
సాక్షి, దూద్‌బౌలి(హైదరాబాద్): డబ్బుల విషయంలో గొడవ కారణంగా తోటి స్నేహితులే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిద్దిపేటకు చెందిన మధుసూదన్‌రెడ్డి కర్మన్‌ఘాట్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పేట్లబురుజు ప్రాంతానికి చెందిన సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరితో అతడికి స్నేహం ఏర్పడింది.
కొన్ని రోజులుగా మధుసూదన్‌రెడ్డికి సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరికి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్‌రెడ్డిని చార్మినార్ ప్రాంతానికి పిలిపించారు. సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరు అతడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి ఓ పొలంలో పాతిపెట్టారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి భార్య మధులతకు అనుమానం రావడంతో కుటుంబ సభ్యులతో వెళ్లి 20వ తేదీన చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుసూదన్‌రెడ్డి ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ మధులత ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment