
ముత్యాల మణికంఠ సాయి కిరణ్ మిరియాల వంశీ
పెరవలి: ఎస్సై వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు స్నేహితులు విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ, మిరియాల వంశీ, సైపురెడ్డి నవీన్ కుమార్ పెరవలి మండలం కాకరపర్రు వద్ద గోదావరి తీరంలో విహారానికి ఉదయం 11 గంటలకు వచ్చారు. వీరు ఉదయం నుంచి ఆడుతూపాడుతూ గడిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి దిగారు. స్నానాలు చేయటానికి వచ్చారు. వీరిలో సైపురెడ్డి నవీన్ కుమార్ ఇసుక తెన్నెల్లోనే ఉండగా, మిగతా ముగ్గురు నదిలో దిగారు. లోతు లేదని కొద్దికొద్దిగా లోపలకు వెళ్లారు. ఒక్కసారిగా మునిగిపోయారు. దీనిని గమనించిన నవీన్‌కుమార్ స్నేహితులను రక్షించడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఎంతగా కేకలు వేసినా ఎవరూ రాకపోవడంతో ఏమీ చేయలేకపోయాడు. స్నేహితులు కళ్లముందే మునిగిపోవడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. పెరవలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పాడు.
బంధువుల రోధనలు: విషయం తెలిసిన బంధువులు ఘటనా స్థలానికి వచ్చి తమ పిల్లల జాడ తెలియకపోవటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటి దగ్గర కూడా చెప్పకుండా వచ్చేశారని ఇలాంటి సమాచారం వస్తుందని అనుకోలేదని అంటూ వాపోయారు.
ముమ్మరంగా గాలింపు
గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారని తెలిసిన వెంటనే పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు సంఘటనా స్థలానికి సిబ్బందితో సహా వచ్చారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. స్థానికులను ఆరా తీశారు. చేపలు పట్టే వలలతోనూ యువకుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment