
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతిసనన్ డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం ఈ రూమర్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్-కృతిసనన్‌ల రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బేఢియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాలిటీ షోకు వరుణ్, కృతిసనన్ గెస్టులుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిస్తూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పదుకోణెతో షూటింగ్‌లో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చేశాడు. ఇతడి మాటలకు కృతి కూడా సిగ్గుపుడతూ నవ్వేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఓ షోలో కృతి ప్రభాస్‌కు కాల్ చేయడం, ఆదిపరుష్ టీజర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో క్లోజ్‌గా ఉండటం వంటివి చూసి వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బీటౌన్‌లో జోరుగా టాక్ వినిపిస్తుంది.
Whaaaaaaattt 😯😁🥰💖...... Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe
— Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022