కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మీ విలక్షణమైన నటనతో పెద్ద ఎత్తున అభిమానుల ఫాలోయింగ్‌ని సొంత చేసుకుంది. అలాంటి ఆమె తాను ఎదుర్కొన్న చేదు ఘటనను గుర్తు చేసుకుంటూ..నా చిన్నతనంలో కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్లినప్పుడు, ఓ యువకుడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ రోజు నేను పసుపు బట్టలు వేసుకుని ఉన్నా. దాని తర్వాత పసుపు బట్టలు వేసుకోవాలంటే భయపడేదాన్ని అని, ఇప్పుడు ఆ భయం లేదని చెప్పుకొచ్చింది" ఐశ్వర్య. కాగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి ఐశ్వర్య లక్ష్మీ. సినిమాల ఎంపికలో తన ప్రత్యేకతను చాటుతున్నట్లే.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్ చూపిస్తోంది. ఆమెకు స్టయిల్‌ను కాయిన్ చేసిన బ్రాండ్స్‌లో కొన్ని..
దేవ్‌నాగరి..
ఇంజినీర్, డాక్టర్ కావాలనుకున్న అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. అమ్మమ్మ స్ఫూర్తితో ఫ్యాషన్ డిజైన్‌లోకి అడుగుపెట్టారు. జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్‌నాగరి’ పేరుతో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలో ఏ మూల జరుపుకునే పండగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువే. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఐశ్వర్య ధరించిన దేవ్‌నాగరి చీర ఖరీదు రూ.55,500/-
తృప్తి మెహతా
ముంబైలో పుట్టి, పెరిగిన తృప్తి మెహతా.. చిన్నవయసులోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగింది. చుట్టూ ఉన్న ప్రకృతే తన బ్రాండ్‌కి స్ఫూర్తి అని చెబుతుంది తృప్తి. అందుకే తన అన్ని కలెక్షన్స్‌లోనూ పక్షులు, చెట్లు, కొమ్మలు, ఆకులను పోలి ఉండే ఆభరణాలే కనిపిస్తాయి. అదే ఈ బ్రాండ్‌ని ఇతర బ్రాండ్స్‌కి భిన్నంగా నిలుపుతోంది. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ ఐశ్వర్య ధరించిన ఉంగరం ధర: రూ.3,800/-, కమ్మల ధర: రూ.5,800/-
(చదవండి: బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment