరుగా టీవీలోకి వస్తుందంటే మా మనసు ముక్కలవుతోంది.

ఇంత మర్యాద చూపించారు
పొన్‌ ఒండ్రు కండేన్‌ సినిమా టీమ్‌కు ఎవ్వరికీ ఈ విషయం తెలియకపోవడం నిజంగా విచారకరం. సోషల్‌ మీడియా ద్వారా అందరితోపాటు మాకూ ఒకేసారి టెలివిజన్‌ ప్రీమియర్‌ గురించి ఇంత మర్యాదగా, గొప్పగా చెప్పినందుకు జియో స్టూడియోస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి సినిమా కమర్షియల్‌ అంశాలకు సంబంధించిన విషయాల్లో ఆర్టిస్టులకు ఎటువంటి అధికారం ఉండదు. కానీ అందుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకునే హక్కు మాకుంది' అని రాసుకొచ్చాడు. దీంతో జియో స్టూడియో సదరు పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement