ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్ ఎంతమంది అబ్బాయిల మైండ్స్‌లో నాటుకుపోయిందో! ‘బొమ్మరిల్లు’లో అలా అడిగిన హ..హ..హాసిని.. జెనీలియా కూడా ఎంతమంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిందో! ఇప్పటికీ ఆమె పట్ల అదే క్రేజ్ చిన్న నుంచి పెద్ద వరకు. ఆమె గ్లామర్‌కీ అదే గ్రేస్..ఆడవాళ్లకు మెరిసే ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు. నా దృష్టిలో ఆడవాళ్ల జ్యూలరీలో ముక్కుపుడకను మించింది లేదు. అలాగే చీరకట్టును బీట్ చేసే ట్రెడిషనల్ వేర్ లేదు! అని అంటోంది జెనీలియా. ఇక ఆమె ట్రెడిషనల్ వేర్‌లో అయినా.. మోడర్న్ డ్రెస్‌లో అయినా! దేన్నయినా ఫ్యాషన్‌గా మలచుకోగల స్టయిల్ జెనీలియాది!. ఆ స్టయిల్ కోసం జెనీలియా ఈ బ్రాండ్స్‌నీ కన్సిడర్ చేస్తుంది.
ఒసా బై ఆదర్శ్
వెడ్డింగ్ కలెక్షన్స్‌కి కేరాఫ్ ఇది. దీని స్థాపకుడు ఆదర్శ్ మఖ్రియా. దేశంలోని సంప్రదాయ వస్త్రరీతులన్నిటికీ తన బ్రాండ్‌ని పడుగు.. పేకలుగా మార్చాడు. ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్‌లతో పెళ్లి వస్త్రాలకు కొత్త కళను అద్దుతాడు. అందుకే ఈ డిజైన్స్‌కి డిమాండ్ ఎక్కువ. కోల్‌కతా, ఢిల్లీల్లో స్టోర్స్ ఉన్నాయి. మల్టీడిజైనర్ స్టోర్స్‌లోనూ ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ధర మాత్రం సామాన్యులకు అందేలా ఉండదు. .జెనిలియా ధరించిన ఒసా బై ఆదర్శ్ డ్రెస్ ధర రూ. 1,77,555
నారాయణ్ జ్యూలర్స్
80 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఇది. సంప్రదాయ నగలు.. ఆధునిక ఆభరణాలు.. రెండిటికీ పెట్టింది పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజీలేని నాణ్యత.. కల్తీకాని నమ్మకానికి పర్యాయపదం ఈ జ్యూలర్స్. ధర.. ఆభరణాల డిజైన్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది.
ద పింక్ పోట్లీ
ఇది ముంబై బ్రాండ్. హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాగ్స్, పోట్లీలు, బట్వాలకు ప్రసిద్ధి. దీపా, ప్రణతి అనే తల్లీకూతుళ్ల ఆవిష్కార ఈ పింక్ పోట్లీ. ప్రొడక్షన్ విషయాలు దీపా చూసుకుంటే బ్రాండింగ్, మార్కెటింగ్, బిజినెస్ వ్యవహారాలు ప్రణతి చూసుకుంటుంది. ఆలియా భట్, కరీనా కపూర్, సోనం కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలెందరో దీనికి హాట్ ఫేవరేట్స్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. జ్యూలరీ బ్రాండ్: నారాయణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
(చదవండి: జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment