అతడు సర్వాంతర్యామి | Seen is yours title is ours 21-04-2019 | Sakshi
Sakshi News home page

అతడు సర్వాంతర్యామి

Published Sun, Apr 21 2019 12:03 AM | Last Updated on Sun, Apr 21 2019 12:03 AM

Seen is yours title is ours 21-04-2019 - Sakshi

‘‘నమో హిరణ్యాయ నమః’’ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు.‘‘రమ్ము నారదా’’ అంటూ మహర్షికి స్వాగతం పలికాడు హిరణ్యకశిపుడు.‘‘దానవేంద్రులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు.మరలా ఏదైనా దండయాత్రకు ప్రయత్నమా?’’ అడిగాడు నారదుడు.‘‘ముల్లోకములు జయించినవాడికా!’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఇక తాను జయించవలసింది ఏమీ లేదనే భావన...ఆ జవాబులో ధ్వనించింది.‘‘మరి దీర్ఘాలోచనకు కారణం?’’ అడిగాడు నారదుడు.‘‘ప్రహ్లాదుడు’’ అన్నాడు హిరణ్యకశిపుడు  విచారంగా.ప్రహ్లాదుడిని చూస్తూ...‘‘బుద్ధిమంతుడు’’ మెచ్చుకోలుగా అన్నాడు నారదుడు.‘‘మంద బుద్ధిమంతుడు’’ అన్నాడు విసుగ్గా  హిరణ్యకశిపుడు.‘‘అదేమి దానవేంద్రా!’’ ఆశ్చర్యపోయాడు నారదుడు.‘‘ఇతనికి ఏదో జాడ్యం ఉన్నది. ఉలకడు. పలకడు. ఆకలి అనడు. దప్పి అనడు. తోటివాళ్లతో ఆడడు, పాడడు. అసలు తాను దానవ సార్వభౌముని పుత్రుడననే అహంకారం, దర్పం కానరాదు...’’ అని బాధగా చెప్పుకుపోతున్నాడు హిరణ్యకశిపుడు.(స్నేహితులు కూడా ప్రహ్లాదుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు....అటువంటి తండ్రికి ఇటువంటి కొడుకా! అని ఈసడించుకుంటున్నారు)‘‘ఒంటరిగా కూర్చొని తనలో తాను పిచ్చివాని వలే నవ్వుచుండును’’ అన్నది లీలావతి తన ముద్దుల కుమారుడిని గురించి.‘‘అవును. లీలావతి జ్ఞాపకమున్నదా? పసితనములో ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా ఉండేదిగానీ...’’ అని నారదుడు అన్నాడో లేదో హిరణ్యకశిపుడు అడ్డుపడ్డాడు.‘‘ఓహో ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమవాతావరణ ప్రభావము. గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాకాదులచే  పోషించిన పుత్రుడు ఇట్లుగాక మరెట్లుండును’’ అన్నాడు హిరణ్యకశిపుడు వ్యంగ్యంగా.‘‘స్వామీ! చిరంజీవి ఇంకను పసివాడు. అతడిని ఉద్ధరించే మార్గం ఆలోచించండి’’ అని అభ్యర్థించింది లీలావతి.‘‘దీనికి ఒక్కటే మార్గం’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఆ తరువాత కొడుకును దగ్గరగా తీసుకొని...‘‘నాయనా! నీవు దానవకులదీపం. భావి సార్వభౌముడవు. సకలశాస్త్ర పారంగతుడవై, నీతికోవిదుడవై ముల్లోకములను పరిపాలించవలెను. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం’’ అన్నాడు.‘‘అలాగే తండ్రి! శ్రద్ధగా చదువుకొనెదను’’ వినయంగా సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు.‘‘సంతోషం’’ అన్నాడు హిరణ్యకశిపుడు.విద్య కోసం ప్రహ్లాదుడిని చండమార్కుల దగ్గరికి పంపారు.చండామార్కుల ఆశ్రమంలో.... ‘‘హరిభక్తి లేని వాడు పశువు కన్నా హీనం కదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.ఆ బాలుని కళ్లలో తెలియని దివ్యత్వం! ‘‘అయితే మల్లోకాధిపతి అయిన నీ తండ్రి, నీకు గురువులమైన మేము, ఈ దానవలోకం అంతా పశువులనా నువ్వు అనునది!’’ ఆందోళనస్వరంతో అడిగారు చండామార్కులు.‘‘హరి హరి గురుదూషణ పాపంకదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘పాపం పాపం అంటూనే గురువులకు పంగనామం పెడుతున్నావు’’ అని వెటకరించారు పెద్ద గురువు.

‘‘లేదు గురువర్యా! నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి’’ తన్మయంగా అన్నాడు ప్రహ్లాదుడు.ఎంత చెప్పినా శిష్యుడుగారు తమ మాటలు వినరని, పైగా తమకే పాఠాలు చెబుతాడనే విషయం చండామార్కులకు ఆ చిరుసమయంలో  క్షుణ్ణంగా అర్థమైంది.ఇక పెద్దగురువు గారిలో వణుకు మొదలైంది.‘‘తమ్ముడూ...నా వొడలంతయూ కంపనముగా యున్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చెదను నాయనా!’’ అన్నారు పెద్ద గురువుగారు.‘అగ్రజా! నా వొడలు నీ కంటే కంపనముగా యున్నవి. నేనూ వచ్చెదను’’ అని అన్నగారి వణుకుతో తన వణుకును జత చేశాడు.గురువులు అలా వెళ్లారో లేదో విద్యార్థులు హుషారుగా ఆటలు మొదలు పెట్టారు.వారి ఆటలను చూసి...‘‘మిత్రులారా! శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థం చేయుట? అన్ని జన్మలలోనూ మానవజన్మ దుర్లభం. ఈ జీవితం నూరు సంవత్సరాలకు పరిమితం. ఈ నూరు సంవత్సరాలలో సగం రాత్రి రూపమున, నిద్ర రూపమున నిరర్థకం అగును. మిగిలిన యాభై ఏండ్లలో ఇరవై ఏండ్లు పోగా చివరికి మిగిలినముప్పది ఏండ్లలో సంసార లంపటమున చిక్కుకొని మానవుడు కామ క్రోధాది అరిషడ్వర్గములచే పీడించబడును. కావున...కాలం వ్యర్థం చేయక హరిభజనలో మోక్షం పొందుట ఉత్తమం, హరినామంకంటే రుచి అయినది లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘లేకేం...నరమాంసం’’ అన్నాడు ఒక విద్యార్థి.మిగిలిన వాళ్లు నవ్వారు.‘‘హరి అంటే ఎవరు?’’ అని ప్రహ్లాదుడిని అడిగాడు ఒకడు. ‘‘నారాయణుడు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘అతనికి రెండు పేర్లా?’’ అడిగాడు ఒకడు.‘‘రెండేమిటి! అతనికి అనంతకోటి నామాలు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘ఎందుకు?’’‘‘ఒకటైతే వాళ్ల అమ్మ మరిచిపోతుందని’’ వెటకారంగా అన్నాడు ఒకడు.‘‘అతని అమ్మ పేరేమిటి?’’‘‘అతనికి అమ్మ లేదు’’‘‘మరి నాన్నో?’’‘నాన్నా లేడు’’‘వాడెవడో విచిత్రమైన వాడునన్నట్లున్నాడే...ఏ ఉరు ఎక్కడ ఉంటాడు?’’ ఆసక్తిగా అడిగాడుఒకడు. ‘‘అతడు సర్వాంతర్యామి. అతను లేని చోటు లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘మరి ఎలా పుట్టాడు?’’‘‘అతనికి పుట్టుకయే లేదు’’‘‘మరి అతడిని చూసుట ఎట్లా?’’‘‘భక్తితోధ్యానించుటయే’’‘‘ఓంనమోనారాయణ....ఓం నమోనారాయణ’’పై సన్నివేశాలు ఏ సినిమాలోనివి?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement