Naradudu
-
అతడు సర్వాంతర్యామి
‘‘నమో హిరణ్యాయ నమః’’ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు.‘‘రమ్ము నారదా’’ అంటూ మహర్షికి స్వాగతం పలికాడు హిరణ్యకశిపుడు.‘‘దానవేంద్రులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు.మరలా ఏదైనా దండయాత్రకు ప్రయత్నమా?’’ అడిగాడు నారదుడు.‘‘ముల్లోకములు జయించినవాడికా!’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఇక తాను జయించవలసింది ఏమీ లేదనే భావన...ఆ జవాబులో ధ్వనించింది.‘‘మరి దీర్ఘాలోచనకు కారణం?’’ అడిగాడు నారదుడు.‘‘ప్రహ్లాదుడు’’ అన్నాడు హిరణ్యకశిపుడు విచారంగా.ప్రహ్లాదుడిని చూస్తూ...‘‘బుద్ధిమంతుడు’’ మెచ్చుకోలుగా అన్నాడు నారదుడు.‘‘మంద బుద్ధిమంతుడు’’ అన్నాడు విసుగ్గా హిరణ్యకశిపుడు.‘‘అదేమి దానవేంద్రా!’’ ఆశ్చర్యపోయాడు నారదుడు.‘‘ఇతనికి ఏదో జాడ్యం ఉన్నది. ఉలకడు. పలకడు. ఆకలి అనడు. దప్పి అనడు. తోటివాళ్లతో ఆడడు, పాడడు. అసలు తాను దానవ సార్వభౌముని పుత్రుడననే అహంకారం, దర్పం కానరాదు...’’ అని బాధగా చెప్పుకుపోతున్నాడు హిరణ్యకశిపుడు.(స్నేహితులు కూడా ప్రహ్లాదుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు....అటువంటి తండ్రికి ఇటువంటి కొడుకా! అని ఈసడించుకుంటున్నారు)‘‘ఒంటరిగా కూర్చొని తనలో తాను పిచ్చివాని వలే నవ్వుచుండును’’ అన్నది లీలావతి తన ముద్దుల కుమారుడిని గురించి.‘‘అవును. లీలావతి జ్ఞాపకమున్నదా? పసితనములో ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా ఉండేదిగానీ...’’ అని నారదుడు అన్నాడో లేదో హిరణ్యకశిపుడు అడ్డుపడ్డాడు.‘‘ఓహో ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమవాతావరణ ప్రభావము. గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాకాదులచే పోషించిన పుత్రుడు ఇట్లుగాక మరెట్లుండును’’ అన్నాడు హిరణ్యకశిపుడు వ్యంగ్యంగా.‘‘స్వామీ! చిరంజీవి ఇంకను పసివాడు. అతడిని ఉద్ధరించే మార్గం ఆలోచించండి’’ అని అభ్యర్థించింది లీలావతి.‘‘దీనికి ఒక్కటే మార్గం’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఆ తరువాత కొడుకును దగ్గరగా తీసుకొని...‘‘నాయనా! నీవు దానవకులదీపం. భావి సార్వభౌముడవు. సకలశాస్త్ర పారంగతుడవై, నీతికోవిదుడవై ముల్లోకములను పరిపాలించవలెను. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం’’ అన్నాడు.‘‘అలాగే తండ్రి! శ్రద్ధగా చదువుకొనెదను’’ వినయంగా సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు.‘‘సంతోషం’’ అన్నాడు హిరణ్యకశిపుడు.విద్య కోసం ప్రహ్లాదుడిని చండమార్కుల దగ్గరికి పంపారు.చండామార్కుల ఆశ్రమంలో.... ‘‘హరిభక్తి లేని వాడు పశువు కన్నా హీనం కదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.ఆ బాలుని కళ్లలో తెలియని దివ్యత్వం! ‘‘అయితే మల్లోకాధిపతి అయిన నీ తండ్రి, నీకు గురువులమైన మేము, ఈ దానవలోకం అంతా పశువులనా నువ్వు అనునది!’’ ఆందోళనస్వరంతో అడిగారు చండామార్కులు.‘‘హరి హరి గురుదూషణ పాపంకదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘పాపం పాపం అంటూనే గురువులకు పంగనామం పెడుతున్నావు’’ అని వెటకరించారు పెద్ద గురువు. ‘‘లేదు గురువర్యా! నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి’’ తన్మయంగా అన్నాడు ప్రహ్లాదుడు.ఎంత చెప్పినా శిష్యుడుగారు తమ మాటలు వినరని, పైగా తమకే పాఠాలు చెబుతాడనే విషయం చండామార్కులకు ఆ చిరుసమయంలో క్షుణ్ణంగా అర్థమైంది.ఇక పెద్దగురువు గారిలో వణుకు మొదలైంది.‘‘తమ్ముడూ...నా వొడలంతయూ కంపనముగా యున్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చెదను నాయనా!’’ అన్నారు పెద్ద గురువుగారు.‘అగ్రజా! నా వొడలు నీ కంటే కంపనముగా యున్నవి. నేనూ వచ్చెదను’’ అని అన్నగారి వణుకుతో తన వణుకును జత చేశాడు.గురువులు అలా వెళ్లారో లేదో విద్యార్థులు హుషారుగా ఆటలు మొదలు పెట్టారు.వారి ఆటలను చూసి...‘‘మిత్రులారా! శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థం చేయుట? అన్ని జన్మలలోనూ మానవజన్మ దుర్లభం. ఈ జీవితం నూరు సంవత్సరాలకు పరిమితం. ఈ నూరు సంవత్సరాలలో సగం రాత్రి రూపమున, నిద్ర రూపమున నిరర్థకం అగును. మిగిలిన యాభై ఏండ్లలో ఇరవై ఏండ్లు పోగా చివరికి మిగిలినముప్పది ఏండ్లలో సంసార లంపటమున చిక్కుకొని మానవుడు కామ క్రోధాది అరిషడ్వర్గములచే పీడించబడును. కావున...కాలం వ్యర్థం చేయక హరిభజనలో మోక్షం పొందుట ఉత్తమం, హరినామంకంటే రుచి అయినది లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘లేకేం...నరమాంసం’’ అన్నాడు ఒక విద్యార్థి.మిగిలిన వాళ్లు నవ్వారు.‘‘హరి అంటే ఎవరు?’’ అని ప్రహ్లాదుడిని అడిగాడు ఒకడు. ‘‘నారాయణుడు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘అతనికి రెండు పేర్లా?’’ అడిగాడు ఒకడు.‘‘రెండేమిటి! అతనికి అనంతకోటి నామాలు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘ఎందుకు?’’‘‘ఒకటైతే వాళ్ల అమ్మ మరిచిపోతుందని’’ వెటకారంగా అన్నాడు ఒకడు.‘‘అతని అమ్మ పేరేమిటి?’’‘‘అతనికి అమ్మ లేదు’’‘‘మరి నాన్నో?’’‘నాన్నా లేడు’’‘వాడెవడో విచిత్రమైన వాడునన్నట్లున్నాడే...ఏ ఉరు ఎక్కడ ఉంటాడు?’’ ఆసక్తిగా అడిగాడుఒకడు. ‘‘అతడు సర్వాంతర్యామి. అతను లేని చోటు లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘మరి ఎలా పుట్టాడు?’’‘‘అతనికి పుట్టుకయే లేదు’’‘‘మరి అతడిని చూసుట ఎట్లా?’’‘‘భక్తితోధ్యానించుటయే’’‘‘ఓంనమోనారాయణ....ఓం నమోనారాయణ’’పై సన్నివేశాలు ఏ సినిమాలోనివి? -
"నారదుడు" వర్కింగ్ స్టిల్స్
-
నారదుడు ఏం చేశాడు?
ధనుష్, జెనీలియా జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఉత్తమపుత్తిరన్’. తెలుగులో ‘నారదుడు’ పేరుతో విడుదల కానుంది. శ్రీయ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్, టు అవర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ఉమ, వై.వి.సత్యనారాయణలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన పాటల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.పద్మారావు విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘స్ట్రయిట్ చిత్రాలు తీసే ముందు సినీ రంగంపై అవగాహన కోసం డబ్బింగ్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో నారదుడు ఎవరు? ధనుష్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ‘పిజ్జా 3’ని కూడా రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, శివగణేశ్. -
గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు
పురానీతి ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే గజదొంగ ఉండేవాడు. ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకుని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకుని జీవించేవాడు. అడవి దారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి, వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవి దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళుతుండగా, రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు దస్కం ఏమేమి ఉన్నాయో బయటకు తీయమని గద్దించాడు. నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రం బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి... ‘ఎందుకిలా దారికాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను.’ అని బదులిచ్చాడు. ‘నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?’ అడిగాడు నారద మహాముని. ‘నేను, నా భార్య, నా కొడుకు... ఇంకా వయసుమళ్లిన నా తల్లిదండ్రులు... వాళ్లందరి బాగోగులు నేనే చూసుకోవాలి’ బదులిచ్చాడు రత్నాకరుడు. ‘వాళ్లందరి బాగోగులు చూసుకోవడం కచ్చితంగా నీ బాధ్యతే! అయితే, అందుకోసం అమాయకులను చంపి దోచుకోవడం పాపం కదా! ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో’ అన్నాడు నారద మహాముని. ‘సరే... నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను’ అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే, తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి, ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు. ‘నిన్ను పెళ్లి చేసుకున్నాక... నిన్ను బాగా చూసుకోవడానికి దారిదోపిడీలు చేస్తున్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తున్నాను. ఈ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా..?’ అని భార్యను అడిగాడు. ‘నన్ను పోషించడం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే’ తేల్చి చెప్పింది భార్య. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు... ‘వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను కదా..! నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా?’ అని అడిగాడు. ‘నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్లిన దశలో కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాప పుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి గానీ, మేమెలా అనుభవిస్తాం’ అన్నారు. చివరిగా కొడుకును అడిగాడు. ‘నిన్ను పెంచి పెద్దచేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా?’ ససేమిరా అనేశాడు కొడుకు. ‘నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాప పుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే’ అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తుడిని చేశాడు. ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బతకమని సెలవిస్తాడు నారద మహాముని. ఇక అప్పటి నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి. -
శ్రీకృష్ణసత్యన్నారదీయం
దీపావళి సందర్భంగా శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుల సంభాషణ. నారదుడు: స్వామీ! శ్రీకృష్ణపరమాత్మా! అడగ కూడదని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నాను... ఎక్కడకు బయలుదేరారు స్వామీ. సత్యభామ: అయ్యా! నారదమునీంద్రా! ఆచారాలు సంప్రదాయాలు తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం భావ్యమేనా. అయినా ఈ పూట మేం ఎక్కడికి వెళ్తామో ముందుగా నీకే తెలుస్తుంది కదా త్రిలోకసంచారీ! నారదుడు: అయ్యో! తెలియక కాదమ్మా! అన్నీ తెలిసినవాడినే. తెలుసు కనుకనే అడగవలసి వచ్చింది. సత్యభామ: అంతటి అత్యవసరం ఏమొచ్చింది మునివర్యా! నారదుడు: అమ్మా! సత్యాభామా దేవీ! నిన్నటికి నిన్న భూలోకమంతా ఒకసారి పర్యటించి వచ్చాను. అక్కడ కొందరు ప్రజలు మాట్లాడుకున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ విషయాలు మీకు విన్నవించుకుందామని వచ్చాను తల్లీ! శ్రీకృష్ణుడు: ప్రజలు ఏమనుకుంటారు నారదా! ఈ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, బాణాసంచా కాల్చుకుంటూ సంబరంగా జరుపుకోవాలనుకుంటారు అంతేగా! ఇందులో ప్రత్యేకంగా విన్నవించుకోవలసినదేం ఉంటుంది! నారదుడు: అక్కడే మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు స్వామీ! నేను కొన్ని ప్రాంతాలు పర్యటించి, దీపావళి పండుగను ఎవరెవరు ఏ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారో తెలుసుకుందామని ఒక సర్వే నిర్వహించాను. వారి మాటలు నన్ను అవాక్కయ్యేలా చేశాయి. సత్యభామ: ఊరికే ఉత్కంఠ కలిగించేలా కాకుండా అసలు విషయం ఏమిటో శలవియ్యవయ్యా బ్రహ్మచారీ! నారదుడు: వస్తున్నా! ఆ విషయానికే వస్తున్నాను! శ్రీకృష్ణుడు: ఊఁ ప్రారంభించు. నారదుడు: ఎలా ప్రారంభించమంటారో అర్థం కావటం లేదు స్వామీ! వారి మాటలు వినలేక నా చెవులు మూసుకున్నాను. సత్యభామ: అంత వినరాని మాటలు ఏమన్నారు కలహభోజనా! నారదుడు: తల్లీ! నన్ను కలహ భోజనా అన్నా సరే! ఏమన్నా సరే! కాని, నేను చెబుతున్నది వాస్తవం. నా చెవులతో విన్న మాటలు నోటితో పలకలేను. విన్నందుకే నా చెవులలో దివ్య మందాకినీ జలం పోసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నోటితో పలికి నోటిని కూడా సంప్రోక్షణ చేసుకోమంటావా తల్లీ! శ్రీకృష్ణుడు: ఏం జరిగింది నారదా! ముందువెనుకలు లేకుండా మాట్లాడుతున్నావు. ఇక ఆ మాటలు కట్టిపెట్టి అసలు విషయానికి రావయ్యా! నారదుడు: ఏముంది స్వామీ! మీరు సత్యా సమేతులై, ద్వాపరయుగంలో నరకాసుకర సంహారం చేసి ప్రజలకు చీకటిని పారద్రోలి వెలుతురును ప్రసాదించారు. ఆ సంతోషంతో నాటి నుంచి భూలోకవాసులంతా నరకచతుర్దశి, దీపావళి జరుపుకుంటున్నారు. ఈ సంగతి తెలిసిందేగా. సత్యభామ: అవును! ఇందులో వినరాని మాటలేం ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే కదా. ముల్లోకాలలోనే కాకుండా కలియుగంలో సైతం కిందటి సంవత్సరం వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది కదా! నారదుడు: ప్రజల అమాయకత్వమనుకోవాలో, వారి అతి తెలివితేటలను కోవాలో అర్థం కావట్లేదు స్వామీ! ప్రజలట బాణసంచా కాల్చకూడదట. అలా కాల్చటం వలన వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం ఏర్పడుతుందట. ఈ విడ్డూరం ఎన్నడైనా విన్నామా కన్నామా స్వామీ! మరీ ఇంత అన్యాయమా! వారంరోజులుగా ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతోంది. పండుగనాడు కేవలం దీపాలు మాత్రమే వెలిగించుకోవాలట, టపాసులు కాల్చకూడదట. ఎక్కడ చూసినా ఈ ప్రచారం జోరుగా, హోరుగా, వడివడిగా సాగుతోంది. కొందరైతే సోషల్ నెట్‌వర్క్‌లలో మెయిల్స్ పంపుతున్నారు. ఏం చెప్పమంటారు స్వామీ! శ్రీకృష్ణుడు: అంతే కదా నారదా! ఒకటి చెప్పనా నా ప్రజలేమీ తెలివితక్కువ వారు కాదు. వారు టపాసులు కాల్చితీరతారు. ఆకాశంలో హరివిల్లులు సృష్టిస్తారు. భూలోకంలోకి వెన్నెల వెలుగులు, సుధామయూఖాలు తీసుకువస్తారు. నువ్వేమీ విచారించకు నారదా! సత్యభామ: ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే ప్రజలు భయపడి, కాల్చటం మానేయరా స్వామీ..! శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! ప్రజలేమీ అవివేకులు కారు. మంచిచెడులు తెలియనివారు అంతకన్నా కాదు. తెల్లవారి లేచింది మొదలు ఎంత కాలుష్యాన్ని చూస్తున్నారు ప్రజలు. ఆటోల నుంచి వచ్చే కిరోసిన్ వాసనకి ఎంతమంది ఆస్త్మా బారినపడుతున్నారో, నిరంతరం బస్సులు, కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు వాయించే హారన్లకి ఎంత శబ్దం కాలుష్యం అవుతోందో, ప్లాస్టిక్ వల్ల ఎంత జల కాలుష్యం అవుతోందో నా ప్రజలకు బాగా తెలుసు. అటువంటిది టపాసుల వలన కాలుష్యం అంటే ఎవ్వరూ విశ్వసించరు. పైగా కాకరపువ్వొత్తుల వల్ల, మతాబుల వల్ల క్రిమికీటకాలు నశిస్తాయని, దోమలు సమూలంగా నాశనమవుతాయని భారతీయులకు తెలుసు. అంతేకాదు, ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభ మవుతుంది. అంటే చీకటి రాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే చలి కూడా మొదలవుతుంది. వీటిని పారద్రోలడానికే ఈ పండుగ అనే విషయం ప్రతి భారతీయ పౌరుడికి తెలుసు. సత్యభామ: ఈ ప్రచారం చేసేది కూడా మీ ప్రజలేగా స్వామీ! అయినా ఇలా ఎందుకు చేస్తున్నట్లో అర్థం కావటం లేదు స్వామీ! శ్రీకృష్ణుడు: ఏముంది? నేటి యువత విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోతోంది. వారికి మన భారతీయ విలువలు తెలియడానికి ఇంకా కొంతకాలం పడుతుంది సత్యా! సత్యభామ: స్వామీ! మన పండుగలలో సైన్స్ కూడా ఉందంటారు కదా! శ్రీకృష్ణుడు: మనవారికి రోగనిరోధకశక్తి ఎక్కువ. అందుకు కారణం ఏ ఋతువుకు తగ్గట్టు ఆయా పండుగలు, ఆహారపు అలవాట్లూనూ... ఇన్ని పండుగలు, ఇంత వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి మనకు ఉన్నంతగా మిగతా దేశాలకు లేవు. అవి తెలియక, ఈ వెర్రిమొర్రి ఆలోచనలు కలుగుతున్నాయి. సత్యభామ: ఇంకా... నరులు ఇంటింటా వాడే దోమల మందులు, రసాయనాలు, ఇంటిని పరిశుభ్రపరచే ద్రవాలు... వీటికి మించిన కాలుష్యం లేదట కదా స్వామీ! ఏడాదికి ఒకసారి జరుపుకునే ఈ పండుగ వలన సత్యాశ్రీకృష్ణులకు పేరు వచ్చేస్తుందేమోననే ఈర్ష్య ఉన్నవారు ఇలా ఈ పండుగ గురించి దుష్ర్పచారం చేస్తున్నారనిపిస్తోంది స్వామీ! శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! మన మీద ఈర్ష్య అసూయలు కాదు, వారు ఇలా కాల్చవద్దని చెప్పడంలోనూ ఒక ఆంతర్యం ఉంది. కొందరు స్వార్థపరులు ఈ సమయంలో పెద్దపెద్ద ధ్వనులు వచ్చే టపాసులు కాల్చుతారు. దానివల్ల పసిపిల్లలు,అమాయక ప్రాణులు ఇబ్బంది పడతాయి. అందువలన చెప్పి ఉంటారనుకోవచ్చు కదా! ఎవరు ఏది చెప్పినా అందులోని మంచిని గ్రహించటానికి ప్రయత్నించాలి సత్యా! నారదుడు: అయ్యా! పరంధామా! మీ మాటలు నాకు తేనెల ఊటలా ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను స్వామీ! ఈ పండుగకు బాణాసంచా కొనకుండా ఆ డబ్బును సత్కార్యాలకు వినియోగించమని ప్రచారం చేస్తున్నారు, మరి అవేవో ఇంగ్లీషువారి దినాలుంటాయి కదా, వాలెంటైన్స్‌డే, మదర్స్ డే... ఇత్యాది దినాలకు ఖర్చు చేయవద్దని ఇటువంటి ప్రచారం ఎందుకు చేయరు స్వామీ! శ్రీకృష్ణుడు: నారదా! మనం వాటి గురించి ఆలోచించటం అనవసరం. ‘శ్రీకృష్ణుడు’ అంటే ‘లోకకల్యాణం కోసం ప్రభవించినవాడు’ అని ప్రపంచమంతా తెలిసిందే. నరకుడిని చంపిన రోజు లోకానికి ఆనందం కనుక ఈ పండుగను జరుపుకోవలసిందే... మరోమాట... దుష్టసంహారం జరిపిన ఇటువంటిరోజులను పండుగగా జరుపుకుంటే... కొందరైనా శిష్టరక్షణ కార్యానికి పూనుకుంటారు. ఈ పండుగలు మానుకుంటే మంచిపనులు చేయాలనే అభిలాష కొరవడుతుంది. అనునిత్యం లోకకల్యాణం కోసం ఎవరో ఒకరు పాటుపడుతూనే ఉండాలి. అందుకే ఈ పండుగలు పబ్బాలూనూ. పిండివంటలు నైవేద్యాలు పెట్టడమూనూ... సత్యభామ: ఎవ్వరు ఎన్ని మాటలన్నా మీ నవ్వురాజిల్లెడు మోములో లవలేశం క్రోధం కూడా కనపడదు కదా స్వామీ.! నీ నుంచి నేను ఆ లక్షణం నేర్చుకోగలిగితే బాగుంటుంది. శ్రీకృష్ణుడు: ఒకటి చెప్పనా సత్యా! నీకు స్వాభిమానం ఎక్కువ. అది ప్రతి స్త్రీకి అలంకారం. నీలో ఆ గుణం చూసి అందరూ సత్యలా ఉండాలనుకుంటున్నారు. అంతకుమించిన ఘనత ఏముంది. నారదుడు: అయ్యా! సత్యాపతీ! మీరిద్దరూ ఒకరినొకరు ప్రశంసలలో ముంచెత్తుకోవడమేనా, భూలోక యాత్ర ప్రారంభించేది లేదా... శ్రీకృష్ణుడు: ఇదిగో బయలుదేరుతున్నాము మహర్షీ! సత్యా... రథాన్ని పోనియ్యి ... భూలోకవాసులు జరుపుకునే ఈ దీపావళిని కన్నుల పండువుగా వీక్షిద్దాం... - డా.పురాణపండ వైజయంతి