కండనాళ్ ముదల్, కణ్ణాముచ్చి ఏనడా చిత్రాల ఫేమ్ ప్రియ దర్శకత్వం వహించిన తాజాచిత్రం పొన్ ఒండ్రు కండేన్. ఈ చిత్రంలో అశోక్‌సెల్వన్, వసంత రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు చెందిన వైఎస్సార్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని కలర్స్ తమిళ్ టీవీ ఛానెల్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రోమోను జియో స్టూడియోస్ సంస్థ తన ఎక్స్ మీడియాలో పేర్కొంది. ఇదే ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారుతోంది.
ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వసంత్ రవి తీవ్రంగా ఖండించారు. ఈయన ఈ వ్యవహారంపై తన ఎక్స్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ విషయం తనను ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. జియో స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలాంటి ప్రకటన చేయడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పొన్ ఒండ్రు కండేన్ చిత్రాన్ని నేరుగా ఛానెల్‌లో విడుదల చేసే విషయం గురించి అశోక్‌సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, నిర్మాత యువన్‌శంకర్‌రాజా, దర్శకురాలు ప్రియ అనుమతి తీసుకోకుండా ఇలాంటి ప్రకటన చేయడం బాధ కలిగిస్తోందన్నారు.
తాము ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించినట్లు పేర్కొన్నారు. అలాంటిది చిత్రాన్ని ఛానల్‌లో విడుదల చేయబోతున్నట్లు చేసిన ప్రకటన గురించి తమకెవరికీ తెలియదన్నారు. అలాంటి ప్రకటనను ఎక్స్ మీడియా ద్వారా ప్రకటించి తమకు మర్యాద నిచ్చినందుకు జియో స్టూడియోస్ సంస్థకు చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమను కలిసి ప్రకటన చేయడం సరికాదని వసంత్‌రవి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment