సుశాంత్‌ జీవితంతో శశాంక్‌ | Shashank First Look Poster Release | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ జీవితంతో శశాంక్‌

Published Sat, Aug 29 2020 1:57 AM | Last Updated on Sat, Aug 29 2020 2:04 AM

Shashank First Look Poster Release - Sakshi

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణ వార్త బాలీవుడ్‌ను కుదిపేసింది. ఊహించని షాక్‌లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్‌ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌?) ప్రకటించింది బాలీవుడ్‌. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్‌ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది.

ఓ యంగ్‌ సినిమా స్టార్‌ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్‌ సింగ్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement