ముంబై : బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఓ యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చారు. అతడి యూట్యూబ్ ఛానల్లో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు 500 కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బీహార్‌కు చెందిన సిద్ధిఖీ అనే సివిల్ ఇంజనీర్‌పై కేసు నమోదైంది. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో సంబంధం ఉందంటూ తనపై ఫేక్ వార్తల్ని ప్రచారం చేశాడని అక్షయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సుశాంత్ కేసుతో అక్షయ్‌ని ముడిపెడుతూ సిద్ధిఖీ పలు వీడియోలు చేశాడు. సుశాంత్ ధోనీ లాంటి పెద్ద సినిమాలు చేయటం అక్షయ్‌కు ఇష్టం లేదని, అక్షయ్.. ఆధిత్య ధాక్రే, ముంబై పోలీసులతో పలుమార్లు రహస్య సమావేశాలు జరిపారని ఆరోపిస్తూ ఓ వీడియో. ( తల్లి రాలేదని గుండెలవిసేలా ఏడ్చిన మోనాల్ )
సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కెనడాకు పారిపోవటానికి అక్షయ్ సహాయం చేశాడంటూ మరో వీడియో చేశాడు. ఇలా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు చేయటం ద్వారా సిద్ధిఖీ యూట్యూబ్ ఛానల్ ఒక్క సారిగా ఫేమస్ అయిపోయింది. నాలుగు నెలల కాలంలో దాదాపు 2 లక్షల సబ్‌స్క్రైబర్లతో పాటు 15 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుమారుడ్ని సుశాంత్ కేసులోకి లాగి గతంలో ఇతడు ఓ సారి జైలు పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment