బాలీవుడ్‌లో రామాయణం ఆధారంగా సీత దృక్కోణంలో సాగే కథతో ‘సీత: ది ఇన్‌కార్నేషన్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కేవీ విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా, అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, దీపికా పదుకొనేని మూవీ టీం సంప్రదించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది రూమర్ మాత్రమేని లిరిసిస్ట్, స్క్రీన్ ప్లే రైటర్ మనోజ్ ముంతాశిర్ తెలిపాడు.
ఈ సినిమా క్యాస్టింగ్ గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడిన మనోజ్ ‘ఈ సినిమాలో సీత పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేశాం. ఆ విధంగా చూస్తే కంగనానే సరిగ్గా సరిపోతుంది. ప్రేక్షకులు మూవీని చూసిన తర్వాత ఈ పాత్రలో ఆమెను తప్ప ఎవరిని ఊహించుకోలేరు. అంతగా ఆమె సెట్ అయ్యింది. ఇతర హీరోయిన్స్‌ని మూవీ టీం సంప్రదించిందని ప్రచారంలో ఉంది. అది నిజం కాదు’ అని తెలిపాడు.
మరోవైపు కరీనా ఈ పాత్ర చేయడానికి ఎక్కువ మొత్తం పారితోషికం అడిగిందని పుకార్లు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగిన విషయం కూడా విదితమే. అయితే ఓ ఇంటర్వూలో బెబో మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు ఎందుకు ఇవ్వరని, ఇది స్త్రీల గౌరవానికి సంబంధించిన విషయమని తెలిపింది. అనంతరం ‘సీత: ది ఇన్‌కార్నేషన్’తోపాటు హృతిక్ రోషన్ ముఖ్యపాత్రలో నితేశ్ తివారి నిర్మించనున్న ‘రామాయణ’లోనూ సీతగా దీపిక పదుకొణె నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలాకిక్ సినిమాలో దీపిక నటించట్లేదని కన్‌ఫార్మ్ అయిపోయింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment