Genelia
-
క్యూట్ అందాలతో కవ్విస్తున్న జెనీలియా ఫొటోస్
-
దివాలీ వైబ్స్: నటి జెనీలియా స్పెషల్ లుక్
-
తుల్జాభవానీ అమ్మవారి సేవలో జెనిలీయా దంపతులు.. (ఫొటోలు)
-
నూతన ఓటీటీ హిమాన్షు..
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు. -
బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్ ఎంతమంది అబ్బాయిల మైండ్స్‌లో నాటుకుపోయిందో! ‘బొమ్మరిల్లు’లో అలా అడిగిన హ..హ..హాసిని.. జెనీలియా కూడా ఎంతమంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిందో! ఇప్పటికీ ఆమె పట్ల అదే క్రేజ్ చిన్న నుంచి పెద్ద వరకు. ఆమె గ్లామర్‌కీ అదే గ్రేస్..ఆడవాళ్లకు మెరిసే ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు. నా దృష్టిలో ఆడవాళ్ల జ్యూలరీలో ముక్కుపుడకను మించింది లేదు. అలాగే చీరకట్టును బీట్ చేసే ట్రెడిషనల్ వేర్ లేదు! అని అంటోంది జెనీలియా. ఇక ఆమె ట్రెడిషనల్ వేర్లో అయినా.. మోడర్న్ డ్రెస్‌లో అయినా! దేన్నయినా ఫ్యాషన్‌గా మలచుకోగల స్టయిల్ జెనీలియాది!. ఆ స్టయిల్ కోసం జెనీలియా ఈ బ్రాండ్స్‌నీ కన్సిడర్ చేస్తుంది. ఒసా బై ఆదర్శ్ వెడ్డింగ్ కలెక్షన్స్‌కి కేరాఫ్ ఇది. దీని స్థాపకుడు ఆదర్శ్ మఖ్రియా. దేశంలోని సంప్రదాయ వస్త్రరీతులన్నిటికీ తన బ్రాండ్‌ని పడుగు.. పేకలుగా మార్చాడు. ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్‌లతో పెళ్లి వస్త్రాలకు కొత్త కళను అద్దుతాడు. అందుకే ఈ డిజైన్స్‌కి డిమాండ్ ఎక్కువ. కోల్‌కతా, ఢిల్లీల్లో స్టోర్స్ ఉన్నాయి. మల్టీడిజైనర్ స్టోర్స్‌లోనూ ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ధర మాత్రం సామాన్యులకు అందేలా ఉండదు. .జెనిలియా ధరించిన ఒసా బై ఆదర్శ్ డ్రెస్ ధర రూ. 1,77,555 నారాయణ్ జ్యూలర్స్ 80 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఇది. సంప్రదాయ నగలు.. ఆధునిక ఆభరణాలు.. రెండిటికీ పెట్టింది పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజీలేని నాణ్యత.. కల్తీకాని నమ్మకానికి పర్యాయపదం ఈ జ్యూలర్స్. ధర.. ఆభరణాల డిజైన్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ద పింక్ పోట్లీ ఇది ముంబై బ్రాండ్. హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాగ్స్, పోట్లీలు, బట్వాలకు ప్రసిద్ధి. దీపా, ప్రణతి అనే తల్లీకూతుళ్ల ఆవిష్కార ఈ పింక్ పోట్లీ. ప్రొడక్షన్ విషయాలు దీపా చూసుకుంటే బ్రాండింగ్, మార్కెటింగ్, బిజినెస్ వ్యవహారాలు ప్రణతి చూసుకుంటుంది. ఆలియా భట్, కరీనా కపూర్, సోనం కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలెందరో దీనికి హాట్ ఫేవరేట్స్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. జ్యూలరీ బ్రాండ్: నారాయణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే..!) -
వెండితెరపై ఛత్రపతి శివాజీ వీరగాధ.. భర్త దర్శకత్వం, భార్య నిర్మాత!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. ఈ మహా రాజ్ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా ‘రాజా శివాజీ’ టైటిల్‌తో బయోపిక్ రూపొందించనున్నట్లు రితేష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ జీవిత చరిత్రలో టైటిల్ రోల్ చేయడంతో పాటు రితేష్ దర్శకత్వం కూడా వహించనున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది పేరు మాత్రమే కాదు ఒక భావోద్వేగం. ఈ మట్టిలో పుట్టిన ఈ మాణిక్యానికి నా నివాళులు. ఆయన వారసత్వం రాబోయే తరా లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ఈ నూతన ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలి.. జై శివరాయ్’’ అని పేర్కొన్నారు రితేష్. కాగా, రెండేళ్ల క్రితం దర్శకుడిగా తొలి చిత్రం ‘వేద్’ (మరాఠీ)ని తెరకెక్కించి విజయం సాధించారు రితేష్. మలి ప్రయత్నంగా ఛత్రపతి శివాజీ వంటి భారీ బయోపిక్‌ను రూపొందించనున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ కంపెనీ బేనర్ నిర్మించనున్న ఈ చిత్రానికి రితేష్ భార్య, నటి జెనీలియా ఓ నిర్మాత. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. -
జెనీలియాను టార్చర్ చేసిన డైరెక్టర్.. మూడు రాత్రులు నిద్రపోలేదట!
జెనిలియా.. తెలుగు ప్రేక్షకులకు నవ్వుల హాసినిగానే బాగా పరిచయం. సిద్ధార్థ్‌తో కలిసి నటించిన ‘బొమ్మరిల్లు’ సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. అందులో చలాకి, టింగరితనం గల హాసిని పాత్రలో జెనిలియా ఒదిగిపోయింది. బొమ్మరిల్లు తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ.. జెనిలియా అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం హాసిని క్యారెక్టరే గుర్తుకొస్తుంది. అయితే ఆ పాత్రలో నటించడానికి జెనిలియా చాలా కష్టపడిందట. ఆ సినిమాలో ఓ సీన్ కోసం మూడు రాత్రులు నిద్రలేకుండా చేశాడట దర్శకుడు భాస్కర్. ఒకనొక దశలో సినిమా చేయలేనని వెళ్లిపోయిందట. జెనిలియాను ఇబ్బంది పెట్టిన సీన్ ఏంటి? బొమ్మరిల్లు సినిమాలో అర్థరాత్రి వేళ హీరో సిద్ధార్థ్‌తో కలిసి జెనిలియా ఐస్‌క్రీమ్ తినడానికి వెళ్తుంది. ఈ సీన్ కోసం డైరెక్టర్ భాస్కర్.. జెనిలియాను అర్థరాత్రి షూట్‌కి రమ్మని చెప్పారట. మొదటి రోజు షూట్లో జెనిలియా సరిగా చేయలేదట. నాలుగైదు టేకులు తీసుకున్నా..సరిగా చేయలేకపోవడంతో తిరిగి పంపించారట. ఆ ఒక్క సీన్ కోసమే మూడు రోజుల పాటు ఆమెను నిద్ర పోనియకుండా చేశాడట డైరెక్టర్. అల్లు అర్జున్ చెప్పడంతో.. డైరెక్టర్ భాస్కర్ పెట్టే టార్చర్ భరించలేక సినిమా వద్దు అని జెనిలియా వెళ్లిపోయిందట. దాదాపు రెండు రోజుల పాటు షూటింగ్‌కి కూడా రాలేదట. ఈ విషయం గురించి అల్లు అర్జున్‌కు తెలిసి ఆమెతో మాట్లాడి సినిమాలో నటించేలా చేశాడని తెలుస్తోంది. బన్నీ, జెనిలియా మంచి స్నేహితులు. ఆయన కోరిక మేరకే జెనిలియా ‘బొమ్మరిల్లు’లో నటించింది. జెనిలియా ఇష్టం లేకుండా నటించిన చిత్రమే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బొమ్మరిల్లు రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆమె గురించే మాట్లాడుకున్నారు. -
ఆమిర్‌కు జోడీగా?
‘సై’, ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్’ వంటి చిత్రాలతో హీరోయిన్గా జెనీలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జెనీలియా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్‌కు జోడీగా ఆమె ఓ సినిమాలో ఎంపికయ్యారని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు జెనీలియాను తీసుకున్నారని, ఆర్ఎస్ ప్రసన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరి.. ఆమిర్‌కు జోడీగా జెనీలియా కనిపిస్తారా? చూడాలి. మరోవైపు దశాబ్దం తర్వాత ‘జూనియర్’ అనే తెలుగు సినిమాలో జెనీలియా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక 2012లో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ తెలుగులో హీరోయిన్గా జెనీలియా నటించిన చివరి చిత్రం. -
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్‌కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్‌లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్‌లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్‌లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆ కారణంతో బాలీవుడ్ నన్ను పక్కన పెట్టేసింది: జెనీలియా
ఉత్తరాదికి చెందిన నటి జెనీలియా. ఈమె 2003లో తుఝే మేరీ కస్సమ్ చిత్రం ద్వారా నటిగా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం తమిళంలోనూ బాయ్స్ చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళం తెలుగు హిందీ మరాఠీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. అయితే ఈమె తెలుగులోనే క్రేజీ కథానాయకిగా రాణించారు. తమిళంలోనూ నటుడు విజయ్, జయం రవి వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు. కాగా నటిగా ఉచ్చ దశలో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన దక్షిణాదిలో మాత్రం నటించలేదు. అలాంటిది తాజాగా మళ్లీ నటనపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది . చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనను పక్కన పెట్టేసిందని చెప్పారు. కొందరు హిందీ దర్శక నిర్మాతలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నావుగా అక్కడికే వెళ్లిపో అని చెప్పారన్నారు. అయితే తనకు దక్షిణాది చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని, అసలు తనకు నటనపై ఆసక్తి కలగడానికి కారణమే దక్షిణాది చిత్రాలు అని పేర్కొన్నారు. -
అందుకే సినిమాలకు దూరమయ్యాను : జెనీలియా
హా హా హాసినీ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలె వేద్(మజిలీకి రీమేక్)సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకుంది. భర్త రితేష్ డైరెక్షన్లో నటించిన ఆమె ఇందులో సమంత పాత్రను పోషించగా, చైతూ రోల్లో రితేష్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో తన నటనా జీవితంపై జెనీలియా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నా. ఇల్లాలిగా, పిల్లలకు మంచి తల్లిగా పూర్తి సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలకు దూరమయ్యా. ఇక రీసెంట్గా వేద్ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది. -
భర్త రితేష్ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ
పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నాక ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు మరాఠీ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. దర్శకుడిగా రితేష్‌కి ఇది తొలి సినిమా కావడం మరో విశేషం. ‘వేద్’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు జెనీలియా. వచ్చే ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. -
వైరల్ అవుతోన్న జెనిలియా ఎమోషనల్ పోస్ట్
‘బొమ్మరిల్లు’ సినిమాతో హా హా.. హాసిని అంటూ అందరి మనసులో అలా నిలిచిపోయింది నటి జెనిలియా. ఆ తర్వాత ‘రెడీ’, ‘ఢీ’.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పి హౌజ్ వైఫ్‌గా మారింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ఉంటుంది. చదవండి: ‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్’ ఈ నేపథ్యంలో ఇటీవల తన పెద్ద కుమారుడు రియాన్ 7వ పుట్టినరోజు సందర్భంగా, జెనీలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. రియాన్‌పై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలను హద్దుకుంటోంది. దీంతో ఆ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రియాన్ కోసం ఓ లేఖ రాసుకొచ్చింది జెన్నీ. ‘ప్రియమైన రియాన్! నీ చిట్టి బుర్రలో ఉన్న బోలెడన్ని కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా నీకు మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే తప్పించి నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్. ఐ లవ్ యూ మై బ్రేవ్ బాయ్’ అంటూ తల్లి ప్రేమను కురిపించింది. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటే తమ అభిమాని హీరోయిన్ జెన్నీ ఇలా ఏమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జెనిలియా, రితేశ్‌లు తమ కుమారులు ఎప్పుడు సమయంలో కేటాయిస్తుంటారు. ఎక్కడికి వెళ్లిన వారిని వెంట తీసుకుని వారితో సరదాగా గడుపుతుంటారు. View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
కళ్లతోనే మాట్లాడేస్తున్న ముద్దుగుమ్మలు
♦ మేం దాచుకోవాలనుకున్న ఫీలింగ్స్‌ను కళ్లు చెప్పేస్తాయంటోన్న సిమ్రత్ కౌర్ ♦ సెహరి డబ్బింగ్ పూర్తైందంటున్న సిమ్రాన్ చౌదరి ♦ సోహైల్‌తో టీవీ నటి శిల్ప ♦ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ స్నేహితురాలు నందితకు బర్త్‌డే విషెస్ తెలిపిన జెనీలియా View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
జెనీలియా చేతికి గాయం
-
మరోసారి ఢీ&ఢీకి రెడీ అవుతున్న మంచు విష్ణు
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ‘ఢీ’ విడుదల తేదీ పోస్టర్ని పోస్ట్ చేసిన విష్ణు ఈ నెల 23న ఓ ఎగ్జయిటింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాం అని ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘కొన్ని వేల మంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటుడికీ ఇదొక గేమ్ చేంజర్. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది.‘ఢీ’ కంటే బెటర్ ఏం ఉంటుంది?’ అని ట్వీట్ చేశారు విష్ణు. తాజాగా శ్రీనువైట్లతో డీ&డీ సినిమా చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. బిగ్ బ్రదర్ శ్రీను వైట్లతో మరోసారి పనిచేయడం ఆసక్తిగా ఉందని, డబుల్ డోస్‌తో ఈ సినిమా రాబోతుందని ట్వీట్ చేశారు. Here we go again! But this time it’s D&D Double Dose. Very excited to partner with my big brother Sreenu Vaitla garu again. God speed! #DD #Doubledose pic.twitter.com/TLeCZAq4kd — Vishnu Manchu (@iVishnuManchu) November 23, 2020 -
డాక్టర్స్ డే: బాలీవుడ్ జంట కొత్త నిర్ణయం
జన్మనిచ్చేది అమ్మ అయితే.. ప్రాణం పోసేది వైద్యుడు. కరోనా లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ జంట జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ ఓ ప్రతిజ్ఞ పూనారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. "రితేశ్, నేను ఈ పని ఎప్పుడో చేయాలని భావించాం, కానీ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సంకల్పానికి పూనుకునేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన డా.నోజర్ శెరీర్, FOGSIకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. (ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!) ఒకరికి జీవితాన్ని ఇవ్వడమే అసలైన బహుమతి. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పనిలో భాగస్వాములు అవండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ పూనండి" అని జెనీలియా పిలుపునిచ్చింది. వీరి నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్రరాయ్ గుర్తుగా ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం. ఆయన 1882 జూలై 1న జన్మించగా 1962 జూలై 1వ తేదీనే మరణించారు. ఆయన అందించిన విశేషమైన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 4న బిధాన్ చంద్రరాయ్‌కు అత్యున్నత పురస్కారమైన భారత రత్నను బహుకరించింది. (విద్యుత్ జమాల్‌కు అండగా జెనీలియా!) View this post on Instagram @riteishd and me have been thinking about it for a long time but unfortunately didn’t get down to doing it. Today on Doctor’s Day we pledge to donate our organs. We want to thank Dr Nozer Sherier and FOGSI for inspiring us. The greatest gift you can give someone is ‘The gift of life’. .We urge you all to take a part in this initiate and pledge to save lives, pledge to donate your organs. A post shared by Genelia Deshmukh (@geneliad) on Jul 1, 2020 at 4:29am PDT -
మిసెస్ శివాజీ
కెరీర్లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లాడారామె. వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ రితేష్ దేశ్‌ముఖ్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. రితేష్ నటించిన ‘లాయి బహారీ, మౌళి’ సినిమాల్లో తళుక్కున మెరిశారు జెనీలియా. ప్రస్తుతం ఓ పూర్తి స్థాయి పాత్రతో తన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రితేష్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో శివాజీ భార్య పాత్రలో కనిపించనున్నారట జెనీలియా. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. -
ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!
‘తుజే మేరీ కసమ్కు పదిహేడేళ్లు... నా మొదటి సినిమా. ఇందులో నా హృదయం అంటే నా భర్త కూడా ఉన్నాడు’ అంటూ హీరోయిన్ జెనీలియా తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘తుజే మేరీ కసమ్’ సినిమాతో జెనీలియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. ఇందులో జంటగా కనిపించిన జెనీలియా- రితేశ్.. షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. పెళ్లికి పెద్దల ఆమోదం లభించకపోవడంతో కొన్నాళ్లు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు రేహిల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా వీరిద్దరి బంధానికి బీజం వేసిన ‘తుజే మేరీ కసమ్’ సినిమా విడుదలై(2003) నేటికి సరిగ్గా పదిహేడేళ్లు. ఈ సందర్భంగా తొలి సినిమాలోని పాటలకు స్టెప్పులేసిన ఈ స్టార్ కపుల్... ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మాపై ఇంతగా ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అని భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘ఎల్లప్పుడూ మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి. ప్రేమ బంధాన్ని.. పెళ్లి పీటలు ఎక్కించి మా అందరికీ ఆదర్శంగా నిలిచిన మీ బంధం శాశ్వతంగా నిలిచి ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి సినిమాతోనే రితేశ్- జెనీలియా సూపర్‌హిట్ కొట్టారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టాలీవుడ్ హీరో తరుణ్ ‘నువ్వే కావాలి’ మూవీకి రీమేక్. View this post on Instagram #17YearsOfTujheMeriKasam Feels like yesterday... somethings in life are forever. Thank you all for the unconditional love that you have showered upon @geneliad & me. Location: Babhalgaon, Latur Shot by : @sandeep_films A post shared by Riteish Deshmukh (@riteishd) on Jan 2, 2020 at 11:50pm PST View this post on Instagram 17 years on .... fees like yesterday- reliving the memories of our debut film. #17YearsOfTujheMeriKasam @geneliad - Shot by @sandeep_films A post shared by Riteish Deshmukh (@riteishd) on Jan 2, 2020 at 11:15pm PST -
స్క్రీన్ టెస్ట్
► చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ సినిమాలో బాల నటుడిగా నటించింది, బాబు కాదు పాప. ఈ పాప పేరు ఏంటి? ఎ) సుజిత బి) సుహాసిని సి) సురభి డి) హారతి ► ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం చిత్రంలో అర్ధరూపాయి కోసం ఐస్‌పై నిలబడే బాలనటుడు ఎవరు? ఎ) హర్షిత్ బి) హాశ్రిత్ సి) తేజ.సజ్జా డి) బాలాదిత్య ► 2017వ సంవత్సరపు బాలల చలన చిత్రోత్సవంలో ‘అప్పూ’ అనే చిత్రం ద్వారా సందడి చేసిన బాల నటుడు శ్రీసాయి శ్రీవంత్. చిత్ర దర్శకుని పేరేంటో కనుక్కోండి... ఎ) అల్లాణి శ్రీధర్ బి) అక్కినేని కుటుంబరావు సి) కె. మోహన్ డి) ‘డాడి’ శ్రీనివాస్ ► యన్టీఆర్‌తో బడిపంతులు సినిమాలో మనవరాలుగా నటించిన ఈ బాల నటి తర్వాత కాలంలో ఆయన పక్కన చాలా సినిమాల్లో డ్యూయట్లు పాడింది. ఎవరామె? ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయప్రద ► చిన్నారి పెళ్లికూతురు హిందీ టీవీ సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి తెలుగు హీరో రాజ్‌తరుణ్‌తో రెండు సినిమాలలో నటించింది. ఆమె ఎవరు? ఎ) అవికాగోర్ బి) శ్వేతా బసు ప్రసాద్ సి) ఉల్కాగుప్తా డి) శ్రియా శర్మ ► అఖిల్ బాలనటునిగా నటించిన సినిమా ఏమిటి? ఎ) సిసింద్రీ బి) బాలరామాయణంసి) డాడి డి) అంజలి ► మణిరత్నం దర్శకత్వం వహించిన ‘అంజలి’ అనే సినిమాలో బాలనటిగా నటించింది షామిలి. ఆమె అక్క షాలిని. ఓ హీరోని పెళ్లి చేసుకుంది. ఆ హీరో పేరేంటి? ఎ) విజయ్ బి) అజిత్ సి) విక్రమ్ డి) సూర్య ► ‘కుక్క కావాలి’ అంటూ ‘చిత్రం’ సినిమాలో మారాం చేసే పాత్రను పోషించిన బాలనటి చేతన ఇప్పుడు హీరోయిన్గా పరిచయమైంది. ఈమె ఒక నటుని కూతురు. ఆ నటుడెవరు? ఎ) సాయికుమార్ బి) చిన్నా సి) ఉత్తేజ్ డి) గణేశ్ ► ‘మమతల కోవెల’ అనే చిత్రంలో హీరో కూతురిగా నటించిన బాలనటి తర్వాత కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో హీరోయిన్గా నటించింది? ఆమె ఎవరై ఉంటారు? ఎ) రాశి బి) నిత్యామీనన్ సి) రోహిణి డి) మీనా ► ఏ దర్శకుని కొడుకు మొదట బాలనటుడిగా నటించి ‘ఆంధ్రాపోరి’అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు? ఎ) కృష్ణ వంశీ బి) పూరి జగన్నాథ్ సి) గుణశేఖర్ డి) యన్ శంకర్ ► ‘కోయి మిల్ గయా’ అనే హిందీ సినిమాలో హృతిక్‌రోషన్‌తో నటించిన బాల నటి ఎవరు.ఆమె తెలుగు,తమిళ సినిమాల్లో ఇప్పుడు హ్యాపెనింగ్ హీరోయిన్. ఎవరామె? ఎ) జెనీలియా బి) హన్సిక సి) శ్రద్ధా కపూర్ డి) నిషా అగర్వాల్ ► ‘తల్లో మల్లె పూలు పెట్టుకోవాలి’ అంటూ ఈ బుడతడు చెప్పిన డైలాగ్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రం లోనిది. ఇప్పుడు అతను హీరో అయ్యాడు. అతని పేరేంటి? ఎ) కౌశిక్ బి) నాగ అన్వేష్ సి) బాలాదిత్య డి) మనోజ్ నందం ► వెంకటేశ్ బాల నటునిగా నటించిన చిత్రంపేరేంటో కనుక్కోండి... ఎ) ప్రేమాభిషేకం బి) మేఘ సందేశం సి) ప్రేమనగర్డి) శ్రీరంగనీతులు ► శివాజి గణేశన్ మరియు రజనీకాంత్‌లతో చాలా సినిమాల్లో బాల నటించిన అల్లరిపిల్ల ఎవరై ఉంటారు? తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించింది? ఎ) మీనా బి) సుహాసిని సి) సిమ్రాన్ డి) రమ్యకృష్ణ ► ఈ దర్శకుడు బాల నటుడుగా చాలా సినిమాల్లో నటì ంచాడు? హీరో సుమంత్‌కు బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించాటు? అతని పేరేంటì ? ఎ) చక్రి బి) సూర్యకిరణ్ సి) భీమినేని శ్రీనివాసరావు డి) అనిల్ రావిపూడి ► భంగిమ అంటూ ‘సాగర సంగమం’ సినిమాలో ఫోటోలు తీసిన ఈ బాలనటుడు గుర్తున్నాడా? తర్వాత కమల్‌హాసన్ నటించిన ‘ఈనాడు’సినిమాకు ఆ బాల నటుడే దర్శకత్వం వహించాడు. అతనెవరు? ఎ) శ్రీనివాస చక్రవర్తి బి) శ్రీరామ్ ఆదిత్య సి) చక్రి చిగురుపాటి డి)చక్రి తోలేటి ► బాల నటునిగా కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు తరుణ్, హీరోగా నటించిన తొలి సినిమా ఏది? ఎ) ప్రియమైన నీకు బి) నువ్వులేక నేనులేను సి) నువ్వేకావాలి డి) నువ్వే నువ్వే ► ఈ ఫోటో లోని అందాల అభినేత్రిసావిత్రితో ఉన్న ఈ బాలనటుణ్ణి గుర్తుపట్టండి? తర్వాత ఆయన లోకనాయకుడయ్యాడు? ఎ) కమల్ హాసన్ బి) నాగార్జున సి) కార్తీక్ డి) సురేశ్ ► మేజర్ చంద్రకాంత్ చిత్రంలో యన్టీఆర్ మనవడిగా నటించిన బాల నటుడు ఇప్పుడు రాకింగ్ స్టార్. ఎవరతను? ఎ) విష్ణు బి) మనోజ్ సి) ఆది పినిశెట్టి డి) ఆది సాయికుమార్ ► ఈ ఫోటోలో రామునిగా నటించిన బాల నటుడు ఎవరో గుర్తుపట్టండి? ఎ) కళ్యాణ్‌రామ్ బి) జూనియర్ యన్టీఆర్ సి) తారకరత్న డి) మోహనకృష్ణ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) సి5) ఎ 6) ఎ 7) బి 8) సి 9) ఎ10) బి 11) బి 12) బి13) సి 14) ఎ 15) బి 16) డి 17) సి 18) ఎ19) బి 20) బి -
నేను సృష్టించిన అద్భుతం : జెనీలియా
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న జెనీలియా తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. తన చిన్న కొడుకు రహైల్ పుట్టిన రోజు సందర్భంగా తను నేను సృష్టించిన అద్భుతం అంటూ ట్వీత్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రహైల్ తో కలిసి దిగిన ఫోటోతో పాటు ఈ కామెంట్ ను పోస్ట్ చేసింది. రహైల్ తండ్రి, బాలీవుడ్ హీరో రితేష్ కూడా కొడుకు బర్త్ డేను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేశాడు, పుట్టిన రోజు వేడుకకు తను కేక్ రెడీ చేస్తున్న వీడియోనే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రితేష్. ' ఈ రోజు ప్రత్యేకమైన రోజు.. రహైల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ కామెంట్ చేశాడు. హ..హ.. హాసినిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన జెనీలియా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను పెళ్లాడిన తరువాత వెండితెరకు దూరమైన ఈ బ్యూటి రెండో కొడుకుకు జన్మనిచ్చిన తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే జెనీలియాకు రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. Happy Birthday Rahyl... everytime I need to see a miracle,I look into your eyes and believe I created one.. You are soooo special lil one, you always will be and your mine that's all that matters.. God Bless You Always A post shared by Genelia Deshmukh (@geneliad) on May 31, 2017 at 9:47pm PDT -
నేను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను
తాను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను అంటున్నారు నటి జెనీలియా. దక్షిణాదిలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ ఉత్తరాది భామ హింది నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను లవ్వాడి, పెళ్లాడిన తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే హిందీ చిత్రం ఫోర్స్-2లో గెస్ట్‌గా మెరిశారు కూడా. ఇక వార్తల్లో ఉండడానికి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక కార్యక్రమంలో పాల్గొన్న జెనీలియా తాను మునుపటి కన్నా చాలా తెలివి మీరానని తెలిపారు. అనుభవం కూడా గడించానని చెప్పారు. చాలా మంది హీరోరుున్లు పెళ్లి తరువాత పిల్లలను కనడానికి సంకోచిస్తున్నారన్నారు. కొందరైతే గర్భం ధరించడం ఇష్టం లేక విడాకులు తీసుకుంటున్నారన్నారు. నిజానికి మాతృత్వంతో చాలా పరిణితి కలుగుతుందని, నటనలోనూ మరింత మెరుగ్గా నటించగలుగుతాయమని అన్నారు.నటి ఐశ్వర్యారాయ్‌నే తీసుకుంటే తను తల్లి అరుున తరువాత మరింత పరిణితితో నటిస్తున్నారని పేర్కొన్నారు.అరుుతే ఆమె ఇటీవల నటించిన చిత్రంలో హీరో రణ్‌బీర్‌కపూర్‌తో ఘాటైన లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి పెద్ద చర్చకే దారి తీశారన్నారు. తాను అలా నటించలేనని అన్నారు. మొత్తం మీద నటి ఐశ్వర్యారాయ్ చుంబనాల దృశ్యాలను సాకుగా చూపి నటి జెనీలియా తాను ప్రచారం పొందాలని చూస్తున్నారా? అన్న సందేహం కలుగుతోంది కదూ. -
హాసిని రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..?
బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. 2011లో రిలీజ్ అయిన ఫోర్స్ సినిమాతో ఆకట్టుకున్న జెనీలియా లాంగ్ గ్యాప్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ లో నటిస్తోంది. అయితే తొలి భాగం చివర్లో జెనీలియా పాత్ర చనిపోతుంది. మరి ఈ రెండు భాగంలో ఆమె పాత్రను ఎలా చూపిస్తారు. దెయ్యంగా వస్తుందా లేక.. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. సోనాక్షి సిన్మా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఫోర్స్ టు నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
డై..లాగి కొడితే....
సినిమా : బొమ్మరిల్లు రచన: అబ్బూరి రవి, దర్శకత్వం: భాస్కర్ ఫ్రెండ్స్‌తో కలిసి గుడికెళ్లిన సిద్దు (సిద్దార్థ్) పొరపాటున హాసినిని (జెనీలియా) ఢీ కొడతాడు. అప్పుడు ఏర్పడిన పరిచయంతో హాసిని ఇంటి దగ్గర బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తుంటాడు సిద్ధు. హాసిని రాగానే హాయ్.. ఆరోజు గుడిలో సరిగ్గా మాట్లాడుకోలేదు కదా.. అందుకనీ అంటాడు. అయితే? అని హాసిని బదులివ్వగానే ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు సిద్దు. ఇడియట్ అని కాలేజీకి వెళ్లిపోతుంది హాసిని. ఆమె కోసం కాలేజీకి వెళతాడు అతను. ఏదో గుడిలో కలిసావని మళ్లీ వస్తే సైట్ కొడుతున్నాడు.. లైనేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేస్తావా? నేను అలాంటి వాడిని కాదు. నేనూ ఇదే కాలేజీలో చదివా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమంటూ హాసినీకి చెప్పి వెళుతుంటాడు సిద్ధు. అప్పుడు హాసిని అంతేనా.. అంటుంది. ఇంకేం కావాలంటాడు సిద్ధు. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ... అంటుంది హాసిని. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే సెల్‌ఫోన్స్‌లో రింగ్‌టోన్‌గా మోతమోగిపోయింది. -
భార్య యంగ్‌గా కనిపిస్తే.. మరీ భర్త..!
‘అంతేనా.. వీలుంటే నాలుగు మాటలు.. కుదరితే కప్పు’ అంటూ ‘బొమ్మరిల్లు’లో ఆకట్టుకున్న జెనీలియా గుర్తుంది కదా! పలు తెలుగు సినిమాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. బాలీవుడ్‌లోని క్యూటెస్ట్ జంటలలో రితేశ్-జెనీలియా జోడీ ఒకటని చెప్పవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ ప్రేమకథలోని ఒక్కో పేజీని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ స్మార్ట్‌ఫోన్ ప్రమోషన్ కార్యక్రమంలో జెనీలియా పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను పెట్టి రితేష్ ఓ ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు. ‘మీ భార్య టీనేజర్లా మరీ యంగ్‌గా కనిపిస్తే.. మీరు ఆమెకు తండ్రిలా కనిపిస్తారు’అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు. నిజమే జెనీలియా ఇప్పటికీ తన చార్మింగ్ లుక్‌ను కోల్పోలేదు. రితేష్-జెనీలియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల రియాన్, ఐదేళ్ల రహిల్‌ను శ్రద్ధగా చూసుకుంటూ తల్లిగా తాను మురిసిపోతున్నట్టు జెనీలియా చెప్తోంది. -
రిలయన్స్ లైఫ్.. ఎఫ్1 స్మార్ట్‌ఫోన్
ధర రూ.13,999 ముంబై: రిలయన్స్ రిటైల్ తాజాగా ‘లైఫ్ ఎఫ్1’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.13,999గా ఉంది. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల డిస్ప్లే, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 32 జీబీ మెమరీ, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు ఈ స్మార్ట్ఫోన్లు రిలయన్స్ డిజిటల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
జీవీతో జెనీలియా రీఎంట్రీ
నటి జెనీలియాను దక్షిణాది సినిమా అంత సులభంగా మరచిపోదు. కారణం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అంతగా తనదైన ముద్ర వేసుకున్నారిక్కడ. తమిళంలో సచిన్, సంతోష్ సుబ్రమణియన్ లాంటి చాలా తక్కువ చిత్రాల్లో నటించినా, తెలుగులో పలు చిత్రాలు చేశారు. నటిగా మంచి లైమ్‌టైమ్‌లో ఉండగానే హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలా నటనకు దూరం అయిన జెనీలియా సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. అదీ కోలీవుడ్‌లో నటించనున్నారు. ఇప్పటి వరకూ కుర్ర హీరోయిన్లతో నటిస్తున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు జెనీలియాతో రొమాన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బ్యూస్‌టీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాలు త్వరలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. కాగా తాజాగా రామ్‌బాలా దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. సంతానం హీరోగా నటించిన సూపర్‌హిట్ చిత్రం దిల్లుక్కు దుడ్డు చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన దర్శకుడు రామ్‌బాలా అన్నది గమనార్హం. ఈయన దర్శకత్వంలో జీవీ నటించనున్న చిత్రాన్ని స్టీఫెన్ నిర్మించనున్నారు. ఇందులో జీవీకి జంటగా నటి జె నీలియా నాయకిగా నటించనున్నట్లు సమాచారం. కాగా ఇందులో హాస్య భూమికను వైగై పులి వడివేలు నటించడం మరో విశేషం. 2011 శాసనసభ ఎన్నికల తరువాత వడివేలు నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎలి అనే చిత్రంలో హీరోగా నటించినా ఆ చిత్రం ఆయన్ని నిరాశపరిచింది. చాలా గ్యాప్ తరువాత వడివేలు తన పాత బాణీకి మారారు. విశాల్ హీరోగా నటిస్తున్న కత్తిసండై చిత్రంలో హాస్య పాత్రతో రీఎంట్రీ అయ్యారు. తాజాగా జీవీ చిత్రంలో నటించనున్నారన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
భర్తకు అండగా...
అందం, అమాయకత్వం కలగలిసిన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ జెనీలియా. నటనతో పాటు ఆమెలో మరో ప్రతిభ కూడా ఉందంటున్నారు జెనీలియా భర్త, హిందీ హీరో రితేశ్ దేశ్‌ముఖ్. అదేంటంటే... ఆమెలో మంచి నిర్మాత లక్షణాలు కూడా ఉన్నాయట. పెళ్లైన తర్వాత ఎక్కువగా ఇంటికి పరిమితమైన ఈ బ్యూటీ భర్తకు అండగా నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్నారట! హీరోగా నటిస్తూనే, రెండు మరాఠీ సినిమాల్లో రితేశ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఓ మరాఠీ సినిమా నిర్మించాలనుకుంటున్నారు. ఆ చిత్రాల నిర్మాణ కార్యకలాపాలను జెనీలియా చూసుకుంటుందని రితేశ్ తెలిపారు. సౌత్‌లో హీరోయిన్గా నటించినప్పటి నుంచి ప్రొడక్షన్ అంటే ఆమెకు ఆసక్తి ఉందట. అది ఇప్పుడు నెరవేర్చుకుంటు న్నారు. అన్నట్టు.. రితేశ్ నటించిన మరాఠీ సినిమా ‘లయ్ భారి’కి నిర్మాత జెనీలియానే. -
నారదుడు ఏం చేశాడు?
ధనుష్, జెనీలియా జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఉత్తమపుత్తిరన్’. తెలుగులో ‘నారదుడు’ పేరుతో విడుదల కానుంది. శ్రీయ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్, టు అవర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ఉమ, వై.వి.సత్యనారాయణలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన పాటల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.పద్మారావు విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘స్ట్రయిట్ చిత్రాలు తీసే ముందు సినీ రంగంపై అవగాహన కోసం డబ్బింగ్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో నారదుడు ఎవరు? ధనుష్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ‘పిజ్జా 3’ని కూడా రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, శివగణేశ్. -
బెస్ట్ ఫ్రెండ్ ను కలుసుకున్న రామ్..
బొమ్మరిల్లు, సై, రెడీ లాంటి పలు చిత్రాల్లో నటించి తెలుగులో హీరోయిన్గా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెండితెరకు తాత్కాలికంగా దూరమైంది. ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా ప్రస్తుతం ఆ సంబరాల్లోనే మునిగి తేలుతుంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, జెనీలియాలు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. షూటింగుల్లో బిజీగా ఉంటున్న రామ్ ఇన్ని రోజులకు తన బెస్ట్ ఫ్రెండ్‌ను చూసేందుకు వెళ్లాడు. జెనీలియా కుమారుడు చిన్నారి రియాన్‌తో ప్రేమలో కూడా పడిపోయానంటున్నాడు. జెనీలియా దంపతులతో కొంత సమయం గడిపిన రామ్ ఆ సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో ఫ్రెండ్షిప్ డే వస్తుందనగా.. ఈ దోస్తులు ఇలా కలుసుకోవడం బాగుంది కదూ. With the bestie @geneliad and her sweetest husband @Riteishd .. I'm officially in love with Riaan you guys.. pic.twitter.com/SHhWC5mpoA — Ram Pothineni (@ramsayz) August 2, 2016 -
నారదుడుగా ధనుష్
‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’, ‘నవ మన్మథుడు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ హీరో ధనుష్. తమిళంలో ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ దాదాపు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. తాజాగా మరో చిత్రం రానుంది. ధనుష్, శ్రీయ, జెనీలియా ప్రధాన పాత్రల్లో జోహార్ దర్శకత్వంలో సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘నారదుడు’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. రేష్మ, కరిష్మా సమర్పణలో ఉమ (సైదాపురం) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఉమ మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగువారికి అవసరమైన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు, విజయ్ ఆంటోని సంగీతం, భువనచంద్ర పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
నా బొమ్మలన్నీ తనవే!
‘‘మా అమ్మానాన్న నాకో తమ్ముణ్ణి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నా బొమ్మలన్నీ తనవే’’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు రియాన్. జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ల ముద్దుల కొడుకు తను. ఈ బుడతడు పుట్టి ఏడాదిన్నర్ర అయ్యింది. అప్పుడే ట్విట్టర్లో తనకు తమ్ముడు పుట్టిన విషయాన్ని ఎలా పంచుకున్నాడబ్బా? అని ఆలోచించక్కర్లేదు. రియాన్ తరఫున రితేష్ చేసిన ట్వీట్ ఇది. బుధవారం ఉదయం జెనీలియా తన రెండో కొడుక్కి జన్మనిచ్చారు. తల్లీ కొడుకు క్షేమంగా ఉన్నారు. రితేష్, జెన్నీ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లకు పైగా ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రితేష్ వంటి వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టం అని జెన్నీ పేర్కొన్నారు. రెండో బాబుకి జన్మనివ్వడానికి ఆస్పత్రిలో చేరే ముందు తన భర్తతో దిగిన ఒక ఫొటోను ట్విట్టర్లో పెట్టి... ‘‘థ్యాంక్యూ గాడ్... నేను అనుకున్నదానికన్నా నన్ను ఎక్కువే ఆశీర్వదించావ్’’ అని పేర్కొన్నారామె. జెన్నీ, రితేష్‌ల వైవాహిక జీవితం ఎంత ఆనందంగా సాగుతోందో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు. -
హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియా డిసౌజా జంటకు మళ్లీ కొడుకు పుట్టాడు. ఇంతకుముందే వీళ్లకు రియాన్ అనే ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. తన పెద్దకొడుకు రియాన్‌కు ఇప్పుడు ఓ తమ్ముడు పుట్టాడని చెప్పాడు. ''హే గయ్స్, మా ఆయి, బాబా (అమ్మ, నాన్న) నాకు ఇప్పుడే ఓ చిన్నారి తమ్ముడిని బహుమతిగా ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ వాడివే.. రియాన్'' అంటూ తన పెద్ద కొడుకు చెబుతున్నట్లుగా రితేష్ ట్వీట్ చేశాడు. వెంటనే బాలీవుడ్ ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరుగా రితేష్ - జెనీలియా జంటకు తమ అభినందనలు తెలిపారు. హుమా ఖురేషి, బొమ్మన్ ఇరానీ, అదితి రావు హైదరీ, రాజ్‌నాయక్, బాబా సెహగల్, సచిన్ జోషి, కమాల్ ఆర్ ఖాన్, వరుణ్ ధావన్, ఆలియా భట్... ఇలా చాలామంది రితేష్, జెనీలియాలను అభినందించారు. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d — Riteish Deshmukh (@Riteishd) 1 June 2016 -
మరోసారి బాయ్స్ టీమ్
స్టార్ దర్శకుడు శంకర్ సెల్యులాయిడ్ సృష్టిలో బాయ్స్ చిత్రం ఒకటి. ఆయన చేసిన ఒక కొత్త ప్రయోగం ఇది. శంకర్ మ్యాజిక్ ఆశించినంతగా పని చేయకపోయినా ఆ చిత్రం ద్వారా సిద్ధార్థ్, భరత్, నకుల్, తమన్, మణికంఠన్, నటి జెనీలియా సహా ఆరుగురు నూతన టాలెంటెడ్ తారలు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వారిలో నటుడు మణికంఠన్ మినహా అంద రూ తమకంటూ ఒక గుర్తింపును పొందారు. సిద్ధార్థ్, భరత్, నకుల్ హీరోలుగా రాణిస్తుండగా తమన్ సంగీత దర్శకుడుగా తమిళం, తె లుగు భాషల్లో రాణిస్తున్నారు. ఈ టీమ్ 13 ఏళ్ల తరువాత మరోసారి కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారన్న తాజా సమాచారం. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. 13 ఏళ్ల తరువాత బాయ్స్ టీమ్ మళ్లీ కలిసి చిత్రం చేయనున్నాం. అంతా సవ్యంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన వెలువడనుంది. అని తమన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సిద్ధార్థ్, భరత్,నకుల్ హీరోలుగా నటించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి మహేంద్రన్ అనే నవ దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నట్లు టాక్. -
జెనీలియా మళ్లీ...?
ముంబై: వరుస శుభవార్తలతో బాలీవుడ్ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే హీరోయిన్ రాణీ ముఖర్జీ, ఆదిత్యా చోప్రా ఇంట్లోకి ఓ బుజ్జి అతిథి చేరి సంతోషాన్ని పంచింది. ఇపుడిక జెనీలియా వంతట. ఇప్పటికే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు మళ్లీ తల్లి కాబోతోందట. బాలీవుడ్ క్యూట్ కపుల్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దేశ్‌ముఖ్ కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా బాలీవుడ్ హీరో హీరోయిన్లు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే (నవంబర్ 24న) వీరి ముద్దుల కొడుకు రియాన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
నువ్వు నటించడానికే పుట్టావు!
ముంబై: హహ్హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జెనీలియా దేశ్‌ముఖ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోంది. మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ''చాలా సంతోషంగా ఉంది. త్వరలో షూటింగ్ మొదలు.. మూడేళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నా'' అని జెనీలియా ట్వీట్ చేసింది. జెనీలియా భర్త, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఇది చాలా మంచి రోజు... నువ్వు నటించడానికే పుట్టావు అంటూ సతీమణికి రిప్లై కూడా ఇచ్చాడు. కాగా తెలుగులో సై, శశిరేఖా పరిణయం, బొమ్మరిల్లు, బాలీవుడ్లో జానే తూ జానే న, తేరే నాల్ లవ్ హో గయా లాంటి సినిమాలలో హీరోయిన్గా మెప్పించిన జెనీలియా బాలీవుడ్‌కు చెందిన రితేష్‌ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు గత ఏడాది నవంబర్‌లో ఒక కొడుకు కూడా పుట్టాడు. దీంతో మూడేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఈ బొమ్మరిల్లు భామ, తన సెకండ్ ఇన్సింగ్స్ గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. On my way to shoot..excited as hell.. Been 3yrs since I last shot but I have a feeling it's going to be a Good Good Day.. — Genelia Deshmukh (@geneliad) August 12, 2015 It's going to be a Greattttt Dayyy - you were born for this. https://t.co/VjWqA8fa9t — Riteish Deshmukh (@Riteishd) August 12, 2015 -
మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా
ఫొటోలనేవి తీపిగుర్తులు. పైగా, ఆత్మీయలు, రక్తసంబంధీకుల ఫొటోలైతే మనకు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి. పదే పదే వాటిని చూసుకుని మురిసిపోతుంటాం. కానీ, ఒక్కోసారి ఇతరుల ఫొటోలను కూడా పదే పదే చూస్తుంటాం. ఆ ఫొటో తాలూకు బ్యూటీ మనకు కనువిందు చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న జెనీలియా, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్, కుమారుడు రియాన్ ఫొటో ఆ కోవకే చెందుతుంది. ముద్దులొలికే రియాన్‌పై తమకున్న ప్రేమనంతా జస్ట్ ఒక్క ఎక్స్ప్రెషన్తో చూపించేశారు జెన్నీ, రితేష్‌లు. రియాన్‌కి ఇప్పుడు ఆరు నెలల వయసు. ఈ బుడతడి రాకతో తమ జీవితం సంపూర్ణమైందని జెనీలియా అంటున్నారు. -
హీరోయిన్ కొడుకు 'ఫస్ట్' లుక్
ముంబయి : సోషల్ మీడియాలో మరో హీరో, హీరోయిన్ కొడుకు ఫస్ట్‌లుక్ హల్చల్ చేస్తోంది. బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన ముద్దుల తనయుడు రియాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నెలల ఈ బుడతడు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు 2014 నవంబర్‌లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. పుత్రోత్సాహంతో ఉన్న ఈ జంట ఎప్పటికప్పుడు బుజ్జాయి వార్తలను ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అబిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ తన కుమారుడి ఫోటోలను తొలిసారిగా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు ఆనందం కలిగించారు. ఆమధ్య హీరో అల్లు అర్జున్ కూడా ఇదేవిధంగా తన ముద్దుల కొడుకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిచేశారు. -
తండ్రి అయిన బాలీవుడ్ హీరో
ముంబయి : మరో బాలీవుడ్ హీరో తండ్రి ప్రమోషన్ కొట్టేశాడు. హీరో వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక ఆల్వా పాపకు జన్మనిచ్చింది. మంగళవారం ఆమె బుజ్జిపాపకు జన్మనివ్వడంతో వివేక్ ఒబెరాయ్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ సంతోషకరమైన వార్తను బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివేక్ ఒబెరాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. 'కంగ్రాట్యూలేషన్స్ ప్రియాంకా అండ్ వివేక్ ఒబెరాయ్.. లిటిల్ వీర్ హేజ్ ఏ లిటిల్ సిస్టర్.. సో హ్యాపీ ఫర్ యూ ఆల్.. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్,' అంటూ జెనీలియా ట్విట్ చేసింది. ఇప్పటికే వివేక్ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బుడ్డోడి పేరు వివాన్ వీర్ ఒబెరాయ్. వివేక్ ఒబెరాయ్ జేడీ(యూ) దివంగత నేత జీవరాజ్ ఆల్వా కుమార్తె ప్రియాంకను 2010 అక్టోబర్ 29న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రక్త చరిత్ర సినిమా ద్వారా వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. -
ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తోంది! - జెనీలియా
జెనీలియా... ఈ పేరు చెప్పగానే ‘బాయ్స్’ చిత్రంలోని టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్రధారిణి దాకా ఎన్నో వెండితెర దృశ్యాలు గుర్తుకొస్తాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్రస్థాయికి చేరుకొని, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళి చేసుకున్న ఈ అందాల నటి కొద్ది నెలల క్రితమే ఒక బాబుకు తల్లి అయ్యారు. అమ్మగా కొత్త బాధ్యతలు మీద పడ్డ జెనీలియా ఈ కొత్త పాత్రను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లల డయాపర్ల బ్రాండ్ ‘ప్యాంపర్స్’ ప్రకటనకు ఎండార్స్మెంట్ చేసిన జెనీలియా తన తల్లి పాత్ర గురించి తొలిసారిగా పంచుకున్న విశేషాలు... ♦ ఏకకాలంలో ఇంటి పని, చంటిబాబు పని చూసుకోవడం కొద్దిగా కష్టమే. కానీ, నా తొలి ప్రాధాన్యం బాబుకే! ఆ తరువాతే ఇంటి వ్యవహారాలు. మా బాబు రియాన్‌కు మూడు నెలలే. అదృష్టం ఏమిటంటే - రియాన్ రాత్రంతా నిద్రపోతాడు. అందువల్ల తల్లిగా నేను హ్యాపీ. నేను సంతోషంగా ఉండడం వల్ల అన్ని పనులూ సవ్యంగా చేసుకోగలుగుతున్నా. సానుకూలంగా స్పందించగలుగుతున్నా. బాబును హాయిగా ఆడించగలుగుతున్నా. ♦ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాబు పనులన్నీ స్వయంగా నేనే చేసుకోవడం వల్ల బాగా అలసిపోతున్నా. అయితే, కొత్తగా వచ్చిన ఈ తల్లి పాత్రను బాగా ఆస్వాదిస్తున్నా. తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభూతి. నాకు పదే పదే మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. మనకంటూ ఒక బిడ్డ పుట్టాక, మనకు మన అమ్మ మీద అమితంగా ప్రేమ పెరుగుతుందంటే నమ్మండి. ♦ చంటిపిల్లాణ్ణి పెంచడంలో మా అమ్మ నుంచి, మా అత్త గారి నుంచి బోలెడన్ని సలహాలు తీసుకుంటూ ఉంటా. అయితే, నా బుద్ధికి తోచినట్లు చేస్తా. చంటిపిల్లాడికి ఏం కావాలన్నది తల్లికి తెలిసినట్లుగా వేరెవరికీ తెలియదు. అయినా ఎవరో అన్నట్లు, చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు మాత్రం ఉండరు! ♦ మా ఆయన రితేశ్ దేశ్‌ముఖ్ కూడా పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. నేను గర్భవతినన్న సంగతి తెలిసిన క్షణమే ఆయన ఒక మాట అన్నారు... ‘నిజానికి, నువ్వొక్కదానివే కాదు, మన ఇద్దరం ఇప్పుడు ప్రెగ్నెంటే!’ జీవిత భాగస్వామి నుంచి ఏ స్త్రీకైనా అంతకు మించి ఇంకేం కావాలి! తండ్రి కాబోతున్న క్షణంలో ఆయనకొచ్చిన గొప్ప ఆలోచన అది. ఇలాంటి ఆలోచన వల్ల జీవిత భాగస్వాములిద్దరూ ఆ గర్భధారణ సమయాన్నీ, ప్రసవాన్నీ కలసి ఆస్వాదిస్తారు. అలాగే, తల్లితండ్రులుగా వచ్చిపడ్డ కొత్త బాధ్యతల్ని పంచుకుంటారు. రితేశ్ కూడా మా బాబుకి డయాపర్స్ మారుస్తారు, స్నానం చేయిస్తారు. బాబు నిద్రపోకపోతే, నాతో పాటే రాత్రంతా మెలకువగా ఉంటారు. పసిపిల్లల్ని పెంచడం కేవలం తల్లి బాధ్యతే కాదు, తండ్రి బాధ్యత కూడా అని గ్రహిస్తే, ఆ సంసారంలో అంతకన్నా ఆనందం ఏముంటుంది! ♦ నన్నడిగితే తల్లులకు మాతృత్వపు సెలవు ఇచ్చినట్లే, తండ్రులకు ‘పేటర్నిటీ లీవ్’ ఇవ్వాలి. దాన్ని చట్టబద్ధం చేయాలి. లేకపోతే, ఇతర పనుల్లో పడిపోయి, భార్యాబిడ్డలతో గడిపే తీరికే వాళ్ళకు ఉండదు. ♦ పెళ్ళయ్యాక మీలో వచ్చిన మార్పేమిటి? తల్లయ్యాక వచ్చిన మార్పేమిటి? అని నన్ను అందరూ అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే, మనం మనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూ పిల్లల్ని పెంచాలి. అది చంటిపిల్లల పెంపకంలో ప్రతిఫలిస్తుంది. అలా కాకుండా మరొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడిక మొత్తం కుప్పకూలిపోతుంది. హుషారుగా, ఆనందంగా ఉండే అమ్మాయి మా అమ్మ అని గుర్తించేలా మా అబ్బాయి పెరగాలనుకుంటున్నా. ♦ పసిబిడ్డకు తల్లి అయ్యాక సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా శారీరక మార్పులు తప్పవు. గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఎంతైనా లావు కావచ్చు. బిడ్డ పుట్టాక మళ్ళీ క్రమంగా అందం మీద దృష్టి పెట్టక తప్పదు. అలాగే, తల్లి పాత్ర వల్ల నటిగా లైమ్‌లైట్‌కు దూరమయ్యానని అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, జీవితంలో నేనేమీ మిస్సవడం లేదు. తల్లి పాత్ర అలవాటయ్యాక ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నా. మొన్నటిదాకా నటిగా, నిన్న గర్భవతిగా, ఇప్పుడు తల్లిగా - ఇలా ప్రతి దశనూ ఆస్వాదిస్తూనే ఉన్నా. -
సెకండ్ ఇన్నింగ్స్!
తెలుగులో ఓ వెలుగు వెలిగి... బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్నట్టుంది. అయితే తెలుగులో కాదు... తన భర్త బిజీగా ఉన్న మరాఠీ స్క్రీన్‌పై! ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో గ్లామరస్‌గా కనిపించిన జెనీ... బాలీవుడ్లో తన రీ ఎంట్రీ గురించి చెబుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు భిన్నంగా అమ్మడు... ‘ఇన్నాళ్లూ ఇంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేశాను. స్క్రిప్ట్స్ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతానికైతే ఏ సినిమాకీ సైన్ చెయ్యలేదు. అయితే మరాఠీ చిత్రంలో నటించడమంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. రితేష్ అప్‌కమింగ్ వెంచర్లో జెనీలియా లీడ్ రోల్ చేయనుందనేది సమాచారం. రితేష్ గత చిత్రం ‘లాయ్ భారీ’లో ఈ చిన్నది హోలీ సాంగ్‌లో కనిపించి మురిపించింది. -
నేను మళ్లీ వస్తున్నా...
జెనిలీయా.. ఈ పేరు వింటే చాలు...'అంతేనా..వీలైతే నాలుగు మాటలు...కుదిరితే కప్పు కాఫీ' డైలాగ్స్ ఠక్కున గుర్తస్తాయి. 'సై' అంటూ హుషారుగా ...'బొమ్మరిల్లు' చిత్రంలో తన నటనతో మార్కులు కొట్టేసిన ఈ అమ్ముడు ప్రస్తుతం కొడుకుతో ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను జెన్నీ 2012 వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తెరమీద ఆమె ముఖమే కనిపించకపోవటంతో అభిమానులను కొంతనిరాశను మిగిల్చింది. అయితే జెనీలియ మరోసారి తెరాగమనం చేస్తానంటోంది. అతి త్వరలోనే ఓ చిత్రంలో నటించనున్నట్లు చెబుతోంది. అయితే అది బాలీవుడ్ చిత్రమా, టాలీవుడ్ చిత్రామా అనేది మాత్రం చెప్పలేదు. అంతేకాకుండా తన భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి బాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించనుందట. అయితే వీటన్నిటి కన్నా 'మాతృత్వాన్ని మించిన వరం మహిళలకు మరొకటి లేదని, తన ప్రసవ సమయంలో భర్త చూపించిన ఆదరణ దేనితోను పోల్చనేనని' జెనీలియా చెప్పటం విశేషం. -
మా అబ్బాయి పేరేంటంటే...?
బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ‘మా బుజ్జి కొండ రాక మాకెంతో ఆనందంగా ఉంది’ అని ఈ దంపతులు పేర్కొన్నారు. తమ కుమారుడి నామకరణోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుక గురించి జెనీలియా చెబుతూ - ‘‘ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల బంధువుల్నీ, స్నేహితుల్నీ కలుసుకోవడం అరుదైపోతోంది. కానీ, మా అబ్బాయి ‘బార్సీ’ (నామకరణోత్సవం) మమ్మల్నందర్నీ ఒకచోటకి చేర్చింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుక చేయడం చాలా ఆనందం అనిపించింది’’ అన్నారు. మా అబ్బాయి పేరేంటో తెలుసా. ‘రియాన్ రితేష్ దేశ్‌ముఖ్’ అని రితేష్, జెనీలియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. -
రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!
ముంబై:బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాల జంటకు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట తీవ్రంగా చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు. తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది. -
డిసౌజా..దేశ్‌ముఖ్‌ల మూడు తరాలు
ముంబయి : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి జెనీలియా డిసౌజా శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమెకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన జెన్నీ, రితేష్ దేశ్‌ముఖ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళుతూ మీడియా కంటికి చిక్కారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తల్లి, అత్తగార్లతో కలిసి తమ ముద్దుల కొడుకుతో ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. కొడుకు పుట్టిన ఆనందాన్ని మాత్రం రితేష్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నాడు. #Thank you all for your Love, Prayers & Blessings - the mother @geneliad n the lil one are doing great. అంటూ ట్విట్ చేశాడు. -
జెనీలియా అమ్మ అయింది..
ప్రముఖ నటి జెనీలియా డిసౌజ గత నెల 25న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆదివారం ముంబైలో తమ ముద్దుల బాబుతో జెనీలియా. చిత్రంలో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, ఇతర కుటుంబ సభ్యులు. -
జెనీలియాకు కొడుకు పుట్టాడు
ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా బాగా పరిచయమైన హాసిని.. అదే జెనీలియాకు కొడుకు పుట్టాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన జెనీలియా ఇటీవలే నెలలు నిండిన తర్వాత కూడా ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంగళవారం నాడు ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. వెంటనే రితేష్ దేశ్‌ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాడు. తనకు కొడుకు పుట్టినందుకు రితేష్ తెగ ఆనందపడిపోయాడు. బ్బోయ్య్.... అంటూ చాలా గట్టిగా ఒత్తి మరీ చెప్పాడు. 2003 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకుంది. It's a BBBOOOOYYYYYY!!!!!!!! — Riteish Deshmukh (@Riteishd) November 25, 2014 -
తల్లి కాబోతున్న జెనీలియా
-
జెనీలియా స్కర్ట్‌తో రితేష్
‘‘నీ మినీ స్కర్ట్ ఒకసారి నాకు ఇస్తావా... వేసుకోవాలనిపిస్తోంది’’ అని భార్యను భర్త అడిగితే... ఖంగు తినడం ఖాయం. ఇటీవల జెనీలియాకు అలాంటి షాకే తగిలింది. అయితే, తన భర్త స్కర్ట్ ఎందుకు అడిగాడో తెలుసుకున్న తర్వాత హాయిగా నవ్వుకున్నారు జెనీలియా. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, రామ్‌కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తా, తమన్నా ముఖ్య తారలుగా రూపొం దిన చిత్రం ‘హమ్ షకల్స్’. ఇందులో సైఫ్ ఆడవేషంలో కనిపించనున్న విషయం తెలిసిందే. రితేష్ కూడా ఈ అవతారంలో కనిపించి, అలరించనున్నారు. మినీ స్కర్ట్, పైకి మడిచి ముడివేసిన షర్ట్‌తో వీలైనంత గ్లామరస్‌గా కనిపించాలనుకున్నారు ఆయన. అందుకే తన శ్రీమతి స్కర్ట్ అడిగి తీసుకున్నారు. జెన్నీ, రితేష్‌ల నడుము కొలత ఒకటే కావడం విశేషం. అందువల్లే రితేష్ తన భార్య స్కర్ట్ ధరించి నటించడానికి కుదిరింది. ఆడవేషంలో రితేష్‌ని చూసి, చాలా హాట్‌గా ఉన్నావ్ గురూ అని లొకేషన్లో అన్నారట. జెన్నీకి కూడా ఈ లుక్ బాగా నచ్చిందట. ఈ నెల 20న సినిమా రిలీజ్ అవు తోంది. -
తప్పు చేస్తే డబ్బులిస్తానన్నాడు!
‘మంచి పనులు చేస్తే.. బహుమతి ఇస్తా’ అని కొంతమంది పందెం కడతారు. కానీ, తప్పు చేస్తే, డబ్బులిస్తానని తమన్నాతో పందెం కట్టారు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. తను జెనీలియా భర్త. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, తమన్నా తదితరుల కాంబినేషన్లో ‘హమ్ షకల్స్’ అనే చిత్రం రూపొందుతోంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల రితేష్, తమన్నాలపై ఓ సన్నివేశం తీశారు. అది క్లిష్టమైన సీన్ కావడంతో తమన్నా తడబడ్డారు. దాంతో, సీన్‌ని మరోసారి విపులంగా వివరించి, ‘ఈసారి సరిగ్గా చెయ్యాలి’ అన్నారట సాజిద్. కానీ, ఆయనకు తెలియకుండా ‘నువ్వు కనుక ఈసారి కూడా తప్పుగా చేస్తే, నీకు వెయ్యి రూపాయలిస్తా’ అని రితేష్ అన్నారట. కోట్లు సంపాదిస్తున్న తమన్నాకి వెయ్యి రూపాయలు చాలా తక్కువే అయినా, ఊరికే వచ్చింది ఎందుకు వదులుకోవాలని, తప్పుగా చేశారట. దాంతో రితేష్ పది వంద నోట్లు లంచం ఇచ్చుకున్నారు. ఇదంతా చేసింది జస్ట్ తమాషా కోసం అని, సైఫ్, రితేష్ లొకేషన్లో ఉంటే ఇలాంటి తమాషాలు బోల్డన్ని చేస్తారని, ఒక్కోసారి వాళ్లు వేసే జోకులకు కుర్చీల్లోంచి కిందపడి మరీ నవ్వి నంత పని చేస్తామని తమన్నా పేర్కొన్నారు. -
మళ్లీ వస్తున్నా
మళ్లీ వస్తున్నా అవకాశాలివ్వండి అంటోంది బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా. ఒక సారి ముఖానికి రంగేసుకున్న తరువాత దానికి దూరం అవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన నటీమణులకు సినిమా ఆశ తీరదు. పెళ్లి అయిన తరువాత కూడా తమ హవా కొనసాగించాలని కోరుకుంటారు. కొందరికి అది చెల్లినా అలాంటి అవకాశాలు లేనివారు అక్కగానో, వదినగానో చివరికి అమ్మగా నటించడానికైనా సిద్ధపడటం చూస్తూనే ఉన్నాం. అలా మళ్లీ ముఖానికి రంగేసుకోవాలని తహతలాడుతున్న పెళ్లయిన వారి జాబితాలో తాజాగా జెనీలియా చేరారు. ఉత్తరాది నుంచి దక్షిణాది కొచ్చి హీరోయిన్గా ప్రకాశించిన హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. తమిళంలో బాయ్స్ చిత్రం ద్వారా తెరపైకి వచ్చిన దరహాసిని ఆ తరువాత విజయ్, ధనుష్, జయంరవి వంటి ప్రముఖ హీరోల సరసన నటించి మంచి పేరు పొందారు. టాలీవుడ్‌లోను హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ప్రేమలోపడి ఆ తరువాత ఆయన్నే జీవిత భాగస్వామిని చేసుకున్నారు. దీంతో నటనకు స్వస్తి చెప్పారు. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మళ్లీ నటించాలనే కోరిక పుట్టిందట. భర్త అనుమతితో ఇప్పటికే హిందీ చిత్రం జయహోలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇక తమిళం, తెలుగు భాషలలోనూ నటించాలని భావిస్తున్నారట. దీంతో తనకు బాగా సన్నిహితమయిన దర్శక నిర్మాతలకు ఫోన్ చేసి తాను నటించడానికి సిద్ధం. మంచి అవకాశాలివ్వండని అడుగుతున్నారు. దక్షిణాదిలో మరో రౌండ్ కొడతాననే దృఢ నిశ్చయంతో ఉన్నారు. -
రెండు సంప్రదాయాల జోడి... నిండు హృదయాల సవ్వడి
నవ్వుల హాసిని ‘జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కిందటేడాది ఫిబ్రవరి 3న దంపతులయ్యారు. ఇద్దరి మతాలు వేరు. కుటుంబ నేపథ్యాలు వేరు. దీంతో మొదట ఇరువైపు పెద్దలు ససేమిరా అన్నారు. అయినా ఎవరినీ నొప్పించకుండా ఒప్పించి ఒక్కటైన ఈ జంట విశేషాలే ఈ మనసే జతగా! ప్రేమికులుగా ఉన్నప్పుడు కులాలు, మతాలు అడ్డు రావు. కాని పెళ్లి అనగానే ఎవరి సంప్రదాయాలు వారికి గుర్తుకు వస్తాయి. పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని కొంతమంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు తమ ప్రేమను తమలోనే దాచుకుని కుమిలిపోతుంటారు. కొందరు మాత్రమే ధైర్యంగా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించి మరీ జంటకడతారు. ఈ వరసలోనే చేరుతారు 26 ఏళ్ల జెనీలియా డి సౌజా, 35 ఏళ్ల రితేష్ దేశ్‌ముఖ్‌లు. రితేష్ సినిమాల్లోకి రాకముందు ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ్జకుమారుడు. అప్పటికి జెనీలియా మోడల్! రితేష్ 2003లో తుఝే మేరీ కసమ్ సినిమాలో నటించడానికి ఓకే చేశారు. కో స్టార్ జెనీలియా! ఇద్దరికీ అది మొదటి సినిమా. ఆ సినిమాతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా వీరి అనుబంధం మాత్రం పెద్ద హిట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరికి వారు కెరియర్లో బిజీగా ఉంటూనే తమ మధ్య ఆత్మీయతను పెంచుకున్నారు. అనుబంధానికే ప్రాముఖ్యం జెనీలియా: రితేష్‌తో ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మా మధ్య ప్రేమ చిగురించిందని తెలిశాక ఇరువైపు కుటుంబాల వారికి చెప్పాం. అయితే రితేష్ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో ఎనిమిదేళ్లపాటు వారి అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రితేష్ చాలా కష్టపడ్డారు. మా మధ్య బంధం మొదలైన నాటి నుంచి వారి ఇంట్లో చెబుతూనే ఉండేవారు. నేనూ అంతే! అమ్మనాన్నలకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉండేదాన్ని. మా మధ్య దీర్ఘకాలంగా కొనసాగిన ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి ఓకే చేశారు. అంతే! మా ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఇరువైపులవారికి నచ్చినట్టుగా రెండు మతాల పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా మా ఇంట్లో వారికి నచ్చినట్టుగా చర్చిలోనూ, రితేష్ ఇంట్లో వారికి నచ్చినట్టుగా మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలోనూ మా పెళ్లి అయ్యింది. రితేష్ పెద్ద అన్నయ్య టీవీ నటి అదితి ప్రతాప్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అదితి నటనకు ఫుల్స్టాప్ పెట్టేసింది. దాంతో నేనూ అలాగే నా నటనకు స్వస్తి చెబుతానని చాలా మంది అనుకున్నారు. కాని రితేష్ మాత్రం ఆ నిర్ణయం నాకే వదిలేశారు. అందుకే ఇంకా సినిమాల్లో నటిస్తున్నాను. నేను రితేష్ కలిసి గుళ్లు, గోపురాలు సందర్శిస్తుంటాం. అలాగే చర్చ్‌కీ వెళుతుంటాం. మా పెళ్లయిన కొద్దిరోజులకే ముంబైలో మంచి ఫ్లాట్ కొనుక్కున్నాం. మేం ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దగ్గర ఉండి డిజైన్ చేయించారు రితేష్! దేవుడికి నేను చాలా ఇష్టమైన బిడ్డను అని నమ్ముతాను. అందుకే నా జీవితం ఇంత బాగుంది. నాకే చిన్న సమస్య వచ్చినా దేవుడితోనే ముందు చెప్పుకుంటాను...’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ, ఎంతో సంబరంగా చెబుతారు ఆమె! విలువ తెలిపిన బంధం రితేష్: మా పెద్దలు పెళ్లికి ఒప్పుకోనప్పుడు జీవితాంతం స్నేహితులుగానే ఉందామని చెప్పింది జెనీలియా! పెద్దల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల మన్నన ఉన్న వ్యక్తి తను. ఆమె నా జీవితంలోకి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. నా పుట్టినరోజు కూడా కిందటి వారమే (డిసెంబర్ 17). క్రిస్ట్మస్ కూడా ఈ నెలలోనే! దీంతో మా ఇంట రెండు పండుగల సందడి ఉంటుంది. అంధేరిలోని సెయింట్ క్యాథరీన్ హోమ్ బాలల మధ్య కిందటేడాది క్రిస్ట్మస్ వేడుకలు జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి’ అంటూ ఆనందంగా వివరిస్తారు రితేష్! ఇద్దరూ సెలబ్రిటీలు. కాంట్రవర్సీ కామన్! సమస్యలూ సహజమే! అయినా ప్రేమను కాపాడుకోవడానికి పెద్దలను ఒప్పించిన ఈ జంటకు అవన్నీ దూదిపింజెల్లాంటివే! పెళ్లయ్యాక నా నటనకు ఫుల్స్టాప్ పడుతుంది అన్నారంతా! కానీ రితేష్ మాత్రం ఆ నిర్ణయాన్ని నాకే వదిలేశారు. - జెనీలియా జెనీలియా నా జీవితంలో కి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. - రితేష్ -
క్రిస్మస్... ఓ ఆనందం, ఓ సంతోషం - జెనీలియా
తారాస్వరం క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచీ ఆ పండుగ కోసం ఎదురు చూడటం అలవాటు నాకు. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు... అన్నిచోట్లా క్రిస్మస్ సందడే కనిపిస్తుంది. క్రిస్మస్ స్పిరిట్ అలా గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టడం ఎంత సరదాగా ఉంటుందో! ఒక్కసారి స్టార్ పెట్టామో... ఇక క్రిస్మస్ వచ్చేసినట్టే. అమ్మకి కేక్ తయారీలో సాయం చేయడం, అన్నయ్యతో కలిసి ఇల్లు అలంకరించడం, పండుగకి షాపింగ్ చేయడం, నాకా డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి అంటూ అమ్మానాన్నలను సతాయించడం... ఎంత మంచి జ్ఞాపకాలో అవన్నీ. నా వరకూ నాకు క్రిస్మస్ అంటే ఓ ఆనందం. ఓ సంబరం. ఆ రోజు ఉన్నంత సంతోషం మరెప్పుడూ ఉండదేమో. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించడంలో ఉండే సంతోషమే వేరు. నాకు తెలిసి... ఆ రోజు ఉన్నంత రుచిగా అమ్మ వంట మరెప్పుడూ ఉండదు. మనసులో నిండిన క్రిస్మస్ జాయ్... అన్నిటినీ అలా మధురంగా మార్చేస్తుందనుకుంటా. అందుకే అస్సలు మిస్ అవను నేను. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా... ఆ రోజున ఇంట్లోవాళ్ల దగ్గర వాలిపోవాల్సిందే! క్రిస్మస్ పండుగలో నాకు నచ్చిన మరో విషయం... అందరికీ పంచడం. బహుమానాలు కొనడం, అందరికీ ఇవ్వడం, లేనివాళ్లకు మన దగ్గర ఉన్నదాన్ని పంచి ఇవ్వడం ఎంతో సంతోషాన్నిస్తుంది. నిజమైన క్రిస్మస్ స్పిరిట్ అదే! ముద్దుపేర్లు: జెన్నీ, జీనూ పుట్టినరోజు: ఆగస్టు 5, 1987 జన్మస్థలం: బాంద్రా, ముంబై మాతృభాష: కొంకణి చదువు: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ నచ్చే ఆహారం: బిర్యానీ, రెడ్ మసాలా ఫిష్ కర్రీ నచ్చే రంగులు: పసుపు, ఎరుపు నచ్చే దుస్తులు: ప్యాంట్స్, టాప్స్. లాంగ్ స్కర్టులు కూడా చాలా ఇష్టం. నచ్చిన సినిమాలు: హోమ్ అలోన్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే నచ్చే హీరోలు: షారుఖ్, సల్మాన్, ఆమిర్ నచ్చే హీరోయిన్లు: మాధురీ దీక్షిత్, కాజోల్ నచ్చే దర్శకుడు: ఇంతియాజ్ అలీ నచ్చే సింగర్‌స: మడొన్నా, లక్కీ అలీ నచ్చే ఆట: ఫుట్‌బాల్. నేను జాతీయస్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. ఫిట్నెస్ సీక్రెట్: కొద్దిగా వ్యాయామం, కొంచెం ఆహార నియంత్రణ. అంతే. అయినా లేని అందం ఏం చేసినా రాదు. ఉన్నదాన్ని కాపాడుకోవడానికి మరీ అంత కష్టపడిపోవాల్సిన అవసరమూ లేదని అనుకుంటాను. తీరిక వేళల్లో: పాత పాటలు వింటూ హ్యాపీగా గడిపేస్తా. నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా ఏ కంపెనీలోనో ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని. లేదంటే ఏదైనా చిన్న వ్యాపారమైనా చేసేదాన్ని. కానీ ఏం చేసినా సక్సెస్ అయి ఉండేదాన్ని. నమ్మే సిద్ధాంతం: జీవించు, జీవించనివ్వు. భవిష్యత్ ప్రణాళిలు: వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగిపోతోంది. అందుకే ఇక వృత్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను. త్వరలోనే అన్ని భాషల్లోనూ నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాను. మిగిలినదంతా దేవుడి దయ. నేను ఆయనకు ప్రియమైన బిడ్డని. నేనేం చేయాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఎక్కడికి చేరాలో అక్కడికే చేర్చుతాడు. అది నా నమ్మకం! -
ముంబైలో 'రెడ్ కార్పెట్' ఈవెంట్
-
ఇండియన్ బ్రైడల్ ఐడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్
ముంబైలో జరిగిన ఇండియన్ బ్రైడల్ ఐడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్లో మోడల్స్ వెరైటీ డ్రస్సులతో కనువిందు చేశారు. ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, రోహిత్ బాల్ రూపొందించిన ఫ్యాషన్స్‌లో మోడల్స్ మెరిశారు. బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, ప్రాచీ దేశాయ్, గీతా బస్రా, ఇషా గుప్తా, అతిథిరావు హైద్రి, సోఫీ చౌదరి క్యాట్ వ్యాక్లతో అదరగొట్టారు. Courtesy: HOTURE IMAGES -
హ్యేపీ ఇండిపెండెన్స్ డే!
67వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా ప్రముఖులు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులమైనందుకు గర్వపడుతున్నామని, దేశం గర్వించేలా ఏదైనా చేయాలని పలువురు పేర్కొన్నారు. మాతృభూమిలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హ్యేపీ ఇండిపెండెన్స్ డే.. భారతీయుడినని గర్వించు.. జైహింద్ అంటూ హీరో రామ్ ట్విట్ చేశారు. వందేమాతరం అంటూ హీరో రామ్ చరణ్ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులకు రచయిత కోన వెంకట్ వందనాలర్పించారు. స్వతంత్ర భారతావనికి హీరో సిద్ధార్థ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దేశానికి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతానన్నాడు. నిజమైన భారతదేశ పౌరురాలిగా గర్వపడుతున్నానని హీరోయిన్ శ్రియా శరణ్ ట్విట్ చేసింది. భారతదేశం తన నా మాతృభూమి అయినందుకు గర్విస్తున్నానని, ఐ లవ్ ఇండియా అంటూ జెలీనియా పేర్కొంది. శాంతి, అనురక్తితో జీవించాలని ప్రియా ఆనంద్ ఆకాంక్షించింది. మిత్రులందరికీ పద్మశ్రీ డాక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా ఒకటేనని మంచు మనోజ్ ట్వీట్ పోస్ట్ చేశాడు. మేరా భారత్ మహాన్, భారతీయుడినని గర్వించు అని మంచు విష్ణు పేర్కొన్నారు. దేశం గర్వించేలా ఏదైనా చేయాలని సోనూ సోద్ సూచించాడు. తన 25వ సినిమా టైటిల్ 'హ్యేపీ ఇండిపెండెన్స్ డే' అని తమిళ హీరో ధనుష్ ట్వీట్ చేశాడు. -
అవకాశాల వేటలో జెనీలియా
నటి జెనీలియాను దక్షిణాది ప్రేక్షకులు మరచిపోలేరు. కోలీవుడ్‌లో బాయ్స్, సంతోష్ సుబ్రమణియన్, సచ్చిన్, తెలుగులో బొమ్మరిల్లు వంటి చిత్రాలతో ఈమె మంచి గుర్తింపు సాధించింది. హిందీలోనూ కొన్ని చిత్రాలు చేసింది. హీరోరుయిన్గా మంచి స్థానంలో ఉండగానే బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత జెనీలియూకు అవకాశాలు తగ్గాయి. ఆమె సైతం అంతగా ఆసక్తి చూపించలేదు. తాజాగా భర్త మళ్లీ నటించడానికి పచ్చజెండా ఊపడంతో ఈ హాసిని అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది. బాలీవుడ్లో అవకాశాల కోసం కొందరు దర్శకులకు రాయబారం పంపినా ప్రయోజనం లేకపోయిందని సమాచారం. దీంతో తనను తారాస్థాయికి తీసుకెళ్లిన దక్షిణాదిపై దృష్టి సారించింది. ముందుగా టాలీవుడ్లో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ దర్శక, నిర్మాతలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిందట. పార్టీ కొచ్చిన వారందరూ బాగా ఎంజాయ్ చేసి జెనీలియాకు అభినందనలు తెలిపి మరీ వెళ్లారట. అవకాశాల మాట మాత్రం నోరెత్తలేదట. దీంతో డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ జెనీలియా తల పట్టుకుని కూర్చొందట. ఇక అమ్మడి దృష్టి కోలీవుడ్‌పై మళ్లింది. ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.