Sushanth Singh Rajputh
-
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు బిగ్ రిలీఫ్
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!) రియాపై నమోదైన సెక్షన్ 27-ఎ అంటే ఇదే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్‌కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది. అప్పట్లో జరిగింది ఇదీ 2020లో కలకలం రేపిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసు కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ చార్జీషీట్లో పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు నెలరోజుల పాటు జైల్లో ఉన్న రియా బెయిల్‌పై విడుదల అయింది. (ఇదీ చదవండి: జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్) -
సుశాంత్‌ది హత్యే!.. ఇప్పటికైనా న్యాయం చేయండి : సుశాంత్ సోదరి ఆవేదన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల కారణాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోస్టుమార్టం చేసిన బృందంలోని రూప్‌కుమార్ షా అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని పేర్కొన్న రూప్‌కుమార్.. పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సుశాంత్ మరణంపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సుశాంత్ సోదరి ట్వీట్ చేసింది. రూప్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్‌షాట్స్‌లో జోడించి.. సుశాంత్ కేసును సీబీఐ విచారణ జరిపి నిజనిజాలు ఏంటో బయటకు వెల్లడిస్తారని ఎప్పటినుంచో మేం ఎదురుచూస్తున్నాము. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 2020 జూన్14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ మరణించిన సంగతి తెలిసిందే. If there is an ounce of truth to this evidence, we urge CBI to really look into it diligently. We have always believed that you guys will do a fair investigation and let us know the truth. Our heart aches to find no closure as yet. 🙏 CBI Make SSRCase TimeBound pic.twitter.com/g58mj2F37q — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 We have to make sure safety of RoopKumar Shah is insured. 🙏 CBI Make SSRCase TimeBound @narendramodi @AmitShah #SushantSinghRajput https://t.co/suY8sCuwrU — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 -
కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్
ముంబై: బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, లేదంటే వారెంట్లు పంపుతానంటూ కోర్టు పరోక్షంగా బెదిరిస్తోందని, కోర్టుపై నమ్మకం పోయిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్ అక్తర్ గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. దీంతో ఎట్టకేలకు సోమవారం కంగన కోర్టుకొచ్చారు. బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్ ఒకటిన విచారించనుంది. -
సుశాంత్‌కి న్యాయం జరగాలి!
జూన్ 14.. 2020.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తుది శ్వాస విడిచిన రోజు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ చనిపోయి జూన్ 14కి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్‌కి అవకాశాలు రాకుండా చేసి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మృతిపై ముంబై పోలీసులే కాకుండా బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం, బెయిల్ మీద బయటకు రావడం తెలిసిందే. సుశాంత్ మరణించి ఏడాది పూర్తయినా కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘వియ్ మిస్ యు’, 'JusticeForSushantSinghRajput' అని ట్రెండ్ చేశారు. వెబ్సైట్ ప్రారంభం... సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత వివరాలతో www.ImmortalSushant.com పేరుతో వెబ్సైట్ ఆరంభమైంది. సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్లో సుశాంత్ జీవిత విశేషాలు, సినిమాల వివరాలు, ఆయన వీడియోలు, ఫోటోలు ఉంటాయి. నీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి – అంకితా లోఖండే సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యా¯Œ ్స చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాశారు. ‘పవిత్ర్∙రిష్తా’ సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత రియా చక్రవర్తిని ప్రేమించారు సుశాంత్ సింగ్. ఇంకా సుశాంత్‌తో సినిమాలు చేసినవారు, అతని కుటుంబ సభ్యులు కూడా ట్వీట్ చేశారు.| సహాయం, సలహా లేదా నవ్వు.. ఇవి నాకెప్పుడు కావాలన్నా నువ్వు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నాతో ఉన్నావు. ఈ నటనా ప్రపంచానికి నీతోనే (సారా తొలి చిత్రం ‘కేదార్నాథ్’లో సుశాంత్ హీరో) పరిచయం అయ్యాను నేను. కలలు నిజమవుతాయనే నమ్మకాన్ని నాలో కలిగించిన నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఈ మండుతున్న సూర్యుణ్ణి, వెలుగుతున్న చంద్రున్ని, ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూస్తున్న ప్రతిసారీ నువ్వు మాతోనే ఉన్నావని మాకు అనిపిస్తుంటుంది. – సారా అలీఖాన్ నీ ప్రశ్నలు, మనం మాట్లాడుకున్న సంభాషణలతో పాటు నిన్ను కూడా మిస్ అవుతున్నాను. నాకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఊహల్లో ఉన్న ప్రశాంతత నీకు దొరికిందనే ఆశిస్తున్నాను. – భూమీ పెడ్నేకర్ మన జీవితాలను రెండు భాగాలుగా చూసే కొన్ని çఘటనలు ఉంటాయి. సుశాంత్ మరణం మా జీవితాల్లో అలాంటిదే. మా కుటుంబసభ్యుల జీవితాలు సుశాంత్ మరణానికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. జీవించడానికి సంపాదించుకుంటున్నాం, మా పెద్దలను బాగానే చూసుకుంటున్నాం. ఇలా కొన్ని సాధారణ పనులు అందరి జీవితాల్లో జరిగినట్లుగానే మాకూ జరుగుతున్నాయి. కానీ మా అందరి ఆలోచనల్లో భర్తీ కానీ ఏదో శూన్యత దాగి ఉంది. అది మా జీవితాలను మార్చివేసింది. సుశాంత్ చాలామందికి దానాలు చేశాడు – సుశాంత్ బావ విశాల్ కృతి. జూన్ నెల అంతా పర్వత ప్రదేశాల్లో ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. అక్కడ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవు. నా సోదరుడికి చెందిన జ్ఞాపకాలను ఆ నిశ్శబ్ద వాతావారణంలో నెమరువేసుకుంటాను’’ అని ఈ ఏడాది మే 26న సుశాంత్‌సింగ్ సోదరి శ్వేతాసింగ్ కృతి ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు – శేఖర్ సుమన్ ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును త్వరితగతిన పూర్తి చేయమని సంబంధిత అధికారులను, ఏజెన్సీలను కోరుకుంటున్నాను. అనుమానాస్పద రీతిలో సుశాంత్ మనకు దూరమై ఏడాది అవుతోంది. ఓ మంచి వ్యక్తి సమాజంలోని కొన్ని కారణాల్ల ఒత్తిళ్లకు లోనయ్యాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని నమ్ముతున్నాను. అతని కేసు విషయంలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతోంది? కేసును ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇలా సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ జవాబులు ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ సుమన్. నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు మాకు దూరమయ్యావన్న నిజాన్ని ఇంకా మర్చిపోలేకపోతు న్నాను. కాలం కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుందని కొందరు అన్నారు. కానీ నా కాలం, సర్వస్వం నువ్వు. నాకు తెలుసు.. నువ్వొక గార్డియన్ ఏంజిల్లా నీ టెలిస్కోప్ కళ్ళతో నన్ను చూస్తూ, కాపాడుతూనే ఉంటావని! నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళతావని ప్రతిరోజూ ఎదరుచూస్తూనే ఉన్నాను. అన్నిచోట్లా వెతుకున్నాను. నీ గురించి ఇది రాస్తున్నప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో చెప్పలేను. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. నా జీవితంలో నెలకొని ఉన్న శూన్యం భర్తీ చేయలేనిది. – రియా చక్రవర్తి మన లుక్‌టెస్ట్ కోసం తొలిసారి నేను నిన్ను చూశాను. ఆలోచనల పరంగా రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులం మనమని అనుకున్నాను. తర్వాత మనం ఇద్దరం కలిసి చేసిన ఓ సినిమా మన ఇద్దరి ప్రపంచాల్లో ఉన్న చాలా సంగతులు ఒకటేనని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు లేవని బాధగా ఉంది. నువ్వు దూరమవ్వడాన్ని నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నువ్వింకా మా మధ్యనే ఉన్నావనే అనుకుంటున్నాను. – కృతీసనన్ -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్
-
యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్
ముంబై : బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఓ యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చారు. అతడి యూట్యూబ్ ఛానల్లో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు 500 కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బీహార్‌కు చెందిన సిద్ధిఖీ అనే సివిల్ ఇంజనీర్‌పై కేసు నమోదైంది. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో సంబంధం ఉందంటూ తనపై ఫేక్ వార్తల్ని ప్రచారం చేశాడని అక్షయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సుశాంత్ కేసుతో అక్షయ్‌ని ముడిపెడుతూ సిద్ధిఖీ పలు వీడియోలు చేశాడు. సుశాంత్ ధోనీ లాంటి పెద్ద సినిమాలు చేయటం అక్షయ్‌కు ఇష్టం లేదని, అక్షయ్.. ఆధిత్య ధాక్రే, ముంబై పోలీసులతో పలుమార్లు రహస్య సమావేశాలు జరిపారని ఆరోపిస్తూ ఓ వీడియో. ( తల్లి రాలేదని గుండెలవిసేలా ఏడ్చిన మోనాల్ ) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కెనడాకు పారిపోవటానికి అక్షయ్ సహాయం చేశాడంటూ మరో వీడియో చేశాడు. ఇలా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు చేయటం ద్వారా సిద్ధిఖీ యూట్యూబ్ ఛానల్ ఒక్క సారిగా ఫేమస్ అయిపోయింది. నాలుగు నెలల కాలంలో దాదాపు 2 లక్షల సబ్స్క్రైబర్లతో పాటు 15 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుమారుడ్ని సుశాంత్ కేసులోకి లాగి గతంలో ఇతడు ఓ సారి జైలు పాలయ్యాడు. -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
రియాకు బెయిలు..
-
మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి పలువురి పేర్లను వెలువరించింది. అందులో దీపికా పదుకొనే, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే వారిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా వారు సరదగా మాట్లాడుకొనే అనేక కోడ్ లాంగ్వేజ్ల గురించి వివరించారు. 2017లో వారి వాట్సాప్ చాట్ గురించి ప్రశ్నించగా వారు వీడ్, మాల్, డబ్ అనే పేర్లతో సిగరెట్లను పిలుచుకుంటామని తెలిపారు. ఇరువురిని వేరువేరుగా ప్రశ్నించగా వారిద్దరూ కూడా సరైన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా ఏం ఏం కోడ్ భాషలో మాట్లాడుకుంటారు అని ప్రశ్నించగా తాము పన్నీర్, క్విక్కర్, మ్యారేజ్ అనే కోడ్‌లో మాట్లాడుకుంటామని దీపికా తెలిపింది. పన్నీర్ అనే పదాన్ని చాలా సన్నగా ఉండేవారి కోసం ఉపయోగిస్తామని, క్విక్కర్ అనే పదాన్ని షార్ట్ టర్మ్ రిలేషన్షిప్లో కోసం, మ్యారేజ్ అనే పదాన్ని లాంగ్‌టర్మ్ రిలేషన్షిప్లో ఉండే వారి కోసం ఉపయోగిస్తామని దీపికా తెలిపింది. అయితే వారి సమాధానాలతో ఎన్సీబీ అధికారులు తృప్తి చెందారని, వారికి త్వరలోనే ఈ డ్రగ్స్ కేసు నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్? -
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంతమందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకొని వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. విచారణలో రియా వెల్లడించిన కొన్ని విషయాల ఆధారంగా కొంతమంది హీరోయిన్లు రకుల్, దీపికా పదుకొణే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ వంటివారికి ఎన్సీబీ బృందం విడివిడిగా విచారించడం మొదలుపెట్టింది. అయితే వీరిని విచారించిన అనంతరం బాలీవుడ్ భామలకు ఊరట లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లకు ఎన్సీబీ దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించారు. 2017 వాట్సప్ చాట్‌లో దీపికా, ఆమె మేనేజర్ వాల్, మాల్, వీడ్, హాష్, డూంబ్ అనే పదాలను ఉపయోగించారని ఎన్సీబీ విచారణలో వెల్లడయ్యింది. అయితే అవి వివిధ రకాల సిగరెట్ల కోసం సరాదాగా కోడ్‌తో పిలుచుకున్నామని దీపికా, ఆమె మేనేజర్ విచారణలో తెలిపినట్లు తెలిసింది. . స్లిమ్ సిగరెట్స్ కోడ్‌గా హ్యాష్, మందపాటి సిగరెట్లకు కోడ్‌గా వీడ్, తక్కువ నాణ్యత గల సిగరెట్లను మాల్ ఇలా పలు రకాలుగా వారు పిలుచుకునే వారని తెలిపారు. దీపికా, ప్రకాశ్‌లను వేర్వేరు గదులలో ఉంచి విచారించగా, వారి ఇచ్చిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని వీటితో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందినట్లు ఒక అధికారి తెలిపారు. మరి కొద్ది రోజులలో వీరికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పారు. అదే జరిగితే ఇక బాలీవుడ్ భామలకు డ్రగ్స్ కష్టాలు తప్పినట్లే. చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు? -
దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మొదలైన వివాదం చిత్రపరిశ్రమలో పెను దుమారాన్ని రేపుతోంది. మొదట నెపోటిజం చుట్టూతిరిగిన కథఅంతా.. డ్రగ్స్‌వైపు మళ్లింది. ప్రస్తుతం విచారణ అంతా సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి వాంగ్మూలం చుట్టు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె వెల్లడించిన పేర్ల ప్రకారం.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్‌లకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనెకు కూడా నోటీసులు పంపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీపికపై కక్షసారింపు చర్యగా ఈ కేసులో ఇరికించారనీ, సుశాంత్ ఆత్మహత్య కేసులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు డ్రగ్స్ కేసు తెరపైకి తీసుకువచ్చారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. (రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు) అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 25న దేశ వ్యాప్త బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే దీపికతో పాటు ఇతర నటీమనుల పేర్లును డ్రగ్స్ కేసు జాబితాలో చేర్చారని సోషల్ మీడియా వేదికగా పలువురు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు దేశంలో ఆగ్రహావేశాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్ రణరంగాన్నే తలపించింది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణాకం ఏకంగా సభ్యుల సస్పెన్సన్‌కు దారితీసింది. అంతేకాకుండా బిల్లులను ఉపసంహించుకోవాలని కోరుతు విపక్ష పార్టీలు సమావేశాలను సైతం బహిష్కరించాయి. (డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు) ఈ క్రమంలోనే ఈనెల 25(శుక్రవారం) దేశ వ్యాప్తంగా బంద్‌కు అఖిల భారత రైతు కూలీసంఘం పిలుపునివ్వగా దీనికి దేశంలోని రైతు సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని బంద్‌పై పడనీయకుండా కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా రెండు రోజుల ముందు నోటీసులు జారీచేశారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా దృష్టిని సైతం మళ్లించే విధంగా బీజేపీ పెద్దలు రచించిన వ్యూహంలో దీపికను పావుగా ఉపయోగించుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 25న జరిగే బంద్‌ను ఏమాత్రం కవర్ చేయకుండా మీడియా మొత్తం దీపిక చుట్టే తిరుగుతుందని పోస్టులు పెడుతున్నారు. దీపికపై ఎందుకింత కుట్రఅని నిలదీస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ దీపిక వర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుదారులు చేసిన దాడికి నిరసనగా అక్కడి విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొందరు దీపిక చర్యలను సమర్థించగా.. బీజేపీ పెద్దలు మాత్రం విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ఆమెకు జారీచేసిన నోటీసులు జేఎన్‌యూ సందర్శనకు కక్షసారింపేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులు ఇంకా పలువురు నటీమనులు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) దీనిపై సీనియర్ నటీ నగ్మా తాజాగా ట్విటర్ వేదికగా స్పందించింది. డ్రగ్స్ కేసులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయని, కంగనా రనౌత్‌కు ఎందుకు నోటీసులు పంపడంలేదని ప్రశ్నించారు. తాను డ్రగ్స్‌కు బానిసగా మారాను అంటూ ఓ టీవీషోలో తానే స్వయంగా ప్రకటించిందని అలాంటప్పుడు కంగనాను ఎందుకు అరెస్ట్ చేయరని నగ్మా నిలదీసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. అదే అనుకూలంగా మాట్లాడినప్పుడు తప్పు చేసినా సరే, వారికి ఎలాంటి శిక్ష ఉండబోదని ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శనాస్గ్రాలు సందించింది. ఇక తాజా వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సైతం స్పందించారు. ‘ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఓవైపు భారత్ బంద్‌కు రైతులు పిలుపునివ్వగా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని కేంద్రం భావిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. So @deepikapadukone summoned on September 25 by @narcoticsbureau . Farmers all India protest on Sept 25. Samajh mein aaya?🙏 — Rajdeep Sardesai (@sardesairajdeep) September 23, 2020 -
టాలీవుడ్‌ను షేక చేస్తోన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు
-
మలుపులు తియుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత
యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్శెట్టి ఒక డ్యాన్సర్. బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదాపడింది. -
సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు
ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్‌హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ ఒక న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ వద్ద పనిచేసే జగదీష్ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. సుశాంత్ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్‌హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్ ఫామ్‌హౌస్‌లో రీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్ హౌస్‌ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్ పేపర్లను కూడా ఆర్డర్ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని రీస్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్‌పుత్ ఈ ఫామ్‌హౌస్‌కు వచ్చేవారని రీస్ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్‌తో కలిసి ఆ ఫామ్ హౌస్‌లో జరుపుకుంది అని రీస్ తెలిపారు. పార్టీలలో స్మోక్ పేపర్ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్డౌన్లో ఫామ్‌హౌస్‌లో గడపాలని సుశాంత్ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు. చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు -
జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్లో మొదలైన విమర్శల ప్రకంపనలు తాజాగా పార్లమెంట్‌ను తాకాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్పై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజ్యసభలో జయా మంగళవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ.. మీ కుమారుడు అభిషేక్ బచ్చక్ కూడా సుశాంత్‌లా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఈ మేరకు కంగనా ఓ ట్వీట్ చేశారు. ’రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్ కుడా టీనేజ్‌లో వేధింపులు గురైతే ఇలానే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు. (కొడుకు కోసమే కక్షసాధింపు) కాగా చిత్రపరిశ్రమపై ఎంపీలు రవికిషన్ మాట్లాడిన తీరుపై జయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఉంటూ డ్రగ్స్ మాఫీయా అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జయా బచ్చన్ రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్‌గా కంగనా ట్వీట్ చేశారు. రాజ్యసభలో జీవో అవర్ సందర్భంగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశాన్ని లేవనెత్తారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. డ్రగ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని... సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కూడా బాలీవుడ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
-
ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్‌ను తిరష్కరించటంపై ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వరుస ట్వీట్లతో స్పందిస్తూ.. ‘‘ కూతురి విషయంలో ఇలాంటి తీర్పును ఏ తండ్రీ భరించలేడు. నేను చచ్చిపోవాలి... రియా చక్రవర్తి బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఇక గురువారం సెషన్ కోర్టులో తదుపరి విచారణ... ఇక్కడో జీర్ణించుకోలేని నిజం ఏంటంటే. సుశాంత్ బ్రతికున్నట్లయితే డ్రగ్స్ కేసులో అతడే ప్రధాన ముద్దాయి. ( రియా చక్రవర్తి అరెస్ట్ ) అందరూ అతడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ‘ప్రచారం’ చేసిన పని కూడా ఇదే. ఓ గొప్ప నటుడి జీవితం డ్రగ్స్ వినియోగంతో ముడిపడి ఉంది’’ అని పేర్కొన్నారు. బుధవారం మరో ట్వీట్లో ‘‘ ఏలాంటి ఆధారాలు లేకుండా దేశం మొత్తం రియాను జైలుకు పంపటానికి పూనుకుందని’’ ఆవేదన వ్యక్తం చేశారు. ( సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు ) -
రియా రియల్ స్టోరీ
-
రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం
ముంబై: బాలీవుట్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్రవారం తొలిసారిగా సీబీఐ ముందు హాజరైంది. సీబీఐ ఆమెను 10 గంటలపాటు విచారించింది. సుశాంత్‌ను ప్రియురాలు రియా మానసికంగా వేధించారని, అతని అకౌంట్ల నుంచి డబ్బు తీసుకున్నారని రాజ్‌పుత్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. గురువారం రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ప్రశ్నించిన సీబీఐ... ఇద్దరి వాంగ్మూలాల్లో తేడాలను పరిశీలించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రియాను సీబీఐ అడిగిన ప్రశ్నలిలా ఉన్నాయి. ► సుశాంత్ మరణం గురించి మీకెవరు చెప్పారు. అప్పుడు మీరెక్కడ ఉన్నారు. ► మరణవార్త తెలిసిన వెంటనే బాంద్రా ఫ్లాట్‌కు వెళ్లారా? లేకపోతే... ఎందుకు వెళ్లలేదు? ఎప్పుడు, ఎక్కడ సుశాంత్ మృతదేహాన్ని సందర్శించారు. ► అంతకుముందు వరకు కలిసి నివసించిన మీరు జూన్ 8వ తేదీన సుశాంత్ ఫ్లాట్‌ను వదిలి ఎందుకు వెళ్లారు? ► మీరు అలా వెళ్లిపోవడానికి ఏదైనా గొడవ కారణమా? ► వెళ్లిపోయిన తర్వాత జూన్ 9 – 14 మధ్యలో సుశాంత్‌తో మాట్లాడారా? ఏ విషయంపై మాట్లాడారు. ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు అతనితో కాంటాక్ట్‌లో లేరు? ► మరోవైపు సుశాంత్ ఈ రోజుల్లో మీకేమైనా కాల్స్, మెసేజ్‌లు చేశాడా? మీరు వాటిని పట్టించుకోలేదా? కాల్స్‌కు బదులివ్వకపోతే... ఎందుకలా చేశారు? ► సుశాంత్ ఆరోగ్య సమస్యలేమిటి? ఏ డాక్టర్లు, మానసిక నిపుణుల వద్ద చికిత్స తీసుకున్నాడు? ఏయే మందులు వాడుతుండేవాడు? -
సుశాంత్ జీవితంతో శశాంక్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త బాలీవుడ్‌ను కుదిపేసింది. ఊహించని షాక్‌లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్ ఆర్ మర్డర్?) ప్రకటించింది బాలీవుడ్. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఓ యంగ్ సినిమా స్టార్ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. -
సీబీఐకి సుశాంత్ సింగ్ మృతి కేసు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే సుశాంత్ సన్నిహితురాలు రియా పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీంతో రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయబద్దమైనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్ కుటుంబసభ్యులు స్వాగతించారు. సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. కాగా జూన్ 14లో సుశాంత్ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. (‘సుశాంత్ కేసు సాక్ష్యులకు భద్రత కల్పించాలి’) సుశాంత్ మృతి కేసుపై సీబీఐ విచారణకు బిహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 11 నాటి విచారణ సందర్భంగా.. రియా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిజం కంటే రాజకీయ జోక్యం ఎక్కువగా మారిందని స్పష్టమవుతోందన్నారు. అసంబద్ధమైన వాదనలతో బీహార్‌లో ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ఈ కేసును వాడుకుంటున్నారని రియా చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు) సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కుమారుడ్ని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని సుశాంత్ సింగ్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు. రీల్ లైఫ్‌లో లాగానే... సుశాంత్ మృతి రియల్ లైఫ్‌లోనూ అనేక మలుపులు తిరుగుతూ చివరకూ సుప్రీంకోర్టుకు చేరింది. (అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్ సోదరి) -
అలియాకు షాక్.. డిస్‌లైక్‌ల వరద
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్లైక్ చేశారు. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.(ఓటీటీలో సడక్ 2) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.