నారదుడు ఏం చేశాడు? | Naradudu Movie Audio Function | Sakshi
Sakshi News home page

నారదుడు ఏం చేశాడు?

Published Mon, Aug 8 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

నారదుడు ఏం చేశాడు?

నారదుడు ఏం చేశాడు?

 ధనుష్, జెనీలియా జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఉత్తమపుత్తిరన్’. తెలుగులో ‘నారదుడు’ పేరుతో విడుదల కానుంది. శ్రీయ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్, టు అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఉమ, వై.వి.సత్యనారాయణలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన పాటల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.పద్మారావు విడుదల చేశారు.
 
  నిర్మాతలు మాట్లాడుతూ -‘‘స్ట్రయిట్ చిత్రాలు తీసే ముందు సినీ రంగంపై అవగాహన కోసం డబ్బింగ్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో నారదుడు ఎవరు? ధనుష్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ‘పిజ్జా 3’ని కూడా రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, శివగణేశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement