friends
-
దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!
నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
Jahnavi Dasetty: బేబీ బంప్‌తో మహాతల్లి.. కంపెనీ ఇచ్చిన నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
ఫ్రెండ్స్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
స్నేహితులతో ఫ్యాషన్ ఈవెంట్లో నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
‘సాక్షి’ కలిపింది ఈ ఇద్దరినీ...
రామచంద్రాపురం(పటాన్చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
బెస్ట్ కపుల్స్‌గా స్నేహ దంపతులు.. ఫ్రెండ్స్‌తో వెకేషన్ ప్లాన్ (ఫోటోలు)
-
కూతురు పెళ్లికి ముందు జవాను మృతి..దేవుడిలా వచ్చిన స్నేహితులు
లక్నో:తాము అందరికీ ఆదర్శమని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించుకున్నారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడమే కాదు..అవసరమైతే పక్కవాడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకుంటామని చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 48 ఏళ్ల దేవేంద్రసింగ్ నెలరోజుల క్రితమే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఒక్కడే చకచకా చేసుకుంటున్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. గురువారం(డిసెంబర్5) జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనతో సింగ్ ఇంట్లో అంతులేని విషాదం అలుముకుంది. పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. కానీ ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోయింది. సింగ్‌తో పాటు ఆర్మీలో పనిచేసిన జవాన్లు, అధికారులు అతడి మరణం విషయం తెలుసుకున్నారు. వెంటనే మథురకు వచ్చారు. సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్నీ దగ్గరుండి చూసుకుని సింగ్ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. చివరకు దగ్గరుండి కన్యాదానం కూడా చేశారు. సింగ్ స్నేహితుల మానవతా సాయంపై అతడి వియ్యంకుడు నరేంద్రసింగ్ స్పందించారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో సింగ్ స్నేహితులంతా వచ్చి మాకు ధైర్యం చెప్పి పెళ్లి జరిపించారు’అని వారిపై ప్రశంసలు కురిపించారు. -
పార్టీలో ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్ చెల్లెలు (ఫోటోలు)
-
నా స్నేహితుడు మరోసారి ‘మహా’ సీఎం!
సాక్షిప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: నాగపూర్ యూనివర్సిటీ లా కాలేజీలో తన సహచరుడైన దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా మరోమారు ప్రమాణ స్వీకారం చేయనుండడం ఆనందంగా ఉందని ఖమ్మంకు చెందిన వ్యాపారి వేములపల్లి సీతారాంబాబు తెలిపారు. లా కాలేజీ 1990 బ్యాచ్‌లో ఫడ్నవీస్, తాను కలిసి చదువుకున్నామని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఏబీవీపీలో చురుగ్గా పని చేయడమే కాక కాలేజీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా తాను, కార్యదర్శిగా ఫడ్నవీస్ పోటీ చేశామని తెలిపారు. కాలేజీ రోజుల్లో ఐదుగురు స్నేహితులం కలిసి బ్యాచ్‌గా ఉండేవాళ్లమని చెప్పారు. ఆయన తొలిసారి 2015లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్నేహితులను ఇంటికి పిలిచి భోజనం పెట్టారని.. చివరగా 2023లో ఫడ్నవీస్‌ను కలిశానని తెలిపారు. త్వరలో ముంబై వెళ్లి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేస్తామని, వచ్చే ఏడాది శ్రీరామనవమికి ఆయనను భద్రాచలం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని సీతారాంబాబు వెల్లడించారు. -
కలసి తింటే.. కలదు సుఖం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలతో పాటు నగర విందు వైవిధ్యభరితంగా ఉంటుంది. అమెరికన్, మెక్సికన్, ఇటాలియన్ సహా పాశ్చాత్య వంటకాలు, క్లాసిక్ చైనీస్ వంటకాలు ఇక్కడ డిమాండ్‌లో ఉన్నాయి. మరోవైపు సుసంపన్నమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మన నగరం. దీంతో రెస్టారెంట్ల సంఖ్యలో వృద్ధితో పాటే సిటీ జనుల ఆహారపు అలవాట్లలో వేగవంతమైన మార్పును చవిచూస్తోంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఇండియా ఫుడ్ సరీ్వసెస్ రిపోర్ట్ (ఐఎఫ్ఎస్ఆర్) 2024 ప్రకారం, సిటీజనులు నెలకు సగటున ఏడు సార్లు బయటే భోజనం చేస్తారు లేదా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఇది జాతీయ సగటు 8కి అతి దగ్గరగా ఉంది. ఇంకా ఈ ఐఎఫ్ఎస్ఆర్ నివేదిక తెలిపిన అంశాల్లో మరికొన్ని ఇలా.. సరికొత్త వంటకాలు.. రెస్టారెంట్ల అన్వేషణ.. సామాజిక సమూహాలు, కుటుంబాలు, స్నేహితులతో సమావేశాలు సిటీలో డైనింగ్ కల్చర్‌ను ప్రభావితం చేస్తున్న ముఖ్యాంశాలు. హైదరాబాదీలు కూడా విహారయాత్రలతో పాటు సినిమాలను చూడటం దాకా రెస్టారెంట్ల సందర్శనను కూడా జత చేస్తారు. అంతేకాక కొత్త వంటకాలు సరికొత్త రెస్టారెంట్లను అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటారు. అవుట్‌సైడ్ ఫుడ్.. రీజన్స్ ఇవే.. బయటి ఆహారం తినడానికి కుటుంబం, స్నేహితులతో గెట్– టుగెదర్ 28.9 శాతం మందికి ప్రధాన కారణంగా ఉంది. అదే విధంగా థియేటర్లో సినిమా చూడడానికి ముందు, ఆ తర్వాత 19.3 శాతం మంది బయటే తింటున్నారు. అలాగే పండగ లేదా నేషనల్ హాలిడేస్ వచి్చనప్పుడు 19.3 శాతం మంది, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు వంటి ఆనందకరమైన సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవడానికి 19.3 శాతం మంది, కొత్త అవుట్‌లెట్స్, రెస్టారెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడడానికి అని13.3 శాతం మంది బయటి ఫుడ్‌కి ఓటేస్తున్నారు. దేశంలోనే 5వ స్థానంలో... నగరంలో అన్ని సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్నవి కలిపితే 74,000 పైగా ఆహార విక్రయశాలలు ఉన్నాయి. నగరం వ్యవస్థీకృత రంగాన్నే తీసుకుంటే రూ. 10,161 కోట్ల విలువ చేస్తుందని అంచనా. మన భాగ్యనగరానిది దేశంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్. నగరం 40 వేలకుపైగా రెస్టారెంట్లు కలిగి ఉంది. వీటిలో క్లౌడ్ కిచెన్‌లూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవి మొత్తం మార్కెట్లో 40 శాతం వాటా కలిగి ఉండడం క్లౌడ్ కిచెన్ల వృద్ధికి అద్దం పడుతోంది. అనారోగ్యాలకూ ఆహ్వానం.. సిటీలో అవుట్‌సైడ్ ఫుడ్ తినడం అనేది పెరగడం ఆరోగ్యపరమైన సవాళ్లను తెచి్చపెడుతోంది. కొన్నిచోట్ల అపరిశుభ్ర నిల్వ పద్ధతులు, నాసిరకం వంట పద్ధతులు ప్రమాణాలు పాటించని విధానాలు సిటీజనులకు రోగాలను కొని తెచ్చిపెట్టుకున్నట్టుగా చేస్తున్నాయి. అంతేకాకుండా.. కేలరీలు అధికంగా ఉండే రెస్టారెంట్ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, స్థూలకాయం సంబంధిత ఆరోగ్య సమస్యలకు దోహదపడవచ్చు. వీటిని గుర్తించి అవగాహనతో మాత్రమే అవుట్‌సైడ్ డైనింగ్‌ను ఆస్వాదించాల్సి ఉంది. -
శత్రువులు..మిత్రులు
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు. ‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.మనకు మిత్రులెవరు....మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు. – యామిజాల జగదీశ్ -
గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి..
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచచూసింది.ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్‌ను కొత్త కారులో లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశారు. షోరూమ్ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటీ కలిసి స్కెచ్ వేశారు.गर्लफ्रेंड को घूमने के लिए तीन स्टूडेंट ने लूट ली वेन्यू कारमामले में तीन आरोपियों को पुलिस ने किया गिरफ्तारपुलिस ने लूटी हुई गाड़ी को भी कर लिया है बरामद @noidapolice @CP_Noida #Greaternoida pic.twitter.com/4hT8TjjpFt— PRIYA RANA (@priyarana3101) October 11, 2024సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు అడిగారు. వారు హెల్మెట్లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్‌ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి,నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది. -
నెచ్చెలులతో మల్లు బ్యూటీ ‘అహనా కృష్ణ’ ఊయల ఉల్లాసం (ఫొటొలు)
-
స్నేహితులతో వెకేషన్లో ధోని (ఫొటోలు)
-
'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!
ఇద్దరు ప్రయాణికులు ఒక్క ఫ్లైట్ జర్నీ చేయకుండా ఏకంగా 27 దేశాలు చుట్టొచ్చారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కార్బన్ ఉద్గారాలు లేకుండా ప్రయాణించి చూపారు. డబ్బుని కూడా ఆది చేశారు. అస్సలు ఫ్లైట్ జర్నీ చెయ్యకుండా అన్ని దేశాలు చుట్టిరావడం సాధ్యమేనా..?.అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా అన్ని దేశాలు ప్రయాణించగలిగారో చూద్దామా..!ఇటలీకి చెందిన టోమ్మాసో ఫరీనామ్, స్పెయిన్‌కి చెందని అడ్రియన్ లాపుఎంటే అనే ఇద్దరు గత వేసవిలో తమ అడ్వెంచర్‌ని ప్రారంభించారు. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వృక్ష సంపద, జంతువులతో సహవాసం చేసే ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతోనే తాము ఈ సాహసం చేసినట్లు చెప్పారు ఇద్దరు. తమ జర్నీలో ఎక్కడ కార్బన్ ఉద్గారాలకు తావివ్వకూడదనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించారు. తాము సోషల్ మీడియాలో బోట్ హిచ్‌హైకర్స్ అనే రైడ్‌ని సంప్రదించి ప్రయాణించినట్లు తెలిపారు. ఇలాంటి జర్నీ చేసిన అనుభవం లేకపోయినా ధైర్యం చేసి మరీ ఇలా సెయిలింగ్ బోట్లో అట్లాంటిక్ మీదుగా ప్రయాణించినట్లు వివరించారు. ఆ తర్వాత మోనోహాల్ బోట్లో పసిఫిక్ మీదుగా ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ పనామా వరకు వెళ్లొచ్చినట్లు తెలిపారు. ఇలా తాము జర్నీ చేసినట్లు కుటుంబసభ్యులు, బంధువులకు చెబితే ఒక్కసారిగా వారంతా కంగుతిన్నారని చెప్పుకొచ్చారు ఈ ఇద్దరు మిత్రులు. అంతేగాదు గల్ఫ్ ఆఫ్ పనామాలో సముద్రంలోని భయంకరమైన అలలతో చేసిన జర్నీఓ పీడకలని చెప్పారు. అయినప్పటికీ తాము తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ జర్నీ చేయాలని అనుకోలేదని ధైర్యంగా చెప్పారు. ఇలా విమానంలో ప్రయాణించకుండా పర్యావరణానికి సహాయం చేయడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేయడం విశేషం. ఒక్కోక్కరికి ఇలా 27 దేశాలు చుట్టి రావడానికి కేవలం రూ. 6 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యింది. ఈ ఇద్దరు మిత్రులు 'ప్రాజెక్ట్ కునే'లో భాగంగా తమ కథనాన్ని ఆన్లైన్లో పంచుకోవడంతో నెట్టింట ఈ విషంయ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛారిటీ కోసం ఇంగ్లీష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!) -
Best Indian Places: భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలివే..! (ఫోటోలు)
-
విశాఖపట్నం బీచ్‌లో ఫ్రెండ్షిప్ డే సందడి (ఫొటోలు)
-
స్నేహితులున్న జీవితం అద్భుతం.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే (ఫొటోలు)
-
Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
ఎన్నికల ప్రచారం అనగానే ప్రత్యర్థులపై, అవతలి పారీ్టపై విమర్శలు సహజం. చాలాసార్లు పరిస్థితి వ్యక్తిగతంగా తిట్ల దండకాల దాకా వెళ్తుంది. కానీ ప్రత్యర్థులిద్దరూ మంచి స్నేహితులైతే? 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరిగింది. స్నేహితులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. ప్రచారం చేసుకున్నారు. అయినా మంచి స్నేహితులుగానే మిగిలారు. వాళ్లే ప్రముఖ కాంగ్రెస్ నేత విష్ణు గాడ్గిల్, పిజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ లీడర్ కేశవరావ్ జేఢే. సోషలిస్ట్ వెటరన్ బాబా అధవ్ ఆ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికాయనకు 22 ఏళ్లు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘గాడ్గిల్పై తిలక్ ప్రభావం ఎక్కువ. కాంగ్రెస్‌లో బ్రాహ్మణ శ్రేణి ప్రముఖునిగా ఉండేవారు. మరాఠ్వాడాకు చెందిన జేఢే బహుజన ఉద్యమ భాగస్వామి. జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్తో కలిసి పనిచేశారు. బ్రాహ్మణవాదానికి అతి పెద్ద విమర్శకుడు. 1920ల్లో వారిద్దరూ ప్రత్యర్థులు. స్వాతంత్య్రోద్యమంలో జైలుపాలయ్యాక మంచి స్నేహితులయ్యారు. దళితుల కోసం పార్వతి ఆలయాన్ని తెరవడానికి 1929లో అంబేడ్కర్ నడిపిన ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1934లో రెండు కేంద్ర అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. గాడ్గిల్ మద్దతుతో జేఢే 1938లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1947లో కాంగ్రెస్‌ను వీడి పీడబ్ల్యూపీని స్థాపించారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో పుణే సెంట్రల్ నుంచి గాడ్గిల్పైనే పోటీ చేయాల్సి వచి్చంది. ప్రత్యర్థులుగా మారినా ప్రచారంలో పరస్పర దూషణల వంటివి అస్సలుండేవి కాదు. ప్రసంగాలూ స్నేహపూర్వకంగానే సాగేవి. ఒక్కోసారి అభ్యర్థులంతా ఒకే వేదిక నుంచి ప్రచారం చేసేవారు. మొదట జేఢే, తరువాత గాడ్గిల్, చివరికి సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఎస్.ఎమ్.జోషి మాట్లాడేవారు. ఒకరినొకరు నిందించుకోలేదు. పారీ్టలను తిట్టుకోలేదు. కులపరంగా ఓట్లడగలేదు. కేవలం హామీలపైనే దృషి సారించి ప్రచారం చేశారు. గాడ్గిల్‌కు 102,692 ఓట్లు, జేఢేకు 42,200 ఓట్లొచ్చాయి’’ అని అధవ్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నెలకు రూ. 60 లక్షలు సంపాదిస్తున్న ‘పోహె వాలా’
నిజాయతీగా కష్టపడే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ‘పోహెవాలా’ ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, మహారాష్ట్రకు చెందిన చాహుల్ బల్పాండే, పవన్ వాడిభాస్మే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. చాహుల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక, పవన్ ఎంబీఏ డిగ్రీ అందుకున్నాక ఒక కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. సదరు కంపెనీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రతి నెలా డబ్బుకు ఇబ్బంది ఎదురయ్యేది. దీంతో వారిద్దరూ పగటిపూట అదే ఆఫీసులో పనిచేస్తూ, రాత్రి పూట నాగపూర్‌లో పోహె విక్రయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వీరు తయారు చేసే పోహెకు ఆహార ప్రియుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరూ 2018లో తమ ఉద్యోగాలను వదిలేసి, పూర్తిస్థాయిలో పోహె విక్రయాలు ప్రారంభించారు. వీరు తమ బ్రాండ్‌కు ‘పోహె వాలా’ అనే పేరు పెట్టారు. అనంతరం అనేక రకాల పోహెలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ఆరు సంవత్సరాలలో, వారు దేశంలోని 15 నగరాల్లో తమ అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రస్తుతం పవన్, చాహుల్ ప్రతి నెలా రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తున్నారు. చాహుల్, పవన్‌లు ఫుడ్ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు తొలుత రాత్ర వేళ చిన్నగా పోహె విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంతో పాటు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారనేది గ్రహించారు. 2018 మేలో వీరు నాగ్‌పూర్‌లో తమ పోహె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోహె విక్రయించేవారు. ఇది వారికి మార్కెట్‌పై లోతైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాపారం సాగిస్తున్న వీరు మొత్తం 13 రకాల పోహెలను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ పోహె అమ్మకాలు ప్రారంభించినది కూడా వీరే కావడం విశేషం. నేడు పోహెవాలా బ్రాండ్ పనీర్ పోహె, ఇండోరి పోహె, నాగ్‌పూర్ స్పెషల్ తారీ పోహె, చివ్దా పోహె, మిశ్రా పోహె చాలా ప్రసిద్ధి చెందాయి. ఒక ఇంటర్వ్యూలో చాహుల్ బాల్పాండే మాట్లాడుతూ నిజానికి ఏ వ్యాపారానికీ హెచ్చు తగ్గులుండవని, వ్యాపారం విజయవంతం కావడానికి వినూత్న ఫార్ములా, నాణ్యత, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సరైన వ్యూహాన్ని రూపొందించడం ముఖ్యమన్నారు. వీరు ‘పోహెవాలా’కు సొంత వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. దీని సాయంతో ఆన్‌లైన్‌లోనూ పోహె విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
Galentines Day: ఇది ఎవరు, ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
గాలెంటైన్స్ డే 2024. వాలెంటైన్స్ డే గురించి అందరికీ తెలుసు. లవ్‌బర్డ్స్ వారం రోజుల పాటు సంబరాలు చేసుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ రోజులు గడిచిపోయాక ఎనిమిదో రోజు ఫిబ్రవరి 14న వాలెండైన్స్ డేగా జరుపుకుంటారు. మరి గాలెంటైన్స్ డే గురించి తెలుసా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న, "లేడీస్ సెలబ్రేటింగ్ లేడీస్" కోసం గాలెంటైన్స్ డేని జరుపుకుంటారు. స్నేహితురాళ్లు ప్రేమపూర్వ బహుమతులను ఇచ్చిచ్చుకుంటారు ఇది మీ స్నేహితురాళ్ళతో ప్రేమతో పాటు కొన్ని బహుమతుతలో హ్యాపీగా గడిపే రోజు. మహిళా స్నేహితుల స్నేహాన్ని, ప్రేమను హైలైట్ చేయడానికి ఇలా ఒక నిర్దిష్ట రోజును కేటాయించారు. గాలెంటైన్స్ డేని లెస్లీ నోప్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. గాలెంటైన్స్ డే అనేది అమెరికన్ సిట్కామ్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ రెండో సీజన్ 16వ ఎపిసోడ్లో ఆ రోజు గురించి ప్రస్తావన ఉంది. ఈ ఎపిసోడ్లో, లెస్లీ నోప్ (అమీ పోహ్లర్) వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు తన మహిళా స్నేహితుల కోసం తన వార్షిక గాలెంటైన్స్ డే పార్టీని ఏర్పాటు చేసింది. ఇది మహిళల సెలబ్రేషన్ రోజు. ఈ రోజును ఎలా గడుపుతారు అనేది మీరు మీ స్నేహితుల ఇష్టం! ఇది మీ రోజు అని నోప్ ప్రకటించారు. అప్పటినుంచి గాలెంటైన్స్ డే ప్రాచుర్యంలో వచ్చింది. ( Valentines day: లవ్‌బర్డ్స్‌తో, ప్రేమికుల పోలిక: ఈ ఇంట్రస్టింగ్ సంగతులు తెలుసా?) కరీనా నటాషా గాలెంటైన్స్ డే బాలీవుడ్ నటి కరీనాకపూర్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనావాలా మంచి బెస్టీలు, గత ఏడాది వీరిద్ద విలాసవంతమైన వింటర్ ఫ్యాషన్‌లో దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఏడాది గ్యాలెంటైన్స్ డే సందర్భంగా నటాషా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమేజింగ్ ఫోటోలను షేర్ చేసింది, National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా? View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్యచేసిన స్నేహితులు
న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో స్నేహితులే అతన్ని కుట్ర పన్ని అంతమొందించారు. పెళ్లికి తీసుకెళ్లి... తిరిగిరాని లోకాలకు పంపించారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్పాల్ సింగ్‌కు 24 ఏళ్ల కుమారుడు లక్ష్య చౌహాన్ ఉన్నాడు.ఇతడు తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహిలు వికాస్ భరద్వాజ్, అభిషేక్‌లతో కలిసి హర్యానాలోని సోనేపట్‌లో జరిగిన వివాహ వేడుకకు ముగ్గురు హారయ్యారు.. ఆ తర్వాత లక్ష్య చౌహాన్ తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన తండ్రి ఎసీపీ అధికారి యశ్పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్యతో కలిసి కారులో వెళ్లిన స్నేహితుడు అభిషేక్నును అదుపులోకి తీసుకొచిన విచారించగా అసలు విషయం చెప్పాడు. వికాస్ భరద్వాజ్, లక్షయ్, తాను ముగ్గురం కలిసి కారులో సోనెపట్‌కు వెళ్లామని, వివాహం అనంతరం అదేరోజు రాత్రి ఇంటికి బయలుదేరామని చెప్పాడు. చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కూలీలతో వెళ్తున్న ఆటో.. ముగ్గురు దుర్మరణం మార్గంమధ్యలో పానిపట్ దగ్గర మునక్ కాలువ వద్ద మూత్రవిసర్జన కోసం కారు ఆగినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్, తాను కలిసి చౌహాన్‌ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం అదే కారులో వికాస్ తనని ఢిల్లీ సమీపంలోని నెరెలా వద్ద విడిచిపెట్టాడని తెలిపాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకున్నారు. నిందితుడు వికాస్ భరద్వాస్ కూడా తీస్ హజారీ కోర్టులోనే క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. వికాస్ గతంలో లక్షయ్కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే లక్షయ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న వికాస్ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మరో స్నేహితుడు అభిషేక్‌ను ఇందుకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద సెక్షన్లు నమోదు చేశారు. -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్‌ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
Niharika Konidela: సీక్రెట్ సాంటాగా మెగా డాటర్.. ఫ్రెండ్స్‌తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anupama Parameswaran : ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కు చెక్కేసిన కేరళ కుట్టి (ఫోటోలు)
-
మద్యం మత్తు.. సిమ్మింగ్ పూల్‌లో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం(అనకాపల్లి): మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తోటి స్నేహితుని మరణానికి కారణమయ్యాడు మరో స్నేహితుడు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండకర్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌లో పడి విజయనగరానికి చెందిన సాయివర్మ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్నేహితులు కొండకర్లలో ప్రైవేట్ రిసార్టులో శనివారం సందడి చేశారు. స్నేహితుల్లో కొందరు మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్ వద్ద నృత్యాలు చేశారు. ఆ సమయంలో సాయివర్మను మరో స్నేహితుడు సిమ్మింగ్ పూల్‌లోకి తోసేశాడు. నీటిలో పడిపోయిన సాయివర్మకు ఈత రాకపోవడమో లేక మద్యం మత్తు కారణమో గానీ కొంత సేపటికి స్విమ్మింగ్ పూల్‌లో తేలిపోయాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సాయివర్మను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో మునిగి చనిపోయాడని భావించినప్పటికీ సీసీ ఫుటేజ్ దృశ్యాలను చూసిన తర్వాత పోలీసులు ఘటనకు కారణాన్ని గుర్తించారు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ స్నేహితుడే సాయివర్మను నీటిలోకి తోసేసినట్టు గుర్తించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటన కాదని భావించిన పోలీసులు సాయంత్రం తర్వాత కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడి రిసార్ట్‌లో గతంలోనూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకొన్న తర్వాత ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి సీసీ ఫుటేజ్‌లు లేకపోవడంతో కేసు తీవ్రత గుర్తించలేకపోయారు. తాజా ఘటనతో కొండకర్ల పరిసరాల్లో జరిగే పార్టీలపై నిఘా పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ యుగేంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లికి చెందిన వారణాసి తరుణ్(24) తన స్నేహితుడు డీకొండ నితిన్‌తో కలిసి ఆదివారం బీబీనగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. స్నేహితుడిని కలిసిన తర్వాత తరుణ్, నితిన్ కలిసి బీబీనగర్ మండలంలోని వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. తరుణ్, నితిన్ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. తరుణ్ చెరువులోరాళ్ల మధ్యన ఇరుక్కపోయాడు. నితిన్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తరుణ్ కోసం గాలింపు చర్యలు ఆచూకీ లభించలేదు. సోమవారం చెరువులో తరుణ్ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరుణ్ ముఖంపై గాయాలు ఉండడంతో నితిన్‌పై అనుమానం ఉన్నట్లు మృతుడి తండ్రి గోవిందాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!
పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. View this post on Instagram A post shared by Betty Who (@bettywho) వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్‌ని ప్లే చేశారు. ఆ ట్యూన్‌కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్లను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్‌కు ఫిదా అయినట్లు స్పందించారు. ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్‌సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్‌ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్‌ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్‌ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్‌లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్‌ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్‌లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్‌లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్‌కు కూడా అందుతుంది. -
స్నేహితుడిని కలిసేందుకు వెళ్తూ..
సంగారెడ్డి: బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన చేగుంట శివారులోని మక్కరాజీపేట బైపాస్ బ్రిడ్జి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామయంపేట మండలం జాన్సిలింగాపూర్‌కు చెందిన టాకూర్ బాలాజీసింగ్(32), కోళ్ల రవితేజ(20) బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్నారు. చిన్నశివునూర్ శివారు నుంచి వస్తున్న కంటైనర్, బైక్ మక్కరాజీపేట బైపాస్బ్రిడ్జి సమీపంలో 44వ నంబర్ రహదారిపై ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలాజీసింగ్, రవితేజలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలాజీసింగ్ కూలీ పనులు చేసుకునేవా డు కాగా, రవితేజ ఉపాఽధి హామీ పనులతోపాటు ఇతరేతర పనులు చేసుకునేవాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందారు. వీరి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్'
నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది. నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఎరా , మీ స్కూల్లో ఇదొక్కేటేనా బెంచి కూర్చోవడానికి" "కాదు తాతగారు, ఆ బెంచ్ 'స్నేహితుల బెంచి' అన్నాడు నా మనవడు నాతో. నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? " నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి, వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు. నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన ఎవరిదో కానీ అనుకుని , మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?" "కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు. "నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు" అన్నాడు . ఓ నిముషం ఆగి "ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్లు మూడో నాలుగో తరగతి పిల్లలైనా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తే బావుంటుంది తాతయ్య, వాళ్లెప్పుడు కనిపించినా అన్నయ్యా అంటూ నా దగ్గరకు పరుగెత్తుకువచ్చి పలకరిస్తారు" తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. నేను చేరిన కొత్తలో మా టీచర్ పిల్లందరిని క్లాస్ ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు. ఎంతో బెంగగా అనిపించింది స్నేహితులు లేకపోవడం అప్పుడు. ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది. నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరు లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో. --సుబ్రమణ్యం వల్లూరి (చదవండి: డెత్ మిస్టరీ.. ఆరోజు ఏం జరిగింది? ఇప్పటికీ సమాధానం లేకుండానే..) -
30 ఏళ్ల క్రితం ఇండియా ఇలానే ఉండేది..ఇప్పుడు కావలసింది అవే..
పేపర్ తెరిస్తే ఘోరమైన వార్తలు. రక్త సంబంధాల మధ్య కూడా కక్షలు, కార్పణ్యాలు. మానవ సంబంధాలపై విశ్వాసం పోయేలా సంఘటనలు.ఇటువంటి సమయంలో ఒక ట్విటర్ పోస్ట్ చాలామందికి హాయినిచ్చింది. ‘గాయత్రీ... ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తన పొరుగింటివారు వాట్సప్ మెసేజ్ పెట్టినసంగతిని మైసూర్‌కు చెందిన ఒక మహిళ షేర్ చేస్తూ తమ కాలనీలో అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చెప్పింది. ‘ముప్పై ఏళ్ల క్రితం ఇండియా ఇలాగే ఉండేది’ అని అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఏం... ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు? నిజమే. పక్కింటి పాప తలుపు తట్టి ‘బీరకాయ కూర చేసింది అమ్మ. ఇచ్చి రమ్మంది’ అని చెప్తే చాలా బాగుంటుంది. ‘గడి ముందుకేసి కూరగాయలకు వెళుతున్నా. కాస్త చూస్తుండక్కా’ అని ఎదురింటి వాళ్లతో అంటే ‘అదేం భాగ్యం. వెళ్లిరా’ అని సొంతింటి కన్నా ఈ ఇంటి పైనే దృష్టి పెట్టే వాళ్లు దొరికితే మరెంతో బాగుంటుంది. ఇలా ఉండటానికే మనుషులు ఇష్టపడేవాళ్లు. కాని ఇప్పుడు ఇలా ఉండటం ‘భాగ్యం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. మైసూర్లో ఒక కాలనీ ‘గాయత్రి. ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘మా కాలనీలో అంతా ఇలాంటి స్నేహమే’ అని గాయత్రి జయరామన్ అనే మైసూర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. 20 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్న గాయత్రి ‘హూ మి, పూర్’ అనే పుస్తకం రాసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గాయత్రి పక్కింటావిడ ఇడ్లీలకు పిలవడంతో సంతోషపడి తన కాలనీ స్నేహాలన్నీ ట్వీట్లుగా రాసింది. ‘యోగా సెంటర్‌కు రాపిడో బుక్ చేద్దామని ఇంటి బయట నిలబడతానా... ఎవరో ఒకరు దింపడానికి వస్తారు. నా కుక్కపిల్ల నేను బయటికెళ్తే గోల చేస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాననే భావన కలిగించడానికి తలుపు తెరిచి పెట్టి పనుల కోసం బయటకు వెళితే మా కాలనీలో అందరూ కాపలా కాసేవాళ్లే. ఒక రోజు ఒకావిడ బిసిబేలాబాత్ పంపుతారు. నిన్న ఒకామె సాంబార్ పంపింది. మా కాలనీలో ఒకరి గిన్నెలు మరొకరి వంట గదిలో ఉండటం మామూలే. ఇలాంటి స్నేహాలతో మేమంతా ఉండటం సంతోషంగా ఉంది’ అని రాసింది. దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ‘మేము గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు అందరం ఇలాగే ఉండేవాళ్లం’ అని ఒకరు రాస్తే ‘మైసూర్లో అందరూ ఇలా ఉండొచ్చు. బెంగళూరులో ఈ వాతావరణం మిస్ అవుతున్నాను’ అని మరొకరు రాశారు.‘ముప్పై ఏళ్ల క్రితం అందరూ ఇలా ఉన్నవాళ్లే. ఇప్పుడెక్కడ’ అని మరొకరు బాధ పడ్డారు. ‘లాక్డౌన్ సమయంలో కొంతకాలం మాత్రం ఇలా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరి గుహల్లోకి వాళ్లు వెళ్లిపోయారు’ అని మరొకరు రాశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండటం, ‘ఏం బాబాయ్’ అంటే ‘ఏం అల్లుడూ’ అని పలకరించుకోవడం.. ‘ఆంటీ ఇంటి నుంచి టీ పౌడర్ తీసుకురాపో’ అని పంపించడం కూడా అసాధ్యమైన విషయాలుగా మారిపోతే ఏ ఊతంతో ఏ స్పందనలతో జీవించాలి మనం? శ్రుతి మించి ప్రైవసీ పల్లెల్లో అయినా పట్నాల్లో అయినా ప్రతి ఒక్కరూ శ్రుతి మించిన ప్రైవసీలోకి జారుకుంటున్నారు. మొదట ఉమ్మడి కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని వద్దనుకుంటున్నారు. కేవలం ఎప్పుడూ ఇళ్లకు కూడా రాని కొందరు స్నేహితులు, పరిచయస్తులు చాలనుకునే స్థితికి చేరుకున్నారు. ‘మన బతుకులో ఎవరి జోక్యం అక్కర్లేదు’ అనే భావనలో ఉన్న సౌకర్యం ఎలా ఉన్నా ‘ఎవరి సాయం, తోడు లేకుండా బతుకు ఎలా ఉంటుంది’ అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రైవసీ పిచ్చి ఒంటరితనంలోకి, ఏకాంతంలోకి, మనకు ఎవరూ లేరని భావనలోకి నెట్టి అభద్రతకు, ఆందోళనకు గురి చేస్తుంది. ‘ఎదుటివారి లోపాలు వెతకడం, జడ్జ్ చేయడం, మనకు హితవు చెప్పిన వారిని కూడా పగవారిని చేసుకోవడం, అనుబంధాలు ఆర్థికపరమైన సాయాలు కోరతాయనే మిషతో అందరినీ దూరం పెట్టడం’ ఇవి నేడు ప్రతి మనిషిని కేవలం కుటుంబ జీవితానికి, కుటుంబ అనుబంధాలకి (అవి కూడా సరిగ్గా ఉంటే) పరిమితం చేస్తున్నాయి. పక్కింటామె ‘ఇడ్లీ తిందూరా’ అని పిలవడమే వార్తగా మారి, అది చదివి ఆనంద బాష్పాలు వచ్చే స్థితికి మనం చేరుకుంటే ఆ తప్పు ఇడ్లీదో చట్నీదో కాదు. మనదే. ప్రేమ, అభిమానాలే ఇంధనాలు ఒక దూరప్రయాణం పరిచయస్తులు ఎవరూ లేని రైలులో చేస్తుంటే ఎలా ఉంటుందో, జీవన ప్రయాణం ప్రేమ, అభిమానాలు పంచేవాళ్లు లేకుంటే అలా ఉంటుంది. నలుగురు స్నేహితులతో సాగే పిక్నిక్ యాత్రలా జీవితం ఎందుకు ఉండకూడదు? కనీసం అప్పుడప్పుడన్నా వీధి అరుగుపై ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకునే కమ్మదనంతో జీవితం ఎందుకు ఉండకూడదు? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహం చేయడం మానేస్తున్నారు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఆలోచించారా? (చదవండి: అర్చన... అనుకున్నది సాధించింది) -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్‌లో చాలా తక్కువమంది మాత్రమే టచ్‌లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్‌ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్‌గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
వెబ్ సిరీస్ చూసి ముగ్గురు మిత్రుల దోపిడీ యత్నం
కోరికలనేవి అందరికీ ఉంటాయి. అయితే అవి తీరనివిగా మారినప్పుడు కొందరు పెడదారి పడుతుంటారు. కోరికలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతుంటారు. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్నోకు చెందిన ముగ్గురు స్నేహితులకు బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు రూ. 25 వేలు అవసరం అయ్యాయి. వారు చూసిన ఒక వెబ్ సిరీస్‌లోని కథనాన్ని అధారంగా చేసుకుని దోపిడీకి పథకం వేసుకున్నారు. తరువాత వీరు ముఖానికి ముసుగులు ధరించి స్థానికంగా ఉన్న ఒక జ్యూయలరీ దుకాణానికి వెళ్లారు. తరువాత వారు ఒక తుపాకీ తీసి, దుకాణం యజమానిని బెదించారు. అయితే వారి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణం యజమాని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీని ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిందితులలో ఇద్దరు ఖదరా, ఒకరు మండియావ్ ప్రాంతానికి చెందినవారన్నారు. వీరిలో ఇద్దరు మాస్క్ ధరించారని, ఒకరు రుమాలు ముఖానికి చుట్టుకున్నాడన్నారు. మే 30 వీరు స్థానికంగా ఉన్న మహేశ్వరి జ్యూయలర్స్‌లో దోపిడీకి ప్రయత్నించారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని పట్టుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించామని, వారి దగ్గర నుంచి నంబరు ప్లేటులేని స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
గుంతకల్లు రూరల్: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికై నా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. వివరాలు... గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వీరన్న (26), అదే గ్రామానికి చెందిన రాము, మహాలక్ష్మి దంపతుల కుమారుడు రవీంద్ర (25) ఇటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరన్నకు కృపాకుమారితో వివాహం కాగా, 6, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు బిడ్డలున్నారు. ఆరు నెలల క్రితం లక్ష్మి అనే యువతితో రవీంద్రకు వివాహమైంది. వీరన్న, రవీంద్ర ఒకే గ్రామానికి చెందిన వారే అయినా.. ఆటోడ్రైవింగ్ ద్వారానే ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. కొంత కాలం క్రితం ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల అనంతరం గుండె సంబంధిత వ్యాధితో వీరన్న, షుగర్, బీపీతో రవీంద్ర బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. పది రోజుల క్రితం ఆయాసం ఎక్కువ కావడంతో వీరన్నను కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. రవీంద్ర ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు రవీంద్ర, 5.30 గంటలకు వీరన్న మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లీ అండ్ నవీన్...!
-
టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు
భారతదేశంలో టీ లేదా చాయ్‌కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అంతేకాదు చాయ్ అమ్మి సక్సెస్ అయిన స్టోరీలు కూడా చాలా ఉన్నాయి. అయితే అనుభవ్ దూబే, ఆనంద్ విజయగాథ మాత్రం కాస్త డిఫరెంట్. ముఖ్యంగా 23 ఏళ్ల అనుభవ్ దూబే సీఏ పరీక్షలో ఫెయిలయ్యాడు. వ్యాపారవేత్త కావాలనుకుని ఏఐఎస్ డ్రీమ్స్‌ను వదిలేసుకున్నాడు. టీ వ్యాపారిగా 150కోట్లు సంపాదిస్తున్నాడు. మధ్యప్రదేశ్, రేవాకు చెందిన అనుభవ్ దూబే ఆనంద్ నాయక్ చిన్ననాటి స్నేహితులు. అనుభవ్ తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికీ తన కొడుకును వ్యాపారిగా కాకుండా ఏఐఎస్ ఆఫీసర్ అధికారి కావాలని కోరుకున్నాడు. అప్పటికే సీఏ పరీక్షలో ఫెయిలైన కొడుకు అనుభవ్ దూబేని యూపీఎస్సీకి ప్రిపేర్ కావడాని ఢిల్లీకి పంపించాడు. తండ్రి కోరిక మేరకు అనుభవ్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పటికీ ఎందుకో ఉద్యోగంలో తన లైఫ్ సెటిల్ కాదని వ్యాపారమే కరెక్ట్ అని డిసైడయ్యాడు. ఫలితం కోట్ల విలువ చేసే కంపెనీ చాయ్ సుత్తా బార్‌కు కో ఫౌండర్‌గా మారిపోయాడు. కేవలం అయిదేళ్లలో 3 లక్షల నుండి 150 కోట్లకు ఎదిగాడు. 2016లో స్నేహితుడు ఆనంద్ నాయక్‌తో తన ప్లాన్‌గురించి చర్చించాడు. ఆలోచన బానే ఉందిగానీ ఇద్దరి దగ్గరా సరిపడా నిధులు లేవు. కానీ వ్యాపారవేత్త కావాలనుకున్న వాటి పట్టుదల ముందు అదిపెద్ద సమస్యగా తోచలేదు. ఎలాగోలా రూ. 3 లక్షలు సమకూర్చుకుని , తమ తొలి టీ అవుట్‌లెట్‌ను అమ్మాయిల హాస్టల్‌కు ఎదురుగా షురూ చేశాడు. తరువాతి కాలంలో వీరిద్దరితో రాహుల్ కూడా జత కలిశాడు. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అసలే లో-బడ్జెట్. ఇక మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైన్, బ్రాండింగ్ వంటి వాటి డబ్బులు ఎలా వస్తాయని అనుభవ్,ఆనంద్ మదనపడ్డారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలే. తోటి స్నేహితుల దగ్గర అప్పు చేసి, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్‌తో ఇండోర్‌లోని హాస్టల్‌కు ఆనుకుని తొలి అవుట్ లెట్‌ని డిజైన్ చేసుకున్నారు.అంతేకాదు ఆఖరికి బ్యానర్‌ను ప్రింట్ చేయడానికి డబ్బు లేకపోవడంతో, ఒక చెక్క ముక్కను తీసుకుని, చేతితో "చాయ్ సుత్తా బార్" అని రాశారు. ఈ టీ స్టాల్ పేరు, ఆలోచన, ఆశయం యువతను బాగా ఆకట్టుకున్నాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అనుభవ్ ,ఆనంద్ దేశంలోని 195 నగరాల్లో చాయ్ సుత్తా బార్ 450కిపైగా అవుట్లెట్లను ప్రారంభించారు. దుబాయ్, యుకె, కెనడా , ఒమన్ వంటి దేశాలతో సహా విదేశాలకు కూడా ఛాయ్ సుత్తా బార్ తన సత్తా చాటుకుంటోంది. చాయ్ సుత్తా బార్ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.150 కోట్లు. అనుభవ్ దూబే నికర విలువ దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా. మట్టి కప్పులు, 250 కుటుంబాలకు ఉపాధి చాయ్ సుత్తాబార్‌లో మట్టి కప్పులు, కుల్హాద్‌లు ప్రధాన ఆకర్షణ. దీనికి 250 కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించారు. మట్టి పాత్రనే వాడుతూ తద్వారా వృత్తి నిపుణులైన కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇద్దరితో మొదలై చాయ్‌సుత్తా బార్లో ఇపుడు ఎంబీఏ చదివినవారు, ఇతర ఇంజనీర్లతో సహా ఈరోజు 150 మందికి పైగా పని చేస్తున్నారంటే వీరి వ్యాపార దక్షతను అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడి సిబ్బంది దాదాపు అందరూ వికలాంగులు లేదా ఆర్థికంగా పేద నేపథ్యం నుండి వచ్చినవారు కావడం విశేషం. 7 రకాల టీ, పలు రకాల కాఫీలు, ఫాస్ట్ ఫుడ్లను విక్రయిస్తారు. ఇక్కడ టీ 10 రూపాయలకే టీ లభిస్తుంది. అనుభవ్ కష్టాలు, జీవిత పాఠం 2016: స్థానిక గూండాల దాడి 2017: నార్కోటిక్స్ దాడి 2020: కోవిడ్ హిట్; అవుట్లెట్లు మూసివేత 2020: వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన వ్యక్తి 2021: టైప్ 1 డయాబెటిస్ నిర్ధారణ 19 ఏళ్ళపుడు సీఏ వదిలి సివిల్ సర్వీసెస్‌కి 21 ఏళ్ళ వయసులో యూపీఎస్సీకి గుడ్‌బై 20వ దశకం ప్రారంభంలో ఏం చేయాలో తెలియని అయోమయం కట్ చేస్తే.. 3 లక్షల నుండి 150 కోట్లకు రాకింగ్ స్టార్‌గా అనుభవ్ దుబే ‘‘మీ ప్రయత్నాన్ని వదలవద్దు.. విజయం మీ కోసం వేచి ఉంది! ఆపొద్దు ప్రయత్నిస్తూ ఉండు!’’ అంటారు అనుభవ్ దూబే What's the craziest business idea you've ever had? pic.twitter.com/bfKdifIa5i — Anubhav Dubey (@tbhAnubhav) May 15, 2023 -
స్నేహితురాలిని అలా చూస్తూ..! ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్‌లా
తిరుపతి రూరల్: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది. ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది. స్నేహితురాలిని ఫ్రీజర్ బాక్స్‌లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు. -
ప్రీతి ఆత్మహత్యయత్నంపై ప్రీతి ఫ్రెండ్స్ రియాక్షన్
-
స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసిన అలీ దంపతులు.. ఫోటోలు
-
టీచర్ మిస్సింగ్ కేసు..అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు
ఆఫ్రికాలో గతేడాది తప్పిపోయిన ఓ సంగీతం టీచర్ దారుణమైన హత్యకు గురయ్యాడు. తన రూమ్మేట్సే అతన్ని కడతేర్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాంగోలోని బ్రజ్జావిల్లేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గతేడాది అక్టోబర్ 26న ఆస్ట్రేలియన్ సంగీత ఉపాధ్యాయుడు మార్క్ సియవరెల్ల ఆఫ్రికాలోని కాంగోలో కనిపించకుండాపోయాడు. అప్పటిన నుంచి అంతు చిక్కని మిస్సింగ్ కేసుగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కేసు చిక్కుముడి వీడింది. కానీ అతడ్ని అంతమొందించిన విధానం విని పోలీసులను ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..న్యూసౌత్ వేల్స్‌లోని లీటన్కు చెందిన 57 ఏళ్ల మార్క్ సియవరెల్లా ఆరేళ్ల క్రితం ఆప్రికా దేశానికి వెళ్లాడు. అక్కడ అతను మొదటగా అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ తోపాటు సంగీతాన్ని భోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ కాన్సులర్ స్కూల్‌కు మారారు. అతను కాంగోలోని బ్రజ్జావిలేలోని అపార్ట్మెంట్లోన తన స్నేహితుడి కలిసి ఉంటున్నాడు. ఇంతలో అతని పాత సహచరుడు, రూమ్మేట్ క్లెమెంట్ బెబెకా అనే వ్యక్తి మార్క్ వద్దకు వచ్చాడు. కాసేపు అక్కడే అపార్ట్మెంట్లో ముగ్గురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో మార్క్ వాష్‌రూమ్‌కి వెళ్లగానే ఆ ఆపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యక్తి మార్క్ ఇంకొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు అతని రూమ్మేట్తో చెప్పాడు. అంతేగాదు అతను ఇక్కడ నుంచి వెళ్లిపోతే మనకేం ప్రయోజనం ఉండదు అని మార్క్ రూమ్మేట్తో అన్నాడు. దీంతో బెబెకా అయితే ఏం చేద్దాం మరీ అని అతడిని అడిగాడు. అందుకని అతన్ని కడతేర్చి అతని వద్ద నుంచి ఎంత కొంత సొమ్ము దుండుకుందా అని సలహ ఇచ్చాడు. ఇంతలో మార్క్ తాగి వదిలేసిన మందు గ్లాస్లో పాయిజన్ వేసి అక్కడ టేబుల్ మీద ఉంచాడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి. ఇంతలో వాష్‌రూమ్ నుంచి వచ్చిన మార్క్ వారితో మాట్లాడుతూ.. ఆ గ్లాస్‌లోని పాయిజన్‌ని తాగేశాడు. కాసేపటికే స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో తామిద్దం మార్క్‌ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి మొసళ్లు అధికంగా ఉండే కాంగో నదిలో పడేశామని బెబెకా చెప్పాడు. ఐతే మార్క్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేవని అతని వద్ద ఉన్న బ్యాంకు కార్డుల సాయంతో డబ్బులు కొట్టేశామని పోలీసలుకు వివరించాడు. కనీసం కుటుంబసభ్యులకు చివరి చూపుకూడా దక్కనీయకుండా అత్యంత ఘోరంగా హతం చేసిన విధానం పోలీసులను షాక్ గురి చేసింది. ఈ విషయాన్ని మార్క్ కుటుంబసభ్యులు విని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. (చదవండి: కాలిఫోర్నియా కాల్పుల ఘటన: పట్టుబడతానన్న భయంతో నిందితుడు..) -
అయ్యో.. ఎంత ఘోరం, స్నేహితులే చంపేశారు!
యశవంతపుర: డబ్బుల విషయమై యువకున్ని అతని స్నేహితులే హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో జరిగింది. ఓంకార, విజయ్, సునీల్, ధనరాజ్లు మంచి స్నేహితులు. ఫైనాన్స్ వ్యవహారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న ఓంకార (30)ను మిగతా ముగ్గురు ఎపిఎంసీ యార్డుకు పిలుపించుకున్నారు. డబ్బు గురించి చర్చిస్తూ గొడవకు దిగారు. ఓంకారను సునీల్, ధనరాజ్, విజయ్‌లు తలపై బండరాయితో బాది హత్య చేశారు. ముగ్గురు నిందితులను తరీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు. -
పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్చుకున్నాను: మెగాస్టార్ చిరంజీవి
-
పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు
సాధారణంగా పెళ్లి మండపానికి వరుడు ఎలా వస్తాడు...? మనదేశంలో ఉత్తరాదిన అయితే గుర్రం మీద వస్తాడు. దక్షిణాదిన అయితే ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. కొన్నిచోట్ల బావమరుదులు మండపానికి ఎత్తుకొని వస్తారు. ఎబ్బే... ఇంత ట్రెడిషనల్‌గా బాగలేదు అనుకున్నాడేమో ఈ వరుడు. అందరికంటే భిన్నంగా ట్రై చేశాడు. మండపానికి ఏకంగా శవపేటికలో వచ్చాడు. అతని స్నేహితులు ఆరుగురు ఆ శవపేటికను మండపానికి మోసుకొచ్చారు. పెళ్లి మండపం వద్దకు రాగానే శవపేటికను మోసుకువెళ్లి ఒక చోట ఉంచారు. అది ఓపెన్ చేయగానే పెళ్లి కొడుకు బయటికి రావడంతో ఆశ్చర్యపోవడం అతిథుల వంతయ్యింది. అంతేనా.. చివరకు అందరూ ఆ శవపేటిక పక్కన వరుసలో నిలబడి ఫొటో కూడా తీసుకున్నారు. చదవండి: Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు.. ఇదంతా జరిగింది ఎక్కడన్నది తెలియనప్పటికీ.. ఈ వివాహానికి హాజరైన ఒకరు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.80 లక్షల మంది చూశారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభమాని పెళ్లి చేసుకుంటూ.. ఇలా శవపేటికలో రావడమేంటని మండిపడుతున్నారు. -
స్నేహితుడి పెళ్లిలో చీరకట్టుతో మెరిసిన అమెరికన్స్.. ఎంత సక్కగున్నారో!
సాధారణంగా ఎవరైనా పెళ్లికి వెళ్తే ఏం చేస్తారు.. మంచిగా తయారయ్యి గిఫ్ట్‌లు, డబ్బులు కానుకలుగా తీసుకెళ్తారు. పెళ్లయ్యాక భోజనం చేసి వచ్చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. చాలా వరకు పెళ్లిల్లో బంధువులు, స్నేహితులు సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు. వధూవరులతో ఫ్రెండ్స్ చేసే అల్లరి పనులు, సర్ప్రైజ్లు భలే ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఓ ఇద్దరు యువకులు తమ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లి భారతీయ యువకుడిదే అయినా జరిగింది ఇక్కడ కాదు అమెరికాలో.. అయితే అతన్ని సర్ప్రైజ్ చేసింది అమెరికా దోస్తులు కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియాకు చెందిన ఓ యువకుడు చికాగోలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పంచెకట్టులో ముస్తాబైన వరుడు తన స్నేహితుల కోసం ఎదురుస్తున్నాడు. ఇంతలో తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు అమరికన్ యువకులు అచ్చమైన భారత మహిళలుగా చీర కట్టుకొని అటుగా వస్తుంటారు. చక్కగా చీరలు కట్టుకొని ముఖానికి బొట్టు పెట్టుకొని.. ఇద్దరు కలిసి రోడ్డుపై వయ్యారంగా సిగ్గుపడుతూ నడుస్తూ వచ్చారు. దోస్తుల కోసం ఎదురు చూస్తున్న వరుడు వారు అలా చీరలో స్టైల్‌గా వస్తుండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. గాల్లో తేలిపోయి పడిపడి నవ్వుతుంటాడు. స్నేహితులు సైతం వరుడిని ఆనందంతో చిరునవ్వు చిందిస్తారు. చివరికి ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని తమ స్నేహానికి గుర్తుగా ఓఫోటో ఫోజు ఇచ్చారు. ఇదంతా వధువు పక్కకు ఉండి వారిని గమనిస్తూ మురిసిపోవడంపై మరింత హెలైట్గా నిలిచింది. చదవండి: విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ.. చికాగోకు చెందిన ఓ వెడ్డింగ్ఫోటోగ్రాఫ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో భారతీయ సంప్రదాయమైన చీరను కట్టడంలో యువకులకు ఓ మహిళ సాయం చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్నేహితుడి సంప్రదాయాన్ని గౌరవించి యువకులు తీసుకున్న నిర్ణయం నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది. నిజమైన స్నేహితులు వీళ్లు అంటూ యువకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప‘రాయి దేశం వాళ్లు అయిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో విలువిచ్చారో, ఎంత ముద్దుగా చీరలు కట్టుకున్నారో.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు’ అంటూ కొనియాడుతున్నారు. View this post on Instagram A post shared by Chicago Wedding Videographers (@paraagonfilms) -
గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): తాగిన మత్తులో గొడవ పడిన స్నేహితులిద్దరు ప్రమాణం చేయడానికి చెరువు వద్దకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాసన్ తాలూకా తేజూరు గ్రామానికి చెందిన ఆనంద, చంద్రు హాసన్‌లో ఒక బేకరిలో పని చేస్తున్నారు. ఖాళీ సమయంలో శుభకార్యాలకు స్వీట్లు చేసి ఇచ్చేవారు. గురువారం బేకరిలో పని ముగించుకొని రింగ్‌రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగారు. గతంలో ఒకరి నుంచి డబ్బు తీసుకుని మిఠాయిలు చేసివ్వలేదు. తాగిన మత్తులో ఈ విషయంపై గొడవ పడ్డారు. తప్పు చేయలేదని గంగను ముట్టి ప్రమాణం చేద్దామంటూ దగ్గరిలోని చెరువులోకి దిగారు. మత్తులో జారి నీటిలోకి పడి మునిగిపోవడంతో విగతజీవులయ్యారు. హాసన పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (నూతన జంట జలసమాధి.. ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం) -
ఖతార్ నుంచి హతమార్చేందుకు ప్లాన్.. చంపేందుకు వెళ్తూ..
గుంటూరు రూరల్: వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాత ఇద్దరిమధ్యా తలెత్తిన ఆర్థిక లావాదేవీలు దూరం పెంచాయి. చివరకు కిరాయి హంతకుల సాయంతో మిత్రుడునే హత్య చేయించే స్థాయికి పురిగొల్పాయి. చివరకు పన్నాగం బెడిసికొట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మండలం ఏటీ అగ్రహారానికి చెందిన ప్రశాంత్, అవినాష్‌రెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం.. మర్మాంగాలను కోసి.. ప్రశాంత్ ఖతార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడ్డారు. కాగా, అవినాష్‌రెడ్డికి ప్రశాంత్ తన సొంత ఖర్చుతో పెళ్లి చేశాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. అవినాష్‌రెడ్డి వైఖరిపై విసుగు చెందిన ప్రశాంత్ అతడిని అంతం చేయాలని పథకం పన్నాడు. తాను ఖతార్‌లో నుంచి గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన నామాల చందు, దేవళ్ల సూర్య, రాచకొండ గోపీకృష్ణ, వెంగలశెట్టి దుర్గాప్రసాద్, షేక్ కరీముల్లా, షేక్ బాజీ, పూసల బాలాజీ, కమతం కృష్ణను సంప్రదించాడు. అవినాష్‌రెడ్డిని హతమార్చాలని, ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తానని చెప్పాడు. సుమారు రూ.30 లక్షల వరకు సుపారీ చెల్లించాడు. చంపేందుకు వెళ్తూ దొరికిపోయారు సుపారీ తీసుకున్న 8 మంది ఇటీవల విజయవాడలో కత్తులు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కాగా, నిందితులకు స్థానికంగా కొందరితో వివాదాలు ఉండటంతో.. హైదరాబాద్‌లో హత్య చేసి తిరిగొచ్చాక ఇక్కడి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అనంతరం శుక్రవారం రాత్రి వారంతా కారులో హైదరాబాద్ బయలుదేరగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు పేరేచర్ల వద్ద 8 మందినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తులు, ఇతర మారణాయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడి హత్యకు పథకం వేసిన ప్రశాంత్‌ను ఖతార్ నుంచి స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. -
స్నేహితుల మధ్య ఘర్షణ ... ఒకరి మృతి
గోరంట్ల: డబ్బు విషయంగా ఘర్షణ పడిన స్నేహితులను విడిపించే క్రమంలో మరో స్నేహితుడు హతమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సాములపల్లి వద్ద నివాసముంటున్న సుబ్బన్న, అనంతపురానికి చెందిన సురేష్ బావబామ్మర్దులు. తన స్నేహితుడు షాదర్‌వలితో కలసి బుధవారం సాములపల్లికి సురేష్ వచ్చాడు. డబ్బు విషయంగా సుబ్బన్నతో సురేష్ గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ సమయంలో బ్లేడుతో సుబ్బన్న గొంతు కోసేందుకు సురేష్ ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన షాదర్‌వలి వెంటనే అడు్డకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాదర్‌వలి తలపై బండరాయితో కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బన్న, షాదర్‌వలిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షాదర్‌వలి మృతిచెందాడు. సుబ్బన్న పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన సురేష్ పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ) -
విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా..
యశవంతపుర(బెంగళూరు): దావణగెరె జిల్లా హరిహర తాలూకా హరగనహళ్లి వద్ద డ్యాం అందాలను వీడియో తీస్తూ నీటమునిగి స్నేహితులిద్దరూ మునిగి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... హరిహర ఆశ్రయ లేఔట్‌కు చెందిన పవన్ (25), ప్రకాశ్ (24) మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాలో పోస్ట్ చేసేవారు. గురువారం సాయంత్రం వెళ్లి.. గురువారం సాయంత్రం సమీపంలోని జలాశయం నిండడంతో బైక్ వేసుకుని వెళ్లి వీడియో తీయసాగారు. అదుపుతప్పి నీటిలో పడిన ప్రకాశ్‌ను రక్షించడానికి యత్నించిన పవన్ కూడా మునిగిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరి జాడ లేకపోవడంతో బంధుమిత్రులు డ్యాం వద్ద బైక్ ఉండడంతో రోదిస్తూ గాలించసాగారు. శనివారం ఉదయం హరిహర రాఘవేంద్రమఠం వద్ద ప్రకాశ్ మృతదేహాన్ని కనుగొన్నారు. పవన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి జతలో అదే గ్రామానికి చెందిన హనుమంత కూడా వెళ్లాడు. ఇద్దరు మునిగిపోయిన విషయాన్ని భయపడి ఎవరికీ చెప్పలేదు. శవం బయట పడిన తరువాత పోలీసులు విచారించగా రీల్స్ తీస్తుండగా ఘటన జరిగిందని హనుమంత వివరించాడు. -
ఫొటోలు లీక్..ప్రియురాలు రౌద్రరూపం.. ప్రియుడు ఖతం
బొమ్మనహళ్లి: ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడనే ఆగ్రహంతో ప్రియురాలు రౌద్రరూపం దాల్చింది. ముగ్గురు మగ స్నేహితులతో కలిసి ప్రియున్ని ఇష్టానుసారం కొట్టడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన బెంగళూరులో బేగూరు పరిధిలో చోటుచేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో చదివి వచ్చి వివరాలు... చెన్నై నగరానికి చెందిన వికాస్ (27), ప్రతిభ ప్రేయసీ ప్రియులు. ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్ చెన్నైలో డాక్టర్‌గా పని చేసేవాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభతో వికాస్‌కు రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. వికాస్ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేసుకుందామని జంట అనుకుంది. ఇన్ స్టాలో ఫొటోల పోస్టింగ్‌తో గొడవ ప్రతిభ నగ్న చిత్రాలను వికాస్ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది ఆమె కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్‌తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. (చదవండి: మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు) -
ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్
వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. ప్రస్తుతం అలాంటి ముగ్గురు స్నేహితుల విజయగాథ ఇది. రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోట్ల రుపాయలు టర్నోవర్ చేస్తున్నారు. అందరిలానే చదువు పూర్తి చేసుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేసి సంతృప్తి చెందక వ్యాపారం వైపు అడుగులు వేశారు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ పాత్ర. 2 లక్షలు పెట్టుబడి.. 75 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేద్దామని అనుకునే సమయానికి వారి వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రం ఉంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి 2010లో ఫ్లవర్ ఆరా పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఇందులో పూలు, కేకులు, బహుమతులు వంటి వస్తువులకు సంబంధించిన ఆన్లైన్ సేవలను అందిస్తూ వచ్చారు. ప్రారంభంలో, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి మాత్రమే ఉన్నాడు. అదే ఉద్యోగి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా పని చేయడంతో సహా కార్యకలాపాలు, డెలివరీ వంటి అన్ని అంశాలను నిర్వహించేవాడు. అనుకోకుండా వాలెంటైన్స్ డే వాళ్ల కంపెనీకి చాలా ఆర్డర్లు వచ్చాయి. స్టాఫ్ ఒక్కరే కావడంతో సహ వ్యవస్థాపకులు హిమాన్షు, శ్రే కూడా డెలివరీ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా సందర్భాల్లో కేకులు ఎక్కువగా విక్రయాలు జరుగుతుండడం గమనించారు. దీంతో 2016 సంవత్సరంలో బెకింగో అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఒకే బ్రాండ్‌కు చెందిన తాజా కేక్‌లను డెలివరీ చేస్తూ బెకింగోని విస్తరింపజేశారు. ప్రస్తుతం, కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు మీరట్, పానిపట్, రోహ్తక్ కర్నాల్ వంటి చిన్న నగరాలకు సేవలందిస్తోంది. కంపెనీ విక్రయాల్లో 30 శాతం వెబ్సైట్ ద్వారానే 70 శాతం అమ్మకాలు స్విగ్గీ, జొమాటో ద్వారా జరుగుతున్నాయి. అలా 2021-22లో బెకింగో 75 కోట్లకు పైగా టర్నోవర్ చేరకుంది. ప్రస్తుతం కంపెనీలో 500 మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ ఈ ఏడాది తన మొదటి ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌ను ఢిల్లీలో ప్రారంభించింది. చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
మృత్యువులోనూ వీడని స్నేహం
కళ్యాణదుర్గం: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలిచి వేసింది. ఆదివారం మధ్యాహ్నం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. రెండు కుటుంబాల్లోనూ విషాదం.. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సిద్ధం చంద్రశేఖరరెడ్డి, సరస్వతి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. కుమారుడు సిద్ధం లక్ష్మీకాంతరెడ్డి. పిల్లలిద్దరికీ పెళ్లి కాలేదు. అలాగే ధర్మవరంలోని గాందీనగర్‌కు చెందిన అంకె రామాంజనేయులు, రామసుబ్బమ్మ దంపతులకూ ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. కుమారుడు అంకె బాలచంద్ర ఎంటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి కాలేదు. కుమార్తెకు వివాహమైంది. రోడ్డు ప్రమాదంలో కుమారులను కోల్పోవడంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ‘ఒక్క గానొక్క కుమారుడిని తీసుకుపోయావా.... దేవుడా... ఇక మాకు దిక్కెవరు?’ అంటూ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇటీవలే ఇద్దరూ పరిచయమై... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిద్ధం లక్ష్మీకాంతరెడ్డి, అంకె బాలచంద్ర మధ్య ఇటీవలే స్నేహం పెరిగింది. వీరిలో లక్ష్మీకాంతరెడ్డి అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బాలచంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో లక్ష్మీకాంతరెడ్డితో కలిసి అనంతపురంలో ఒకే గదిలో ఉంటున్నాడు. ప్రమాదాన్ని తొలుత చూసిన తండ్రి.. మృతుడు సిద్దం లక్ష్మీకాంతరెడ్డి తండ్రి చంద్రశేఖరెడ్డికి సొంతంగా బొలెరో వాహనం ఉంది. రోజూ అనంతపురంలోని టమాట మండీకి సరుకు రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం అనంతపురానికి టమాట లోడుతో వెళ్లిన ఆయన అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో గోళ్ల వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎవరో దురదృష్టవంతులు చనిపోయారనుకుని ముందుకెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా ఆ మార్గంలో వస్తున్న తోటి డ్రైవర్లకు ఫోన్ చేసి ‘గోళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది... జాగ్రత్తగా రండి’ అంటూ సూచించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత చూస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది తన కుమారుడేనని తెలుసుకుని గుండెలవిసేలా రోదించాడు. (చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’) -
వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్ కట్ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది. శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్‌ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. -
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో..
తిరువనంతపురం: మనకంటూ ఓ మొబైల్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లే. ఏది కావాలన్న, ఏం తెలుసుకోవాలన్న క్షణంలో గూగుల్, యూట్యూబ్‌లో వెతికేస్తున్నారు. సాధారణంగా యూట్యూబ్ ద్వారా చాలామంది వంటలు, అల్లికలు వంటి వాటిని నేర్చుకుంటుంటారు. తాజాగా ఓ మైనర్ బాలుడు యూట్యూబ్‌లో చూసి మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్లే ద్రాక్ష పండ్లతో మద్యాన్ని కూడా తయారు చేశాడు. అయితే అక్కడే అతనికి దెబ్బకొట్టింది. అసలేం జరిగిందంటే కేరళలోని తిరువనంతపురం చిరాయింకీజుకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు. అంతేగాక ఈ వైన్‌ను రుచి చూడాలని చెప్పి తన స్నేహితులకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేముంది తాగిన కాసేపటికి స్నేహితుల్లోని ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. కల్తీ మద్యం తాగిన బాలుడిని వెంటనే చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఎలాంటి రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌లో చూపించిన విధంగా వైన్ తయారు చేసి దానిని ఒక సీసాలో నింపి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు. కాగా బాలుడు తయారు తయారు చేసిన వైన్ బాటిల్‌ను పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే వైన్‌లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై జువెనల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆలూరు: వారిద్దరూ స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. వ్యక్తిగత పని నిమిత్తం దేవనకొండకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రి దేవనకొండ మండలం కరిడికొండ సమీపంలో చోటుచేసుకుంది. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన బోయ సుధాకర్ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనతో అదే గ్రామానికి చెందిన తెలుగు వెంకటేష్ (38) స్నేహం చేసేవాడు. ఇద్దరూ కలసి శనివారం సాయంత్రం వ్యక్తిగత పనినిమిత్తం మోటారు సైకిల్‌పై దేవనకొండకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా రాత్రి 8:30 గంటల సమయంలో కరిడికొండ గ్రామ సమీపాన కర్నూలు వైపు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకుని ఎస్ఐ శ్రీనివాసులుకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయ సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె, తెలుగు వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్నేహితులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కప్పట్రాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు
పరిగి: పాతకక్షలను మనసులో పెట్టుకుని స్నేహితుడినే హతమార్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నాటకం ఆడారు. పోలీసులు దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాలు లెక్కపెడుతున్నారు. ఈనెల 18వ తేదీ రాత్రి పరిగి మండలంలోని బీచిగానిపల్లిలో జరిగిన యుగేంద్ర(19) హత్య కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ బీటీ నాయుడు మీడియాకు వెల్లడించారు. బీచిగానిపల్లికి చెందిన బూచర్ల యుగేంద్ర, రాచూరి అంజినేయులు అలియాస్ అంజి, నడింపల్లి మంజునాథ్ స్నేహితులు. హిందూపురంలోని కట్టకింద ఉన్న శివ అనే వ్యక్తి దగ్గర పెయింటింగ్ పనులు చేసేవారు. గ్రామానికే చెందిన ఓ యువతి విషయంలో అంజికి, యుగేంద్రకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యుగేంద్ర కొత్త బైకు కొనుగోలు చేశాడు. రాత్రి ఇంటిముందు నిలపగా...నిప్పుపెట్టారు.ఈ ఘటనలో అంజి నిందితుడిగా పోలీసులు భావించారు. అయినప్పటికీ అందరూ స్నేహితులు, సమీప బంధువులు కావడంతో యథావిధిగా కలిసే పనికి వెళ్తుండేవారు. మద్యం తాగుదామని పిలిపించి... ఓ రోజు యజమాని శివ పని విషయంలో అంజి, మంజులను మందలిస్తూ చేయిచేసుకున్నాడు. ఇందుకు యుగేంద్రే కారణమని వారు భావించారు. అప్పటి నుంచి వారిద్దరూ యుగేంద్రపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఉదయం అంజి, మంజు సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువుకు వెళ్లి కల్లు తాగారు. అనంతరం ఎలాగైనా యుగేంద్రను హతమార్చాలని పథకం పన్నారు. అనంతరం సాయంత్రం ఇద్దరూ బీచిగానిపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రి యుగేంద్రకు ఫోన్ చేసిన అంజి, మంజునాథ్ మద్యం తాగుదామని గ్రామ సమీపంలోని ఓ పొలం వద్దకు పిలిపించుకున్నారు. అక్కడికి చేరుకున్న యుగేంద్రను తొలుత బండరాయితో ముఖంపై బలంగా కొట్టారు. ఆపై వెంట తెచ్చుకున్న సూరకత్తితో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా అతని మర్మాంగాన్ని సైతం కత్తితో కోశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు గ్రామస్తుల ముందు నటించారు. యుగేంద్ర హత్య కేసును దర్యాప్తు చేసిన హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ బీటీ నాయుడు, అప్పటి ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీనివాసులు... అంజి, మంజునాథ్‌లపై అనుమాన పడ్డారు. ఆ తర్వాత గ్రామస్తులతో విచారణ చేపట్టారు. పాతకక్షలతోనే అంజి, మంజునాథ్ యుగేంద్రను హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారు కాగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే శుక్రవారం మండలంలోని గొల్లపల్లి వద్ద అంజి, మంజునాథ్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, యుగేంద్ర సెల్ ఫోన్‌ను స్వాధీనం చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. కేసును వేగవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐలు నరేంద్ర, శ్రీనివాసులుతో పాటూ పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. (చదవండి: ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్) -
ఎవరికీ చెప్పుకోలేక... భయంతో మథనపడుతూ..
యువత పెడదోవ పడుతోంది. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం ‘సెల్ ఫోన్’ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. మంచికోసం వినియోగించాల్సిన తమ మేధస్సును పెడదోవ పట్టిస్తోంది. తల్లిదండ్రులకు తలనొప్పులు తెస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు తప్పులు చేస్తుంటే వారిని వారించడం తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు సమస్యను ఎవ్వరితోనూ చెప్పుకోలేక ఇద్దరూ లోలోన మథనపడుతున్నారు. సున్నితమైన అంశాలు కావడంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఏయూక్యాంపస్/ఎంవీపీ కాలనీ: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది బాలురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొద్దిరోజుల్లో వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఓ బాలుడు మిగిలిన వారి తల్లిదండ్రులకు మత్తు పదార్థాల సేవనం గురించి తెలియజేశాడు. దీంతో కక్ష గట్టిన ఐదుగురు బాలురు ఓ రోజు రాత్రి ఆ అబ్బాయిని నమ్మించి తీసుకువెళ్లి గంజాయి సేవించిన తర్వాత విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తుప్పల్లో పెట్టి పడేశారు. వీరంతా హైస్కూల్ స్థాయి విద్యార్థులే. మద్దిలపాలెం సమీపంలో సుమారు నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన పిల్లల విపరీత ప్రవర్తనకు ఓ నిదర్శనం. కొద్ది రోజుల క్రితం నగరంలోని డాబాగార్డెన్స్ సమీపంలో ఓ యువకుడిపై స్నేహితులే కత్తులు, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. గతంలో తలెత్తిన చిన్నచిన్న వివాదాలకే కక్ష గట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు బాలురే కావడం గమనార్హం. ఆధునిక సమాజంలో ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సెల్ఫోన్లు తదితర సామాజిక మాధ్యమాలు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడడం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివిఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఇటీవల ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులూ మైనర్లే కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన నొక్కి చెప్పింది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. క్రమంగా బానిసలై.. సరదా కోసం స్నేహితుల ప్రోద్బలం, ప్రభావంతో ప్రారంభించిన చెడు అలవాట్లు పిల్లల మెడకు చుట్టుకుంటున్నాయి. రానురాను వీరు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకు లభించడంతో యువత దీన్ని అధికంగా అభ్యంతరకర పనులకు వినియోగిస్తున్నారు. ఇవి వారి లోచనలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. సరదా కాస్తా అలవాటుగా మారిపోవడం, దానిలో గంటల తరబడి సమయం గడపడం విద్యా ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యువత భవిష్యత్తును అంధకార బంధురంగా మార్చివేస్తోంది. చెడువైపే ఆకర్షణ ఉన్నత పాఠశాల విద్యకు వచ్చిన నాటి నుంచి పిల్లల్లో విపరీత ఆలోచనలు మొదలవుతున్నాయి. 6, 7 తరగతులకు వచ్చిన ప్రతీ చిన్నారి సెల్‌ఫోన్ వినియోగించడం సాధారణమైపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇచ్చే ఈ చిన్న పరికరం పెను సమస్యలకు కారణంగా మారుతోంది. యుక్తవయస్సులోకి అడుగిడే సమయంలో మంచి కంటే చెడు వీరిని సులభంగా ఆకర్షిస్తోంది. సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలు వీక్షించడం, ధూమపానం, మద్యం వంటివి వీరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడితే సులభంగా వీరు తప్పటడుగులు వేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటి వరకు వివాదాలు స్నేహితులతో వివాదాలు, అనైతిక చర్యలకు పాల్పడటం, మత్తుపదార్థాల సేవనం, ప్రేమ వ్యవహారాలు, విపరీత ధోరణులతో తరచూ వివాదాలకు కేంద్రంగా యువత మారిపోతున్నారు. ఆ వివాదాలు ఇంటిమీదకు రావడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతోంది. గౌరవంగా జీవనం సాగిస్తున్న జీవితాలను అతలాకుతలం చేసే విధంగా యువత ప్రవర్తన ఉంటోంది. బయటకు పొక్కితే, పోలీసుల రికార్డుల్లో నమోదైతే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందనే భయంతో తల్లిదండ్రులు సమస్యను ఎవ్వరికీ చెప్పకుండా గుండెల్లో దాచుకుంటున్నారు. ఇది యువతకు అవకాశంగా మారిపోయి వారు మరింత బరితెగించి ప్రవర్తించే దిశగా ప్రోత్సహించినట్లుగా మారుతోంది. దీనికి పరిష్కారం చూపుతూ మానసిక నిపుణుల సహకారంతో యువతను చక్కదిద్దే కేంద్రాలు ఏర్పాటు కావడం ఎంతో అవసరం. చెడ్డవారితో స్నేహాలు, వ్యసనాలకు అలవాటు పడిన యువతకు తప్పు చేయడం ఓ అలవాటుగా మారిపోతోంది. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ సరిపోకపోవడంతో ఇంట్లో డబ్బులు దొంగలించడం నుంచి తల్లిదండ్రుల ఏటీఎం కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు తెలుసుకుని నగదు బదిలీ చేసుకునే వరకు వెళ్తున్నారు. వీటిని తల్లిదండ్రులు గమనించకపోవడంతో కొనసాగించడం.. వారికి తెలిస్తే పశ్చాత్తాప భావన లేకుండా ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది. అబద్ధాలు ఆడటం, పొంతన లేని సమాధానాలు చెప్పడం, నిజాలను దాచడం చేస్తూ వివాదాల్లో, సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులు వీటిని తెలుసుకునే సమయానికి వీరు చేయిదాటిపోతుండటం జరుగుతోంది. ఒక్కో దశలో తల్లిదండ్రులను ఎదిరించడం, తాను ఇలానే ఉంటానని తెగించి మాట్లాడటం వరకు వస్తోంది. నైతిక విలువలు బోధించాలి పిల్లలకు మార్కులు కాదు.. బిహేవియరల్ క్వాలిటీస్ ప్రధానం. దీనిని తల్లిదండ్రులు గమనించి చిన్నారులను తీర్చిదిద్దాలి. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులను సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. శతక పద్యాలు, నీతి సూత్రాలు చిన్నారులకు బోధించే ప్రయత్నం జరగాలి. తద్వారా వారి భవిష్యత్ జీవనానికి బలమైన పునాదులు బాల్యంలోనే పడతాయి. – తాతా సందీప్ శర్మ, శతావధాని సమాజం పెను సవాల్ ఎదుర్కొంటోంది ఇంటర్నెట్ యుగంలో పిల్లలకు స్వేచ్ఛ పెరిగిపోయింది. ప్రస్తుతం సమాజాన్ని శాసిస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జాట్స్లో సెల్ ఫోన్ ముందు వరుసలో ఉంది. ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉన్న చాలా మంది తల్లిదండ్రులు వారి పనులకు ఆటంకం కలగకుండా పిల్లలకు సెల్ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీంతో రెండున్నరేళ్ల నుంచే సెల్ ఫోన్ ప్రభావం పిల్లలపై కనిపిస్తోంది. క్రమంగా పబ్జీ వంటి గేమ్‌లతో పాటు ఆన్లైన్ క్రైమ్స్, అడల్ట్ కంటెంట్స్ ఉన్న వీడియోల వైపు ఆకర్షితులవుతున్నారు. గంటల తరబడి ఫోన్‌కి బానిసలై.. వ్యసనాలకు లోనై నేర మార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తుమందులు, సిగరెట్లను స్టేటస్ సింబల్‌గా, హీరోయిజంగా భావిస్తున్నారు. దీంతో సామాజిక బంధాలకు, చదువుకు క్రమంగా దూరమై.. కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. క్రియేటివ్ వర్క్స్, చిన్న చిన్న ఇంటి పనులను అలవాటు చేయాలి. ఇతరులతో స్నేహపూర్వకంగా మెలగడం, విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. – డాక్టర్ భవానీ, క్లినికల్ సైకాలజిస్ట్ -
అమ్మాయి కోసం స్నేహితుల మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే?
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడి హత్యకు దారితీసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన గిలక దీపక్ ఆకాష్ (24) జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆకాష్, గోపీకృష్ణ అలియాస్ ప్రభ, మరికొందరు కలిసి నగరంలోని కళాశాలలో చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఆకాష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె పేరును తన పొట్టపై పుట్టుమచ్చ కూడా వేయించుకున్నాడు. చదవండి: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని.. ఈ అమ్మాయి విషయంలో ఆకాష్, గోపీకృష్ణల మధ్య గత రెండేళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన టోనీ అనే రౌడీషీటర్ మృతదేహాన్ని చూడడానికి మంగళవారం మధ్యాహ్నం ఆకాష్ తన ఏడుగురు స్నేహితులతో కలసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఆస్పత్రి సమీపంలో ఉన్న మద్యం షాపులో ఆకాష్ మద్యం తాగుతుండగా, అదే ప్రాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలసి అక్కడ ఉన్న గోపీకృష్ణ మరోసారి ఆకాష్‌తో గొడవ పడ్డాడు. నీ సంగతి చూస్తానంటూ గోపీకృష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మద్యం బాగా తాగి ఉన్న ఆకాష్‌ను అతని స్నేహితులు బైక్‌పై ఎక్కించుకుని గురునానక్ కాలనీలో ఉంటున్న మరో స్నేహితుని ఇంట్లో దించి వెళ్లిపోయారు. ఆ సంగతి తెలుసుకున్న గోపీకృష్ణ కొంతమంది స్నేహితులను వెంటబెట్టుకుని గదిలో నిద్రిస్తున్న ఆకాష్‌ను కత్తులతో పొడిచి చంపి పరారయ్యాడు. ఆకాష్ స్నేహితుడు వెంటనే అతనిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆకాష్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆకాష్ హత్యపై అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ హత్యలో తొమ్మిది మంది పాల్గొన్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. వీరిలో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరంతా గుణదలకు చెందిన వారుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. హతుడి ఫోన్ డేటాను పరిశీలించిన అనంతరం గుంటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు, నెల్లూరు ప్రాంతాలకు వీరిని పంపి నిందితుల కోసం గాలిస్తున్నారు. హతుడు, నిందితులు కూడా మంగళవారం ఆత్మహత్య చేసుకున్న రౌడీషీటర్ టోనీ అనుచరులుగా పోలీసులు గుర్తించారు. కేసును విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆకాష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
మృత్యువులోనూ వీడని బంధం
చిన్ననాటి నుంచి వారిద్దరూ మిత్రులు. ఏ పనైనా కలిసే చేసుకునేవారు. ‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అనుకుంటూ సాగేవారు. వీరిని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను విషాదాంతంగా ముగించింది. బాధిత కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో దర్శనమల ఫీల్డ్ అసిస్టెంట్ తలారి నరేంద్ర(24), అతని స్నేహితుడు అంకే రామాంజనేయులు(23) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... దర్శనమలకు చెందిన నరేంద్ర, రామాంజనేయులు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇటీవలే రామాంజనేయులు తన వ్యవసాయ పొలంలో బోరు వేయించాడు. చీనీ మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. పొలంలోని మట్టిని అనంతపురంలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించేందుకు శుక్రవారం మిత్రుడు నరేంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగిశాక మిత్రులిద్దరూ బైక్‌పై ధర్మవరం వైపు వస్తున్నారు. గరుడంపల్లి సమీపంలోకి రాగానే ఎస్కే యూనివర్సిటీలో పనిచేస్తున్న లక్ష్మీపతి ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి ఎదురుగా వీరి వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. సంఘటనా స్థలంలోనే ముగ్గురు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్ర, రామాంజనేయులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ద్విచక్ర వాహనదారుడు లక్ష్మీపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రకు భార్య ఇందు, కుమార్తె సంతానం. రామాంజనేయులుకు భార్య రమాదేవి, కుమారుడు ఉన్నారు. ధర్మవరం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దర్శనమలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ మృతుల కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. (చదవండి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం.. చక్రం తిప్పిన పరిటాల బంధువు) -
మరణంలోనూ వీడని స్నేహబంధం..
కె.కోటపాడు (మాడుగుల) : మండలంలో మర్రివలస వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. దైవ కార్యక్రమానికి వచ్చిన వారిని బైక్ ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది. వీరిలో ఒకరు కె.కోటపాడు మండలం గొట్లాం గ్రామానికి చెందిన కొట్యాడ మణికంఠ (23)కాగా, మిగతా ఇద్దరు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం దాసులపాలెంకు చెందిన కూనిశెట్టి త్రినా«థ్(20), జామి మండలం చింతాడకు చెందిన యర్రా సాయి(18) అని పోలీసులు తెలిపారు. స్నేహితుని ఆహ్వానం మేరకు.. కె.కోటపాడు మండలం గొట్లాం గ్రామంలో శుక్రవారం జరిగిన నూకాలమ్మ ఆలయ ప్రారంభ కార్యక్రమానికి గ్రామానికి చెందిన కొట్యాడ మణికంఠ ఆహ్వానం మేరకు స్నేహితులు కూనిశెట్టి త్రినాథ్, యర్రా సాయి వచ్చారు. వీరు ముగ్గురూ ఒకే బైక్‌పై పాతవలస గ్రామానికి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వారు ప్రమాదానికి గురయ్యారు. గొట్లాం గ్రామం వస్తుండగా మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పింది. రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రోడ్డుపక్కన పడి ఉన్న మృతదేహాల్లో మణికంఠను స్థానికులు గుర్తించారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మణికంఠ సోదరుడు అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కె.కోటపాడు ఎస్ఐ జి.గోపాలరావు తెలిపారు. మణికంఠ బైక్ నడుపుతుండగానే ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు. గొట్లాంలో విషాదఛాయలు గొట్లాం గ్రామానికి చెందిన మృతుడు కొట్యాడ మణికంఠ తల్లిదండ్రులు రమణ, లక్ష్మమ్మలు వసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు మణికంఠ. మృతుడు విశాఖపట్నం పోర్ట్‌లో కంటైనర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో అందరినీ కంట తడి పెట్టించింది. పండగ రోజున గొట్లాం గ్రామంలో విషాదం చోటు చేసుకోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కూనిశెట్టి త్రినాద్ దాసులపాలెం గ్రామంలో ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తున్నాడు, జామి మండలం చింతాడకు చెందిన యర్రా సాయి విజయనగరంలోని ఓ కళాశాలలో డిప్లొమో చదువుతున్నాడని ఎస్ఐ తెలిపారు. ముగ్గురు మృతదేçహాలకు చోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. -
విషాదం: మరణంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌గానే మిగిలారు..
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): వారి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పిల్లలను బాగా చదివించాలని తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని చదివిస్తున్నారు. స్నేహితులిద్దరు చిన్నప్పటి నుంచి ఒకే గ్రామం, ఒకే పాఠశాల కాకపోయినప్పటికీ ఇంటర్మీడియట్ నుంచి ఒకే కళాశాలలో కలిసి చదువుకుంటున్నారు, ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. వారి స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో కాని ఒకరి తర్వాత మరొకరు ఈ లోకాలను, తల్లిదండ్రులను విడిచివెళ్లారు, వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు వారే పెదనందిపాడు మండల అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన కోండే పాటి విజయ్, కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన బాలరాజులు. చదవండి: హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు వీరివురు పెదనందిపాడులోని పెదనందిపాడు అర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాలలో బీఎస్సీ (కంప్యూటర్స్) మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఇంటర్మీడియట్ మొదటి పంవత్సరంలో ఏర్పడిన వీరి స్నేహం కడవరకు నిలిచింది. అందరి దృష్టిలో బెస్ట్ ప్రెండ్స్‌లా ఉన్నారు. మరణంలో కూడా బెస్ట్ ప్రెండ్స్‌గానే మిగిలారు. గార్లపాడు గ్రామానికి చెందిన బాలరాజు ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకుని చనిపోయాడు, ఈ విషయం తెలిసిన స్నేహితుడు విజయ్ అక్కడకు వెళ్లి బాలరాజు అంత్యక్రియలు అయిపోయేంత వర కు అక్కడే ఉన్నాడు. ఇంటికి వచ్చిన నాటి నుంచి స్నేహితుడితో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోయాడు. తన స్నేహితుడు లేని లోకంలో తాను ఉండలేనని, తానూ స్నేహితుడు వద్దకు వెళతానని తల్లిదండ్రులతో చెబుతూ బాధపడేవాడు. దీనిపై తల్లిదండ్రులు సర్ది చెబుతూ ధైర్యం చెప్పే వారు. అయితే మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు లేని సమయం చూసి గ్రామంలో వెలుపల ఉన్న చెరువు వద్దకు వెళ్లి చీరతో ఊరివేసుకుని తన స్నేహితుడు వద్దకు వెళ్లిపోయాడు. రెండు రోజుల వ్యవధిలో తమ తరగతి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో కళాశాల సిబ్బంది, విద్యార్థులు దుఃఖసాగరంలో మునిగారు. ఇన్నాళ్లు తమతో స్నేహంగా మెలిగిన ఇద్దరు మరణించడంతో కళాశాల చిన్నబోయింది. బుధవారం సాయంత్రం అబ్బినేనిగుంటపాలెం గ్రామంలో విజయ్ను కడసారి చూడటానికి వచ్చిన స్నేహితులు, బంధువులు, కళాశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు వేదన వర్ణనాతీతంగా మారింది. స్నేహితులు, బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు. -
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేసేవారు.. చివరకు..
కామారెడ్డి క్రైం: వాళ్లిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేసేవారు.. చివరికి మృత్యువు సైతం వారిని విడదీయలేకపోయింది. రామేశ్వర్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులిద్దరు మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన బురుగుల్ల రాహుల్(20), మహ్మద్ షఫీ(18) మంచి స్నేహితులు. రాహుల్ మున్సిపాలిటీలో కార్మికుడి గా, షఫీ స్థానికంగా ఓ మోటార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి రామేశ్వర్పల్లిలో పని ఉండడంతో శుక్రవారం బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా హైవేపై యూటర్న్ తీసుకోబోయారు. ఆ సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాహుల్, షఫీ అక్కడికక్కడే మృతి చెందారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. చదవండి: (భార్యపై అనుమానం.. మద్యం సేవించి..) ప్రమాదాల నిలయంగా యూటర్న్... రామేశ్వర్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ఇక్కడ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడగా అనేక మందికి గాయాలయ్యాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు ధర్నాలు సైతం చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించాలని కోరుతున్నారు. -
హోలీ వేడుకల్లో అపశృతి.. ఆడుకుందామని బయటికి పిలిచి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): హోలీ ఆడుకుందామని స్నేహితుడిని బయటికి పిలిచిన ముగ్గురు బాలురు తమతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో వీపుపైన, తొడలపైన గాయపరిచి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక ఉండే ఇందిరానగర్‌లో నివసించే శ్రీహరి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. (చదవండి: సంతానం కలగలేదు.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని.. ) శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీహరి తన ఇంటి ముందు హోలీ ఆడుకుంటుండగా సమీపంలో నివసించే ముగ్గురు స్నేహితులు అభి, నాని, బబ్లూ ముగ్గురూ అక్కడికొచ్చి శ్రీహరికి రంగులు పూశారు. బలవంతంగా నెత్తి మీద కోడిగుడ్లు కొట్టారు. వారి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురూ కలిసి తమతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో శ్రీహరి వీపు మీద గాట్లు పెట్టారు. తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండగా శ్రీహరి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా తొడలపై గాట్లు పెట్టారు. అదే సమయంలో బాధితుడి తల్లి లక్ష్మి అక్కడికొచ్చి తీవ్రంగా గాయపడిన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాడికి పాల్పడ్డ ముగ్గురు బాలలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అభి, నాని, బబ్లూలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కెమెరాల సాక్షిగా.. చివరి వరకు చెరగని చిరునవ్వు..
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: బలవన్మరణం చెందాలనుకున్న వారు ఇటీవల ఎక్కువగా రైలు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా జిల్లా కేంద్రమైన కడపలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టాలపై క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా...జీవితంపై ఎందుకింతలా విరక్తి చెందుతున్నారో అంతు చిక్కడం లేదు. తాజాగా సోమవారం కడపలో గూడ్స్ రైలు కిందపడి ఇరువురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న సంఘటను పరిశీలిస్తే....వారికి వచ్చిన కష్టమేమో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులు, బంధువులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఎందుకిలా జరిగిందబ్బా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తప్ప అసలు కారణాలు ఎంత వెతికినా దొరకడం లేదు. మంచి చదువులు అభ్యసిస్తూ... అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడుకు చెందిన కల్యాణి (18) గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. యాడికి పట్టణం హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రి సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతోంది. చదువులో ఇరువురు తెలివైన వారే. ఉన్నత లక్ష్యాలను సాధించాలనే దిశగానే వారి విద్యాభ్యాసం కొనసాగుతోంది. ఈ క్రమంలో వీరికి ఎందుకిలాంటి ఆలోచన వచ్చిందో అంతుచిక్కడం లేదు. ఏదైనా ప్రేమ వ్యవహారమా? అనడానికి ఆధారాల్లేవు. అలాగని కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నాయనుకుంటే అవీ లేవు. తాడిపత్రి నుంచి కడపకు వచ్చి మరీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి వీరికి ఎందుకొచ్చిందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!) చివరి వరకు చెరగని చిరునవ్వు.. కల్యాణి, పూజితలు కడపలో బస్సు దిగి రైల్వేస్టేషన్ చేరుకునే వరకు వారి ముఖాల్లో చిరునవ్వు ఏమాత్రం చెరగలేదన్నది సీసీ కెమెరాల సాక్షిగా స్పష్టమవుతోంది. బస్టాండులో దిగిన తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా కొన్ని సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకున్నారు. మాస్క్ పెట్టుకుని ఒకసారి..లేకుండా మరోసారి...ఇలా ఒకరిపై ఒకరు ఆప్యాయతను కనబరుస్తూ జ్ఞాపకాలు మిగిల్చిపోయారు. అది వారి చివరి ఫొటోగా చెప్పవచ్చు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మాత్రం తీరని శోకాన్ని మిగిల్చి వారిని కన్నీటి సంద్రంలో ముంచిపోయారు. సంఘటనపై పోలీసుల ఏమంటున్నారంటే.. కల్యాణి, పూజిత ఆత్మహత్యలపై రైల్వే ఎస్ఐ రారాజును వివరణ కోరగా ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుంచి అన్ని వివరాలు సేకరించామన్నారు. అయితే వారి వద్ద మృతికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదన్నారు. వీరి కళాశాల ప్రిన్సిపాల్స్‌తోపాటు స్నేహితులతో మాట్లాడాల్సి ఉందని వివరించారు. అలాగే మృతి చెందిన విద్యార్థినుల ఫోన్‌కాల్ డేటా గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం అందగానే మీడియాకు తెలియజేస్తామని ఆయన వివరించారు. -
ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!
సాక్షి, అనంతపురం/ కడప కోటిరెడ్డిసర్కిల్: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. యాడికిలో ఒకే బడిలో చదువుకున్నారు. ప్రాణం కంటే మిన్నగా వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహమే చివరికి వారిద్దరి ప్రాణాలను ఒకేసారి తీసుకునేటట్లు చేసింది. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు సోమవారం మధ్యాహ్నం కడప నగర పరిధిలోని భాకరాపేట రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. రైల్వే ఎస్ఐ రారాజు కథనం మేరకు... యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కల్యాణి (18) గుత్తిలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఈసీఈ చదువుతోంది. ఈమె తండ్రి రామాంజనేయులు యాడికిలో కూల్‌డ్రింక్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రిలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూలులో ఇంటర్ వరకు కలిసి చదివారు. చదవండి: (బ్యూటీ పార్లర్లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి..) ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు యాడికిలో బయలుదేరి మధ్యాహ్నం కడపకు చేరుకున్నారు. 1.30 గంటల ప్రాంతంలో కడప సమీపంలోని భాకరాపేట (ఎర్రముక్కపల్లె) రైలు పట్టాల వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ సమయంలో వస్తున్న గూడ్స్ రైలు కిందపడ్డారు. సంఘటన స్థలంలోనే కల్యాణి మృతి చెందింది. శరీర భాగాలు విడిపోయాయి. మరో యువతి పూజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు ఎందుకు తీసుకున్నారో తెలియరాలేదు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. మాజీ నక్సలైట్ దారుణ హత్య
సాక్షి, నల్గొండ: మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే హంతకులయ్యారు. శరీరం నుంచి తలను వేరుచేసి అతి కిరాతకంగా హత్య చేసి గోతిలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం, వద్దిపట్లకు చెందిన నామ శ్రీనివాస్(38), ఆదిబట్ల మున్సిపల్ సమీపంలోని బొంగ్లూర్ వద్ద మెట్రోసిటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ భార్య కవిత 16 ఏళ్ల క్రితమే మృతిచెందింది. ప్రస్తుతం ఆయన మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెండు నెలలుగా కనిపించకకుండా పోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 14న శ్రీనివాస్ తండ్రి, కుటుంబ సభ్యులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నవంబర్ 12న హత్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనివాస్‌కు ఎల్బీనగర్లో స్నేహితులు ఉన్నారు. వీరిలో బ్రహ్మచారి, నరేష్, రాజమ్మ (ట్రాన్స్‌జెండర్)తో ఎక్కువగా కలిసి ఉండేవాడు. బ్రహ్మచారి నకిలీ బంగారం వ్యాపారం చేస్తుండే వాడు. అతనిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. బ్రహ్మచారి పోలీసుల కంట పడకుండా.. శ్రీనివాస్ మెట్రోసిటీలో ఓ గది అద్దెకు ఇప్పించి దాచిపెట్టాడు. బ్రహ్మచారితో ఉంటున్న స్వాతి ఫోన్ నంబర్ తెలుసుకుని శ్రీనివాస్ స్నేహం చేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని భావించాడు. బ్రహ్మచారి ఉంటున్న సమాచారాన్ని ఎల్బీనగర్ పోలీసులకు అందజేశాడు. వారు బ్రహ్మచారిని అరెస్టు చేయించి, జైలుకు పంపించారు. ఆ తర్వాత స్వాతికి దగ్గరైన శ్రీనివాస్ ఆమెతో సహజీవనం సాగించాడు. జైలుకు వెళ్లిన 18 రోజుల తర్వాత బ్రహ్మచారి బయటకు వచ్చాడు. అతనికి స్వాతి జాడ తెలియలేదు. శ్రీనివాస్ వద్ద ఉందని నరేష్, రాజమ్మ చెప్పారు. అప్పటికే స్వాతి బంగారాన్ని బ్రహ్మచారి దొంగిలించాడని శ్రీనివాస్ అతనిపై మరో కేసు పెట్టించాడు. బ్రహ్మచారి జైల్లో ఉన్న సమయంలో నరేష్‌తో మద్యం తాగిన శ్రీనివాస్ ఎలాగైనా బ్రహ్మచారిని హత్యచేస్తానని నరేష్‌తో చెప్పాడు. ఈ విషయాన్ని నరేష్.. బ్రహ్మచారితో చెప్పాడు. దీంతో రగిలిపోయిన అతడు శ్రీనివాస్ హత్యకు పథకం వేశాడు. మద్యం తాగించి.. నవంబర్ 12న నరేష్, బ్రహ్మచారి, రాజమ్మ కలిసి శ్రీనివాస్‌ని మట్టుబెట్టాలని చూశారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ కారులో బయలుదేరారు. బీఎన్‌రెడ్డి వద్దకు వచ్చి వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి మెట్రోసిటీకి వచ్చి తాగారు. ఔటర్ పక్కన ఆటవీ ప్రాంతం వద్దకు రాగానే.. కారులో కూర్చున్న శ్రీనివాస్ మెడకు వెనక సీటు నుంచి బ్రహ్మచారి క్లచ్‌వైర్ బిగించాడు. నరేష్, రాజమ్మ కాళ్లూ చేతులు పట్టుకున్నారు. శ్రీనివాస్ చనిపోగానే మృతదేహాన్ని ఆడవిలోపలికి తీసుకెళ్లి, గుంత తవ్వి కప్పేశారు. అంతకు మందు బ్రహ్మచారి.. శ్రీనివాస్ తలను కత్తితో నరికి వేరు చేశాడు. తలను తీసుకెళ్లిన నరేష్ ఎక్కడో పాతిపెట్టాడు. హత్య జరిగిన 45 రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మచారి పాత కేసులో అరెస్టు కాగా ఎల్బీనగర్ పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు. గోతిలో పాతి పెట్టిన శ్రీనివాస్ మొండాన్ని బయటకు తీశారు. పంచనామా అనంతరం తిరిగి పూడ్చివేశారు. బ్రహ్మచారి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా నరేష్, రాజమ్మ పరారీలో ఉన్నట్లు ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, తన తండ్రి హత్య ఘటనలో బల్వంతయ్య అనే సీఐపై అనుమానం ఉందని, ఆయన్ని విచారించాలని శ్రీనివాస్ కుమారుడు గోపీ, కుటుంబ సభ్యులు చెప్పారు. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
ఆ కుటుంబంలో వరుస ఘటనలు.. మృత్యువులోనూ వీడని స్నేహం
సాక్షి,రామకృష్ణాపూర్(చెన్నూర్): ఓ రోడ్డు ప్రమాదం ఇద్ద రు స్నేహితులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. చెట్టెత్తు కొడుకులు అందనంత ఎత్తు ఎదుగుతారని కలలు కన్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. అంతులేని విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇ లా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవా రం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణాపూర్‌కు చెందిన ఇద్దరు యువకు లు దుర్మరణం చెందారు. స్థానిక భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి తుమ్మేటి మేఘనాథ్(19), డిప్లొమో పూర్తిచేసిన మరో విద్యార్థి పసునూటి మదన్మోహన్(20) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మేఘనాథ్ తండ్రి శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మదన్మోహన్ తండ్రి రాము బజ్జీకొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బర్త్‌డే వేడుకలకని వెళ్లి.. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్ ఏరియాకు చెందిన ఇద్దరు స్నేహితులు మేఘనాథ్, మదన్మోహన్లు స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్తున్నామని మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నామనేది ఎవరికీ స్పష్టతనివ్వకుండానే ఇంట్లో నుంచి బైక్‌పై బయలుదేరారు. మరుసటిరోజు ఉదయం కరీంనగర్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను వీరి బైక్ ఢీకొని మేఘనాథ్, మదన్మోహన్లు చనిపోయినట్లుగా కబురు వచ్చింది. మృతులు ఇద్దరు కూడా ఇంట్లో చిన్నవారు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. కళ్ల ముందున్న కొడుకులు ఒక్కరోజు గడువులోనే విగత జీవులు కావడం ఇరు కుటుంబాలను కోలుకోలేకుండా చేసింది. ఆ కుటుంబంలో వరుస ఘటనలు.. రామకృష్ణాపూర్‌కు చెందిన బజ్జీల కొట్టు నిర్వాహకుడు రాము ఇంట్లో వరుస ఘట నలు కుదిపేస్తున్నాయి. కొద్దిరోజుల క్రిత మే రాము సోదరుడు, యువత బుక్‌స్టాల్ నిర్వాహకుడు రవి భగత్‌సింగ్‌నగర్‌లో రోడ్డు పక్కనే బైక్‌పై ఆగి ఉండగా ఓ ఎద్దు పొడవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందాడు. రవి చనిపోయి నెలరోజులు కూడా గడవకముందే రాము చిన్నకుమారుడు మదన్మోహన్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడటంతో కుటుంబమంతా గుండెలవిసేలా విలపిస్తున్నారు. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..
సాక్షి, చెన్నై: ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడి కిరాతకం నామక్కల్‌లో వెలుగు చూసింది. బీహార్‌కు చెందిన ఓ యువతి నామక్కల్ వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్క డే పనిచేస్తున్న బాల్ రాజ్‌తో ఈమె పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయ మాటలు చెప్పి తన ఇంటికి బాల్‌రాజ్ తీసుకెళ్లాడు. చదవండి: (Lovers Commit Suicide: ప్రేమ జంట ఆత్మహత్య) కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే యత్నం చేసిన ఆమె మీద బాల్‌రాజ్ లైంగిక దాడి చేశాడు. అంతేకాదు, మిత్రులు ప్రదీప్, మనోజ్‌కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో స్పృహ తప్పింది. ఆందోళనతో ఆ ముగ్గురు ఉడాయించారు. అర్ధరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఆ ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. -
Tea: చాయ్ గరీబుకు విందురా భాయ్
జీవితంలో చాయ్ (టీ) ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా ఓ కప్పు చాయ్ కావాల్సిందే. దోస్తులు కలిసినా.. అతిథి వచ్చినా తేనీటి విందు తప్పనిసరి. భారత ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చ’ అనే పేరు పేట్టారంటే టీ ఎంతలా మనలో స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. జనంలో అత్యంత ఆదరణ ఉండడంతో టీని జాతీయ పానీయంగా గుర్తించారు. అయితే ఇక్కడ చాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ‘ఇంటర్నేషనల్ టీ డే’ కాబట్టి. సాక్షి, హైదరాబాద్: నాలుగో శతాబ్దంలో ఓ చైనా వైద్యుడికి కొంత సుస్తిగా ఉండగా, వైద్య పరీక్షల్లో భాగంగా కొన్ని ఆకులను తీసుకొని ఎండబెట్టాడు. వేడి నీటిలో వాటిని నానబెట్టగా వచ్చిన డికాషన్‌ను తాగాడు. దీంతో అతడు ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. ► 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టిట్టారు. అప్పటి నుంచి భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. ► 1860 నాటికి భారతదేశంలోని టీ ప్లాంటేషన్ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ టీ ఉత్పత్తి సుమారు 10లక్షల కేజీలు ఉండేది. నేడు పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ టీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చదవండి: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
స్నేహితులను కలిసి వస్తానని వెళ్లిన యువతి.. ఫోన్ స్విచ్చాఫ్..
సాక్షి, కుత్బుల్లాపూర్(హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన శ్రీను, నాగసత్యవేణి పెద్దకుమార్తె నాగరేవతి(20) ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సుచిత్రలోని ఓ దుస్తుల షాపులోని తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అలాగే చింతల్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న తన సోదరికి ఇచ్చేందుకు టిఫిన్‌బాక్స్ కూడా తీసుకు వెళ్లింది. కాగా చిన్నకుమార్తె ఫోన్ చేసిన తనకు టిఫిన్స్ బాక్స్ అందలేదని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాగరేవతి మొబైక్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన కారు.. ఒకరి మృతి.. మరో ముగ్గురు -
బాలిక అదృశ్యం.. ప్రియుడు, ఐదుగురు స్నేహితులు కలిసి..
సాక్షి, సుల్తాన్‌బజార్(హైదరాబాద్): సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలిక పై ఐదుగురు దుండగులు లైంగికదాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి గత నెల 30న వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబర్ 3న పోలీసులు బాలికను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా... తనకు తెలిసిన స్నేహితులతో కలిసి ఇంటినుంచి బయటకు వచ్చినట్లు ఆమె తెలిపింది. అయితే ఐదుగురు కలిసి మేడిపల్లి ప్రాంతంలో పలుమార్లు అత్యాచారం జరిపారని మైనర్‌బాలిక పోలీసుల విచారణలో వెల్లడించింది. మైనర్ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రహస్య జేబులో బంగారం శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం కువైట్ నుంచి జె9–1403 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అతడి ప్యాంటుకు ఉన్న రహస్య జేబులో 233.20 గ్రాముల బరువు కలిగిన రెండు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ.11.49 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి..
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జీపీఆర్ కొండపై ఆదివారం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ మిత్రుల ఐదవ ఆత్మీయ సమ్మేళనంలో నవ్వులు విరబూశాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని అక్కా..బా.. అంటూ గోదావరి యాసతో పలకరించుకున్నారు. గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ క్రియేటర్ ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. చదవండి: కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు చిన్నారులు ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులతో పాటు, ఫేస్బుక్ మిత్రులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్ర స్నాక్స్ వరకు సుమారు 40రకాల తెలుగు వంటకాలను ఫేస్బుక్ మిత్రులకు రుచి చూపించారు. చిన్నారులు, పెద్దలు వేసిన స్టెప్పులు అలరించాయి. డూప్ నాగార్జున, ఇతర డాన్సర్లు చేసిన డ్యాన్స్‌లకు ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. రేడియో జాకీ శీను మామ వ్యాఖ్యానం..చిన్నచిన్న పొడుపు కథలు..ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. గ్రూప్ క్రియేటర్ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదారోళ్ల సంప్రదాయాలు ఎప్పటికీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ఫేస్బుక్ మిత్రుల గ్రూపు ప్రారంభించామని అన్నారు. వివిధ లక్కీడిప్‌లు నిర్వహించి బహుమతులను అందించారు. అడ్మిన్ పేపకాయల లలిత, మోడరేటర్లు సరిత ఎం.బొల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి, బండారు ఆదివిష్ణు, చిలుకూరి విజయ్, కోపల్లె శేషగిరిరావు, నిభనుపూడి వాసుప్రసాద్, కేఎస్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. సుమారు నాలుగువేల మంది గ్రూపు సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. -
దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!
ఘజియాబాద్: కుల వివక్షత నేరం అని తెలిసి కూడా చాలా మంది కులం పేరుతో బడుగు బలహీన వర్గాలను దూషిస్తూనే ఉంటున్నారు. పైగా వాళ్లను అనేక రకాలుగా బాధపెడుతూ అవమానిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఘజియాబాద్‌లో జరిగింది. (చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!) అసలు విషయంలోకెళ్లితే... ఘజియాబాద్‌లో ఓ దివ్యాంగుడు తనపై చేసిన కులపరమైన దూషణలకు అభ్యంతరం చెప్పడంతో అతని స్నేహితులే అత్యంత పాశవికంగా హత్య చేసి చంపేశారు. ఈ మేరకు మృతుడి హర్బన్స్ నగర్ కాలనీలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని నగర సర్కిల్ ఆఫీసర్ అవినాష్ కుమార్ అన్నారు . పైగా నిందితులు ఆ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి, కత్తెరతో పొడిచి చంపడమే కాక మృత దేహాన్నిచెత్త కుప్పపై వేసి కాల్చేశారని వెల్లడించారు. ఈ మేరకు మృతిడి సోదరులు సందీప్, విశాల్ అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారని అన్నారు. అయితే ఆ సోదరులు కాలిపోయిన దుస్తులు అవి చూసి తమ సోదరుడిగా గుర్తించారని చెప్పారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక నిందితులు సౌరభ్, వివేక్, రవిలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం అని అన్నారు. అయితే సచిన్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) -
స్నేహితులతో కలిసి పిక్నిక్.. అక్కడ ఏం జరిగిందో శవమై తేలాడు
సాక్షి,బొబ్బిలి(విజయనగరం): మండలంలోని భోజరాజపురం వేగావతి నది దగ్గరకు పిక్నిక్ వెళ్లిన ఓ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. పట్టణంలోని ఐటీఐ కాలనీకి చెందిన డి.సంతోష్‌కుమార్ (16) స్నేహితులతో కలిసి పిక్నిక్ కు వెళ్లి నదీతీరంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. కాగా సంతోష్‌కుమార్ తండ్రి మధుసూదనరావు, బంధువులు మాట్లాడుతూ ఫిట్స్ వల్ల సంతోష్‌కుమార్ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు పాచిపెట: మండలంలోని చీపురువలస సమీపంలో ని పారమ్మకొండ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు పారమ్మకొండకు అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా ఆటో బ్రేకులు ఫెయిలవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ ఆటోను నియంత్రించే క్రమంలో ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వెంటనే 108 సహాయంతో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుల్లో నక్కాన అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ -
ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి..
సాక్షి, శిడ్లఘట్ట(కర్ణాటక): ప్రియునికి కాబోయే భార్యపై హత్యాయత్నం చేసిన యువతి జైలుపాలైంది. శిడ్లఘట్ట తాలూకా ఆనేమడుగు గ్రామానికి చెందిన గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. వీరిద్దరిని గంగరాజు (20) అనే యువకుడు గుట్టుగా ప్రేమించాడు. అయితే ఇటీవల మోనిక– గంగరాజుకు వివాహం నిశ్చయమైంది. ఇది తట్టుకోలేని గంగోత్రి ఆదివారం తెల్లవారుజామున చాకుతో దాడి చేయడంతో మోనిక చేతికి, మెడకు గాయాలయ్యాయి. దిబ్బూరహళ్లి పోలీసులు గంగోత్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!
బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో పేదలు జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది ఎన్జీవోస్, స్యచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిచడానికీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నిరుపేదలను ఆదుకునేలా బెంగళూరులోని నలుగురు స్నేహితులు సరికొత్త ఆలోచనతో ముందుకు రావడమే కాక కార్యాచరణలోకి తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. (చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట) ఈ మేరకు మెలిషా నొరోన్హా అనే ఆమె తన భర్త వినోద్ లోబో, తల్లి గ్లాస్గో, మరో ఇద్దరు స్నేహితులు నితిన్ కుమార్, విఘ్నేశ్‌తో సహా కలసి 2013లో పేద ప్రజల కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల దీనస్థిత చూశక వారికి క్లాత్ బ్యాంక్ అనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే తాము ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2021లో బెరటేన అగ్రహారంలో లవకుశ లే అవుట్‌లోని ఒక చిన్న డబల్ బెడ్రూం అపార్ట్మెంట్లో షాపును ప్రారంభించారు. అయితే ఈ షాపుకి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు బట్టలను విరాళంగా ఇచ్చారు. ఈ క్లాత్ బ్యాంక్‌లో పేదవాళ్లు తమకు నచ్చిన దుస్తులను ఎన్నుకోవచ్చు. పైగా వాటి ధర రూ.1 మాత్రమే. పైగా ఈ క్లాత్ షాపులోని క్లాత్‌లు అమ్మగా వచ్చిన డబ్బులను కూడా వారు నిరుపేద కుటుంబాల పిల్లల చదువు, వైద్య ఖర్చుల అవసరాలకు నిధులుగా సమకూరుస్తున్నారు. అంతేకాదు ఒక పేద కుటుంబం సంవత్సరానికి దుస్తులు కోసం రూ. 2000 ఖర్చు చేస్తున్నారు. అదే ఈ బ్యాంక్ ద్వారా వారికి డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈ మేరకు వినోద్, నితిన్ మాడుతూ.."2002లో మంగళూరులోని సెయింట్ అలోసియస్లో మా కాలేజ్ డేస్‌లోనే ఈ క్లాత్ బ్యాంక్ ఆలోచన ఉంది. మేము అప్పుడు కూడా మా స్నేహితు సాయంతో దుస్తులను సేకరించి పేదలకు పంపిణీ చేసేవాళ్లం." అని అన్నారు. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) -
ఇదంతా నీ కోసమే రా....ఇవన్నీ నీవే
పసిహృదయాల మనస్సులు ఎంతో నిర్మలంగా, అమాయకంగా ఉంటాయి. అంతేకాదు వాళ్లు తమ స్నేహితులు బాధపడుతుంటే పెద్దవాళ్ల కంటే వాళ్లే ఎక్కువగా చొరవ తీసుకుని భలే ఊరడిస్తారు. వాళ్లు ఒకరికొకరు వారికి తోచిన రీతిలో గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ భలే సరదాగా గడుపుతుంటారు. అచ్చం అలాగే ఇక్కడోక విద్యార్థి విషయంలో జరిగింది. అసలు ఎక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!) అసలు విషయంలోకెళ్లితే.....తమ స్నేహితుడి ఇల్లు అనుకోని ప్రమాదంలో కాలిపోతుంది. దీంతో అతని తోటి స్నేహితులు అతని బాధను మర్చిపోయాలా అతని మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అంతే తమ స్నేహితుడు క్లాస్‌రూంలోకి రాగానే వారంతా కొత్త కొత్త బొమ్మలను గిఫ్ట్‌గా ఇస్తారు. అంతేకాదు "ఇదంతా నీకోమే రా", "ఇవన్నీ నీకే" అంటూ అందరూ రకరకలా బొమ్మలతో క్లాస్ రూమ్‌ని నింపేస్తారు. దీంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి 'వావ్' అని గట్టిగా అరిచి ఆనందంగా వారిని కౌగిలించుకోవటానికీ రెండు చాతులు చాపుతాడు. దీంతో అతని స్నేహితులంతా ఒకేసారి అతన్ని కౌగిలించుకోవటానికి ఎగబడతారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను స్కూల్ డిస్ట్రిక్ట్ ఫిలడెల్ఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు ఈ వీడియో చూస్తే ఎవరి హృదయం అయినా ద్రవించిపోతుంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....) View this post on Instagram A post shared by Jay Shetty (@jayshetty) -
Viral Video: అరే ఇటు చూడండ్రా.. నన్నే వదిలేసి వెళ్లిపోతారేంట్రా?
-
వైరల్: ‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారు’
జీవితంలో నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఇతరులు చెప్పడం వల్ల తెలిస్తే మరికొన్ని సొంత అనుభవాల ద్వారానే బోధపడుతుంటాయి. కేవలం మనుషులతోనే కాదు, ప్రకృతి, జంతువుల ద్వారా కూడా బోలేడు విషయాలు నేర్చుకోవచ్చు.. తాజాగా అలాంటి ఓ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్న చీమలకు సంబంధించిన విషయం మావవ జీవితానికి ఎలా ముడిపడి ఉందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. చదవండి: ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ వీడియోలో మూడు చీమలు ఒక పెద్ద ఆకు మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ మూడింటిలోఒక చీమ కింద నుంచి సాయం చేస్తుండగా మిగతా రెండు చీమలు ఆకు పైకి ఎక్కేస్తుంటాయి. రెండు చీమలు ఆకు ఎక్కిన తరువాత వీటికి సాయం చేసిన చీమను మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాయి. దీనిని బెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశారు. చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ ‘ఇది ఇప్పటివరకు చేసిన అత్యంత బాధాకరమైన సినిమా’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 4 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. దీనిని చూసిన నెటిజన్లు చిన్న చీమల వీడియో వెనక పెద్ద జీవిత సత్యం దాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. చివరికి మిగిలిన చీమ పట్ల జాలిపడుతూ, ప్రస్తుతం మనుషులు కూడా ఇలాగే తయారయ్యారని పేర్కొంటున్నారు. మరికొంత మంది‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారే’ అంటూ ట్వీట్ చసస్తున్నారు. -
ఫ్రెండ్స్‌తో కలిసి స్టెప్పులేసిన వధువు.. వావ్ వాట్ ఏ డ్యాన్స్ అంటున్న నెటిజన్స్!
సోషల్‌మీడియాలోని నెటిజన్లకు ఎప్పుడు ఏ కంటెంట్ నచ్చుతుందో చెప్పలేం. అయితే నెట్టింట ఇటీవల వధువు, వరుడు డ్యాన్స్ వీడియోలు మాత్రం ఎక్కువగా వైరల్‌గా మారతున్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి మండపంలో చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట నిండిపోతున్నాయి. పైగా ఈ రోజుల్లో పెళ్లంటే డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. ఇందులో కొందరు మాత్రం తమ స్టెప్పులతో ప్రోషెషనల్ డ్యాన్స్ర్లను తలపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ( చదవండి: ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు.. ) తాజాగా ఓ పెళ్లిలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వధువు బాలీవుడ్ మూవీలోని ‘పప్పు క్యాన్ట్ డ్యాన్స్ సాలా’ పాటకి తన స్నేహితులతో కలిసి స్టెప్పులేసింది. ఆ వీడియోను కొరియోగ్రాఫర్ మహిమ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వధువు డ్యాన్స్‌తో పాటు తన ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు. కొందరు ఆమె డ్యాన్స్‌కి ఫ్యాన్స్‌గా మారిపోయమని, మరికొందరు వావ్ వాట్ ఏ డ్యాన్స్ అని కామెంట్లు పెడుతున్నారు View this post on Instagram A post shared by Wedding| Choreography | Dance (@choreographybymaheema) చదవండి: టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే! -
కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!
న్యూఢిల్లీ: మనం ఎక్కడికైన వెళ్తున్నప్పుడూ అనుకోకుండా ఎవరైన మనకు ఇష్టమైన స్నేహితులో, బంధువులో ఎదురైతే మన ఆనందానికి అవధులే ఉండవు కదా. అందులోకి మనకు మరింత ఇష్టమైన వాళ్లైతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ తల్లి కూతుళ్లు ఒక విమానంలో ప్రయాణిస్తుంటారు. (చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?) ఇంతలో తాను ప్రయాణిస్తున్న అదే విమానంలో వాళ్ల నాన్న పైలెట్‌గా రావడం చూసి ఒక్కసారిగా ఆ పాప డాడీ అని అరుస్తుంది. ఈ మేరకు ఆ పాప తల్లి నాన్న కూడా మనతో పాటే ఈ విమానంలోనే వస్తారని చెప్పడంతో ఐలవ్ యూ పప్పా అంటూ ఆనందంతో గెత్తులేస్తుంది. అయితే ఆ పాప తల్లి ప్రియాంక మనోహత్ ఈ సంఘటనను వీడియో తీసి నా చిన్నారి తల్లి షనాయ్ మోతిహర్కి ఈ వీడియో అంకితం అంటూ ట్యాగ్ లైన్ జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు చిన్నారి షెనాయ నాన్న చూడగానే ఎంతలా సంబరపడింది అని ఒకరు, ఇది ఒక అపరూపమైన ఘటం అని మరోకరు అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. (చదవండి: టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు) -
మరణంలోనూ వీడని స్నేహం..
సాక్షి,డోన్ టౌన్( కర్నూలు): వారిద్దరూ స్నేహితులు. గౌండా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు. రోజూ కలసి పనికి వెళ్లి వస్తున్న వీరిని సోమవారం మృత్యువు బలి తీసుకుంది. డోన్ పట్టణంలోని జెడ్పీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని వెంకటనాయునిపల్లె గ్రామానికి చెందిన బోయ చిన్న నాయుడికి ముగ్గురు కుమారులు కాగా రాజశేఖర్ (18) పెద్దోడు. పదో తరగతి వరకు చదివి గౌండా పని చేస్తున్నాడు. అలాగే ఇదే గ్రామానికి చెందిన శంకరమ్మ, శేఖర్ దంపతులకు కుమార్తెతో పాటు కుమారుడు శివకుమార్ (20) ఉన్నాడు. ఆరేళ్ల క్రితం శేఖర్ అనారోగ్యంతో మృతి చెందగా శివకుమార్ కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడేళ్లుగా రాజశేఖర్, శివకుమార్ గౌండా పనికెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. సోమవారం రాజశేఖర్ తన బంధువుకు చెందిన స్పోర్ట్స్ బైక్ తీసుకుని పనికొచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇద్దరూ బైక్‌పై గ్రామానికి వెళ్తుండగా.. అదే సమయంలో జెడ్పీ గెస్ట్ హౌస్ వద్ద సిమెంట్ దుకాణంలో అన్లోడ్ చేసేందుకు రివర్స్‌లో వస్తున్న లారీని గమనించక పోవడంతో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం శివకుమార్‌ను కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు యువకుల మృతితో వెంకటనాయునిపల్లెలో విషాదం అలుముకుంది. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నగేష్ తెలిపారు. చదవండి: పెళ్లయ్యి ఏడాది కాకముందే.. అబార్షన్ చేయించుకుందని! -
వ్యాపారి మధుసూదన్ రెడ్డి హత్యకేసు: ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్: వ్యాపారి మధుసూదన్ రెడ్డి కిడ్నాప్, హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారిని అతని స్నేహితులు గంజాయి మాఫియా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా, మధుసూదన్ రెడ్డి, సంజయ్, జగన్నాథ్‌లు కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి నుంచి రూ.40 లక్షలను సంజయ్ అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులకి డబ్బు తిరిగి ఇవ్వాలని సంజయ్‌పై మధుసూదన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో.. నిందితులు బీదర్‌లో డబ్బు ఇస్తామని చెప్పి కారులో కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో.. పాతబస్తీ సమీపంలో మధుసూదన్‌రెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సంజయ్ పోలీసులు విచారణలో తెలిపాడు . చదవండి: తోటి స్నేహితులే కిరాతకంగా హత్య చేసి.. ఆపై.. -
తోటి స్నేహితులే కిరాతకంగా హత్య చేసి.. ఆపై..
సాక్షి, దూద్‌బౌలి(హైదరాబాద్): డబ్బుల విషయంలో గొడవ కారణంగా తోటి స్నేహితులే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిద్దిపేటకు చెందిన మధుసూదన్‌రెడ్డి కర్మన్‌ఘాట్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పేట్లబురుజు ప్రాంతానికి చెందిన సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరితో అతడికి స్నేహం ఏర్పడింది. కొన్ని రోజులుగా మధుసూదన్‌రెడ్డికి సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరికి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్‌రెడ్డిని చార్మినార్ ప్రాంతానికి పిలిపించారు. సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరు అతడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి ఓ పొలంలో పాతిపెట్టారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి భార్య మధులతకు అనుమానం రావడంతో కుటుంబ సభ్యులతో వెళ్లి 20వ తేదీన చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుసూదన్‌రెడ్డి ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ మధులత ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లిలో స్నేహితులు ఇచ్చిన విచిత్ర బహుమతి..! వధువు షాక్
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైంది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఉన్నంతలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు. అయితే, పెళ్లికి వచ్చే స్నేహితులు, బంధువు మిత్రులు సైతం ఆ వివాహ వేడుక మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వివాహానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందటే.. వధూవరులిద్దరూ వేదికపై నిల్చోని ఉన్నారు. ఇంతలో వరుడు స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. ఇంతలో మరో స్నేహితుడు వధువుకు ఒక విచిత్ర బహుమతిని అందజేశాడు. అది ఓపెన్ చేసిన చూసిన వధువు షాక్ అవడంతో పాటు.. కోపంతో, ఆమె ముఖం తిప్పింది. ఎందుకంటే.. ఆ గిఫ్ట్ బాక్స్‌లో పాలసీసా ఉంది. అయితే స్నేహితులు చేసిన చిలిపి పనికి అక్కడ ఉన్నవారంతా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు అన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
ప్రాణ స్నేహితులు.. ప్రాణం పోయేప్పుడు కూడా కలిసే..
పిఠాపురం: వారిద్దరిదీ ఒకే ఊరు.. ఒకే వీధి.. ఒకే సామాజికవర్గం.. చిన్ననాటి నుంచీ ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. ఇద్దరిలో ఎవరి పనైనా కలిసే వెళతారు. మృత్యువులోనూ వారిది వీడని స్నేహబంధమైంది. కత్తిపూడి బైపాస్ రోడ్డులో వన్నెపూడి జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం గ్రామానికి చెందిన గండ్రెడ్డి మాధవరావు (48) రైతు. అదే గ్రామానికి చెందిన సిరగం వెంకటరమణ అలియాస్ శ్రీను (42) వ్యవసాయ కూలీ. వీరిద్దరూ చిన్ననాటి నుంచీ ప్రాణ స్నేహితులు. మంగళవారం ఉదయం తుని మండలం తలుపులమ్మ లోవకు మోటారు సైకిల్‌పై వెళ్లి, తిరిగి వస్తున్నారు. కత్తిపూడి బైపాస్ రోడ్డులో వన్నెపూడి జంక్షన్ వద్ద బైక్ ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరావు పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మాధవరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట రమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మృతితో ఏలేశ్వరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ముగ్గురిని చంపాడు.. చివరకు దోస్తుల చేతిలోనే హత్య
అనంతపురం క్రైం: నగరంలో ఆదివారం రాత్రి ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో స్నేహితులే అతన్ని మట్టుబెట్టారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన మేరకు.... నగరంలోని రాజమ్మ కాలనీకి చెందిన గుజిరీ వ్యాపారి ఖాదర్‌బాషా, ఖైరూన్‌బీ దంపతుల కుమారుడు షేక్ సికిందర్ బాషా అలియాస్ సీకే (31) టైల్స్ పనిచేసేవాడు. మద్యానికి బానిసైన సికిందర్ బాషా వైఖరి నచ్చక ఐదేళ్ల క్రితం అతని నుంచి భార్య విడిపోయింది. ఈ క్రమంలోనే సికిందర్ బాషా మరింత జులాయిగా మారాడు. తాగుడు కోసం ఇతరులను బెదిరించి డబ్బు వసూలు చేసుకునేవాడు. ఇందులో భాగంగానే డబ్బు ఇవ్వలేదన్న కసితో 2011లో అనంతపురంలోని గుత్తి రోడ్డులో జిలాన్బాషాని, 2020లో కనకదాసు విగ్రహం ఐదు లైట్ల కూడలిలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఖాదర్బాషాని, ఈ ఏడాది రియల్ ఎస్టేట్ వ్యవహారంలో బెంగళూరులో మరో వ్యక్తిని హతమార్చాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సికిందర్ 20 రోజుల క్రితం విడుదలై అనంతపురానికి వచ్చాడు. అనాలోచితం.. అనివార్యం.. సికిందర్‌కు అనంతపురంలోని కృష్ణదేవరాయనగర్‌కు చెందిన షెక్షావలి అలియాస్ బ్రూస్లీ, లింగమయ్య కొట్టాలకు చెందిన కుక్కల జిలాన్, అన్సర్, భవానీ నగర్ నివాసి అడపాల చంద్రశేఖర్ ప్రాణస్నేహితులు. వీరంతా మద్యం, ఇతర వ్యసనాలకు బానిసలు. వీరిలో బ్రూస్లీపై రౌడీషీట్, అడపాల చంద్రశేఖర్‌పై సస్పెక్ట్ షీట్ ఉన్నాయి. ఈ నెల 1న రాత్రి వీరంతా కలిసి గుత్తి రోడ్డులోని ఓ బార్లో మద్యం సేవించారు. అనంతరం రెండు బైక్‌లపై ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో వాణి రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే కుక్కల్ జిలాన్‌ను సికిందర్ తిట్టాడు. దీంతో అన్సర్ జోక్యం చేసుకుని ఎందుకు తిడుతున్నావంటూ ప్రశ్నించడంతో ఖాళీ బీరు బాటిల్‌తో అన్సర్ తలపై సికిందర్ కొట్టాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన స్నేహితులు అనాలోచితంగానే సికిందర్‌పై తిరుగుబాటు చేశారు. ఈ ఘటన మనసులో పెట్టుకుని తమపై ఎప్పటికైనా దాడి చేస్తాడని భావించారు. దీంతో రాయి, ఇటుక పెళ్లలతో సికిందర్‌పై దాడి చేశారు. ఓ పెద్ద బండరాయిని బ్రూస్లీ ఎత్తి సికిందర్‌పై వేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, 2021లో ఉమాశంకర్ అనే వ్యక్తిని ఇదే తరహాలో బండరాయి వేసి హత్య చేసిన కేసులో బ్రూస్లీ నిందితుడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
స్నేహమంటే ఇదేరా.. ఫ్రెండ్స్ అనిపించుకున్నారు..
ఖానాపురం: ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం సంపాదించాడు. ఏ లోటు లేకుండా కుటుంబాన్ని పోషించుకున్నాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే విధి ఆ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది. ఆ దంపతులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అయితే, కొంతమంది స్నేహితులు ఆ కుటుంబానికి సాయం అందించి.. స్నేహితుల దినోత్సవం రోజున స్నేహమంటే ఇదేరా అని నిరూపించారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బోడ పూల్‌సింగ్.. హైదరాబాద్‌లో 2002లో బీటెక్ పూర్తి చేశాడు. ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు అభినాష్, చరణ్ ఉన్నారు. 2018లో భార్య మంజుల అనారోగ్యంతో మృతిచెందింది. 2019లో పూల్‌సింగ్ గుండెపోటుతో మృతి చెందాడు. పిల్లలను పూల్‌సింగ్ తమ్ముడు చేరదీసి చదివిస్తున్నాడు. పూల్‌సింగ్ పిల్లలకు సాయం చేయాలని ఆయన బీటెక్ క్లాస్మేట్స్ నిర్ణయించుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్న 60 మంది మిత్రుల సహకారంతో రూ.10 లక్షలు సమకూర్చారు. ఆదివారం పూల్‌సింగ్ పిల్లలు అభినాష్, చరణ్‌లకు ఓడీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు చేతుల మీదుగా రూ.10 లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో స్నేహితులు దామోదర్‌రెడ్డి, శరత్‌బాబు, సుస్మిత, రఘు, శేఖర్, శ్రీకాంత్, కిరణ్, మేర్వాల్, అనిల్, అయ్యప్ప, హైమవతి, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
విషాదంగా మారిన ఫ్రెండ్షిప్ డే
నందిపేట్(ఆర్మూర్): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్(19), ఉదయ్(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. -
ఇందులో మీ ఫ్రెండ్ ఏ కేటగిరీనో చెక్ చేసుకోండి
Happy Friendship Day 2021: అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్నేహ ప్రవాహం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫేస్బుక్, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్సుల్లో ఫ్రెండ్షిప్ గొప్పదనం గురించి కొటేషన్లు, దోస్త్‌ల ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. రెగ్యులర్‌గా ఫ్రెండ్షిప్ విలువ చెప్పే కంటెంట్‌కు ఇవాళ ఫుల్ గిరాకీ ఉంటుంది. అది చూసి కొందరికి ‘వావ్’ అనిపించొచ్చు.. మరికొందరికి ‘అబ్బో’ అనిపించొచ్చు. కానీ, ఎవరెన్ని అనుకున్నా స్నేహం అంటే.. . . . . . . . . . . ఒక కచ్చితమైన అవసరం. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ది బెస్ట్’, ‘స్నేహాన్ని మించిది లేదు’.. ఇలాంటి కొటేషన్స్ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సింగిల్ కింగ్‌లైనా ఉంటారేమోగానీ.. ఫ్రెండ్ లేని మనిషి అరుదనే చెప్పాలి. జీవితంలో ఎవరితో షేర్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యే విషయాల్ని కూడా.. చివరికి ఏదో ఒక ‘బలహీన’ సందర్భంలో చెప్పుకునేది స్నేహితుడికే!. అలాగని మిగతా బంధాలను తక్కువేం చేయదు స్నేహ బంధం. అయితే స్నేహాల్లోనూ రకరకాలుంటాయి. అలాగే స్నేహితుల్లో రకరకాల మనస్తత్వాలవాళ్లూ ఉంటారు. అందుకే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీలోని ఆ జానర్ల గురించి సరదాగా చర్చించుకుందాం. పక్కా కమర్షియల్ స్నేహంలో అవసరం ఉండొచ్చు. కానీ, స్నేహాన్ని పూర్తి అవసరంగా మార్చుకునేటోళ్లూ ఉంటారు. మనిషిని అమితంగా ఆకర్షించే నెగెటివిటీ వల్ల చాలామందికి స్నేహం మీద కలిగే భావనే ఇది. అఫ్కోర్స్.. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఈ లోకంలో అన్నింటి కన్నా మిన్న అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. చివరికి డబ్బు-అంతస్థుల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు తడబడుతుంది స్నేహం. టార్చర్ స్నేహం వీళ్లు ప్రాణ స్నేహితులంటూ చెప్తుంటారు. ఊరంతా ప్రచారం చేస్తారు. వీళ్ల మాటలు కోటలు దాటుతాయి. కానీ, పక్కలోనే ఉంటూ పోటు పోడుస్తుంటారు. నస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే వీళ్ల స్నేహంలో ఒక స్వచ్ఛత ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. అవసరాల్లోనే కాదు.. ఆపదలోనూ వదలుకోలేని బలహీనత కనిపిస్తుంటుంది వీళ్ల స్నేహంలో. అందుకే ‘ఫ్రెండ్‌వి రా’ అనుకుంటూ కలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఏజ్‌లెస్ దోస్తులు ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. కానీ, స్నేహానికి వయసుతో సంబంధం ఉండదని మరో నిజం. ఇది నిరూపించే దోస్తులు మన చుట్టూరానే.. మనలోనే కనిపిస్తుంటారు. కలిసి సరదాలు చేస్తారు. గోలలు చేస్తుంటారు. కలిసే గోతిలో పడుతుంటారు. వాళ్ల స్నేహం వాళ్లకే కాదు.. అవతలి వాళ్లకూ ఎంటర్టైన్మెంట్ పంచుతుంటుంది. అవసరానికో స్నేహం ప్రతీ ఫ్రెండూ అవసరమేరా అనే కొటేషన్ తెలుసు కదా!. అలాగే ఈ రకం స్నేహంలో అవసరం తీరేంత వరకే స్నేహం కొనసాగుతుంది. ఆ అవసరంలో ఉన్నంత దాకా వీళ్లు వెంట నడుస్తారు. అవసరమైతే సాయం చేస్తారు. తీరా.. తమ అవసరం పూర్తిగా తీరాక హ్యాండిచేస్తారు. అపార్థాలు, అవమానాలు, అనుమానాల నడుమ ఇలాంటి స్నేహాలు కలకాలం కొనసాగడం కొంచెం కష్టమే!. ప్రాణ స్నేహితులు ఈ స్నేహం చాలా చాలా ప్రత్యేకం. చిన్న వయసు నుంచి మొదలై చివరిదాకా సాగే అవకాశాలే ఎక్కువ. ఈ స్నేహంలో రాగద్వేషాలు కనిపించేది అతితక్కువ. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేంత స్థాయి వీళ్లలో ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు స్నేహాన్ని విడిచిపెట్టవు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢబంధం వీళ్లది. పైగా ఎలాంటి తారతమ్యాలు లేనిది ఈ స్నేహం. అందుకే ‘చిలకా-కోయిల’లా కలకలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఇలాంటి స్నేహంలో నడివయసులో పుట్టి కడదాకా సాగే స్నేహ బంధాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. లవ్లీ ఫ్రెండ్స్ అవతలి వాళ్లకు ఇదొక చిల్లర-చిచ్చర స్నేహం అనిపించొచ్చు. కానీ, వాళ్ల స్నేహంలో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. వాళ్ల ఆనందం వాళ్లదే. అవతలి వాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. పోటాపోటీగా ఒకే అమ్మాయికి బీట్ కూడా కొడతారు. బడి నుంచి గుడి దాకా, రూమ్ నుంచి ఇంటి దాకా ప్రతీ విషయం చర్చించుకుంటారు. అవసరాలకు సాయం ఒకరికొకరు చేసుకుంటారు. కెరీర్ ఎదుగుదలకు వీళ్ల ప్రోద్భలం ఉంటుంది. అందుకే ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్నేహమే!. ఇంటి స్నేహం స్కూల్, కాలేజీలు, ఆఫీసులు.. ఫ్రెండ్స్ అంటే ఇక్కడే దొరుకుతారా?. మనసు పెడితే ఇంట్లోనూ ఇంతకన్నా బలమైన స్నేహమే దొరుకుతుంది. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, బావాబామ్మర్ది, మామాఅల్లుడు, తాతామనవడు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బంధాలు స్నేహ బంధాలుగానూ మార్చుకోవచ్చు. సంతోషమొచ్చినా.. దుఖమొచ్చినా వాళ్లతో పంచుకుని మనసు కుదుటపర్చుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో అపార్థాలకు చోటు ఉండని ఏకైక స్నేహం.. ఇంటి స్నేహమే! వాట్సాప్ బ్యాచ్ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటారు. సంవత్సరాల దొర్లిపోయే దాకా గుర్తుండరు. సడన్‌గా గుర్తుకొస్తారు. ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. అడ్డగోలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారు. అయితే మెసేజ్‌ల వరద.. లేదంటే గప్‌చుప్. ఇలాంటి స్నేహితులు గెట్ టు గెదర్‌లోనే కలిసేది. చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా. ‘గుర్తుకొస్తున్నాయి..’ అంటూ రీయూనియన్లలో సందడి చేసే బాపతి అన్నమాట. అఫ్కోర్స్.. బిజీ, టైం లేదంటూ కలయికను ఎగ్గొట్టి స్నేహితుల రోజున ఉప్పెనలా మెసేజ్‌లు పెట్టే దోస్తులు చాలామందే ఉన్నారండోయ్. ఇవేకాదు.. ఇంకా చాలా రకాల స్నేహాలే ఉంటాయి. అయితే నవ్వినా, తిట్టినా, ఏడ్పించినా, జోకులేసుకున్నా, చివరికి మోసానైనా తట్టుకుని నిలబడేది ఒక్క స్నేహమే. ఎంత చెప్పుకున్నా దూరాలను దగ్గర చేసే స్నేహం అంతిమంగా గొప్పదే. అందుకే ఆ బంధాన్ని గౌరవిస్తూ ఈ రోజును గుర్తించడం, అనుభవాలేవైనా అప్పటిదాకా జీవితంలో తారసపడిన రకరకాల స్నేహాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం తప్పేం కాదు. చివరగా.. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. ఒకేసారి ఆత్మహత్య
సాక్షి, అద్దంకి: ఇద్దరు స్నేహితులు వేర్వేరు సమస్యలతో ఒకేసారి.. ఒకే చోట మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండలంలోని ధర్మవరంలో బుధవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాల శ్రీను (38)కు బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన అంకమ్మతో పదహారేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అంకమ్మ ఆరేళ్ల క్రితం భర్తను వదిలేసి కుమార్తెతో పుట్టింట్లో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన మేడగం పాపిరెడ్డి(55)కి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పెళ్లయిన కుమారులు ఉన్నారు. పాపిరెడ్డికి 10 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వ్యవసాయం కలిసి రాక నష్టాలు రావడం.. సంపాదన కోసం చేసిన ఇతర వ్యాపారాలు అచ్చిరాక అప్పులు పాలయ్యాడు. పొలం అమ్మి అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యులు ససేమిరా అన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య పాపిరెడ్డి, శ్రీను స్నేహితులు కావడంతో బాధలను ఒకరికొకరు చెప్పుకుంటూ కలిసి తిరుగుతుండే వారు. ఈ క్రమంలో ఇద్దరూ బైకుపై తెల్లవారు జామున గ్రామంలో చక్కర్లు కొట్టారు. తెల్లవారిన తర్వాత ఊరి పొలిమేరల్లోని చెరువు గట్టు వద్ద ఒకరి పక్కన ఒకరు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీన్ని గ్రామస్తులు గమనించి 108కి ఫోన్ చేశారు. సిబ్బంది అక్కడి చేరుకునేలోపే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల భార్యలు, అంకమ్మ, ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లుౖ ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వధువుకి వరుడి స్నేహితుల సర్ఫ్రైజ్ గిఫ్ట్; కోపంతో నేలకేసి కొట్టింది!
వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో వరుడు స్నేహితులు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో ఊహించని విధంగా ఇబ్బందికరమైన వస్తువు ఉండటంతో వెంటనే కోపంతో దాన్ని బయటకు విసిరేస్తుంది. మరి వరుడు స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లిపోదాం.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వధూవరులిద్దరూ పెళ్లి వేదికపై కూర్చొని ఉంటారు. అంతలోనే అక్కడకు పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చి నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతారు. అలాగే ప్యాక్ చేసి ఉన్న ఓ గిఫ్ట్‌ను సరదాగా వధువుకి అందిస్తారు. గిఫ్ట్‌ను పెళ్లి కూతురు అక్కడే తెరిచి చూడగా అందులో చిన్న పిల్లలకు పాలు తాగించే బాటిల్ ఉంటుంది. తనకిచ్చిన ఫన్నీ గిఫ్ట్ నచ్చకపోవడంతో వెంటనే దాన్ని వధువుకు విసిరేసింది. దీనిని చూసిన అక్కడి వారంతా పడిపడి నవ్వుతూనే.. మళ్లీ అదే బాటిల్ ఉన్న గిఫ్ట్‌ను వధువుకివ్వడంతో ఈసారి వధువుకు చిర్రెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పక్కన ఉన్న మరో మహిళా ఆ వస్తువును వెంటనే లాక్కుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో బంటి ఠాగూర్ అనే వ్యక్తి పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ పోస్టుకు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘ప్రతి ఒక్కరిని గౌరవించాలి. సరదా కోసం ఎవరిని హర్ట్ చేయొద్దు’ అంటూ నెటిజన్లు హితవు పలుకున్నారు. -
FriendsReunion: ఆర్టిస్టులతో పాటు ఫ్యాన్స్ కంటతడి
ఆరు మెయిన్ క్యారెక్టర్లు, పది సీజన్లు, 236 ఎపిసోడ్లు.. పదేళ్లపాటు స్నేహంలోని రకరకాల భావోద్వేగాలను అందించి నవ్వించింది ఫ్రెండ్స్ టీవీ సిరీస్. ఇప్పుడు మళ్లీ రీయూనియన్ ఎపిసోడ్‌తో సంచలనాలకు తెరతీసింది. ఫ్రెండ్స్ : ది రీయూనియన్ పేరుతో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌కి గ్లోబల్ వైడ్‌గా భారీ స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్ పాత అల్లర్లను గుర్తు చేసుకుంటూ చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. 1994 నుంచి 2014 దాకా అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఫ్రెండ్స్ సిట్కామ్(సిచ్యుయేషనల్ కామెడీ). ఆరుగురు స్నేహితులు, వాళ్ల మధ్య లవ్ బ్రేకప్, అల్లరి, గొడవలు.. అంతిమంగా స్నేహాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలతో సరదాగా సాగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ టీం మళ్లీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జెన్నిఫర్ అనిస్టన్, కోర్టెనె కాక్స్, లీసా కుడ్రో, మాట్ లెబ్లాంక్, మాథ్యు పెర్రీ, డేవిడ్ ష్విమ్మర్.. అదే ఆర్టిస్టులు, అదే టెక్నికల్ టీం.. ఈ రీయూనియన్ కోసం పనిచేశారు కూడా. గెట్ టు గెదర్గా వచ్చిన ఈ ఎపిసోడ్‌ను బెన్ విన్స్టన్ డైరెక్ట్ చేశారు. మన దగ్గర జీ5 ఈ రీయూనియన్‌ను టెలికాస్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియా అకౌంట్లలో #FriendsReunion రికార్డు స్థాయి ట్వీట్లతో దూసుకుపోతోంది. ఆరుగురు లీడ్ క్యారెక్టర్లు ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. సెట్లో ఆనాటి జ్ఞాపకాలన్నింటిని ఉంచారు. బిహైండ్ సీన్స్‌తో నవ్వులు విరిశాయి. అభిమానుల ప్రశ్నలకు సరదా జవాబులు ఇచ్చింది ఫ్రెండ్స్ టీం. ఇక రీయూనియన్ పట్ల ఆ ఆర్టిస్టులు భావోద్వేగానికి లోనుగాక.. అది చూసి అభిమానులు ఫీలవుతున్నారు. VIDEO: Lady Gaga performs “Smelly Cat” with “Phoebe” #FriendsReunionpic.twitter.com/Rf3pQkfNPU — GAGAIMAGES (@gagaimages) May 27, 2021 కళ్లు చెదిరే డీల్ ఫ్రెండ్స్ రీయూనియన్ ఎపిసోడ్లో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కనిపించారు. లేడీ గాగా, బీటీఎస్, జస్టిన్ బీబర్, డేవిడ్ బెక్‌హమ్, జేమ్స్ కార్డన్.. ఇలా కొందరు కనిపించారు. ఫ్రెండ్స్ టీంతో సరదాగా అల్లరి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం భారీగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 1996లో ఫ్రెండ్స్ ఆర్టిస్టుల ఒక్కొక్కరి రెమ్యునరేషన్ 22,500 డాలర్లు ఉండేది. ఇప్పుడు రీయూనియన్ కోసం ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు మిలియన్ల డాలర్లు తీసుకున్నట్లు హాలీవుడ్ వెబ్‌సైట్స్ కథనాలు ప్రచురించాయి. అలాగే మొన్నటిదాకా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఫ్రెండ్స్ ఎపిసోడ్స్‌ను 425 మిలియన్ డాలర్ల చెల్లించి హెచ్‌బీవో కొనుక్కుంది. ఈ రీయూనియన్ స్ట్రీమింగ్‌లో మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. -
వావ్.. మీ మానవత్వానికి హ్యాట్సాఫ్
జైపూర్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని ప్రభావానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కాగా, ఇప్పటికే అనేక ఆసుపత్రులలో కరోనా బాధితుల తాకిడి ఎక్కువైంది. వారికి సరైన బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు సదుపాయం కల్పించలేక చాలా ఆసుపత్రులు ఇప్పటికే చేతులేత్తాశాయి. ఇదిలా ఉండగా, కరోనా బాధితులను ఆసుపత్రులకు చేర్చే అంబులెన్స్‌ల కోరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. కాగా ఈ కష్టకాలంలో కొంత మంది ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ డబ్బులను వసూలు చేస్తూంటే మరోవైపు కొంత మంది కరోనా బాధితులకు తమ కున్న పరిధిలో సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వివరాలు.. రాజస్తాన్‌లోని కోటా నగరానికి చెందిన అయిదుగురు మిత్రులు తమ లగ్జరీ కార్లను కోవిడ్ అత్యవసర ఆసుపత్రిగా మార్చారు. కాగా, కోటా పట్నంలో కార్ సర్వీస్ సెంటర్ ను నిర్వహించే చందేష్ గుహిజా తన చుట్టు ఉన్న ప్రజలకు ఆక్సిజన్ కోసం పరుగెత్తడం చూసి చలించిపోయాడు. వెంటనే తన మిత్రులు ఆశిష్‌సింగ్, భారత్ సమ్నాని, రవికుమార్ లతో పంచుకున్నాడు. వీరంతా కలసి బాధితుల కోసం ఏదైనా సహయం చేయాలనుకున్నారు. వారి ఆలోచనను వెంటనే అమలులోకి తీసుకొచ్చారు. వెంటనే, వారి మూడు లగ్జరీకార్లను అత్యవసర ఆసుపత్రిగా మార్చేశారు. దీనిలో బెడ్, ఆక్సిజన్, మందులు, ఇతర సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న మరో రెండు కార్లను అంబులెన్స్‌గా మార్చారు. వీటిల్లో ఆక్సిజన్ కిట్ కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని కోసం ప్రతిరోజు రూ. 5000 నుంచి 7000 వేల వరకు ఖర్చువుతుందన తెలిపారు. తమ కారులో అమర్చిన ఒక సిలెండర్‌తో ముగ్గురు రోగులకు ఆక్సిజన్‌ను అందించగలదని తెలిపారు. గడచిన 10, 12 రోజుల నుంచి రోగుల కుటుంబాలకు ఉచితంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు ఉచితంగా చేర్చే వాహనాల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. కాగా, తమ సేవలను కోరుకునేవారి కోసం కొన్ని నెంబర్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మీ మానవత్వానికి హ్యట్సాఫ్.. మీ ఆలోచన బాగుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, గతంలో రాంచీకి చెందిన ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన ఆటోను కరోనా బాధితుల కోసం అంబులెన్స్‌గా మార్చిన సంగతి తెలిసిందే. -
మాట్లాడదామని తీసుకెళ్లి గొంతుకోశారు..
సాక్షి,బళ్లారి(కర్ణాటక): మాట్లాడే పని ఉందని చెప్పి ఇంటివద్ద ఉన్న యువకుడిని స్నేహితులు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హత్య చేసిన ఘటన బళ్లారి నగరంలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించించింది. వివరాలు... బ్రూస్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని మిల్లర్‌పేట సమీపంలో ఇస్మాయిల్(19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు యువకులు ఇంటివద్దకు వచ్చి ఇస్మాయిల్‌ను వెంట తీసుకెళ్లారు. వచ్చింది స్నేహితులే కదా అని ఇంట్లోవాళ్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కణేకల్లు బస్టాండ్ వద్ద వాగ్వాదం.. ఇస్మాయిల్‌ను వెంట తీసుకెళ్లిన నలుగురు యువకులు కణేకల్లు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇస్మాయిల్‌తో వాగ్వాదానికి దిగి గొడవ పడ్డారు. అనంతరం కత్తితో గొంతుకోసి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వచ్చి రక్తపు మడుగులో విగతజీవిగా మారిన ఇస్మాయిల్‌ను చూసి రోదించారు. బ్రూస్‌పేట పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలించి ఒకరిని అరెస్ట్ చేశారు. భర్త చేతిలో భార్య హతం.. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే చంపిన భర్త ఉదంతమిది. బళ్లారి నగరంలోని తాళూరు రోడ్డులో మస్తాన్‌రెడ్డి, ధనలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అతను కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని, కోవిడ్ పరీక్షలు చేయించుకుందామని చెప్పి ఆదివారం రాత్రి భార్యను కువెంపునగర్ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ తలపై బండరాయి వేసి హత్యచేశాడు. అనంతరం కౌల్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’
భీమునిపట్నం: కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న వేళ ఇక్కడ నేరెళ్లవలస కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి ఎవరూ రావద్దని బుధవారం బ్యానర్ కట్టారు. బంధువులు, మిత్రులు, ఎవరు రావద్దని అందులో రాశారు. ‘మనకు మొహమాటం ఉన్నా కరోనాకు లేదు’ అని బ్యానర్‌పై రాసి ఇలా ఇంటి ముందు పెట్టాడు. చదవండి: హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు -
ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..
సాక్షి, హైదరాబాద్: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నాగరపల్లి గ్రామానికి చెందిన అశోక్, రమాదేవి దంపతులు మియాపూర్ టీఎన్ నగర్లో నివాసం ఉంటున్నారు. అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సింధే సుదీప్‌కుమార్ (18) ఉన్నారు. సుదీప్ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఉండటంతో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ రోజూ అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఇదిలా ఉండగా, సుదీప్ బుధవారం రాత్రి హైటెక్ సిటీ హోటల్‌కు వెళ్దామని తన స్నేహితులను పట్టుపట్టగా, ఈ సమయంలో వద్దని వారించడంతో వారితో గొడపడ్డాడు. రాత్రి ఒంటి గంటకు స్నేహితులు అతడిని ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపు స్నేహితులతో ఫోన్లో చాట్ చేసిన సుదీప్ ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు తల్లి లేచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మైనర్‌పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. ) -
వ్వావ్! ఫ్రెండ్ షిప్ అంటే ఈ పిల్లులదే..
మీరు ఊసరవెల్లి సినిమాలో ‘లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్’ అనే పాటను వినే ఉంటారు. ఈ ప్రేమలు మనుషుల్లోనే కాకుండా జంతువుల మధ్యలోనూ ఉంటాయి. ఇప్పటికే.. వీటికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఇంటి యజమాని తమ పిల్లుల ముందు గిన్నెలో ఆహరం పెట్టాడు. అయితే అవి రెండు ఏ మాత్రం కొట్టుకోకుండా, ఆహరాన్నిఒకదానికి మరొకటి సహయం చేసుకుంటూ తిన్నాయి. దీనిలో ‘ఒక పిల్లి తను ఆహరం తిన్న తర్వాత.. ఆ గిన్నెను ఎదురుగా ఉన్న మరో పిల్లి ముందు జరిపింది. ఆ రెండో పిల్లి కూడా ఆహరం తిన్నాక తిరిగి మొదటి దాని ముందుకు గిన్నె జరిపింది. ఇలా అవి రెండు ఆహరాన్ని కిందపడేయకుండా తిన్నాయి. షైయిల్డ్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వాట్ ఎ కేరింగ్.. షేరింగ్’..‘క్యూట్ క్యాట్స్’...‘మీ ఫ్రెండ్షిప్కి హ్యట్సాఫ్’..అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
రాజీకని పిలిచి.. స్నేహితులే దారుణంగా
సాక్షి, నెల్లూరు : తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే అనుమానంతో రాజీకని పిలిచి ఓ యువకుడ్ని స్నేహితులే దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన బుజబుజనెల్లూరులోని మురళీ జ్యూవెలరీషాపు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...చెన్నైకు చెందిన మురగన్ భాస్కర్(25) తన తండ్రిని హత్య చేశారన్న అక్కసుతో పదిహేనేళ్ల వయస్సులోనే హత్యచేసి జైలు జీవితం అనుభవించాడు. పదేళ్ల కిందట నెల్లూరుకు వచ్చాడు. బుుజబుజనెల్లూరు న్యూకాలనీలో ఉంటూ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడసాగాడు. అతనిపై నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్లో దొంగతనం కేసు ఉంది. భాస్కర్‌కు బుుజబుజనెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన వెంకటేష్, దేవ, ఆరీఫ్, రసూల్ స్నేహితులు. వారం రోజుల క్రితం వెంకటేష్, దేవ ఆరుబయట మద్యం, గంజాయి సేవిస్తుండగా ఎవ్వరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మందలించి పంపివేశారు. అయితే పోలీసులకు భాస్కరే సమాచారం అందించాడన్న అనుమానం వారిలో బలంగా నాటుకుపోయింది. ఎలాగైనా భాస్కర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వెంకటేష్ తన స్నేహితులైన దేవా, అన్సర్, రసూల్, మరో వ్యక్తిని ఓ దుకాణం వద్ద ఉండమని చెప్పి రాజీచేసుకుందామని భాస్కర్‌ను పిలిచాడు. దీంతో భాస్కర్ తనతో సహజీవనం చేస్తున్న మహిళ ఇంటికి సమీపంలోని మురళీ జ్యూవెలరీషాపు వద్దకు వెళ్లారు. వెంకటేష్, అతని తల్లి అక్కడకు చేరుకోగా ఇరువర్గాలు మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో వెంకటేష్ సైగ చేయడంతో మిగిలిన వారు అక్కడకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో భాస్కర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, నగర ఇన్చార్జి ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, వేదాయపాళెం ఎస్సైలు లక్ష్మణ్‌రావు, పుల్లారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ఘటనా స్థలంలోని మహిళలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సోపతుల సోషల్ వార్.. చీలుతున్న స్నేహితులు
వారంతా స్నేహితులే.. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు, ఎక్కడ ఉన్నా నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా ‘టచ్’లో ఉండే వ్యక్తులే... జీవన ప్రయాణంలోని ఘట్టాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ పోస్టులు, లైక్‌లు, షేర్లు, కామెంట్లతో పలకరించుకొనే వారే... కానీ అంతటి ఆప్తమిత్రులు కూడా గత కొన్ని వారాలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బద్ధ విరోధులుగా మారిపోయారు! ముఖ్యంగా రైతుల ఉద్యమం, పెట్రోల్ ధరలు, గ్యాస్ సబ్సిడీ, బడ్జెట్ కేటాయింపులపై అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు!! తమ మనోభావాలకు అద్దంపట్టేలా చురుక్కుమనిపించే డీపీ (డిస్ప్లే పిక్చర్), షాకిచ్చే వాట్సాప్ స్టేటస్‌లను లోకానికి తెలియజేస్తూ చెలరేగిపోతున్నారు. సాక్షి, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గత కొన్ని నెలలుగా రైతులు చేపడుతున్న నిరసన ఇప్పుడు జాతీయ స్థాయిలోనేగానే కాక అంతర్జాతీయ అంశంగా మారింది. వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా ట్వీట్ చేయడంతో దేశంలోని స్టార్లు రంగంలోకి దిగారు. దీంతో వారి అభిమానులు కూడా వాటిని రీ ట్వీట్లు, షేర్లు, లైక్‌లు, డిస్‌లైక్‌లు కొడుతూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అనుకూలంగా వీడియోలు, మీమ్స్ రూపొందిస్తూ క్షణాల్లో వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇక్కడ అనుకూల, వ్యతిరేక వర్గాల్లో వీటికి మంచి ఆదరణ రావడం గమనార్హం. రాత్రీపగలు వాదోపవాదాలు... కొన్ని వారాలుగా వాట్సాప్ గ్రూపుల్లో మిత్రులు అనుకూల, వ్యతిరేక ఆధారాల (ఆయుధాల)ను టైమింగ్‌తో ప్రయోగిస్తున్నారు. తమ వాదనే సరైందని చాటిచెప్పేందుకు వీడియో లింకులు, స్క్రీన్ షాట్లు, న్యూస్ క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంకొందరు స్టిక్కర్లతో వెక్కిరిస్తున్నారు. ఈ వాట్సాప్ యుద్ధాలు తెల్లవారకముందే మొదలై.. అర్ధరాత్రి అయినా ఆగట్లేదు. సున్నిత మనస్కులతో తస్మాత్ జాగ్రత్త..! సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సాగిస్తున్న వాదోపవాదాలు కొన్నిసార్లు గతి తప్పుతున్నాయి. తాము అభిమానించే వ్యక్తి, సంస్థ, పార్టీ, వ్యవస్థలను ఇతరులు విమర్శిస్తుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో బెదిరింపులు లేదా భౌతిక దాడులకు దిగేందుకు సైతం వెనుకాడక సామాజిక సంబంధాలను చేతులారా దెబ్బతీసుకుంటున్నారు. ఇంకొందరేమో మనసు పాడుచేసుకుంటూ కుంగిపోతున్నారు. ఆ కోపాన్ని ఇంట్లో, ఆఫీసులో ప్రదర్శిస్తూ వారికి వారే నష్టం చేసుకుంటున్నారు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ అంశాలను పంచుకోవడం వరకు పరిమితమైతే చాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. వివాదాస్పద చాటింగ్‌లు, పోస్టులు వ్యక్తిగత జీవితాన్ని కటకటాల పాలుజేసి, కుటుంబాలను కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారితో వాదనలకు దిగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కంపెనీలు గమనిస్తుంటాయి సోషల్ మీడియాలో విరుచుకుపడే వారిలో అధిక శాతం మంది ముసుగు వీరులే. నిజ జీవితంలో వారు అంత ధైర్యవంతులు కాదు. అందుకే వారి అసంతృప్తిని ఎదుటివారిపై వెళ్లగక్కుతుంటారు. లోకంలో ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ వైరుధ్యాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. అంతేకానీ వ్యక్తిగతంగా కోపాన్ని ప్రదర్శించవద్దు. ముఖ్యంగా యువతకు ఇది మంచిది కాదు. అవతలి వారిపై మాటల దాడి చేస్తున్నామనుకుంటున్నా.. మీ అసలు రూపా న్ని సోషల్ మీడియా ముందు పెడుతున్నారన్న సంగతి మరువద్దు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఉద్యోగం ఇచ్చే కంపెనీలు మీ సోషల్ ఖాతాలనూ గమనిస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. – వీరేందర్, సైకాలజిస్టు ప్రపంచవ్యాప్తంగా సోషల్ లెక్కలు... (అంకెలు: ప్రతి నిమిషానికి) ఫేస్బుక్ ఫొటోలు: 1,47,000 ఫేస్బుక్ షేర్స్: 1,50,000 వాట్సాప్ చాట్: 4,16,66,667 ఇన్స్టాగ్రామ్ పోస్టులు: 1,38,889 ఇన్స్టాగ్రామ్ చాట్స్: 3,47,222 టిక్‌టాక్: 2,704 యూట్యూబ్ వీడియోలు: 500 గంటలు ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగదారులు: 457 కోట్లు (సోర్స్: యూఎస్ కేంద్రంగా నడిచే డొమో కంపెనీ ‘డేటా నెవర్ స్లీప్స్ 8.0’పేరిట ఇటీవల విడుదల చేసిన గణంకాలు) -
రూ. 400 అప్పు.. స్నేహితుడి హత్య
ముంబై : తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానే జిల్లా, ఉల్హాస్‌నగర్‌కు చెందిన సోను, ఫాహిమ్ ఓ జీన్స్ తయారీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఫాహిమ్, సోను దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు తీర్చడానికి ఫాహిమ్ సుముఖత చూపలేదు. ( పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు!) దీంతో తరచుగా స్నేహితులిద్దరికీ గొడవలయ్యేవి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గొడవైంది. సోను, ఫాహిమ్‌ను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మృత్యువు ఒడిలోకి ముగ్గురు స్నేహితులు
సాక్షి, దెందులూరు (పశ్చిమ గోదావరి): జాతీయ రహదారిపై దెందులూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. గుండుగొలనులోని రామాలయం వీధికి చెందిన బాలిన నరేంద్ర (25), పరసా రామకృష్ణ (25), వెలివల గాంధీ (25) స్నేహితులు. రామకృష్ణకు బొలెరో వాహనం ఉండగా, నరేంద్ర, గాంధీ ఆప్టింగ్ డ్రైవర్లు. మంగళవారం రాత్రి వీరు బోలెరో వాహనంలో ఏలూరు వెళ్లి అనంతరం తిరుగుప్రయాణమయ్యారు. దెందులూరు వద్ద పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి వాహనం టైరు పంక్చరైంది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి రోడ్డులో హైదరా బాద్ వెళుతున్న ఇంద్ర బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై డి.రామ్‌కుమార్, ఆర్టీసీ డీఎం సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికి తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. భోజనానికి వస్తారని ఎదురుచూస్తున్నాం.. ‘భోజనానికి వస్తామని ఫోన్ చేశారు. భోజనం సిద్ధం చేశాం. ఇంకా రాలేదని ఎదురుచూస్తుండగా విషాద వార్త విని హతాశులయ్యాం. బిడ్డల మృతి కడుపు కోతను మిగిల్చింది’ అంటూ వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణ ఇంటిలోని వ్యాన్ తాళం తీసుకుని బయటకు వెళ్తూ వెంటనే వచ్చేస్తాను, భోజనం రెడీగా ఉంచమ్మా అంటూ పరసా రామకృష్ణ అనగా, బాలిన నరేంద్ర భోజనం వద్ద కూర్చున్నవాడే లేచి వెళ్లిపోయాడు. గాంధీ కూడా భోజనం సిద్ధంగా ఉంచామని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఈ ముగ్గురు రాత్రి 10.30 గంటల వరకు గ్రామంలో అందరితో కలిసి తిరిగారు. తరువాత వీరు బొలెరో వ్యాన్‌పై ఏలూరు వెళ్లారు. తిరిగి తమ ఇంటికి మరో కొద్ది నిమిషాల్లో చేరుకునే లోపే మృత్యు ఒడికి చేరారు. లేకలేక పుట్టాడు.. గౌడపేటకు చెందిన బాలిన శ్రీనివాసరావు, ధర్మావతి దంపతులకు వివాహం తర్వాత చాలాన్నాళ్లకు లేకలేక బాలిన నరేంద్ర పుట్టాడు. అతనిని అల్లారుముద్దుగా పెంచారు. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల కితం వివాహం కాగా, భార్య గర్భిణి. నరేంద్ర ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బిడ్డ మృతితో కుటుంబసభ్యులు గుండెలావిసేలా రోధించారు. తల్లిదండ్రులు రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. బడ్టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నారు. చేదోడువాదోడుగా.. పరసా రంగారావు, వెంకటలక్ష్మీలకు రెండో సంతానం పరసా రామకృష్ణ బొలెరో వాహనంపై చేపల వ్యాపారం చేస్తుంటాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో వాహనం నడుపుతూ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నోడు తెలివైనోడు.. వెలివెల సుబ్బారావు, నాగలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో చిన్నవాడైన వెలివెల గాంధీ అప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తెలివైన వాడు కావడంతో ఆ కుటుంబమంతా అతనిపైనే ఆశలు పెట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో కుమా రుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
వరుడి హత్య.. పరారీలో ఐదుగురు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు కూడా గడవకముందే వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. సరిపడా మద్యం పొయ్యలేదనే కారణంతో స్నేహితులే వరుడిని పొడిచి చంపేశారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్ పాలిముకిమ్ పూర్ గ్రామానికి చెందిన బబ్లూ(28) అనే వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాడు చేశాడు. వివాహం పూర్తయిన తర్వాత రాత్రి తన స్నేహితులను కలుద్దామని వెళ్లాడు బబ్లూ. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న అతడి స్నేహితులు తమకు మరింత మద్యం కావాలని బబ్లూని అడిగారు. అందుకు అతడు అంగీకరించకపోవడంతో వారి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. మాట మాట పెరిగింది. (వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్) అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న బబ్లూ స్నేహితులు విచక్షణ కోల్పోయి కత్తితో అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బబ్లూని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఈలోపే అతడు మరణించాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామ్‌ఖిలాడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రియురాలి కోసం స్నేహితుల మధ్య చిచ్చు..
సాక్షి, గుంటూరు: ప్రియురాలి వ్యవహారంలో ఇద్దరి స్నేహితుల మధ్య రగిలిన చిచ్చు.. చివరకు స్నేహితుడి ప్రాణాలను బలిగొంది. కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇవ్వడంతో ఆ స్నేహితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్ స్నేహితులు. ప్రేమ్‌చంద్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఫోన్ లేకపోవడంతో స్నేహితుడైన గోపీ ఫోన్ ద్వారా తరచుగా మాట్లాడేవాడు. అయితే మిత్రుడికి తెలియకుండా అదే నంబర్‌కు గోపీ కూడా పలుమార్లు మాట్లాడిన విషయాన్ని ప్రేమ్‌చంద్ గ్రహించాడు. దీంతో స్నేహితుల మధ్య పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి. చివరిగా ఈనెల రెండోతేదీన ఇద్దరూ ఈ విషయమై గొడవ పడ్డారు. ప్రియురాలి విషయంలో అడ్డుగా ఉన్న గోపీవర్మను కడతేర్చాలని ప్రేమ్‌చంద్ నిశ్చయించుకున్నాడు. (చదవండి: డేటింగ్ పేరుతో చీటింగ్) అదే రోజు రాత్రి గోపీవర్మను యడ్లపాడు–నాదెండ్ల మార్గంలోని చప్టా వద్దకు పిలిపించి ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను అతనితో తాగించి తర్వాత నిజం చెప్పాడు. వెంటనే గోపీ బైక్‌పై ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. గోపీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో ఈ నెల 7న గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఇక మీకెవరికీ మేము కనిపించం’
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: వారు ఏ రోజుకారోజు కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలసి మద్యం సేవించారు. వారితో సరదాగా గడిపారు. ఇక మేమెవరికీ కనిపించబోమని, కువైట్ వెళ్లిపోతున్నామని చెప్పారు. తీరా మంగళవారం ఉదయం విగతజీవుల్లా పొలాల్లో పడి ఉన్నారు.. కరప మండలం కొంగోడు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటన ఇది.. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నొక్కు సుబ్రహ్మణ్యం(19), అల్లంపల్లి దుర్గారావు(24) మృతి చెందారు. ఎస్సీపేటకు చెందిన దుర్గారావు, సుబ్రహ్మణ్యం స్నేహితులు. కూలిపని చేసుకుని జీవనోపాధి పొందే వీరు సోమవారం రాత్రి స్నేహితులతో మద్యం సేవించి జల్దీఫైవ్ ఆట కొద్ది సేపు ఆడారు. మీకెవరికి కనిపించబోమని కువైట్ వెళిపోతున్నామని స్నేహితులతో చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. మంగళవారం ఉదయం పొలం మడిలో విగతజీవుల్లా పడి ఉండడంతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మద్యం మత్తులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకుండా మృత దేహాలకు గ్రామంలో అంత్య క్రియలను నిర్వహించారు. వివరాలు తెలిపేందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీనిపై ఎస్సై రామారావును వివరణ కోరగా కొంగోడులో ఇద్దరు యువకులు మృతి చెందారని విన్నాం కానీ, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణ వార్త మొత్తం దేశాన్ని కదిలించింది. అతను ఒంటరిగా ఉన్నాడని.. నిరాశతో బాధపడుతున్నాడని నివేదికలు వెల్లడించాయియి. ఈ క్రమంలో సుశాంత్ మరణించిన రెండు రోజుల తరువాత పాత వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సుశాంత్ తనకు కేవలం ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ‘చాలా నిజాయితీగా చెప్తున్నాను. నాకు ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు’ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. (‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) ఈ క్రమంలో సుశాంత్ మాట్లాడుతూ.. ‘జనాలకు నాతో మాట్లాడటం ఇష్టం ఉండదు.. అయితే వారు మొదట నన్ను ఇష్టపడినట్లు నటిస్తారు. ఆ తరువాత నన్ను మర్చిపోతారు. నేను స్నేహితులను చేసుకోలేను. అంటే నాకు జనాలు అంటే ఇష్టం లేక కాదు. నేను వారిని నిజంగా ఇష్టపడుతున్నాను. కాని వారు నాతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపరు. మొదటిసారి వారు నన్ను ఇష్టపడుతున్నట్లు నటిస్తారు. కాని తర్వాత వారు నా కాల్స్ లిఫ్ట్ చేయరు’ అని తెలిపారు. బంధుప్రీతి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారసత్వం లేక టాలెంట్ వున్న నటుల పట్ల ఇండస్ట్రీ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Please don't miss. Carefully Listen what did Sushant Singh Rajput say about his friends in Bollywood. 😭😭😭💔💔#JusticeForSushantSinghRajput #BoycottKaranJoharGang #bollywoodnepotism #SonamKapoor #KaranJoharIsBULLY #SalmanKhan #BoycottFakeStars #Nepotism pic.twitter.com/aoFpo79Ue5 — Pushpendra Kulshreshtha (@iArmySupporter) June 16, 2020 -
మరణంలోనూ వీడని స్నేహం
కరీంనగర్, మంథని: ముగ్గురివీ పేద కుటుంబాలే.. ముగ్గురూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. పక్కపక్క గ్రామాల్లో ఉన్నప్పటికీ కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేయగా, ఒకరు ఎంబీఏ చదివాడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే ముగ్గురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి వేటలో పడ్డారు. అయితే లాక్‌డౌన్‌తో వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత అండగా ఉండాలనుకున్నారు. నెల క్రితం ముగ్గురూ ఓ ఇసుక క్వారీలో పనికి కుదిరారు. అక్కడే ఉంటూ విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇసుక క్వారీల్లో పని ఆగిపోయింది. నెల రోజుల తర్వాత ద్విచక్రవాహనంపై ఆనందంగా ఇంటికి బయల్దేరిన స్నేహితులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. ప్రాణాలను తీయగలిగింది కానీ.. స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. మంథని సమీపంలో జరిగిన ఈ ఘటన జూలపల్లి మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిలో మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్‌పల్లి శివారులో సోమవారం లారీ ఢీకొని ముగ్గురూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం అబ్బాపూర్ చెందిన రజనీకాంత్(26), మిట్ట మధుకర్(26), , బాలరాజుపల్లికి అడప సురేశ్(24)లు ముగ్గురు విద్యావంతులు. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా నెల కిత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్వైజర్లుగా పనికి కుదిరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్వారీలో పని ఆగిపోగా సోమవారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ఇళ్లకు బయలుదేరారు. మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్‌పల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొ నడంతో రజనీకాంత్, మధుకర్ అక్కడికక్కడే మృతిచెందారు. సురేశ్‌ను మంథని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రజనీకాంత్, మధుకర్ మృతదేహా లు చిందరవందరగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు బయటపడ్డాయి. రోడ్డంతా రక్తసిక్తమైంది. లారీ వేగంగా ద్వి చక్రవాహనాన్ని ఢీకొనగా భారీ శబ్దం రావడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న వారు ప్రమాద సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. లారీ రోడ్డు దిగి పత్తి చేసులోకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. మ ంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్‌యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ మృతదేహాలను అంబులెన్స్›లో ఎక్కించి పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మూడు కుటుంబాల్లో విషాదం ఎలిగేడు(పెద్దపల్లి): మంథని సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు నిరుపేద కు టుంబాలకు చెందినవారే. వీరిలో ఇద్దరిది అబ్బాపూర్ కాగా మరొకరిది బాల్‌రాజ్‌పల్లి. ముగ్గురు యువకుల మృతితో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ నేపథ్యం.. మృతుల్లో అబ్బాపూర్‌కు చెందిన చొప్పరి రజినీకాంత్(26) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి రాజేశ్వరి కూలీపని, తండ్రి కొమురయ్య హమాలీ పని చేస్తూ కుమారుడిని చ దివించారు. అదే గ్రామానికి చెందిన మిట్ట మధుకర్(26)ఎంబీఏ చదివాడు. తల్లి ఆరవ్వ కూలీ పనిచేస్తుతండగా తండ్రి మల్లయ్య హమాలీ పని చేస్తూ ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించారు. అడప సురేశ్(24)డిగ్రీ చదివాడు. తల్లి లక్ష్మి, తండ్రి లచ్చయ్య కూలిపని చేస్తూ కుమారున్ని చదివించారు. కుటుంబా నికి భారం కాకూడదని ఎంతో కొంత ఆసరాగా ఉండాలని ముగ్గురు యువకులు ఇసుక క్వారీలో పనికి కుది రారు. పనులు సాగక ఇంటికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. -
నలుగురూ స్నేహితులు.. ఒకే గ్రామం
చేవెళ్ల: నలుగురూ స్నేహితులు... ఒకే గ్రామం.. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వేర్వేరు ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు. సరదాగా కారులో వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో మర్రిచెట్టు మాటేసి మింగేసింది. కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఘటనా స్థలంలో ముగ్గురు దుర్మరణం పాలవడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా మండల పరిధిలోని ఆలూరు గ్రామస్తులు కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటలకు మండల పరిధిలోని మీర్జాగూడ బస్‌స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్(30), గారెల రవీందర్(32), ఎన్కేతల రఘు(30), నర్కుడ నవీన్ స్నేహితులు. వీరు నలుగురు కలిసి చదువుకున్నారు. 2005 పదో తరగతి బ్యాచ్. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వగ్రామం నుంచి నరేష్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మరో 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకోవాల్సి ఉండగా.. మార్గంమధ్యలో మీర్జాగూడ బస్‌స్టేజీ దాటిన తర్వాత కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టింది. వాహనం అతివేగంగా చెట్టును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రఘు వాహనంలో ఇరుక్కుపోయాడు. సార నరేశ్, గారెల రవీందర్ తీవ్రంగా గాయపడటంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. నర్కూడ నవీన్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురూ ఉద్యోగస్తులే.. కారు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు స్నేహితులు ఆలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువకులు. ఎప్పుడూ స్నేహంగా మెలిగే వీరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సార నరేశ్ బీటెక్, ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేసేవాడు. లాక్‌డౌన్‌తో ఇటీవల ఉద్యోగం షాదనగర్‌కు మారింది. ఆదివారం సెలవు కావటంతో గ్రామానికి వచ్చాడు. తండ్రి చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు నరేశ్ పెద్దకొడుకు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అతడు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండులుబాదుకుంటూ రోదించారు. గారెల నారాయణ, కమలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రవీందర్. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం కాలేదు. ఎన్కేతల రఘు(30) ఏఆర్ కానిస్టేబుల్. వికారాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన ఎన్కేతల యాదయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. రఘుకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి. తీవ్రంగా గాయపడిన నర్కుడ నవీన్ గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉండేవాడు. చేవెళ్ల ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
బీరు తాగడంలేదనే కోపంతో స్నేహితుడిపై దాడి
బంజారాహిల్స్: తనతో పాటు బీరు తాగడం లేదన్న కోపంతో స్నేహితుడిపై బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం బంటుమిల్లు గ్రామానికి చెందిన ఎం. దినేష్ ఇంటర్ చదువుకుంటున్నాడు. ఓ కేసులో బెయిల్ రాగా ప్రతి సోమవారం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వస్తుంటాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 8.30 గంటలకు రైలు దిగి తన స్నేహితుడు గణేష్‌తో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హాజరు సంతకం చేశాడు. బయటకు వచ్చాక మరో స్నేహితుడు నవీన్ బాగా గుర్తు చేస్తున్నాడని ఒకసారి కలుద్దాం అంటూ గణేష్ చెప్పడంతో ఇద్దరూ కలిసి నవీన్ నివసించే ఎస్పీఆర్హిల్స్ శ్రీరాంనగర్ సమీపంలోని సంజయ్‌నగర్ మార్కెట్ పక్కన హనుమాన్ టెంపుల్ గుంతలో గోరఖ్‌నాథ్ టెంపుల్‌ను ఆనుకొని దినేష్, గణేష్, నవీన్, సాయి నలుగురు స్నేహితులు కలిసి మద్యం తాగుతున్నారు. దినేష్ మద్యం తాగకుండా కూర్చోవడంతో పలుమార్లు నవీన్ బతిమిలాడాడు. అయినా సరే తనకు ఇష్టం లేదని చెప్పడంతో తాగుతున్న బీరు సీసాను పగులగొట్టిన నవీన్ కోపంతో దినేష్ తల, వీపుపై గట్టిగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం మధ్య విలవిల్లాడుతున్న దినేష్‌ను అక్కడే ఉన్న సాయి ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. దినేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నవీన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నవీన్ ప్లంబర్‌గా పని చేస్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధ శతాబ్దపు స్నేహగీతం
ప్రకాశం, చీమకుర్తి: ‘‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’’ అని కలిసిమెలిసి తిరిగిన ఇద్దరు ప్రాణ స్నేహితులు 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకున్న క్షణం ఉద్వేగంతో వారి కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకరు మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ కాగా మరొకరు టైలర్ వృత్తిలో కొనసాగి విరామం తీసుకున్నారు. వీరిద్దరూ సోమవారం చీమకుర్తిలో కలుసుకుని అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ ధనుంజయ్, చీమకుర్తికి చెందిన తాటికొండ వెంకటేశ్వర్లు ప్రాణస్నేహితులు. వెంకటేశ్వర్లు టైలరింగ్ పని నేర్చుకోవడానికి 1970లో నాసిక్ వెళ్లారు. ధనుంజయ్ తండ్రి వద్ద టైలరింగ్ వర్క్ నేర్చుకున్నారు. ఆలింగనం చేసుకుంటున్న స్నేహితులు ఆ సమయంలో ధనుంజయ్‌కు ప్రాణమిత్రుడిగా ఉండేవారు. కాలక్రమంలో ధనుంజయ్ మిలిటరీలో స్థిరపడగా, వెంకటేశ్వర్లు చీమకుర్తిలో బాంబే టైలర్‌గా గుర్తింపు పొంది టైలరింగ్‌లో స్థిరపడ్డారు. తర్వాత ఆయన టైలరింగ్ నుంచి విరమించుకుని రాజకీయ నాయకుల అనుచరుడిగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ధనుంజయ్ కుమారుడు సూరజ్ ధనుంజయ్ గనోర్ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రకాశం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కుమారుడిని చూసేందుకు ఒంగోలు వచ్చిన ధనుంజయ్ 50 ఏళ్ల క్రితం నాటి స్నేహం గురించి కుమారుడికి చెప్పారు. దీంతో ట్రైనీ ఐఏఎస్ సూరజ్ ధనుంజయ్ తన సిబ్బందితో కలిసి చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఆరా తీసి తాటికొండ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు. సోమవారం ఇద్దరు మిత్రులు కలిశారు. వారి స్నేహానికి గుర్తుగా చీమకుర్తిలోని ఎస్కేఆర్ మానసిక వికాస కేంద్రంలో విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇద్దరు స్నేహితులను కలపడంలో చీమకుర్తికి చెందిన గుండా శ్రీనివాసరావు, పరాంకుశం శ్రీనివాసమూర్తి సహకారం అందించి మధురానుభూతి పొందారు. ఇద్దరు మిత్రుల స్నేహబంధాన్ని పలువురు స్థానికులు అభినందించారు. -
ఒరేయ్ అన్నాడని మిత్రుడి ప్రాణం తీశాడు
భాగ్యనగర్‌కాలనీ: ఒరేయ్.. అన్నాడని ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. తోటి స్నేహితుణ్ని బీరు సీసా పగులగొట్టి గొంతులో పొడిచి హత్య చేసిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణరెడ్డి కథనం ప్రకారం.. మూసాపేట యాదవ బస్తీలో తాడెల లక్ష్మి, ఆమె కుమారుడు సుధీర్ (20) నివాసముంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సుధీర్ సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత రూ.50 తీసుకొని స్నేహితులైన గురజాల కిరణ్, నవీన్, రాంబాబులతో కలిసి బయటికి వెళ్లాడు. ఖైత్లాపూర్ సమీపంలోని గ్రౌండ్లో మద్యం తాగారు. ఆ సమయంలో మరికొంత మంది స్నేహితులైన కిరణ్, సాబేర్, హర్షవర్ధన్‌లు కూడా వీరికి తోడయ్యారు. అంతా కలిసి మద్యం తాగారు అనంతరం కిరణ్, రాంబాబు, హర్షవర్ధన్‌లు ఇంటికి వెళ్లి పోయారు. అక్కడే ఉన్న కిరణ్, నవీన్, సాబేర్‌లు సుధీర్‌తో మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో సుధీర్‌ని అరటి పండ్ల విక్రయ వ్యాపారి సాబేర్ ఒరేయ్ అన్నాడు. సుధీర్ ఒరేయ్ అంటావా అని నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగటంతో సుధీర్‌ను సాబేర్ పక్కకు తీసుకెళ్లి బీరు బాటిల్ పగులగొట్టి గొంతులో పొడిచాడు. దీంతో వెంటనే సుధీర్ కింద పడిపోవటంతో సాబేర్ అక్కడి నుంచి స్కూటీపై పారిపోయాడు. అక్కడే ఉన్న తోటి స్నేహితులు నవీన్, కిరణ్‌లు వెంటనే సుధీర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుధీర్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
ప్రాణం తీసిన సరదా పందెం
-
సత్యమేవ జయతే!
ఒకసారి అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు స్నేహితులతో కలసి ఉన్నత విద్యాభ్యాసం కొరకు సుదూర నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజుల్లో ఎలాంటి వాహన సదుపాయాలూ ఉండేవి కావు. ఎంతదూరమైనా కాలినడకనే ప్రయాణం. బందిపోట్ల బెడద కూడా ఎక్కువే. మార్గమధ్యంలో అబ్దుల్ ఖాదర్‌ను దొంగలు అడ్డుకున్నారు. నిలువెల్లా సోదా చేశారు. సంచులన్నీ వెదికారు. ఖాదర్ వద్ద ఏమీ దొరకలేదు. అబద్ధాలాడకుండా ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమున్నాయో అప్పగించండి. అని హుకుం జారీ చేశారు దొంగలు. అందరిదగ్గర ముందే దోచుకోవడం మూలాన ఎవరి దగ్గరా ఏమీ మిగల్లేదు. కాని అబ్దుల్ ఖాదర్ మాత్రం ఎవరికీ కనబడకుండా రహస్యంగా దాచిన పైకాన్ని తీసి దొంగలకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం దొంగల వంతయింది. ఆలోచనలో పడిన దొంగల నాయకుడు అబ్దుల్ ఖాదర్ ను దగ్గరికి పిలిచాడు. ‘నిజం చెప్పు, ఎంత వెదికినా దొరక్కుండా ఈ పైకాన్ని ఎక్కడ దాచావు?’. అని గట్టిగా ప్రశ్నించాడు. ‘అబద్ధం చెప్పేవాణ్ణయితే రహస్యంగా దాచుకున్నది మీకెందుకు చూపిస్తాను? ఇదిగో ఇక్కడ దాచింది మా అమ్మ, ’ అంటూ, నడుము బెల్టుకు లోపలిభాగంలో వస్త్రానికి అతుకేసి కుట్టిన వైనాన్ని వివరించాడు ఖాదర్. ఈసారి మరింత ఆశ్చర్యానికి లోనైన నాయకుడు, ‘మేమెలాగూ దాన్ని కనిపెట్టలేదు, మరి అంత రహస్యాన్ని మాకు తెలియజేసి ఎందుకు నష్టపోవాలనుకున్నావు?’ అన్నాడు. ‘ఇది నష్టపోవడం ఎలా అవుతుంది, ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పకూడదని, సత్యమే మాట్లాడాలని, దీనివల్ల మేలే తప్ప కీడు జరగదని చెప్పింది మా అమ్మ. నేను అమ్మ మాటను ఎలా జవదాటగలను? అసత్యం ఎలా పలకగలను? అమ్మ మాట వినకుండా అబద్ధాలాడితే అల్లాహ్ శిక్షించడా?’ అని ఎదురు ప్రశ్నించాడు అబ్దుల్ ఖాదర్ అమాయకంగా, నిర్భయంగా. ఈ మాటలు దొంగల నాయకుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆలోచనలో పడిపొయ్యాడతడు. తన పాపాల చిట్టా రీలులా కళ్ళముందు కదలాడుతుండగా, కరుడు గట్టిన భయంకర నేరస్థుని కళ్ళు ధారాప్రవాహంగా వర్షిస్తున్నాయి. పరివర్తిత హృదయంతో దొంగల నాయకుడు ఒక్కసారిగా అబ్దుల్ ఖాదర్ ను గుండెలకు హత్తుకున్నాడు. తన సత్యసంధత, సత్యవాక్పరిపాలనతో కరుడుగట్టిన దొంగల్లో సైతం పరివర్తన తీసుకు రాగలిగిన ఆ చిన్నారి అబ్దుల్ ఖాదర్ ఎవరో కాదు, ఆయనే హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ (ర) దైవం మనందరికీ సదా సత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ప్రాణం తీసిన బిల్లు వివాదం
ముషీరాబాద్: మద్యం మత్తులో నలుగురు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండకు చెందిన అభిలాష్ హైదరాబాద్‌కు వచ్చి రాంనగర్లో ఉంటూ జొమాటో కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు వంశీ ఇటీవల ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 24న రాంనగర్లో ఉంటున్న తమ స్నేహితుడు హరీష్ గదికి వెళ్లారు. వంశీ స్నేహితుడు చంద్రకాంత్ కూడా అక్కడికి రావడంతో నలుగురు కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా వంశీ పుట్టినరోజు విషయం గుర్తుకు రావడంతో అందరూ కలిసి రాంనగర్‌లోని ఓ బేకరీకి వెళ్లి కేక్ కట్‌చేశారు. అనంతరం మరో రెస్టారెంట్‌కు వెళ్లి మరోసారి మద్యం తాగారు. ఆ తర్వాత నారాయణగూడలోని ఓ హోటల్‌కు వెళ్లి బిర్యాని తిన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ వచ్చినందున అదనంగా రూ.600 ఖర్చయ్యిందని అభిలాష్ అనడంతో మనస్తాపానికి లోనైన చంద్రకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వంశీ అభిలాష్‌తో వాగ్వాదానికి దిగడంతో అందరూ కలిసి అక్కడినుంచి హరీష్ గదికి వెళ్లిపోయారు. అక్కడ కూడా వాగ్వాదం కొనసాగడంతో అభిలాష్ వంశీపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికిలోనైన వంశీ అభిలాష్‌ను బలంగా నెట్టివేయడంతో తల నేలకు తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మిగతా ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
బైక్ ఇచ్చి.. బలయ్యాడు!.
తాడేపల్లిరూరల్: తన బైక్‌ను స్నేహితులకివ్వడం.. ఆ యువకుడి ప్రాణాలనే బలిగొంది. ఆ స్నేహితులు ఓ యువతిని వేధించడం.. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో అవమాన భారంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పట్టణ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ చానెల్లో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తున్న తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన చరణ్‌రాజు తన బైక్‌ను విజయవాడలోని స్నేహితుడు శివ, అతనితోపాటు వచ్చిన మరో యువకుడికి ఈ నెల 24వ తేదీ రాత్రి ఇచ్చి విజయవాడలోని చర్చికి వెళ్లాడు. వారిద్దరూ బైక్‌పై విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ యువతిని ఈవ్‌టీజింగ్ చేయడంతో ఆమె వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు చరణ్ రాజును అదుపులోకి తీసుకుని రోజంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఈవ్ టీజింగ్ చేసింది చరణ్‌రాజు కాదని నిర్ధారించుకున్నాక విడిచిపెట్టారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించానంటూ తీవ్ర మనస్తాపం చెందిన చరణ్‌రాజు గురువారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఒకే చెట్టుకు ఇద్దరు స్నేహితుల ఉరి
కర్ణాటక, ముళబాగిలు: ఇళ్లనుంచి బయటకు వచ్చిన ఇద్దరు స్నేహితులు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులై కనిపించారు. ఈ ఘటన తాలూకాలోని అణ్ణిహళ్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం వెలుగుచూసింది. గ్రామానికి చెందినప్రవీణ్ కుమార్ (19), కప్పల మడుగు గ్రామానికి చెందిన వీ శ్రీనాథ్(24)లు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం తమ తమ గ్రామాలనుంచి బైక్‌ల్లో బయటకు వచ్చారు. తిరిగి ఇళ్లకు చేరలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవులుగా కనిపించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంగలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా యువకులను హత్య చేసి చెట్టుకు ఉరివేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కార్తీక్‌రెడ్డి పరిశీలించారు. నిపుణులు వేలిముద్రలు సేకరించారు. జాగీలం సహాయంతో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిద్దరిదీ ఆత్మహత్య? లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రాబంధువులు
బంధాన్ని గౌరవించేవారు బంధువులు. కనుమరుగైన బంధాన్ని నిలబెట్టేవారు బంధువులు. బంధాన్ని కల్తీ చేసేవారు, పలుచన చేసేవారు, వంచన చేసేవారు బంధువులు కాబోరు. నీ రక్తం నా రక్తం అని చూసేవారు బంధువులు కాబోరు. ఆమెకు బంధువులు శత్రువులుగా మారారు. తిరిగి వారు స్నేహితులుగా మారే లోపు బాధ పెట్టారు. ఆమె దృఢంగా నిలబడేందుకు చేసిన ప్రయత్నమే ఇది. అతనికి పుట్టినవారు అతని పిల్లలు. ఆమెకు పుట్టినవారు ఆమె పిల్లలు కారా? ఆమె బావగారు అదే అపార్ట్మెంట్లో ఉంటారు. ఆయనను చూస్తే ఆమెకు భయం. ఆయన రోజూ ఆమె పిల్లలను తన ఫ్లాట్‌కు రప్పించుకుంటారు. చాక్లెట్లు ఇప్పిస్తారు. కబుర్లు చెబుతారు. షికారు తిప్పుతారు. ఆయనా ఆయన భార్యా వాళ్లిద్దరి పిల్లలూ ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటారు. దానికి కారణం ఆమె పిల్లలను ఆ బావగారు ‘తన తమ్ముడి పిల్లలు’ అనుకోవడం. కాని వారి కన్నతల్లిని మాత్రం తమకు సంబంధం లేని మనిషిగా భావించడం. అది ఒక సమస్య అయితే ఇంట్లో ఉన్న అత్తగారు మరో సమస్య ఆమెకు. ఆమె ఎప్పుడూ తన ఇద్దరు మనవల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారితో మాట్లాడుతుంటుంది. వారితో జట్టు కడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె వారిని తన కొడుకు పిల్లలు అనుకుంటుంది. వారిని కన్న తల్లిని కోడలు అనుకోదు. కొడుకు భార్య అని కూడా అనుకోదు. ఎందుకంటే కొడుకు చనిపోయాడు. కోడలితో ఏం పని?! ఆమెకు 42 ఏళ్లు ఉంటాయి. ఇద్దరు పిల్లలు. కొడుక్కి పదేళ్లు. కూతురికి ఎనిమిదేళ్లు. కార్పొరేట్ హాస్పిటల్లో అకౌంట్స్‌లో ఉద్యోగం. భర్త చనిపోయి రెండేళ్లు అవుతున్నా ఆ విషాదం నుంచి ఆమె కోలుకోలేదు. అతను లేని జీవితాన్ని ఎదుర్కోవాల్సి రావడం ఒక సమస్య అయితే బంధువులతో వేగాల్సి రావడం మరో సమస్యై కూచుంది. దానికి కారణం తన తప్పేనట. ఆమెకు లేటుగా వివాహం జరిగింది. అది కూడా అతడితో రెండో పెళ్లి. మొదటి భార్యకు విడాకులిచ్చిన అతను.. ఐదుగురు సంతానంలో పెళ్లి కాకుండా ఉన్న ఆమెను ఆమె 30వ యేట పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి ఆమె జీవితం అంత సరిగా లేదు. అతను మంచివాడేకాని తాగుడుకు బానిస. బాగానే సంపాదించేవాడు. కాని ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి చనిపోయాడు. అతడలా చనిపోవడానికి కారణం తనే అని అత్తగారు, బావగార్ల ఫిర్యాదు. ‘ఆమె అదుపు చేసి ఉంటే అదుపులో ఉండేవాడు’ అంటారు వాళ్లు. ‘వయసు తేడా ఉన్న వాణ్ణి అయిష్టంగా పెళ్లి చేసుకుంది. వాణ్ణి సాగనంపితే ఇంకొకరిని చేసుకొని ఆస్తి అనుభవించవచ్చునని ప్లాన్’ అని వాళ్లకు సందేహం. అతని ద్వారా ఆమెకు ఫ్లాట్ వచ్చింది. కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది. ఆ రెంటి కోసం భర్త ఎటుపోయినా పర్వాలేదని ఆమె అనుకుంటుందని వాళ్లు నిర్ణయానికి రావడం ఆమెను బాధిస్తూ ఉంది. రాను రాను అత్తగారి, బావగారి సందేహాలు ఇంకా పెరిగాయి. ‘ఈమె పిల్లల్నయినా చూసుకుంటుందని గ్యారంటీ ఏమిటి’ అనుకున్నారు వాళ్లు. ‘అసలు ఇదంతా ఎందుకు మన పిల్లలు మన బంగారం. వారిని మన దగ్గర ఉంచుకుని దాని దోవ దానిని చూసుకోమంటే అదే మేలు’ అనుకున్నారు వాళ్లే. ఇందుకు మార్గం పొమ్మనకుండా పొగబెట్టడం. ఆమె అది చేసినా తప్పే.. ఇది చేసినా తప్పే. చీటికి మాటికి మాటలు అంటూ ఆమె ఈ ఖర్మకు కారణం ఆమె చేష్టలే అని చెబుతూ రావడంతో ఆమెకు మెల్లగా తన మీద తనకే సందేహాలు మొదలయ్యాయి. అవునా.. నేను దేనికీ పనికిరానా? నాకు కాపురం చక్కదిద్దుకోవడం రాదా? నేను పిల్లల్ని పెంచలేనా?... మెల్లగా ఆమెకు భయాలు మొదలయ్యాయి. ఆ భయాలు పెనుభూతాలయ్యాయి. ఆమెకు నిద్ర లేదు. ఆహారం లేదు. పిల్లల్ని చూసుకుంటూ పదే పదే ఏడవడం మొదలుపెట్టింది. ఆఫీసులో కూడా ఒకటే ఏడుపు. దీనిని చూసి ఆఫీస్ కొలీగ్ ఒకామె ఇదేదో ముదిరిపోతున్నట్టు గ్రహించి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వచ్చింది. ఆ మాత్రం స్నేహాలను ప్రకృతి ఎప్పుడూ సిద్ధం చేసి పెడుతుంది కదా. ‘నాకేమైనా మానసిక సమస్యలు ఉన్నాయా డాక్టర్’ అని అడిగిందామె. ఆమె కేసంతా విన్న డాక్టర్‌కు ఆమెకూ ఆమె బంధువులకూ మధ్య ఉన్న గ్యాప్ అర్థమైంది. ‘లేదమ్మా.. నీకేం సమస్యలూ లేవు’ అన్నారు డాక్టర్. ‘మరి వారెందుకు అలా చేస్తున్నారు? ఆఖరుకు నా పిల్లల మనసులో కూడా విషం నూరి పోశారు. వాళ్ల నాన్న తొందరగా చనిపోవడానికి కారణం నేనట. నేను ఆయన్ను పట్టించుకోలేదట. ఉద్యోగం చేసుకుంటూ ఆయనను నిర్లక్ష్యం చేశానట. ఇవాళ ఉద్యోగమే కదా డాక్టర్ నన్ను కాపాడుతోంది. నా పిల్లలతో నా బతుకు నేను బతుకుదామన్నా ఈ టెన్షన్ ఏంటి డాక్టర్’ అందామె. ‘ఏం లేదమ్మా.. ముందు నువ్వు నీ ఇంటికి తాళం వేసి వాళ్లకు దూరంగా కొన్నాళ్లు జీవించు. అన్నీ సర్దుకుంటాయి’ అన్నారు డాక్టర్. ‘అదేంటి డాక్టర్?’ అందామె. ‘అవునమ్మా. నీ జీవితం పట్ల నువ్వు సీరియస్‌గా ఉన్నావని, నీ పిల్లలకోసం నువ్వు జీవిస్తావని వాళ్లకు తెలియదు. మరొకటి. నీ భర్త చనిపోయాక నీకు మరొకరిని చేసుకునే హక్కు ఉంది. అలా చేసినా నీ పిల్లలంటే నీకు ప్రేమ అనీ, వారి అనుమతితో... వారు యాక్సెప్ట్ చేసినవారినే చేసుకుంటానని, వారిని యాక్సెప్ట్ చేసే బంధంలోకే వెళతానని, వారంటే నీకు ప్రాణమని నీ బంధువులకు తెలిసేలా చేయాలి. అసలు నీకు పెళ్లి ఆలోచనే లేకపోతే ఆ ఇష్యూయే లేదు. పెళ్లయిన ఏడెనిమిదేళ్లకే నీ భర్త చనిపోవడం వల్ల నీకూ నీ బంధువులకూ మధ్య ఇంకా బలపడాల్సినంత బంధం బలపడలేదు. నిన్ను వారి మనిషిగా వారు స్వీకరించలేదు. ఇవన్నీ రోజులు గడిచేకొద్దీ తేలే విషయాలు. ప్రస్తుతం నువ్వు నీ జీవితాన్ని మొదలెట్టు’ అన్నారు డాక్టర్. ఆ తర్వాత ఆమె పిల్లలను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాడు. తల్లి బతికేది వారి కోసమే అనే భావన వారిలో కల్పించాడు. వాళ్లు దూరంగా వెళ్లి వేరే ఫ్లాట్ తీసుకున్నాక అత్తగారు, బావగారు దూరం అయ్యాక పిల్లలు తల్లికి దగ్గరయ్యారు. తల్లి మరింతగా వారికి అర్థం కావడం మొదలెట్టింది. ఆ ముగ్గురూ ఒక కుటుంబం అయ్యారు. బంధం ఎక్కడికీ పోదు. మెల్లగా అత్తగారికి బావగారికి ఆమె పట్ల ఉన్న సందేహాలు తీరిపోయాయి. ఆమె ఒంటరిగా మిగిలినా మరొకరిని చేసుకున్నా పిల్లలకు అన్యాయం చేయదు అని గ్రహించారు. మెల్లగా రాకపోకలు మొదలయ్యాయి. ఏమో.. పెద్దలు పిల్లలు అంగీకరిస్తే ఆమె మరొకరిని వివాహం చేసుకోవచ్చేమో. ఇప్పుడైతే ఆమె జీవితం సంతోషంగానే ఉంది. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
సేమ్ జెండర్ అడ్డా
కొన్నాళ్ల కిందట. బెంగళూరులోని ఓ కేఫ్. చేతిలో చేయి వేసుకుని నిలబడ్డ సేమ్ జెండర్ జంటొకటి కేఫ్‌లో కాస్త మూలగా ఉన్న చోట టేబుల్ కోసం చూస్తోంది. టేబుల్ దొరికింది. వెళ్లి కూర్చోబోతుంటే ‘‘మీరిలా కూర్చోడానికి మిగిలిన కస్టమర్స్ ఇష్టపడరు’’ అంటూ వాళ్లను కూర్చోనివ్వలేదు ఆ కేఫ్ సిబ్బంది. అంతేకాదు, వాళ్ల పట్ల చాలా అభ్యంతరకరంగా కూడా ప్రవర్తించారు. అప్పుడు అక్కడే ఉన్న హెప్సీబా స్మిత్ అనే అమ్మాయి వాళ్లను గమనించింది. ఆ కేఫ్ సిబ్బంది తీరు ఆమెకు నచ్చలేదు. బాధేసింది కూడా. ఒకే జెండర్ వాళ్లిద్దరూ చేతిలో చేయి వేసుకుని వచ్చినంత మాత్రాన వాళ్లు స్వలింగ సంపర్కులన్నట్టేనా? ఒకవేళ అయితే రెస్టారెంట్ సిబ్బందికొచ్చిన ఇబ్బంది ఏంటీ? అనుకుంది. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ చోటు కల్పిస్తే బాగుంటుంది కదా అని కూడా ఆలోచించింది బైసెక్సువల్ అయిన హెప్సీబా. ఆ నిశ్చయంతోనే అప్పటిదాకా ‘తాజ్ వెస్టెండ్’ లో బార్టెండర్గా చేస్తున్న పనిని వదిలేసి సొంతూరైన హైదరాబాద్‌కు వచ్చేసింది. పీపుల్స్ చాయిస్ తన క్లాస్మేట్, స్నేహితుడూ అయిన మహ్మద్ ఆదాంతో కలిసి తొమ్మిది నెలల కిందట ఎల్జీబీటీక్యూ కోసం సైనిక్‌పురిలో ‘పీపుల్స్ చాయిస్’ పేరుతో కేఫ్‌ను స్థాపించింది. ఇది పెట్టడానికి రెండేళ్లు పట్టిందట! తన ఆలోచన గురించి మహ్మద్‌కు చెప్పినప్పుడు.. ‘‘ముందు ఖ్వీర్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి, వాళ్లతో స్నేహం చేసి వాళ్లలో కలిసిపోయి వాళ్ల అభిరుచులు, ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే దానికి తగ్గట్టే కేఫ్ ప్లాన్ చేసుకోవాలి’’ అని సలహా ఇచ్చాడట ఆదాం.. హెప్సీబాకు. అతను చెప్పినట్టే చేసింది. ‘ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్’లో కూడా పాలుపంచుకున్నారిద్దరూ. ఇంత పరిశీలన, అధ్యయనం తర్వాతే ‘పీపుల్స్ చాయిస్’ కేఫ్‌కు రూపమిచ్చారు. వీళ్లిద్దరూ మంచి పాకశాస్త్ర ప్రవీణులు కూడా. కేఫ్‌లో వంటపనీ చేస్తుంటారు. పీపుల్స్ చాయిస్లో లైవ్ పెర్ఫార్మెన్స్తో పాటు ఈవెంట్స్‌నూ నిర్వహిస్తుంటారు. దేశంలో ఎల్జీబీటీక్యూ కోసం నడుస్తున్న అతి కొద్ది కేఫ్‌లలో ‘పీపుల్స్ చాయిస్’ ఒకటిగా.. వాళ్లకోసం ఉన్న అద్భుతమైన స్పేస్‌గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల వాళ్లతో..! అయితే ఈ ప్రయాణమంతా ఇక్కడ చెప్పుకున్నంత సాఫీగా సాగలేదు. కేఫ్ చుట్టుపక్కల వాళ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ‘‘ఒకసారైతే ఈవెంట్ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్లొచ్చి కేఫ్ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మల్ని విరిచేశారు. సామాన్లను పడేసి.. చిందర వందర చేశారు. ‘‘పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం. అదృష్టం ఏమంటే పోలీసులు మా వైపు నిలబడ్డారు. వెంటనే వాళ్లను పంపించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఆ సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూంటుంది’’ అంటుంది హెప్సీబా. చదువే పరిష్కారం కొంతమంది స్నేహితులతో కలిసి పేదరికంలో ఉన్న ఎల్జీబీటీ వాళ్లకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హెప్సీబా, మహ్మద్. ‘‘మారుమూలన ఉన్న వాళ్లు హైదరాబాద్‌కు రాలేరు. అందుకే మేమే తరచుగా అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి చదువు చెప్తున్నాం. ‘‘ఈ రెండేళ్లలో నేనూ చాలా నేర్చుకున్నాను. ఈ భూమ్మీద గౌరవం అందుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మనుషులందరూ సమానమే. ఆ సమానత్వాన్ని తెచ్చే, ఇచ్చే సాధనం చదువొక్కటే. దానికోసమే మా ఈ ప్రయత్నం’’అంటుంది హెప్సీబా. -
జీవిత సత్యం
ఓ ముగ్గురు స్నేహితులు పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్దహోటల్ లో 75 వ అంతస్తులో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్ నిబంధనల ప్రకారం రాత్రి పదకొండు గంటలకల్లా రూంకు చేరుకోవాలి. పదకొండు దాటితే లిఫ్ట్ పనిచేయదు. ఈవిషయం తన కష్టమర్లకు ముందుగానే చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఆలస్యంగా వచ్చినవాళ్ళు పై అంతస్తులకు వెళ్ళాలంటే చుక్కలు చూడాల్సిందే. మొదటిరోజు ముగ్గురు స్నేహితులూ సమయానికే చేరుకున్నారు.కాని రెండవ రోజు కాస్తంత ఆలస్యమైంది. వచ్చేసరికి లిఫ్ట్ కు తాళంవేసి ఉంది. ఏంచెయ్యాలో అర్థం కాలేదు. 75 అంతస్తులంటే మాటలా? అయినా చేసేదేమీ లేదు. గదికి వెళ్ళాలంటే కాళ్ళకు బుధ్ధిచెప్పాల్సిందే. అలసట తెలియకుండా ఉండడంకోసం ఒక స్నేహితుడు సరదాగా ముచ్చట్లు, కథలు చెప్పడం ప్రారంభించాడు. అలా సరదాగా ఆడుతూ పాడుతూ పాతిక అంతస్తులు సునాయాసంగా అధిగమించారు. తరువాత రెండవ స్నేహితుడు బంధాలు, బాధ్యతలకు సంబంధించిన వాస్తవగాథలు వినిపిస్తుండగా మరో పాతిక అంతస్తులు అధిగమించారు. ఇక చివరి పాతిక అంతస్తులు మిగిలాయి. మూడవ స్నేహితుడు బాధలు, కష్టాలు, కడగండ్లకు సంబంధించిన కథలు, జీవన సత్యాలను విడమరిచి చెబుతుంటే, వాటిని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ, పడుతూ లేస్తూ, ఆపసోపాలు పడుకుంటూ ఎలాగోలా తమ గదివరకూ చేరుకున్నారు. తీరా పైకి వెళ్ళిన తరువాత గదితాళాలు కింద వాహనంలోనే మరచి వచ్చామన్నసంగతి గుర్తొచ్చింది వారికి. ఖచ్చితంగా ఇలానే ఉంది ఈనాటి మన పరిస్థితి. మన జీవితకాలంలోని మొదటి ఇరవై పాతిక సంవత్సరాలు బాల్యం, యవ్వనం, చదువు, ఆట పాటల్లోనే గడిచి పోతోంది. మిగతా పాతిక సంవత్సరాలు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బాధ్యతలతో గడిచి పోతోంది. ఇక మిగిలిన పాతిక సంవత్సరాలు బాధలు, నొప్పులు, వృద్ధాçప్యం, ఆరోగ్య సమస్యలతో జీవితం భారంగా గడుస్తోంది. చివరికి గమ్యానికి చేరుకునే సరికి ఏమీ మిగలడం లేదు. రిక్తహస్తాలతోనే సమాధికి చేరిపోతున్నాం. అప్పుడుగాని అసలు విషయం గుర్తుకు రావడం లేదు. ప్రాపంచిక జీవనవ్యామోహంలో పడి సత్కర్మలు అనే తాళం చెవులు మరిచిపోయి వచ్చామని. అసలు వెంట తేవలసిన వాటినే తీసుకురాలేదని. మరలా వెనక్కి వెళ్ళడానికి, వెళ్ళి తీసుకురావడానికి అవకాశమే ఉండదు.అయినప్పటికీ కొంతమంది అడుగుతారట.. ‘ప్రభూ.. మాకు మరొక్కసారి అవకాశాన్ని ప్రసాదించు. మమ్మల్ని ఇహలోకానికి పంపు. మేము ఎలాంటి తలబిరుసు తనానికి పాల్పడకుండా, నువ్వుచెప్పినట్లే నడుచుకుంటాము.’ అని మొరపెట్టుకుంటారట. కాని వారికి అలాంటి అవకాశమే ఇవ్వబడదు. అందుకని చావుపుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాధికి చేరడానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మగాళ్లు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు..
ప్రపంచంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లే ఎక్కువ ఒంటరితనంతో బాధ పడుతున్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో బ్రిటన్ విషయంలో కూడా ఇదే రుజువైంది. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు ఒంటరితనంతో బాధ పడుతున్నారు. సన్నిహిత మిత్రులు ఒక్కరు కూడా లేరని 18 శాతం మంది, మంచి మిత్రులే లేరని 32 శాతం మంది చెప్పగా, 12 శాతం మహిళలు సన్నిహిత మిత్రులు లేరని, 24 శాతం మంది మహిళలు మంచి మిత్రులు లేరని ‘యూగౌ’ జరిపిన సర్వేలో తెలిపారు. పిల్లల స్కూళ్లకు వెళ్లినప్పుడో, వారి కోసం క్రీడా క్లబ్బులు, మైదానాలకు వెళ్లినప్పుడు ఇతర పిల్లల తల్లులు తమకు ఎక్కువగా స్నేహితులు అవుతున్నారని తేలింది. ఈ విషయంలో తండ్రులకు ఎక్కువగా స్నేహితులు కావడం లేదు. కారణం వారు తరుచుగా పిల్లల కోసం స్కూళ్లకుగానీ స్పోర్ట్స్ క్లబ్బులకుగానీ వెళ్లకపోవడం. మగవాళ్లకు ఎక్కువగా ఆఫీసుల్లోనే స్నేహితులు అవుతున్నారు. అందుకనే వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాత ఒంటరితనంతో బాధపడాల్సి వస్తోంది. సమాజంలో పురుషులకన్నా మహిళలనే సోషల్ నెట్వర్క్ ఎక్కువగా ఉంటుందని, వారు జీవితాంతం కొత్తవారిని స్నేహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, అదే మగవాళ్లలో లేదని, వారితో మనకేం పనిలే అనుకోవడం అందుకు కారణమని బ్రిటన్‌లో ఒంటరితనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న పరిశోధనా సంస్థ డైరెక్టర్ రాబిన్ హెవింగ్స్ విశ్లేషించారు. పైగా మహిళలు సొంత విషయాలు మిత్రులు, కుటుంబాలతో పంచుకోవడానికి ఎక్కువ చొరవ చూపుతారని, అదే మగవాడు ఒంటరితనంతో బాధ పడుతున్న విషయాన్ని మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడరని, అలా పంచుకోవడం ఆత్మ న్యూన్యతా భావంగా భావించడమేనని హెమింగ్స్ వివరించారు. కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం కూడా మగవాళ్లలో తక్కువ. అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్లు కేవలం 18 శాతం మాత్రమేనని తేలింది. ఒంటరితనంతో బాధపడడం వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అది పెరిగితే బతుకు భారం అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆ తీవ్రమైన చర్యకు కూడా పాల్పడతారు. అందుకని పురుషుల్లో ఒంటరితనం పోవాలంటే పాత మిత్రులతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి. అందుకు నేడు సోషల్ మీడియా ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం పూట వాకింగ్ అలవాటు చేసుకొని అలా వచ్చేవారితో స్నేహం చేసుకోవాలి. లేదా పెంపుడు కుక్కలను అలా తిప్పడానికి తీసుకెళ్లినప్పుడు తోటి వాళ్లతో స్నేహం చేయాలి. వ్యాయామం లేదా ఇతర కాలక్షేప క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా స్నేహాన్ని పెంచుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు ఇరుగు, పొరుగు వారితో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. -
ఆరిన ఆశాదీపాలు
బూర్గంపాడు: రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది. కుటుంబ ఆశాదీపాలు ఆరిపోవటంతో ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. బాగా చదువుకుని తమ కుటుంబాలకు ఆసరా అవుతారునుకున్న కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే సమాచారం ఆ కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును చూసి అందరి కళ్లు చెమర్చాయి. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొని ఇరువురు యువకులు మృతిచెందిన ఘటన మంగళవారం బూర్గంపాడు మార్కెట్‌యార్డు వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గంపాడులోని గౌతమీపురం కాలనీకి చెందిన బర్ల బిందుకుమార్ (21), గంగపురి సాయికిరణ్(18) మంగళవారం మధ్యాహ్నం బూర్గంపాడు మెయిన్‌సెంటర్ నుంచి గౌతమిపురానికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటార్‌సైకిల్‌పై ఉన్న బర్ల బిందుకుమార్, గంగపురి సాయికిరణ్ అక్కడికక్కడే మృతిచెందారు. భద్రాచలం నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ ఫోన్ చేయటంతో వీరు మోటార్‌సైకిల్‌పై బూర్గంపాడు బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అక్కడ కొద్దిసేపు స్నేహితుడితో మాట్లాడిన అనంతరం స్నేహితుడి బుల్లెట్ వాహ నం తీసుకుని గౌతమిపురం వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపక్కన మట్టి ఉండటంతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమం లో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను వెంటనే బూర్గంపాడు సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యు లు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరణంలోను వీడని స్నేహం.. బర్ల బిందుకుమార్, గంగపురి సాయికిరణ్ కులా లు వేరైనా అన్నదమ్ముల్లా్ల కలిసి మెలిసి ఉంటారు. ఒకే కాలనీకి చెందిన వీరు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. పాల్వంచలో బీటెక్ చదువుతున్న బర్ల బిందుకుమార్ బాగా చదివి కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెబుతుండేవాడు. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న గంగపురి సాయికిరణ్ తమ తల్లిదండ్రులకు ఒక్కడే కొడు కు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు అతడిని కష్టపడి చదివిస్తున్నారు. ఇరువురి మరణం ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలో నింపింది. బర్ల వెంకటరత్నం, స్వరూపల రెండవ కుమారుడు బర్ల బిందుకుమార్. తాపీ పనులు, కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటరత్నం దంపతులు పిల్లలను చదివించేందుకు బాగా కష్టపడుతున్నారు. తమ ముగ్గురు పిల్లలు ప్రవీణ్‌కుమార్, బిందుకుమార్, వేణుచంద్లను వారు కష్టపడి చదివిస్తున్నారు. బీటెక్ చదువుతున్న బిందుకుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణణాతీతం. అదేవిధంగా గౌతమిపురం కాలనీకి చెం దిన గంగపురి చిన్నవెంకటి, చంద్రకళ దంపతుల కుమారుడు సాయికిరణ్. తమ కుమార్తె రమాదేవికి వివాహం చేసిన చిన్నవెంకటి దంపతులు తమ ఆశలన్నీ సాయికిరణ్‌పై పెట్టుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డులో చిన్నవెంకటి హమాలీగా పనిచేస్తున్నాడు. చంద్రకళ స్థానికంగా కూలీ పనులు చేస్తుంది. తమ ఆశలదీపం కొడుకు సాయికిరణ్‌ను కష్టపడి చదివిస్తున్నారు. కొడుకు రోడ్డుప్రమాదంలో మరణించాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. సాయికిరణ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంక టప్పయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు.. యువత చిత్తు
ఫ్రెండ్ పుట్టిన రోజనో.. శుభకార్యమనో.. లేక బాధకర సందర్భమో గానీ.. ‘నిషా’ అందిస్తున్న మత్తు అనే స్నేహహస్తం.. యవతను ‘ఉన్మత్తు’ ఆగాధంలోకి లాగేస్తోంది. చివరకు బతుకునే ఉప్పెనలా ముంచేస్తోంది. ఈ ఉచ్చులో పడిన వారి బతుకు అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఈ విషయంలో మద్యం ప్రధాన పాత్ర పోషిçస్తుంటే.. గంజాయి, డ్రగ్స్ విపత్తు తక్కువేం కాకుండా ఉంది. మంచిర్యాలక్రైం :మత్తుకాటుతో యువత చిత్తవుతోంది. సరదాగా ప్రారంభమైన ఈ వ్యసనం.. చివరకు అలవాటుగా మారి ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. ఏటా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారిలో 70శాతం మంది 35 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగించే ఆంశం. ఈ బాధితుల్లో 80శాతం మంది మద్యం, దుమపానం వంటి వ్యసనాల కారణంగానే అనారోగ్యం బారినా పడుతున్నారని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. పుట్టిన రోజు.. అమ్మాయికి ప్రపోజ్ చేసినరోజు.. పెళ్లిరోజు.. ఇలా ఏ చిన్న సందర్భం దొరికినా.. మందుతాగేవారు కొందరుంటే.. స్నేహితులు బలవంతం చేశారని మరికొందరు వ్యసనం బారినపడుతున్నారు. ఒక్క గ్లాస్‌తో మొదలవుతున్న ఈ వ్యసనం.. జీవితాన్ని ఆసుపత్రిపాలుచేసే వరకూ కొనసాగుతోంది. సరదాగా ప్రారంభమవుతున్న ఈ అలవాట్లు చివరికి ఎందరి జీవితాలకో శాపంగా మారుతున్నాయి. చాలామంది సరదాగా గ్లాస్ పట్టి చివర కు దేవదాసులై పోతున్నారు. ఒక వ్యక్తి రోజుకు 360ఎంఎల్ మద్యం తీసుకుంటే కొన్నాళ్ల తర్వాత మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ మద్యం సేవిస్తున్నవారిలో 35 ఏళ్ల యువకులు 60శాతం ఉండడం విచారకరం. బాధితుల్లో దాదాపు 90 శాతం మద్యంతోపాటు ధూమపానం, గంజాయి, డ్రగ్స్, ఎక్కువగా ఉంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఉద్యోగం, ఉపాధి పొందినవారు ఎక్కువ శాతం మత్తుకు బానిస అవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సినిమాలు, ఇంటర్నెట్ ప్రభావం విస్తృతమయ్యాక ‘పార్టీల’ సంస్కృతి పెరిగింది. ఇటీవల లేట్‌నైట్ పార్టీ కల్చర్ యువతను ఆకుట్టుకుంటోంది. దీంతో ప్రతి ఆనందానికి మ ద్యం గ్లాసులు గలగలలాడుతున్నాయి. నలు గురు స్నేహితులు కలిస్తే చాలు.. మందు పార్టీ ఇప్పుడు ఫ్యాషన్‌గా తయారవుతోంది. గతంలో పోల్చితే మత్తు బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుమం దు తాగేవారు.. సిగరెట్ కాల్చేవారు ఒకేసారి మానేసినా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. చేతులు, కాళ్లు వణకడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ఒంటరితనంగా ఫీలవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి తక్షణమే మానసిక వైద్యనిపుణులకు చూపించాలని సూచిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే పగ్గాలు ముఖ్యం మత్తుకు బానిసై తీవ్ర మానసిక సమస్యలకు దారితీయకముందే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నా రు. అతిగా మద్యం, పొగ, గంజాయి, డ్రగ్స్ వంటి మ త్తు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఇలాంటి వా టిని ఫ్రాథమిక స్థాయిలో గుర్తించాల్సిన అవసరం ఉం ది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రా త్రివేళల్లో పార్టీలంటూ తరచూ పిల్లలు స్నేహితుల్లో కలి సి బయటకు వెళ్తుంటే ఆలాంటి వారిపై ఓ కన్నేసి ఉం చాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగులైతే పిల్లల్ని అశ్రద్ధ చేయడం కనిపిస్తోంది. దీంతో వారి లో తాము ఒంటరి అనే భావన కలిగి చివరికి చెడు వ్యసనాలకు అలవాటుపడుతారు. ఇంట్లో పెద్దలకు సమ యం లేకపోయినప్పటికీ పిల్లలతో గడిపేందుకు ప్రణా ళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం వారంలో ఒకరోజైనా పూర్తిగా వారితో గడపాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటినుంచే విలువలు నేర్పిస్తూ పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలువాలని సూచిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మందు, గుట్కా, సిగరెట్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటుంటారు. ఇది కూడా వారిపై ప్రభావం చూపుతోంది. యువత జోగుతోందిలా.. మంచిర్యాల జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో ప ట్టుబడుతున్న వారిలో 35ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉంటున్నారని పోలీస్‌వర్గాలు చెబుతున్నాయి. జిల్లా వాణిజ్య, వ్యాపారరంగంలో దినదినం అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ప్రధానంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. జిల్లాలో 7.30లక్షల జనాభా ఉండగా సుమారు 2 లక్షలకుపైగా ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. సింగరేణి ప్రాంతానికి చెందిన యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల, శ్రీరాంపూర్, సీసీ, బెల్లంపల్లి, మందమర్రి పోలీసులు ఇటీవల మద్యంమత్తులో ఉన్న యువకులను అ దుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. జిల్లా కేంద్రం లోని రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, కళాశాల రోడ్, ఏసీసీక్వారీ రోడ్ ప్రాంతాలను యువత డ్రగ్స్, గంజాయి, మద్యం సేవించేందుకు అడ్డాలుగా చేసుకుంటున్నట్లు సమాచారం. విస్తృతమవుతున్న డ్రగ్స్ వినియోగం మత్తు పదార్థాల వ్యాపారులు విద్యార్థులను, యువతను టార్గెట్ చేస్తూ మత్తులోకి దింపుతూ వ్యాపా రం సాగిస్తున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్.. ఇలా మత్తు పదార్థాలకు యువతరం బా నిసగా మారుతోంది. దినదినం అభివృద్ధి చెం దుతున్న పట్టణాల్లో విద్య, వైద్యం, విజ్ఞానరంగాల్లో గుర్తింపు పొందుతున్న విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం. విద్యార్థులు, యువత డ్రగ్స్ , గంజా యి, వాడకుండా కట్టడి చేయకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరా బాద్, మహా రాష్ట్ర, మహబూబాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి కొందరు డ్రగ్స్ ముఠా యువత ను టార్గెట్ చేస్తూ మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కదలికలపై దృష్టి పెట్టాలి పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసా రి వ్యసనం బారిన పడితే. వాటి నుంచి తప్పించుకునేందుకు శ్రమించాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగానో..? ఒంటరితనం భావనతో కొందరు. చెడుస్నేహాలతో మరికొందరు. ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి మద్యం తాగితే. మనసు దానిపట్ల ఆకర్షణ పెరిగిపోయి.. మానసిక సంఘర్షణకు లోనవుతుంటా రు. మెదడును ఉత్తేజపరిచే మద్యం.. క్రమంగా దానికి బానిసను చేస్తుంది. ఆ తర్వాత మెదడు చురుకుదనం కోల్పోతుంది. మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. – విశ్వేశ్వర్రావు,మానసిక వైద్యనిపుణులు, మంచిర్యాల తల్లిదండ్రులదే కీలక బాధ్యత నయాకల్చర్కు అవాటు పడుతున్న యువత సగం మందికిపైగా పెడదోవ పడుతున్నవారే ఉన్నారు. మద్యానికి బానిసలుగా మారడంతోపాటు గుట్కా, సిగరెట్ వంటివి వినియోగిస్తున్నారు. పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రులు సంపాదన ధ్యేయంగా పనిచేస్తుండడంతో వారు ఈ తరహ వ్యసనాల బారిన పడుతున్నారు. టీనేజీలో ఉన్న పిల్లలతో గడిపేందుకు సమయం కేటా యించి.. వారి దృష్టి ఇతర వ్యాపకాలవైపు మరల్చకుండా కంటికి రెప్పలా కాపాడాల్సి బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.– ఎడ్ల మహేష్, సీఐ, మంచిర్యాల -
అతడు సర్వాంతర్యామి
‘‘నమో హిరణ్యాయ నమః’’ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు.‘‘రమ్ము నారదా’’ అంటూ మహర్షికి స్వాగతం పలికాడు హిరణ్యకశిపుడు.‘‘దానవేంద్రులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు.మరలా ఏదైనా దండయాత్రకు ప్రయత్నమా?’’ అడిగాడు నారదుడు.‘‘ముల్లోకములు జయించినవాడికా!’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఇక తాను జయించవలసింది ఏమీ లేదనే భావన...ఆ జవాబులో ధ్వనించింది.‘‘మరి దీర్ఘాలోచనకు కారణం?’’ అడిగాడు నారదుడు.‘‘ప్రహ్లాదుడు’’ అన్నాడు హిరణ్యకశిపుడు విచారంగా.ప్రహ్లాదుడిని చూస్తూ...‘‘బుద్ధిమంతుడు’’ మెచ్చుకోలుగా అన్నాడు నారదుడు.‘‘మంద బుద్ధిమంతుడు’’ అన్నాడు విసుగ్గా హిరణ్యకశిపుడు.‘‘అదేమి దానవేంద్రా!’’ ఆశ్చర్యపోయాడు నారదుడు.‘‘ఇతనికి ఏదో జాడ్యం ఉన్నది. ఉలకడు. పలకడు. ఆకలి అనడు. దప్పి అనడు. తోటివాళ్లతో ఆడడు, పాడడు. అసలు తాను దానవ సార్వభౌముని పుత్రుడననే అహంకారం, దర్పం కానరాదు...’’ అని బాధగా చెప్పుకుపోతున్నాడు హిరణ్యకశిపుడు.(స్నేహితులు కూడా ప్రహ్లాదుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు....అటువంటి తండ్రికి ఇటువంటి కొడుకా! అని ఈసడించుకుంటున్నారు)‘‘ఒంటరిగా కూర్చొని తనలో తాను పిచ్చివాని వలే నవ్వుచుండును’’ అన్నది లీలావతి తన ముద్దుల కుమారుడిని గురించి.‘‘అవును. లీలావతి జ్ఞాపకమున్నదా? పసితనములో ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా ఉండేదిగానీ...’’ అని నారదుడు అన్నాడో లేదో హిరణ్యకశిపుడు అడ్డుపడ్డాడు.‘‘ఓహో ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమవాతావరణ ప్రభావము. గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాకాదులచే పోషించిన పుత్రుడు ఇట్లుగాక మరెట్లుండును’’ అన్నాడు హిరణ్యకశిపుడు వ్యంగ్యంగా.‘‘స్వామీ! చిరంజీవి ఇంకను పసివాడు. అతడిని ఉద్ధరించే మార్గం ఆలోచించండి’’ అని అభ్యర్థించింది లీలావతి.‘‘దీనికి ఒక్కటే మార్గం’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఆ తరువాత కొడుకును దగ్గరగా తీసుకొని...‘‘నాయనా! నీవు దానవకులదీపం. భావి సార్వభౌముడవు. సకలశాస్త్ర పారంగతుడవై, నీతికోవిదుడవై ముల్లోకములను పరిపాలించవలెను. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం’’ అన్నాడు.‘‘అలాగే తండ్రి! శ్రద్ధగా చదువుకొనెదను’’ వినయంగా సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు.‘‘సంతోషం’’ అన్నాడు హిరణ్యకశిపుడు.విద్య కోసం ప్రహ్లాదుడిని చండమార్కుల దగ్గరికి పంపారు.చండామార్కుల ఆశ్రమంలో.... ‘‘హరిభక్తి లేని వాడు పశువు కన్నా హీనం కదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.ఆ బాలుని కళ్లలో తెలియని దివ్యత్వం! ‘‘అయితే మల్లోకాధిపతి అయిన నీ తండ్రి, నీకు గురువులమైన మేము, ఈ దానవలోకం అంతా పశువులనా నువ్వు అనునది!’’ ఆందోళనస్వరంతో అడిగారు చండామార్కులు.‘‘హరి హరి గురుదూషణ పాపంకదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘పాపం పాపం అంటూనే గురువులకు పంగనామం పెడుతున్నావు’’ అని వెటకరించారు పెద్ద గురువు. ‘‘లేదు గురువర్యా! నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి’’ తన్మయంగా అన్నాడు ప్రహ్లాదుడు.ఎంత చెప్పినా శిష్యుడుగారు తమ మాటలు వినరని, పైగా తమకే పాఠాలు చెబుతాడనే విషయం చండామార్కులకు ఆ చిరుసమయంలో క్షుణ్ణంగా అర్థమైంది.ఇక పెద్దగురువు గారిలో వణుకు మొదలైంది.‘‘తమ్ముడూ...నా వొడలంతయూ కంపనముగా యున్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చెదను నాయనా!’’ అన్నారు పెద్ద గురువుగారు.‘అగ్రజా! నా వొడలు నీ కంటే కంపనముగా యున్నవి. నేనూ వచ్చెదను’’ అని అన్నగారి వణుకుతో తన వణుకును జత చేశాడు.గురువులు అలా వెళ్లారో లేదో విద్యార్థులు హుషారుగా ఆటలు మొదలు పెట్టారు.వారి ఆటలను చూసి...‘‘మిత్రులారా! శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థం చేయుట? అన్ని జన్మలలోనూ మానవజన్మ దుర్లభం. ఈ జీవితం నూరు సంవత్సరాలకు పరిమితం. ఈ నూరు సంవత్సరాలలో సగం రాత్రి రూపమున, నిద్ర రూపమున నిరర్థకం అగును. మిగిలిన యాభై ఏండ్లలో ఇరవై ఏండ్లు పోగా చివరికి మిగిలినముప్పది ఏండ్లలో సంసార లంపటమున చిక్కుకొని మానవుడు కామ క్రోధాది అరిషడ్వర్గములచే పీడించబడును. కావున...కాలం వ్యర్థం చేయక హరిభజనలో మోక్షం పొందుట ఉత్తమం, హరినామంకంటే రుచి అయినది లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘లేకేం...నరమాంసం’’ అన్నాడు ఒక విద్యార్థి.మిగిలిన వాళ్లు నవ్వారు.‘‘హరి అంటే ఎవరు?’’ అని ప్రహ్లాదుడిని అడిగాడు ఒకడు. ‘‘నారాయణుడు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘అతనికి రెండు పేర్లా?’’ అడిగాడు ఒకడు.‘‘రెండేమిటి! అతనికి అనంతకోటి నామాలు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘ఎందుకు?’’‘‘ఒకటైతే వాళ్ల అమ్మ మరిచిపోతుందని’’ వెటకారంగా అన్నాడు ఒకడు.‘‘అతని అమ్మ పేరేమిటి?’’‘‘అతనికి అమ్మ లేదు’’‘‘మరి నాన్నో?’’‘నాన్నా లేడు’’‘వాడెవడో విచిత్రమైన వాడునన్నట్లున్నాడే...ఏ ఉరు ఎక్కడ ఉంటాడు?’’ ఆసక్తిగా అడిగాడుఒకడు. ‘‘అతడు సర్వాంతర్యామి. అతను లేని చోటు లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘మరి ఎలా పుట్టాడు?’’‘‘అతనికి పుట్టుకయే లేదు’’‘‘మరి అతడిని చూసుట ఎట్లా?’’‘‘భక్తితోధ్యానించుటయే’’‘‘ఓంనమోనారాయణ....ఓం నమోనారాయణ’’పై సన్నివేశాలు ఏ సినిమాలోనివి? -
కన్నీటి గోదావరి
పెరవలి: ఎస్సై వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు స్నేహితులు విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ, మిరియాల వంశీ, సైపురెడ్డి నవీన్ కుమార్ పెరవలి మండలం కాకరపర్రు వద్ద గోదావరి తీరంలో విహారానికి ఉదయం 11 గంటలకు వచ్చారు. వీరు ఉదయం నుంచి ఆడుతూపాడుతూ గడిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి దిగారు. స్నానాలు చేయటానికి వచ్చారు. వీరిలో సైపురెడ్డి నవీన్ కుమార్ ఇసుక తెన్నెల్లోనే ఉండగా, మిగతా ముగ్గురు నదిలో దిగారు. లోతు లేదని కొద్దికొద్దిగా లోపలకు వెళ్లారు. ఒక్కసారిగా మునిగిపోయారు. దీనిని గమనించిన నవీన్‌కుమార్ స్నేహితులను రక్షించడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఎంతగా కేకలు వేసినా ఎవరూ రాకపోవడంతో ఏమీ చేయలేకపోయాడు. స్నేహితులు కళ్లముందే మునిగిపోవడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. పెరవలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పాడు. బంధువుల రోధనలు: విషయం తెలిసిన బంధువులు ఘటనా స్థలానికి వచ్చి తమ పిల్లల జాడ తెలియకపోవటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటి దగ్గర కూడా చెప్పకుండా వచ్చేశారని ఇలాంటి సమాచారం వస్తుందని అనుకోలేదని అంటూ వాపోయారు. ముమ్మరంగా గాలింపు గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారని తెలిసిన వెంటనే పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు సంఘటనా స్థలానికి సిబ్బందితో సహా వచ్చారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. స్థానికులను ఆరా తీశారు. చేపలు పట్టే వలలతోనూ యువకుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
‘సల్మాన్’ ఉసురు తీసిన టిక్-టాక్
జిమ్మిక్కుల సెలెంట్ కిల్లర్, మొబైల్ యాప్ టిక్-టాక్ వీడియోల వెర్రి యువత ప్రాణాలు తీస్తోంది. సోషల్ మీడియాలోఈ వీడియోల మోజు వికటించి అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది. దీనిపై ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణ స్నేహితుడి ఉసురు తీసిన వైనం కలకలం రేపింది. సల్మాన్, సొహైల్, అమీర్ ముగ్గురూ స్నేహితులు. ఆదివారం సాయంత్రం ముగ్గురు కారులో ఇండియా గేట్ వరకూ వెళ్లారు. అలా ఆ సాయంత్రం సరదాకి గడిపిన అనంతరం ముగ్గురూ తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంతలో టిక్-టాక్వీడియో తీసుకోవాలని కోరిక పుట్టింది సొహైల్‌కు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కారు డ్రైవ్ చేస్తున్న సల్మాన్ (19) పై గురిపెడుతూ.. టిక్-టాక్వీడియో తీయడానికి ప్రయత్నించాడు పక్క సీట్లో కూర్చున్న సొహైల్. కానీ దురదృష్టవశాత్తూ తుపాకి గుండు సల్మాన్ కుడి కణత భాగంలోకి చొచ్చుకుపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్‌ను చూసి వెనక సీట్లో అమీర్ సహా, సొహైల్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేహితుడికి ఇంటికి వెళ్లి రక్తపు మరకల బట్టలను మార్చుకుని.. సల్మాన్‌ను సమీపంలోని ఎల్ఎన్జెపీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఇంతలోనే సొహైల్, అతని స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అలా విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఢిల్లీ బరఖాంబ రోడ్డుకు సమీపంలో ని రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందుకున్నపోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. సల్మాన్, అతని స్నేహితుడు షరీఫ్‌లను అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హత్య, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు. కాగా న్యూ జఫర్బాద్ ప్రాంతంలో నివసించే సల్మాన్ తండ్రి వ్యాపారవేత్త అని సల్మాన్ బంధువు తెలిపారు. అండర్-గ్రాడ్యుయేట్ విద్యార్థి సల్మాన్ కుటుంబంలో చిన్నవాడు. అతనికి సోదరుడు, సోదరి ఉన్నారు. టిక్-టాక్ వీడియోల క్రేజ్‌లో మునిగి, వీడియోలను అప్లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
కుస్తీ మే సవాల్
స్త్రీకి జీవితంలో ప్రతిదీ ఒక కుస్తీనే.అలాంటి స్త్రీ.. కుస్తీ పోటీల్లో ఉంటే..భర్త చప్పట్లు కొట్టకపోతే ఎలా?!‘బెటర్ హాఫ్’గా ఒప్పుకున్నప్పుడుచేతికి రింగు తొడిగిస్తారు. బాక్సింగ్ చేసే చోటు కూడా రింగే. భార్య బాక్సింగ్ రింగ్‌ని ప్రేమించింది.భర్త భార్యను ప్రేమించాలి.. ‘విత్ దిస్ రింగ్’! ‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.వధువు, వరుడు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి అయిపోయింది. జనవరి 1 అది. పెళ్లికి వచ్చినవాళ్లలో ముగ్గురు స్నేహితురాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు కెరీర్లో పైపైకి ఎదగాలని కోరుకుంటున్న అమ్మాయి. ఇంకొకరు మంచి కాలమిస్టుగా ఎదుగుతున్న అమ్మాయి. మరొకరు ఒక అడుగు పైకి ఎగబాగుతూ, ఒక అడుగు కిందికి జారుతూ ఉన్న నటి. ఆ పెళ్లిలో ఆ ముగ్గురూ ఒక ఒప్పందానికి వస్తారు. సరిగ్గా ఏడాది లోపు తాము కూడా పెళ్లి చేసుకోవాలని. అంతగా పెళ్లిలోని ఆ రింగ్ సెరిమనీ వాళ్లలో ఉత్సాహం తెస్తుంది. పెళ్లిప్రమాణాల్లో ‘విత్ దిస్ రింగ్’ అనే మాటకు ఈ ముగ్గురు అమ్మాయిల చెంపలు కెంపులవుతాయి. నాలుగేళ్ల క్రితం అమెరికన్ టెలివిజన్ చానల్ ‘లైఫ్‌టైమ్’లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామాలోని థీమ్ ఇది. ఆ టీవీ మూవీ పేరు ‘విత్ దిస్ రింగ్’. ‘విత్ దిస్ రింగ్’ అనే పేరుతోనే ఇండియాలో ఈ ఫిబ్రవరిలో యూట్యూబ్‌లోకి ఒక డాక్యుమెంటరీ అప్లోడ్ అయింది. అందులోనూ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. మనకు తెలిసిన అమ్మాయిలే. మేరీకోమ్, సరితాదేవి, చోటో లోరా. ముగ్గురూ బాక్సర్లు. ‘నువ్వసలు అమ్మాయివేనా?’, ‘నీకు పెళ్లెలా అవుతుందనుకున్నావ్?’, ‘కండలున్న ఆడదాన్ని ఏ మగాడు చేసుకుంటాడు?’, ‘పరువు తియ్యడానికి పుట్టావే నువ్వు నా కడుపున’, ‘ఊళ్లో అంతా నవ్వుతున్నారు’, ‘నీ నడక ఎలా మారిపోతోందో తెలుసా.. ఆడతనాన్ని వెతుక్కోవలసి వస్తోంది’.. ఎన్ని మాటలు!! అన్నీ పడ్డారు. బాక్సింగ్ ప్రాణం అనుకున్నారు. కష్టాలు అనుభవించారు. తినీ తినకా బరిలో నిలబడ్డారు. ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. పతకాలు సాధించారు. ఊరేం సంతోషించలేదు. పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. బాక్సింగ్ రింగ్.. ఈ ముగ్గురి ఫస్ట్ మ్యారేజ్. ఆ తర్వాతే మ్యారేజ్ రింగ్. ఇంట్లో వద్దన్న పని చెయ్యడం కష్టం. ఊరు వద్దన్న పని చెయ్యడం ఇంకా కష్టం. ఆ రెండు కష్టాలనూ వీళ్లు బాక్సింగ్‌తో ముఖం మీద.. ముఖం మీద గుద్దేసి, విజేతలయ్యారు. ‘విత్ దిస్ రింగ్’ అనే ఈ డాక్యుమెంటరీ ఇప్పటికిప్పుడు యూట్యూబ్‌లో మీకు అందుబాటులో ఉంది. అయితే ఇవాళ మనస్టోరీ పై ముగ్గురి స్నేహితురాళ్లు, కింది ముగ్గురు మహిళా బాక్సర్ల గురించి కాదు. అమీషా జోషి, అన్నా సర్కిస్సియన్ అనే ఇద్దరు అమ్మాయిల గురించి! మేరీ కోమ్, సరితాదేవి, ఛోటో లోరాలపై డాక్యుమెంటరీ తీసింది వీళ్లే. బాక్సర్లుగా ఎదగడానికి ఆ ముగ్గరూ ఎంత కష్టపడ్డారో, వాళ్లపై డాక్యుమెంటరీ తియ్యడానికి వీళ్లిద్దరూ అంత కష్టపడ్డారు. గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రాన్ని తియ్యడానికి వీళ్లకు పదేళ్లు పట్టింది!!అమీషా, అన్నా ఎవరికి వారుగా ఫిల్మ్మేకర్లు. చిన్న వయసే. కెనడాలో ఉంటారు. అనుకోకుండా కలుసుకున్నారు. ఎవరైనా బయోపిక్‌లు, బయోబుక్లు తేవాలంటే.. ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరా అని వెదకుతారు. వీళ్లకు ఆ సమస్య లేదు. ప్రతి మహిళ జీవితమూ ఇన్స్పైరింగే వీళ్ల ఉద్దేశంలో. అయితే మేరీ, సరిత, ఛోటోల స్టోరీ అనుకున్నప్పుడు ఇన్స్పైరింగ్ని పక్కన పెట్టి, వాళ్ల స్ట్రగుల్‌ని ముఖ్యాంశంగా తీసుకున్నారు. ఎక్కడో ఈశాన్య భారతదేశంలో, పేదరికంలో, సంప్రదాయాల చట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఏంటి, బాక్సింగ్ రింగ్‌లోకి రావడమేంటి! వచ్చి విజయం సాధించడం ఏంటి! డాక్యుమెంటరీ తియ్యాల్సిందే అనుకున్నారు. ఊరికే అవుతుందా? రిసెర్చ్ అవసరం. ఆట టఫ్‌గా ఉంటుంది. ట్రైనింగ్ ఇంకా టఫ్‌గా ఉంటుంది. ఇక లేత బలహీనమైన ఎముకలు గల ఆ అమ్మాయిల మనోబలం వాటికి మించి టఫ్‌గా ఉందని.. అన్నా, అమీషలకు తెలుస్తూనే ఉంది. బయల్దేరారు. ఆ ముగ్గురు బాక్సర్లు పుట్టిన ఊరికి, ఆడిన ఊరికీ, పతకం గెలిచిన ఊరికీ తిరిగారు. శ్రమ పడ్డారు. నోట్స్ రాసుకున్నారు. షూట్స్ చేశారు. డబ్బులు ఖర్చుపెట్టారు. మరి వీటన్నిటికీ టైమ్? ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. సెలవురోజుల్లో కొంత పని. సెలవు పెట్టి కొంత పని. ఇలా పదేళ్లు.. ఓ భారీ నీటì పారుదల ప్రాజెక్టును కట్టినట్లుగా.. జీవితం అనే ఒక బరిలో, బాక్సింగ్ అనే ఇంకో బరిలో మేరీ, సరితా ఛోటో ఎలా నెగ్గుకొచ్చిందీ చిత్రీకరించారు. అన్నా అయితే ఒక ఆటగా బాక్సింగ్‌ను ఎప్పుడూ ఇష్టపడలేదు. మేరి, సరిత, ఛోటోల ఆట చూశారు కాబట్టి ఇష్టపడ్డారు. మామూలుగానైతే విస్మయపరిచే అనామక స్త్రీల జీవితాలను అన్నాను నమ్మోహనపరుస్తాయి. అయితే ఈ ముగ్గురి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు.. ఒక స్త్రీ జీవన పోరాటాన్ని డాక్యుమెంటరీని తీయడానికి అవసరమైన స్క్రీన్ ప్లే అన్నాకు లభించింది.పదేళ్ల తర్వాతనైనా డాక్యుమెంటరీ పూర్తయినందుకు అమీషా కూడా విశ్రాంతిగా వేళ్లు విరుచుకుంటున్నారు. ‘బాబోయ్.. చిన్న పనైతే కాదు’’ అని నవ్వుతోంది అమీషా. డాక్యుమెంటరీ కోసం ఈ ఇద్దరూ రోజూ సాయంత్రాలలో, శని ఆదివారాల్లో పూర్తిగా డే అంతా పని చేశారు. ప్రాజెక్టులో సగభాగం పూర్తయ్యాక.. సగంలో ఆపేద్దాం అని కూడా అనుకున్నారు. ఒళ్లంతా సినిమా రీళ్లు చుట్టుకుపోయి తమను బందీలను చేసినట్లు ఫీలయ్యారు. సొంత డబ్బు సరిపోవడం లేదు. ఫండింగ్ చేసేవాళ్లు.. మహిళల బాక్సింగ్ అంటే చిన్న పంచ్లాంటి చూపు విసిరి.. మీకేం పనిలేదా? పని లేని పనికి ఫండింగ్ కూడానా అన్నట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజు అమీషా అంది... ‘‘మనకేనా ఈ ఎగ్జయింట్మెంట్! ప్రపంచానికి లేదా?’’ అని. ‘మేరీ కోమ్’ సినిమా బాగా ఆడింది. ‘దంగల్’ ఇంకా బాగా ఆడింది. ఒకటి బాక్సింగ్. ఇంకొకటి రెజ్లింగ్. రెండూ స్త్రీలు చేసినవే. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లారు. డబ్బు సంపాదించడం కోసం కాదు. ముందసలు జనాల్లోకి వెళ్లాలి. పెళ్లి, పిల్లలు కాకుండా కెరియర్లో ఎదగాలన్న అభిలాష ఉన్న యువతుల జీవితాల్లో ఎంత కష్టం ఉంటుందో తెలియాలి. మహిళా బాక్సింగ్‌లో ఇండియాకు, కెనడాకు తేడా ఉంటుంది. కెనడా కన్నా ఇండియా చాలా నయం. కెనడానే కాదు, తక్కిన దేశాలతో పోలిస్తే కూడా.. ఉమెన్ బాక్సింగ్ ఈవెంట్‌కి ఇండియాలో డబ్బులు కుమ్మరించే స్పాన్సరర్లు చాలామందే ఉంటారు. కెనడాలో ఫండింగే ఉండదు. మహిళలు ఒక హాబీగా మాత్రమే ఆడతారు. వాళ్లకు సొంత జిమ్‌లు ఉంటాయి. ట్రైనర్‌ను పిలిపించుకుని అక్కడే శిక్షణ పొందుతారు. ముందు జాబ్ చూసుకుంటారు. బాక్సింగ్ పోటీలకు వెళ్లాలనుకున్నప్పుడు.. అప్పుడు ఫండ్ రైజింగ్ కోసం చూస్తారు. ఇండియాలో అసలు చదువుతున్నప్పుడే ఆర్థిక సహాయం చేసేవాళ్లుంటారు. ప్రభుత్వమూ ముందుకొస్తుంది. బాగా ఆడితే ఉద్యోగం ఇస్తుంది. ఒకసారి ఉద్యోగం వచ్చాక జీవితం స్థిరపడిననట్లే. ఇన్ని అవకాశాలు, సదుపాయాలు ఉన్నా కూడా భారతదేశంలో మహిళా బాక్సర్లు కుటుంబ ఆంక్షల వల్ల, పెళ్లి కాదేమోనన్న పెద్దవాళ్ల భయాల వల్ల ఆశను చంపుకోవలసి వస్తోంది. ఈ విషయాలన్నీ అన్నా, అమీషా ఇండియా టూర్లో ఉన్నప్పుడు అర్థం చేసుకున్నారు. వాటన్నిటినీ డాక్యుమెంటరీలో.. చూసింది చూసినట్లు చూపిస్తే ఈ ముగ్గురూ ఎగిరిపోయి, భారతదేశంలో క్రీడలకు లభిస్తున్న ప్రోత్సాహం ఒక్కటే కనిపిస్తుంది. అందుకే మొదట మేరీ కోమ్ చుట్టూ ఆమె నిజ జీవితాన్ని ఒక కథగా అల్లుకున్నారు. తర్వాత మిగతా ఇద్దరి లైఫ్‌ని, లైఫ్ అచీవ్మెంట్స్నీ తీసుకున్నారు. లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే లోపు సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. మేరీకోమ్‌కి, సరితకు పెళ్లయింది. మేరీ కోమ్ భర్త.. పిల్లల్ని భద్రంగా చూసుకుంటాడు. ఆట ఆడేందుకు అవసరమైన స్థిమితత్వాన్ని ఆమెకు చేకూరుస్తాడు. సరిత భర్త కూడా అంతే. వాళ్లకొక కొడుకు. సరిత ఈవెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడికి తల్లీ తండ్రీ అతడే. వాస్తవానికి మేరీ, సరిత.. పెళ్లయ్యాకే మెరుగైన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్లిలా శ్రమ పడడం, భర్త సహకరించడం.. డాక్యుమెంటరీలో ఇవేవీ నేరుగా చూపించలేదు అన్నా, అమీషా. చూస్తుంటే తెలిసిపోతుంది.. చిన్న మాట, చిన్న సహాయం తోడుగా ఉంటే స్త్రీలు ఎంత కష్టమైన ఆటలోనైనా అత్యున్నతస్థాయిలో రాణించగలరని.ఇంతకీ ఈ డాక్యుమెంటరీకి ‘విత్ దిస్ రింగ్’ అని పేరెందుకు పెట్టినట్లు?‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.. అనే పెళ్లి ప్రమాణంలోని ఈ మాటను ఇక్కడ మనం మరొక రకంగా అర్థం చేసుకోవాలి. ‘నిన్నే కాదు.. ఆటపై ఉన్న నీ ఇష్టాన్నీ ప్రేమిస్తున్నాను’ అని. జీవిత భాగస్వామిగా నీ ఇష్టానికి పూర్తి భాగం ఇస్తాను’ అని కూడా! అన్నా.. అమీష అభినందనీయులు. ►పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. ►అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే స్త్రీకి కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. ►లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే దారిలో సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. -
‘బండి’ దొరికిందని.. బరితెగించారు
సాక్షి, సిటీబ్యూరో: ఒకే ప్రాంతానికి చెందిన వారిద్దరూ స్నేహితులు. కూలీ, చిరుద్యోగి అయిన వారు ఆ సంపాదనతో తృప్తి చెందలేదు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు స్నాచింగ్స్ చేయాలని పథకం పన్నారు. కేవలం రూ.8 వేలు చెల్లిస్తే ఫైనాన్స్‌లో వాహనం వస్తుండటంతో దానిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రెండు కిస్తీలు చెల్లించే లోగా మూడు స్నాచింగ్స్ చేశారు. వీరి వ్యవహారాన్ని కనిపెట్టిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, జరాసాగరం, కాకరవాడకు చెందిన రవి నగరానికి వలసవచ్చి సూరారంలో ఉంటున్నాడు. మెదక్ జిల్లా, నర్సాపూర్ సమీపంలోని రెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు సైతం అదే ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. నిరక్షరాస్యుడైన రవి కూలీ పనులు చేస్తుండగా కొద్దిగా చదువుకున్న ఆంజనేయులు సూరారంలోని ఓ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూ పేరు మార్చుకుని అంజన్‌గా చెలామణి అవుతున్నాడు. ఒకే ప్రాంతంలో ఉంటున్న వీరు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. తమకు వచ్చే ఆదాయంతో తృప్తి చెందని ఇరువురూ తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? అనే అంశంపై తరచు చర్చలు జరిపైవారు. నగరంలో స్నాచింగ్స్ చేస్తే తేలిగ్గా, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే ఆస్కారం ఉందని రవి సలహా ఇచ్చాడు. దీనికి అంజన్ కూడా అంగీకరించడంతో ఆ నేరాలు చేయాలంటే ద్విచక్ర వాహనం ఉండాలని వారు భావించారు. అది కొనే స్థోమత లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అతి తక్కువ మొత్తం చెల్లించినా ఫైనాన్స్‌పై బైకులు ఇస్తున్నట్లు తెలియడంతో సదరు సంస్థను సంప్రదించిన వీరు రూ.8 వేలు చెల్లించి రెండు నెలల క్రితం బజాజ్ పల్సర్ బైక్ ఖరీదు చేశారు. దీనిపై తిరుగుతూ నగరంలోని అనేక ప్రాంతాల్లో రెక్కీలు చేశారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్లో ఒంటరి వారిని గుర్తించి టార్గెట్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అంజన్ హెల్మెట్ పెట్టుకుని వాహనం నడుపుతుండగా వెనుక కూర్చునే రవి స్నాచింగ్స్ చేసేవాడు. ఇలా ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 17 (ఆదివారం) మధ్య ఎస్సార్‌నగర్‌లో ఒకటి, సైబరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రెండు స్నాచింగ్స్ చేశారు. ఇలా తస్కరించిన పది తులాల బంగారాన్ని విక్రయించేందుకు నగరంలో సంచరిస్తున్నారు. ఈ చోరీలపై దృష్టి పెట్టిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ, కానిస్టేబుళ్లు సి.ప్రదీప్ సాగర్, జి.వినయ్ యాదవ్, ఎ.సత్యనారాయణ, కె.నయన్ దర్యాప్తు చేపట్టారు. ఎస్సార్ నగర్, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేశారు. ఫలితంగా స్నాచర్లకు సంబంధించిన కీలక ఆధారాలు చిక్కడంతో నగర వ్యాప్తంగా వలపన్నారు. చోరీ సొత్తును విక్రయించడానికి సోమవారం నగరానికి వచ్చిన వీరి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన 10 తులాల బంగారం, బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రైవేట్ సంస్థదే పాపం... ఈ ఇద్దరూ స్నాచర్లుగా మారడానికి ప్రధాన కారణం తక్కువ డౌన్ పేమెంట్‌తో బైక్ ఖరీదు చేసే అవకాశం ఉండటమే. కేవలం రూ.8 వేలు కట్టించుకుని మిగిలిన మొత్తం ఫైనాన్స్ ఇస్తూ ఓ ప్రైవేట్ సంస్థ వీరికి పల్సర్ వాహనం ఇచ్చింది. దీంతో రెండు కిస్తీలు చెల్లించేలోపే మూడు స్నాచింగ్స్ చేశారు. ఈ సంస్థలు సైతం బ్యాంకుల తరహాలో కనీసం 25 శాతం చెల్లిస్తే తప్ప వాహనాలు ఇవ్వకూడదు. అలాగే నగరానికి చెందిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేనుసైతం ప్రాజెక్టు కింద సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. అలా చేస్తే నేరాలు నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం కూడా సాధ్యమవుతాయి.– నగర పోలీసులు -
ఓ స్త్రీ కథ
ఇంట, బయట, ఆఫీసుల్లో, కార్ఖానాల్లో..గుడిలో, బడిలో, మడిలో..అంతటా ఆమే.అవని అంతా ఆమే.ఆమె లేనిది ఏమీ లేదు.ఆమె ఉన్న చోట లేనిదంటూ ఏదీ లేదు. ఈ ఆలోచన దూరదర్శన్ ఛానెల్‌ని 90ల కాలంలో అమాంతం ఆకాశమంత ఎత్తు పెంచేసింది. ఏక్ ఔరత్ కి కహాని అంటూ చిన్నతెర ఓ స్త్రీ కథను చెప్పడం మొదలుపెట్టింది.అది ‘శాంతి’గా అందరి మదిని తట్టి లేపింది. ఇలా మొదలు... దేశంలో అతి పెద్దదైన బాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు స్నేహితులతో ‘శాంతి’ కథ ప్రారంభమవుతుంది. ఈ ఇద్దరు స్నేహితుల పేర్లు కామేష్ మహదేవన్, రాజేష్ సింగ్. ఒకరు రచయిత, ఇంకొకరు దర్శకనిర్మాత. ఈ ఇద్దరూ అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో నివసిస్తుంటారు. శాంతి ఓ జర్నలిస్ట్ ప్రతీ ఒక్కరి వెనకాల ఓ గతం ఉంటుంది. ఆ గతాన్ని తెలుసుకొని, ఆ రహస్యాలను తన రచనల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తుంటుంది జర్నలిస్ట్ శాంతి. సంపన్నుల ఇళ్లలో పనిచేసే సర్వెంట్స్ సమస్యల మీద కామేష్, రాజ్‌లు ఓ సినిమా తీసి, మంచి పేరు సంపాదిస్తారు. సెలబ్రిటీలైన వీరిద్దరి బయోగ్రఫీలు రాయాలని అనుకుంటుంది శాంతి. ఓ రోజు కామేష్, రాజ్‌లను కలిసి మంచి సినిమా తీశారని అభినందిస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి కుటుంబాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం కామేష్, రాజ్‌లకు తెలియదు. గత కాలపు నీడల జాడలు కామేష్ పెద్ద కొడుకు రమేష్ బుద్ధిమాంద్యుడని, చిన్న కొడుకు సోమేష్ తన స్క్రిప్ట్‌ని చివరికి తండ్రి కూడా తిరస్కరించడంతో తీవ్ర మనోవేదనకు లోనై కుంగిపోయి ఉన్నాడని తెలుసుకుంటుంది. కామేష్ భార్య ఆయేషా గతంలో ఓ సినీ నిర్మాత కూతురు. ఆ నిర్మాత కెరీర్‌ను ఈ ఇద్దరు స్నేహితులు కలిసి నాశనం చేశారనే విషయం స్పష్టం అవుతుంది. తన దత్తత కూతురు నిధి భర్త కామేష్ అక్రమసంతామని చెబుతుంది ఆయేషా. కామేష్ కుటుంబం తర్వాత రాజ్ సింగ్ కుటుంబ సభ్యులను కలుసుకుంటుంది. రాజ్‌సింగ్ భార్య మనశ్శాంతి కోసం సాధువులను కలుసుకోవడానికి తరచూ ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటుంది. ఆమెను కలుసుకున్న శాంతికి ఎన్నో నిగూఢమైన విషయాలు తెలుస్తాయి. తన కొడుకు నిహాల్, అమెరికన్ ఫ్రెండ్ మైఖేల్‌కి తనకు పుట్టిన సంతానం అని శాంతి ముందు బయట పెడుతుంది రాజ్‌సింగ్ భార్య. కూతురు మాయ తల్లి దూరం అవడంతో డిప్రెషన్ బారిన పడుతుంది. స్త్రీలోలుడు అయిన పెద్ద కొడుకు రోహణ్ మోడల్ సశ ను పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉంటాడు. అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో ఉన్న వీరందరి గత జీవితాలను తెలుసుకునే క్రమంలో తన పుట్టుకకు కారణం ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతుంది శాంతి. ఒకప్పుడు శాంతి మాన్షన్ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసేది శాంతి తల్లి. ఆ మాన్షన్‌లోనే ఈ సినీ నిర్మాత, రచయిత కామేష్, రాజ్‌లు ఆమెపై లైంగిక దాడి చేస్తారు. గర్భవతి అయిన ఆమె ఒంటరిగా కూతుర్ని కని, పెంచి పెద్ద చేస్తుంది. పురుషాధిక్య సమాజంలో ఒంటరిగా ఒక తల్లి ఏ విధంగా జీవించిందో ఆమె పాత్ర స్పష్టం చేస్తుంది. సామాజిక, రాజMీ య శక్తులుగా ఎదిగిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె తన కూతురు పెంపకంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. స్త్రీ ఆధారిత సీరియల్స్‌కు చుక్కాని పాతికేళ్ల క్రితం సామాజిక సమస్యలను కళ్లకు కట్టిన తొలి డెయిలీ సీరియల్ శాంతి. 780 ఎపిసోడ్స్‌తో సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమైన శాంతి ఆ తర్వాత వచ్చిన స్త్రీ ఆధారిత సీరియల్స్‌కి స్ఫూర్తిగా నిలిచింది. అక్కణ్ణుంచే స్త్రీని శక్తిమంతురాలిగా, ప్రధాన పాత్రధారిణిగా చూపించడం మొదలుపెట్టింది చిన్నతెర. అలా ఆ తర్వాత వరసగా దూరదర్శన్‌లో వచ్చిన సీరియల్స్‌లో ‘రజని’ ఒకటి. ఓ మధ్యతరగతి గృహిణి సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం ఈ సీరియల్లో చూస్తాం. అటు తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను కళ్లకు కట్టిన ‘ఉడాన్’ సీరియల్‌కి దర్శకత్వ ప్రతిభను అందించింది కవితా చౌదరి భట్టాచార్య. ఈ సీరియల్లో లింగవివక్ష, మహిళా సాధికారిత.. వంటి పాయింట్స్‌ను బేసిక్‌గా తీసుకున్నారు. ఇది మొట్టమొదటి మహిళా ఓరియెంటెడ్ టీవీ షోగా దూరదర్శన్ హిస్టరీలో చేరింది. ఒక మహిళా పోలీస్ అధికారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ సీరియల్‌ని తీశారు. మహిళ ఎదగడానికి ఎలాంటి అడ్డంకులు లేవని, వారి కలలకు, ఆకాంక్షలకు అకాశమే హద్దు అని ఓ మహిళ ఈ సీరియల్‌ని డైరెక్ట్ చేసి చూపించారు. ఆ తర్వాత నేవీ అధికారిణిని పరిచయం చేస్తూ వచ్చిన ‘ఆరోహణ్’ సీరియల్ కూడా అదే బాటలో నడిచింది. ‘ఔరత్’ సీరియల్ ద్వారా కుటుంబంలో మహిళకు విద్య, సాధికారతతోపాటు పెళ్లి చేసుకోవడానికి వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళకు ఇచ్చి తీరాలని లాయర్ పాత్ర ద్వారా చూపించారు. ఇలా మహిళా అభ్యున్నతి కోసం పాటు పడే స్త్రీ ఆధారిత కథలు రావడం శాంతి సీరియల్ నుంచే మొదలయ్యాయి. – ఎన్.ఆర్. చాలామందికి ఆమె శాంతిగానే పరిచయం. మందిరాబేడి అనగానే శాంతి పేరు కూడా స్ఫురణకు వస్తుంది. ప్రేక్షకుల మదిలో అంతగా నిలిచిపోయేలా దర్శకుడు ఆది పోచా శాంతి పాత్రను మలచిన తీరు అమోఘం. 1994లో వచ్చిన శాంతి సీరియల్ ద్వారా మందిరాబేడి దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఇండియన్ టెలివిజన్‌లో ఒక జర్నలిస్టు పాత్రను పరిచయం చేసిన మొట్టమొదటి సీరియల్ శాంతి. అప్పటికే అడ్వరై్టజింగ్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నారు మందిరాబేడి. ఆ క్రమంలో దర్శకుడు ఆది పోచా దృష్టిలో పడ్డారు ఆమె. ట్రౌజర్, టీ షర్ట్–జీన్స్, సల్వార్, కమీజ్‌లతో మందిరాబేడికి ఆడిషన్ టెస్ట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మందిరాబేడి మాట్లాడుతూ – ‘శాంతి సీరియల్ తర్వాత నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. శాంతిలో ఏదో చిన్న పాత్ర ఇస్తారు అనుకున్నాను. కానీ, నేనే ‘శాంతి’ అన్నారు డైరెక్టర్. నమ్మలేకపోయా. నాకు ఈ ఫీల్డ్‌లో విధమైన బ్యాక్‌గ్రౌండ్ లేదు. నటనలో ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడితే గాని ఇలాంటి పాత్రలు రావు. అలాంటిది శాంతి పాత్ర నన్ను వరించింది. శాంతి చాలా ౖస్రాంగ్ ఉమెన్. ఎన్నో సమస్యలను సాల్వ్ చేస్తుంది. శాంతి నన్ను శక్తిమంతురాలిని చేసింది’ అన్నారామె. -
ఒక సర్కిల్.. నాలుగు కోణాలు
మనందరికీ స్నేహితులు. వాళ్లందరూ మన సర్కిల్.భిన్న వైరుధ్యాల వృత్తం అది.వృత్తంలో శృతులు తప్పుతాయి. కానీ వృత్తం శృతి తప్పదు. కుటుంబంతో పంచుకోలేనివి..సమాజంతో చెప్పుకోలేనివి..ఈ సర్కిల్లోనే ఆవిష్కృతం అవుతాయి. పరిష్కృతమూ అవుతాయి.నాలుగు స్తంభాల ఆటలోప్రతిష్టంభన ఉండదనిఈ నలుగురు అమ్మాయిల కథలు మనకు చెబుతాయి. టకీలా షాట్స్‌తో కష్టసుఖాలను పంచుకునే నలుగురు స్నేహితుల కథ.. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! ముంబైలోని పాష్ లొకాలిటీలో నివసిస్తూ అంతే ఆధునికమైన జీవనశైలితో పురుషాధిపత్య సమాజంలోని చాలెంజెస్‌ను ఎదుర్కొంటున్న ఆ నలుగురు.. దామిని రిజ్వి రాయ్, అంజనా మీనన్, ఉమంగ్ సింగ్, సిద్ధీ పటేల్. ఇంట్రడక్షన్ దామిని (సయాని గుప్తా).. జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెబ్‌సెట్‌కి ఫౌండర్. కుంభకోణాలు, రాజకీయ పర్యవసానాల మీద కథనాలు రాస్తూంటుంది. ఫియర్లెస్ జర్నలిస్ట్‌గా అవార్డులు..సోషల్ మీడియాలో పాపులారిటీ.. ట్రోలింగ్ సర్వసాధారణం ఆమెకు. అబ్సేషన్ కంపల్సివ్ డిజార్డర్.. రిలేషన్స్‌లో అసంతృప్తి కూడా ఆమె ఐడెంటిటీలో భాగమే. అంజనా మీనన్ (కృతి కుల్హరి).. ముంబైలో లీడింగ్ అడ్వకేట్. సింగిల్ మదర్. నాలుగేళ్ల కూతురు. భర్త వరుణ్ ఖన్నా. స్ట్రగులింగ్ స్క్రిప్ట్ రైటర్. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న ప్పటి నుంచీ అన్ని బాధ్యతలూ అంజనా భుజాల మీదే. కూతురు పుట్టాక కూడా వరుణ్‌లో ఎలాంటి మార్పు రాదు. కెరీర్ మీద దృష్టి పెట్టడు. అన్నిటినీ తేలికగా తీసుకునే అతని తత్వంతో విసిగిపోయి విడాకులు తీసుకుంటుంది అంజనా. అయితే కూతురు మీద భర్తకున్న హక్కును గౌరవిస్తుంది. భర్త జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆమె పేరు కావ్య. తన కూతురును చాలాబాగా చూసుకుంటూంటుంది. దాంతో పాపా ఆమెకు చాలా మాలిమి అవుతుంది. ఎంతలా అంటే ప్రతి విషయంలో తల్లిని కావ్యతో పోల్చుకునేంతలా. ఇది అంజనాకు ఇబ్బందిగానే కాదు బాధగానూ ఉంటుంది. అంజనా తల్లికీ కావ్య నచ్చుతుంది. తన బిడ్డలో లేని సహనం, అమ్మతనంలోని ఓపిక ఆమెకు కావ్యలో కనపడుతుంది. దాంతో ఆమే కావ్యకు దగ్గరవుతుంది. వీటన్నిటి వల్ల కావ్యతో సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది అంజనాకు.ఉమంగ్ సింగ్ (బాని జి).. లుథియానాలో పుట్టిపెరిగిన అమ్మాయి. జిమ్ ట్రైనర్. తన సెక్సువాలిటీ మీద అవగాహన, తనకేం కావాలో స్పష్టత ఉన్న మనిషి. బై సెక్సువల్. బాలీవుడ్ స్టార్ సమారా కపూర్ (లిసా రే) అంటే క్రష్.. ప్రేమ. సిద్ధీ పటేల్ (మాన్వి గగ్రూ).. వయసు మళ్లుతున్న అవివాహిత వాళ్లమ్మ దృష్టిలో. సంపన్న కుటుంబం. భోజన ప్రియురాలు, బొద్దుగా ఉంటుంది చిన్నప్పటి నుంచీ. బయటవాళ్లకంటే తల్లి దగ్గరే బాడీ షేమింగ్‌కు గురవుతూ ఉంటుంది. ఆమె తిండి మీదే కాదు ప్రవర్తన మీద కూడా బోలెడు ఆంక్షలు విధిస్తూ ఉంటుంది తల్లి. పెళ్లే ఆ పిల్లకున్న ఏకైక లక్ష్యమన్న భావనలో కూతురిని పడేస్తుంది. దీంతో తల్లి పట్ల అసహనంగా ఉంటుంది సిద్ధీ. అమ్మ కంటే తనను పెంచిన ఆయా అంటే ఆమెకు ఇష్టం, గౌరవం. తల్లి పోరు నుంచి తప్పించుకోవడానికి పెళ్లే మార్గమని సిద్ధీ ఓ నిశ్చయానికి వచ్చేస్తుంది. ట్రక్ బార్ తను పెట్టిన వెబ్సైట్లోనే తననే కార్నర్చేస్తూ ఆ మానసిక ఒత్తిడితో దామిని, ఏ పనీపాటా లేకుండా కాలక్షేపం చేస్తున్న భర్తతో విసిగిపోయిన అంజనా.. తనకు నచ్చిన తీరులో బతకడానికి ముంబై వచ్చిన ఉమంగ్.. అమ్మ చీవాట్లతో ఆత్మాభిమానం దెబ్బతిన్న సిద్ధీ.. ట్రక్బార్కు వస్తారు. ఒకరికొకరు పరిచయం అవుతారు. గూడు కట్టుకున్న దిగులుకు ఫోర్ మోర్ షాట్స్‌తో అవుట్ లెట్ కనుక్కుంటారు. ఒకరి లైఫ్ స్టయిల్ పట్ల ఒకరికి యాక్సెప్టెన్స్ ఉండదు. అలాగని వ్యతిరేకించుకోరు. గౌరవించుకుంటారు. నలుగురినీ కలుపుతున్న కామన్ పాయింట్స్ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అని తెలుసుకుంటారు. స్నేహాన్ని గట్టిచేసుకుంటారు. ఆ నాటి నుంచి ట్రక్బార్ మీటింగ్ పాయింట్ అవుతుంది వాళ్లకు. బార్ ఓనర్ (ప్రతీక్ బబ్బర్).. పురుషాధిపత్యం మీద వీళ్లు వేసుకునే జోకులు, చేసే కామెంట్స్‌కి శ్రోత అవుతాడు. సెకండ్ ఇన్నింగ్స్ కొత్త జీవితం మొదలుపెట్టాలని నలుగురికీ ఉంటుంది. వరుణ్ గర్ల్ ఫ్రెండ్ కావ్య తనలోని అమ్మతనాన్నే కాదు స్త్రీత్వాన్నీ సవాల్ చేసినట్టు ఫీలవుతుంది అంజనా. దాంతో తన ఆఫీస్‌లో అప్రెంటిస్‌గా చేరిన ఒక యంగ్ లాయర్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటుంది. ఈ ఆలోచనకు, అంతర్లీనంగా దాగి ఉన్న సంప్రదాయ భావాలకు మధ్య తీవ్ర ఘర్షణ మొదలవుతుంది అంజనాలో. ఆ అబ్బాయితో బంధాన్ని కోరుకుంటుంది కాని అది తన కూతురికి తెలియకుండా దాచాలనుకుంటుంది. ఈ విషయంలో ఆ అప్రెంటీస్కి, అంజనాకు మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఆ అప్రెంటీస్ ఇచ్చిన భరోసాతో సమాధానపడి అతనిని ఇంటికి పిలుస్తుంది అంజనా. అదే సమయానికి ఆమె మాజీ భర్త వరుణ్, అతని గర్ల్‌ఫ్రెండ్ కావ్యా ఇంటికి వస్తారు కూతురిని చూడ్డం కోసం. బాయ్‌ఫ్రెండ్‌తో అంజనా కనిపించే సరికి ఓర్చుకోలేక పోతాడు వరుణ్. ఆ అసూయను అణచిపెట్టుకుని కూతురికి జబ్బు చేసినప్పుడు బయటపెడ్తాడు. కూతురు కన్నా వేరే ఆసక్తులు ఎక్కువయ్యాయని ఆమెను అపరాధిగా చేసి కూతురి బాధ్యతను అంజనా నుంచి లాక్కోడానికి ప్రయత్నిస్తాడు. తనను తాను నిరూపించుకోవడానికి అంజనా తన రిలేషన్‌కు స్వస్తి చెప్పి కూతురిని తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇటు దామిని కూడా ఆఫీస్ పాలిటిక్స్‌తో విసిగిపోతుంది. వెబ్సైట్ కో ఫౌండర్స్ న్యూయార్క్‌లో మాస్ కామ్ చేసిన ఓ కొత్త అమ్మాయిని అప్పాయింట్ చేస్తారు గ్లామర్ న్యూస్‌తో వ్యూస్‌ను మరింత పెంచడానికి. సెలబ్రిటీల ప్రైవేట్ వ్యవహారాల మీద పెన్ పెట్టమని రిపోర్టర్లను ఆదేశిస్తుంది ఆ కొత్త అప్పాయింటీ. ఖంగు తింటుంది దామినీ. రానురాను తన ప్రాపకం, ప్రభావం తగ్గడంతో డీలా పడిపోతుంది. ఆ టైమ్‌లో ఆమెకు అండగా నిలుస్తాడు ట్రక్బార్ ఓనర్ (ప్రతీక్ బబ్బర్). అతనికి దగ్గరవుతుంది దామినీ. అనుకున్నట్టుగానే సమారాకు దగ్గరవుతుంది ఉమంగ్. ఆమెకు పర్సనల్ జిమ్ ట్రైనర్‌గా చేరి. అయితే తనకున్న పబ్లిసిటీ, ఫ్యాన్‌ఫాలోయింగ్ దృష్ట్యా ఉమంగ్‌ను తన పార్టనర్‌గా ఎక్కడా పరిచయం చేయదు సమారా. పార్టీల్లో కూడా కేవలం జిమ్ ట్రైనర్‌గానే పరిచయం చేస్తుంది. అవమానంగా భావిస్తుంది ఉమంగ్. ఈలోపే వాళ్లిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటోగ్రాఫ్ మీడియా, సోషల్ మీడియాలో వైరలై సమారా ఒక లెస్బియన్ అనే వార్తలు వస్తాయి. ఇది తన కెరీర్‌ను దెబ్బతీయనుందని ఉమంగ్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటుంది సమారా. అలా ఉమంగ్ మళ్లీ ఒంటరిదైపోతుంది. తల్లి పెట్టే నసతో ఆత్మన్యూనతకు గురైన సిద్ధీ.. అడల్ట్ వెబ్సైట్లో మొహం కనపడకుండా అర్థనగ్నంగా ఫోజులిస్తూ.. దానికి ఫాలోయింగ్‌తో ఆత్మస్థయిర్యం పెంచుకుంటూంటుంది. బ్లాక్మెయిల్ దామినీ బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి గోవా టూర్ వెళ్తారు నలుగురూ. అక్కడ సిద్ధీకి తన చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తాడు. అతను సిద్ధీని ఇష్టపడ్తుంటాడు. అతని సాహచర్యం సిద్ధీకీ నచ్చుతుంది. అతనితో ఉన్నప్పుడే ఒకసారి సిద్ధీకి బ్లాక్మెయిల్ మెస్సేజ్ వస్తుంది.. ‘‘నిన్ను హాఫ్ న్యూడ్‌గా చూడాలి.. వెంటనే ఆన్‌లైన్‌లోకి రా.. లేదంటే నీ ఫోటోస్ నీ బాయ్‌ఫ్రెండ్‌కి షేర్ చేస్తా’’ అంటూ. షాక్ అవుతుంది సిద్ధీ. గోవా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ బ్లాక్మెయిల్ వెంటాడుతుంది. సిద్ధీ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసి.. సంతోషంగా వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు. అటువైపు పేరెంట్స్ కూడా అభ్యంతరపెట్టరు. కాని ఎందుకనో సిద్ధీయే ఆనందంగా ఉండదు. అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపించదు ఆమెకు. ఇంతేనా జీవితం? అనుకుంటుంది. ఏదో సాధించాలనే తపన మొదలవుతుంది. ఈలోపు మళ్లీ బ్లాక్మెయిల్ మెస్సేజ్ వస్తుంది. ఫ్రెండ్స్‌ని బార్కి పిలుస్తుంది ఆ విషయం చెప్పడానికి. సిద్ధీకి కాబోయే మామగారు కనిపిస్తారు బార్లో. మెస్సేజ్‌లో వాడిన భాషతో మాట్లాడుతుంటాడు. అప్పుడు అర్థమవుతుంది సిద్ధీకి ఆ బ్లాక్మెయిల్ తనకు కాబోయే మామ నుంచే అని. అతన్ని చెంప దెబ్బ కొడ్తుంది. ‘‘ఛీ నీలాంటి దాన్నా నా ఇంటికి కోడలుగా చేసుకునేది?’ అంటాడు. ‘‘ముందు నీలాంటి వాడి ఇంటికి కోడలుగా రావడానికి నేను సిద్ధంగా లేను’’ అని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇటు దామిని కలిసి ఉండాలనుకున్న ట్రక్ బార్ ఓనర్ దగ్గరకు అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ వచ్చేస్తుంది. అలా దామినీ ఒంటరే అయిపోతుంది. అలా మళ్లీ నలుగురు.. ట్రక్ బార్లో కలుసుకొని ఫోర్ మోర్ షాట్స్ తీసుకుని సడలని ఆత్మవిశ్వాసంతో ఒంటరి పోరాటానికి సిద్ధపడ్తారు. ఇదీ కథ. టకీలా బాటిల్లో స్త్రీ సాధికారతను.. షాట్స్‌లో ఆమె స్వేచ్ఛను పోసి స్ట్రీమింగ్ చేస్తోంది అమేజాన్ ప్రైమ్ ‘‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’’ పేరుతో! – సరస్వతి రమ -
వీడని స్నేహం
చిన్ననాటి వారి స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టి్టంది. ఎప్పుడు కలిసిమెలిసి ఉండే వారిపై పగబట్టింది. రోడ్డు ప్రమాదంలో వారిని కబళించింది. పండగ వేళ ఆ రెండు కుటుంబాల్లో పెనువిషాదం నింపింది. కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉండే కుమారులు అందనిలోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. బీచ్‌రోడ్డులోని రుషికొండ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విషాదకరమైన ఈ సంఘటన చోటుచేసుకుంది. జాలరి ఎండాడకు చెందిన దేశయ్య, అప్పుఘర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్, జాలరిపేటకు చెందిన సాయికుమార్ రుషికొండ ప్రాంతానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దేశయ్య, ప్రవీణ్‌కుమార్‌లు అక్కడికక్కడే మృతి చెందగా సాయికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుడికి కూడా అక్కడే వైద్యం అందిస్తున్నారు. ఎంవీపీకాలనీ/పీఎంపాలెం: నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఆ ఇద్దరు స్నేహితులు కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా కలిసే వెళ్తారు. ఏ పని చేసినా కలిసి మాట్లాడుకుని చేస్తారు. అందుకే విధికి కన్ను కుట్టిందేమో.. వారిని రోడ్డు ప్రమాద రూపంలో కబళించి వారి ఆశలను మొగ్గలోనే తుంచేసింది. బీచ్‌రోడ్డులో పెద రుషికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నతనం నుంచి స్నేహితులైన ఈ యువకులు చివరికి ఒక్కటి గానే తనువు చాలించి అటు కన్నవారిని, ఇటు ఆత్మీయులను శోకసంద్రంలో ముంచారు. పండగ పూట ఊహించని రితీగా వారి ఆయువు అనంతలోకాల్లో కలిసిపోవడం స్థానికులను కలచివేసింది. బీచ్‌రోడ్డులో పెద రుషికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొ ట్టు మిట్టాడుతున్నాడు. పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ సీఐ ఈ.వెంకునాయుడు తెలిపిన వివరాలివి. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన పండా ప్రవీణ్‌కుమార్ (20), జాలరి ఎండాడకు చెందిన చింతపల్లి దేశయ్య అలియాస్ రాజేష్(19), పెదజాలరి పేటకు చెందిన పి. సాయికుమార్లు బైక్‌పై ఆదివారం బీచ్‌రోడ్డు మీదుగా భీమిలి వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అతివేగంగా ప్ర యాణిస్తూ.. పెదరుషికొండ సాయి రిసార్ట్స్ ఎదురుగా ఉన్న స్పీడ్‌బ్రేకర్ వద్ద ముందుగా డివైడర్‌ను.. ఆ తర్వాత చెట్టును బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో దేశయ్య, ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సాయికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రుడికి కేజీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా.. దేశయ్య, ప్రవీణ్‌ల మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆదివారం కావడంతో సోమవారం వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుందని సీఐ తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమా.. ద్విచక్రవాహనంపై అతివేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావి స్తున్నారు. ఒకే వాహనంపై దూసుకు వస్తూ స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేకపోయారు. ఆ సమయంలో బైక్‌ను అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో ముందు డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టును ఢీ కొని దుర్మరణం పాలయ్యారు. ప్రవీణ్ కుమార్ అన్నయ్య సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఇద్దరివీ నిరుపేద కుటుంబాలే.. అందివచ్చిన ఈ ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడాన్ని వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చింతపల్లి దేశయ్య తండ్రి ధనరాజు చేపలవేటనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. దేశయ్య చిన్నవాడు. జాలరి ఎండాడలోని పూరి గుడిసెలో వీరు నివాసముంటున్నారు. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన ప్రవీణకుమార్ కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. కనీసం ఉండటానికి ఇల్లు లేని వీరు చిన్న ఇంటిలో అద్దెకు నివాసముంటున్నారు. ప్రవీణ్ తండ్రి మహవీర్ మార్బుల్స్ వర్క్ చేస్తుండగా అన్న సునీల్‌కుమార్ ఏపీ టూరిజం బార్లో పనిచేస్తున్నాడు. చెల్లి ఇంటి పనులు చేస్తోంది. ప్రవీణ్‌కుమార్, దేశయ్యలిద్దరూ ఇంటికి చిన్న కుమారులే. చిన్నాడంటే ఎంతో గారాబం మాది నిరుపేద కుటుంబం. దశాబ్దాలుగా పూడి గుడిసెలోనే నివాసం ఉంటున్నాం. ఇప్పుడిప్పుడే పిల్లలు అందివస్తున్నారు. కుటుంబం కూడా కుదుటపడుతోంది. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఇటీవల నాకు ప్రమాదం జరిగి చెయ్యి విరిగింది. కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొడుకు దూరమయ్యాడు. సమస్యలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నాడంటే వాళ్ల అమ్మకు ఎంతో గారాబం. తను తిన్నా తినకపోయినా.. పిల్లలకు ఏవి కావాలంటే అవి వండి పెడుతుంది. తనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు – చింతపల్లి ధనరాజు, దేశయ్య తండ్రి నాకు కావాల్సింది తెస్తానన్నాడు 2000లో నా కోడలు మృతి చెందింది. చిన్నతనం నుంచి అమ్మ లేకుండానే నా మనమడు పెరిగాడు. తల్లి లేని లోటు తెలియకుండా ప్రవీణ్‌కుమార్‌తో పాటు మిగతా ఇద్దరినీ పెంచాం. మాకు సొంత ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం అప్పుఘర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నాం. ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఇంట్లోనే ఉన్న ప్రవీణ్ తన స్నేహితులు రావడంతో బయటకు వెళ్లివస్తానని చెప్పాడు. ఎక్కడికి అని అడగ్గా.. వచ్చేటప్పుడు నీకు కావాల్సింది తెస్తానంటూ వెళ్లిపోయాడు. నాకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో అదే తీసుకొస్తాడు అనుకున్నా.. అయితే అదే చివరి మాట, చివరి చూపు అవుతుందని అనుకోలేదు. ఇంత చిన్న వయసులో వాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మొత్తం కుటుంబాన్నే దుఃఖసాగరంలో ముంచింది. –పండా దేవానంద్, ప్రవీణ్‌కుమార్ తాత ప్రాణమిచ్చే స్నేహం వీరిది.. దేశయ్య, ప్రవీణ్ కుమార్‌లు చిన్నతనం నుంచి స్నేహితులు. 6వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి కూలి పనులు, చేపల వేట చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కొన్నేళ్ల కిందట ప్రవీణ్‌కుమార్ కుటుంబం జాలారి ఎండాడకు పక్కనే ఉన్న అప్పుఘర్‌కు నివాసం మార్చింది. ఆ తర్వాత పెయింటింగ్ పనులు నేర్చుకున్నారు. ఈ క్రమంలో వీరికి సాయికుమార్ పరిచయమయ్యాడు.కొన్నేళ్లుగా వీరు ముగ్గురూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వీరికి కలిసి వెళ్లడం అలవాటని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పని లేని సమయంలో సరదాగా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. పండగ కావడంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో ముగ్గురు కలిసి బయటకు వెళ్లి.. ఇలా ప్రమాదానికి గురయ్యారని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
మిత్రుడి ఒడి – తల్లి ఒడి
బౌద్ధసంఘంలో అగ్రభిక్షువుల్లో సారిపుత్రుడు, మౌద్గల్యాయనులు ముఖ్యులు. చిరకాలంగా మంచి మిత్రులు కూడా. వారిద్దరూ కలసిమెలసి ఉండటం చూసి, ఈర్ష్యనొందిన ఒక వ్యక్తి వారిద్దరి మధ్య తగవులు పెట్టాలనుకున్నాడు. ఒకరి మీద ఒకరికి చెప్పాడు. అలా వీలైనప్పుడల్లా చెప్తూనే ఉండేవాడు. అతని విషయం బుద్ధునికి తెలిసింది. ఒకరోజున భిక్షువులందరూ ఉన్న సమయంలో ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక సింహం, ఒక పులి ఒకే గుహలో అన్యోన్యంగా కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. వాటి దాపున ఉన్న బొరియలో ఒక నక్క కూడా ఉండేది. సింహం, పులి వేటాడి తెచ్చి, తినగా మిగిలిన మాంసాన్ని తిని జీవించేది. ఎంతో వినయం నటిస్తూ సింహానికి, పులికి సేవలు చేస్తూ ఉండేది. అలా కొన్నాళ్లకు అది దుక్కలా బలిసింది. ఒకరోజున అది ఇలా ఆలోచించింది. నేను ఎన్నో జంతువుల మాంసాల్ని రుచి చూశాను. సింహం, పులి మాంసాల్ని రుచి చూడలేదు. ఈ రెండింటికి తగవు పెట్టి, చంపుకునేలా చేసి, వీటి మాంసాన్ని తినాలి’’ అనుకుని సింహం దగ్గరకు వెళ్లి– ‘‘మహాశయా! మీకూ పులికీ మధ్య గొడవలేమైనా వచ్చాయా ఏమిటి?’’అంది. ‘‘ఎందుకలా అడిగావు?’’ అడిగింది సింహం.‘‘శరీర రంగులోనూ, బలంలోనూ, అందంలోనూ, శౌర్యంలోనూ నాలో ఒక వంతుకు కూడా సరిపోదు సింహం అని అందే ఆ పులి’’ అన్నది. ‘‘ నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పులి మిత్రుడు అలాంటి వాడు కాదు. నీవు మా మధ్య వుండ తగవు, వెంటనే వెళ్లిపో’’ అని కసిరి కొట్టింది సింహం. నక్క చెప్పిన మాటలు పులితోకూడా చెప్పలేదు సింహం. మరునాడు నక్క పులి దగ్గరకు వెళ్లి సింహానికి చెప్పినట్టే చెప్పింది. పులి కూడా నక్కను తరిమి కొట్టింది. కానీ వచ్చి– ‘‘మిత్రమా! నా గురించి ఇలా అన్నావా?’’ అని అడిగింది. అప్పుడు సింహం– పులి మిత్రమా! ఆ నక్కది దుష్టబుద్ధి. నాకూ అలాగే చెప్పింది. నీకు ఒక మాట చెప్తాను విను. మైత్రి అంటే... ఎవరెన్ని కొండీలు చెప్పినా నమ్మనిది. ఒక బిడ్డ తల్లి ఒడిలో తలపెట్టి ఎంత నిర్భీతిగా నిదురిస్తాడో, ఒక స్నేహితుని ఒడిలో తలపెట్టి మరో స్నేహితుడు అంత నిర్భీతిగా నిదురించేది. అదీ అసలైన మైత్రి’’ అని చెప్పగా– ‘‘మిత్రమా! నన్ను క్షమించు. ఇలా అన్నావా? అని వచ్చి అడగడం నా తప్పే’’ అని క్షమాపణలు కోరింది. ఈ కథ విన్న సారిపుత్రుడు, మౌద్గల్యాయనులూ ఆ వ్యక్తిని దూరం పెట్టారు. మరణించేవరకూ మిత్రులుగా జీవించారు. – డా. బొర్రా గోవర్ధన్ -
అమ్మకానికి తుపాకీ..!
సాక్షి, హైదరాబాద్: ఆయుధాన్ని అక్రమంగా బిహార్ నుంచి తీసుకువచ్చి వాట్సాప్ ద్వారా రూ.60 వేల రేటుకు అమ్మకానికి పెట్టిన ఓ మిత్రుల బృందం గుట్టును హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అక్కడి ఛాబ్రా ప్రాంతంలో తయారైన ఆయుధాన్ని ఎక్కువ రేటుకు అమ్మేందుకు ఓ వ్యక్తి ఖరీదు చేయగా... అది అనేక చేతులు మారి ఓ ఆభరణాల వ్యాపారి వద్దకు వచ్చింది. అతను ఓ వ్యక్తికి తాను ఇచ్చిన అప్పునకు గాను తుపాకీని జమ చేసుకోవడం కొసమెరుపు. ఈ జట్టుకు చెందిన మొత్తం ఆరుగురిని పట్టుకుని, నాటు తుపాకీ , మూ డు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. టీ తాగి వచ్చేలోపు... బిహార్ రాజధాని పట్నాకు 30 కిమీ దూరంలోని ఛాబ్రా ప్రాంతం అడవికి దగ్గరలో ఉంటుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఇక్కడ నాటు తుపాకుల్ని తయారు చేసే కొన్ని కార్ఖానాలు వెలిశాయి. అక్కడ నాటు రివాల్వర్, పిస్టల్స్‌కు చెందిన విడి భాగాలను తయారు చేసి ఛాబ్రా వరకు తీసువచ్చి భద్రపరుస్తా రు. కొనుగోలుదారుడు ఎవరైనా వచ్చి తుపాకీకి డ బ్బు చెల్లిస్తే... దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి టీ తాగి రమ్మంటారు.దానికి పట్టే పావు గంటలో విడిభాగాలను అసెంబుల్ చేసి తుపాకీ సిద్ధం చేసి అందిస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర లోని పుణేలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న హుస్సేన్ గౌస్ మహ్మద్ ఖాన్ స్వస్థలం ఛాబ్రా. కొన్నాళ్ల క్రితం అక్కడకు వెళ్లిన ఖాన్ రూ.20 వేలు వెచ్చించి ఓ నాటు పిస్టల్, మూడు తూటాలు కొన్నాడు. విక్రయం కోసం సిటీకి తీసుకువచ్చి... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పి.ప్రకాష్ కుటుంబం కొన్నేళ్ల క్రితమే పుణేకు వలసపోయింది. అక్కడ ఉండగా తమ ఇంటి సమీపంలో నివసించే ఖాన్‌తో ఇతడికి పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ప్రకాష్ హైదరాబాద్‌కు వచ్చేసినా వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇలా ఖాన్ తాను ఖరీదు చేసిన తుపాకీ విషయం ఇతడికి చెప్పి విక్రయించమన్నాడు. అలా వచ్చిన మొత్తం ఇద్దరం పంచుకుందామని చెప్పాడు. అంగీకరించిన ప్రకాష్ ఆయుధం తీసుకువచ్చాడు. అతనికి ఓ వివాహ సందర్భంలో పరిగికి చెందిన జె.మోహన్‌తో పరిచయమైంది. దీంతో తుపాకీని అమ్మిపెట్టమని,లాభం పంచుకుందామంటూ అతనికి అందించాడు. ఇలా ముగ్గురూ దీని అమ్మకంపై దృష్టి సారించి ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. చిత్రంగా జ్యువెల్లరీ షాపు యజమాని వద్దకు... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మోహన్ కొన్నాళ్ల క్రితం పరిగికి చెందిన అజయ్ జ్యువెల్లర్స్ యజమాని నరేంద్ర చౌదరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చాలని నరేంద్ర ఇటీవల ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన మోహన్ తన వద్ద ఓ నాటు తుపాకీ ఉందని, దాన్ని అమ్మి ఆ డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు.సమ్మతించిన నరేంద్ర తానే విక్రయిస్తానని, వచ్చిన మొత్తంలో తన బాకీ మినహాయించుకుని మిగిలింది ఇస్తాననడంతో మోహన్ పిస్టల్‌ను అతనికి అప్పగించాడు. కొన్నాళ్లకు నరేంద్ర దాన్ని భద్రపరచమని సికింద్రాబాద్‌కు చెందిన తన స్నేహితులు నేమి చాంద్, గన్పత్ జట్లకు ఇచ్చాడు. వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసేసరికి... కొన్నాళ్లుగా ఈ పిస్టల్ ఖరీదు చేసే కస్టమర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించిన నరేంద్ర తన స్నేహితుల బృందానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో ‘రూ.60 వేలకు వెపన్ ఫర్ సేల్’అంటూ పోస్టింగ్ పెట్టాడు. నిజమా? కాదా? అంటూ కొందరు చాట్ చేయడంతో ఆధారాలకోసం పిస్టల్ ఫొటో, తూటాల చిత్రం పెట్టాడు. ఈ విషయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు దృష్టికి వచ్చింది. ఆయన నేతృత్వంలో పోలీసు బృందాలు వరుసదాడులు చేశాయి. ఫలితంగా ఆరుగురు నిందితులు అరెస్టు కావడంతో పాటు తుపాకీ, తూటాలు రికవరీ అయ్యాయి. -
పరిగి వాసి బెంగళూరులో ఆత్మహత్య
అనంతపురం ,పరిగి: పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన హాసీబ్‌బాషా(28) ఆదివారం కర్ణాటకలోని బెంగళూరులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం అదే రోజు రాత్రి పలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసి చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. కొడిగెనహళ్లి గ్రామంలో నివాసముంటున్న కార్పెంటర్ అన్వర్ రెండవ కుమారుడు హసీబ్ ద్విచక్రవాహన మెకానిక్. కొన్నాళ్లు గ్రామంలోని తన ఇంటి పక్కనే పని చేసుకుంటూ ఏడేళ్ల క్రితం బెంగళూరులో షాపు పెట్టాడు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన ఓ మిత్రుని కారణంగా నష్టపోయినట్లు హసీబ్ ఆదివారం ఉదయం బెంగళూరులోని తన రూంలో వీడియో రికార్డు చేసి తరువాత తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు యథాతథంగా.. ‘‘నాది ఆంద్రప్రదేశ్. అనంతపురం జిల్లా హిందూపురం పక్కనున్న పరిగి మండలంలోని కొడిగెనహళ్లి. గత ఏడు సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నా. నేను చాలా కష్టపడినాను. ఒక అంగడి బాడుగకు తీసుకుని నడిపాను. ఐదేళ్లుగా బిజినెస్ బాగా జరిగింది. మధ్యలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత కాలంలో బాగా నన్ను ఇబ్బందులకు గురిచేశాడు. అంగడి తీసేయమని, నీకు వేరే దారి చూపిస్తానని నమ్మబలికాడు. అలాగే నా జతలో వచ్చేయి.. నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలపడంతో నాకు నమ్మకం కలగలేదు. ఎక్కువగా ఒత్తిడి చేసి చివరకు దుకాణం బంద్ చేయించాడు. మాయమాటలు చెప్పి షాపు మూయించేదాకా నన్ను వదల్లేదు. తరువాత కొంతకాలం గడిచింది. ఇక నన్ను పట్టించుకోవడం మానేశాడు. ఏదో పని చూపిస్తానని చెప్పావు కదా.. నాకేదైనా దారి చూపించమని ప్రాధేయపడ్డాను. చివరకు నేనే బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో పనిలో చేరాను. అక్కడికి వెళ్లి రావడానికి ఎంతో వ్యయప్రయాసలకు లోనయ్యా. కడుపు నిండితే చాలని కష్టాలను ఎదుర్కొన్నాను. నేనున్న ఇంటి ఓనర్ చాలా మంచి వ్యక్తి. నాకు ఆర్థికంగా ఎంతో సపోర్టు ఇచ్చారు. రూ.1.20 లక్షలు ఓనరుకు బాకీ పడ్డాను. నేను ఆత్మహత్య చేసుకున్నాక ఇంటి ఓనరుకు కచ్చితంగా నాబాకీ ఇచ్చేయమని ప్రాధేయపడుతున్నా. నాకు ఇబ్బందులు పెట్టి నా జీవితాన్ని నాశనం చేసిన మహేష్ అనే వ్యక్తిని ఎట్టిపరిస్థితిల్లోనూ వదలొద్దు. శిక్షించాలి. సర్జాపూర్‌లో పెద్ద మనుషులు ఉన్నారు. అందులో సద్దాం, కటింగ్ శీనా ఓం శక్తి మంజు మిగిలిన మా కుల పెద్దలు ఉన్నారు. వారంతా నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. బెంగళూరులోనే అతి పెద్ద మనిషిగా ఉన్న జమీర్ అన్నను రిక్వెస్ట్ చేస్తున్నా.. నాకు మోసం చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. మిగిలిన వారంతా నాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నాకు కర్ణాటకలో జమీర్ అన్న.. ఆంధ్ర లో వైఎస్ జగనన్న అంటే ప్రాణం..(నవ్వుతూ).. జగనన్న సీఎం అవడం ఖాయం.. ఆంధ్రలో ఈసారి వైఎస్ జగనన్న సీఎం కావడం గ్యారెంటీ. ఆయనంటే నాకు అమితమైన ఇష్టం. జగనన్న ఒక్కసారి సీఎం అయితే ప్రతి పిల్లోడి నుంచీ ముసలివాళ్ల వరకూ జీవితాలు బాగుపడతాయి. ఎంతో నమ్మకంగా పాలన అందిస్తారనుకుంటున్నా. మా తల్లిదండ్రులు నాకేమి లోటు చేయలేదు. వారి గురించి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. వారికి చాలా దుఃఖం కలిగించాను. వారిని అనేక ఇబ్బందులు పెట్టాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ప్రతి ఒక్కరికీ డౌట్ రావచ్చు. నా గురించి ఎవరినీ ఇబ్బందులు పెట్టొద్దండి. కానీ ఆ ఒక్కడిని మాత్రం వదలొద్దండి. వాడికి శిక్ష పడాలి. మహేష్ అనే వాడి ఫొటో, సెల్ ఫోన్ నెంబరును ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నా. 10–15 నిమిషాల్లో ఆత్మహత్య చేసుకోబోతున్నా. నాకు మాటలు రావడం లేదు. డబ్బుకోసం చనిపోతున్నాడని భావించకండి. మనిషి డబ్బును సంపాదిస్తాడు.. కానీ డబ్బు మనిషిని సంపాదించలేదు.’’ -
మరణంలోనూ వీడని బంధం
చిత్తూరు ,తవణంపల్లె: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలసిమెలిసి ఉండేవారు..ఇద్దరికీ రెండేళ్ల వయసు తేడా. ఒకే గ్రామానికి చెందిన వీరు కలిసి ఒకే చోట చదువుకున్నారు. ఇద్దరూ ఉపాధ్యాయులుగానే పనిచేశారు. వీరిద్దరూ ఒకేరోజు(ఆదివారం) అనారోగ్యంతో కన్నుమూశారు. మృత్యువు దగ్గరా వీరి బంధం వీడిపోలేదని స్థానికులు కంటతడి పెట్టారు. తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన కేశవులురెడ్డి, హేమసుందరరెడ్డి చిన్న నాటి నుంచి కలిసి ఉండేవారు. ఇద్దరూ వెంగంపల్లె పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అరగొండ హైస్కూల్లో కూడా ఎస్ఎస్ఎల్సీ వరకూ చదువుకొన్నారు. తర్వాత ఇద్దరూ బీఈడీ చదివారు. 1984లో వెంగంపల్లె ప్రాథమిక పాఠశాలలో కేశవులు రెడ్డి పనిచేశారు. తొడతర ప్రాథమిక పాఠశాలలో హేమసుందర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పద్యోగంలో చేరారు. పలు పాఠశాలలో పనిచేసిన కేశవులు రెడ్డి 2009లో అరగొండ హైస్కూల్లో రిటైరయ్యారు. తర్వాత రెండేళ్లకు హేమసుందరరెడ్డి కూడా ఉద్యోగ విరమణ చేశారు. హేమసుందర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేశవులు రెడ్డికి భార్య..ఒక కుమార్తె సంధ్యారాణి. ఈమె బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. వరుసకు అన్నదమ్ములైన కేశవులు..హేమసుందర్ రిటైరయ్యాక ఒకే గ్రామంలో ఉంటున్నారు. వీరిద్దరికీ అనారోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం కేశవులు..రాత్రి హేమసుందరరెడ్డి కన్నుమూశారు. మరణం దగ్గర వీరి బంధం చెదిరిపోలేదు. ఒకేరోజు చనిపోయారంటూ గ్రామస్తులంతా చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్ వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
స్త్రీలోక సంచారం
‘స్నేహితులుగా మీకు తగినవారు’ అని సూచించే ‘ఫ్రెండ్ సజెషన్స్’లో టీనేజ్ అమ్మాయిలకు మధ్యవయస్కులైన పురుషులను ఫేస్బుక్ సజెస్ట్ చేస్తోందని ‘బ్రిటన్‌లోని నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు చిల్డ్రన్’ సంస్థ ఆరోపించింది. టీనేజ్ బాలికలకు స్నేహితులుగా ఫేస్బుక్ సూచిస్తున్న మధ్యవయసు పురుషులలో కొందరు ఛాతీపై ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా కనిపించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఫేస్బుక్ తక్షణం తన బాధ్యతారాహిత్యాన్ని సరిచేసుకోవాలని సూచించింది. బ్రిటన్ మొత్తానికి ర్యాడ్‌ఫోర్డ్ దంపతులది పెద్ద కుటుంబం. గత మంగళవారం అది మరింత పెద్ద కుటుంబం అయింది. పన్నెండు నిముషాల పురిటి నొప్పుల అనంతరం తమ 21వ బిడ్డ బోనీ రేయ్‌ని ప్రసవించింది ఆ మాతృమూర్తి స్యూ ర్యాడ్‌ఫోర్డ్. దీంతో ఆ కుటుంబంలోని సంఖ్య భార్యాభర్తలిద్దరితో కలిపి 23కు చేరుకుంది. ‘‘ఇక చాలనుకుంటున్నాం. బోనీతో మా కుటుంబం సంపూర్ణం అయింది’’ అని స్యూ, ఆమె భర్త నోయల్ ర్యాడ్‌ఫోర్డ్ చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు. స్యూ తన జీవితకాలంలో ఇప్పటి వరకు 800 మాసాలు గర్భిణిగా ఉన్నారు! మొదటి సంతానానికీ ఇప్పుడు పుట్టిన బిడ్డకు మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది. స్యూ తన ఏడేళ్ల వయసులో నోయల్‌కి పరిచయం అయింది. పద్నాలుగేళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 43. మొదటైతే ముగ్గురు పిల్లలే చాలని అనుకున్నారు స్యూ, నోయల్. ఆయనైతే తొమ్మిదో బిడ్డ పుట్టాక వేసక్టమీ కూడా చేయించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఎందుకో ఆయన మనసు మళ్లీ బిడ్డల మీదకు మళ్లింది. వేసక్టమీని రివర్స్ చేయించుకున్నాడు. మోర్కాంబిలోని లాంకషైర్ ప్రాంతంలో బేకరీ దుకాణం నడుపుతున్న ర్యాడ్ఫోర్డ్ల ఇల్లు ప్రస్తుతం సందడి సందడిగా ఉంది. అప్పుడే పుట్టిన తమ చిట్టి చెల్లాయిని ఆడించేందుకు మిగతా పిల్లలందరూ పోటీ పడుతున్నారు. అయితే ఆ సంతోషాన్ని కళ్లారా చూస్తున్న స్యూ.. గర్భిణిగా మాతృత్వపు మధురిమల్ని ఇక అనుభూతి చెందలేను కదా అని కొద్దిపాటి బాధతో ఉన్నారు. చెప్పలేం. వీళ్ల çసంతాన ప్రియత్వాన్ని చూస్తుంటే తమ నిర్ణయానికి కట్టుబడేలా కనిపించడం లేదు. ఇంకో సంగతి. వీళ్లకు ముగ్గురు మనవలు కూడా ఉన్నారు. రెండో సంతానం అయిన సోఫీకి పుట్టినవాళ్లు ఆ పిల్లలు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ఆ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.. కలిసి బడికి వెళ్ళారు... కలిసి ఆడుకున్నారు... కలిసే పెరిగారు... ఎక్కడి వెళ్ళినా కలిసే వెళ్లేవారు. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా కలిసే పాల్గొనేవారు. ఒకరంటే ఒకరికి నమ్మకం... అలాంటి ఆ స్నేహితులకు మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. క్షణాల్లో వారిపైకి దూసుకువచ్చింది. అప్పటి వరకు ఏమరుపాటుగా ఉన్న ఆ ముగ్గురూ ఎదురుగా వచ్చిన మృత్యువును చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయవిదారకర ఘటన బందరు మండలం చిన్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బందరు మండలం వాడపాలెం పంచాయతీ శివారు వెంకటదుర్గాంబపురానికి చెందిన ఒడుగు కుమార్‌స్వామి, మోకా సహదేవుడు (19), ఒడుగు సాయికుమార్ (20) స్నేహితులు. కుమార్‌స్వామి కృష్ణా యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. సహదేవుడు పవిత్ర డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు. సాయికుమార్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం చేపల చెరువుపై ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. చిన్ననాటి స్నేహితులైన వీరు ముగ్గురూ ఎక్కడికైనా కలిసే వెళ్తుంటారు. సహదేవుడికి ఎగ్జామ్ ఉండటంతో బుధవారం బైక్‌పై ముగ్గురూ బందరు బయలుదేరారు. చిన్నాపురం శివారు శ్మశానం సమీపంలోని మలుపు వద్ద భీమవరం నుంచి కోన చేపల చెరువు వద్దకు వెళ్తున్న లారీ వేగంగా వారి బైక్‌పైకి దూసుకువచ్చింది. అకస్మాత్తుగా లారీ మీదకు దూసుకురావటంతో కుమార్‌స్వామి బైక్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు. అప్పటికే లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సహదేవుడు, సాయికుమార్‌లకు రోడ్డు దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయారు. బైక్ నడుపుతున్న కుమార్‌స్వామి కాళ్ళు, చేతులకు బలమైన గాయాలై రోడ్డు పక్క పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి.. స్థానికులు 108కు ఫోన్ చేసి ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సహదేవుడు, సాయికుమార్ క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. కుమారస్వామి కొనఊపిరితో కొట్టుకుంటుండగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కదిలొచ్చిన రెండు గ్రామాలు.. విషయం తెలుసుకున్న వెంకటదుర్గాంబపురం, పోలాటితిప్ప గ్రామస్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. చేతికి అందిన బిడ్డలు శవాలుగా మారటాన్ని చూసిన తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు సైతం బోరున విలపించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. చిన్నాపురంలోని ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకోవాలని బందరు రూరల్ పోలీసులకు సూచించారు. ఆయనతోపాటు బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు రూరల్ సీఐ బి. రవికుమార్ ఉన్నారు. నాయకుల పరామర్శ.. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల బంధువులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్‌దాదా, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఎల్ ఎన్ ప్రసాద్, ఇతర నాయకులు ఉన్నారు. -
ఒకే అమ్మాయిని ప్రేమించారు.. శత్రువులయ్యారు..
నాంపల్లి: ఇద్దరు స్నేహితులు.. ఎప్పుడూ కలిసి తిరిగేవారు.. అనుకోకుండా ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. స్నేహితులు కాస్తా శత్రువులయ్యారు.. ఆమె కోసం ఒకరినొకరు చంపుకోవాలని పథకం వేసుకున్నారు. ఆ గొడవల్లో ఒకరు మరొకరిని దారుణంగా హత్య చేశాడు. సినిమా కథను తలపించే ఈ సంఘటన ఈనెల ఒకటో తేదీన ఏక్‌మినార్ చౌరస్తాలో జరిగిన యువకుడి హత్య ఘటనకు సంబంధించింది కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం నాంపల్లి కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డితో కలిసి సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. ఫస్ట్‌లాన్సర్‌లో నివాసం ఉండే షాహీదుద్దీన్(23), అజారుద్దీన్ అలియాస్ అజ్జూ(27) స్నేహితులు. జులాయిగా తిరిగే వీరిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. ఇదిలా ఉండగా ఇద్దరు ఓ ప్రేమిస్తున్నామంటూ ఓ యువతి వెంటపడ్డారను. ఒక రోజు షాహీదుద్దీన్ సదరు అమ్మాయిని పట్టుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని అజారుద్దీన్ అలియాస్ అబ్బూ షాహీదుద్దీన్‌తో ఘర్షణ పడ్డాడు. ఈ వివాదంతో ఇద్దరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. అయితే, స్నేహితులు ఇద్దరూ విడిపోయినా అమ్మాయి కోసం తరచూ తారసపడేవారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని టీజ్ చేస్తున్న షాహీదుద్దీన్‌ను ఎలాగైనా హతమార్చాలని అజారుద్దీన్ పథకం పన్నాడు. ఇందుకు తన అనుచరులైన మహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబ్బూ, మహ్మద్ సలాం అలియాస్ సుల్తాన్ మీర్జా, మహ్మద్ అబ్దుల్ జునైద్‌తో కలిసి సెప్టెంబర్ 30న హత్య చేయడానికి కుట్ర పన్నారు. అదే రోజు రాత్రి షాహీదుద్దీన్‌ను ఫోన్ చేసి రాజీకి ఆహ్వానించగా అతడు తన వెంట ఓ కత్తితో అక్కడి వచ్చాడు. నాంపల్లి ఏక్ మినార్ మసీదు సమీపంలోని 21 సెంచరీ బిల్డింగ్ సెల్లార్ వద్దకు చేరుకున్న షాహీదుద్దీన్, షేక్ అజారుద్దీన్, అతని అనుచరులతో కలిసి తెల్లవారు జాము వరకు మద్యం, గంజాయి తాగారు. మద్యం మత్తులో మళ్లీ అమ్మాయి విషయం వచ్చింది. దీంతో షాహీదుద్దీన్ కత్తి చూపించి చంపుతానని అజారుద్దీన్‌ను బెదిరించగా నలుగురూ కలిసి షాహీదుద్దీన్‌పై దాడి చేశారు. శరీరంపై ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
ఏమిటీ... మిస్టరీ!
శ్రీకాకుళం రూరల్: వారిద్దరూ ప్రాణ స్నేహితులు... ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. కలిసికట్టుగా తిరుపతి ప్రయాణం సాగించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ తిరుగు ప్రయాణంలో ఒక్కరు మాత్రమే ఇంటికి చేరుకున్నారు. తన స్నేహితుడు గురించి ఆరా తీయగా ఏమైందో చెప్పలేక తల్లడిల్లిపోతూ తిరుపతి నుంచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఇతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.... శ్రీకాకుళం మండలంలోని కిల్లిపాలెం పంచాయతీ అదే గ్రామానికి చెందిన రాగోలు లక్ష్మణరావు, సాది రామప్పడు మంచి స్నేహితులు. గత నెల 19వ తేదీన వీరిద్దరూ కలిసి తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ దగ్గరకు రాగానే రాగోలు లక్ష్మణరావు ఒక్కసారిగా కనిపించలేదు. రైలు కదులుతోంది కదా బాత్రూంకు వెళ్లాడేమో అనుకొన్నాడు తోటి స్నేహితుడు రామప్పడు. అయితే గత నెల 23న శ్రీకాకుళం చేరుకునేటప్పటికీ బండి దిగినా తన స్నేహితుడు లక్ష్మణరావు ఆచూకీ మాత్రం కనిపించలేదు. రామప్పడు ఇంటికి రాగానే లక్ష్మణరావు భార్య తన భర్త ఏడని ప్రశ్నించగా ఏమో తెలియదంటూ మాట దాటవేశాడు. అర్ధంతరంగా తనువు చాలించిన రామప్పడు ఇదిలావుండగా రామప్పడు వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడిన సందర్భాలు కూడా లేవని, రెండు రోజులుగా దిగాలుగా కనిపించేవాడని గ్రామస్తులు అంటున్నారు. అయితే గత నెల 24వ తేదీన రాత్రి ఇంట్లోనే పురుగు మందు తాగి ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు రామప్పడు. ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో లక్ష్మణరావు కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందారు. తిరుపతిలో ఏదైనా సంఘటన చోటుచేసుకుందా? లేకా ఎవరైనా లక్ష్మణరావును చంపేసారా? అన్న అనుమానాలు లక్ష్మణరావు కుటుంబ సభ్యుల్లో మరింతగా నెలకొన్నాయి. దీంతో లక్ష్మణరావు ఆచూకీ కోసం గ్రామానికి చెందిన వారు రెండు రోజులు క్రితం తిరుపతి బయలుదేరారు. ఫిర్యాదు తీసుకోని రూరల్ పోలీసులు జరిగిన సంఘటనపై లక్ష్మణరావు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో కనిపించడం లేదని కేసు నమోదు చేయాలని పోలీసులకు లక్ష్మణరావు భార్య కోరింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ సిబ్బంది ఈ కేసు విశాఖపట్నంలోని దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలోకి వస్తోందని, అక్కడ ఫిర్యాదు చేయాలని తిరిగి వెనక్కి పంపేశారు. ప్రసార మాధ్యమాలపై ఇద్దరికీ అవగాహన లేదు తిరుపతి బయలుదేరిన ఇద్దరు స్నేహితులకు కనీసం ప్రసార మాధ్యమాలు(సెల్ ఫోన్లు) అవగాహన లేదు. గ్రామంలో ఉన్నవారు కూడా తిరుపతి వెళ్తున్నారు ఏదైనా అవసరం ఉంటే తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఇచ్చారు. తిరుపతి వెళ్లి తిరిగి ప్రయాణంలో కూడా వీరు కనీసం గ్రామస్తులు ఎవరితోను మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. -
పంతానికి ఈతకు వెళ్లి...
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : స్నేహితులతో ఛాలెంజ్ చేసి పంతం కోసం ఆపకుండా ఈత కొట్టిన యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన నెలమంగల తాలూకా పరిధిలో చోటుచేసుకుంది. తుమకూరు శెట్టిహళ్లికి చెందిన శ్రీనివాస్ (25) నెలమంగల తాలూకా నందిహళ్లి వద్ద ఉన్న రిలయన్స్వేర్హౌస్లో పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ డ్యూటీ చేసి గురువారం ఉదయం ఆరుగురు స్నేహితులతో కలిసి హళేనిజగల్ చెరువులో ఈత కొట్టడానికి వెళ్లాడు. ఈ సమయంలో ఎక్కువసేపు ఈత కొడతానని స్నేహితులతో ఛాలెంజ్ చేసి పంతానికిపోయి ఈతకొడుతూ అలసిపోయి నీట మునిగి పోయి మృతి చెందాడు. ఆ సమయంలో స్నేహితులు కూడా ఈత కొడుతున్నా వారు శ్రీనివాస్‌ను రక్షించే ప్రయత్నం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చాలదన్నట్టు శ్రీనివాస్ నీట మునిగే దృశ్యాలను ఒక స్నేహితుడు తన మొబైల్లో వీడియో తీశాడు. సమాచారం అందుకుని ఘటనాస్ధలానికి వచ్చిన కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌కు నీళ్లంటే భయమని ఈత కూడా వచ్చేదికాదని శ్రీనివాస్‌ను ఎవరో కావాలని నీటిలో తోసి హత్య చేసారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చెరువులో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న దాబస్‌పేట పోలీసులు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అమ్మాయి విషయం : స్నేహితుణ్నే మట్టుబెట్టారు?
కర్నూలు నంద్యాల: ఓ అమ్మాయి విషయంలో తోటి స్నేహితుడినే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తగులబెట్టి, ఆ తర్వాత పూడ్చివేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన ఖలీల్, సమీర కుమారుడు సద్దాంహుసేన్. ఇతను పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది జూలై 17న అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు నంద్యాల టూటౌన్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సద్దాంహుస్సేన్ను దారుణంగా హత్య చేశారన్న విషయం పోలీసు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తోటి స్నేహితులే పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి తీసుకెళ్లి.. అక్కడే చంపి, పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టిన అనంతరం పూడ్చి పెట్టినట్లు సమాచారం. ఓ అమ్మాయి కోసమే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై టూటౌన్ సీఐ రామకృష్ణారెడ్డిని అడగ్గా.. పాణ్యం మండలం పిన్నాపురంలో కొంత మంది కలిసి హత్య చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి తహసీల్దార్, విద్యార్థి తల్లిదండ్రులను తీసుకొని వెళతామని చెప్పారు. మృతదేహాన్ని చూసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి, పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామన్నారు. -
ఒబీస్
‘ఈ ఒక్క ముక్కతోనే ఒళ్ళు పెరిగిపోతుందా ఏం? ‘వొద్దనుకుంటూనే కళ్ళు మరల్చలేకపోతున్నాను. మరోవైపు చూస్తే, నేహ ఇంత లావు పేస్ట్రీముక్క ప్లేట్లో పెట్టుకుని సుతారంగా దానిమీద ఐసింగ్ నాకుతూ కన్నుగీటిందిఒక ప్లాస్టిక్ నవ్వు పడేసి చూపులు ముందుకు తిప్పాను.లేత క్రీమ్ రంగూ, తెలుపూ కలిసిన పొరలతో దట్టమైన తెల్లని ఐసింగ్‌తో మాక్రోషాట్లో తీసిన ఫొటోలాగా స్పష్టంగా కళ్ళెదురుగా ..పైనాపిల్ పేస్ట్రీ.... చెమ్మ తాలూకు అతిపల్చని పొర... నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిస్తూ.. ఫోన్ మోగింది.‘ఎక్కడున్నావ్?’‘ఆఫీసులో’‘మరి పక్కన ఆ కేకలూ హడావుడీ ఏంటి? ఆఫీసేనా?’‘అవును, ఇవాళ రాహుల్ బర్త్‌డే. కెఫెటేరియాలో కేక్ కట్ చేశాడిప్పుడే’‘రాహులెవడు?’‘ఎవడేంటి ఎవడు? మొన్న మాల్లో కనిపిస్తే పరిచయం చేశాగా? అతనే’‘చేరి నెలైనా కాలేదు, అప్పుడే బర్త్‌డే ఇంత హంగామాగా చేస్తున్నారా?’‘ఫ్రెండ్స్ ఉండరా ఏంటి? సరదాగా’‘మరే, సరదా! ఇందాక ఫోన్ చేశాను, ఏం చేస్తున్నావ్? తీయవేంటి‘కట్ చేశాను విసుగ్గా. మళ్ళీ రింగ్ అవుతోంది. తీయబుద్ధి కాలేదు . ప్చ్... అసలు మనుషులు ఎందుకిలాగ ఉంటారో!ఇందాక పేస్ట్రీ వైపు సాగుతూ టేబుల్ మీద ఆగిపోయిన చేయి ముందుకు నిస్సంకోచంగా కదిలి ప్లేటు అందుకుంది. స్పూను పక్కన పడేసి చేత్తో అందుకునిమొత్తం ముక్కని నోట్లో పెట్టుకున్నాను. హాయిగా తీయగా చల్లగా కమ్మని క్రీమ్ రుచితో.. వేడెక్కిన మెదడుని మనసుని చల్లబరుస్తూ... మెత్తగా పళ్ళ కింద నలుగుతూ కమ్మగా గొంతులోకి జారుతోంది.హెవెన్... దేవుడా! ఎన్నెన్ని రుచులు సృష్టించావయ్యా స్వామీ... నీ దుంపతెగా!జతిన్ మరో ప్లేట్లో చాక్లెట్ కేకు ముక్కలుపెట్టుకుని వస్తూ ‘కావాలా?’ అన్నాడు.‘అర్జెంట్‌గా..’ దాదాపు లాక్కున్నంత పనిచేసి చాక్లెట్ కేకుని మళ్ళీ మాక్రోషాట్ లెవెల్లో మొహానికి దగ్గరగా పెట్టుకుని చూశాను. అందంగా కనపడింది నాలాగే!బాగా బొద్దుగా ఉంది, నాలాగే! బొద్దుగా..... ఒక్కక్షణం ఆగాను.ఉహూ. గబగబా చాక్లెట్ రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నానులేచి ఫస్ట్ఫ్లోర్కేసి నడుస్తుంటే వెనక నుంచి వినపడింది‘నార్త్ పిల్లలు అంత సన్నగా ఎలా ఉంటార్రా‘‘మనలాగా పప్పూ నెయ్యీ పోసుకొని తినరువాళ్ళు.. ’ ఇంకెవడో జవాబు చెప్పాడు.‘వాళ్ళూ తింటారు. కాస్త ఒళ్ళొంచి వర్కౌట్లు చేస్తారు. మనోళ్ళు పెళ్ళయితేటేకిట్ ఫర్ గ్రాంటెడ్ రకాలు. చేసుకున్నాక చస్తాడా ఏంటి భరించక‘‘అలా ఏంలేదురా! వాళ్ళూ అంతే! పంజాబీలు చూడు, మెక్సికన్ గాల్స్ టైపు. పెళ్ళి కాకముందు మెరుపుతీగలే! పెళ్ళయ్యాక ఆలూబస్తాలే‘ ఓహో వీడు ఆన్‌సైట్‌కి వెళ్ళొచ్చాడన్నమాట. అక్కడికేదో మెక్సిక¯Œ ఆడపిల్లలని బాగా చదివేసినట్టే.. సొల్లుకబుర్లు. వీడి నాలెడ్జ్ అంతా పంచాలి మనకి!వాళ్ళు మాట్లాడుకుంటున్నది నా గురించి కాదేమో గాని నాకు మాత్రం నన్నుద్దేశించే అనిపిస్తుంది ప్రతిసారీ. ఏడిశార్లే, ఐడోంట్ కేర్ !‘లవీ... అమ్మా, మెరుపుతీగా ఆగు’ మోహిత్‘ప్రొడక్ట్ రిలీజ్ ఎప్పుడు?’‘ట్వెల్త్‘ పాలిష్ చేసిన గోళ్ళకేసి చూసుకున్నా. నిండు ఆరెంజ్ రంగు, ఎంత బావుందో! షాపర్స్ స్టాప్‌లో వచ్చేస్తున్నపుడు చివర్లో దొరికింది.‘మీ టీమ్‌లో ఎవరో గుర్గావ్ నుంచి వచ్చిందట వడోదరా అమ్మాయి, పరిచయం చెయ్యొచ్చుగా కొంచెం.అంత కుళ్ళుండగూడదు‘ఇదీ వీడిక్కావలసింది. ప్రొడక్ట్ రిలీజ్ కాదు. ఇద్దరు పిల్లల తండ్రి, బెల్టుకి ససేమిరా లొంగనని తోసుకొస్తున్న పొట్ట, ఎంత ముందుకు దువ్వినా, మొదలైపోయిన బట్టతల.అయినా సరే కొత్త పిల్లలు ఎవరైనా రాగానే పరిచయం చేసేస్కోవాలని తాపత్రయం. ఆ పిల్లలకు తను తన నాలెడ్జ్ నచ్చేస్తాయని బోల్డు కాన్ఫిడెన్స్. కాంపిటీషన్ ఉంటుందని భయమైనా లేదు. ముందు నుంచి ఒక ఆడపిల్ల పోతుందంటే చాలు ఏదో ఒక పాయింట్ మీద కామెంట్ చేయకుండా ఉండడు. లావనో, పొట్టనో, నలుపనో, డంబ్ అనో, ఈజీ ఫాలింగ్ అనో..!‘నీకు ఒకళ్ళు పరిచయం చేసేదేముంది’ అటుగా వెళ్తున్న ఎవరి ప్లేట్లోంచో పేస్ట్రీ ముక్క తీసుకున్నాను. ఇవాళ చాలా క్రేవింగ్‌గా ఉంది. వారం నుంచి నోరు కట్టేసుకునే ఉన్నాను. రోజూ ఆ రుచీ పచీలేని పుల్కాలతో సరిపెట్టుకుంటున్నాను. అంతకంటే నీచమైన ఆ బీరకాయ, సొరకాయ కూరలతో! ప్రపంచమంతా నిస్సారంగా కనిపిస్తున్నా సరేకె ఫెటేరియాలో రకరకాల ఐటెంలు .కార్పొరేట్ లంచ్. అటుగా వెళ్తే ఏదో ఒకటి తినేస్తానని భయం.ఇవాళ తప్పింది కాదు. నా బాక్స్‌లో పుల్కాలు నీరసంగా నిద్రపోతున్నాయేమో! అందరితో కలిసి నూడుల్స్, పూరీకూర తినేశాను. ఎంత హాయిగా ఉందో! కడుపునిండా ఎంత తిన్నా ఒళ్ళు రాకుండా లావు కాకుండా ఉండే వరమేదైనా దేవుడివ్వాలంటే ఎన్నేళ్ళు తపస్సు చేయాలో! ఆ చేసినన్నాళ్ళూ నిరాహారంగా చేయాలా? ఇహ అప్పుడు ఆశలన్నీ చచ్చాక ఇక స్లిమ్ ఉండి ఏంలాభం? ఇష్టమైంది కడుపునిండా తినేశాక వచ్చే నిద్ర ఎంతందం? నెమ్మదిగా రెప్పల మీదికి బరువుగా తోసుకొస్తూ, సోఫా, కుర్చీ, మంచంలాంటì æతేడాలేవీ లేకుండా పక్కన కూచున్న మనిషి ఎవరైనా సరే, వాళ్ల భుజం మీద వాలి, హాయిగా !అసలు మధ్యాహ్నం నిద్రల్ని ఆఫీసుల్లో కంపల్సరీ చేయాలి. కనీసం గంట! అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మరో పది నిమిషాల్లో నాకు మీటింగ్ లేకపోయుంటే ఎంత హాయిగా డెస్క్ మీద తలవాల్చి నిద్రపోదును? మధ్యాహ్నాలు నిద్రపోతే ఒళ్ళొస్తుందని ఎవరోచెప్పారు. అయినాసరే తెగించి శనాదివారాలు ఒక్క గంటైనా పడుకుందామనుకుంటే ఏదో ఒక పని పని పని!అసలందుకే కడుపునిండా తినకూడదు. గాలి పీల్చినా వెధవది ఒళ్ళొచ్చేలా ఉందే దీన.... ‘ఆ అమ్మాయిపేరు రిచా అటగా, మొన్న దూరం నుంచి చూశాం! ఏం తింటారబ్బా గుజ్జూలు, ఎంత స్లిమ్‌గా ఉందో!‘వీడి నోరుపడ, అనేశాడు మళ్ళీ!‘మరి అంత స్లిమ్‌గా ఉన్న పిల్లతో నీకెందుకు చెప్పు పరిచయం? గణపతి బప్పాలా ఆ బొజ్జ చూసుకో ముందు!’అయినా ఆ పిల్లకు పెళ్ళి కుదిరింది‘ వాడి మొహం ఎలా ఉందో చూడకుండా ముందుకు నడిచాను. సీట్లో కూలబడ్డాను. మీటింగ్ క్యాన్సిల్. ఖాళీతెరెసా వస్తోంది గునగునా! తెరెసానో, చంద్రకళనో చూసినపుడు కాస్త హుషారు వస్తుంది. నాకంటే లావు కాబట్టి ఫీలింగ్ బెటర్ అనిపిస్తుందివస్తూనే బాక్స్తీసి,‘అత్తమ్మ పంపింది పొద్దున! ‘ అని బొబ్బట్టు తీసి పేపర్ ప్లేట్లో పెట్టింది.‘ఓయ్! ఇప్పుడే కేకు తిని వస్తున్నా. ఇంక చాలివాల్టికి‘ అన్నానుగొల్లున నవ్వింది. ‘చల్తీ! ఎంత చేసినా ఇంతేలే మనం. ఒక్కదానికేంగాదు. తినాలె‘ అని ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ‘‘మనం’’అట.. నన్ను కూడా కలుపుకుంది బండది.‘తెరెసా, ప్లీజ్ ’అంటున్నా వినిపించుకోలేదు. నిజానికి మొదటి ముక్క తిన్నందుకే పశ్చాత్తాపంగా ఉంది. దానిపైన ఇంకో రెండు పట్టించాను. ఇప్పుడీ బొబ్బట్టు.నో, వద్దు! జాగ్రత్తగా పేపర్లో చుట్టి డస్ట్‌బిన్‌లో అడుగున పడేశాను.‘ఒక గ్రీన్ టీ తీసుకురా, తేనె వెయ్యొద్దని చెప్పు రామూకి. లతా మేడంకంటే ఎలా చేయాలో తెలుస్తుంది’ లక్ష్మణ్‌కి చెప్పాను?పేస్ట్రీలు, కేకులు తిన్నందుకు పశ్చాత్తాపం మొదలై క్షణక్షణానికి ఇంతింతై మర్రిచెట్టులా ఊడలు దిగుతూ పెరగడం ప్రారంభమైంది.‘ఛ, ఎలాటి ఫ్రస్ట్రేషన్ వచ్చినపుడల్లా దాన్ని అణచడానికి స్వీట్లు తినడం ఎలా అలవాటైంది నాకు? హాస్టల్లో ఉండి చదివేటపుడు ఎగ్జామ్ టెన్షనూ, చదువు టెన్షనూ చాక్లెట్లు తింటే తగ్గుతుందని ఒక పిచ్చినమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి పనికిమాలిన సలహాలు భలే ఆకట్టుకుంటాయి అందులో నిజముందాలేదా అనే సంగతి తర్వాత. ముందు చాక్లెట్ తినాలి. అలాగే పట్టుకుని ఉంటుంది వెధవ అలవాటునాలుగవుతుండగానే లేచి బయటపడ్డాను. లక్ష్మణ్‌ని పిలిచి, సాయంత్రం బండి ఇంటికి తీసుకు రమ్మన్నాను. నడిచివెళ్తా ఇవాళ. ఇందాక తిన్నది కొంతైనా కరిగించాలి.మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడిచి వెళ్ళాను. శరీరానికి కాస్త కష్టమైనా మనసు తేలిగ్గా అనిపించింది.పిండికలిపి, నాకోసం కీరాలూ, టమాటాలు కట్‌చేసి పెట్టుకున్నాను.‘పుల్కాలా మళ్ళీ? నీడైటింగ్తో మా ప్రాణాలు తీస్తున్నావ్. ఆ సొరకాయ కూర కాకుండా ఇంకేదైనా చెయ్యి. ఆలూకూర ‡చెయ్యి ఇవాళ. కొంచెం రైస్ కూడా ఒండు! అసలు నీ డైటింగ్ వంటలు నువ్వు చేసుకో. మాకెందుకు ఈ బలాత్కారం? ‘ఒక్కొక్కరికీ ఒక్కోరకం వండాలంటే ఎంతశ్రమో కనీసం ఊహలోనైనా తెలీదేమో!చపాతీలు చేసి నూనెవేసి కాల్చాను స్నానం, వంట అయ్యాక ఏవిటో కేకుకి ప్రాయశ్చిత్తం చేసుకున్న ఫీలింగ్ వచ్చి, బరువు తగ్గినంత ఆనందం వచ్చిపడింది.నాలుగు కీరా ముక్కలూ, ఒకకప్పు టమాటా జ్యూసూ తాగి పడుకున్నాను. అర్ధరాత్రయ్యే సరికి ఆకలితో నిద్రపట్టలేదు. చాలాసేపు దొర్లానుగాని నిద్రలేకపోతే రేపు ఆఫీసులో పని చేయలేననిపించిందిలేచిచూస్తే డబ్బానిండా చాక్లెట్లూ, టేబుల్ మీద అరటిపళ్ళూ!వంటింట్లో హాట్ ప్యాక్‌లో చపాతీలూ, ఆలూకూర.అమ్మో ఆలూ ఒద్దు. దానికంటే æచాక్లెట్లు నయం. కానీ కడుపునిండదు.పెరుగన్నం తిని, బౌల్ సింక్‌లో పడేసి వస్తూవస్తూ నాలుగుచాక్లెట్లు నోట్లో పడేసుకున్నాక, హాయిగా నిద్రపట్టింది. ప్రాణం ఎటుపోయిందో తెలీదు రాత్రి అనుకున్న ప్రకారం పొద్దున్నే ఐదున్నరకి లేచి అన్నం కుక్కర్లో పడేసి, జిమ్‌కి పరిగెత్తాను. నేను వెళ్ళేసరికే మూడు ట్రెడ్మిల్స్ మీదా ముగ్గురమ్మలు కనిపించారుగుంజన్, గీత, మన్‌ప్రీత్ రాజహంసల్లాగా రెండుస్పీడులో నడుస్తూ కబుర్లుచెప్పుకుంటున్నారు‘రారా, చాలా రోజులైంది కనపడి జిమ్‌లో?‘ ‘సాయంత్రాలు వస్తున్నాను‘ అబద్ధం అలవోగ్గా ఆడాను.‘సాయంత్రం నేనూ వస్తున్నానే? ‘గుంజన్ . నేను రావట్లేదని ప్రూవ్ చెయ్యాలి. అదీ దీని పట్టుదల.‘ఇంట్లో పనీ అదీ అయ్యేసరికి ఎనిమిదవుతుంది అప్పుడు వస్తున్నాను‘ తగ్గదల్చుకోలేదు‘కాస్త వెయిట్ పెరిగినట్టు అనిపించట్లా లావణ్య? ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకో, ఎందుకైనా మంచిది. దాని సింప్టమ్స్ మిగతావి ఎలా ఉన్నా ముందు వెయిట్ పెరిగి తీరతాం‘ మరికొంచెం లావయ్యాన నీ మనసులో అనుమానం ఉన్నా, వెయింగ్ మెషీన్ జోలికి వెళ్ళకుండా తగ్గే ప్రయత్నాలు చేస్తూ సమాధాన పడుతున్నాను. చాలా నీరసం వచ్చింది మన్‌ప్రీత్ మాటలతో!అయినా వీళ్ళుమాత్రం తక్కువున్నారా ఏంటి? ఇంకోళ్ళని నువ్వు లావయ్యావని అంటేతప్ప కడుపునిండదేమో!సైక్లింగ్ చేయాలనుకున్నాగాని ఆ మాటలతో గొప్ప నిరాశ వచ్చిపడింది.గుంజన్ అంటోంది ‘నైరే! గార్లిక్ బటర్ పొటాటోస్కా రెసిపీ హై మేరే పాస్. హోలీకే దిన్ బనాయా, స్వీట్కే సాథ్. బటర్ జ్యాదా లగ్తా హై లేకిన్, టేస్ట్‌కీ బాత్ కరో! హెవన్ యార్, మెరా సిగ్నేచర్ రెసిపీ!’ఇంట్లో బటర్ పొటాటోస్ కానిచ్చి ఇక్కడికొచ్చి ఒక అరగంట కబుర్లు నంజుకుంటూటైమ్ పాస్ చేయడమే కానీ అసలు సీరియస్నెస్సేదీ? ‘నువ్వో‘ ఎవరో అడిగారు నా లోపల్నుంచి. ‘నేనేంకాదు‘ మొహంపగిలేలా జవాబుచెప్పి పెడలింగ్చేయడం మొదలుపెట్టాను. ‘వెయిట్ పుటాన్ చేసినట్టులేదూ లావణ్య? ‘పదేపదే గుంజన్ మాటలు వినపడుతున్నాయిపదినిమిషాలు చేసేసరికి ఉత్సాహం పూర్తిగా చచ్చింది. అయినా ఇవాళ ఆఫీసుకు పెందలాడే వెళ్ళకపోతే కష్టం. లక్ష్మణ్ బండి తీసుకు రాలేదు రాత్రి.ఆమాట గుర్తొచ్చేసరికి గుండెగుభేలుమంది. నడిచెళ్లాలా? అమ్మో నావల్లకాదు. గబగబా సైకిల్ దిగాను.‘నైరే! జలేబీమే జిత్నా భీ రెహెనేదో! కెలొరీస్? ఆనేదో? వెయిట్‌లాస్ కేలియే జాయేంగే ఫైనల్లీ‘ మన్‌ప్రీత్ మాటలు వినపడుతున్నాయి.హాయిగా అనిపించింది. అంతే! కెలొరీలు వస్తేరానీ! కడుపు మాడ్చుకుని ఏమిసాధిస్తాం? నేను ఏమీ తినకుండానే బరువు పెరిగిపోతున్నా, ప్చ్నిజంగానే థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకుంటే? జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటారేమో?వెయిట్‌లాస్ ట్రీట్మెంట్కి బరువు గ్యారంటీగా తగ్గుతారంటే ఈ కష్టాలుపడలేక అదీ ట్రైచేశానాయెఏవిటో వేడివేడి హాట్ ప్యాచ్లుఒళ్ళంతా చుట్టి పడుకోబెడతారు ఒకగంట. అదొక్కటీ ఐతే బానేఉండును. రోజుకు గంట బ్రిస్క్‌వాక్ చేయాలి, నిమ్మకాయనీళ్ళు తాగాలి, మధ్యాహ్నం అరకప్పు అన్నమే తినాలి. రాత్రి ఒకపుల్కా మాత్రమే తినాలి‘ అని చెప్పి 30 వేలు కట్టమన్నారు.అవన్నీ చేస్తే ఎలాగూ తగ్గుతాను, బోడి ..వీళ్ళు తగ్గించేదేంటి ? టీవీలో గంటలతరబడి సెలబ్రిటీస్ చేత చెప్పిస్తారు ‘అక్కడికెళ్ళి స్లిమ్‌గా తయారైపోయాను. నా లైఫ్ మారిపోయింది’ అని గబగబా తయారైపోయాను. బాక్స్‌లో రెండు పుల్కాలు, మరో బాక్స్‌లో ఆకుకూర, బుల్లి బుల్లి టప్పర్‌వేర్ డబ్బాలో కీరాముక్కలు. నడవాలంటే నావల్ల అయ్యేలాలేదు. మూడ్ కూడా లేదు.కారు డ్రైవ్ చేసే సహనం ఈ ట్రాఫిక్‌లో నాకు లేదు. నిరుత్సాహంగా ఆటో పిలిచానుప్రతిరోజూ ఇలాగే గడిచిపోతోంది .ఉదయాన్నే గ్రీన్‌టీతో మొదలుపెట్టాలని, బ్రిస్క్వాక్కో, జిమ్కో వెళ్లాలని, బ్రౌన్ బ్రెడ్డూ లేదా ఓట్స్ తినాలని, వారానికి రెండుసార్లయినా యోగా క్లాసుకో, జుంబాకో వెళ్లాలని . జుంబాకి డబ్బుకట్టి కూడా మానేశాను రెండుసార్లు .ఉదయం టైముండదు, సాయంత్రం ఓపికుండదు. అందరూ ఎలా వెళ్తారో మరి. వాళ్లంతా ఇంటిపట్టునుండే గృహిణులా ? గృహిణులైతే మాత్రం పన్లుండవా?పేపర్, ఫేస్బుక్ చూస్తేనే చాలు బోల్డు ఈవెంట్స్ కనిపిస్తాయి. 3కే రన్, 5కే రన్, నెక్లెస్ రోడ్లో నడక, ఎక్కడెక్కడో సినిమా క్లబ్స్, ఫొటో వాక్స్ .. వాటికి వెళ్లేవాళ్లంతా ఔన్సు కూడా కొవ్వు లేకుండా స్లిమ్గాకనిపిస్తుంటారు. బోల్డు డబ్బుండి, పనేమీ ఉండి ఉండదా వాళ్ళకి? ఇదిగో ఇలాటి తొక్కలో తీర్పులే మానెయ్యాలి. ఉత్సాహం ఉండాలిగాని ప్రతి ఈవెంట్‌కీ వెళ్లొచ్చు.మరే, ఉత్సాహం నీకొక్కదానికే ఉంటే చాలా? నువ్వు తిరిగొచ్చే సరికి ఎవరి కాఫీ వాళ్ళు కలుపుకుని తాగేవాళ్లున్నారా కొంపలో? అలాటి ఈవెంట్స్‌కి పోయి తిరిగొచ్చాక, ‘ఎలాజరిగింది ? నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? కాస్త ఏదైనా తిని రెస్ట్ తీసుకో ఇవాళ్టికి. అన్నీ రెడీగా ఉన్నాయి. స్నానం చేసొచ్చి తింటూ ఈవెంట్ కబుర్లు చెప్పు‘ అనేమాట ఎప్పటికైనా వినపడుతుందా? పనిమనిషి ఉన్నాసరే, బోల్డు పని! టిఫిన్లు, లంచ్‌బాక్సులు సర్దటం నుంచి సాయంత్రం కావలసినవి రెడీగా పెట్టుకోడం వరకూ! సరుకులు, కూరగాయలు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే.. ఆఫీసు పని , ట్రాఫిక్‌లో పడి ఇల్లు చేరేలోపు ప్లాన్లు అన్నీ అట్టర్‌ఫ్లాప్ అయిపోతాయి. సెల్ఫ్‌పిటీలో భలేహాయి ఉంది. కళ్ళెమ్మట నీళ్ళొచ్చేలా ఉంటుంది. ‘నేనెంత కష్టపడుతున్నానో‘ అనుకోడంలో ఒక త్యాగం ఉందసలు.టీవీ యాడ్స్‌లో భలే చూపిస్తారు. ఆవిడ ఇంటికెళ్ళాక కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండి, మావగారికి మందులిచ్చి, అత్తగారికి కాళ్ళునొక్కి... అబ్బా ఆ దేవతా స్త్రీలు ఎక్కడుంటారో? ఆఫీసుకు వెళ్తూనేతెరెసా కనపడింది. దుశ్శకునం! ఇదేమి స్వీట్లూ ఫ్యాట్లూ తెచ్చిందో తినడానికి... లంచ్‌లో టప్పర్‌వేర్ డబ్బా తీసి టేబుల్ మీద పెట్టింది. ‘సున్నుండలు చేసిందమ్మ. నీకిష్టమని తెచ్చా’ అంది.దీనికెవరు చెప్పారో నాకిష్టమని. ప్రతిదీ నాకిష్టమని తెచ్చేస్తుంది. నామీద ఇష్టానికి సంతోషించాలో, కొంచెం కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వనందుకు విసుక్కోవాలో తెలీదు.నా బాక్స్‌లో పుల్కాలు, సొరకాయ కూర తింటూ నీరసంగా సున్నుండల వైపు చూశాను.‘ఒద్దులేవే, ఏమనుకోకు. బరువు తగ్గాలి. బీఎంఐ 32 ఉంది. కనీసం 26కి దిగాలి. వెయిట్ తగ్గాలి. కాస్త సీరియస్‌నెస్ మెయింటైన్ చెయ్యాలి. చూడు నడుం దగ్గర ఎలా ఫ్యాట్ వచ్చేసిందో?అసలు రుజుతాదివేకర్ ‘అదేప్రాబ్లెమ్ మీతో...’ వెనక నుంచి వినిపించింది.ఉలిక్కిపడి వెనక్కుచూశాం. నిహాల్ !‘మీకింకా నడుం దగ్గర టైర్లు రాలేదు. చీర కట్టుకున్నా పర్ఫెక్ట్గానే ఉంది. మొన్న చూశాగా, అంత ఫ్యాట్ ఏమీ లేదులే.’ మండిపోయింది .‘సిగ్గుందా? ఏం వాగుతున్నావ్ ?’ అన్నాను.నిహాల్ స్పూన్‌తో స్ప్రౌట్స్ తింటూ ‘సరిగ్గనే వాగుతున్న! ఎంతసేపూ రుజుతాదివేకర్ నెయ్యి తినమంది, ఫ్రూట్స్ తినమంది, ఫ్యాట్స్ తినమంది అనేదే చూస్తారుగాని ఆవిడ ఎట్ల తినమందో చూడరు. అసలు మీ లేడీస్‌కి హెల్త్ కాన్షస్నెస్ కంటే బ్యూటీ కాన్షస్నెస్ ఎక్కువుంటది. ముప్ఫైఅయిదు దాటినంక కూడా ఇరవైల్లో ఉన్నట్టు ఉంటరా? ఎట్లయితది? ఐడియా మంచిదే! కానీ అందుకు సిచుయేషన్ మీకు కోపరేట్ చేస్తదా లేదా చూసుకోరేంది? పెళ్లి, డెలివరీలు, ఫ్యామిలీ, చాకిరీ ఇవన్నీ మీ బాడీని పెళ్లికి ముందులాగే ఉంచుతయా? ఉంచవు. అందుకే హెల్త్ చూసుకోవాలి. అయినా ముప్పయి దాటాక మరీ సన్నగుంటే బాగోదు. కొంచెం బొద్దుగుంటేనే మంచిగుంటది. ఎక్కణ్ణో ఏదో ఏ మాల్యాగాడి కాలెండరో జూస్తరు. ఆ లెక్కనే ఉండాలంటరు. ఏదైనా డ్రెస్జూస్తే, అది మనకు నప్పుతదా లేదా..అహా ఏంలేదు. పొయ్యి కొనుడు ఏసుకునుడు. ఆమెవరో కొన్నది గాబట్టి మనమూ కొనాలె, అంతే! ఎప్పుడూ ఎవరి లెక్కనో ఉండాలె.అయినా ఎవరికో మీరు నచ్చేదేంది? మీకు మీరు ఎలా ఉన్నా నచ్చాలి. లవ్ యువర్ మిర్రర్ అనే కాన్సెప్ట్ తెలుసా? అద్దంలో మీరెలా ఉన్నా, మీకు మీరు నచ్చాలంట తెల్సా? అరె, ఎప్పుడు చూడు, వాడికి నచ్చాలి, ఈమె లెక్కుండాలి, పార్టీలో మెరిసిపోవాలి, ఎవరి పెళ్లిలోనో మనం సెంటరాఫ్ అట్రాక్షన్ కావాలి. ఏందిది? ఎంతసేపూ ఇదేగోలా? హెల్దీగా తినండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే బ్యూటీ ఉంటది తెలుసా మొహంలో?’‘అయిందా నీ బోడి ఉపన్యాసం? ఏదో గీత బోధించినట్టు ఫీలవుతున్నావుగానీ ఇక దయచెయ్యి! చంపుతాను ఇంకొక్క మాటమాట్లాడినా‘ అన్నాను కోపంగా... కిక్కిక్కీ అని నవ్వాడు. ‘నాకుతెలుసులే, నేను చెప్పినవన్నీ నిజాలని మీకు తెలుసనీ! నేను మాట్లాడితే మీకు ఇయ్యన్నీ గిల్లినట్టు ఉంటై‘ ‘పోతావా పోవా నువ్వు?‘ ప్లాస్టిక్ గ్లాసు విసిరేశాను.‘సరేసరే, పోతున్నలే’ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.ఇద్దరం నవ్వుకున్నాం హాయిగా.‘అంటే అన్నాడులే కానీ కరెక్ట్‌గానే అన్నాడు’ అంది తెరెసా సున్నుండ తీస్తూ! ఇదసలు స్వీట్ల దగ్గర కాంప్రమైజ్ అవ్వనే అవ్వదు.పుల్కాలు తినడం అయిపోవడంతో, చేయిచాచి సున్నుండ తీసుకున్నా!కమ్మని నెయ్యి వాసనతో ...అమ్మ గుర్తొచ్చేస్తోందినిహాల్గాడు అన్న మాటలన్నీ మాకు తెలీనివా?అమ్మ అనదూ?‘ముప్ఫయి నిండగానే ఈ కడుపు మాడ్చుకోడాలేమిటో? హాయిగా తినకుండా అలా నీరసం మొహాలేసుకుని శవాల్లాగా తయారైతే ఏం అందమనో మరీ చచ్చిపోతున్నారు! పిల్లలు పుట్టాక కూడా మెరుపుతీగలల్లే ఉండాలని అంత తాపత్రయం ఉంటే ఎలాగ? ఉజ్జోగంతో పాటు బోల్డు పన్లుంటాయి కదా; సరిగా తినకపోతే ఎలా? హెల్దీగా ఉంటే చాలదూ? ఎవరికో అందంగా కనపడాలా? ఎంతమందిని మెప్పిద్దావనో?’ బస్సుదిగి నడుస్తున్నా! మా ఆఫీసు ముందే స్టార్టింగ్ పాయింట్ కావడంతో సీటు దొరికేసింది. హాయిగా కూచున్నా.ఇంటికెళ్లి కమ్మగా అన్నం తినేయాలి. పొద్దున్న చేసిన పప్పూ, వంకాయకూర, నిన్న చేసిన గోంగూరపచ్చడి! ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి వెళ్ళగానే. మంచినెయ్యి పంపమని అమ్మకి ఫోన్ చేయాలి.ఇంటికెళ్ళగానే పిండి కలపక్కర్లేదని తలచుకుంటేనే బోల్డు హాయిగా ఉంది.అబ్బా, ఈ నార్త్ వాళ్ళు రోజూ చేతులు విరిగేలా పిండి కలపడం, రొట్టెలు ఒత్తడం ఎలా చేస్తారో పాపం! ఇంటి వీధిలోకి తిరగ్గానే ముందు వెళ్తున్న అమ్మాయిలెవరో పెద్దగానే మాట్లాడుకుంటున్నారు‘నీకు ఎంత చెప్పినా బుర్రకి ఎక్కడం లేదు. అన్నం మానేయాలి. అన్నంలో ఎంత షుగర్ ఉంటుందో తెలుసా? రాత్రిపూట రోజూ పప్పు తింటావు. పప్పు ప్రోటీన్, రాత్రి తినకూడదు. పుల్కాలు కాదు, అసలు రాత్రిళ్లు సలాడ్స్ తినాలి. నాల్రోజులు నిద్రపట్టదు. కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది తెలుసా? ఎన్నేళ్లు నీకిప్పుడు?’ ‘ముప్ఫైనాలుగు, అయినా అన్నం ఒక్కపూటయినా తినకపోతే ఎలాగే?’‘అదేమరి! ఈ వయసులో ఫ్యాట్ కూడబెట్టుకుంటే ఇంకా ముందుకు పోయాక అది కరుగుతుందా? ఇప్పుడే జాగ్రత్తపడాలి. ఒక పనిచెయ్యి. కాస్త కష్టపడి కీటో డైట్ ఫాలో అవు. ఈ ఏజ్‌లో బాడీ మెయింటైన్ చెయ్యకపోతే ముందుముందు ఎంతకష్టం! చీరకట్టుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా చక్కగా ఉండాలి. మొన్న కిట్టీపార్టీలో చూశావుగా, అసలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారని? కాస్త నోరుకట్టేసుకుంటే ఏమీ చావంలే! లేదంటే నలభై రాకముందే అమ్మమ్మల్లా తయారైపోతాం. ఇప్పటికే ప్రతి అడ్డమైన వెధవా అడ్వాంటేజ్ తీసుకుని ఆంటీ అనేస్తున్నాడు. పొద్దున్నే యాపిల్ సైడర్ వెనిగర్ కాస్త నీళ్ళలో కలుపుకు తాగు.బ్యాగులో బాదంపప్పు పడేసుకుని ఉంచు. గ్రీన్‌టీలో తేనె తగ్గించు. ఏమీ చేయనంటే ఎలా?’ఆటోమేటిగ్గా నా నడక స్లో అయిపోయింది. అడుగులు పడనని మొరాయిస్తున్నాయి. మెదడులో ఆలోచనలు గబగబా చిక్కుముళ్ళు పడిపోతున్నాయి.ఇంటికెళ్లి గబగబా పిండి కలపాలి. కీరాలు ఉన్నాయా ఫ్రిజ్‌లో? పోనీ ఇవాళ్టి సలాడ్ తినేస్తేనో?\రేపు బద్ధకించకుండా గుంజన్ వాళ్ళు రాకముందే లేచి జిమ్‌కి వెళ్లిపోవాలి.రైస్ మానేయాలి. అవును మానేయాలి ... గ్రీన్ టీ అయిపోయింది, తెచ్చుకోవాలి. తేనె? ఒద్దు ఒద్దు తేనెవద్దు. ఒట్టి గ్రీన్ టీయే తాగేస్తాను. సుజాత వేల్పూరి -
స్నేహితుల మాట విని సాహసం
దొడ్డబళ్లాపురం: స్నేహితుల మాటకు కట్టుబడి ఒక వ్యక్తి నిండి ప్రవహిస్తున్న నదిలో దూకిన సంఘటన హొళేనరసీపురలో చోటుచేసుకుంది. హొళేనరసీపురకు చెందిన రాము అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆదివారం తన పిల్లలు, స్నేహితులతో కలిసి రాము కావేరి నది పరివాహక ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా పొంగి ప్రవహిస్తున్న నదిలో దూకి అవతలి వైపు ఒడ్డును చేరుకున్న సంఘటనను గుర్తు చేసాడు. దీంతో స్నేహితులు సరదాగా అయితే ఇప్పుడు చేసి చూపించు అంటూ ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాము పిల్లలతో ఈతకొట్టి చూపిస్తాను చూడండంటూ చెప్పి అమాంతం నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మిత్రుడి చెల్లెలిపై సామూహిక అత్యాచారం
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడి చెల్లెలుపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. అనంతరం ఆ విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు.ఈ ఘటన జబల్పూర్ నగరంలోని బడా పత్తార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న బడాపత్తార్ ఏరియాలో ఉండే స్నేహితుని దగ్గరని ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో వారి స్నేహితుని చెల్లెలు మాత్రమే ఉంది. అన్నయ్య స్నేహితులు కావడంతో ఆమె వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవెశించగానే తలుపులు బిగించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించి పారిపోయారు. కాగా అత్యాచారం జరిగిన రెండు రోజుల తర్వాత ఆ బాలిక ఇంట్లో అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో ఒకరు 18 ఏళ్ల యువకుడు కాగా మరో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. -
మిత్రుడి కోసం భిక్షాటన
భువనేశ్వర్ : ఆపదలో ఆదుకున్న వాడే మిత్రుడు అనే ఆంగ్ల సూక్తి తరచూ మన చెవిన పడుతుంటుంది. వాస్తవంగా ఇటువంటి మిత్ర బృందం రాష్ట్రంలో అందరి మన్ననల్ని పొందుతోంది. ప్రమాదవశాత్తు మంచాన పడిన అలోక్ మిత్రులు తోటి మిత్రుని చికిత్స కోసం డబ్బుల కొరత నివారించేందుకు నడుం బిగించారు. పూరీ జిల్లాలోని కృష్ణ ప్రసాద్ సమితి గోపాల్పూర్ గ్రామస్తుడు అలోక్ చిలికా పర్యటనకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక దెబ్బతింది. చికిత్స కోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుందని వైద్యులు ప్రకటించారు. కుటుంబీకులకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. డబ్బు లేకుంటే చికిత్స ముందుకు సాగని దయనీయ పరిస్థితి. స్నేహితుడు మంచాన పడ్డాడు. లేచి తిరుగాడాలంటే ముందుగా డబ్బు పోగు చేయాలి. ఆ తర్వాతే వైద్యం, చికిత్స వగైరా. స్నేహితుడి కోసం భిక్షాటన తప్పు కాదు అలోక్ కుటుంబీకుల మాదిరిగానే స్నేహితుల ఆర్థిక స్తోమత çకూడా అంతంత మాత్రమే. మునుపటిలా మిత్రుడిని తమతో కలిసి తిప్పుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. చివరికి మిత్రులంతా కలిసి భిక్షాటనకు సిద్ధమయ్యారు. వీధి వీధి తిరుగుదామని నిశ్చయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు అయ్యేంత వరకు నిరవధికంగా భిక్షాటన చేద్దామని బయల్దేరారు. భిక్షాటన కోసం కాగితంతో ఓ డబ్బా తయారు చేసి వీధిన పడ్డారు. 15 రోజుల పాటు ఊరూ వాడా.. 15 రోజులపాటు వీధులే కాదు ఊరూరా తిరిగారు. నిరవధికంగా భిక్షాటన చేశారు. దాదాపు 15 పైబడి ఇరుగుపొరుగు గ్రామాల్లో తిరిగి చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు చేసి మిత్రుని కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి గురైన వెంటనే అలోక్‌ను తొలుత బరంపురం ఎమ్కేసీజీ వైద్య కళాశాలలో చికిత్స కోసం భర్తీ చేశారు. ఉన్నతమైన చికిత్స అవసరం కావడంతో భువనేశ్వర్‌లో పేరొందిన ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు తాము పోగుచేసిన నగదును అలోక్ తల్లిదండ్రులకు అతని మిత్రులు అందజేశారు. మొత్తం మీద మిత్రుని వెన్నెముక చికిత్స కోసం అలోక్ మిత్ర బృందం సాయశక్తులా శ్రమించింది. వీరి అంకిత భావంపట్ల భగవంతుడు కరుణించి మిత్రుడు అలోక్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరుగాడతాడని ఆశిద్దాం. -
ఏకాంతం కోరుకుంటా..
ఏకాంతాన్ని కోరుకుంటానని అంటోంది చెన్నై చిన్నది త్రిష. గతంలో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్ ఈ అమ్మడిపై చాలా ప్రచారమయ్యాయి. నిర్మాత వరుణ్‌మణియన్‌తో పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన ప్రేమ వ్యవహారం. అయితే వ్యక్తిగత సంఘటలేమీ త్రిష నట కేరీర్‌పై ప్రభావం చూపలేదు. మూడు పదుల వయసును అధిగమించిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దంన్నర దాటేసింది. అయినా హీరోయిన్గా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటిలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు ఉండడం విశేషమే. ఈ సందర్భంగా స్నేహితులు, మనస్తాపం వంటి విషయాల గురించి త్రిష ఒక భేటీలో పేర్కొంటూ.. జీవితంలో అనునిత్యం చాలా మందిని కలుసుకుంటుంటాం. ‘నా ఎదురుగా వచ్చే చాలా మంది చెయ్యి పైకి ఎత్తి హాయ్ అంటూ పలకరిస్తుంటారు. వారిలో కొంతమందితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారిలో కొందరు స్నేహితులుగా మారతారు. అయితే ఎంత స్నేహితులైనా వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకోలేం. అందుకే ప్రతి రోజు ఒకసారి మనకు మనమే హలో చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు మనమే స్నేహితులం. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నా వరకూ ఏదైనా మనస్తాపం కలిగినప్పుడు ఏకాంతం కోరుకుంటాను. ఆ సమయంలో అసలు ఎందుకు సమస్య వచ్చింది? అని నన్ను నేనే ఆత్మపరిశీలన చేసుకుంటాను. ప్రేమాభిమానాలు కురిపించే కుటుంబం, మంచి స్నేహితులు ఉండవచ్చు. అయితే నాకు నేనే అండ అని అంటోంది’ హీరోయిన్ త్రిష. -
మూర్తీభవించిన స్నేహం
హిరమండలం: కష్టాల్లో వెన్నంటి ఉండి.. ఆపదలో మేమున్నామంటూ స్నేహితుడికి అండగా నిలిచారు. మిత్రుడు ప్రమాదానికి గురై కదల్లేని స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాన్ని చూసి తట్టుకోలేకపోయారు. వైద్య ఖర్చులకు రూ.లక్ష అందజేశారు. ప్రతి నెలా మందులకు రూ.5000 ఇవ్వాలని నిర్ణయించారు హిరమండలానికి చెందిన స్నేహితులు!! మండలంలోని గులుమూరు గ్రామానికి చెందిన గొర్లె జగదీశ్వరరావు 1997–2000 వరకు అనకాపల్లిలో డిగ్రీ చదివాడు. అదే సమయంలో హిరమండలం నుంచి మరో పది మందికి పైగా విద్యార్థులు అదే కాలేజీలో చదివారు. ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళతున్న జగదీశ్వరరావు ప్రమాదానికి గురై పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. జగదీష్ వైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్పత్రులకు తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది. అప్పటినుంచి పూర్తిగా మంచానికే జగదీశ్వరరావు పరిమితమయ్యాడు. పేద కుటుంబం కావడంతో శస్త్రచికిత్స కోసం తల్లిదండ్రులు.. తమకున్న కొద్ది పాటి భూమిని అమ్మి అప్పులు చేశారు. నెలకు దాదాపు రూ.4 వేలు మందులకు ఖర్చువుతోంది. ఈ విషయం తెలుసుకున్న డిగ్రీ స్నేహితులు కలవల గోపాలరావు, కొప్పురౌతు రాజనారాయణ, బి.నాగరాజు, బోర శ్రీధర్, కలవల నాగభూషణ్‌రావు, వెంకటరమణ ఆదివారం జగదీశ్వరరావుని పరామర్శించారు. కుటుంబసభ్యులకు రూ.లక్ష అందించారు. మందుల ఖర్చులకు నెలకు రూ.5000 ఇచ్చేందుకు నిర్ణయించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. కన్నీరుమున్నీరవుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఉన్నది ఒకటే జిందగీ..
పసిపాప బోసి నవ్వు తల్లికి ఆనందం.. అమ్మాయి ఓర చూపు అబ్బాయికి ఆనందం... ఉద్యోగం దొరికితే నిరుద్యోగికి ఆనందం... పదవొస్తే రాజకీయ నాయకుడికి పట్టలేని ఆనందం.. ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్కరికీ ఆనందాన్ని పంచుతుంది. అయితే ప్రస్తుత యువత ఇంకాస్తా ముందడుగు వేసి.. ఇదిగో ఇలా ఎంజాయ్ చెయ్యడంలోనే అసలైన ఆనందం ఉందనీ.. ఎందుకంటే ‘‘ఉన్నది ఒకటే జిందగీ బాస్’’ అంటున్నారు. విశాఖ సిటీ: ఉరకలేసే ఉత్సాహం, కాలంతో పరిగెత్తే వేగాన్ని అందిపుచ్చుకున్న నేటి యువతరం ఆనందమనేది మనం సంపాదించుకునేది. అది ఏ రూపంలోనైనా పొందవచ్చని చెబుతున్నారు. జీవితమంటే ఓ సాహసయాత్రలాంటిది. కష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని సంతోషంగా స్వీకరిస్తేనే ఆనందయాత్ర ముందుకు సాగుతుందనే వేదాంతం మాట్లాడేస్తున్నారు. వారి మాటల్లో నిజమే ఉంది. చిన్న కష్టం వస్తే అసంతృప్తి బాట పడుతూ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు కొంతమంది. ఈ తరహా వైఖరిని వీడనాడాలని యువత సూచిస్తోంది. ఆనందపు వసంతం రావాలంటే.? అసంతృప్తే అన్ని అనర్థాలకు మూలం. సంతృప్తి అనేది లేకపోతే బతుకు దుర్భరమవుతుందని అన్నారు గోరాశాస్త్రి. కొంతమంది జీవితం సాఫీగా సాగిపోతున్నా.. సంతృప్తి చెందకుండా ఏదో మూలన బాధపడుతూ కాలం గడుపుతుంటారు. నగర జీవనంలో 35 ఏళ్లు పైబడిన వారిలో ఈ తరహా అసంతృప్తి ఇటీవల ఎక్కువైపోతోంది. ఈ విధానం నుంచి దూరమైపోతూ తమ సొంత ఆలోచనలతోనే ఆనందపుటంచుల్ని తాకుతోంది నేటి యువతరం. అసలు సంతోషం, ఆనందం అనేది 50 శాతం జన్యుపరంగానూ 40 శాతం మనిషి అంతర్గత ఆలోచనలు, 10 శాతం జీవన పరిస్థితుల పరంగా ఆధారపడి ఉంటుంది. సేవలోనే సంతృప్తి.. తాము ఆనందంగా ఉండటమే కాదు.. ఎదుటి వారి కళ్లల్లో ఆనందం చూస్తేనే తమకు నిజమైన సంతృప్తి అని అంటున్నారు కొందరు యువతీ యువకులు. అందుకే.. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తూ వారి జీవితాల్లో నింపుతున్న వెలుగుల్లోనే ఆనందం వెతుక్కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తకాలు కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతూ నిస్సహాయ స్థితిలో విద్యకు మధ్యలోనే దూరమైపోతున్న వారికి చేయూతనిస్తున్నారు. వైజాగ్ స్మైల్స్, వేదిక్ సైన్స్ క్లబ్, కెన్ ఫౌండేషన్.. మొదలైన సంస్థలు స్థాపించి ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక విద్యార్థిగా.. తోటి విద్యార్థికి సహాయం చేస్తే.. అందులో దొరికే ఆనందం చెప్పలేనిదనీ.. వీరంతా గర్వంగా చెబుతున్నారు. నగరంలో చైల్డ్ బెగ్గింగ్ని నిర్మూలించేందుకు జనరేషన్ యువ పేరుతో సంస్థను స్థాపించి కొంతమంది యువకులు ఆనందం వెతుక్కుంటున్నారు. యాచకవృత్తిలో ఉన్న బాలబాలికలకు ఉత్తమ జీవితాన్నందిస్తూ వారికీ ఆనందం పంచిపెడుతున్నారు. స్ట్రీట్ స్వచ్ఛంద సంస్థ పేరుతో 200 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వృథా ఆహారాన్ని సేకరిస్తూ నగరంలోని రోడ్లపై, ఫుట్ పాత్లపై ఎవరూ లేని అనాథల్లా.. ఆకలితో అలమటిస్తున్న వారికి అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. కడుపు నిండిన తర్వాత వారి ఆశీర్వాదంలోనే ఆనందం వెతుక్కుంటున్నారు. ఇలా.. ఆనందం కోసం యువతరం ఒక్కోదారిలో అన్వేషణ సాగిస్తున్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు..? ఆనందంగా ఉండాలని అనుకుంటే పనిలో మునిగిపోండంటున్నాయి కొన్ని అధ్యయన సంస్థలు. ఖాళీగా కూర్చొని పగటి కలలు కనేవారితో పోలిస్తే చేతినిండా పని ఉన్న వారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఆనందంగా ఉండడంపై యువత అభిప్రాయమేంటని తరచి చూస్తే.. ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. నగరంలో కొంతమంది యువతీ యువకుల్ని వారి ఆనందం విషయంపై మాట్లాడమంటే గలగలా కబుర్లు చెప్పేస్తున్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ.. ఎంత ఎక్కువ ఆనందం ఎందులో లభిస్తుందో.. దానివైపే మేము మొగ్గు చూపుతామంటూ ‘‘ఆనందం’’కొద్దీ చెప్పేస్తున్నారు. రోజులో ఎన్ని గంటలు ఆనందంగా ఉంటారు.? రోజంతా ఆనందంగా ఉంటాం టీవీలో కార్యక్రమాలు చూస్తున్న సమయంలో అప్పుడప్పుడూ ఆనందంగా ఉన్నామనిపిస్తుంది ఆనందాన్ని ఎందులో వెతుక్కుంటారు.? ఎదుటివారికి సహాయం చెయ్యడంలో చేస్తున్న ఉద్యోగంలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యడంలో సినిమాలు, టీవీషోలు చూడటంలో ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటారు.? కుటుంబంతో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఆనందమంటే..? ఉద్యోగం దొరకడం సొంతూరిలో ఉపాధి దొరకడం మంచి మనసున్న తోడు దొరకడం ఎదుటి వారికి సాయం చెయ్యడం ఆనందం కోసం ఎక్కడ అన్వేషిస్తున్నారని కొంతమంది యువతను అడిగితే.. వారు చెప్పిన మాటలివీ... అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడు ఆనందం విశాఖ వీధుల్లో దయనీయంగా కనిపిస్తున్న వారు అభాగ్యులు కాదు. వారికి స్ట్రీట్ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారు. వారి ఆకలిని తీర్చినప్పుడే అసలైన ఆనందం దొరుకుతుంటుంది. –గాయత్రి రాచర్ల, స్ట్రీట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఫ్రెండ్స్ పలకరింపుతో ఖుషీ ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాం. ఆ సమయంలో మేమున్నామంటూ అమ్మ ప్రేమను అందించే ఫ్రెండ్స్ పలకరింపులోనే ఆనందం దొరుకుతోంది. –మోనిక, ఏయూ ఎంటెక్ విద్యార్థి, ఒంగోలు పని చేస్తుంటేనే సంతోషం సాఫ్ట్వేర్ కంపెనీలో బ్యాకెండ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. పని చేస్తున్నప్పుడు పై అధికారులనుంచి ప్రశంసలు పొందినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. –యామిని, సాఫ్ట్వేర్ టెస్టర్ అమ్మ నాన్నలతో ఉంటేనే.. మాది శ్రీకాకుళం జిల్లా. ఉద్యోగం కోసం విశాఖ వచ్చేశాను. ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నా.. అమ్మా నాన్నతో గడిపిన క్షణాలే ఎంతో ఆనందాన్నిస్తాయి. – బి. ఆదిత్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి చదువులోనే.. చిన్నప్పటి నుంచి చదువుకోవడమంటే ఇష్టం. ఉత్తమ ప్రతిభ కనబరిచినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. –వి. భార్గవి, బిట్స్ పిలానీ విద్యార్థిని, మద్దిలపాలెం ఫ్రెండ్స్‌తో గడుపుతుంటే ఆనందం చదువు, ఉద్యోగంతో జీవితం బిజీ బిజీగా గడిచిపోతుంటుంది. ఖాళీ సమయంలో ఫ్రెండ్స్‌తో గడుపుతున్నప్పుడు లెక్కకు మించిన ఆనందం నా సొంతమవుతుంది. – స్రవంతి, పీహెచ్‌పీ డెవలపర్, సీతంపేట ఆనందానికి ఐరాస ఆరు కొలమానాలు.. 1. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు 2. తలసరి ఆదాయం 3. స్వేచ్ఛ 4. దాతృత్వం 5. సామాజిక భద్రత 6. అవినీతి రహితంగా జీవించడం. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చిరునవ్వులొలికిస్తూ ఆనందంగా గడిపేస్తుంటారు చాలా మంది. సంపద ఎంత ఉన్నా ఆనంద లేమితో జీవిస్తుంటారు మరికొంతమంది. ఏమిటీ వ్యత్యాసం? అంటే.. సంపదే సమస్తం కాదు. అది ఉంటే సౌకర్యాలతో సుఖంగా ఉండొచ్చేమో కానీ.. ఆనందంగా ఉండలేమంటున్నారు నగర యువత. ఆనందమనేది హృదయానికి సంబం«ధించినది. అది అంతర్గతమైన అనుభూతి. సామాజిక పునాదులు బలంగా ఉంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారని ఐరాస చెబుతోంది. అందుకే.. ఐక్యరాజ్యసమితి ఆనందానికి ఆరు కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుంటోంది. -
ఆ స్నేహబంధాన్ని వాగు విడదీసింది..
ఆ నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా వారందరూ కలిసే వెళతారు. ఒకిరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహబంధం వారిది.. ఆ ఫ్రెండ్షిప్తోనే వారందరూ విహారయాత్రకు వెళ్లారు. సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. అయితే విధి వక్రించింది. మారేడుమిల్లి మండలం పాములోరులో దిగిన వారిలో ఇద్దరు మృతి చెందారు.. చేతికి అందివస్తాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగాయి. కుమారులు కడుపుకోత మిగిల్చారంటూ వారి కన్నతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. గొల్లప్రోలు (పిఠాపురం), మారేడుమిల్లి (రంపచోడవరం): స్నేహితులతో కలిసి విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చి అక్కడ పాములేరువాగులోకి స్నానానికి దిగి గల్లంతైన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21) మృతి చెందాడు. పాములేరు వాగు శివారు ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. అప్పటికే మృతి చెందిన నందికాళ్ల ఫణీంద్ర(21)తో పాటు బుచ్చిరాజుగుప్తా మృత దేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తులసీరామ్ తెలిపారు. కాగా ఫణీంద్ర, బుచ్చిరాజుగుప్తా కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయామని బుచ్చిరాజుగుప్తా తల్లిదండ్రులు రాంబాబు, సుజాత గుండెలవిసేలా రోధించిన తీరు పలువురిని కలచివేసింది. స్నేహితులతో విహారానికి వెళ్లి తిరిగిరాకుండా పోయావా! అంటూ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. మరో వైపు ఫణీంద్ర మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు వెంకన్న, వరలక్ష్మి మాటలేకుండా పడిపోయారు. వ్యాపారం చూసుకుంటూ ఉపాధి పొందుతున్నావను కుంటే ఇలా అర్ధాంతరంగా కడుపు కోత మిగులుస్తావా! అంటూ రోధించారు. పలువురు గ్రామస్తులు మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. నలుగురి స్నేహాన్ని చూడలేకపోయిన మృత్యుదేవత మృతులు ఫణీంద్ర, బుచ్చిరాజుగుప్తా, తేటకాయల నరేంద్ర, గాడిదల సుబ్రహ్మణ్యం చిన్ననాటి నుంచి విడదీయని స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా వారు నలుగురే వెళతారు. ఈ సందర్భంలోనైనా వారు ఒకరిని విడిచి ఒకరు ఉండరు.ఈ నేపథ్యంలో ఆ నలుగురు యువకులు మంగళవారం మారేడుమిల్లి మండలం జీఎంవలస పంచాయతీ పరిధిలోని పాములేరు గ్రామానికి విహారయాత్రకు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. విహారానికి వెళ్లిన వారిలో ఇద్దరిని మృత్యువు కాటేసింది. వారి స్నేహాన్ని మృత్యురూపంలో విడదీసిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.