
వరుణ్ ధావన్
గతేడాది ‘నెపోటిజమ్ (బంధుప్రీతి) రాక్స్’ ఇష్యూలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, నటుడు సైఫ్ అలీఖాన్, నటుడు వరుణ్ ధావన్‌లకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు, కొంత సపోర్ట్ లభించిన విషయం గుర్తుండే ఉంటుంది. రీసెంట్‌గా వరుణ్ ధావన్ ఈ విషయంపై స్పందించారు. ‘‘అవును.. బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఒక భాగంగా ఉంది. కానీ బయటి నుంచి వచ్చే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను సక్సెస్‌ఫుల్‌గా వినియోగించుకునే వారు ఇండస్ట్రీలో రాణించగలుగుతారు.
ఎవరో ఎందుకు? మా నాన్నగారు (డేవిడ్ ధావన్) బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. మా నాన్న కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు ఇంకా గుర్తు ఉంది’’ అని చెప్పుకొచ్చారు వరుణ్« దావన్. ఇక సినిమాల విషయానికొస్తే... శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా నటించిన ‘సూయి దాగా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’లో ఓ పాత్ర పోషిస్తున్నారు వరుణ్.
Comments
Please login to add a commentAdd a comment