సుశాంత్‌, అలియా మధ్య పోటీ, గెలిచేదెవరు? | Kangana Slams Celebs For Gushing Over Alia Childhood Photo | Sakshi
Sakshi News home page

ఫోటో షేర్‌ చేసిన అలియా, మండిపడ్డ కంగనా

Published Sat, Aug 1 2020 9:00 AM | Last Updated on Sat, Aug 1 2020 9:00 AM

Kangana Slams Celebs For Gushing Over Alia Childhood Photo - Sakshi

మరోసారి కంగనా టీం అలియాభట్‌ను టార్గెట్‌ చేసింది. అలియాభట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన చిన్నప్పటి ఫోటోలను షేర్‌ చేసింది. అయితే  దీనికి ఆమె ఫ్యాన్స్‌తో పాటు దీపికా పదుకొనే, హృతిక్‌ రోషన్‌, జోయా అక్తర్‌, మనీష్‌ మల్హోత్రా లాంటి వాళ్లు లైక్‌ కొట్టారు. ఆమె ఫ్యాన్స్‌ ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే వీటిపై స్పందించిన కంగనా రనౌత్‌... సుశాంత్‌ మరణించడంతో దేశం మొత్తం దు:ఖంలో మునిగిపోయి ఉంటే బాలీవుడ్‌ స్టార్‌లు మాత్రం అలియా క్యూట్‌నెస్‌ను పొగడటంలో బిజీగా  ఉన్నారు అని ట్విట్‌ చేశారు. ఇలా చేయడం వలన ఆమె  క్రిమినల్‌ పాదర్‌ చేసినవి, బయట వారి పట్ల ఆమె ఉండేతీరును తుడిచేయగలరా అని ప్రశ్నించింది. 

spread some love 🤍

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on


కంగనా టీం సుశాంత్‌ రాజ్‌పుత్‌  చిన్నప్పటి ఫోటోలను షేర్‌ చేసి ఇప్పుడు ఎవరికి ఎక్కువ లైక్‌లు వస్తాయో చూద్దాం.  10వ తరగతి ఫెయిల్‌ అయిన మొద్దుకా లేదా ఫిజిక్‌ ఒలంపియాడ్‌ విన్నర్‌కా అని  పోస్ట్‌ చేసింది. సుశాంత్‌వాళ్ల అక్క అతని చిన్నప్పటి ఫోటోలను షేర్‌ చేసినప్పుడు బాలీవుడ్‌ స్టార్‌లు ఎవరు లైక్‌  కొట్టలేదు. ఇప్పుడు సుశాంత్‌ ఫ్యాన్స్‌ అందరూ అలియాను, లైక్‌ కొట్టిన సెలబ్రెటీలను మరోసారి టార్గెట్‌ చేస్తున్నారు. సుశాంత్‌ బతికున్నప్పుడు ఏవిధంగా అయితే అతనిని చిన్న చూపు చూశారో అదే విధంగా ఇప్పుడు కూడా చూస్తున్నారు అని కామెంట్స్‌ పెడుతున్నారు. దీపిక పై కూడా సుశాంత్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. 

చదవండి: నేను ఉరేసుకుని కనిపిస్తే: హీరోయిన్‌

  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement