aishwarya lakshmi
-
రెడ్ శారీలో యాంకర్ రష్మీ.. పెళ్లి వీడియోను షేర్ చేసిన బుల్లితెర నటి!
రెడ్ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ హోయలు..సైకిల్‌పై సవారీ చేస్తోన్న నమ్రతా శిరోద్కర్...బ్లాక్ డ్రెస్‌లో ఐశ్వర్య లక్ష్మి స్టన్నింగ్ లుక్స్..పెళ్లి వీడియోను షేర్ చేసిన బుల్లితెర నటి మాన్సి జోషి..పింక్ డ్రెస్‌లో షాలిని పాండే పోజులు.. View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ టైటిల్ ఈవెంట్లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు. -
జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య
ఒకప్పుడు పెళ్లి కోసం యువత ఎగబడే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగాలు, ఇండిపెండెంట్‌గా బతకడం లాంటివి చెబుతూ అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు సింగిల్‌గానే ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్లలో సినిమా హీరోహీరోయిన్లు కూడా ఉన్నారండోయ్. వాళ్లకు పెళ్లిపై నమ్మకమున్నా సరే ఎందుకో చేసుకోవట్లేదు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మాత్రం జీవితంలో తాను పెళ్లి చేసుకోనని చెబుతోంది.(ఇదీ చదవండి: అక్కినేని హీరోతో పెళ్లి.. స్పందించిన మీనాక్షి చౌదరి)మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. గతంలో పెళ్లి చేసుకోనని ఓసారి చెప్పిన ఈమె.. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టింది.'జీవితంలో నేను పెళ్లి చేసుకోను. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలామందిని చూశారు. ఒక్క జంట తప్పితే మిగిలిన వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యాను. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూసినప్పుడల్లా నేను కూడా అలానే చేసుకోవాలని అనుకున్నా. కానీ పెద్దయిన తర్వాత పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది.'(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)'కొన్నేళ్ల ముందు వరకు కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నారు. ఓ మ్యాట్రిమోని సైట్లో నేను నా ప్రొఫైల్ కూడా పెట్టాను. కానీ అది ఫేక్ అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు పెళ్లిపై నా అభిప్రాయం మారిపోయింది' అని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది.తమిళ నటుడు అర్జున్ దాస్‌తో ఈమె ప్రేమలో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మాటలతో అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయాయి. ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో సాయితేజ్ లేటెస్ట్ మూవీలో చేస్తోంది.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
వెబ్ ప్రపంచంలోకి ఐశ్వర్య లక్ష్మి
బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. ఈమె నిర్మాత కూడా. మలయాళంలో పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారు. ఇకపోతే తమిళంలో జగమే తంతిరం, యాక్షన్, కట్టాకుస్తీ, పొన్నియిన్ సెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్,థ్రిల్లర్ థగ్ లైఫ్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఐశ్వర్య లక్ష్మి తాజాగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని తెలిసింది. యాలీ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తమిళ వెబ్‌సిరీస్‌లో నటి ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా చాలా మంది ప్రముఖ నటీమణులు ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూసుతున్నారు. ఆ కోవలో నటి ఐశ్వర్యలక్ష్మి కూడా చేరుతున్నారన్నమాట. -
Aishwarya Lekshmi: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
‘ఆకులో ఆకునై’ మట్టి కుస్తీ సుందరిని గుర్తు పట్టారా? (ఫోటోలు)
-
డైరెక్ట్‌గా ఓటీటీకి ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రియ దర్శకత్వంలో తెరకెక్కించారు. జియో స్టూడియోస్, వైఎస్ఆర్ ఫిలింస్ బ్యానర్లపై యువన్ శంకర్ రాజా, జ్యోతి దేశ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మొదట ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనివార్య కారణాలతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తాజాగా పొన్ ఒండ్రు కండేన్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ రోజు నుంచే స్ట్రీమింగా కానుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజవుతోంది. అంతే కాకుండా కలర్స్ టీవీ తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ చిత్రంలో దీపా శంకర్, సచ్చు కీలక పాత్రలు పోషించారు. #PonOndruKanden is a light hearted fun film, with my buddies @iamvasanthravi and @AishuL_ , directed by @directorpriya_v and music by thalaivan @thisisysr 💥 The film is coming directly to your home, through @JioCinema and @ColorsTvTamil on April 14th. Watch it with your… pic.twitter.com/CMUBcWbNku — Ashok Selvan (@AshokSelvan) April 11, 2024 -
Aishwarya Lekshmi: చీరలో ఐశ్వర్య లక్ష్మి.. సోయగాలు (ఫొటోలు)
-
ఐశ్వర్య లక్ష్మి.. కిర్రాక్ లుక్స్.. (ఫోటోలు)
-
ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?
కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మీ విలక్షణమైన నటనతో పెద్ద ఎత్తున అభిమానుల ఫాలోయింగ్‌ని సొంత చేసుకుంది. అలాంటి ఆమె తాను ఎదుర్కొన్న చేదు ఘటనను గుర్తు చేసుకుంటూ..నా చిన్నతనంలో కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్లినప్పుడు, ఓ యువకుడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ రోజు నేను పసుపు బట్టలు వేసుకుని ఉన్నా. దాని తర్వాత పసుపు బట్టలు వేసుకోవాలంటే భయపడేదాన్ని అని, ఇప్పుడు ఆ భయం లేదని చెప్పుకొచ్చింది" ఐశ్వర్య. కాగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి ఐశ్వర్య లక్ష్మీ. సినిమాల ఎంపికలో తన ప్రత్యేకతను చాటుతున్నట్లే.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్ చూపిస్తోంది. ఆమెకు స్టయిల్‌ను కాయిన్ చేసిన బ్రాండ్స్‌లో కొన్ని.. దేవ్నాగరి.. ఇంజినీర్, డాక్టర్ కావాలనుకున్న అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. అమ్మమ్మ స్ఫూర్తితో ఫ్యాషన్ డిజైన్లోకి అడుగుపెట్టారు. జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ పేరుతో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలో ఏ మూల జరుపుకునే పండగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువే. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఐశ్వర్య ధరించిన దేవ్నాగరి చీర ఖరీదు రూ.55,500/- తృప్తి మెహతా ముంబైలో పుట్టి, పెరిగిన తృప్తి మెహతా.. చిన్నవయసులోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగింది. చుట్టూ ఉన్న ప్రకృతే తన బ్రాండ్‌కి స్ఫూర్తి అని చెబుతుంది తృప్తి. అందుకే తన అన్ని కలెక్షన్స్‌లోనూ పక్షులు, చెట్లు, కొమ్మలు, ఆకులను పోలి ఉండే ఆభరణాలే కనిపిస్తాయి. అదే ఈ బ్రాండ్‌ని ఇతర బ్రాండ్స్‌కి భిన్నంగా నిలుపుతోంది. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ ఐశ్వర్య ధరించిన ఉంగరం ధర: రూ.3,800/-, కమ్మల ధర: రూ.5,800/- (చదవండి: బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
ప్రముఖ నిర్మాణ సంస్థ ఓవరాక్షన్.. నటీనటుల ఆగ్రహం!
కండనాళ్ ముదల్, కణ్ణాముచ్చి ఏనడా చిత్రాల ఫేమ్ ప్రియ దర్శకత్వం వహించిన తాజాచిత్రం పొన్ ఒండ్రు కండేన్. ఈ చిత్రంలో అశోక్‌సెల్వన్, వసంత రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు చెందిన వైఎస్సార్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని కలర్స్ తమిళ్ టీవీ ఛానెల్లో విడుదల చేస్తున్నట్లు ప్రోమోను జియో స్టూడియోస్ సంస్థ తన ఎక్స్ మీడియాలో పేర్కొంది. ఇదే ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వసంత్ రవి తీవ్రంగా ఖండించారు. ఈయన ఈ వ్యవహారంపై తన ఎక్స్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ విషయం తనను ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. జియో స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలాంటి ప్రకటన చేయడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పొన్ ఒండ్రు కండేన్ చిత్రాన్ని నేరుగా ఛానెల్లో విడుదల చేసే విషయం గురించి అశోక్‌సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, నిర్మాత యువన్‌శంకర్‌రాజా, దర్శకురాలు ప్రియ అనుమతి తీసుకోకుండా ఇలాంటి ప్రకటన చేయడం బాధ కలిగిస్తోందన్నారు. తాము ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించినట్లు పేర్కొన్నారు. అలాంటిది చిత్రాన్ని ఛానల్లో విడుదల చేయబోతున్నట్లు చేసిన ప్రకటన గురించి తమకెవరికీ తెలియదన్నారు. అలాంటి ప్రకటనను ఎక్స్ మీడియా ద్వారా ప్రకటించి తమకు మర్యాద నిచ్చినందుకు జియో స్టూడియోస్ సంస్థకు చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమను కలిసి ప్రకటన చేయడం సరికాదని వసంత్‌రవి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
షాకింగ్.. థియేటర్లో కాకుండా నేరుగా టీవీలోకి వస్తున్న సినిమా
తమిళహీరోలు అశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇంతలో అందరికీ షాకిస్తూ నేరుగా టీవీలో విడుదల చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ సినిమాను కలర్స్ తమిళ్ అనే ఛానల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంటూ ప్రోమో కూడా వదిలింది. ఇలా చేశారేంటి? ఇది చూసిన వసంత్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. 'షాకింగ్‌గా ఉంది. ఇది నిజమేనా? జియో స్టూడియోస్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమాలో నటించినవారికిగానీ, డైరెక్టర్‌కుగానీ.. అసలు సినిమాతో సంబంధమున్న ఏ ఒక్కరికీ కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా టీవీలో రిలీజ్ చేస్తుండటం చాలా బాధగా ఉంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం.. థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా టీవీలోకి వస్తుందంటే మా మనసు ముక్కలవుతోంది. ఇంత మర్యాద చూపించారు పొన్ ఒండ్రు కండేన్ సినిమా టీమ్‌కు ఎవ్వరికీ ఈ విషయం తెలియకపోవడం నిజంగా విచారకరం. సోషల్ మీడియా ద్వారా అందరితోపాటు మాకూ ఒకేసారి టెలివిజన్ ప్రీమియర్ గురించి ఇంత మర్యాదగా, గొప్పగా చెప్పినందుకు జియో స్టూడియోస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి సినిమా కమర్షియల్ అంశాలకు సంబంధించిన విషయాల్లో ఆర్టిస్టులకు ఎటువంటి అధికారం ఉండదు. కానీ అందుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకునే హక్కు మాకుంది' అని రాసుకొచ్చాడు. దీంతో జియో స్టూడియో సదరు పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. Shocking !! Is this even True ?? Especially from a reputated and leading production house like @jiostudios. Extremely painful and disheartening to see the promo of #PonOndruKanden and announcement of World Satellite Premiere without any communication to @AshokSelvan,… https://t.co/Q4HT74Gyxx — Vasanth Ravi (@iamvasanthravi) March 14, 2024 -
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. గ్లామర్‌తో రెచ్చగొడుతోన్న శ్రద్ధాదాస్!
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. స్మైలీ లుక్స్‌తో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. రెడ్ శారీలో ఆషిక రంగనాథ్ హోయలు.. బోల్డ్ లుక్స్‌తో రెచ్చిపోతున్న శ్రద్ధాదాస్... వాలెంటైన్స్ మూడ్‌లో మాళవిక మోహనన్.. ఆరెంజ్ డ్రెస్‌లో తేజస్విని గౌడ పోజులు.. రెడ్ డ్రెస్‌లో మరింత బోల్డ్‌గా యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
యంగ్ హీరోతో జతకట్టనున్న పొన్నియిన్ సెల్వన్ భామ!
వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న యంగ్ హీరో అశోక్‌సెల్వన్. ఇటీవల ఈయన నటించిన పోర్ తొళిల్, బ్లూస్టార్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించాయి. తాజాగా అశోక్‌సెల్వన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పొన్ను ఒన్ను కండేన్. వి. ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటిస్తున్నారు. వసంత రవి మరో ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. పొన్ను ఒన్ను కండేన్ చిత్రం యువతను ఆకట్టుకునే పలు ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందని సమాచారం. అశోక్‌సెల్వన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి చిన్న గ్యాప్ తరువాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
మణిరత్నం థగ్ లైఫ్‌లో...
హీరో కమల్‌హాసన్–దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ‘నాయగన్’–1987 (‘నాయకుడు’) తర్వాత 37 ఏళ్లకు రూపొందనున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, ‘జయం’ రవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ఖరారయ్యారు. తాజాగా ఐశ్వర్యా లక్ష్మి ఈ జాబితాలో చేరారు. ఈ చిత్రంలో ఆమె నటించనున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే... ‘థగ్ లైఫ్’లోకి ఐశ్వర్యా రాయ్ ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో ‘ఇద్దరు, గురు, రావణ్, పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాల్లో ఐశ్వర్యా రాయ్ నటించారు. మరి... ‘థగ్ లైఫ్’లో ఆమె నటించనున్నది నిజమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావచ్చాయని, ఈ నెలాఖరులో షూటింగ్ ఆరంభమయ్యే చాన్స్ ఉందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
‘మట్టి కుస్తీ’ భామ గురించి ఈ విషయాలు తెలుసా?
యాక్టర్స్‌గా మారిన డాక్టర్స్.. మన చిత్ర పరిశ్రమలో చాలామందే ఉన్నారు. ఆ జాబితాలోకి నటి ఐశ్వర్యా లక్ష్మి కూడా చేరుతుంది. చిన్న పాత్రలో మెరిసి స్టార్డమ్ దిశగా దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని విషయాలు.. ► ఐశ్వర్యా సొంతూరు తిరువనంతపురం. ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసింది. ► కాలేజీ రోజుల్లోనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ►మలయాళం, తమిళ భాషల్లో ఎక్కువగా నటించే ఐశ్వర్యా .. ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయింది. ఆ తర్వాత ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’తో మెప్పించింది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ కీలక పాత్ర పోషించింది. ►2017లో మలయాళ చిత్రం ‘న్యంగలుడే నాత్తిల్ ఒరిడవేల’తో వెండి తెర ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఆ చిత్రానికిగాను ఉత్తమ పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. దీంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ►నటిగా రాణిస్తూనే తన అభిరుచి మేరకు నిర్మాతగానూ మారింది. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ నిర్మాతల్లో ఐశ్వర్యా ఒకరు. ►ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘కింగ్ ఆఫ్ కొత్త’తో అలరిస్తోంది. కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఏ కొంచెం టైమ్ దొరికినా ఇంట్లో వాళ్లకు వండి వడ్డిస్తుంటా!: ఐశ్వర్యా లక్ష్మి -
అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంంది. హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా.. మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్ గానే అంగీకరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా అవుననే అంటున్నారు. (ఇది చదవండి: 'బిగ్‌బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!) అయితే ఈ కేరళ కుట్టికి మొదట నటనపై ఆసక్తి లేదట. డాక్టర్ అవ్వాలని చదివిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంపై దృష్టి సారించారట. అలా పలు వాణిజ్య సంస్థలకు మోడల్‌గా పనిచేసిన ఈమె ఫొటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితమవడం, దాంతో సినిమా అవకాశాలు రావడం అలా జరిగిపోయిందట. మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్ కథానాయకుడు నటించిన యాక్షన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అదేవిధంగా ధనుష్‌కు జంటగా నటించిన జగమే తంధిరం కూడా నేరుగా ఓటీపీలో స్ట్రీమింగ్ కావడంతో ఆ చిత్రం కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత విష్ణు విశాల్ సరసన నటించిన కట్టా కుస్తీ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో పూంగుళి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా గార్గీ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తింది. తాజాగా దుల్కర్ సల్మాన్‌కు జంటగా కింగ్ ఆఫ్ కోత్త చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకు తగినట్లుగా గ్లామర్‌నే మార్గంగా ఎంచుకుంది. అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అలాంటి ఫొటోల గురించి నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ గ్లామర్‌కు మారడం తప్పనిసరి అని.. అది లేకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేమని పేర్కొంది. (ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్ ఆఫ్ కొత్త నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కళ్ళరక్కల్, అనిఖా సురేంద్రన్, నైలా ఉషా, షాహుల్ హసన్, గోకుల్ సురేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ దర్శకత్వం: అభిలాష్ జోషి నేపథ్య సంగీతం: జాక్స్ బిజోయ్ పాటలు : షాన్ రెహమాన్, బిజోయ్ సినిమాటోగ్రఫీ: నిమేష్ రవి విడుదల తేది: ఆగస్ట్ 24, 2023 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. తనదైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మలయాళ హీరో అయినప్పటికీ మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్ నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘కింగ్ ఆఫ్ కొత్త’కథేంటంటే.. ఈ మూవీ కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అనుకున్నట్లే పెద్ద రౌడీ అయి కోతా టౌన్‌ని తన గుప్పింట్లోకి తెచ్చుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. స్వతాహా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రాజు.. ఆ ఏరియాలో ఎక్కడ పోటీలు నిర్వహించిన తన గ్యాంగ్‌తో కలిసి పాల్గొనేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. దీంతో అతని గ్యాంగ్ అంతా వేరు వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. కొన్నాళ్లకు కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. ఆ ఏరియా పోలీసు అధికారులు సైతం కన్నాభాయ్‌కి భయపడతారు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్ పెట్టేందుకై రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? పదేళ్ల పాటు రాజు ఎక్కడికి వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? కన్నాభాయ్ ఆగడాలకు రాజు ఎలా చెక్ పెట్టాడు? ప్రాణంగా ప్రేమించిన తారకు రాజు ఎందుకు దూరమయ్యాడు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. దానికి కారణం కథ, కథనం కొత్తగా ఉండడం. ‘కింగ్ ఆఫ్ కొత్త’లో అసలు కొత్తదనం అనేదే లేదు. అవే కత్తి పోట్లు.. తుపాకుల తూట్లు.. వెన్నుపోట్లు. కథ పరంగా ఎక్కడా కొత్తగా అనిపించదు కానీ కథనం మాత్రం కాస్త వెరైటీగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు ప్రేమ, స్నేహ బంధం..ఇలా అన్ని అంశాలు ఉన్నాయి . కానీ వాటిని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఈ మూవీ కథ కోత అనే పట్టణంలో జరుగుతుంది. (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోతా అని వాడారు ) ప్రారంభమవుతుంది. కోతా పట్టణానికి కొత్తగా వచ్చిన సీఐ శావుల్కి అక్కడి ఎస్సై టోని.. రాజు, కన్నాల ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఫుట్‌బాల్ పోటీకి సంబంధించిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఇక తారతో రాజు ప్రేమాయణానికి సంబంధించినసన్నివేశాలు రొటీన్‌గా సాగుతుంది. రంజియ్ భాయ్ పాత్ర మాట్లేడే ఇంగ్లీష్ నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండదు.. అలా సాగిపోతుంది అంతే. ఇక ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుందనేది ఈజీగా అర్థమవుతుంది. రాజు తిరిగి కోతాకి రావడం.. కన్నాభాయ్ మనుషులపై దాడి చేయడం..ఇలా రొటీన్‌గా కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్‌కి అరగంట ముందు వరుసగా ట్విస్టులు ఉంటాయి. కాని అవి బోరింగ్ అనిపిస్తాయి. ఇక సినిమా ముగుస్తుందిలే అని అనుకున్న ప్రతిసారి మరో మలుపు రావడం.. సాగదీతగా అనిపిస్తుంది. ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ సల్మాన్ గ్యాంగ్‌స్టర్‌గా చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ తనదైన నటనతో గ్యాంగ్‌స్టర్ రాజు పాత్రకి న్యాయం చేశాడు. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక దుల్కర్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర షబిర్ది. కన్నా అలియాస్ కన్నాభాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్ర తనది. ఇక గ్యాంగ్‌స్టర్ రాజు ప్రియురాలు తారాగా ఐశ్వర్య లక్ష్మీ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో సోదరి రీతూగా అనిఖా సురేంద్రన్ తన పాత్రకు న్యాం చేసింది. సీఐ శావుల్గా ప్రసన్న, ఎసై టోనీగా గోకుల్ సురేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జేక్స్ బిజోయ్. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. బీజీఎం కారణంగా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. నిమేష్ రవి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో ప్రతి పాత్ర.. కథని మలుపు తిప్పేదే
‘‘నేను ఇప్పటి వరకూ గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేయలేదు. తొలిసారి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చేశాను. ఈ కథ రెండు పీరియడ్స్‌లో ఉంటుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పంచుకున్న విశేషాలు.... ► అభిలాష్, నేను చిన్ననాటి స్నేహితులం. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటే ‘కింగ్ ఆఫ్ కొత్త’కి కుదిరింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. స్నేహం కూడా ఉంటుంది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ, ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇవ్వాలని ఈ మూవీ కోసం ఏడాది శ్రమించా. సాంకేతికంగా ఈ మూవీ పెద్ద స్థాయిలో ఉంటుంది. ► కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోత అని చెప్పాం. ప్రేక్షకులకు నేను ఎక్కువగా లవర్ బాయ్‌గా గుర్తుంటాను(నవ్వుతూ). ఒకేరకమైన కథలు, పాత్రలు చేయాలని ఉండదు. ప్రేక్షకులతో పాటు నటుడిగా నాకు నేను సర్ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ మూవీ కోసం తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ రకంగా ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కూడా (నవ్వుతూ). ► ఐశ్వర్య లక్ష్మి చాలా ప్రతిభ ఉన్న నటి. ఈ మూవీలో తన పాత్ర కీలకంగా ఉంటుంది. నిమేష్ రవి విజువల్స్, జాక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం నేను, రానా కలిసి ‘కాంత’ చేస్తున్నాం. తెలుగు, ఇతర పరిశ్రమల నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలను మలయాళంలో అనుసరిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. ప్రభాస్‌గారి ‘కల్కి 2898 ఏడీ’లో నేను నటిస్తున్నానా? లేదా? అన్నది మేకర్సే చెప్పాలి. -
నా స్క్రీన్ టైమ్ తక్కువే కానీ..
‘‘దర్శకుడు అభిలాష్ జోషి ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమా స్కేల్ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్ పరంగా చాలా పెద్ద సినిమా. ప్రతి షాట్ చాలా నిండుగా అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. మలయాళంలో ఇంత పెద్ద స్కేల్ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి’’ అని హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మి అన్నారు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మి మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’లో తార పాత్ర చేశాను. దుల్కర్ పేరు రాజు. తార, రాజు మధ్య అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. నా పాత్రకి స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు సవాల్‌గా అనిపించింది. నాకంటూ డ్రీమ్ రోల్స్ ప్రత్యేకంగా లేవు. కానీ, నేను చేసిన పాత్రలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ పదం నాకు పెద్దగా నచ్చదు
‘‘మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంది. తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్ ఓ వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘ నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘కింగ్ ఆఫ్ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్‌ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
ఇలా అవుతానని కలలో కూడా ఊహించలేదు: హీరోయిన్
కట్టా కుస్తీ చిత్రంతో తమిళంలో పాపులర్ అయిన మలయాళీ నటి ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మెరిసిన ఈమె మాతృభాషలో నిర్మాతగానూ కొనసాగుతున్నారన్నది గమనార్హం. అక్కడ గార్గి వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలపై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు. (ఇది చదవండి: ఇండియన్ ఐడల్ 2 విన్నర్ ఆమెనే.. ఐకాన్ స్టార్ ప్రశంసలు) కారణం స్త్రీల జీవితంలో పురుషులకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. కాబట్టి స్త్రీ, పురుషులకు సమానత్వం కలిగిన కథలతో కూడినదే మంచి చిత్రాలన్నది తన భావన అన్నారు. అలా కాని చిత్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సినిమా అనేది మన జీవితాలను, సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కాబట్టి సినిమాల్లోనైనా, మన జీవితాల్లో నైనా సమానత్వం ఉండాలన్నారు. మరో విషయం ఏమిటంటే తాను ఈ రంగంలోకి ప్రవేశిస్తాననే ఊహించలేదన్నారు. వైద్య విద్యను పూర్తి చేసిన తాను సినిమాల్లో రావడం అన్నది దైవ నిర్ణయమే అన్నారు. కారణం తాను నటి నవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. తాను చదువుకు ప్రాముఖ్యత వచ్చే కుటుంబంలో పుట్టానన్నారు. వారికి సంబంధించినంత వరకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయడమే సమాజంలో ఉన్నతస్థాయి అని పేర్కొన్నారు. సినిమా అలాంటి గౌరవాన్ని ఇచ్చేదిగా వారు భావించలేదన్నారు. నిజం చెప్పాలంటే సినిమాలో కొనసాగడం అనేది ప్రతినిత్యం పోరాటమేనని నటి ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు. (ఇది చదవండి: నా అవార్డులను వాష్‌రూమ్ డోర్ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు) -
ఆ క్రికెటర్‌ను ప్రేమించా.. కానీ!: హీరోయిన్
మాలీవుడ్‌లో హీరోయిన్గా, నిర్మాతగా రాణిస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. కోలీవుడ్‌లో విశాల్‌తో యాక్షన్ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా జగమే తంతిరం, ఆర్య సరసన కెప్టెన్ తదితర చిత్రాల్లో నటించిన ఈమె విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తీ(మట్టి కుస్తీ) చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలను అందుకున్నారు. అదే విధంగా ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ పూంగుళలీగా కీలక పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఈమె తన గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను పుట్టినప్పుడు తన తండ్రి శ్రీలక్ష్మీ అనే పేరు పెట్టారని, అయితే అమ్మ మాత్రం ఐశ్వర్య అని పిలిచేదన్నారు. దీంతో చివరికి తన పేరు ఐశ్వర్య లక్ష్మిగా మారిందని చెప్పారు. నటిగా తనకు డ్రీమ్ పాత్ర అంటూ ఏమీ లేదని, అయితే విలన్ రోల్స్‌లో నటించడం ఇష్టం ఉండదని, అందుకే ఎప్పటికీ అలాంటి పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకు కాంచీపురం పట్టు చీరలు, కేరళ సంప్రదాయ చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. అందుకే షూటింగ్ లేనప్పుడు చీరలు ధరించి ఫొటోషూట్ నిర్వహించుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు. నటుడు అభిషేక్ బచ్చన్, విజయ్ నటించిన చిత్రాలను ఎక్కువగా చూస్తానన్నారు. ఇకపోతే క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాను ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆయన్ని మనసులోనే ప్రేమిస్తూ వచ్చానని, అలాంటిది ఇప్పుడు క్రికెట్ క్రీడను చూడ్డానికి సమయం దొరకడం లేదన్నారు. చదవండి: ఓటీటీ పరిశ్రమ సూపర్ హిట్ -
Aishwarya Lekshmi Photos: గ్లామర్ డోసు పెంచుతున్న ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
గ్లామర్ డోసు పెంచుతున్న ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు) -
ఈ ఫోటోలో చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
ఇప్పటి హీరోయిన్లు గ్లామర్ ప్రపంచంలో పోటీపడుతూ దూసుకెళ్తున్నారు. అందివచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోవట్లేదు. దక్షిణాదిలో ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. డబ్బింగ్ సినిమాలతో వచ్చి.. సక్సెస్ సాధించిన హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నటించి సక్సెస్ అయి అలా వచ్చిన వారిలో ఈ ఫోటోలోని చిన్నారి కూడా ఒకరు. ఇటీవలే టాలీవుడ్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ ఫోటోలోని చిన్నారిని మీరు గుర్తుపట్టారా? ఆ ఫోటోలోని పాలబుగ్గల చిన్నారి మరెవరో కాదు ఇటీవలే వచ్చిన మట్టీ కుస్తీలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి. పొన్నియిన్ సెల్వన్, అమ్ము, మట్టి కుస్తీ సినిమాలతో ఫేమ్ సంపాదించుకుంది మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. మణిరత్నం సినిమాతో ఒక్కసారిగా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కేరళకు చెందిన ఐశ్వర్య లక్ష్మి మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టంది. గతేడాది సత్యదేవ్ సరసన ‘గాడ్ సే’ మూవీతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’లో మెరిసింది. అలాగే మట్టికుస్తీ, అమ్ము వెబ్ సిరీస్‌లతో మంచి ప్రశంసలు దక్కించుకుంది. -
నటుడితో లవ్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
సినీ జంటలు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు.. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఆరేళ్లకు పైగా ప్రేమించుకుని గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. నానుమ్ రౌడీదాన్ సినిమా షూటింగ్ వీరి ప్రేమకు ఆజ్యం పోసింది.ఇంకా నటి స్నేహ నటుడు ప్రసన్నది కూడా ప్రేమ వివాహమే. అచ్చముండు అచ్చముండు చిత్రం షూటింగ్ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది. తాజాగా మలయాళ బ్యూటీ, పొన్నియిన్ సెల్వన్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మాస్టర్, ఖైదీ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు అర్జున్‌దాస్‌తో లవ్‌లో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసిన భామ దానికి లవ్ సింబల్‌ను జోడించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి వీరి మధ్య ప్రేమ ఎలా కుదిరిందబ్బా? అని నెటిజన్లు ఓపక్క ఆశ్చర్యపోతూనే మరోపక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తమది ప్రేమ కాదంటోంది ఐశ్వర్య. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. 'నా పోస్ట్ ఇంతలా పేలుతుందని ఊహించలేదు. మేమిద్దరం సరదాగా కలిశాం, ఓ ఫోటో దిగాం. దాన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశా.. అంతే! మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే, అంతకుమించి మా మధ్య ఏం లేదు. నిన్నటినుంచి ఒకటే పనిగా మెసేజ్ చేస్తున్న అర్జున్ దాస్ ఫ్యాన్స్ అందరికీ క్లారిటీ ఇస్తున్నా.. అర్జున్ మీవాడు..' అని రాసుకొచ్చింది. ఒక్క పోస్ట్‌తో అర్జున్‌తో డేటింగ్ రూమర్స్‌కు చెక్ పెట్టింది ఐశ్వర్య. చదవండి: కొత్త బంగారు లోకం హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా? క్యాన్సర్‌తో చచ్చిపోయినా ఓకే కానీ ట్రీట్మెంట్ తీసుకోను: సంజయ్ దత్ -
ప్రేమలో పడ్డ హీరోయిన్, ప్రియుడిని పరిచయం చేస్తూ పోస్ట్
అమ్ము, పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నటుడు అర్జున్ దాస్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఆమె దానికి లవ్ సింబల్‌ను జోడించింది. ఇది చూసిన ఫ్యాన్స్ కొందరు కంగ్రాట్స్ చెప్తుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమోషన్ స్టంట్ అయ్యుండొచ్చు, త్వరలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌లో కలిసి నటిస్తున్నారేమో అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అర్జున్ దాస్ మాస్టర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించాడు. బుట్టబొమ్మ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఐశ్వర్య లక్ష్మి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి ఇష్టమా? పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టమా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని చెప్పింది. అలా చెప్పిన నెల రోజులకే ప్రియుడిని పరిచయం చేస్తూ పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) చదవండి: -
ఓటీటీకి 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు విష్ణు విశాల్, ఐశ్యర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మట్టి కుస్తీ. విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ) కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. -
థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న మట్టి కుస్తీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు
తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం కట్టా కుస్తీ. మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందటం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నై వడపళనిలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించింది.నటి ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ కట్టా కుస్తీ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది టీం వర్కుతో రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నారన్నారు. ఈ చిత్ర టీం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన చిత్రంలోని ఆడ మగ సమానం అనే థాట్ నచ్చడంతో చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. తన విజయానికి అమ్మ, అక్క, తన భార్య కారణమన్నారు. వారంతా తనకు చాలా సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తానే కాదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నిజమన్నారు. నిర్మాతగా మారడానికి కారణం నటుడిగా తన కలలను నిజం చేసుకోవడానికే అని చెప్పారు. కట్టా కుస్తీ చిత్ర తొలి ఆటను తాను మదురైలో ప్రేక్షకుల మధ్య చూశానని, థియేటర్లో మహిళల ఆదరణను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని, ఇంకా వసూలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మంచి అనుభూతినిచ్చింది. -
నాకిప్పటికీ గుర్తుంది.. ఆ రోజు నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు.. పొన్నియిన్ సెల్వన్ హీరోయిన్
పొన్నియిన్ సెల్వన్, అమ్ము సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. మణిరత్నం సినిమాతో ఒక్కసారిగా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆమె చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనపై ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. గుడికి వెళ్లినప్పుడు ఓ యువకుడు తన ప్రైవేట్ పార్ట్స్ తాకినట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా దురుసుగా ప్రవర్తించాడని వివరించింది. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. 'నా చిన్నతనంలో కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్లాం. అక్కడ ఓ యువకుడు నా ప్రైవేట్ భాగాలను తాకి దురుసుగా ప్రవర్తించాడు. ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఆరోజు నేను పసుపు బట్టలు వేసుకుని ఉన్నా. అప్పటి నుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటేనే భయంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి భయం లేదు' అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఇటీవలే ఐశ్వర్య లక్ష్మి నటించిన మట్టి కుస్తీ థియేటర్లలో సందడి చేస్తోంది. -
నాకు ఇష్టమైన నటుడితో నటించే అవకాశం వచ్చింది : హీరోయిన్
తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి. గార్గి చిత్రంతో నిర్మాతగానూ మారిన ఈ మలయాళి బ్యూటీ కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తరువాత ధనుష్ జంటగా జగమే తందిరం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తీ త్రంలో నటింంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో ఈమె నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. కుస్తీ పోటీల్లో తన నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు మలయాళ సపర్‌స్టార్ మమ్ముట్టీ అంటే చాలా ఇష్టమన్నారు. ఆయన నటనను చూస్తూ పెరిగినట్లు పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న క్రిస్టోఫర్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా తాను నటించడం మరిపోలేని అనుభవమని తెలిపింది. మరో విషయం ఏమిటంటే నటుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా కింగ్ ఆఫ్ గోదా చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నట్లు పేర్కొంది. ఇలా ఒకేసారి తండ్రీకొడుకులతో నటించడం అరుదైన అనుభవంగా పేర్కొంది. ఈ ఏడాది తాను జీవితంలో గుర్తుండిపోయిందని సంతోషం వ్యక్తం చేసింది. -
మట్టికుస్తీ: అలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు.. కానీ
నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణువిశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మట్టికుస్తీ. మలయాళ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలోనటుడు కరుణాస్, మీనీష్ కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చెల్లాఅయ్యావు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహింన ఈ చిత్రం కుస్తీ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చర్చించే చిత్రంగా ఇది ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన అమ్మాయిగా ఉండాలి. తన మాటకు ఎదురు చెప్పకూడదు. ముఖ్యంగా పొడవైన కురులు కలిగి ఉండాలి. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకొని కూర్చుంటాడు. అయితే తను కోరుకున్న అమ్మాయికి భిన్నంగా జీవిత భాగస్వామి వస్తే జరిగే పరిణామాలు ఏమిటి? అన్నది కట్టాకుస్తీ చిత్రం. ఇందులో 20 ఎకరాల పొలం, బంగ్లా ఉన్నా.. బాధ్యతలు తెలియని యువకుడిగా నటుడు విష్ణువిశాల్ నటించారు. ఐశ్వర్యలక్ష్మి కుస్తీ క్రీడపై ఆసక్తితో ఆ రంగంలో పేరు తెచ్చుకున్న యువతిగా నటించారు. నటుడు విష్ణువిశాల్ కూడా కబడ్డీ క్రీడలు పరిచయం ఉన్న క్రీడాకారుడు. అలాంటి వీరిద్దరికీ ఎలా పెళ్లి జరిగింది. ఇద్దరు కుస్తీ పోటీల బరిలోకి దిగడానికి కారణాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కట్టా కుస్తీ. భార్యాభర్తల మధ్య ఈగో అనేదానికి తావు లేకుండా ఒకరికొకరు గౌరవించుకోవాలి, భార్య ఇష్టాఇష్టాలు భర్త గుర్తెరిగి ప్రోత్సహించాలి అనే సందేశంతో కూడిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ
టైటిల్: మట్టి కుస్తీ నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, శ్రీజ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్ దర్శకత్వం: చెల్లా అయ్యావు సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్ ఎడిటర్: ప్రసన్న జికె విడుదల తేది: డిసెంబర్ 2, 2022 మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘మట్టి కుస్తీ’(తమిళంలో-గట్టా కుస్తీ). విష్ణు విశాల్ హీరో. ఆయనకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు ఇది స్పోర్ట్స్ డ్రామా కావొచ్చని అంతా భావించారు. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చిత్ర యూనిట్ చెప్పడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మట్టి కుస్తీ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లింగ బేధం లేదని ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ చాలా చోట్ల స్త్రీలకు సరైన గౌరవం ఉండడం లేదు. వాళ్లను చిన్న చూపుగా చూసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా మంది భర్తలు చులకనగా వ్యవహరిస్తారు. తన ఇష్టాలను ఆమె గౌరవించాలి కానీ.. భార్య ఇష్టాయిష్టాలతో తనకు సంబంధం లేదనే భర్తలు ఇప్పటికీ ఉన్నారు. అది తప్పని, భార్య ఇష్టాయిష్టాలను కూడా భర్తలు గౌరవించాలని చాటి చెప్పే చిత్రమే ‘మట్టి కుస్తీ’. ఓ మంచి సందేశాన్ని కామెడీ వేలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు చెల్ల అయ్యావు సఫలం అయ్యాడు. టైటిల్ చూస్తే ఇదేదో స్పోర్ట్స్ డ్రామా అనుకుంటాం. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ నేపథ్యంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఫ్యామిలీ డ్రామాకి, స్పోర్ట్స్ యాంగిల్‌ని మేళవించడం ‘మట్టి కుస్తీ’ స్పెషల్. సినిమా అంతా కామెడీ కామెడీగా సాగుతుంది. తను అనుకున్నట్లుగా భార్య పెద్దగా చదువుకోలేదని, పెద్ద జడ ఉందని భావించే హీరో.. రెజ్లర్ అన్న విషయం భర్తకు తెలియకుండా మ్యానేన్ చేసే క్రమంలో హీరోయిన్ పడే ఇబ్బందులతో ఫస్టాఫ్ అంతా ఫన్‌గా సాగుతుంది. కథంతా ఊహకందేలా సాగుతున్నా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ చేసే ఫైట్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రెజ్లర్ అనే విషయం హీరోకి తెలియడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో హీరో పరిస్థితి రివర్స్ అవుతుంది. ఊరి జనాలంతా తన కంటే భార్యకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం.. అందరి ముందు తన పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకోవడం.. ఈ క్రమంలో హీరో చేసే పనులు థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అయితే భార్య భర్తల ఇగో క్లాషెస్‌ని కామెడీగా చూపిస్తూనే ఎమోషనల్ యాంగిల్‌ని టచ్ చేశాడు దర్శకుడు. భార్యలు ఎప్పుడూ తమ చెప్పుచేతుల్లోనే ఉండాలనే భర్తల ఆలోచన తప్పనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాడు. ఎవరెలా చేశారంటే.. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు విష్ణు విశాల్. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. . `రాక్షసన్` చిత్రంతో అక్కడ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మరో ప్రయోగంగా మట్టి కుస్తీ చేశాడు. ఇందులో వీర పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. కీర్తి పాత్రలో ఐశ్యర్యలక్ష్మీ ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. హీరోతో సమానంగా ఆమె పాత్ర సాగుతుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. వీర మామయ్యగా కరుణాస్, కీర్తి బాబాయ్‌గా మునీష్ కాంత్‌తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం బాగుంది. పాటలు తమిళ నెటివిటీకి తగ్గట్లుగా ఉంటాయి. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ బ్యూటీ
మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గార్గీ వంటి సక్సెస్‌ఫ/ల్ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇటీవల అమ్ము అనే చిత్రంతో టైటిల్ పాత్ర పోషించింది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్‌లోనూ పూంగుళి అనే కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో రెండేసి చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా విష్ణువిశాల్ జంటగా నటించిన కట్టా కుస్తా చిత్రం డిసెంబర్ 2వ తేదీ నుంచి తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రం విజయంపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా మీకు ప్రేమ వివాహం ఇష్టమా? పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టమా? ప్రశ్నకు అసలు పెళ్లే ఇష్టం లేదని ఠక్కున బదులిచ్చింది. చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?) -
అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ
‘‘తెలుగు సినిమాలకు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఇండియాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ఎదిగింది. తెలుగు ప్రేక్షకులకు సినిమాలపై ఉన్న ప్రేమాభిమానాలే ఇందుకు కారణం’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ. విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితమే ‘మట్టి కుస్తీ’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. అయితే హీరోయిన్ పాత్ర సవాల్‌తో కూడుకున్నది. అందుకే ఓకే చెప్పలేదు. కానీ ఆశ్చర్యకరంగా మళ్లీ ఈ కథ నా వద్దకే వచ్చింది. ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేసి, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాను. దాంతో ఈసారి ఓకే చెప్పాను. ఈ సినిమా ఎందుకు సవాల్‌గా అనిపించిందంటే నాకు టఫ్‌గా అనిపించే కామెడీని డీల్ చేయాల్సి వచ్చింది. ఇగో, వినోదం, ఎమోషన్స్ అన్నీ ఉన్న ఫ్యామిలీ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఇక కథల ఎంపికలో నాకు తొందరలేదు. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునే పాత్రలే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' నుంచి లిరికల్ సాంగ్ అవుట్
విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్స్ డ్రామా మట్టి కుస్తీ. హీరో రవితేజ, విష్ణు విశాల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చల్ చక్కని చిలక.. చిరునవ్వుల చక్కెర గుళిక.. అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరణ్ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా హేమచంద్ర పాడారు. -
'అమాయకమైన ఆంధ్రప్రదేశ్ అబ్బాయిలు ఎక్కడా దొరకరమ్మా'.. ఆసక్తిగా ట్రైలర్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన చిత్రం 'మట్టి కుస్తీ'. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే.. ' ఇంకోసారి పిల్లను చూడమని నన్ను అడక్కు. మన అల్లుడికి పెళ్లయిందా రత్నం. ఈ జన్మలో అవ్వదు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ ఎంటర్టైనర్ను తలపించేలా ఉంది. హీరో ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించనున్నారు. కేరళ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి మధ్య ప్రేమకథ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్2న థియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతమందిస్తున్నారు. -
విష్ణు విశాల్ కొత్త సినిమా 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఫిక్స్
వెండితెరపై రెజ్లర్‌గా తన సత్తా ఏంటో చూపేందుకు విష్ణు విశాల్ రెడీ అయ్యారు. విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మట్టి కుస్తీ. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఎఫ్ఐఆర్ చిత్రం తర్వాత హీరోలు రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా డిసెంబర్2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: జస్టిన్ ప్రభాకరణ్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
ఆ హీరోను నాతో మాట్లాడకు అని మొహం మీదే చెప్పాను: కలర్స్ స్వాతి
నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అమ్ము'. నేరుగా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యిందీ చిత్రం. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరకెక్కించారు. అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించగా.. ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన హీరోయిన్ కలర్స్ స్వాతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'నవీన్ చంద్ర మన ఇండస్ట్రీకి దొరికొన జెమ్ లాంటివాడు. ఈ సినిమాలో అతను పోషించిన శాడిస్ట్ రోల్ చూసి షాక్ అయ్యాను. అతన్ని చూడాలంటేనే భయం వేసింది. ఇంటర్వెల్లో వచ్చి నాతో మాట్లాడతోతే.. నాతో మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పేశాను. అంతలా నవీన్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు' అంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించింది స్వాతి. -
కుటుంబ కథా నేపథ్యంగా 'అమ్ము'.. ఓటీటీలో గ్రాండ్ రిలీజ్
‘పొన్నియిన్ సెల్వన్-1లో' నటించిన ఐశ్వర్య లక్ష్మి మరో మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'అమ్ము'. ఈ సినిమా ఓటీటీలో ప్రీమియర్ షోగా అక్టోబర్ 19న అలరించేందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కార్తీక్ సుబ్బరాజ్,నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల, దేవాకట్టా,శరత్ మరార్,రాజ్ కందుకూరి, స్వాతి హాజరయ్యారు. నేరుగా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తున్న తొలి తెలుగు మూవీ "అమ్ము". ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరకెక్కించారు. ఈ థ్రిల్లింగ్ స్టోరీ ఓటీటీలో సందడి చేయనుంది. అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించగా.. ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్‌లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, సింహా నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరించనుంది. -
నిర్మాతగా వరుస విజయాలు.. ‘తగ్గేదే లే’ అంటున్న ‘అమ్ము’ హీరోయిన్
నటిగా, నిర్మాతగా హ్యాపీ జీవితాన్ని గడుపుతోంది నటి ఐశ్వర్యలక్ష్మి. నటుడు విశాల్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది ఈ మలయాళ బ్యూటీ. ఆ తరువాత ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తందితరం’ చిత్రంలో శ్రీలంక తమిళ భాష మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం పొన్నియిన్ సెల్వన్‌లో పూంగుళళీ పాత్రలో నటించారు. ఇందులో నటనకు గాను సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు. చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్ మాతృభాషలోనూ నటిస్తున్న ఈమె నిర్మాతగానూ అవతారమెత్తి విజయాలను అందుకుంటున్నారు. నటి సాయిపల్లవి నటించిన గార్గీ చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఈ మూవీ మలయాళంతో పాటు తమిళ్ తదితర భాషల్లోనూ విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తెలుగులో కథానాయకిగా ప్రధాన పాత్రను పోషించిన అమ్ము చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. అలాగే ఐశ్వర్యలక్ష్మి మలయాళంలో నటించి, నిర్మించిన కుమారి అనే చిత్రం కూడా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి గార్గీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత తాను నిర్మించిన చిత్రం కుమారి ఐశ్వర్యలక్ష్మి పేర్కొన్నారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రమని, ఇలా మూడు భాషల్లో మూడు మంచి పాత్రల్లో వరుసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తమిళంలో నటుడు విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తా చిత్రం, ప్రియా దర్శకత్వంలో అశోక్ సెల్వన్, వసంత రవిలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మలయాళంలో మమ్ముట్టితో క్రిస్టోఫర్, కింగ్ ఆఫ్ గోవా చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటిస్తున్నట్లు చెప్పారు. -
ఓటీటీలో అమ్ము, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన చిత్రం అమ్ము. నవీన్ చంద్ర, సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. చారుకేశ్ శేఖర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కల్యాణ్ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 19 నుంచి ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అమ్ము టీజర్‌ను రిలీజ్ చేసింది. 'నా పేరు అమ్ము. మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు' అంటూ హీరోయిన్ పరిచయంతో వీడియో మొదలవుతుంది. మరి ఎంతో గారాబంగా పెరిగిన అమ్ము పెళ్లి తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అసలు అమ్ముకేం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! she’s fierce, she’s strong & she’s got a story to tell! ✨ watch #AmmuOnPrime, Oct 19 @karthiksubbaraj @StoneBenchers #KalyanSubramaniam @CharukeshSekar @aishwaryaleksh7 @Naveenc212 @ActorSimha pic.twitter.com/sr5AVZphmX — prime video IN (@PrimeVideoIN) October 6, 2022 చదవండి: ఓటీటీలో లాల్‌సింగ్ చడ్డా బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో నటుడు, ఆస్పత్రికి తీసుకెళ్లగా -
అప్పుడు పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డా!
‘‘నలభై రెండేళ్లుగా మీరు (ప్రేక్షకులు) నాపై చూపించిన ప్రేమని ‘పొన్నియిన్ సెల్వన్’పై చూపించండి. ఈ సినిమా ఓ పది శాతం షూటింగ్ చెన్నైలో జరిగితే మిగిలినదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లో చేశాం.. కాబట్టి ఇది మీ (తెలుగు) సినిమా.. మీరు ఆదరించాలి’’ అని నటి సుహాసినీ మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (‘పీయస్–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘పీయస్–1’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పెళ్లికి ముందు మణిరత్నంగారు ఓ పెద్ద బ్యాగ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఐదు భాగాలుగా ఉంది. చదివి ఒక్క లైన్లో కథ చెప్పమన్నారు. నేను ఐదు భాగాలను చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను.. కానీ పెళ్లయింది. మా పెళ్లయిన 34 ఏళ్లకి ‘పొన్నియిన్ సెల్వన్’ తీశారాయన. దానికి ముఖ్య కారణమైన సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ టీమ్‌తో ఇక్కడ ఉండటం గర్వంగా ఉంది. ప్రతిభావంతులైన మంచి యూనిట్‌తో పని చేయడం గౌరవంగా ఉంది. నా తొలి సినిమా (‘ఇద్దరు’) మణిరత్నం సార్‌తో చేశాను. ఆయన కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ భాగం కావడం హ్యాపీ’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయా లంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్ సెల్వన్’ని రెండు భాగాలుగా తీయడం గ్రేట్. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2’ చిత్రాల్లా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఇండియాలో రెహమాన్‌గారు ఉన్నారని చెప్పుకునేందుకు భారతీయుడిగా గర్వపడతాం’’ అన్నారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ– ‘‘38 ఏళ్ల క్రితం నా ప్రయాణం తెలుగులో ప్రారంభమైంది. రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజ్–కోటి, సత్యంగార్లు సంగీతానికి ఒక పునాది వేశారు. ఇన్నేళ్లుగా నా సంగీతాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాని అందరూ చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘పొన్నియిన్ సెల్వన్ ’ లాంటి మంచి టీమ్‌తో పని చేయడం హ్యాపీ. చాన్స్ ఇచ్చిన మణిరత్నం సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. నా డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నంగారు అంత అద్భుతంగా మా పాత్రలను తీర్చిదిద్దారు’’ అన్నారు విక్రమ్. ‘‘మణిరత్నంగారి నలభై ఏళ్ల కల ఈ సినిమా. ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక ‘బాహుబలి’ని మనం చూశాం.. ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి.. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కార్తీ. ‘‘మా నాన్న ఎడిటర్ మోహన్‌గారు ‘హిట్లర్, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక అద్భుతం’’ అన్నారు ‘జయం’ రవి. ఐశ్వర్యా లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్‌లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్‌ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్‌కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్‌తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్‌కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్‌లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్‌తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్‌ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్‌లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Ponniyin Selvan: రాజమౌళి వల్లే ధైర్యం వచ్చింది
‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘పీయస్–1’ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ చిత్రంలోని ‘చోళ చోళ..’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ, అది ఎందుకనేది చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారి వల్లే ఇలాంటి (పొన్నియిన్ సెల్వన్) చిత్రాలు తీయగల మనే ధైర్యం వచ్చింది. రెండు భాగాలుగా ఇలాంటి సినిమాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం తెలు గులో ఇక ‘దిల్’ రాజుగారిదే’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి ‘అమృత’ సినిమా వల్లే నిర్మాతగా మారి, 50 చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ని రిలీజ్ చేసే చాన్స్ ఇచ్చిన మణిరత్నంగారికి థ్యాంక్స్’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘మణి సార్‌తో గతంలో ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిగారితో సినిమా అంటే కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్‌గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకున్నాను.. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి.. నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘అన్ని భాషల్లో నటించి, పాన్ ఇండియన్ నటుడు అవడం వేరు. కానీ దక్షిణాది నుంచి తన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నంగారు’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెందరో ప్రయత్నించారు. కానీ మణిరత్నంగారి వల్లే సాధ్యం అయింది’’ అన్నారు నాజర్. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా? అంటే కాదు ఇష్టమైన చిత్రం అని మావారు (మణిరత్నం) అన్నారు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడాలి (నవ్వుతూ)’’ అన్నారు. -
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ
టైటిల్: గాడ్సే నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్ సంగీతం: శాండీ అద్దంకి నిర్మాత: సి. కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: జూన్ 17, 2022 విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే ? సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నటి లక్ష్మి కూతురు, ఒకప్పటి హీరోయిన్ ఐశ్వర్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ప్రముఖ సీనియర్ నటి కూతురు. పలువురు స్టార్ హీరో సరసన హీరోయిన్గా చేసింది.. సహా నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. అంతటి నేపథ్యం ఉన్న ఆమె ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవిస్తూ దర్జాగా జీవిస్తూ ఉంటుందని అందరు అనుకుంటారు. కానీ ఆమె కనీసం మూడు పూటలా సరిగా తినలేని స్థితిలో ఉందంటే నమ్ముతారా? పూట గడవడం కోసం ఈ స్టార్ నటి ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ సేల్స్‌గర్ల్‌గా మరింది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్, నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య భాస్కరన్. చదవండి: Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ తన ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది. ప్రముఖ నటి లక్ష్మి కూతురుగా సినీరంగ ప్రవేశం చేసింది ఐశ్వర్య భాస్కరన్. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 1989లో వచ్చిన అడవిలో అభిమన్యుడు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస పెట్టి సినిమా ఆఫర్లు అందుకుంది. మోహన్‌లాల్‌తో హిట్ సినిమాలైన బటర్‌ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి వాటిలో నటించింది. చదవండి: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు కరువైన నాని వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు చేసి మెప్పించింది. అంతేకాదు పలు టీవీ సీరియల్స్‌లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్టు స్యయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నాకు పని లేదు. డబ్బు లేదు. అలాగనీ అప్పులేమీ లేవు. వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదానినే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను ఆలోచించను. చదవండి: ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ రేపు మీ ఆఫీసులో జాబ్ ఇస్తానంటే తప్పకుండా చేస్తా. అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తా’ అని పేర్కొంది. ‘నేను నటించడం ప్రారంభించిన మూడేళ్ల పాటు కెరీర్ బాగా సాగింది.. ఇంతలోనే పెళ్లయింది. ఆ తర్వాత క్రమంగా సినీ ఇండస్ట్రీకి దూరమవాల్సి వచ్చింది. హీరోయిన్గా అందరికి సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదు. ప్రస్తుతం నేను ఇండిపెండెంట్‌గా ఉన్నాను. యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నాను. నేను ఇండిపెండెంట్‌గా ఉన్నందుకు గర్వంగా ఉన్నాను. అయితే ఆర్థికంగా నేను నిలదొక్కుకోవాలంటే నాకు ఇప్పుడు ఓ మెగా సీరియల్ ఆఫర్ కావాలి’ అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది. -
నెగటివ్ రోల్స్ చేయను: గాడ్సే హీరోయిన్
‘‘ఓ నటిగా విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం. నేను నటించే పాత్రను త్వరగా అర్థం చేసుకుని వెంటనే ఆ పాత్రలోకి వెళ్లిపోగలను. అయితే ఇప్పుడే నెగటివ్ రోల్స్ మాత్రం చేయాలనుకోవడం లేదు. ఇంటెన్స్ అండ్ యాక్షన్ రోల్స్ చేయడానికి సిద్ధమే’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యాలక్ష్మీ. సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యాలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘గాడ్సే’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కి రావడం సంతోషంగా ఉంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం. ప్రభుత్వంతో పౌరులకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి? వ్యవస్థలోని లోపాలపై ఓ యువకుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? అనే అంశాల నేపథ్యంలో ‘గాడ్సే’ కథ సాగుతుంది. ఇందులో వైశాలి అనే సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాను. బ్యూటీ అండ్ బ్రెయిన్.. ఈ రెండూ ఉపయోగించే పాత్ర నాది. సత్యదేవ్ ఇంటెన్స్ అండ్ అమేజింగ్ యాక్టర్. తన నటనలో నిజాయితీ కనిపిస్తుంది. సి.కల్యాణ్‌గారు మంచి అభిరుచి గల నిర్మాత. గోపీ గణేష్‌గారు నన్ను నమ్మడంతో సెట్స్‌లో టెన్షన్లో లేకుండా నటించాను. మణిరత్నంగారి దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్ర చేశాను. మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సాయిపల్లవి చేస్తున్న ‘గార్గి’కి ఓ నిర్మాతగా ఉన్నాను’’ అన్నారు. -
మన హీరోకి హాలీవుడ్ డైరెక్టర్ల విషెస్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మిగతా భాషల్లోనూ టాలెంటెడ్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. వరుసగా ప్రయోగాత్మక సబ్జెక్టుల్లో యాక్ట్ చేస్తున్న ధనుష్.. లేటెస్ట్గా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘జగమే తందిరమ్’(జగమే తంత్రం)తో సందడి చేయబోతున్నాడు. ఈ తరుణంలో హాలీవుడ్ దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ ధనుష్‌కి గుడ్‌లక్ చెప్పారు. ‘సూపర్ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎగ్జైట్ అయ్యాం. కొత్త సినిమా రిలీజ్‌కు గుడ్ లక్’ అంటూ ట్రైలర్‌తో సహా ట్వీట్ చేశారు. దానికి ధనుష్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పడం, ఆ వెంటనే రుస్సో బ్రదర్స్ మళ్లీ స్పందించడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే జగమే తందిరం ఈ మధ్యాహ్నం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ మూవీ అలరించనుంది. Thank you so much. That’s very sweet of you. Means a lot to me. https://t.co/SraBgHztgr — Dhanush (@dhanushkraja) June 17, 2021 ధనుష్ హాలీవుడ్లో ‘ది గ్రేమ్యాన్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రుస్సో బ్రదర్స్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీని కూడా నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోంది. ఈ చొరవతో ఈ హాలీవుడ్ దర్శకులు ధనుష్‌కు విషెస్ చెప్పారన్నమాట. -
ట్రైలర్ టాక్: లండన్ వీధుల్లో రియల్ గ్యాంగ్‌స్టర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘జగమే తందిరమ్’, (తెలుగులో ‘జగమే తంత్రం’) కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ను డైరెక్టర్ కార్తీక్ ట్విట్టర్లో ప్రకటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 18న హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమ్ కానుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కోర మీసాలతో మాస్ లుక్‌లో, మరోవైపు స్టైయిల్ కాస్టూమ్స్తోనూ సూరాలి అనే పాత్రలో ధనుష్ కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు ఇదివరకే హిట్ కాగా, ట్రైలర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ను ఆకట్టుకునేలా ఇచ్చాడు. ఓ తమిళ తంబి లండన్‌లో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారతాడు? అక్కడి మాఫియాను ఎలా ఆడుకుంటాడు? ఆ వెనుక ఉద్దేశం ఏంటనే? కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక కాగా, ధనుష్‌కి ఇది 40వ సినిమా. మలయాళ విలక్షణ నటుడు జోజూ జార్జ్, సంచన నటరాజన్, కలైరసన్, రామచంద్రన్ దురైరాజా, సౌందరరాజా, చిన్న జయంత్, వడివక్కరసి తదితరులు ఇందులో నటిస్తుండగా, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ యాక్టర్ జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్రలో నటించాడు. పోయినేడాదే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. కరోనాతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్య నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు గోల చేశాయి. అయినప్పటికీ ఓటీటీ రిలీజ్‌కే నిర్మాతలు మొగ్గుచూపారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకోగా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా జగమే తందిరమ్ను నిర్మించాయి. చదవండి: ధనుష్‌గా క్రికెటర్ -
ఇంట గెలిచి.. రచ్చ గెలవడానికి వచ్చారు
తమిళ పొన్ను (అమ్మాయి), కేరళ కుట్టి (అమ్మాయి).. భాష ఏదైనా తెలుగమ్మాయిలా కనిపించడానికి రెడీ అయిపోతారు. తెలుగు అమ్మాయిలు అక్కడికి వెళుతున్నారు. అక్కడి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న పరభాషా నాయికల్లో కొందరు ఇంట గెలిచారు.. రచ్చ గెలవడానికి వచ్చారు. ఈ తారలపై స్పెషల్ స్టోరీ. ఎమోషనల్... కామెడీ... రొమాంటిక్.. లవ్... ఇలా సీన్ ఏదైనా అద్భుతంగా నటిస్తారు మలయాళ నటి నజ్రియా నజీమ్. ‘నిరమ్’ (2013), ‘బెంగళూరు డేస్’ (2014) వంటి మలయాళ మూవీస్‌లోనే కాదు...‘రాజా రాణి’ (2013) వంటి తమిళ సినిమాలో కూడా నటించారు నజ్రియా. మాలీవుడ్‌లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్‌గా ఉన్న నజ్రియా ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న ‘అంటే...సుందరానికీ!’ సినిమాలో ఈ మలయాళ సుందరి హీరోయిన్గా నటించనున్నారు. నజ్రియా చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. కేవలం నటిగానే కాదు... తన భర్త, హీరో ఫాహద్ ఫాజిల్‌తో కలిసి నిర్మాతగా కూడా మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు నజ్రియా. నజ్రియా నజీమ్ బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి హీరోయిన్గా సక్సెస్ అయినవారిలో ప్రియాభవానీ శంకర్ ఒకరు. ప్రస్తుతం అరడజను తమిళ సినిమాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్నారు ప్రియ. మంచు మనోజ్ హీరోగా నటించనున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కి సైన్ చేశారామె. ప్యాన్ ఇండియా స్థాయిలో శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్షన్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో పాటుగా తెలుగులో మరో కొత్త సినిమా చేయడానికి కూడా ప్రియ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రియా భవానీ శంకర్ మరో మలయాళ భామ ఐశ్వర్యా లక్ష్మీ మాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చిన ఈ బ్యూటీకి మాలీవుడ్‌లో చాన్సులు క్యూ కడుతున్నాయి. బ్రదర్స్ డే, వరదన్ వంటి మలయాళ సినిమాలు చేసిన ఐశ్వర్య తమిళంలో విశాల్, తమన్నా నటించిన ‘యాక్షన్’ సినిమాలో కూడా ఐశ్వర్య ఓ కీ రోల్ చేశారు. ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ కాంబినేషన్లో వస్తోన్న ‘గాడ్సే’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక మరో మలయాళీ భామ ఐశ్వర్యా మీనన్ తమిళంలో సిద్ధార్థ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కాదలిల్ సొదప్పువదు ఎప్పడి’ (తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’గా విడుదలైంది) సినిమా ద్వారా నటిగా ప్రయాణం ప్రారంభించారు. తమిళంతో పాటు ఇప్పుడు కన్నడ సినిమాలూ చేస్తున్నారామె. ఐశ్వర్యా లక్ష్మి తాజాగా రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్‌ను ఐశ్వర్యా మీనన్ దక్కించుకున్నారని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారు. ‘పెళ్లిసందడి’ సినిమా సీక్వెల్లో హీరోయిన్గా చేస్తున్నారు శ్రీలీల. తెలుగులో శ్రీలీలకు హీరోయిన్గా ఇది తొలి సినిమా. ఇక కన్నడలో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న నటి రచితా రామ్. ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ వంటి శాండిల్‌వుడ్ టాప్ స్టార్స్ సరసన నటించారామె. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు డైరెక్షన్లో రూపొందుతోన్న ‘సూపర్ మచ్చీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు రచితా. వీరితో పాటు మరికొంతమంది తమిళ, మలయాళ, కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. -
గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా?
‘‘కరోనా తర్వాత మా ‘గాడ్సే’ సినిమా ఆరంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్యానర్లో నిర్మిస్తోన్న 80వ చిత్రం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే వంద సినిమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘తల్లితండ్రులు, యువకులు ఆలోచించే విధంగా చదువు నేపథ్యంలో ‘గాడ్సే’ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నాం. గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా? అనేది మా చిత్రంలో చూపించబోతున్నాం. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి, జూన్ లేదా జూలై నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సత్యతో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘గాడ్సే’ చేస్తున్నాను. ప్రతి దేశంలో ఉన్న, జరుగుతున్న పాయింట్‌ని టచ్ చేసి బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాం’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ‘‘నా జీవితంలో ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్ మాస్టర్’ చాలా ముఖ్యమైన సినిమాలు. ‘బ్లఫ్ మాస్టర్ 2’ ఎప్పుడు చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ చిత్రానికి రెండింతలు గొప్పగా ఉండే సినిమా ‘గాడ్సే’’ అన్నారు సత్యదేవ్. హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేయస్ రామారావు, నటులు ప్రకాశ్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
సరైన ఎంట్రీ
‘బ్లఫ్ మాస్టర్’ వంటి హిట్ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మి తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తెలుగులో ఎంట్రీకి ‘గాడ్సే’ సరైన చిత్రం అంటున్నారు ఐశ్వర్య. ‘‘యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్లో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్యా లక్ష్మి కూడా నటనకి మంచి ఆస్కారం ఉండే పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: సి.వి. రావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి. -
టర్కీ పోదాం... చలో చలో
.... అంటూ బ్యాగ్ ప్యాక్చేసుకునే పనిలో ఉన్నారట విశాల్ అండ్ తమన్నా. దాదాపు యాభై రోజులు అక్కడే ఉంటారని కోలీవుడ్ టాక్. సుందర్. సి దర్శకత్వంలో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్ చేశారట చిత్రబృందం. అక్కడ జరిగే మేజర్ షూటింగ్లో రెండు పాటలు, మూడు ఫైట్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్యాలక్ష్మీ మరో కథానాయికగా నటిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. ఇంతకుముందు ‘కత్తిసండై’ అనే సినిమాలో జంటగా కనిపించారు తమన్నా, విశాల్. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ జోడీ కట్టారు. అలాగే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో కూడా తమన్నా, విశాల్ జంటగా కనిపించనున్నారని తెలిసింది. -
సినిమాలోనూ అన్నదమ్ములే!
తమిళసినిమా: జేకే,జయకాంత్ సోదరద్వయం తిరుపతిస్వామి కుటుంబం అనే చిత్రం ద్వారా కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. విశేషం ఏమిటంటే వీరు చిత్రంలోనూ అన్నదమ్ములుగా నటించారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయకిగా, జయన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో దేవదర్శిని, మయిల్‌స్వామి, ముత్తురామన్, కే.అమీర్, కవిరాజ్, సిజర్‌మనోహర్ ముఖ్యపాత్రలను పోషించారు. జేకే.గుడ్ ఫిలింస్ బాబూరాజ్, జేమ్స్ ఫిలింస్ మురుగానంద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేశ్ షణ్ముగం దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకు ముందు అరసు, గంభీరం చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాబురాజ్, జాఫర్ఆష్రాఫ్ నిర్మించారు. చిత్ర వివరాలను నిర్మాతల్లో ఒకరైన బాబూరాజ్ తెలుపుతూ తాను సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థలో 25 ఏళ్లగా నిర్మాణ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. కాగా ఈ తిరుపతిస్వామి చిత్రాన్ని తన ఇద్దరు కొడుకులు జేకే, జయకాంత్లను కథానాయకులుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నానని తెలిపారు.మన పక్కింటిలోనో, ఎదురింటిలోనో కనిపించే సగటు మనిషిలాంటి పాత్ర తిరుపతిస్వామిలో ఉంటుందన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వెళ్లి సాయం చేసే ఆయనకు ఒక అధికారం, రాజకీయ బలం ఉన్న వ్యక్తితో సమస్య ఎదురవుతుందన్నారు. దాన్ని ఆయన కొడుకులు బుద్ధిబలంతో ఎలా ఎదుర్కొన్నారన్నదే తిరుపతిస్వామి చిత్రం అన్నారు. చిత్రం పూర్తి అయ్యిందని, సెన్సార్ సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్ అందించడంతో పాటు మంచి కుటుంబ కథా చిత్రం అంటూ ప్రశంసించారని తెలిపారు. తిరుపతిస్వామి చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
కొత్త కల్యాణ్‌రామ్ కనపడతాడు
‘‘పదమూడేళ్లుగా డిఫరెంట్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నా. అయితే... ఎప్పట్నుంచో మంచి రొమాంటిక్ కామెడీ సిన్మాలో నటించాలని నా కోరిక. సరిగ్గా జయేంద్రగారు అటువంటి స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమా నాకో ఛేంజ్ ఓవర్. ఇందులో కొత్త కల్యాణ్‌రామ్ కనపడతాడని గట్టిగా నమ్ముతున్నా’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్. జయేంద్ర దర్శకత్వంలో ఆయన హీరోగా మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మించనున్న సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ స్క్రిప్టును దర్శకుడికి అందించారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో వర్క్ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాతో ఐశ్వర్యలక్ష్మిని తెలుగుకు హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘ఆగస్టు 5న ఏర్కాడ్‌లో ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. మూడు రోజులు అక్కడ చిత్రీకరణ జరిపిన తర్వాత ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ చివరి వరకు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు మహేశ్ కోనేరు. ఈ కార్యక్రమంలో చిత్ర–నిర్మాతలు విజయ్‌కుమార్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపు, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్, హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి, సంగీత దర్శకుడు శరత్, రచయిత సుభా తదితరులు పాల్గొన్నారు. -
ఆయనతో ఒక్కసారైనా చేయాలి
‘ధర్మదురై’, ‘రెక్క’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన బ్యూటీ ఐశ్వర్యాలక్ష్మి. ఇప్పుడు ‘తిరుపతి స్వామి కుటుంబం’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతోంది. ఈ చిత్ర విశేషాలను గురించి అమ్మడు మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నేను హీరోయిన్గా నటిస్తున్న ‘తిరుపతి స్వామి కుటుంబం’ చిత్రంలో సంప్రదాయ అమ్మాయిగా నటిస్తున్నాను. అయితే తర్వాత నటించనున్న చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటిస్తాను. నాకు సిమ్రాన్, జ్యోతికా వలే అందంగా అందచందాలను ప్రదర్శించడమే ఇష్టం. నా రోల్‌మోడల్ సమంత. ఆమె తొలి చిత్రం నుంచే సవాలుతో కూడిన పాత్రల్లో నటిస్తున్నారు. కనుక, సమంత లాగా మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆశయం. నాకు నచ్చిన హీరో విజయ్. ఆయన నటించిన అన్ని చిత్రాలను చూస్తున్నాను. ఆయన నడిచి వస్తుంటే అదో మాస్ సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారైనా ఆయనతో డ్యూయెట్ పాడాలని ఉంది. అదే విధంగా అజిత్, సూర్యతో కూడా డ్యూయెట్ పాడాలనేది నా సినిమా కల. ధర్మదురై చిత్రంలో విజయ్ సేతుపతికి స్నేహితురాలిగా నటించాను. రెక్క చిత్రంలో ఆయనకు చెల్లెలి పాత్రలో చేశాను. ఆయనతో నటిస్తున్నప్పుడు కెమెరా ముందు ఎలా ఉండాలి, ఏవిధంగా నటించాలి వంటి సూచనలు ఇస్తుంటారు. ఆయన భార్య కూడా ప్రోత్సహిస్తుంటారు. కనుక, ఆయన కుటుంబానికి నేను రుణపడి ఉన్నాను. విజయ్‌సేతుపతితో జోడీగా నటించడానికి ప్రయత్నిస్తున్నాను. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను అని ఐశ్వర్యా లక్ష్మి తెలిపింది.