Nepotism
-
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
నేను ఇలా చేయడంతో కొందరు తిట్టుకుంటున్నారు: రష్మిక మందన్న
శాండిల్ వుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ కథానాయకిగా అగ్రస్థానానికి చేరుకున్న నటి రష్మిక మందన్న. ఇండస్ట్రీలో అదృష్టం అంటే ఈమెదే అనాలి మాతృభాషలో నటించిన కిరాక్ పార్టీ మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఆ చిత్రం ఈ అమ్మడిని టాలీవుడ్లో అడుగు పెట్టేలా చేసింది. టాలీవుడ్ ఈమెను స్టార్ హీరోయిన్ను చేసింది. కానీ, కోలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసిన ఈమెకు అంత పేరు తెచ్చి పెట్టలేదు. అయితే బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసిన బ్యూటీ అక్కడ కూడా క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారను. దీంతో దక్షిణాదిలో ఎక్కువగా చిత్రాలు చేసే అవకాశం లేకపోతోంది.తాజాగా రష్మిక మందన్న నటించిన పుష్పా– 2 త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి రష్మిక మందన్న పేర్కొంటూ తాను తనను ఇతరులతో పోల్చుకోవడానికి ఇష్టపడనని తెలిపారు. దీన్ని తెలిపే విధంగా ఇరీప్లేసబుల్ అంటూ తన చేతిపై పచ్చబొట్టును కూడా పొడిపించుకున్నారు . తాను తనలాగే ఉండటానికి ఇష్టపడతానన్నారు. అందువల్లే అభిమానులు తనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని నమ్ముతున్నానన్నారు. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యం ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం కొంచెం మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతిభ ఉంటే చాలని అభిమానుల ఆదరణ లభిస్తుందని అన్నారు. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని, అయితే హిందీ తదితర ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని అన్నారు. అందువల్ల తెలుగు సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, కొందరైతే తనను తిట్టుకుంటున్నారని అన్నారు. అయితే అదంతా వారికి తనపై ఉన్న అభిమానమే కారణమని గ్రహించగలనని పేర్కొన్నారు. అదేవిధంగా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదని చాలామంది అడుగుతున్నారని, అలాంటి కథాచిత్రాల్లో నటించాలని ఏ నటి అయినా కోరుకుంటారని, తాను అందుకు అతీతం కాదన్నారు. -
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్‌కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్‌సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
వారి వల్ల సినిమా అవకాశాలు కోల్పోయా
-
వారి వల్ల సినిమా అవకాశాలు కోల్పోయాను: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడారు. చిత్రపరిశ్రమ ఏదైనా సరే అక్కడ నెపోటిజం అనే పదం తప్పనిసరిగా వింటూనే ఉంటాం. ఇప్పటికే దీని గురించి చాలామంది నటీనటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎలాంటి సినీనేపథ్యం లేకుండానే రకుల్ పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, నెపోటిజం వల్ల చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.టాలీవుడ్లో మెప్పించి ఆపై బాలీవుడ్లో కూడా భారీ సినిమాల్లో రకూల్ నటించారు. టాప్ హీరోయిన్గా కొనసాగిన రకూల్ కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు ఇలా చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయాను. అరే, అవకాశాలు కోల్పోయానే అనే బాధ నాలో ఉండదు. అలా అని నేను కూర్చుని ఉండిపోయే వ్యక్తిని కాదు. బహుశా ఆ సినిమాలు నా కోసం ఉద్దేశించినవి కాకపోవచ్చని ముందుకు వెళ్తాను. ఇదీ చదవండి: 'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్నా తండ్రి సైన్యంలో పనిచేయడంతో ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. దీంతో ఇలాంటి చిన్నవాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. అవకాశాలు కోల్పవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. అలాంటప్పుడు దక్కని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్న సమయాన్ని వృథా చేసుకోను. ఒక స్టార్ కిడ్‌కు సులభంగా ఛాన్సులు వచ్చినట్లు కొత్తవారికి మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ రావు. ఆ క్రెడిట్ అంతా వారి తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది. అని రకుల్ చెప్పుకొచ్చారు.రకుల్ తెలుగులో చివరి సినిమా కొండపొలం. 2021లో ఈ మూవీ విడుదలైంది. రీసెంట్గా భారతీయుడు2లో ఆమె కనిపించారు. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌తో 'దే దే ప్యార్ దే 2'లో నటిస్తున్నారు. మేరీ పట్నీ కా రీమేక్ చిత్రంతో పాటు భారతీయుడు-3 ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు -
Prime Minister Narendra Modi: విష వలయంలో కాంగ్రెస్
జైపూర్/రేవాడీ: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల విష వలయంలో చిక్కుకుందని, అందుకే నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిపోయిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌కు దశ, దిశ లేవు. భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ది పట్ల విజన్, రోడ్డు మ్యాప్ లేవు’’ అన్నారు. శుక్రవారం జైపూర్‌లో ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్తాన్’ సభనుద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు, సౌర శక్తి, విద్యుత్ సరఫరా, తాగునీరు, పెట్రోలియం, సహజ వాయువు తదితర రంగాలకు చెందిన రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ అంటే... ప్రజలకు ఇచి్చన గ్యారంటీలను తాము అమలు చేస్తుంటే కొందరికి నిద్ర పట్టడం లేదని మోదీ అన్నారు. వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటివి తాము ప్రారంభించిన పథకాలు కావడంతో వాటి గురించి కాంగ్రెస్ మాట్లాడడం లేదని ఆరోపించారు. మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, దీనివల్ల దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటి ప్రతికూల రాజకీయాలు యువతకు ఏమాత్రం స్ఫూర్తిని ఇవ్వబోవని తేలి్చచెప్పారు. ఇటీవలే యూఏఈలో పర్యటించానని, భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్ అంటే కేవలం కొన్ని పదాలు లేదా భావోద్వేగం కాదని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబాన్ని సౌభాగ్యవంతంగా మార్చే, పేదరికాన్ని తొలగించే, ఉపాధి అవకాశాలు సృష్టించే, ఆధునిక వసతులు కలి్పంచే కార్యక్రమం అని తెలియజేశారు. తన దృష్టిలో యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధానమంత్రి మరోసారి వివరించారు. హరియాణాలోని రేవాడీలో ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాముడు కేవలం ఊహేనని, ఆయోధ్యలో ఆలయం అవసరం లేదని అన్న కాంగ్రెస్ ఇప్పుడు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. -
రిటైర్ అయిపోతే మంచిది
‘కరణ్ జోహార్.. ఫస్ట్ నువ్వు రిటైర్ అయిపో.. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించు.. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. రణవీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఈ నెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కరణ్ జోహార్‌పై మండిపడ్డారు కంగనా రనౌత్. ‘‘భారతీయ ప్రేక్షకులు మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో డైలీ సీరియల్స్ తీస్తున్నారు. 1990లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నావ్? ప్రతిభ ఉన్న ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తే కొత్త కథలతో మూవీస్ తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు’’ అన్నారామె. అలాగే రణ్వీర్ సింగ్‌ని ఉద్దేశించి–‘‘డ్రెస్సింగ్ విషయంలో కరణ్‌ను ఫాలో కావొద్దు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది నటులను చూసి తెలుసుకో.. వాళ్ల లుక్‌లో ఓ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉంటాయి’’ అన్నారు కంగనా. -
బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్
ఉయ్యాలా జంపాలా చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి హీరో నాగార్జున నిర్మాత కావడం మరింత కలిసొచ్చింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి వరుస సినిమాలతో హీరోయిన్గా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో పాప్ కార్న్ సినిమాతో సహ నిర్మాతగా పలకరించినా అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న అవికా గోర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రినయ్యా.. నా జీవితం పరిపూర్ణమైంది) 'స్టార్ హీరోల పవర్ మీదే సౌత్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తోంది. బాలీవుడ్ కంటే సౌత్‌లో నెపోటిజం కొంచెం ఎక్కువే.. హిందీ చిత్రాలపై అక్కడ పక్షపాతం ఉంది. సౌత్ సినిమాలు నేడు బాలీవుడ్లో చాలా రీమేక్ అవుతున్నాయి. వాటిని ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడి వారు మాత్రం బాలీవుడ్ చిత్రాలను పెద్దగా ఇష్టపడరు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. ప్రజలు కూడా దానినే ఇష్టపడుతున్నారు. #Bollywood Actress #AvikaGor about Nepotism in #Tollywood. pic.twitter.com/8MCnVpC9Dv— Crazy Buff (@CrazyBuffOffl) June 12, 2023 రాబోయే రోజుల్లో ఇది ఉండకపోవచ్చు' అని తెలిపింది. అవికా గోర్ కామెంట్లపై నెటిజన్లు మండి పడుతున్నారు. సౌత్‌లో అవకాశాలు దక్కించుకొని, మంచి పేరుతో పాటు డబ్బు సంపాదించాక చులకన చేసి మాట్లాడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. కాగా అవికా గోర్ ప్రస్తుతం 1920 హారర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీలో విడుదల కాబోతోంది. (ఇదీ చదవండి: సీనియర్ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్) -
మా నాన్న వల్లే వచ్చా.. ఢిల్లీ ఈవెంట్లో నెపోటిజంపై చరణ్ కామెంట్స్
నాటు నాటు ఆస్కార్ గెలిచిన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన రామ్ చరణ్ నేరుగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ మారిన చరణ్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ వేదికలపై తనదైన స్పీచ్‌లతో అదరగొట్టాడు. అంతేకాదు ప్రతిష్టాత్మక అవార్డు హెచ్‌సీఏ(హాలీవుడ్ క్రిటిక్ అసోసియేష్ అవార్డును) ప్రజెంటర్‌గా విశ్వవేదికపై మెరిసాడు. అలా ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. చదవండి: ‘రానా నాయుడు’ సిరీస్‌పై సీనియర్ నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చరణ్‌కు నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ బంధుప్రీతిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మా నాన్న వాళ్లే ఇక్కడకు వచ్చాను.. కానీ ఆ తర్వాత తనకు తానుగా ముందుకు సాగాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నిజానికి ఈ నెపోటిజం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ మధ్య కాలంతో దీని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఈ అంశాన్ని ఎక్కువ చర్చిస్తున్నారు’ అని అన్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘అవును నేను మా నాన్న వల్లే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు నటన అంట ఇష్టం. చిన్నప్పటి నుంచి పరిశ్రమలోనే పెరిగాను. చదవండి: పీకల్లోతు కష్టాల్లో మణిరత్నం... పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ డౌటే! సినిమాలు చేయాలనే కలతోనే నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నా. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. 14 ఏళ్లు పరిశ్రమలో నిలబడిగలిగాను. స్టార్ హీరో కొడుకుగా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ నాకు నేనుగా ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకురావుడం కష్టం. ప్రతిభ లేకుంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ‘‘సినిమాలోకి వస్తానన్నప్పుడు మా నాన్న నాకు ఒకటి చెప్పారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. నీ కోసం పనిచేసే వాళ్లను జాగ్రత్తగా చూసుకో చాలు’ అన్నారు. ఆయన మాటలను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా’’ అంటూ చరణ్ తనదైన శైలిలో నెపోటిజంపై వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే తనకు ఇష్టమని చెప్పమని, ఆయనకు వీరాభిమానిని అని చెప్పాడు. -
ఆ కామెంట్ నన్ను తీవ్రంగా బాధిస్తోంది: జాన్వీ కపూర్ ఆవేదన
అతిలోకి సుందరి, దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. స్టార్ కిడ్ అయినప్పుటికీ తరచూ విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నా జాన్వీ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ మాట్లాడుతూ.. తనపై వచ్చే ట్రోల్స్ చూసి విసిగిపోయానంది. ఎంత కష్టపడినా అందులో తప్పులు వెతుకుతూ విమర్శిస్తూనే ఉంటారని వాపోయింది. ‘మనం ఏం చేసిన, ఎంత కష్టపడినా కొందరు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ మనల్ని ఎంతగా ట్రోల్ చేస్తే వారికి అంత సంతోషం. విమర్శించడంలో వారు ఆనందం పొందుతారు. దాంతో వారు మనపై చేసే కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తారు. ఇది నిరంతరం కొనసాగతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వార్తలు చదివి, చదివి కొంతకాలానికి ప్రజలు విసిగిపోతారు. దురదృష్టం ఏంటంటే మనపై వచ్చే ట్రోల్స్ కూడా ప్రజలను విసిగిపోయేలా చేస్తాయి’ అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే ‘నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నెపోకిడ్ అంటూ కొందరు నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ నా సినిమా రిలీజైనప్పుడల్లా ‘నెపోకిడ్.. నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావు?’ అని కామెంట్స్ చేస్తున్నారు. వాటిని చూసి నేనెంతో బాధపడ్డా. అయితే, ఇప్పుడు సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నా. నా బలాలు, బలహీనతలు, నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి, వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోకూడదని అర్థమైంది. అలాగే ఇటీవల నేను చేసిన చిత్రాలతో నటిగా నన్ను నేను నిరుపించుకున్నాను అనుకుంటున్నా. నాకు కూడా అవకాశాలు వస్తాయని అనిపిస్తొంది’ అని పేర్కొంది. -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నేనంటే చాలామందిలో దురభిప్రాయం ఉంది: జాన్వీ కపూర్
నెపోటిజం.. ఈ పదం ఎక్కువగా బాలీవుడ్లో వినిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం రాణిస్తున్న స్టార్స్‌లో వారసత్వంతో వచ్చినవారే ఎక్కవ ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో హీరోయిన్ జాన్వి కపూర్ ఒకరు. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ. ఆమె తండ్రి బోని కపూర్ కూడా బడా నిర్మాత కావడంతో తరచూ ఆమె స్టార్ కిడ్‌గా గుర్తింపు పొందింది. వార వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిందని, అయితే తనలో టాలెంట్ లేదంటూ, తల్లి అంత అందంగా కూడా లేదంటూ తరచూ ఆమె ట్రోల్స్ బారిన పడుతుంది. చదవండి: Nayanthara-Vignesh Shivan: సరోగసీ వివాదం.. వైరల్‌గా విఘ్నేశ్ శివన్ పోస్ట్ ఈ క్రమంలో తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌పై జాన్వీ ఘాటుగా స్పందించింది. తాను పెద్ద టాలెంట్ కాకపోవచ్చు, అందగత్తెను కూడా కాదు.. కానీ కష్టపడేతత్త్వం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నా గురించి చాలా మందిలో దురభిప్రాయం ఉంది. నేను వారసత్వం ద్వారా వచ్చి.. స్టార్ డమ్ పొందాలని అనుకోవడం లేదు. నాకంటూ సొంతంగా గుర్తింపు పొందాలి అనుకుంటున్నా. అయినా నేనేమి గొప్ప టాలెంట్ కాదు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి, ఆ రోజు నుంచి స్ట్రీమింగ్, ఎక్కడంటే పెద్ద అందగత్తేను కూడా కాదు. కానీ సెట్స్‌లో వందకు వందశాతం కష్టపడతాను. కష్టపడేతత్త్వంలో నాలో ఉంది. అందువల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. సెట్లో ఎంతో కష్టపడి పనిచేస్తానని హామీ ఇవ్వగలను. ఇదే విషయాన్ని మీకు నా రక్తంతో కూడా రాసిస్తాను. నా పనితీరుపై అనుమానమే అక్కర్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఒకటే పనిని పదే పదే చేయడం తనకు ఇష్టం లేదని, సవాళ్లతో కూడిన పనిని చేసేందుకు తాను ఆసక్తిచూపుతానని తెలిపింది. కాగా జాన్వీ ఇటీవల గుడ్‌లక్ జెర్రీలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మిలి చిత్రంతో బిజీగా ఉంది. -
నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన బాలీవుడ్ డెబ్యూ చిత్రం లాల్ సింగ్ చడ్డా మూవీకి బాయ్‌కాట్ సెగ అట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను బహిష్కించారంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కనీస వసూళ్లు కూడా చేయలేకపోతుంది. ఇదిలా ఉంటే ఇందులో చై బాలరాజు అనే ఆర్మి యువకుడిగా నటించగా.. తన పాత్రకు మంచి మార్కులు వచ్చాయి. లాల్ సింగ్ చడ్డా రిలీజ్‌కు ముందు నుంచి రిలీజ్ అనంతరం నాగ చైతన్య వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. చదవండి: ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో చైకి నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నెపోటిజం ప్రభావం అనేది బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాన పెద్దగా కనిపించదు. అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్థం కావడం లేదు. దీని గురించి నన్ను అడిగినప్పుడల్లా నా అభిప్రాయం ఇదే. ఎందుకంటే మా తాత(అక్కినేని నాగేశ్వరరావు) ఓ నటులే. మా నాన్న(నాగార్జున) కూడా నటుడే. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం కచ్చితంగా నాపై పడుతుంది కదా! వారిని చూసి నేనూ నటుడి కావాలని ఆశపడ్డాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని నటుడిని అయ్యాను. అలా వారు చూపించిన దారిలో నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నా.. ఈ జర్నీ అలాగే కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: సెట్స్‌పైకి రజనీ ‘జైలర్’.. కొత్త పోస్టర్ రిలీజ్ ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఎప్పుడైనా ఓ సెల్ఫ్ మేడ్ స్టార్(ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడు) సినిమా, నా సినిమా ఒకేరోజు విడుదలయితే. వారి సినిమా రూ.100 కోట్లు సాధించి నా సినిమా రూ.10 కోట్లు సాధిస్తే.. అందరూ తనను ప్రశంసిస్తారు. ఇక దర్శక-నిర్మాతలు అతడినే ముందుగా అప్రోచ్ అవుతారు’ అని అన్నాడు. ఇక సినిమా ఫ్యామిలీ నుండి రావడం వల్ల తనకు బ్రేక్ ఈజీగానే దొరికిందని ఒప్పుకున్న నాగచైతన్య పరిశ్రమలోని పోటీ గురించి ప్రస్తావించాడు. ‘ఈ రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో కొడుకు రేపు పెద్దయ్యాక అతడు కూడా హీరోనే అవుతాడు కానీ, నెపోటిజం పేరు చెప్పి అతడికి అడ్డు చెప్పగలడా’ అంటూ వివరణ ఇచ్చాడు నాగ చైతన్య. -
ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి!
నెపోటిజం(బంధుప్రీతి) ఈ పేరు వినగానే మొదట గుర్తోచ్చేది బాలీవుడ్. దివంగత నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం బాలీవుడ్లో నెపోటిజంపై ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్లో వినిపించే ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది. తాజాగా యువ నటి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సౌత్‌లో సైతం నెపోటిజం ఎఫెక్ట్ ఉన్నా ఇప్పటివరకు దీనిపై మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ధైర్యం చేసి ఈ అంశాన్ని లెవనెత్తినట్లు కనిపిస్తోంది. ‘సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా. మరి మిగతావాళ్ల సంగతేంటి’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు? ఆమె ట్వీట్ చూస్తుంటే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోలీవుడ్ బంధుప్రీతిపై తొలిసారి నోరు విప్పిన ఈ బ్యూటీ పెద్ద స్టార్ ఏమీ కాదు. ఈమధ్యే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ యువ నటి. ఇప్పటి వరకు ఆమె చేసింది ఒకట్రెండు సినిమాలు మాత్రమే. ఇంతకి ఈ బ్యూటీ పేరు ఏంటంటే ఆత్మిక. ‘మిసాయి మురుకు’ అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆత్మికకు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆత్మిక తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ఈ నేపథ్యంలో ఇటీవలే నటిగా తెరంగేట్రం చేసిన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌కు పరోక్షంగా ఆమె చురకలు వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అదితి.. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాదు సింగర్‌గా కూడా రాణిస్తోంది. ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు కన్ను కుట్టినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆత్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. కాగా అదితి ఇప్పటికే హీరో కార్తి సరసన హీరోయిన్గా చాన్స్ కొట్టేయగా.. తాజాగా ఆమె శివ కార్తికేయన్ సినిమాలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. It’s good to see privileged getting easy way through the ladder while the rest 🥲 Paathukalam 🙌🏽 — Aathmika (@im_aathmika) August 4, 2022 -
కాఫీ విత్ కరణ్: టాలీవుడ్ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం 7వ సీజన్‌ను జరుపుకుంటుంది. ఈ సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో లెటెస్ట్ ఎపిసోడ్లో స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె ఈ షోలో పాల్గొంది. అయితే ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమంత ఎపిసోడ్ తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా కరణ్ సమంతను విడాకులు, ట్రోల్స్‌పై పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగగా సమంత తనదైన శైలిలో సమాధానం చెబుతూ వచ్చింది. అలాగే టాలీవుడ్ నెపోటిజంపై కూడా తనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సామ్ స్పందిస్తూ.. ‘టాలీవుడ్లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు.. కానీ విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్‌గా మారడం చాలా అరుదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కరణ్ టాలీవుడ్‌ను ‘బిగ్ బాయ్స్ క్లబ్’ అని కామెంట్స్ రావడం తాను విన్నానని, దీనిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించాడు. ‘నాకు తెలిసి రెండు ఆపిల్స్ ఒకెలా ఉండవు. ఒక ఆపిల్ నుంచి మరో ఆపిల్‌కు భిన్నంగా ఉంటుందని అనుకుంటున్నాను. నెపో పిల్లలు.. నాన్ నెపో పిల్లలు. ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు, ప్రతిభ కలిగి ఉంటారు. వారికి కూడా టాలెంట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక తండ్రి కోచ్‌గా ఉన్నప్పుడు అతని కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో పక్కన నిలబడి చూడటం తప్పా, కొడుకును గెలిచేందుకు ఏం చేయలేడు కదా. ఇది అలాగే’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సపోర్ట్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడంపై(ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్) తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘ఆ అడ్వంటేజ్ అనేది మొదటి సినిమాల వరకు మాత్రమే ఉంటుంది. చదవండి: ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి సరే రెండు, మూడు, నాలుగు సినిమాలకు కూడా ఉండోచ్చు. అంతకంటే ఉండదు కదా. అదే నన్ను చూసుకుంటే. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా సినిమాలు ఫెయిల్ అయినా, డిజాస్టర్ అయినా మా అమ్మ-నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. అదే స్టార్ హీరోల పిల్లలు ఫెయిల్ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారిని ఎప్పుడు ట్రోల్ చేస్తుంటారు. వారిని వారసత్వంతో పోలుస్తూ విమర్శలు చేస్తుంటారు. సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులని, గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని నేను అనుకోను. దైవానుగ్రహంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. మన సక్సెస్ నిర్ణయించేది ప్రేక్షకులే’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది. -
ప్లాస్టిక్ సర్జరీ.. మూడేళ్లు నరకం చూపించారు
Koena Mitra Recalls Her Struggle: బాలీవుడ్లో నెపోటిజం, గ్రూపిజం కొత్తేమీ కాదు. వీటివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ పలువురు నటీనటులు బాహాటంగానే నోరు విప్పారు. తాజాగా బాలీవుడ్ నటి కొయినా మిత్రా కూడా దీనిపై స్పందించింది. 'ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే వాటివల్ల నేనూ ఇబ్బందులకు లోనయ్యాను. నేను అవుట్ సైడర్(సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి) అయినప్పటికీ ఇండస్ట్రీలో నేను కూడా మంచి బ్రేక్ అందుకున్నాను. కానీ నాకవసరం అయినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నాకోసం వారు పెదవి విప్పి మాట్లాడలేదన్న ఫిర్యాదు నాకెప్పుడూ ఉంటుంది' 'ఇక నా ప్లాస్టిక్ సర్జరీ అంటారా? అది పూర్తిగా నా నిర్ణయం. నా ఫేస్, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే జనాలకేంటి సమస్య? ఇలా సర్జరీ గురించి ఓపెన్‌గా చెప్పొద్దన్న విషయం నాకు తెలియదు. నన్ను దాని గురించి అడిగారు కాబట్టే అవును చేయించుకున్నానని వివరాలన్నీ చెప్పాను. ఆ మాత్రందానికి నన్ను నానామాటలు అన్నారు. నామీద వ్యతిరేక వార్తలు రావౠరు. ఇండస్ట్రీలో అయితే చాలామంది నాతో దూరం పాటించారు. అది నా కెరీర్‌ను దెబ్బతీసింది. మూడేళ్లు నాకు నరకం అంటే ఏంటో చూపించారు. ధైర్యంగా ఉండండి అంటూ హితబోధ చేస్తున్నవారు మీడియా ముందుకు వచ్చి మాత్రం నాకు సపోర్ట్‌గా మాట్లాడరు అని చెప్పుకొచ్చింది కొయినా మిత్రా. -
ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన
వివేక్ ఒబెరాయ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హిందీ నుటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరితులు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. ఇక బాలీవుడ్లో ఆయన ఓ స్టార్ నటుడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఆయన 20 ఏళ్లపైనే అవుతుంది. చదవండి: ఇన్సైడ్ ఎడ్జ్ హ్యాట్రిక్ సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా? అయినప్పటికీ నటుడిగా తనని తాను నిలదొక్కుకునేందుకు ఇప్పటికి ఆయన కష్టపడుతున్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఈ మాటలు స్వయంగా ఆయనే చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బాలీవుడ్లో టాలెంట్ కంటే ఇంటి పేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బి-టౌన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 20 ఏళ్లు నుంచి తాను పరిశ్రమలో ఉన్నప్పటికీ.. నేటికి తన ప్రయాణం ఎంతో కష్టం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా వివేక్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో నెపోటిజంపై ఆయనకు ప్రశ్న ఎదురవగా తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. ఈ మేరకు ‘20 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్న. అయినప్పటికీ నటుడిగా నా ప్రయాణం ఇప్పటికీ కష్టంగా ఉంది. బాలీవుడ్.. కొత్త టాలెంట్ పెంచి పోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోయింది. హిందీ చిత్ర పరిశ్రమను ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌గా మార్చేశారు. ఇది చాలా బాధించే విషయం. ఇక్కడ రాణించాలంటే ప్రతిభ కంటే ఇంటిపేరు కీలకంగా మారింది. బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవాలంటే ఇంటిపేరు ప్రముఖులదై ఉండాలి. చదవండి: 'విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా'.. సమంత షాకింగ్ కామెంట్స్ లేదంటే ప్రముఖులకు బంధువో, లేక తెలిసిన వారై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఇక్కడ అవకాశాలకు, ప్రతిభకు సంబంధం ఉండదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ నేపోటిజం(బంధుప్రీతి)పై చర్చ సాగుతున్న నేపథ్యంలో హిందీ పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు ఈ వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్ మారింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో యువ టాలెంట్‌ను నింపేందుకు తన వంతుగా కృష్టి చేస్తున్నానని, వీలైనంతగా కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. -
బాలీవుడ్లో నెపోటిజం కాదు.. జాత్యాహంకారం ఉంది: నటుడు
వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న నటడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆయన ఇటీవల సుధీర్ మిశ్రా దర్శకత్వంలో చేసిన ‘సీరియస్ మెన్’లో తన నటనకు గానూ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నామినేషన్ పొందాడు. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) కంటే ఎక్కువగా రేసిజం (జాత్యాహంకారం) సమస్య ఉందని ఓ ఇంటర్వూలో తెలిపాడు. నవాజ్ మాట్లాడుతూ.. ‘సీరియస్ మెన్’ తర్వాత మరో మంచి సినిమాలో లీడ్ రోల్ వస్తే అదే ఇందిరా తివారికి విక్టరీ అని చెప్పాడు. అంతేకాకుండా..‘ బాలీవుడ్లో తెల్లగా ఉండేవాళ్లతో పాటు నల్లగా ఉండేవారు కూడా హీరోయిన్లు చేయాలని కోరుకుంటున్నా. మంచి సినిమాలు రావాలంటే ఇదే కాకుండా పరిశ్రమలో ఉన్న పక్షపాతాలు అన్ని పోవాలి. నేను చాలా సంవత్సరాలుగా దానికి వ్యతిరేకంగా పోరాడాను. ఎందుకంటే నేను పొట్టిగా ఉంటాను. నా పరిస్థితి బానే ఉంది కానీ ఈ రకమైన భేషజాల వల్ల ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ బలైపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆయన నటించిన ‘సీరియస్ మెన్’లో లీడ్ రోల్లో నటించిన ఇందిరా తివారి పొట్టిగా, నల్లగా ఉంటుంది. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ గురించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా! -
నెపోటిజంపై బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Mallika Sherawat On Bollywood Nepotism: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి అనంతరం బాలీవుడ్ నెపోటిజంపై జరిగిన రచ్చ అంతఇంత కాదు. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మాత కరణ్ జోహర్‌తో పాటు పలువురు బాలీవుడ్ పెద్దలపై, నటీనటులపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో దర్శకడు మహేశ్ భట్ కూతురు పూజా భట్, కంగనాకు మధ్య మాటల యుద్ధమే జరిగింది. అనంతరం క్రమంగా ఈ వివాదం కాస్తా సద్దుమనుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా బోల్డ్ బ్యూటీ, నటి మల్లిక షెరావత్ వ్యాఖ్యలతో నెపోటిజం(బంధుప్రీతి) మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై మల్లిక ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేసింది. చదవండి: చివరి రోజుల్లో సిద్ధార్థ్‌తో లేనందుకు బాధగా ఉంది: నటి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోల గర్ల్‌ఫ్రెండ్స్, చెల్లెల్లు, బంధువుల కారణంగా చివరి క్షణాల్లో నన్ను సినిమాల నుంచి తప్పించారని వాపోయింది. ‘నెపోటిజం కారణంగా నాకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు చేజారిపోయాయి. కొన్నిసార్లు నా స్థానంలో హీరోల గర్ల్‌ఫ్రెండ్, మరికొందరి ప్రియురాళ్లు, నటుల చెల్లెల్లు, బంధువులను తీసుకున్నారు. ఇది పరిశ్రమలో సాంప్రదాయంగా కొనసాగుతుంది. పరిశ్రమలో ఎన్నటికీ ఇది మారదు. అందుకే ఇవేవి నన్ను బాధించలేదు. అసలు వీటిని నేను అంతగా పట్టించుకొనేదాన్ని కూడా కాదు. నా స్వయం శక్తిని నమ్ముకున్నాను. నా పని ఏంటి, ఆ రోజు నా షూటింగ్ ఏంటీ దానిపైనే శ్రద్ధ పెట్టాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: షెర్లిన్ వల్లే రాజ్‌కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు అలాగే బోల్డ్ సీన్స్‌లో నటించడం వల్ల తను ఎదుర్కొన్న ట్రోల్స్‌పై స్పందించింది. ‘ప్రారంభంలో ట్రోలర్స్ నన్ను టార్గెట్ చేసేవారు. కానీ అదే బోల్డ్ సన్నివేశాల్లో నటించిన పరుషులు మాత్రం బాగానే ఉండేవారు. వారికి అందరిలాగే సమాజంలో గౌరవం ఉండేది. వారి మీద ఎలాంటి కామెంట్స్ చేసేవారు కాదు. కానీ మహిళలను మాత్రం విపరీతంగా ట్రోల్ చేసేవారు. అదే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. సమాజం ఎందుకు ఇలా ఆలోచిస్తుంది. ఈ సమస్య కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ దేశాలలోనూ ఉంది. ఎక్కడ చూసిన మహిళలనే టార్గెట్ చేస్తారు. కానీ ఇది ఇండియాలో కాస్తా ఎక్కువగా ఉంది. కొన్ని మీడియా చానల్స్ అయితే నటీమణులు బోల్డ్ సీన్స్ చేస్తే అది పెద్ద నేరంగా చూసేవి. అసలు సపోర్ట్ ఇచ్చేవి కాదు. కానీ ఇప్పుడు కాస్తా మారియి. ఇలాంటి విషయాల్లో మహిళలకే మద్దుతుగా నిలుస్తున్నాయి. బోల్డ్ సీన్స్‌ను అంగీకరిస్తున్నారు. ఎలాంటి అశ్లీల పాత్రలు చేసిన దానిని నటనగానే చూస్తున్నాయి’ అని ఆమె పేర్కొంది. -
కేరళ మంత్రి రాజీనామా
తిరువనంతపురం: లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నత విద్యా మంత్రి కేటీ జలీల్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. అనంతరం అది గవర్నర్‌ను చేరగా, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దాన్ని ఆమోదించారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది. తన రక్తం తాగుతున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు సంతోషంగా ఉండి ఉంటారంటూ జలీల్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రెండేళ్ల పాటు మీడియా దాడికి గురయ్యాయనని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ నేతలపై ఈసీ వేటు -
ప్రపంచంలో నెపోటిజమ్ లేనిది ఎక్కడ? : బాలీవుడ్ హీరోయిన్
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక రంగంలోకి అడుగుపెట్టి, పైకి రావడం అనేది చిన్న విషయం కాదు. సొంత నిర్ణయాలు తీసుకోవాలి, తప్పొప్పుల మీద అవగాహన ఉండాలి. అదే వారసులకు అయితే గైడ్ చేయడానికి చాలామంది ఉంటారు. సినిమా పరిశ్రమలో వారసత్వం గురించి పలు సందర్భాల్లో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు మాట్లాడారు. వారసులకు అవకాశాలు సులువుగా వస్తాయని, వారికి ఇచ్చే మర్యాదలు వేరేగా ఉంటాయని బాహాటంగానే కొందరు అన్నారు. ‘నెపోటిజమ్’ (బంధుప్రీతి) గురించి కథానాయిక అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ –‘‘నా దృష్టిలో నెపోటిజటమ్ అనేది చెడ్డ పదం. అసలు ప్రపంచంలో నెపోటిజమ్ లేనిది ఎక్కడ? అయితే దీన్ని నేను విమర్శించడంలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నాకు ఎవరి గురించీ ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ దక్కింది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి అవకాశాలు సులువుగా వస్తాయి. కానీ ఈ విషయంలో నాకెలాంటి కోపం లేదు. నా ఎదుగుదల నా శక్తిని తెలియజేస్తుంది. నేను కలలు కనడానికి ఇష్టపడతాను. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకానీ ఇతరుల గురించి చెడుగా ఆలోచించను. నా ప్రతి నిర్ణయం నాకు శక్తినివ్వడంతో పాటు, నిర్భయంగా ముందుకు సాగేలా చేస్తోంది’’ అన్నారు. తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’ వంటి చిత్రాల్లో నటించిన అదితీ రావ్ ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘మహాసముద్రం’లో కథానాయికగా నటిస్తున్నారు. -
అందుకే నేను నెపో-కిడ్ కాదు: టీనా
ముంబై: బి-టౌన్లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువ. అందుకే బాలీవుడ్‌ను నెపోటిజానికి కేరాఫ్‌గా చెబుతుంటారు. తల్లిదండ్రుల సపోర్టుతో సినిమాల్లోకి వచ్చి స్టార్స్‌గా ఎదిగిన అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్ తదితరులను టాలీవుడ్ నెపో-కిడ్స్(నెపోటిజం)గా పిలుస్తుంటారు. అయితే వీరిలో ప్రముఖ సినీయర్ నటుడు, హీరో గోవిందా గారాల పట్టి, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం వినిపించదు. దీనిపై ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. తాను ఎప్పుడూ నెపో-కిడ్ని కాదని, ఎందుకంటే తన సినిమాలను ప్రమోట్ చేయాలని ఆమె తండ్రి(గోవిందా) ఎప్పుడూ ఏ నిర్మాతను కోరలేదని వెల్లడించారు. మీ తండ్రి ఎప్పుడైన మీకు సినిమాల్లో సహాయం చేశారా? అని అడగ్గా ఆమె ‘ఎప్పుడు చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే ఇప్పటికే నేను 30 నుంచి 40 సినిమాలకు సంతకం చేసేదాన్ని. కానీ ఆయన నాకు ఎప్పుడు సాయం చేయలేదు. నేను కూడా ఆయనను ఎప్పుడు అడగలేదు. ఒకవేళ నాకు అవసరమని భావించి ఆయనను అడిగేతే.. సహాయం చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. కానీ నెపో-కిడ్‌గా ముద్ర వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా సొంత గుర్తింపుతోనే సినిమా అవకాశాలు పొందాను. అయితే నేను ఏం చేస్తున్నాను, నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే రిపొర్టులను మాత్రం ఆయన పరిశీలిస్తూంటారు. అలా అని నా ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారని కాదు. సినిమాల ఎంపికలో నా సొంత నిర్ణయాలను నాకే వదిలేస్తారు. అందుకే ఆయన నన్ను సినిమాల్లో ప్రమోట్ చేయమని ఇప్పటి వరకూ ఏ నిర్మాతను అడగలేదు. అందుకే నాకు నెపో-కిడ్(నెపోటిజం) అనే పేరు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా టీనా అహుజా 2015 స్మిప్ కాంగ్ దర్శకత్వంలో వచ్చిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్'లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ అరంగేట్రం చేశారు. (చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా) (నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్) -
నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటా; ఎంపీ సవాల్
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించి బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నబీజేపీకి అభిషేక్ ఒక సంచలన సవాల్ విసిరారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సంచలన ప్రకటన చేశారు. ‘‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబసభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తీసుకొస్తే.. మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని.. తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
‘అసహ్యం.. అందుకే నామినేట్ చేశాను’
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజమ్ టాపిక్‌పై తీవ్ర చర్చ నడిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల వారసులుతో పాటు కరణ్ జోహార్ వంటి వారిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ టాపిక్ బిగ్‌బాస్ రియాలిటీ షో లో కూడా చిచ్చు పెట్టింది. బంధుప్రీతిని కారణంగా చూపిస్తూ.. బిగ్‌బాస్ సీజన్ 14 కంటెస్టెంట్ ఒకరు హౌస్‌మెట్‌ని నామినేట్ చేశారు. దాంతో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో ఇలాంటి టాపిక్ ఎందుకు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. వివరాలు.. బిగ్‌బాస్ 14 గత వారం నామినేషన్ టాస్క్‌లో భాగంగా రాహుల్ వైద్య, జాన్ కుమార్ సనుని నామినేట్ చేశాడు. బంధుప్రీతి అంటే తనకు అసహ్యమని.. అందుకే జాన్ని నామినేట్ చేశానని తెలిపాడు. అంతేకాక జాన్‌కు అంత పాపులారిటీ లేదని.. కేవలం ప్రసిద్ధ సింగర్ కుమార్ సను కొడుకు కావడం వల్లనే షోలో ఉండగల్గుతున్నాడని విమర్శించాడు. (చదవండి: అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!) ఇక ఈ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తాజా ప్రోమోలు చూస్తే అర్థం అవుతోంది. వీకెండ్ షోలో సల్మాన్ రాహుల్ వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ‘ఒకవేళ నా తండ్రి నా కోసం ఏదైనా చేసినట్లయితే.. అది బంధుప్రీతి అవుతుందా’ అంటూ రాహుల్‌ని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత జాన్ని ఉద్దేశించి ‘మీ నాన్న నిన్ను ఎన్నిసార్లు రికమెండ్ చేశాడు అని ప్రశ్నించగా.. అందుకు జాన్ ఒక్కసారి కూడా అలా చేయలేదని’ తెలుపుతాడు. ఆ తర్వతా సల్మాన్ రాహుల్‌ని ఉద్దేశించి నెపోటిజం గురించి చర్చించే వేదిక ఇది కాదు అంటూ హెచ్చరించడం చూడవచ్చు. ఇక గత ఎపిసోడ్లో రాహుల్ తన ప్రకటనపై విచారం వ్యక్తం చేశాడు.. జాన్‌కి క్షమాపణ చెప్పాడు. జాన్ తల్లిదండ్రులు విడిపోయారనే విషయం తనకు తెలియదని రాహుల్ స్పష్టం చేశాడు. జాన్, రాహుల్ క్షమాపణను అంగీకరించాడు, అతను పగ పెంచుకోలేదని తెలిపాడు. Tomorrow episode promo#BiggBoss #BB14 #biggboss14 #sidharthshukla #hinakhan #AsimRiaz #ShehnaazGill #EijazKhan #JasminBhasin #NishantSinghMalkani #abhinavshukla #NikkiTamboli #rubinadilaik #RahulVaidya #pavitraPunia #JaanSanu #ShardulPandit #nainasingh #kavitakaushik pic.twitter.com/EXEIY8ZrNd — BIGGBOSS14jasoos (@biggbossjasoos) October 30, 2020 -
ఉద్ధవ్ ఠాక్రేకు ఫైర్ బ్రాండ్ కౌంటర్
సాక్షి,ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రధానంగా వారి సొంత రాష్ట్రంలో తిండికి గతిలేనవారు ముంబైకి డబ్బు సంపాదించుకుని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఉద్ధవ్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. హిమాలయాల అందం ప్రతి భారతీయుడికి ఎలా చెందుతాయో, ముంబై అందించే అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి చెందుతాయంటూ కౌంటరిచ్చారు. ఈ రెండు రాష్ట్రాలు తనకు తన సొంత ఇళ్లతో సమానమని కంగనా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, దసరా రోజున ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మొత్తం రాష్ట్రం పరువు తీశారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. (మౌనం వీడిన ఉద్ధవ్ ఠాక్రే : కంగనాపై ధ్వజం) వారసత్వంతో అధికారంలోకి వచ్చారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ పై సోమవారం కంగనా వరుస ట్వీట్లలో తీవ్ర విమర్శలు చేశారు. "ముఖ్యమంత్రీ, నీలాగా తండ్రి పవర్ ని అడ్డంపెట్టుకుని అధికారంలోకి రాలేదు.. నేను కూడా గొప్ప కుటుంబానికి చెందినదాన్నే.. వాళ్ల సంపదపై ఆధారపడి జీవించాలనుకుంటే.. అక్కడే (హిమాచల్ ప్రదేశ్) ఉండేదాన్ని'' అన్నారు. తాను నెపోటిజం బ్రాండ్ కాదనీ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయన్నారు. తాను స్వయంశక్తితో ఎదిగిన మహిళనని చెప్పుకొచ్చారు. తమ ప్రజాస్వామ్య హక్కులను హరించే సాహసానికి పూనుకోవద్దని, తమను విభజించవద్దని సీఎంను హెచ్చరించారు. ఇకనైనా అసభ్యకర ప్రసంగాలు కట్టిపెట్టాలని కంగనా సీఎంపై మండిపడ్డారు. అలాగే గతంలో సంజయ్ రౌత్ హరాం ఖోర్ అన్నారు.. ఇపుడు ఉద్ధవ్ నమక్ హరాం అంటున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను మీ కొడుకు వయసుదాన్ని, నాపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలి'' అంటూ ట్వీట్ చేశారు. కాగా గతంలో ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటి కూల్చివేతపై సందర్బంగా నా ఇంటిలానే… త్వరలో ఉద్ధవ్ అహంకారం కూలి పోతుందంటూ మహా సీఎంపై కంగనా మండిపడిన సంగతి తెలిసిందే. Chief Minister I am not drunk on my father’s power and wealth like you, if I wanted to be a nepotism product I could have stayed back in Himachal, I hail from a renowned family, I didn’t want to live off on their wealth and favours, some people have self respect and self worth. — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2020 Just how beauty of Himalayas belongs to every Indian, opportunities that Mumbai offers too belongs to each one of us, both are my homes, Uddhav Thackeray don’t you dare to snatch our democratic rights and divide us, your filthy speeches are a vulgar display of your incompetence.. — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2020 Message for Maharashtra government... pic.twitter.com/WfxI9EII38 — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2020 -
కంగనాపై దేశద్రోహం కేసు
ముంబై: ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెట్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్ అలీ సయ్యద్ బాంద్రా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు. -
ఆ ఒత్తిడి మా మీదా ఉంది
సీనియర్ నటి సుహాసినిలో దర్శకురాలు కూడా ఉన్నారు. గతంలో ‘ఇందిర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు సుహాసిని. అమేజాన్ ప్రైమ్ నిర్మించిన ‘పుత్తమ్ పుదు కాలై’ అనే యాంథాలజీలో ఓ భాగానికి దర్శకత్వం వహించారామె. ‘కాఫీ, ఎనీవన్?’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ భాగంలో అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. ఈ నెల 16న ఈ యాంథాలజీ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ– ‘‘కాఫీ, ఎనీవన్’ కథలో మా కజిన్ అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. మా నాన్న చారుహాసన్, బాబాయి కమల్‌హాసన్‌ని కూడా యాక్ట్ చేయించాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో సుమారు ఆరు షార్ట్ స్టోరీలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. కుటుంబ సభ్యులకే అవకాశాలు, నెపోటిజమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ – ‘‘నేను చారుహాసన్, కమల్‌హాసన్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనేది ఎవ్వరం మార్చలేం. ఆ నెపోటిజమ్ ఒత్తిడి మా మీదా ఉంది. మా తర్వాతి తరం అయిన శ్రుతీహాసన్ వంటి వాళ్ల మీద ఇంకా ఉంది. అయితే సౌతిండియాలో నెపోటిజమ్ అనే మహమ్మారి ఇంకా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుహాసిని. -
ఆ ఎనిమిదినీ అంతం చేయాలి
‘‘మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్ ప్లేస్‌లో ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ఫిల్మ్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. తెలుగు మేకర్స్ ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించదు. కానీ హాలీవుడ్ సినిమాకు దేశవ్యాప్త విడుదలలు ఏంటి? హిందీ సినిమాల్లో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. అవేంటంటే... ► నెపోటిజమ్ టెర్రరిజమ్ ► డ్రగ్స్ మాఫియా టెర్రరిజమ్ ► సెక్సిజమ్ టెర్రరిజమ్ ► ప్రాంతీయ మరియు మతపరమైన టెర్రరిజమ్ ► విదేశీ సినిమాల టెర్రరిజమ్ ► పైరసీ టెర్రరిజమ్ ► శ్రమ దోపిడీ టెర్రరిజమ్ ► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్.. ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి’’ అని ట్వీట్ చేశారు కంగనా. -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్‌లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్‌కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్‌కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్‌కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్‌ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్‌ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్‌సైడర్‌గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్‌సైడర్) స్టార్‌ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్‌ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్‌గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
‘సుశాంత్-సారా విడిపోవడానికే వారే కారణం’
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మాటల దాడికి దిగుతూ అందరిని ఏకిపారేస్తున్నారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగనా సెలబ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రోజు తన ఘాటైన వ్యాఖ్యలతో బీటౌన్‌ను షేక్ చేస్తున్న కంగనా మరోసారి రెచ్చిపోయారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ సంబంధంపై నోరు విప్పారు. ఇంతకముందు కూడా సుశాంత్ సారా వీడిపోవడానికి బాలీవుడ్ బంధుప్రీతి కారణమని కంగనా చెప్పిన విషయం తెలిసింతే. తాజాగా ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. సుశాంత్ సారాతో డేటింగ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు వారు విడిపోయేలా చేశారని పేర్కొన్నారు. (‘ఐటెమ్ సాంగ్ ఛాన్స్ రావాలంటే అలా చేయాలసిందే’) ఇపుడు ఇదే గ్యాంగ్ మూవీ మాఫియా తనను కూడా లక్ష్యంగా పెట్టుకుందని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. సుశాంత్‌తో డేటింగ్ చేయవద్దని సారాను కరీనా కపూర్ కోరినట్లు పేర్కొన్నారు. ‘నీ మొదటి హీరోతో డేటింట్ చేయకు’ అని కరీనా చెప్పిన రికార్డ్ కూడా ఉందన్నారు. సుశాంత్ బయటి వ్యక్తి కాబట్టి అతన్ని ఇండస్ట్రీ ఎగతాళి చేసిందని, మూవీ మాఫియా బహిరంగంగానే అతనిని హత్య చేసిందన్నారు. దాంతో మానసిక కుంగుబాటుకు లోనైన సుశాంత్‌పై రాబంధుల సమూహం వచ్చి అనుకున్నది చేసిందన్నారు. కాగా 2018 లో సుశాంత్‌తో కలిసి ‘ కేదార్నాథ్’ సినిమాతో సారా సినీరంగ ప్రవేశం చేశారు. (బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
మూడు సినిమాల నుంచి తప్పించారు
‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర. ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు. క్యాస్టింగ్ కౌ^Œ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి. -
ఇక్కడ మాఫియా లేదు
ప్రస్తుతం బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి), అవుట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు) అండ్ ఇన్సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు) అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా మాట్లాడుతూ– ‘‘అవుట్‌సైడర్స్, ఇన్సైడర్స్ గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోందో అర్థం కావడంలేదు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. నేనెందుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. 40–45 ఏళ్లుగా నేను నటుడిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా నట వారసుడిగా నా కొడుకును నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక బిజినెస్‌మేన్, లాయర్, డాక్టర్ ఎవరైనా తమ వారసులను తమ రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు. దీనికి మాఫియా అని, బంధుప్రీతి అని పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నా కొడుక్కి అవకాశం రావడం సహజం. అయితే తనకు టాలెంట్ ఉంటేనే అవకాశం ఇస్తారు. కాకపోతే మొదట అవకాశం ఈజీ అవుతుంది. బయటినుండి వచ్చేవారికి ఆ ఛాన్స్ ఉండదు. అయితే అవకాశం తెచ్చుకుని, ప్రతిభ నిరూపించుకుంటే వారసులకన్నా కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి రికమండేషన్‌తో ఓంపురి ముంబైలో అడుగుపెట్టారు. ఎవరు రికమండ్ చేశారని నాకు అవకాశాలు వచ్చాయి. మేమంతా ఒంటరిగా పైకొచ్చినవాళ్లమే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాఫియా అని కొందరు కథలు అల్లుతున్నారు. అందులో వాస్తవం లేదు. 45 ఏళ్లుగా నేనిక్కడే ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడ మాఫియా లేదు’’ అన్నారు. -
సుశాంత్ జీవితంతో శశాంక్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త బాలీవుడ్‌ను కుదిపేసింది. ఊహించని షాక్‌లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్ ఆర్ మర్డర్?) ప్రకటించింది బాలీవుడ్. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఓ యంగ్ సినిమా స్టార్ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. -
అందర్నీ ఒకేలా చూడాలి!
‘‘అవకాశాల విషయంలో అందర్నీ సమానంగానే చూడాలి. ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ అని వేరుగా చూడకూడదు’’ అంటున్నారు సీరత్ కపూర్. ప్రస్తుతం బంధుప్రీతి (నెపోటిజమ్), ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్ అనే చర్చ బాలీవుడ్లో తీవ్రంగా నడుస్తోంది. ఈ విషయం మీద ‘రన్ రాజా రన్, కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘నెపోటిజమ్ ఏ పరిశ్రమలో అయినా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. అది సహజం. కాదనలేం కూడా. కానీ అవకాశాల విషయంలో సమాన న్యాయం ఉండాలి. ప్రతిభను బట్టే అవకాశం ఇవ్వాలి. కేవలం స్టార్ కిడ్స్ మాత్రమే కాకుండా ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరినీ నిజాయతీగా ప్రోత్సహించాలి. వారసులను, బయటినుంచి వచ్చేవాళ్లను ఒకేలా చూడాలి. అలాంటి వాతావరణం ఏర్పడేలా చేసే బాధ్యత అందరి మీదా ఉంది’’ అన్నారు సీరత్. ‘ప్రస్తుతం ‘మా వింత గాధ వినుమ’ అనే సినిమాలో నటిస్తున్నారు సీరత్. -
అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!
‘‘నెపోటిజమ్ కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు.. ప్రతి పరిశ్రమలోనూ ఉంది. అలానే బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. బాలీవుడ్ ఒక ఫ్యూడల్ వ్యవస్థలా పని చేస్తోంది’’ అన్నారు హిందీ నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు స్వర. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్’ అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు స్వరా భాస్కర్. ‘‘నెపోటిజమ్ గురించి అందరూ ఎలా అనుకుంటారంటే... ఒక్క సినిమాలో స్టార్ కిడ్ని పరిచయం చేస్తే చాలు వాళ్ల కెరీర్ సెట్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ అలా జరగదు. ప్రతీ సినిమాకి కష్టపడాలి. నిరంతర కృషే మనల్ని స్టార్‌గా నిలబెడుతుంది. అవుట్‌సైడర్‌గా ఉంటూ స్టార్ కిడ్స్ పరిస్థితి చూస్తే జాలిగా అనిపిస్తుంటుంది. వాళ్ల ఒత్తిడి, వాళ్ల మీద ఉండే అంచనాలు అలాంటివి. కానీ వాళ్లకు ఉండే అవకాశాలు తక్కువేం కాదు. అవుట్‌సైడర్‌గా మాకు కష్టంగా అనిపించే విషయాలు వాళ్లకు చాలా సులువుగా జరిగిపోతాయి. అయితే మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రస్తుతం చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ‘వీళ్లు టాలెంట్‌తోనే ఎదిగారు’ అనే పేరు స్టార్ కిడ్స్‌తో పోల్చుకుంటే.. అవుట్‌సైడర్స్‌కి త్వరగా ఏర్పడుతుంది. అదే అవుట్‌సైడర్స్‌కి ప్లస్’’ అన్నారు. బాలీవుడ్లో ఉండే పోటీ గురించి చెబుతూ– ‘‘సినిమా అనేది పెద్ద పోటీ ప్రపంచం. నిరంతరం ఎవరో ఒకరితో మనం మనకు తెలిసోతెలియకో పోటీ పడుతూనే ఉంటాం. బయట చాలా మంది స్టార్ కిడ్స్‌కి చాలా పొగరు, వాళ్ల పవర్‌ను ఇతరుల మీద రుద్దాలనుకుంటారు అని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో నేను రెండు రకాల వాళ్లతో (ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్) పని చేశా. ఎదుటివారితో చాలా చక్కగా ప్రవర్తించి, కష్టపడే మనస్థత్వం ఉన్నవాళ్లు, టైమ్ విషయంలో కచ్చితంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఇన్సైడర్సే. కొందరు అవుట్‌సైడర్స్ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకొని వాళ్ల స్టార్ స్టేటస్‌ను దుర్వినియోగం చేయడం గమనించాను. ఇది నేను ఎవ్వర్నీ ఉద్దేశించి చెప్పడం లేదు. నా అనుభవం ద్వారా చెబుతున్నాను. స్టార్‌డమ్‌ను దుర్వినియోగం చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు’’ అని వివరించారు స్వరా భాస్కర్. -
‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’
హీరోయిన్ కంగనా రనౌత్ బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఓ రకంగా ఆడేసుకుంటోంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆమె సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ విమర్శించడం తీవ్రస్థాయికి చేరింది. బాలీవుడ్లో నెపోటిజం వేళ్లూనుకుపోయిందంటూ, ప్రతిభ ఉన్న వాళ్లకు ప్రాధాన్యం ఉండదని, కేవలం స్టార్ కిడ్స్‌కు మాత్రమే అవకాశాలు, అవార్డులు ఉంటాయని ఆమె గతంలో విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్లు తాప్సీ, సర్వ భాస్కర్‌లపై విరుచుకు పడిన ఆమె తాజాగా స్టార్ సెలబ్రిటీలు రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేలను టార్గెట్ చేశారు. (సోషల్ మీడియా పోస్టు: కంగనా, చందేల్‌పై ఫిర్యాదు) రణబీర్‌కు స్త్రీ వ్యామోహం ఉందని, దీపిక ఓ మానసిక వ్యాధిగ్రస్తురాలని టీమ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. "అమ్మాయిల వెంట పడే రణబీర్‌ను ఎవరూ రేపిస్ట్ అని పిలిచే ధైర్యం చేయరు. తనను మానసిక రోగిగా ప్రకటించుకున్న దీపికను ఎవరూ సైకో, రాక్షసి అని పిలిచే ప్రయత్నం చేయరు. కానీ బయట నుంచి వచ్చేవాళ్లను, అందులోనూ చిన్న పట్టణాలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చేవారిని మాత్రం ఇలాంటి పేర్లతో పిలుస్తూ వేధిస్తారు" అని ఆగ్రహం వ్యక్తం చేసింది. (కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం) -
కుబ్రా సైట్ వర్సెస్ కంగనా టీం..
తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పడూ ముందుంటారు. యువ హీరో సుశాంత్ మరణించినప్పటి నుంచి కంగనా, అమె బృందం సోషల్ మీడియాలో స్టార్ కిడ్‌లను లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి దిగుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, అలియా భట్ వంటి వారిపై మండిపడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనెను టార్గెట్ చేస్తూ వారిపై మాటల యుద్దానికి దిగారు. దీంతో ఆగ్రహానికి లోనైన రణ్‌బీర్, దీపికా అభిమానులు ట్విటర్లో #SuspendTeamKangana అనే హ్యష్‌టాగ్‌తో ఆమెపై మండిపడుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా నటి కుబ్రా సైట్ చేరారు. (కరీనా సినిమాలను బాయ్‌కాట్ చేయాలి) నటి కుబ్రా సైట్ సోమవారం కంగనాకు వ్యతిరేకంగా ట్విట్టర్లో ఈ సస్పెన్షన్‌కు నా మద్దతు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇతర నటులను లక్ష్యంగా చేసుకొని విమర్శించడం మానేయాలని ట్వీట్ చేశారు. ఇది ట్విట్టర్ ఇండియా కూడా చూస్తే చాలా బాగుంటుందంటూ సస్పెండ్ టీం కంగనా హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. అయితే కుబ్రా ట్వీట్ చేసిన వెంటనే, కంగనా బృందం స్పందించింది. ‘ప్రియమైన కుబ్రాసైట్ మీరు, కంగనా సహోద్యోగులుగా స్నేహితులుగా చాలాకాలం ఉన్నారు. కానీ మీరు ఆమె మాట్లాడే స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రచారం ఎందుకు చేస్తున్నారు. ఆమె మీకు ఏ నష్టం కలిగించింది? మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? మీరు కొద్దిమందిని సంతోషపెట్టాలనుకుంటున్నారా? ’ అంటూ కంగనా టీం తమ ట్విట్టర్లో పేర్కొంది. (ఆయుష్మాన్‌పై కంగనా ఫైర్) అలాగే కంగనా టీం చేసిన ట్వీట్‌పై మరోసారి కుబ్రా స్పందించారు. ఇది తను వ్యక్తిగతంగా చేయడం లేదని స్పష్టం చేశారు.‘ఇది అస్సలు వ్యక్తిగతమైనది కాదు. టీం కంగనా రనౌత్ మీరు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా విషపూరితమైనది. నేను మిమ్మల్ని అన్‌ఫాలో చేశాను. అలాగే రిపోర్ట్ చేశాను. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అడిగేది ఏంటంటే దయతో ఉండండి. బాధ్యత వహించండి. నేను వ్యక్తిగత దూషణలు చేయడం లేదు. మీరు కూడా అలా చేయరని ఆశిస్తున్నాను.’ అంటూ ముగించారు. #suspendkubbrasait😁😁 — jyotshna pandey (@jyotshna_pandey) August 10, 2020 Dear @KubbraSait you and Kangana have shared a lot as friends as colleagues which can be called positive, what damage has she done to you that you are campaigning against her freedom of speech? What is bothering you? Or you just want to please a few ? pic.twitter.com/SpWPkvUfqC — Team Kangana Ranaut (@KanganaTeam) August 10, 2020 -
కరీనా సినిమాలను బాయ్‌కాట్ చేయాలి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్లో మొదలైన నెపోటిజంపై చర్చ నేటికీ కొనసాగుతోంది. స్టార్ కిడ్స్‌పై విమర్శలు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో కరీనా కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కరీనా కపూర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరీనా చిత్రాలను బాయ్‌కాట్ చేయాలంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం చర్చకు రాగా కరీనా స్పందిస్తూ.. ‘బాలీవుడ్లో మాత్రమే నెపోటిజం ఉన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ మరణంతో ఇది తారా స్థాయికి చేరింది. స్టార్కిడ్స్ని ఇండస్ర్టీలోకి తెచ్చినప్పుడు ఈ ప్రేక్షకులే కదా వాళ్లని అసలైన స్టార్స్‌గా చేసేది. ఒకరికి స్టార్ ఇమేజ్ తేవాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది వారి చేతిలోనే ఉంటుంది. సరే స్టార్ కిడ్స్ సినిమాలు నచ్చకపోతే చూడటం మానేయండి. మిమ్మల్ని ఎవరూ బలవంతంగా సినిమా చూడమని చెప్పరు కదా’ అంటూ ఫైర్ అయ్యారు. (ఓటీటీలో సడక్ 2) కరీనా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెకు అహంకారం బాగా పెరిగిందని, ఆమె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రి రణ్‌ధీర్ కపూర్, కుమార్తెగా, కరిష్మా కపూర్ సోదరిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టిన కరీనా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల చేయాలని భావించానా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరీనా కపూర్పూ ట్రోల్స్ కారణంగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. (లాల్‌సింగ్ వాయిదా పడ్డాడు) #KareenaKapoorKhan Wait. What? Sahi to keh rahi h. Audience banati h. Mat jao na. You people make nepo kids star. Now she is getting trolled for harsh truth she said.#KareenaKapoorKhan pic.twitter.com/eNP3t7j7EV — Mamta Dagar 🇮🇳 (@TheMamtaDagar) August 10, 2020 -
ఎవరీ గ్యాంగ్?
బయటకే తళుకులు.. లోపలంతా చీకటి రాజకీయాలే ప్రతిభకు పోటు నెపోటిజం అవుట్‌సైడర్స్‌కు తిప్పలు తప్పవు ఈ మధ్య బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న విమర్శలివి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ, ప్రశాంతంగా కనిపించే ఏ ఆర్ రెహమాన్ ‘నాకు హిందీ సినిమాలు రానీకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోంది’ అని ఆరోపించడం సంచలనం అయింది. ఇంతకీ ఎవరీ గ్యాంగ్? ఈ గ్యాంగ్ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ఇక రెహమాన్ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయనకు మద్దతుగా స్పందించినవారి గురించి తెలుసుకుందాం. రెహమాన్ బిజీ కంపోజర్. ఎప్పుడూ నాలుగైదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటాయి. అయితే హిందీలో మాత్రం తక్కువ సినిమాలు చేస్తున్నారు. అది ఆయన అంతట తగ్గించింది కాదు తగ్గించబడింది అట. ‘హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నారెందుకు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు. ‘నాకు సినిమాలు రాకుండా బాలీవుడ్ లో కొందరు గ్రూపిజమ్ చేస్తున్నారు. ట్యూన్స్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తానని, ఇలా మరికొన్ని అవాస్తవమైన వార్తలు నా మీద çసృష్టించారు. నాకు సినిమాలు రానివ్వకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోంది’’ అని తెలిపారు రెహమాన్. ఆస్కార్ విజేత రెహమాన్‌కి కూడా ఇలా అవుతుందా? అని షాకయ్యారందరూ. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రెహమాన్‌కే ఇలా జరిగితే ఇక వేరేవాళ్ల పరిస్థితేంటి? అనే చర్చకు దారితీసింది. గ్రూపిజమ్, ఫేవరెటిజమ్ తో నచ్చినవాళ్లకు పని కల్పిస్తూ ఇష్టారాజ్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. రెహమాన్‌కి మద్దుతుగా పలువురు ప్రముఖులు స్పందించారు. ‘‘ఏది ఏమైనా నా పని నేను చేసుకుంటూ ఉంటాను’’ అని రెహమాన్ ట్వీట్ చేశారు. ‘డబ్బు పొతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పొతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృ«థా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడదాం’’ అని కూడా అన్నారు రెహమాన్. బాలీవుడ్ గురించి కొందరి మాటలు విన్నాక గ్యాంగ్ కుట్రలు, గ్రూపిజాలు ఉన్నాయని అర్థమవుతోంది. మరి.. ఇవి ఎలా ఆగుతాయి? ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకునే వాతావరణం ఏర్పడుతుందా? బంధుప్రీతి, గ్యాంగ్.. వంటి వివాదాలేనా? రేపు మరో కొత్త వివాదానికి తెరలేస్తుందా? ప్రస్తుతం బయట ఉన్నట్లే బాలీవుడ్ లో అంతా అనిశ్చితి! ‘రెహమాన్ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు శేఖర్ కపూర్. – శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ‘‘రెహమాన్ కి కేవలం హాలీవుడ్ సినిమాల మీదే ఆసక్తి ఉందని, బాలీవుడ్ సినిమాలు చేసే ఆసక్తి లేదని మొదటి నుంచి అతని మీద ఆరోపణలు వేస్తూనే ఉన్నారు. దాంతో చాలామంది దర్శకులు ఆయనకు ఆసక్తి లేదేమో అనుకుని ఉండుంటారు. కానీ ఆయనతో పని చేయాలనుకునేవారు ఆయనతో పని చేస్తూనే ఉన్నారు. – రియానా, రెహమాన్ సోదరి. నాకూ ఇలానే జరిగింది! ‘‘ఆస్కార్ గెలిచిన తర్వాత బాలీవుడ్ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ సినిమాల అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం’’ – రెసూల్ పూకుట్టి, సౌండ్ డిజైనర్. మీకు పరిమితులు లేవు. మీరు కేవలం బాలీవుడ్ కాదు. అంతకు మించి. మీరు కంపోజ్ చేసిన పాటల్ని వినడానికి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం. – శ్వేతా మోహన్, గాయని. రెహమాన్ లాంటి నమ్మదగ్గ మనిషి మాట్లాడినప్పుడే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని అందరికీ అవగాహన వస్తుంది. థ్యాంక్యూ సార్. – మీరా చోప్రా, నటి. నెపోటిజం (బంధుప్రీతి) టాపిక్ మీద ఇటీవల నేషనల్ మీడియాలో తరచూ కనిపిస్తున్న కంగనా కూడా ఈ విషయం మీద మద్దతుగా మాట్లాడారు. ’’ఈ (బాలీవుడ్) ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా వేధింపులకు గురవుతారు. మరీ ముఖ్యంగా స్వతంత్రంగా పని చేద్దాం అనుకునే వాళ్లు’’ అన్నారు కంగనా. – కంగనా, నటి -
నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!
బాలీవుడ్లో సినిమా అవార్డులను ప్రతిభ ఆధారంగా కాకుండా డబ్బులిచ్చి కొనుక్కుంటారన్నా ఆరోపణల్ని 'గల్లీబాయ్' ఫేం నటుడు విజయ్ వర్మ ఖండించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ''గల్లీబాయ్ చిత్రానికి గానూ ఈ ఏడాది 13 ఫిల్మఫేర్ అవార్డులు దక్కాయి. దీనిపై కొద్దిమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిత్ర బృందం డబ్బులిచ్చి అవార్డులు కొనుగోలు చేసి ఉంటే మరి నాకోసం కూడా ఓ అవార్డును కొనుగోలు చేయాలి కదా? మరి నాకెందుకు అవార్డు రాలేదు? వివిధ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో నేను నామినేట్ అయినటప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఒకవేళ నిజంగానే గల్లీబాయ్ బృందం డబ్బులిచ్చి అవార్డులు కొని ఉంటే ఉత్తమ సహాయ నటుడి పాత్రకు నాకు కూడా అవార్డు దక్కి ఉండేది కదా? మరి 13 అవార్డులు కొన్నప్పుడు నాకోసం కొనకుండా ఉంటారా? వాళ్లు నాతో చాలా ప్రాజెక్టులు చేశారు. మరి ఈ స్నేహంతోనైనా అవార్డు కొని ఉండేవారు కదా'' అంటూ ప్రశ్నించారు. కేవలం ఒక్కరు మాత్రమే గల్లీబాయ్ సినిమా అవార్డులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నార్నారు. అవార్డులపై చేస్తోన్న ఆరోపణలు నిరాధారణమైనవంటూ కొట్టిపారేశారు. చిత్ర యూనిటల్కు తాను అండగా ఉంటానని తెలిపారు. (దానికంటే అవార్డు పెద్దది కాదు) గల్లీబాయ్ చిత్రంలో డ్రగ్ పెడ్లర్‌గా విజయ్ అద్భుతమైన నటనకు పలు ప్రశంసలు దక్కాయి. ఇక బాలీవుడ్లో బందుప్రీతి (నెపోటిజం )పై వస్తోన్న విమర్శలపై స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సమస్యను అడ్రస్ చేసినప్పుడు దాన్ని నిజంగా పరిష్కరించాలన్న ఉద్దేశం ఉండాలే కానీ ఒకరిపై ఒకరు బురద చల్లాలనుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గల్లీ బాయ్ చిత్రానికి ఈ ఏడాది 13 అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఉత్తమ దర్శకుడిగా జోయా, ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్, ఉత్తమ నటిగా ఆలియా భట్ సహా వివిధ అవార్డులు దక్కాయి. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పాటు అవార్డులు అంశంలోనూ పక్షపాత దోరణి ఉంటుందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. (సుశాంత్ కెరీర్‌ను బాలీవుడ్ మాఫియా నాశనం చేసింది) View this post on Instagram #1YearOfGullyBoy This film gave me new wings to fly. Thank u @zoieakhtar and thank u #GullyBoy #gratitude #vadevadewowwow A post shared by Vijay Varma (@itsvijayvarma) on Feb 13, 2020 at 11:01pm PST -
నిరూపించుకునే అవకాశమివ్వండి
‘‘ఫలానా పాత్రను చేసే సామర్థ్యం నటిగా ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల కుడా అవకాశాలు చేజారుతుంటాయి. కేవలం ‘అవుట్ సైడర్స్’ అనే కారణం వల్ల’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ‘మళ్ళీ రావా’, ‘దేవదాస్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారామె. ఇటీవలే కన్నడంలో సుదీప్తో ‘పెహల్వాన్’లోనూ కనిపించారు. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న నెపోటిజం, అవుట్ సైడర్స్ వాదనలో భాగంగా ఆకాంక్షా సింగ్ కూడా తన అభిప్రాయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘కొన్నిసార్లు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ రోల్ లో కనిపించాలని ఉంటుంది, ఆ పాత్రకు మనం న్యాయం చేయగలం అనే నమ్మకం కూడా ఉంటుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల మనల్ని మనం నిరూపించుకోవడానికి వీలున్న అవకాశాలు రావు. అతిథి పాత్రకో, సహాయ నటి పాత్రలకో మాత్రమే మేం గుర్తొస్తాం. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, పెద్ద పెద్ద వాళ్ల తో పరిచయాలు లేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీ సర్కిల్ (వారసులను ప్రోత్సహించేవారిని ఉద్దేశించి అయ్యుండొచ్చు) దాటి వస్తేనే వాళ్లు మీకు కనిపిస్తారు. ప్రస్తుతం చాలా మంది నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇదే. ఇక నటిగా నా గురించి చెప్పాలంటే.. మొదటి నుంచి కూడా నా టాలెంట్ మీద, నా మీద నాకు నమ్మకం ఎక్కువ. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ సందర్భంగా దర్శకులకు, నిర్మాత (హిందీ)లకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం (ప్రతిభను నిరూపించుకునే అవకాశం) ఇచ్చి చూడండి. నన్ను నేను నిరూపించుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టితో ‘క్లాప్’ చిత్రంలో నటిస్తున్నారు ఆకాంక్షా సింగ్. -
కంగనాకు బాసటగా బెంగాల్ బ్యాట్స్‌మన్
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొంటున్నాయి. ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఆమె వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తుండగా మరికొందరు ఆమెకు మద్దతునిస్తున్నారు. తాజాగా ఆమెకు మద్దతు పలికే వారిలో బెంగాల్ క్రికెటర్ కూడా చేరాడు. బ్యాట్స్‌మన్ మనోజ్ కుమార్ తివారి ట్విటర్ వేదికగా కంగనాకు మద్దతు నిచ్చాడు. బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘భారతదేశం సుశాంత్ మృతికి కారణం తెలుసుకోవాలని అనుకుంటోందని పేర్కొన్నాడు. (చదవండి: ‘నటించమని ఎవరూ బెదిరించలేదు కదా’) #Kangana Vs rest will go on forever but let's hope d focus is not shifted to other subjects. Conveniently people woke up from sleep and started attacking #Kangana only after she came out openly. Y can't they keep their mouth shut if they cant support her #IndiaWantsSushantTruth — MANOJ TIWARY (@tiwarymanoj) July 21, 2020 ‘సుశాంత్ మృతిపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ ఆమెపై దాడి చేస్తున్నారు. అయితే అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలని. మనం చేసిన కర్మ ఎప్పటికైనా తిరిగి మన వద్దకే వచ్చి చేరుతుంది’ అంటూ #IndiaWantsSushantTruth అనే హ్యష్ ట్యాగ్‌ను జత చేశాడు. మరో ట్వీట్లో ‘‘తనపై దాడి చేసే వారిపై కంగనా పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. ఇతర విషయాలపైకి మళ్ళకుండా కంగనా ఇలాగే పోరాటం కొనసాగించాలని ఆశిస్తున్నా. కంగనా దీనిపై నోరు విప్పినందుకే ఆమెపై దాడులు జరుగుతున్నాయని అయితే ఆమెకు మద్దతు ఇవ్వకపోతే నోరు మూసుకుంటారా’’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. అంతకు ముందు కూడా తివారి, సుశాంత్ ఫొటోని షేర్ చేస్తూ ‘‘చివరికి శత్రువు మాటలను కాదు, స్నేహితుల నిశ్శబ్దాన్ని గుర్తుంచుకుంటాం’’ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలను ఉటంకించాడు. (చదవండి: కంగనాకు సమీర్ సోని కౌంటర్) ”In the end, V will remember not the words of our Enemy, but the SILENCE of our friends.” Martin Luther King Jr. So so relevant in his case 👍#sushantsinghrajputdeath #SushantInOurHeartsForever pic.twitter.com/RDkon0HgJr — MANOJ TIWARY (@tiwarymanoj) July 17, 2020 -
నేను బీ గ్రేడా?
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత హీరోయిన్ తాప్సీ బాగోగుల గురించి తెలుసుకునేవారి సంఖ్య సడన్‌గా ఎక్కువైపోయిందట. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి)ను ప్రోత్సహించేవారే పరోక్షంగా కారణమంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఒక అవుట్‌సైడర్ (అంటే ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోవడం). ప్రస్తుతం బాలీవుడ్లో మంచి జోరుమీద ఉన్న తాప్సీ కూడా అవుట్‌సైడర్. అందుకే అవుట్‌సైడర్‌గా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటూ తాప్సీకి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఈ విషయంపై తాప్పీ స్పందిస్తూ – ‘‘సుశాంత్‌ను నేనెప్పుడూ కలవలేదు. కానీ అతను మరణించిన రోజు (జూన్ 14) నుంచి నాకు ‘ఆర్ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావా? సంతోషంగానే ఉంటున్నావా? ఏవైనా విషయాలు మనసు విప్పి చెప్పాలనుకుంటున్నావా?’ అంటూ నాకు రోజు ఫోన్లు, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మా అమ్మానాన్న ఢిల్లీలో ఉంటారు. నేను, నా చెల్లులు ముంబైలో ఉంటాం. మాతో పెద్దవాళ్లెవరూ లేరని మా ఇరుగు పొరుగు వారు కూడా నాపై ఓ ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు. ‘నువ్వు ఇక్కడి అమ్మాయివి కాదు. మీ తల్లిదండ్రులు నీతో లేరు. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాతో చెప్పుకో’ అనడం నాకు కొత్తగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో అవుట్‌సైడర్స్ చాలా ఇబ్బందులుపడుతున్నారని చిత్రీకరించేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చాలా భయపడతారు’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే.... నెపోటిజమ్ డిస్కషన్స్‌లో భాగంగా హీరోయిన్స్ తాప్సీ, స్వరా భాస్కర్లను ‘బీ గ్రేడ్ యాక్టర్స్’ అని అన్నారట కంగనా రనౌత్. ఈ విషయంపై తాప్సీ ట్వీటర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్ కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్ సిస్టమ్ అధికారికమేనా? ఇప్పటివరకు నెంబర్ సిస్టమ్ అనుకున్నానే!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు తాప్సీ. కరణ్ జోహార్ వారసులను మాత్రమే ప్రోత్సహిస్తాడని కంగనా విమర్శిస్తున్నారు. కరణ్ మంచివాడని, ఏ బ్యాక్‌గ్రౌండూ లేని తాను బాలీవుడ్లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ అనడం కంగనాకి మింగుడుపడలేదు. అందుకే తాప్సీ బీ గ్రేడ్ యాక్టర్ అని కంగనా అనడం, తాప్సీ సమాధానం ఇవ్వడం జరిగింది. -
అప్పుడే ఫలితం చెల్లుతుంది: తాప్సీ
ముంబై: హీరోయిన్ తాప్సీ పొన్ను బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) నేపథ్యంలో ‘ఫేర్ రేసస్’పై ట్వీట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక ఒకే స్థలం నుంచి ప్రారంభించినప్పుడే చెల్లుతుంది అంటూ తాప్సీ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘పోటీ అనేది నిజాయితీగా ఉన్నప్పుడే దాని ఫలితం చెల్లుతుంది. ప్రతి ఆటగాడికి ప్రారంభ స్థానం ఒకేలా ఉంటుంది. కాకపోతే తదుపరి పోటీ లేదా దాడి వల్ల ఆట చివరి గౌరవాన్ని తీసివేస్తుంది. #JustAThought #AppliesToLife’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. (చదవండి: జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్) A race is fair, the result is valid, only if the starting point was the same for every player. If not, the comparison and the ensuing onslaught will take away the dignity of the sport eventually. #JustAThought #AppliesToLife — taapsee pannu (@taapsee) July 17, 2020 సుశాంత్ మరణం తర్వాత కొందరూ బాలీవుడ్ నటీనటులు తాము కూడా నెపోటిజం బాధితులమే అంటూ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాప్సీ కూడా ఒకప్పుడు తాను నెపోటిజం బాధితురాలినే అని వెల్లడించారు. గత నెల జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో నెపోటిజం వల్లే సుశాంత్ మరణించాడంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు, స్టార్ కిడ్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
కంగనా వర్సెస్ పూజా
‘‘మీ నాన్న (నటి, దర్శక–నిర్మాత పూజా భట్ తండ్రి మహేశ్ భట్ని ఉద్దేశించి) అవకాశం ఇవ్వడం వల్ల నాకు చాలా పెద్ద నష్టమే జరిగింది. సరిగ్గా అప్పుడే నాకు తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో చక్కని అవకాశం ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. మీ ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా వల్ల ‘పోకిరి’లాంటి మంచి సినిమా వదులుకున్నాను’’ అని పూజా భట్‌పై మండిపడ్డారు కథానాయిక కంగనా రనౌత్. బాలీవుడ్లో బంధుప్రీతి మెండుగా ఉందని, వారసులకు ఇచ్చినంత విలువ బయటినుంచి వచ్చినవాళ్లకు ఇవ్వరని ఎప్పటినుంచో ఓ వివాదం సాగుతోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ వివాదం ఊపందుకుంది. నెపోటిజం టాపిక్ వచ్చిన ప్రతిసారీ నేనున్నానంటూ ముందువరసలో నిలబడి పోరాటం చేస్తున్నారు కంగనా. ఈ నేపథ్యంలో తనకు మొదటి సినిమా (‘గ్యాంగ్‌స్టర్’)లో నటించటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత మహేశ్ భట్, ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు కంగనా. ‘‘మొదటి అవకాశం ఇచ్చిన మా నాన్నపై చీటికీ మాటికీ చురకలు అంటిస్తుంటుంది తను’’ అని ఓ సందర్భంలో పూజా భట్ అన్నారట. అలాగే ఆ సినిమా అప్పుడు 2006లో జరిగిన ఓ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారామె. కంగనా ‘ఉత్తమ నూతన కథానాయిక’గా ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రానికి అవార్డు అందుకున్న వీడియో అది. స్టేజ్ మీదకు వెళుతూ, ఆ చిత్రనిర్మాతల్లో ఒకరైన ముఖేశ్ భట్ (మహేశ్ భట్ తమ్ముడు)ను హగ్ చేసుకున్నారు కంగనా. తర్వాత స్టేజ్‌పైకి వెళ్లి ‘గ్యాంగ్‌స్టర్’ టీమ్ కెమెరామేన్‌కు, తన మేకప్ టీమ్‌తో పాటు ఆమె అక్క రంగోలికి థ్యాంక్స్ చెప్పారు కంగనా. అప్పుడు ఆనందం వ్యక్తం చేసి, ఇప్పుడు విమర్శించడం సరికాదనే అర్థం వచ్చేలా ఆ వీడియోను షేర్ చేశారు పూజా భట్. అందుకు సమాధానంగా కంగనా ‘‘నన్ను, నా టాలెంట్‌ను గుర్తించి ఆ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది దర్శకుడు అనురాగ్ బస్. విశేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించారంతే. ఆ సినిమా టైమ్‌లో మీ ఫ్యామిలీ (పూజా భట్ ఫ్యామిలీ) వాళ్లు నాపై చెప్పులు విసిరి, నీకు పిచ్చి ఉంది.. ఈ సినిమా తర్వాత నీ కథ ముగిసినట్లే అని విమర్శించారు’’ అని పేర్కొన్నారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ పాత కథలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. మరి... ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. -
పూజాభట్- కంగనాల మధ్య ముదురుతున్న వివాదం!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో మొదలైన నెపోటిజం గొడవ రోజులు గడుస్తున్న ఇంకా చల్లబడటం లేదు. నెపోటిజం గురించి బయటకి వచ్చి బహిరంగంగానే స్టార్స్ కిడ్స్‌ని, మహేష్ భట్, కరన్‌జోహార్ లాంటి నిర్మాతలను విమర్శించిన వారిలో కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు. ఇక నెపోటిజానికి సంబంధించి సోషల్‌మీడియా వేదికగా మహేష్ కుమార్తె పూజా భట్‌కు, కంగనా రనౌత్‌కు మాటల యుద్దం నడుస్తూనే ఉంది. 2006 ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించినందుకు గాను కంగనా బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కంగనా మహేష్ భట్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) తాజాగా పూజాభట్ ఈ వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వీడియోలు కూడా అబద్ధమా? నేను ఆరోపణలను వారికే వదిలేస్తున్నాను, నేను వాస్తవాలను మీ ముందుంచాను’ అని పూజా తన పోస్ట్‌కు శీర్షికను పెట్టారు. తన కుటుంబం మీద వస్తున్న నెపోటిజం ఆరోపణలపై స్పందించిన పూజా... విశేష్ ఫిల్మ్ ఒకప్పుడు కొత్తవారితో మాత్రమే పనిచేసినందుకు అపఖ్యాతి పాలైందని గుర్తుచేశారు. ఇక దీనిపై స్పందించిన కంగనా రనౌత్ సోషల్ మీడియా టీం మహేష్ భట్ ప్రొడక్షన్ హౌస్ నటుల కోసం అంత ఎక్కువగా డబ్బు ఖర్చు చేయదని పేర్కొంది. కంగనా లాంటి టాలెంట్ ఉన్న వారు తక్కువ డబ్బులకు చేయడానికి దొరకడంతో మహేష్ భట్ ఆమెకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మొత్తం మీద సోషల్‌మీడియా వేదికగా పూజా భట్-కంగనాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. చదవండి: 'కంగనా.. నీకు ఆ అర్హత లేదు' -
వాళ్లు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు: రవీనా
తమ కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారని బాలీవుడ్ నటి రవీనా టండన్ అన్నారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమని ఆమె పేర్కొన్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో నెపోటిజమ్ వాదన ఉవ్వెత్తున లేచింది. నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ చనిపోయాడని అతని అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖ నటులు సైతం గళం విప్పుతున్నారు. సుశాంత్ మరణించి 20 రోజులు దాటుతున్న బంధుప్రీతిపై చర్చలు మాత్రం చల్లారడం లేదు. (మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?) దీనిపై తాజాగా నటి రవీనా టండన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ‘బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. అందుకు నేను అంగీకరిస్తున్నాను. ప్రతి చోట మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. వీరిలో చెడ్డవాళ్లు మిమ్మల్ని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. వాళ్లు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీసేందుకు, సినిమాల నుంచి తప్పించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు క్లాస్‌రూమ్‌లో చేసే చిల్లర రాజకీయాల్లాంటివి. కానీ ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అయితే మేము గ్లామరస్ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ఇది ఎక్కువ హైలెట్ అవుతోంది’. అని రవీనా అన్నారు. అంతేగాక సుశాంత్ మరణాన్ని సంచలనం చేయడం ఆపేయాలని ఆమె కోరారు. (రవీనా.. నన్ను పెళ్లి చేసుకుంటారా?) -
ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చిత్రపరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. ఇండ్రస్ట్రీలో బంధుప్రీతి (నెపొటిజం) మూలంగానే యువ నటులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు గొంతెత్తున్నారు. తామూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్ని మానసికంగా ఎంతో కుంగుబాటుకు గురయ్యామంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నారు. సుశాంత్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్ని రాజేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి రూపా గంగూలీ ఘాటుగా స్పందించారు. చిత్రపరిశ్రమలో బంధీప్రతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తుల మూలంగా ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో బంధుప్రీతి తారాస్థాయికి చేరిందని ఆవేదన చెందారు. (నేనూ నెపోటిజమ్ బాధితుడినే) అన్ని రంగాల్లోనూ ఆ జాడ్యం వేళ్లూనుకుందని ఆమె అభిప్రాయడపడ్డారు. బంధుప్రీతి గలవారంటే తనకు అస్సలు గిట్టదని, ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల సినిమాలను చూడటం ఎప్పుడో మానేశానని చెప్పారు. చిత్రపరిశ్రమపై పట్టుకోసం కొందరు చేసే దుర్మార్గానికి ఎంతో మంది నటులు బలైపోతున్నారని ఆవేదన చెందారు. మరోవైపు సుశాంత్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని రూపా ఇప్పటికే డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే నెపోటిజాన్ని వెనకేసుకొస్తున్న వాళ్ల సినిమాలను బాయ్‌కాట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక గత నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ మృతిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని విచారించిన పోలీసులు.. మరికొంత మందిని సైతం ప్రశ్నించే అవకాశం ఉంది. (ఆలియా, మహేష్ భట్‌పై కేసు నమోదు) -
నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే!
చెన్నై : నేను బాధితురాలనే అంటోంది తాప్సీ. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో మొదట కథానాయికగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో మొదటగా ఆడుగళం చిత్రంలో ధనుష్‌కు జంటగా పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో తర్వాత ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన నటిగా పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది. తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తాప్సీ బాలీవుడ్‌ను నమ్ముకుంది. అక్కడ ఈ అమ్మడు నటించిన నామ్ షబానా, పింక్ వంటి చిత్రాలు సక్సెస్ అవడంతో బాలీవుడ్లో ప్రముఖ కథానాయికగా రాణిస్తోంది. ముఖ్యంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఈ అమ్మడిని వరించడం విశేషం. కాగా ఇప్పుడు అక్కడ నేపోటిజం అనే పదం చర్చనీయాంశంగా ట్రోల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన తరువాత దానికి తామూ బాధితులమే అంటూ చెప్పుకొని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలా తాప్సీ కూడా బాధితురాలినే నని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించే ఆమె తెలుపుతూ సినీ పరిశ్రమలో ప్రముఖుల వారసులుగా రంగప్రవేశం చేసిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. అలా వారికి సినిమాల్లో అవకాశాలు చాలా సులభంగా వస్తాయని అంది. అయితే ఏలాంటి సినీ నేపథ్యం లేని వాళ్లు ప్రముఖులతో పరిచయాలు అవడానికి చాలా కాలం పడుతుందని చెప్పింది. దీంతో దర్శకులు కూడా బయటి నుంచి వచ్చే వారికి అవకాశాలు కల్పించడం కంటే ప్రముఖుల వారసులతో చిత్రాలు చేయడానికే నటింపజేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పింది. అలా మొదట్లో తాను పలు అవకాశాలను కోల్పోయినట్టు చెప్పింది. అప్పుడు తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని పేర్కొంది. ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమని ఆరోపించింది. సినిమా వారసులకు నటించిన చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, ఇతరులు వారి చిత్రాలను పట్టించుకోకపోవడం ఇందుకు కారణమని నటి తాప్సీ పేర్కొంది. -
'నాకెవరూ అవకాశాలు ఇవ్వలేదు'
చెన్నై : తనకు ఎవరూ అవకాశాలను కల్పించలేదని నటి తమన్నా పేర్కొంది. ప్రస్తుతం నటి తమన్నా దక్షిణాదిలో అగ్ర నటీమణుల్లో ఒకరుగా రాణిస్తున్నారు . ముఖ్యంగా ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 15 ఏళ్ల వయసులోనే నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు తొలుత బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయింది. అక్కడ ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దక్షిణాదికి మకాం మార్చింది. ఇక్కడ కథానాయికగా వరుసగా అవకాశాలు రావడంతో వాటిని సద్వినియోగం చేసుకుంది. అలా 15 ఏళ్లుగా కథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో నేపోటిజం గురించి అక్కడ పెద్దచర్చ జరుగుతోంది. ఈ విషయంపై నటి తమన్నా స్పందిస్తూ తాను 2005లో చాంద్ సా రోషన్ సహ్రా అనే చిత్రం ద్వారా కథానాయికగా బాలీవుడ్లో పరిచయం అయినట్లు చెప్పింది. తాను ముంబై నుంచి దక్షిణాదికి వచ్చేటప్పుడు తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ సాయం చేయలేదని పేర్కొంది. తన సొంత ప్రయత్నంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అంతస్తును దక్కించుకున్నట్లు చెప్పింది.తన బాలీవుడ్ కల మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. అలా 2013లో హిమ్మత్వాలా చిత్రం ద్వారా మరోసారి తన బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. అది ఆమెకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్లీ దక్షణాదినే నమ్ముకుంది. ఆ తర్వాత కూడా ఇటీవల ప్రభుదేవా దర్శకత్వంలో ఖామోషీ అనే హిందీ చిత్రంలో నటించింది. అది ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇలాంటి సమయంలో తమన్నా ఇటీవల ఒక భేటీలో నేపోటిజం గురించి మాట్లాడుతూ నేపోటిజం ప్రభావం సినీ రంగంలో ఎంట్రి వరకే పనిచేస్తుందని చెప్పింది. ఆ తర్వాత జయాపజయాలు అనేవి ప్రతిభపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. వారసత్వం అన్నది సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉంటుందని పేర్కొంది. పలువురు ప్రముఖుల వారసులు ఎవరి సాయం లేకుండానే ఈ రంగంలో రాణిస్తున్నారని తమన్నా చెప్పింది. -
నేనూ నెపోటిజమ్ బాధితుడినే: సైఫ్
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో పాతుకుపోయిన నెపోటిజాన్ని కూకటివేళ్లతో పెకిలించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోడానికి నెపోటిజం కారణామంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సుశాంత్ మరణించి రెండు వారాలు గడుస్తున్నా..ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్లో ఉన్న వారసత్వ రాజకీయాలపై చర్చ మరింత వేడిని పుట్టిస్తున్న క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. (సుశాంత్ చావును అవమానిస్తున్నారు: హీరో) ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ.. తాను కూడా నెపోటిజమ్ బాధితుడని పేర్కొన్నాడు. ‘భారత దేశంలో ఉన్న అసమానత్వాన్ని బయట పెట్టాల్సి అవసరం వచ్చింది. నెపోటిజం, అభిమానవాదం రెండు వేరువేరు విషయాలు. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా బంధుప్రీతి సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడలేదు. ప్రస్తుతం దీనిపై సినిమా పరిశ్రమ నుంచి అనేక మంది చర్చకు రావడం సంతోషంగా ఉంది’. అంటూ పేర్కొన్నాడు. అంతేగాక తన కూతురు సారా అలీ ఖాన్ మొదటి చిత్రం కూడా సుశాంత్ సింగ్‌తో ‘కేదార్నాథ్’ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. (సడక్-2కు సుశాంత్ ఫ్యామిలీ ఝలక్) అయితే సైఫ్ వ్యాఖ్యలపై అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన అసమానత విషయంపై సైఫ్‌ను అభినందించగా, మరోవైపు నెపోటిజమ్‌పై వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ స్థాయిలో మండిపడుతున్నారు. అలనాటి బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కొడుకుగా.. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌటీ వంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది. మన్సూర్ అలీ ఖాన్ ఒక సంస్థానానికి మహారాజు. ఈ క్రమంలో హీరో పటౌడీ వంశాన్ని, వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్లో వ్యంగ్యంగా మీమ్స్ రూపొందిస్తున్నారు. ‘న్యాయం చెప్పే జడ్జే తప్పు చేస్తే మరి న్యాయం ఎవరూ చెప్తారు. 50 రుపాయల చిల్లర యాక్షన్. సైఫ్ మాత్రమే కాదు. తైమూర్ కూడా నెపోటిజమ్ బాధితుడే’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. (‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’) Saif Ali khan complaining about nepotism is like : pic.twitter.com/svK7zkel50 — Mr. Stark (@Mr_Stark_) July 2, 2020 When Saif Ali Khan Says , He is an Victim of Nepotism. Audiences: pic.twitter.com/NvtfO9VxdB — RaFi (@IamRaaFii) July 2, 2020 Not only Saif Ali Khan but also Taimur has been a victim of Nepotism pic.twitter.com/72JnA4BdJY — Souvik Nag (@SouvikNag_tatai) July 2, 2020 Saif Ali Khan says that he has been a victim of nepotism. Yeah that's why you had got National Award for Hum Tum instead of SRK for Swades. #SRK #ShahRukhKhan Slow Clap for you #Saifalikhan pic.twitter.com/MsFVvvSPOU — Rohit Agrawal (@rohit__6428) July 2, 2020 -
సడక్-2కు సుశాంత్ ఫ్యామిలీ ఝలక్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజం)పై విస్తృత చర్చ లేవనెత్తింది. బాలీవుడ్లో స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సుశాంత్‌కు ఇవ్వలేదన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎందరో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి తిరిగిన దర్శకుడు, చిత్ర నిర్మాత మహేశ్ భట్ కూడా ఒకరు. ఆయన బుధవారం సోషల్ మీడియాలో "సడక్-2" చిత్ర పోస్టర్‌ను విడుదల చేశాడు. హీరోయిన్ అలియాభట్ నటించిన ఈ సినిమా పోస్టర్ లుక్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదిలా ఉంటే సుశాంత్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ చిత్రాల్లో ఎంతవరకు నెపోటిజమ్ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు గురువారం "నెపోమీటర్"ను ప్రారంభించారు. ఇది ఐదు కేటగిరీలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్) నిర్మాత, ప్రధాన పాత్రలు, ఇతర పాత్రలు, దర్శకుడు, రచయిత ఆధారంగా సినిమాలో ఎంతమేరకు బంధుప్రీతి ఉందో నిరూపిస్తూ ఫలితాన్ని వెల్లడిస్తుంది. దీనికోసం సోషల్ మీడియాలో నెపోమీటర్ అని అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. అందులో అలియాభట్ సడక్-2 చిత్రం 98% నెపోటిస్టిక్ అని తెలిపింది. అంటే ఈ చిత్రంలో ఐదు కేటగిరీల్లోని నాలిగింట్లో బాలీవుడ్ ప్రముఖుల వారసులే ఉన్నారని స్పష్టం చేసింది. బాలీవుడ్లో నెపోటిజమ్ రూపుమాపాలన్న ప్రయత్నంతోనే దీన్ని ప్రవేశపెట్టామని సుశాంత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బయట నుంచి వచ్చేవారికి అవకాశాలు ఇవ్వని సినిమాలు చూడవద్దని అభిమానులను కోరారు. కాగా నెపోమీటర్ ఎక్కువ శాతాన్ని చూపిస్తే అది అందులో స్టార్ల కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నట్లు.. తక్కువగా చూపిస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారు సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు అర్థం. (సుశాంత్ ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు) View this post on Instagram #Sadak2 is 98% Nepotistic. We rated it based on 5 categories, Producer, Lead Artists, Supporting Artists, Director & Writer. 4 out of 5 categories have Bollywood Family members. When #nepometer is high, it’s time to #boycottbollywood Will you watch this movie? Tell us in comments. A post shared by Nepometer (@nepometer) on Jul 1, 2020 at 9:43pm PDT -
క్రికెట్లో నెపోటిజమ్ రచ్చ.. చోప్రా క్లారిటీ
ముంబై: సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెపోటిజం అంటూ తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెపోటిజం సెగ భారత క్రికెట్‌ను కూడా తాకింది. బంధుప్రీతి కారణంగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందనే వాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌ను టార్గెట్ చేస్తూ భారత క్రికెట్లో నెపోటిజం ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కుమారుడనే ఒకే ఒక కారణంతో అతడిని ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూనే ప్రతిభ ఉన్నా జట్టులోకి తీసుకోని పలువురు ఆటగాళ్ల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. (‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి) అయితే భారత క్రికెట్లో నెపోటిజమ్ అనే ప్రస్తావనే లేదని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ‘అర్జున్ టెండూల్కర్ పేరును తెరపైకి తీసుకొచ్చి విమర్శించడం సరికాదు. సచిన్ కుమారుడైనంత మాత్రాన అతడికి టీమిండియాలో అవకాశాన్ని పువ్వుల్లో పెట్టివ్వరు. అన్ని విధాలుగా అర్హుడైతేనే జట్టులోకి వస్తాడు. ఇక అండర్-19 సెలక్షన్స్‌లో కూడా ఎలాంటి అవకతవకలు జరగవు. ప్రతిభ, బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉంటేనే అండర్-19 జట్టులోకి తీసుకుంటారు. (‘రైజర్స్’తోనే నేర్చుకున్నా...) సునీల్ గావస్కర్ తనయుడు రోహన్ గావస్కర్ కూడా బెంగాల్ రంజీ టీంలో మెరుగైన ప్రదర్శన చేశాడు కాబట్టే భారత జట్టులోకి వచ్చాడు. గావస్కర్ ఇంటి పేరు ఉన్నప్పటికీ రోహన్‌కు ముంబై రంజీ టీంలో చోటు దక్కని విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌లు ఆడి విజయాలను అందించినప్పటికీ తన కొడుకుకు కనీసం ముంబై టీంలో అవకాశం సునీల్ గావస్కర్ అవకాశం ఇప్పించలేదు. ఎందుకుంటే ప్రతిభ ఉంటే అవకాశం వస్తుంది. బంధుప్రీతితో కాదు’ అంటూ అకాశ్ చోప్రా పేర్కొన్నాడు. (‘నల్లవారిని’ నిరోధించేందుకే...) -
సోను నిగమ్‌పై వీడియో ద్వారా ప్రతిదాడి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మాటల దాడులు కొనసాగుతున్నాయి. ఆరోపణలూ ప్రత్యారోపణలు వేడి మీద ఉన్నాయి. ‘నెపొటిజమ్’ (పక్షపాతం) ఎవరు ఎవరి పట్ల వహిస్తే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్ ‘ఆత్మహత్యలు నటీనటుల్లోనే కాదు ఇక మీదట గాయకుల్లో, సంగీత దర్శకుల్లో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆడియో కంపెనీల నిరంకుశ వైఖరి ఇందుకు కారణం’ అని కామెంట్ చేశాడు. ఇది ‘టి సిరీస్’ సంస్థను, దాని అధిపతి అయిన భూషణ్ కుమార్‌ను ఉద్దేశించినది. సోను నిగమ్ అంతటితో ఆగకుండా ‘భూషణ్ 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షించమని కూడా వచ్చాడు’ అన్నాడు. టి. సిరీస్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలో హతమయ్యాడు. అప్పటికి ఆయన కుమారుడైన భూషణ్ వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ భూషణ్ సంస్థ పగ్గాలు చేపట్టాడు. సంస్థను నిలబెట్టాడు. పెద్ద నిర్మాతగా కూడా ఉన్నాడు. సోను నిగమ్ ఆరోపణలకు భూషణ్‌కుమార్ బదులివ్వలేదు. కాని అతని భార్య దివ్యా ఖోస్లా కుమార్ మాత్రం ఆగ్రహంతో అపర కాళిగా మారింది. తన భర్త మీద ఆరోపణలు చేసిన సోను నిగమ్ మీద వీడియో ద్వారా ప్రతిదాడికి దిగింది. ఒక వేడుకలో గాయకుడు సోను నిగమ్, టి సిరిస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా ‘సోనూ నిగమ్ గారూ. టి సిరీస్ సంస్థ ఎందరో గాయకులకు, సంగీత దర్శకులకు బ్రేక్ ఇచ్చింది. ఢిల్లీలో మీరు ఐదు రూపాయలకు కచ్చేరి ఇస్తున్న రోజుల్లో మా మామగారు గుల్షన్ కుమార్ గారు మిమ్మల్ని స్పాట్ చేసి బాంబే పిలిపించి గాయకుడిగా అవకాశం ఇచ్చారు. కాని ఆయన చనిపోయినప్పుడు సంస్థ మునిగిపోతుందని భావించిన మీరు టి సిరీస్‌తో కాకుండా మరో మ్యూజిక్ కంపెనీతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. ఇదా మీరు చేయాల్సింది. అసలు మీరు ఇంత పెద్ద గాయకులు అయ్యారు కదా మీరు ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు? మిమ్మల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. ఇక మీరు అండర్ వరల్డ్ ప్రస్తావన తెచ్చారు. మావారు మీ దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షణ కోసం వచ్చారని చెబుతున్నారు. అంటే మీకు అండర్ వరల్డ్‌తో లింక్స్ ఉండేవా? దీనిమీద ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నాను. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల సోషల్ మీడియాలో నా భర్త మీద, నా మీద, నా సంతానం మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇది చాలా తప్పు. అవకాశాలు అందరికీ ఇవ్వలేము. అవకాశాలు దొరకని వాళ్లు ఆరోపణలకు దిగితే ఎవరూ మిగలరు. ఇక మీదటైనా మీ ఆరోపణలు బంద్ చేసుకోండి’ అని గట్టిగా హెచ్చరించింది దివ్యా ఖోస్లా. ఈ భార్య చెప్పిన బదులు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on Jun 24, 2020 at 7:23am PDT -
‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’
ముంబై: సినీ రచయిత చేతన్ భగత్ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లీడ్రోల్లో నటించబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ 2015లో చేతన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చివరికి ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావాలనే ఈ సినిమా నుంచి సుశాంత్‌ను తొలగించారంటూ దర్శకుడిపై, అర్జున్ కపూర్, బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో బంధుప్రీతి(నెపొటిజం) కారణంగా సుశాంత్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి తొలగించి స్టార్కిడ్ అయిన అర్జున్ను తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. (జస్టిస్ ఫర్ సుశాంత్) So happy to share @itsSSR will play lead in @mohit11481 directed Half Girlfriend. Shooting begins 1Q16. https://t.co/dUHSVZ2FQ5 — Chetan Bhagat (@chetan_bhagat) November 7, 2015 అంతేగాక ఈ సినిమాలో అర్జున్ నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజమ్) ఎంతగా పేరుకుపోయిందో చూశారా. సుశాంత్‌ను తొలగించి అదిత్య రాయ్... రణ్‌వీర్‌లు.. లెజెండరి నటుడు అర్జున్ కపూర్లు సినిమా అవకాశాలు పొందారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అన్యాయంగా సుశాంత్‌ను తొలగించడం వల్ల జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఇప్పటికైనా సుశాంత్‌కు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు సుశాంత్‌లను పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలని ఇకపై వారి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. (సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్) -
జస్టిస్ ఫర్ సుశాంత్
బాలీవుడ్లో బయటినుంచి వచ్చేవారికన్నా వారసులకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని, ఇక్కడ బంధుప్రీతి బాగా ఉంటుందని పలువురు ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌సింగ్ ఆత్మహత్యకు ఇదో కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరమ్ ఏర్పాటు చేసినట్లు నటుడు శేఖర్ సుమన్ ట్వీటర్లో పేర్కొన్నారు. ‘‘మంచి ప్రతిభ, బలమైన సంకల్పం ఉన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం నన్ను నిరాశకు గురిచేసింది. అతని ఆత్మహత్యకు గల కారణాలను కొందరు దాస్తున్నారు. వాటన్నింటినీ మా ఫోరమ్ వెలుగులోకి తీసుకొస్తుంది. తన ఆత్మహత్యపై సీబీఐ విచారణకు మా ఫోరమ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరమ్ పోరాడుతుంది. సినీ పరిశ్రమలోని గ్రూపు రాజకీయాలను, నిరంకుశత్వాన్ని అంతమొందించేందుకు పని చేస్తాం’’ అన్నారు. ఇప్పటికి మూడు సినిమాలు బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత షామిక్ మౌలిక్ దర్శకత్వంలో సుశాంత్ జీవితం ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు విజయ్‌శేఖర్ గుప్తా ప్రకటించారు. దర్శకుడు నిఖిల్ ఆనంద్ కూడా సుశాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా సుశాంత్ జీవితం ఆధారంగా ‘సుశాంత్’ అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు సునోజ్ మిశ్రా. ఇంతకుముందు ‘గాంధీ గిరి’, ‘శ్రీనగర్’ చిత్రాలను డైరెక్ట్ చేశారు సునోజ్ మిశ్రా. ‘సుశాంత్’ చిత్రం గురించి సనోజ్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోని వేధింపుల వల్ల కఠిన నిర్ణయాలు తీసుకున్నవారందరికీ సంబంధించినదే ఈ చిత్రం. రోడ్ ప్రొడక్షన్, సనోజ్ మిశ్రా ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ముంబై, బీహార్ లొకేషన్స్‌లో మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
‘రేపు మీ పిల్లల విషయంలో ఏం చేస్తారు’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంతో సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన బంధుప్రీతి, లాబీయింగ్, అభిమానవాదం వంటి అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. సుశాంత్ మరణం తరువాత చాలా మంది నటులు, దర్శకులు, రచయితలు, ఇతర వర్ధమాన నటులు బాలీవుడ్లో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు కరణ్ జోహార్, ఆలియా భట్, సోనమ్ కపూర్, సల్మాన్ ఖాన్‌లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ట్రోలర్స్ బాధ తట్టుకోలేక కరణ్, ఆలియా, కరీనా కపూర్ ఖాన్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో కామెంట్ సెక్షన్లో లిమిట్ సెట్ చేసుకున్నారు. సుశాంత్ మరణం తర్వాత అభిమానులు బాలీవుడ్లో బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కరణ్, అలియా వంటి స్టార్లను అన్‌ఫాలో చేయడం ప్రారంభించారు. దాంతో వీరి సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఆలియా భట్‌పై వస్తున్న విమర్శలపై ఆమె తల్లి సోని రజ్దాన్ స్పందించారు. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారు.. రేపు తమ పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మాత్రం వారికి తప్పక మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. దర్శకుడు హన్సాల్ మెహతా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ సోని ఇలా కామెంట్ చేయడం గమనార్హం. (ముసుగులు తొలగించండి) హన్సాల్ మెహతా ‘ఈ బంధుప్రీతిపై చర్చను విస్తృతం చేయాలి. ఎక్కువ మంది దీని గురించి మాట్లాడాలి. నా వల్ల నా కొడుకుకు ఇండస్ట్రీలో త్వరగా అవకాశం లభించిన మాట వాస్తవం. కాకపోతే తను చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రతిభావంతుడు, క్రమశిక్షణ గలవాడు. నాలానే విలువలు పాటిస్తాడు. అందువల్లే అతడికి అవకాశాలు వస్తాయి తప్ప నా కొడుకు అని అవకాశాలు ఇవ్వరు’ అన్నారు. అంతేకాక ‘నా కుమారుడు సినిమాలు తీస్తాడు.. కానీ వాటిని నేను నిర్మించలేదు. ఆ సినిమాలు చేయడానికి అతడు అర్హుడు కాబట్టి అతడికి అవకాశం లభించింది. ఇక్కడ నిలదొక్కుకోగలిగితేనే అతనికి కెరీర్ ఉంటుంది. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే తన కెరీర్‌ను నేను నిర్మించలేను’ అంటూ హన్సాల్ మెహతా ట్వీట్ చేశారు. (నెపోటిజం: ఆ ఆవార్డును బైకాట్ చేశాను) దీనిపై సోని రజ్దాన్ స్పందిస్తూ.. ‘ఫలానా వారి కొడుకు, కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద చాలా అంచానాలు ఉంటాయి. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీరు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. ఏం చేస్తారు.. వారిని ఆపగల్గుతారా’ అని సోని రజ్దాన్ ప్రశ్నించారు. The expectation that people have because of whose son or daughter you are is much more. Also thise who r ranting about nepotism today and who have made it on their own will also have kids one day. And what if they want to join the industry? Will they stop them from doing so ? — Soni Razdan (@Soni_Razdan) June 23, 2020 -
నెపోటిజమ్‌పై తెలివిగా స్పందించిన సుస్మితా సేన్
ముంబై : బాలీవుడ్లో నెపోటిజమ్‌పై చర్చ రోజురోజుకీ సెగలు రాజేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇప్పటి వరకు అనేక మంది బంధుప్రీతిపై తమ అభిప్రాయాన్ని వెలువరించగా.. తాజాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను నెపోటిజమ్ చర్చల్లోకి లాగారు. సుస్మితా సేన్‌కు ఇండస్ట్రీలో బంధువులు ఎవరూ లేరు. దీంతో ఓ నెటిజన్ ఆమెను..‘బాలీవుడ్‌లోని నెపోటిజమ్ నుంచి ఎలా బయటపడగలిగారు’. అంటూ ట్విటర్లో ప్రశ్నించారు. (‘జింతాత జిత జిత జింతాత తా..’ గుర్తుందా!) ఇక దీనిపై స్పందించిన సుస్మితా.. ‘నేను కేవలం నా అభిమానులపై ద`ష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యను దూరం పెట్టాను. మీరు నన్ను ఆదరించినంతకాలం నేను నటిగా నా సేవలు కొనసాగిస్తూనే ఉంటాను’. అంటూ సమాధానమిచ్చారు. కాగా ‘ఆర్య’ వెబ్ సిరీస్‌తో మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టారు నటి సుస్మితా సేన్. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న సుస్మితా.. రెండు సంవత్సరాల తర్వాత దస్తక్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. (బాధపడకండి.. నేను చనిపోవడం లేదు: నేహా) 26 ఏళ్లు.. ఐ లవ్ యూ జాన్..! -
బాధపడకండి.. నేను చనిపోవడం లేదు: నేహా
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం బాలీవుడ్‌లోని సినీ వారసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీలో నెపోటిజమ్ కారణంగానే ప్రతిభావంతులైన నటులు అవకాశాలు కోల్పోతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వారిని ట్రోల్ చేస్తున్నారు. అలాగే స్టార్ వారసులను అన్‌ఫాలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు స్టార్ హీరోల వారసులు తమ సోషల్ మీడియా అకౌంట్లను తొలగిస్తున్నారు. మరికొంత మంది నెగెటివిటీకి దూరంగా ఉండేందుకు కామెంట్ బాక్స్‌ను డిసెబుల్ చేస్తున్నారు. (సుశాంత్ మరణంపై డబ్బు సంపాదించడం భావ్యమా!) నెటిజన్ల నుంచి వస్తున్న బంధుప్రీతి విమర్శలను ఎదుర్కోలేక గతవారం సోనాక్షి సిన్హా తన ట్విటర్ ఖాతా నుంచి వైదొలుగుతన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మరో స్టార్ కిడ్ సోనమ్ కపూర్‌పై సైతం ట్రోల్ చేయగా ఆమె తన కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేశారు. తాజాగా బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కొద్ది రోజులపాటు సోషల్ మీడియాకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ద్వేషం, బంధుప్రీతి, అసూయ నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్) 'నేను తిరిగి నిద్రలోకి వెళుతున్నాను. ప్రపంచం మంచిగా మారినప్పుడు నన్ను మేల్కొల్పండి. ద్వేషం, నెపోటిజం, అసూయ, తీర్పులు, హిట్లర్లు, హత్యలు, ఆత్మహత్యలు, చెడ్డ వ్యక్తులు ఉన్న ప్రపంచం కాదు. స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం, వినోదం, మంచి వ్యక్తులు ఉన్న ప్రపంచం కావాలి. గుడ్‌నైట్. భయపడకండి. నేను చనిపోవడం లేదు. కేవలం కొన్ని రోజులు దూరంగా వెళుతున్నా అంతే'.. అంటూ నేహా తన పోస్ట్ లో పేర్కొన్నారు. (ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్) 'నా నిర్ణయం ఎవరికైనా చెడుగా అనిపిస్తే నన్ను క్షమించండి! ఇది నేను చాల రోజుల నుంచి అనుభవిస్తున్నాను. కానీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. కేవలం నన్ను నేను సంతోషంగా ఉంచుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాను. చాలా కాలం నుండి నేను అనుభూతి చెందుతున్నాను కాని చెప్పలేకపోతున్నాను, సంతోషంగా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేనూ మనిషినే. ఇది నన్ను చాలా బాధపెడుతోంది. నా గురించి ఆందోళన చెందకండి. నేను బాగానే ఉన్నాను'.. అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా సినిమాల్లోని కాకుండా సంగీత పరిశ్రమలోనూ పెద్ద మాఫియా ఉందని, కొందరు ప్రముఖుల కారణంగా కొత్త వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాయకుడు సోనూ నిగమ్ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. దీని అనంతరం సంగీత పరిశ్రమలో కూడా నెపోటిజమ్ వివాదంలో చిక్కుకుంది. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) -
సుశాంత్ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి వారం దాటుతున్న ఇంకా ఎవరు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలలో కలకలం రేపింది. సుశాంత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. స్టార్ కిడ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. బాలీవుడ్లో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, టాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌ఫాలో స్టార్ కిడ్స్ అంటూ క్యాంపెయిన్ కూడా నిర్శహిస్తున్నారు. అభిమానులే కాకుండా బాలీవుడ్ స్టార్లు కూడా సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువగా ఉందంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలను బయటపడుతున్నారు. (‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’) కరణ్ జోహార్, సల్మాన్ సహా చాలా మంది బంధుప్రీతి చూపిస్తున్నారంటూ అభిమానులు ఏకిపారేస్తున్నారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఈ విషయంలో తన అభిమానులు .. సుశాంత్ అభిమానులకు తోడుగా ఉండాలని పిలుపు నిచ్చాడు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రాఖీ సావంత్ సైతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించారు. దీనికి సంబంధించి రాఖీ సావంత్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సుశాంత్ తన కలలో కనిపించి బాలీవుడ్ తనని వెలివేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేగాక త్వరలోనే సుశాంత్ తనకు బిడ్డగా జన్మించబోతున్నాడని ఈ సందర్భంగా రాఖీ వెల్లడించారు. దీంతో పాటు పూర్తి కానీ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే చేయాలని కోరినట్టు ఈ వీడియోలో రాఖీ సావంత్ తెలిపింది. (‘సుశాంత్ నెలసరి ఖర్చు రూ. 10 లక్షలు’) View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Jun 21, 2020 at 1:17am PDT -
ఐ వాన్న అన్‌ఫాలో యు
‘ఐ వాన్న ఫాలో ఫాలో ఫాలో యు...’ అంటూ ‘నాన్నకు ప్రేమతో’లో రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఫాలో అవుతూ పాడతారు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో కూడా తమ అభిమాన తారలను అలానే ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. ‘ఐ వాన్న ఫాలో ఫాలో యు’ అంటూ కండలవీరుడు సల్మాన్ ఖాన్ని, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌ని, క్యూట్ గాళ్స్ సోనమ్ కపూర్, ఆలియా భట్, అనన్యా పాండేలను చాలామంది ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు అదే అభిమానులు ‘ఐ వాన్న అన్‌ఫాలో యు’ అంటున్నారు. దాంతో సామాజిక మాధ్యమంలో వీళ్లంతా లక్షలాది మంది ఫ్యాన్స్‌ను కోల్పోతే కంగనా రనౌత్ ఫాలోయర్స్ సంఖ్య మాత్రం పెరిగింది. దీనికి కారణం ఇటీవల చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. బాలీవుడ్లో వారసులకే ప్రాధాన్యం ఇస్తారని, బంధుప్రీతి బాగా చూపిస్తారని, సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఇదేననే వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ తారాస్థాయిలో ఉందని కంగనా వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పటినుంచీ కంగనా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య పెరిగింది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి విజయాలతో దూసుకెళుతోన్న కంగనా ఇన్‌స్టా ఫాలోయర్స్ అమాంతంగా 20 లక్షలు పెరిగారు. అయితే కంగనా తరఫున ఆమె టీమ్ ఈ అకౌంట్‌ని హ్యాండిల్ చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ‘రాబ్తా’ సినిమాలో నటించిన కృతీ సనన్ అతను చనిపోయాక ‘నాలో సగ భాగాన్ని కోల్పోయినట్లనిపిస్తోంది’ అని తన బాధను వ్యక్తం చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షలమంది ఫాలోయర్స్ పెరిగారు. ఆలియా భట్, కృతీ సనన్ సల్మాన్ ఖాన్ కుటుంబం తనను టార్చర్ పెడుతోందని దర్శకుడు అభినవ్ కశ్యప్ రాసిన లెటర్, సల్మాన్ కూడా వారసులను ప్రోత్సహిస్తాడని పలువురు పేర్కొనడంతో ఈ కండలవీరుడు భారీ స్థాయిలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. దాదాపు పది లక్షల మంది వరకూ సల్మాన్‌ని అన్‌ఫాలో అయ్యారు. స్టార్ కిడ్స్‌కి అవకాశాలు ఇస్తూ, సినిమాలు నిర్మిస్తాడనే అభిప్రాయం కారణంగా కరణ్ జోహార్‌ని దాదాపు రెండు లక్షల యాభై వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇక స్టార్ కిడ్స్ సోనమ్ కపూర్ రెండున్నర లక్షలమందిని, ఆలియా భట్ దాదాపు ఐదు లక్షలమందిని కోల్పోయారు. సోనమ్ కపూర్, ఆలియా భట్ అయితే మరో స్టార్ కిడ్ శ్రద్ధాకపూర్‌కి ఫాలోయర్లు పెరగడం విశేషం. సుశాంత్ అంత్యక్రియలకు శ్రద్ధా హాజరై, నివాళులర్పించింది. ఆమెకు 3 లక్షల మంది ఫాలోయర్స్ పెరగడానికి ఇదొక కారణం. ఇక ప్రముఖ నటుడు చంకీ పాండే వారసురాలిగా ఆయన కుమార్తె అనన్యా పాండే కూడా ఆగ్రహానికి గురైనవారి జాబితాలో ఉంది. గత ఏడాది కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ద్వారా కథానాయికగా పరిచయమైంది అనన్య. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ ద్వారా తెలుగుకి పరిచయం కానుంది. ఆమెను 70 వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇతరుల ఫాలోయర్స్ సంఖ్య కూడా తగ్గుతోంది. శ్రద్ధాకపూర్, అనన్యా పాండే స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య తగ్గితే అది కచ్చితంగా వారి సినిమాల వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. థియేటర్లు రీ ఓపెన్ అయిన వెంటనే సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా వసూళ్లను బట్టి ఇన్స్టాగ్రామ్ అన్ఫాలోయర్స్ ప్రభావం బాక్సాఫీస్ మీద పడిందా? లేదా అని తెలుస్తుంది. ఇక హీరోయిన్లంటే కేవలం వాళ్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడే వసూళ్ల ప్రభావం ఎంతో తెలుస్తుంది. ఆలియా భట్ ప్రస్తుతం ‘గంగూభాయ్ కతియావాడి’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ కిడ్ అనే ట్యాగ్ ఆమె మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమా వసూళ్లు చెప్పేస్తాయి. -
అన్‌ఫాలో స్టార్ కిడ్స్‌పై బాబిల్ స్పందన..
ముంబై : అప్పటి వరకు అడపాదడపా ఉన్న సమస్య ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ఇన్ని రోజులు దీని ప్రస్తావన సినీ పరిశ్రమలో ఉన్పప్పటికీ ఇంత భారీ స్థాయిలో లేదు. అదే నెపోటిజమ్(బందుప్రీతి). బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఈ వివాదం కాస్తా వాడివేడి చర్చకు దారి తీసింది. కేవలం స్టార్ కిడ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారని, ప్రతిభ ఉన్న సామాన్యులకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని వాదన ఎక్కువగా వినబడుతోంది. ఇక బాలీవుడ్లో ఉన్న నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ నిరాశకు గురయ్యారని, పరిశ్రమలోని రాజకీయాల కారణంగా సినిమాలను కోల్పోయి మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతికి వ్యతిరేకంగా నేడు అనేక మంది నెటిజన్లు గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహార్ వంటి వారిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవుతున్నారు. చిత్ర పరిశ్రమలో సుశాంత్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహంతో నెపోటిజానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. (సుశాంత్.. మాట నిలబెట్టుకోలేదు క్షమించు) తాజాగా తాము ఆరాధించే నటీ, నటులను కూడా స్థార్ కిడ్‌లను ఫాలో కావొద్దు అంటూ విన్నపిస్తున్నారు. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్‌ను సుశాంత్క్ మద్దతుగా చేపడుతున్న పోరాటంలో సహయం చేయాలని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో కోరాడు. అంతేగాక స్టార్ కిడ్‌లను అన్‌ఫాలో చేయాలని పేర్కొన్నాడు. దీనిపై బాబిల్ స్పందిస్తూ.. ‘భారతీయ సినిమాల్లో నటనలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి(ఇర్ఫాన్ ఖాన్) కొడుకుగా ఉండటంలో ఎన్ని ఒత్తిడిలు, ఆశయాలు ఉంటాయో నీకు తెలుసా బ్రదర్. బంధుప్రీతికి వ్యతిరేకంగా జరుగుతున్న మీ పోరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి’ అని బదులిచ్చారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) దీనిపై స్పందించిన ఇన్స్టాగ్రామ్ యూజర్.. ‘మేము స్టార్ కిడ్ల సినిమాలను బహిష్కరించలేము. కాబట్టి వారి సోషల్ మీడియా అకౌంట్లను అన్‌ఫాలో చేస్తే వారికి ఉన్న ఇన్కమ్ తగ్గుతుంది. ఇది న్యాయం కోసం జరుగుతున్న పోరాటం’ అని పేర్కొన్నారు. ‘నా నటన, కృషితో మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నానని నేను ఆశిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మీకు ఏదైనా అన్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదు’ అని బాబిల్ సమాధానమిచ్చారు. కాగా ప్రస్తుతం బాబిల్ ఇచ్చిన రిప్లై నెటిజన్ల మనసు దోచుకుంది. (బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై పేరడీ సాంగ్) -
బ్యాక్‌గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది
నెపోటిజమ్ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం... ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి, సక్సెస్ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్‌గ్రౌండ్. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఉంటే రాజశేఖర్‌గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని. అయితే బ్యాక్‌గ్రౌండ్ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. ఫస్ట్ సినిమా సక్సెస్ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు ఆ చాన్స్ తక్కువ. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్‌లైన్స్‌తో చాన్స్ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మా సపోర్ట్ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు. – నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ శివాని, జీవిత,శివాత్మిక నా గాయాలు చాలా లోతైనవి హీరోగా కొన్ని చిత్రాలు, విలన్‌గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్‌కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్ అడుగుతున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. – నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్ రాజ్ మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది కానీ... విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్‌గ్రౌండ్. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది. మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు. కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్ చాన్స్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా. – నటి, నిర్మాత లక్ష్మీ మంచు బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లూ సక్సెస్ అయ్యారు ‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం. – దర్శకురాలు నందినీ రెడ్డి – డి.జి.భవాని -
బాయ్‌కాట్ సల్మాన్
‘‘నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. చాకచక్యంగా నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్ (రచయిత–నటుడు, సల్మాన్ ఖాన్ తండ్రి), సల్మాన్ ఖాన్, సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్. ఇంకా వెన్నుపోటు పొడిచినవాళ్లు ఉన్నారు. కానీ ఈ విషపూరిత సర్పానికి సల్మాన్ కుటుంబం అధిపతి. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్‌వరల్డ్ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. దురదృష్టం ఏంటంటే నావైపు ‘నిజాయితీ’ మాత్రమే ఉంది. అయితే నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా జీవితాన్ని చాలించను. తలవంచేది లేదు. ఎదురు నిలబడి పోరాడతా. ఒకటీ వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. ఇక భరించింది చాలు. మళ్లీ పోరాడే సమయం ఆసన్నమైంది’’ అని హిందీ దర్శకుడు అభినవ్ కశ్యప్ మంగళవారం తన ఫేస్బుక్లో సుదీర్ఘంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి హిందీ పరిశ్రమలో అతనికి ఎదురైన చేదు అనుభవాలు ఒక కారణం అనేది పలువురి అభిప్రాయం. అభినవ్ కశ్యప్ కూడా ఆ మాటే అంటున్నారు. ఇది ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది ‘‘ప్రభుత్వానికి ఓ విన్నపం. సుశాంత్ మరణానికి గల కారణాలను సునిశితంగా పరిశోధించాలి. మేం చాలామంది ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బయటకు తీసుకొస్తోంది. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలవి. సుశాంత్ మరణం అనేది ఒక మచ్చు తునక అనే భయం వేస్తోంది. ఇది (నెపోటిజమ్ – బంధుప్రీతి) ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది. సుశాంత్ మరణానికి ‘వైఆర్ఎఫ్’ టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ ముఖ్య కారణం. ఈ టాలెంట్ ఏజెన్సీ వాళ్లు మన కెరీర్‌ని బిల్డ్ చేయరు.. కెరీర్‌తో పాటు జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. పదేళ్లుగా ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా చెబుతున్నా.. బాలీవుడ్‌కి చెందిన ప్రతి టాలెంట్ మ్యానేజర్, టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీలు ఆర్టిస్ట్‌లకు ఓ ‘డెత్ ట్రాప్’లాంటివి. ఈ మ్యానేజర్లు, ఏజెన్సీలు అవకాశాలిప్పిస్తామని ఇండస్ట్రీకి సంబంధంలేనివాళ్లను నమ్మిస్తారు. బాలీవుడ్లో జరిగే పార్టీలకు వాళ్లను ఆహ్వానిస్తారు. అయితే అక్కడ వీరిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు వీళ్లకు ఓ అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడు ఈ క్యాస్టింగ్ డైరెక్టర్లు మేం కాపాడతామంటూ కొన్నేళ్ల పాటు తమ ఏజెన్సీతో కలిసి పని చేస్తామని ఒప్పందపత్రంలో సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారి ఒప్పందం కుదిరాక ఇక వాళ్లకు ఏ హక్కూ ఉండదు. కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ల చేతిలో ఉండవు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కార్మికుడిలా తక్కువ పారితోషికానికి పని చేయాలి. పోనీ ఎలాగోలా ఈ ఏజెన్సీ నుంచి తప్పించుకుని ‘రేపు’ బాగుంటుందనే నమ్మకంతో వేరే ఏజెన్సీ దగ్గరికి వెళితే ఆ ‘రేపు’ఎప్పటికీ రాదు. ఇలాంటి అనుభవాలు నేను చాలా ఎదుర్కొన్నాను. అర్బాజ్ ఖాన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ‘దబాంగ్’ (2010) సినిమాకి దర్శకత్వం వహించిన పదేళ్లకు నా అనుభవాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ‘దబాంగ్’ తర్వాత ‘దబాంగ్ 2’ ఒప్పుకుని ఆ సినిమా నుంచి నేను తప్పకోడానికి కారణం అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ మరియు అతని కుటుంబం. నా కెరీర్‌ని కంట్రోల్ చేయడానికి వాళ్లు ట్రై చేశారు. నా రెండో చిత్రాన్ని శ్రీ అష్టవినాయక ఫిలింస్ సంస్థతో చేయడానికి సైన్ చేశాను. కానీ ఆ సంస్థ అధినేత రాజ్ మెహతాకి ఫోన్ చేసి, ‘అతనితో సినిమా చేస్తే జాగ్రత్త’ అని బెదిరించారు. దాంతో నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వయాకామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ అధినేత విక్రమ్ మల్హోత్రాకి ఫోన్ చేసి, బెదిరించారు. దాంతో తీసుకున్న 7 కోట్ల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు 90 లక్షలు వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సపోర్ట్ వల్ల ‘బేషరమ్’ (2013) సినిమాకి దర్శకత్వం వహించగలిగాను. అయితే ఆ సినిమా విడుదలకు ముందు సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి భయపడ్డారు. కానీ రిలయన్స్, నేను ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాళ్లం కాబట్టి సొంతంగా సినిమాని విడుదల చేయాలనుకున్నాం. అప్పుడు అసలు యుద్ధం మొదలైంది. నా శత్రువులు బాక్సాఫీస్ దగ్గర నా సినిమా పరాజయం పాలు కావడానికి సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేశారు. అయితే థియేటర్ల నుంచి ఎత్తేసే నాటికి నా సినిమా 58 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్ విషయంలో ఇబ్బందిపెట్టారు. ఇక ఆ తర్వాత నా ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టే పనులు చేశారు. నన్ను బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న స్త్రీలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. దాంతో నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. చివరికి 2017లో నా భార్య, నేను విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత కూడా నన్ను వదిలిపెట్టలేదు. బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. వెనక నుండి నాపై దాడి చేస్తున్నారు. నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సహించేది లేదు. ఓపెన్‌గా చాలెంజ్ చేస్తున్నాను. అమాయకులు బలి కాకూడదు సుశాంత్ సింగ్ వెళ్లిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నాను. కానీ అలాంటి అమాయకులు ఇక బాలీవుడ్లో బలి కాకూడదు. ఇబ్బంది పడుతున్న నటీనటులు, క్రియేటివ్ పీపుల్ నా ఈ పోస్ట్‌ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి’’ అంటూ ‘మీటూ బాయ్‌కాట్ సల్మాన్‌ఖాన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించారు అభినవ్ కశ్యప్. కాగా నో స్మోకింగ్, బాంబే వెల్వెట్, రమణ్ రాఘవ్, మన్మర్జియాన్.. ఇలా ఓ 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్. తన సోదరుడు అభినవ్, సల్మాన్ ఖాన్‌కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తాను స్పందించదలచుకోలేదని అనురాగ్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడటానికి మీడియావారు నాకు ఫోన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని అభినవ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందుకని తను చేస్తున్నవాటికి, చెబుతున్నవాటి గురించి నేను స్పందించలేను’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది – నటుడు వివేక్ ఒబెరాయ్ ‘‘సుశాంత్ తండ్రి కళ్లల్లో బాధ చూస్తుంటే భరించలేని విధంగా ఉంది’’ అంటూ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్వీటర్ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది అని వివేక్ చెబుతూ – ‘‘ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమా పరిశ్రమ అడుగులు వేయాలి కానీ ప్రతిభను నాశనం చేసే దిశగా కాదు. నా ఈ ప్రయాణంలో నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాను. ఆ బాధలు చెప్పి సుశాంత్ బాధని తగ్గించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మన ప్రయాణం చీకటిలో కొనసాగవచ్చు లేదా ఒంటరి ప్రయాణం కావొచ్చు. కానీ మరణం దానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కానే కాదు. సుశాంత్ తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది అభిమానుల గురించి ఆలోచించడం మానేశాడనుకుంటున్నాను. అందుకే ఈరోజు అతన్ని మనం కోల్పోయాం. అతని తండ్రి బాధ వర్ణనాతీతం. ఇక సుశాంత్ అక్క అయితే ‘వెనక్కి వచ్చెయ్’ అంటూ కన్నీటి పర్యంతం కావడం నన్ను కలచివేసింది. సుశాంత్ మరణం సినిమా పరిశ్రమకు ఓ మేలుకొలుపు లాంటిది’’ అన్నారు. – డి.జి.భవాని -
నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణ వార్త మొత్తం దేశాన్ని కదిలించింది. అతను ఒంటరిగా ఉన్నాడని.. నిరాశతో బాధపడుతున్నాడని నివేదికలు వెల్లడించాయియి. ఈ క్రమంలో సుశాంత్ మరణించిన రెండు రోజుల తరువాత పాత వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సుశాంత్ తనకు కేవలం ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ‘చాలా నిజాయితీగా చెప్తున్నాను. నాకు ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు’ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. (‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) ఈ క్రమంలో సుశాంత్ మాట్లాడుతూ.. ‘జనాలకు నాతో మాట్లాడటం ఇష్టం ఉండదు.. అయితే వారు మొదట నన్ను ఇష్టపడినట్లు నటిస్తారు. ఆ తరువాత నన్ను మర్చిపోతారు. నేను స్నేహితులను చేసుకోలేను. అంటే నాకు జనాలు అంటే ఇష్టం లేక కాదు. నేను వారిని నిజంగా ఇష్టపడుతున్నాను. కాని వారు నాతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపరు. మొదటిసారి వారు నన్ను ఇష్టపడుతున్నట్లు నటిస్తారు. కాని తర్వాత వారు నా కాల్స్ లిఫ్ట్ చేయరు’ అని తెలిపారు. బంధుప్రీతి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారసత్వం లేక టాలెంట్ వున్న నటుల పట్ల ఇండస్ట్రీ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Please don't miss. Carefully Listen what did Sushant Singh Rajput say about his friends in Bollywood. 😭😭😭💔💔#JusticeForSushantSinghRajput #BoycottKaranJoharGang #bollywoodnepotism #SonamKapoor #KaranJoharIsBULLY #SalmanKhan #BoycottFakeStars #Nepotism pic.twitter.com/aoFpo79Ue5 — Pushpendra Kulshreshtha (@iArmySupporter) June 16, 2020 -
నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) అకాల మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సుశాంత్ అభిమానులు, సినీ ప్రముఖులు, ఇతర పెద్దలు, సుశాంత్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో స్పందించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో పాతుకు పోయిన నటవారసత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన గాయాలు చాలా లోతైనవని (నా గాయాలు నా మాంసం కన్నా లోతు) గుర్తు చేసుకున్నారు. అయినా నిలదొక్కుకున్నాను. కానీ పాపం.. పిల్లవాడు (సుశాంత్) వల్ల కాలేదు. తట్టుకోలేకపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇకనైనా నేర్చుకుందామా.. వారి కలలు కల్లలు కాకుండా నిలబడదామా.. అంటూ ఉద్వేగ భరిత పోస్ట్ పెట్టారు. (సుశాంత్ అంత్యక్రియలు: నటుడి భావోద్వేగ పోస్ట్) ఈ సందర్భంగా కెరీర్ ఆరంభంలో ఎదురైన నెపోటిజం గురించి ప్రస్తావిస్తున్న సుశాంత్ వీడియోను కూడా ప్రకాశ్ రాజ్ షేర్ చేశారు. ఈ వీడియోలో 2017లో జరిగిన ఐఫా కార్యక్రమంలో తన ఆలోచనలను సుశాంత్ పంచుకున్నారు. నెపోటిజం సమస్య ప్రతిచోటా ఉంది. కానీ నిజమైన ప్రతిభకు ప్రోత్సాహం లభించకపోతే ఏదో ఒక రోజు మొత్తం పరిశ్రమ నిర్మాణం కుప్పకూలిపోతుందని సుశాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా గత ఆరు నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు ప్రశ్నల్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. #nepotism I have lived through this .. I have survived ... my wounds are deeper than my flesh ..but this child #SushanthSinghRajput couldn’t.. will WE learn .. will WE really stand up and not let such dreams die .. #justasking pic.twitter.com/Q0ZInSBK6q — Prakash Raj (@prakashraaj) June 15, 2020 -
ముసుగులు తొలగించండి
‘‘ఇక చాలు నీ మాటలు.. మనిషి పోయాక ఈ మొసలి కన్నీరు ఎందుకు? నెపోటిజమ్ జీర్ణించుకుపోయిన మనిషివి నువ్వు. నీ ముసుగుని తొలగించు. ఆలియా.. నువ్వు కూడా?’’ అంటూ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, కథానాయిక ఆలియా భట్‌లపై సోషల్ మీడియా వేదికగా పలువురు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి కారణం హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. ‘‘నువ్వు (సుశాంత్) ఒంటరితనం ఫీలవుతున్నావని, నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుంటుందని నేనో సందర్భంలో గ్రహించాను. అయితే ఏడాదిగా నీతో టచ్‌లో లేనందుకు ఇప్పుడు నన్ను నేను నిందించుకుంటున్నాను. ఇక ఎప్పటికీ ఇలా చేయకూడదనుకుంటున్నాను. నిన్ను మిస్ అయినందుకు నన్ను నేను తిట్టుకుంటున్నాను’’ అని కరణ్ ట్వీట్ చేశారు. అయితే ఇదంతా ఉత్తుత్తి బాధ అనేది పలువురి అభిప్రాయం. సినిమా నేపథ్యం లేని కుటుంబాన్నుంచి వచ్చిన సుశాంత్ సింగ్‌కి బాలీవుడ్లో వారసులకు దక్కినంత ప్రేమాభిమానాలు దక్కలేదని పలువురు ట్వీటర్లో పోస్ట్ చేశారు. పైగా సుశాంత్ హీరోగా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో ‘డ్రైవ్’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా విడుదల గత ఏడాది పలుమార్లు వాయిదా పడింది. కరోనాలాంటి మహమ్మారి కారణంగా థియేటర్ల మూత లేనప్పుడు గత ఏడాది ఈ సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేశాడు కరణ్ జోహార్. ‘‘అదే బాలీవుడ్లో సుశాంత్‌కి మంచి బ్యాగ్రౌండ్ ఉండి ఉంటే ఇలా చేసేవాడివా?’ అంటూ ఇప్పుడు పలువురు విరుచుకుపడ్డారు. కథానాయిక ఆలియా భట్ని కూడా విమర్శిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఓసారి ఆలియా పాల్గొన్నారు. అప్పుడు రణ్‌వీర్‌సింగ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ ధావన్‌లలో ఎవరు మంచి నటుడు? అని ఆలియాని కరణ్ అడిగితే, ‘సుశాంత్ అంటే ఎవరు?’ అంది. ఇద్దరూ నవ్వుకున్నారు కూడా. ఇక ఆదివారం సుశాంత్ మృతికి సంతాపంగా ‘‘నువ్వు మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లిపోయావ్. ఎంతో షాక్‌లో ఉన్నాను. మాటలు రావడంలేదు. నీ కుటుంబ సభ్యులకి, నిన్ను ప్రేమించేవారికి, నీ ఫ్యాన్స్‌కి సంతాపం ప్రకటిస్తున్నాను’’ అని ఆలియా ట్వీట్ చేసింది. అప్పుడు ‘సుశాంత్ ఎవరు న్నావు? ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్నావు’ అని మండిపడుతున్నారు. వాస్తవానికి రెండు మూడేళ్లుగా హిందీ పరిశ్రమలో ‘బంధుప్రీతి’ అనే వివాదం చాలా ఎక్కువగా సాగుతోంది. ‘నన్ను బాలీవుడ్లో జరిగే వేడుకలకు పెద్దగా పిలవరు’ అని ఓ సందర్భంలో సుశాంత్ సింగ్ అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. హిందీ పరిశ్రమలో తాను ఒంటరిని అనే భావనలో అతను ఉండిపోయాడని, డిప్రెషన్‌కి ఇదొక కారణం అయ్యుంటుందన్నది కొందరి అభిప్రాయం. ఇక కంగనా రనౌత్, తాప్సీ, హ్యూమా ఖురేషీ లాంటివాళ్లు ఈ బంధుప్రీతి గురించి బాహాటంగానే స్పందించారు. కంగనా అయితే కరణ్‌ని ఉద్దేశించి ‘బాలీవుడ్ మాఫియా, ‘ఫ్లాగ్ బ్యారర్‡ఆఫ్ నెపోటిజమ్’ (బంధుప్రీతిని ముందుండి నడిపించేవాడు), స్నూటీ అండ్ ఇన్‌టాలరెంట్ (ఇండస్ట్రీలోని స్టార్స్‌ను తప్ప బయటవాళ్లను భరించలేడు) అన్నారు. ‘‘సుశాంత్ సినిమాలను అవార్డు షోలకు ఎందుకు అనుమతించలేదు? ‘కాయ్ పోచె, ఎం.ఎస్. ధోని, చిచోరే’ వంటి అద్భుత సినిమాలు చేశాడు. కానీ ఎన్ని అవార్డులు ఇచ్చారు?’’ అని కూడా స్పందించారు కంగనా. ‘రంగీలా’ ఫేమ్ ఊర్మిళ అయితే ‘‘బంధుప్రీతి’ రూల్ చేస్తున్న ఈ ఇండస్ట్రీలో ప్రతిభను, హార్డ్‌వర్క్‌ని నమ్ముకుని నీలా ఒక గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇంత సాధించిన నువ్వు త్వరగా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరం’’ అని సుశాంత్ మరణం పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆయన గురించి మాటల్లో చెప్పలేను: రతన్ టాటా
ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా స్ఫూర్తివంతమైన విషయాలను యువతతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే పది లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. రతన్ టాటా ఎప్పుడూ ఏ విషయం చెబుతారా అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్‌టాటా తన బాల్యం, ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రెండవ భాగం ఇంటర్వ్యూలో మరి కొన్ని విషయాలు పంచుకున్నారు. (అలా మా బంధం బీటలు వారింది: రతన్ టాటా) 1991 లో జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా నుంచి టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్య వారసుడిగా రతన్ టాటా బాధ్యతలు అందిపుచ్చుకున్నారు. ఆ సమయంలో బంధుప్రీతిపై రతన్ టాటా ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే.. ‘‘నేను టాటా గ్రూప్‌లో చేరినప్పడు ఎలాంటి విమర్శలు లేవు. కానీ ఎప్పుడైతే టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి జేఆర్డీ టాటా వైదొలగాని నిర్ణయించుకున్నారో అప్పడు విమర్శలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే చైర్మన్ పదవికి కోసం ఆ సమయంలో ఎంతోమంది ఆశపడ్డారు. కానీ జేఆర్డీ.. నన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. దీంతో జేఆర్డీ బంధుప్రీతి కారణంగానే.. రతన్‌కు బాధ్యతలు అప్పజెప్పి తప్పు చేశారంటూ విపరీతమైన విమర్శలు వెలువడ్డాయి. విమర్శ అనేది ఆ కాలంలో వ్యక్తిగతంగా చేసేవారు. అయితే ఆ సమయంలో నేను ఎదురు దాడికి దిగలేదు. సంయమనం పాటించి నా పని ద్వారా నన్ను నేను నిరూపించుకోవడంపై దృష్టి సారించాను’’ అని వెల్లడించారు. (రతన్ టాటా అద్భుత రిప్లై) ఇక జేఆర్డీకీ తనకు మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘జేఆర్డీ నాకు తండ్రి, అన్న లాంటి వారు. అతన్ని సన్నిహితుడిగా కలిగి ఉండటం నా అదృష్టం. అతను గొప్ప గురువు. ఆయన గురించి మాటల్లో ఇంతకంటే ఏం చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా, రతన్ టాటా.. టాటా కుటుంబంలోని విభిన్న నేపథ్యాల నుంచి వచ్చారు. దాదాపు 50 ఏళ్ల పాటు టాటా కంపెనీకి నాయకత్వం వహించిన జేఆర్డీ టాటా అనంతరం తన వ్యాపార సామ్రాజ్య వారసుడిగా 1991లో రతన్ టాటాను నియమించారు. -
నెటిజన్ కౌంటర్‌కు సమాధానమిచ్చిన రానా
పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న తెలుగు కెరటం రానా దగ్గుబాటి. టాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల జెండా పాతిన ఈ దిగ్గజ నటుడు బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సాధించుకున్నాడు. ఆయన తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’. ఇది హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హీరో ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏనుగు ముందు నిల్చొని ఆవేశంతో ఊగిపోతున్న రానా లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఓ అభిమాని మాత్రం భల్లాలదేవపై సెటైర్ వేశాడు. గతంలో రానా ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో రానా మాట్లాడుతూ... ‘నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ, ఆ ఫలితాలు నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి’ అని పేర్కొన్నాడు. దీనికి సదరు నెటిజన్ కౌంటర్ వేస్తూ.. ‘ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది’ అని వ్యంగ్యంగా కామెంట్ వేశాడు. దీంతో ఈ హీరో తన ఆగ్రహాన్ని లోపలే అణచివేసుకుని ‘అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే’ అంటూ కూల్‌గా చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక రానా సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కాగా వీరికి సొంతంగా సురేశ్ బ్యానర్ కూడా ఉంది. ఇక ఆయన తాతయ్య దివంగత దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ మరిచిపోలేని బడా నిర్మాత. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ రానాకు స్వయానా బాబాయ్ అవుతాడని తెలిసిందే. (డిఫరెంట్ లుక్‌లో రానా) -
సలహాదారులుగా చుట్టాలొద్దు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: కచ్చితంగా ఆధారాలుంటేనే ఆరోపణలు చేయాలని, బంధువులను ఉద్యోగాల్లో పెట్టుకోవద్దని మంత్రి వర్గ సహచరులను ప్రధాని మోదీ కోరారు. మంత్రివర్గ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మీడియాతోగానీ, బహిరంగంగా గానీ అనవసర వ్యాఖ్యలు చేయవద్దని, కేవలం ఆధారాలున్న విషయాలపైనే ఆచూతూచి మాట్లాడాలని సూచించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో తమకు తెలిసిన వారిని, బంధువులను సలహాదారులుగా నియమించుకోవద్దని కోరారు. పాలన వేగంగా, సవ్యంగా సాగాలంటే కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రుల మధ్య సమన్వయం అవసరమన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రులు కేవలం కార్యదర్శుల స్థాయి అధికారులతో మాత్రమే కాకుండా, జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులకు కూడా సమాచారం అందించాలని కోరారు. దీనివల్ల అధికారులందరూ కూడా బృందంలో తామూ భాగమేనని భావించేందుకు వీలుంటుందన్నారు. అధికారులను ప్రోత్సహిస్తూ మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. మంత్రులంతా ఉదయం 9.30 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని, గతంలో చాలా సార్లు చెప్పినప్పటికీ ఈ సూచనను కొందరు పాటించడం లేదన్నారు. అలాంటి వారు ఇకపై ఆచరించాలన్నారు. మంత్రులు క్రమశిక్షణను పాటిస్తే ఉత్పాదకత, పని సామర్ధ్యము పెరుగుతుందన్నారు. సర్దార్ డ్యామ్‌ను చూసిరండి జలకళ సంతరించుకున్న సర్దార్ సరోవర్ జలాశయం అందాలను తిలకించాలని ప్రజలను మోదీ కోరారు. బుధవారం ఆయన డ్యామ్ ఫొటోలను, నర్మదా నదీ తీరంలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ఫొటోలను ట్విట్టర్లో ఉంచారు. గుజరాత్‌లోని కేవడియా ప్రాంతంలో నిర్మించిన సర్దార్ సరోవర్ జలాశయం నీటి మట్టం రికార్డు స్థాయిలో బుధవారం 134 మీటర్లకు చేరింది. -
‘అలా చేస్తే మా నాన్న శ్రమను కించపర్చనట్లే’
బాలీవుడ్లో హీట్ రైజింగ్ టాపిక్ అంటే బంధుప్రీతి అనే చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కుదిరినప్పుడల్లా ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ బంధుప్రీతికి కొత్త భాష్యం చెప్పారు. ఆర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పించ్ కార్యక్రమానికి హాజరయ్యారు సోనమ్ కపూర్. ఈ సందర్భంగా తనను విమర్శిస్తూ వచ్చిన ఓ ట్వీట్ గురించి మాట్లాడారు. ఎవరో ఓ వ్యక్తి ‘పదేళ్ల నుంచి పరిశ్రమలో ఉంటున్నావ్.. ఇప్పటికి నీకు నటించడం రాద’ని విమర్శిస్తూ నెపోటిజమ్ అని హ్యాష్‌టాగ్‌తో ఓ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘పదేళ్ల నుంచి కాదు.. 11 ఏళ్ల నుంచి నేను పరిశ్రమలో ఉంటున్నాను. ఇంతకాలం నుంచి మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు.. అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. బంధుప్రీతి అనే పదానికి ఈ రోజు అసలైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. బంధుప్రీతి అనగానే అది ఓ వ్యక్తికి చెందినదిగా భావిస్తారు. కానీ అసలు అర్థం ఏంటంటే ఓ వ్యక్తితో ఉన్న సంబంధం వల్ల మీకు మంచి ఉపాధి దొరకడం. కానీ జనాలు తమ స్వలాభం కోసం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని.. అవతలివారిని కించపరుస్తున్నారు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘మా నాన్న ఓ ప్రముఖ కుటుంబం నుంచి రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నారు. ఇదంతా ఆయన కుటుంబం కోసం.. పిల్లల కోసమే చేస్తున్నారు. మా కోసం ఆయన పడిన శ్రమను మేం సరిగా వినియోగించుకోకపోతే.. ఆయన కష్టానికి మేము మర్యాద ఇవ్వనట్లే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది వారి పిల్లల కోసమే కదా’ అంటూ చెప్పుకొచ్చారు. సోనమ్ తొలిసారి తండ్రి అనీల్ కపూరతో కలిసి ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా లగా చిత్రంలో నటించారు. -
‘అలాగైతే నా బిడ్డను సముద్రంలో తోసేస్తా’
ముంబై : తన అభిప్రాయాలను బోల్డ్‌గా, సూటిగా చెప్పడంలో క్వీన్ కంగనా రనౌత్ ముందుంటారు. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ స్టార్ కిడ్స్ను పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపుతారని గతంలో కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై చర్చకు తెరలేపాయి. మణికర్ణిక మూవీ, హృతిక్ రోషన్‌తో వివాదం, అలియా భట్‌పై వ్యాఖ్యలు ఇలా ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడిన కంగనా సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. ఇక తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర అంశాలు ముచ్చటించారు. బంధుప్రీతిపై తరచూ నిప్పులుచెరిగే కంగనా రనౌత్‌ను ఓ 20 ఏళ్ల తర్వాత మీ బిడ్డ తనను నటుడు లేదా, దర్శకుడు కావాలనుకుంటున్నట్టు చెబితే మీరు సహకరిస్తారా లేదా అని ప్రశ్నించగా, తాను అలా చేస్తే తను మంచి దర్శకుడిగా ఎదిగే అవకాశం యాభై శాతమేనని, ఓ తల్లిగా తాను అతడిపై శ్రద్ధ కనబరిస్తే తనకు ఇష్టమైన దారిలోనే వెళ్లేలా వ్యవహరిస్తారను..అప్పుడే తను ఎక్కడున్నా, ఎలా ఉన్నా సంతృప్తికరంగా ఉంటాడని చెప్పుకొచ్చారు. అయితే తన బిడ్డను అసాధారణ వ్యక్తిగా ఉండాలని తాను కోరుకుంటే మాత్రం అతడిని సముద్రంలో తోసేస్తానని, అతడు అందులో మునకేస్తాడా ఎదురీదుతాడో చూస్తానని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదురీది ఎదిగేలా పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఇక గత నాలుగేళ్లుగా తన సోదరుడు పైలట్ కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, ఉద్యోగం కోసం వేచిచూస్తున్నా తానెప్పుడూ అతని కోసం ఎవరికీ ఫోన్ చేయలేదని, సహకరించిందీ లేదని బంధుప్రీతిపై తన ఉద్దేశాన్ని తేల్చిచెప్పారు. -
‘కరణ్ వాళ్ల గురించే మాట్లాడతారు’
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి ఈసారి దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌ను టార్గెట్ చేశారు. కాఫీ విత్ కరణ్ షోలో ఆయన ఉత్తమ హీరోయిన్ల లిస్ట్‌లో కంగన పేరును ప్రస్తావించకపోవడంపై రంగోలి మండిపడ్డారు. గతంలో జరిగిన ఓ ఎపిసోడ్లో కరణ్ బెస్ట్ హీరోయిన్ ఎవరంటూ కొందరి పేర్లు చెప్పారు. అయితే వారిలో కంగనా పేరు లేదు. దాంతో ఓ నెటిజన్ కరణ్‌ను ఉద్దేశిస్తూ ‘ఆలియా భట్, దీపికా పదుకొణె, అనుష్క శర్మ.. ‘కాఫీ విత్ కరణ్’ షో రాపిడ్ ఫైర్‌లో ఉత్తమ నటీమణుల జాబితాలో కంగన లేరు. ఎందుకంటే కంగన వీళ్లందరి కన్నా ఉత్తమ నట అని కరణ్‌కు ముందే తెలుసు. అంతేగా కరణ్?’ అని సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు. దీన్ని చూసిన రంగోలి కరణ్ బంధుప్రీతి చూపిస్తారని విమర్శించారు. ‘మూవీ మాఫియా అంటే ఇదే. కరణ్ జోహార్ పలు జాతీయ అవార్డులు అందుకున్న నటి గురించి మాట్లాడరు. ఆయన పరిచయం చేసిన బంధువుల పిల్లల గురించి మాత్రమే మాట్లాతారు’ అని రంగోలి ఎద్దేవా చేశారు. కంగన కూడా ఇటీవల నటి ఆలియా భట్‌ను విమర్శించారు. ఆమె కరణ్ చేతిలో కీలుబొమ్మలా మారారని, ఆయన చెప్పిందే చేస్తుంటారని ఆరోపించారు. దీనికి ఆలియా స్పందిస్తూ.. కంగన ఆ రీతిలో వ్యాఖ్యలు చేసేలా తను ఎప్పుడూ ప్రవర్తించలేదని అన్నారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చర్చించుకుంటామని, అంతేకానీ దీని గురించి మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదని చెప్పారు. This is movie mafia, he #Karanjohar talks about acting without mentioning multiple national award winner only to create perception about his own preffered Nepo kids... 😆 https://t.co/iYfePs2Nk6 — Rangoli Chandel (@Rangoli_A) February 25, 2019 -
అవును మేము అండర్డాగ్సే : అనుష్క శర్మ
అటు నటిగానూ.. ఇటు నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తనని తాను అండర్డాగ్ అనడమేంటని ఆశ్చర్యపోకండి..నెపోటిజమ్(బంధుప్రీతి) ప్రభావం ఔట్సైడర్స్పై ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. అనుష్క శర్మ ప్రస్తుతం సూయి దాగా మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘ నాణేనికి రెండు వైపులు ఉంటాయి కదా. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలా రెండు కోణాలు ఉంటాయి. నెపోటిజమ్ విషయంలో స్టార్ కిడ్స్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అవును ఇండస్ట్రీ ఔట్సైడర్స్గా మేము అండర్డాగ్సే. కానీ స్టార్ కిడ్స్‌పై ఉన్నంత ఒత్తిడి మాపై ఉండదు. అంచనాలు కూడా ఉండవు. ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే చాలు ఇక్కడ నిలదొక్కుకోవడం సులభమే. కానీ ఆ ఒక్క అవకాశం వచ్చేదాకా ఓపికగా వేచి చూడాలి. స్టార్ కిడ్ అయినా కాకున్నా ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. నా వరకైతే నెపోటిజమ్ గురించి మాట్లాడమంటే సమయాన్ని వృథా చేసుకోవడంగానే భావిస్తాను’ అంటూ నెపోటిజమ్‌పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అనుష్క శర్మ. కాగా ఆర్మీ కుటుంబంలో జన్మించిన అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. గతేడాది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లాడిన ఈ భామ అటు పర్సనల్ లైఫ్‌ను ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం షారూఖ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జీరో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్
అర్జున్ రెడ్డి హీరోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్లోచేరిన ఈ యంగ్ హీరో ఈ శుక్రవారం నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నాడు విజయ్. అందుకే తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నాడు. తమిళనాట వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్న విజయ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఓ తమిళ జర్నలిస్ట్ సినీరంగంలో వారసత్వంపై అడిగిన ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చాడు. ‘సినిమా అంటే వ్యాపారం కూడా.. ఎవరూ ఊరికే డబ్బులు పెట్టరు. నిర్మాత తను పెట్టిన ఖర్చును తిరిగి ఎలా రాబట్టుకోవాలో లెక్కలేసుకొనే సినిమా చేస్తాడు. అందుకే వారసులైతే ఫ్యాన్స్ కారణంగా సినిమా కొంత సేఫ్ అవుతుంది. కొత్త వారితో తీస్తే రిస్క్ ఎక్కువ’ అంటూ వారసత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతేకాదు ఇండస్ట్రీలో బయటి వ్యక్తులు నిలదొక్కుకోవటం చాలా కష్టమన్న విజయ్, తన లాంటి ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ కాగలుగుతారని అది తమ అదృష్టమని తెలిపాడు. సినీరంగంలోకి రావాలనకున్నప్పుడు తన తండ్రి తనని ఈ విషయంపై హెచ్చరించాడని తెలిపాడు. ‘సినిమా హీరో కావడం కన్నా సివిల్స్ పాస్ అవ్వడం ఈజీ ప్రతీ ఏటా 400 మంది అవకాశం ఉంటుంది. కానీ సినిమాల్లో ప్రూవ్ చేసుకోవటం అంతా ఈజీ కాద’ని చెప్పారని తెలిపాడు. -
బంధుప్రీతి ఉంది
గతేడాది ‘నెపోటిజమ్ (బంధుప్రీతి) రాక్స్’ ఇష్యూలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, నటుడు సైఫ్ అలీఖాన్, నటుడు వరుణ్ ధావన్‌లకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు, కొంత సపోర్ట్ లభించిన విషయం గుర్తుండే ఉంటుంది. రీసెంట్గా వరుణ్ ధావన్ ఈ విషయంపై స్పందించారు. ‘‘అవును.. బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఒక భాగంగా ఉంది. కానీ బయటి నుంచి వచ్చే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను సక్సెస్‌ఫుల్‌గా వినియోగించుకునే వారు ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. ఎవరో ఎందుకు? మా నాన్నగారు (డేవిడ్ ధావన్) బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. మా నాన్న కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు ఇంకా గుర్తు ఉంది’’ అని చెప్పుకొచ్చారు వరుణ్« దావన్. ఇక సినిమాల విషయానికొస్తే... శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా నటించిన ‘సూయి దాగా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’లో ఓ పాత్ర పోషిస్తున్నారు వరుణ్. -
ఎంట్రీ ఈజీ..ఎగ్జిట్ కూడా ఈజీయే
నెపోటిజం (బంధుప్రీతి) అనే టాపిక్ ఏ ఇండస్ట్రీలో అయినా చాలా కామన్. కానీ కేవలం దాని వల్లే ఇండస్ట్రీలో మనం నిలబడం అంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. తనయుడు కరణ్ డియోల్‌ను ‘పల్ పల్ దిల్ కే పాస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు సన్నీ డియోల్ . నెపోటిజమ్ గురించి సన్నీ మాట్లాడుతూ – ‘‘ప్రతిసారి ఇదే కొశ్చన్‌ను ఎందుకు అడుగుతారో అర్థం కాదు. నెపోటిజమ్ వల్ల వేరే వాళ్లు అవకాశాలు కోల్పోతున్నారనుకోవడం పొరబాటు. ఈరోజు నేనిలా ఉన్నానంటే అది కేవలం మా నాన్న పరిచయం చేయడం వల్లే అనుకోవడం సరి కాదు. ఫస్ట్ సినిమా వరకే బ్యాగ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన ప్రతిభ, కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ లేకపోతే ఎంత ఈజీగా ఎంటర్ అయ్యామో అంతే ఈజీగా ఇండస్ట్రీ నుంచి ఎగ్టిట్ అయిపోతాం’’ అన్నారు. -
అగ్ర దర్శకుడి పశ్చాత్తాపం
న్యూయార్క్: ఐపా అవార్డుల వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ దర్శకుడు కరన్ జోహార్ విచారం వ్యక్తం చేశారు. బంధుప్రీతి, హీరోయిన్ కంగనా రౌనత్ గురించి కరణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వివరణయిచ్చారు. బంధుప్రీతి గురించి తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో బంధుప్రీతి, కంగనా గురించి మాట్లాడబోనని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. ‘ఆశ్రిత పక్షపాతం పట్ల నాకు నమ్మకం లేదు. ప్రతిభతోనే సినిమా రంగంలో రాణించగలం. టాలెంట్, హార్డ్ వర్క్, దృఢవిశ్వాసంతోనే అందరి మన్ననలు పొందగలం. ఐపా అవార్డుల వేడుకలో బంధుప్రీతి గురించి నేను మాట్లాడింది జోక్ మాత్రమే. కాకపోతే అసందర్భంగా దీని గురించి ప్రస్తావించడంతో అందరూ అపార్థం చేసుకున్నారు. దీనికి విచారం వ్యక్తం చేస్తున్నా’నని కరణ్ పేర్కొన్నారు. ఇదే వివాదంలో చిక్కుకున్న హీరో వరుణ్ ధావన్ నిన్న ట్విటర్ ద్వారా క్షమాపణ చెప్పారు. ఐఫా అవార్డుల వేడుకకు కంగనా రౌనత్ హాజరుకాకపోవడంతో ఆమెపై కరణ్ జోక్ పేల్చారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం తనకులేదని, బ్యాడ్ జోక్ వేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు. -
ఆమెతో నేను విసిగిపోయాను: డైరెక్టర్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్-కరణ్ జోహార్ మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న కోల్డ్‌వార్ సమసిపోయిందని భావిస్తే అది పొరపాటే. కాఫీ విత్ కరణ్ టీవీ షోలో ఆయన ఎదురుగానే కంగన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి కరణ్ బాలీవుడ్లో నిలువెత్తూ ప్రతీక అంటూ కడిగిపారేసింది. ఈ విమర్శలు, ఆరోపణలపై మొదట మౌనం పాటించిన కరణ్ ఇటీవల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రసంగిస్తూ స్పందించాడు. 'ఆమె నా షో అతిథి. ఆమె ఏం చెప్పినా వినాల్సిందే. ఆమెకు ఒక అభిప్రాయం కలిగి ఉండే హక్కు ఉంది. ఆమె నన్ను 'ఆశ్రిత పక్షపతానికి ప్రతీక' అంటూ నిందించింది. ఈ పదానికి ఆమెకు అర్థం తెలుసా? నేను ఏమైనా నా మేనల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లు, కజిన్స్‌తో మాత్రమే సినిమాలు తీస్తున్నానా? నేను 15 మంది దర్శకులను బాలీవుడ్ పరిచయం చేశాను కదా? వారికి ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తరుణ్ మన్సుఖనీ, పునీత్ మల్హోత్రా, శకున్ బత్రా, శశాంక్ ఖైతాన్ వంటివాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాను కదా. వారికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. వారికి ఒక వేదిక ఇచ్చి నిలబడేందుకు దోహదం చేశాను. ఇది ఆశిత్ర పక్షపాతానికి పూర్తి విరుద్ధమే కదా' అని కరణ్ పేర్కొన్నారు. ఆమె తీరుతో తాను విసుగెత్తిపోయానంటూ కరణ్ మండిపడ్డాడు. 'తాను మహిళనని, బాధితనని కంగన తరచూ చెప్తూపోతుండటం చూసి నేను విసుగెత్తిపోయాను. అస్తమానం నేను బాధితురాలినంటూ.. నన్ను సినీ పరిశ్రమ బెంబేలెత్తించిందని చెప్పడం సరికాదు. సినీ పరిశ్రమ అంత చెడ్డదైతే.. దానిని వదిలేయ్' అంటూ కరణ్ విరుచుకుపడ్డాడు. కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ 'మూవీ మాఫియా'ను నడుపుతున్నాడని, అతనికి ఆశ్రితపక్షపాతం, అసహనం ఎక్కువ అని, సినీ వారసులకే పెద్దపీట వేస్తాడని తీవ్రస్థాయిలో కంగన విమర్శలు చేసింది. ఇదంతా షోలో భాగం అనుకున్నారు చాలామంది కానీ, ఈ విమర్శలతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరాయని తెలుస్తోంది.