నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్‌ | Sushant Singh Rajput Said He Had Just Two Friends | Sakshi
Sakshi News home page

జనాలు మొదట నన్ను ఇష్టపడ్డట్లు నటిస్తారు

Published Tue, Jun 16 2020 6:54 PM | Last Updated on Tue, Jun 16 2020 6:56 PM

Sushant Singh Rajput Said He Had Just Two Friends - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అకాల మరణ వార్త మొత్తం దేశాన్ని కదిలించింది. అతను ఒంటరిగా ఉన్నాడని.. నిరాశతో బాధపడుతున్నాడని నివేదికలు వెల్లడించాయియి. ఈ క్రమంలో సుశాంత్‌ మరణించిన రెండు రోజుల తరువాత పాత వీడియో  ఒకటి ఆన్‌లైన్‌లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సుశాంత్‌ తనకు కేవలం ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ‘చాలా నిజాయితీగా చెప్తున్నాను. నాకు ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు’ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. (‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’)

ఈ క్రమంలో సుశాంత్‌ మాట్లాడుతూ.. ‘జనాలకు నాతో మాట్లాడటం ఇష్టం ఉండదు.. అయితే వారు మొదట నన్ను ఇష్టపడినట్లు నటిస్తారు. ఆ తరువాత నన్ను మర్చిపోతారు. నేను స్నేహితులను చేసుకోలేను. అంటే నాకు జనాలు అంటే ఇష్టం లేక కాదు. నేను వారిని నిజంగా ఇష్టపడుతున్నాను. కాని వారు నాతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపరు. మొదటిసారి వారు నన్ను ఇష్టపడుతున్నట్లు నటిస్తారు. కాని తర్వాత వారు నా కాల్స్‌ లిఫ్ట్‌ చేయరు’ అని తెలిపారు. బంధుప్రీతి కారణంగా సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారసత్వం లేక టాలెంట్ వున్న నటుల పట్ల ఇండస్ట్రీ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement