Kareena kapoor
-
ప్రభాస్, మహేష్ తో కరీనా కపూర్..!
-
నా భర్త మొదటి భార్య అంటే అభిమానం: కరీనా కపూర్
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2012లో ముంబయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గతంలో కరీనా కపూర్.. తన భర్త మొదటి భార్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను అమృతా సింగ్‌కు అభిమానిని అని తెలిపింది. అంతేకాకుండా సైఫ్‌తో స్నేహం చేయాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. సైఫ్ జీవితంలో అమృతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది.గతంలో కరీనా మాట్లాడుతూ..'సైఫ్‌కు ఇంతకు ముందే వివాహం అయిందని నాకు తెలుసు. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతన్ని కుటుంబాన్ని నేను గౌరవిస్తా. నేను కూడా ఆయన మొదటి భార్య అమృతా సింగ్‌కి అభిమానినే. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. కానీ నాకు ఆమె గురించి సినిమాల ద్వారా తెలుసు. ఆమెకు ఎప్పుడు సైఫ్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆమె కేవలం మొదటి భార్యనే కాదు.. అతని పిల్లలకు తల్లి కూడా. సైఫ్లాగే నేను ఆమెను గౌరవిస్తా. ఇది నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా.' అని అన్నారు.కాగా.. సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2004లో విడిపోయారు. వీరిద్దరి కూడా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కరీనా, సైఫ్ అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అకా జెహ్ అనే కుమారులు ఉన్నారు. -
నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ
ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ఇదీ ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా మహిమ. బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ ఆయా జీతం నెలకు రూ. 2.5 లక్షలు అంటూ ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై తైమూర్ నానీ, లలితా డిసిల్వా, తొలి సారి స్పందించారు.కరీనా కపూర్ పెద్ద కొడుకు తైమూర్ నానీగా లలితా డిసిల్వా ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందారు. టాప్ సీఈఓల కంటే లలిత ఎక్కువ సంపాదిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఈ రూమర్స్‌పై ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. హిందీ రష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నెలవారీ జీతం రూ. 2.5 లక్షలు ఉందా అని అడిగినప్పుడు, లలిత ‘రూమర్స్’కి నవ్వుతూ, ‘‘ మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను.’’ అంటూ సమాధానమిచ్చారు. తద్వారా అవన్నీ పుకార్లే అని తేల్చారు. అంతేకాదు కరీనా , ఆమె కుటుంబ సభ్యులు ‘సింపుల్ పీపుల్’ అని కూడా ప్రశంసించారు. సిబ్బందితో ప్రేమగా ఉంటారు. అందరమూ ఒకటే ఆహారం తింటాం. చాలా సార్లు అందరం కలిసి భోజనం చేస్తాం అని కూడా ఆమె తెలిపారు.లలితా డిసిల్వా లలితా డిసిల్వా ముంబైలో ఉన్న ప్రముఖ పీడియాట్రిక్ నర్సు, ఆమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇద్దరు కుమారులను పుట్టినప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది. అంతకుముందు డిసిల్వా ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేశారు. యువ అనంత్ అంబానీని చూసుకున్నారు. ఇటీవల అనంత్అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి లలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!
చాలామంది సెలబ్రెటీలు వేసుకునే మేకప్ చాలా నేచరల్‌గా ఉంటుంది. ఎంతలా అంటే చూస్తే చాలా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ల చర్మం అంత కాంతివంతంగా ఉంటుందేమో అన్నట్లుగా ఆకట్టుకుంటుంది. అదే మనం ట్రై చేస్తే..కచ్చితంగా మేకప్ వేసుకున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత డబ్బు వెచ్చించినా అంతలా నేచురల్‌గా అనిపించదు. అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్‌ని బాలీవుడ్ భామ కరీనా కపూర్ బయపెట్టింది. అందేంటంటే..? కరీనా కపూర్ మేకప్ వేసుకుంటే ముఖంపై చిన్న మచ్చ కూడా లేనట్లు ప్రకాశంతంగా ఉంటుంది. నిజంగా ఆమె మేకప్ వేసుకుందా..! లేదా? అన్నట్లు ఆశ్చర్యంగా ఉంటుంది. అంతలా ముగ్ధమనోహరంగా ఉంటుంది ఆమె రూపు. అంతలా ఆకట్టుకునే కనపించడానికి వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..మేకప్ లుక్ మంచిగా కనిపించేలా ముందు..ముఖంపైన చర్మం హైడ్రైట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా మంచి మాస్క్ వేసుకుని ఉంటారు. ఆ తర్వాత మాయిశ్చరైజేషన్ ముఖానికి ఇంకిపోయాలా అప్లే చేస్తారు. ఆ తర్వాత మేకప్ వేయడం స్టార్ట్ అవుతుంది. ఆమె తదుపరి చిత్రం 'ది క్రూ' షూటింగ్లో భాగంగా ఫేస్ మేకప్‌కి ముందు జరిగే తతంగాన్ని మొత్తం ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఐలైనర్ దగ్గర నుంచి పెదవులకు వేసుకునే లిప్‌స్టిక్ వరకు ఎలా మేకప్ మ్యాన్లు వేస్తారో సవివరంగా ఉంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) (చదవండి: భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!) -
ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీ కారును సొంతం చేసుకుంది. ఈ కారు విలువ దాదాపు రూ.1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం కరీనా కపూర్ ప్రధాన పాత్రలో హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ది బకింగ్‌హామ్ మర్డర్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని కరీనా ఫస్ట్‌లుక్ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో జస్ భమ్రా అనే డిటెక్టివ్‌గా కరీనా కనిపించనుంది. ఈ పాత్ర గురించి కరీనా మాట్లాడుతూ..' ఇరవై మూడేళ్లుగా ఈ పాత్ర కోసమే ఎదురుచూస్తున్నా. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కే పాత్రలకి నేను పెద్ద అభిమానిని. కరమ్‌చంద్, హెలెన్ మిరెన్, అగాథా క్రిస్టీలాంటి రచయితల కథలతో తెరకెక్కిన సిరీస్‌లు చూశా. ఇలాంటి పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధమని' చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో యశ్ టాండన్, రణ్వీర్ బ్రార్, కీత్ అలెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా కపూర్, కరీనాకపూర్ నిర్మిస్తున్నారు. -
రక్తసంబంధం లేకున్నా ఆ పిల్లల కోసం సుస్మితా సేన్ ఏం చేసిందంటే
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్‌జెండర్‌గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ సంఘటనతో సినిమాలకు దూరం సుస్మితా సేన్‌కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అలా షూటింగ్లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్‌కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. అప్పట్లో నాకు కెరీర్‌పై సీరియస్‌నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం. -
దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..
ఇటీవల కాలంటో ప్రముఖ సినీ నటుల పాటలకు నృత్యం చేసిన వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవ్వడం చూస్తునే ఉన్నాం. ఈ మేరకు ఇలా పెళ్లి ఫంక్షన్స్‌లోనూ లేక పార్టీల్లోనూ డ్యాన్స్ చేసిన వీడియోలతో మచి పేరు ప్రఖ్యాతుల సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) అచ్చం అలానే ఇక్కడ ఒక ముగ్గురు చిన్నారులు భలే డ్యాన్స్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకెళ్లితే... ముగ్గురు అమ్మాయిలు సల్వార్, కుర్తా వంటి దుస్తులు ధరించి బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్‌కి సంబంధించిన "దుపట్టా మేరా" పాటకు ఈ ముగ్గురు అమ్మాయిలు అత్యంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు. అయితే దుపట్టా మేరా అనే పాట కరీనా కపూర్, తుషార్ కపూర్ అమ్రిష్ పూరి ప్రధాన పాత్రల్లో నటించిన 2001లో వచ్చిన ముజే కుచ్ కెహనా హై చిత్రంలోనిది. పైగా ఈ పాటను , అను మాలిక్ సంగీతం సమకూర్చగా అనురాధ శ్రీరామ్ పాడారు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియోను డ్యాన్సర్ ఉదయ్‌సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు "బహుత్ హార్డ్ డ్యాన్స్ హై" అంటే రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: నేను ప్రధానమంత్రి అయితే నా మొదటి సంతకం ఆ బిల్లు పైనే !) View this post on Instagram A post shared by Uday singh (@deepak__singad_dd3) -
బెస్ట్ బిర్యానీ పంపినందుకు థ్యాంక్యూ ప్రభాస్.. వైరలవుతున్న కరీనా పోస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ తన కో యాక్టర్స్‌కి ఫుడ్ పార్టీ ఇస్తుంటాడనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాలో రావణ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు ఈ పాన్ ఇండియా స్టార్ బిర్యానీ పంపించాడు. ఈ విషయమై బాలీవుడ్ బ్యూటీ, సైఫ్ భార్య కరీనా కపూర్ ఆదివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేసింది. దానికి.. ‘బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు’ అని బ్యూటీ కామెంట్ రాసింది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్ లవర్ కూడా. తన సోదరి కరిష్మా కపూర్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి పుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నా వీడియోలను ఎన్నో సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తినేసి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతానికి అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
సీత కోసం ఆ హీరోయిన్స్‌ని సంప్రదించలేదు
బాలీవుడ్లో రామాయణం ఆధారంగా సీత దృక్కోణంలో సాగే కథతో ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కేవీ విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా, అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, దీపికా పదుకొనేని మూవీ టీం సంప్రదించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది రూమర్ మాత్రమేని లిరిసిస్ట్, స్క్రీన్ ప్లే రైటర్ మనోజ్ ముంతాశిర్ తెలిపాడు. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడిన మనోజ్ ‘ఈ సినిమాలో సీత పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేశాం. ఆ విధంగా చూస్తే కంగనానే సరిగ్గా సరిపోతుంది. ప్రేక్షకులు మూవీని చూసిన తర్వాత ఈ పాత్రలో ఆమెను తప్ప ఎవరిని ఊహించుకోలేరు. అంతగా ఆమె సెట్ అయ్యింది. ఇతర హీరోయిన్స్‌ని మూవీ టీం సంప్రదించిందని ప్రచారంలో ఉంది. అది నిజం కాదు’ అని తెలిపాడు. మరోవైపు కరీనా ఈ పాత్ర చేయడానికి ఎక్కువ మొత్తం పారితోషికం అడిగిందని పుకార్లు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగిన విషయం కూడా విదితమే. అయితే ఓ ఇంటర్వూలో బెబో మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు ఎందుకు ఇవ్వరని, ఇది స్త్రీల గౌరవానికి సంబంధించిన విషయమని తెలిపింది. అనంతరం ‘సీత: ది ఇన్కార్నేషన్’తోపాటు హృతిక్ రోషన్ ముఖ్యపాత్రలో నితేశ్ తివారి నిర్మించనున్న ‘రామాయణ’లోనూ సీతగా దీపిక పదుకొణె నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలాకిక్ సినిమాలో దీపిక నటించట్లేదని కన్ఫార్మ్ అయిపోయింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే. -
ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు
బాలీవుడ్ జంట కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. వివాహం నుంచి సంతానం వరకూ వ్యక్తిగత జీవితంలో ‘సైఫీనా’గా గుర్తింపు పొందిన ఈ దంపతులు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ కపుల్‌కి పుట్టిన రెండో సంతానానికి సంబంధించి కూడా నెట్టిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో పిల్లలకు పేర్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుందని కరీనా సోషల్ మీడియా వేదికగా మండిపడింది కరీనా. ఈ జంటకు 2016లో ఓ కుమారుడు జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు పుట్టాడు. అయితే మొదటి సంతానాకి ‘తైమూర్ అలీఖాన్’ అని పెట్టగా వివాదాలకు కారణమయినా విషయం తెలిసిందే. అది 1398లో భారతదేశంపై దండెత్తిన పర్షియన్ చక్రవర్తి తైమూర్‌ని గుర్తు చేస్తోందని నెటిజన్లు అప్పట్లో విమర్శలు చేశారు. కాగా రెండో కుమారుడికి ‘జహంగీర్ అలీఖాన్’ అని పెట్టారు. అదీసైతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో కాంట్రవర్సీ ఎందుకని ‘సైఫీనా’ జంట బాబు పేరు ‘జెహ్’గా మార్చారు. దీనిపై స్పందిస్తూ కరీనా ఇన్‌స్టాలో రెండో కుమారుడితో ఉన్న ఫోటోని తాజాగా పోస్ట్ చేసింది. ‘పిల్లలను కనిపెంచే తల్లిదండ్రులకి మాత్రమే వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మరెవరీకి ఉండదు. ఇతర కుటుంబ సభ్యులకి కూడా లేదు. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని’ అందులో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వూలో ట్రోల్‌పై స్పందించిన కరీనా మాకు నచ్చిన పేర్లను, బావుంటాయని పిల్లలకి పెట్టామని వెల్లడించింది. అంతేకానీ మరేంకాదని తెలిపింది. పిల్లలని భయంకరంగా ఇలా ఎలా ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ సోదరి సభా పటౌడి కరీనాకు మద్దతుగా నిలిచింది. View this post on Instagram A post shared by Saba (@sabapataudi) -
భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రిప్లై ఇచ్చిన కరీనా
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. కాగా రామాయణం ఆధారంగా సీత పాత్ర కోణంలో ‘సీత: ది ఇంకార్నేషన్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించడానికి కరీనా ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గుర్తెంది. కరీనా గతంలో ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ‘మైథాలజికల్ మూవీలో సీత పాత్ర పోషించడానికి రూ.12 కోట్లు డిమాండ్ చేశారంటా కదా?’ అని యాంకర్ అడిగింది. అందుకు బదులుగా కరీనా ఏం ఆలోచించకుండా ‘అవును’ అంది. దీంతో మైథాలజికల్ పాత్ర చేయడానికి అంత ఎక్కువ డిమాండ్ చేస్తారా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా కరీనా ఓ ఇంటర్వూలో స్పందిస్తూ.. ఈ డిమాండ్ పారితోషికం విషయంలో కాదని, మహిళల గౌరవానికి సంబంధించిందని తెలుపుతూ.. ‘ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించే హీరోహీరోయిన్ల పారితోషికాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయంలో గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అని చెప్పింది. ఈ విషయంలో తాప్సీ పన్ను, ప్రియమణి వంటి నటీమణులు కరీనాకి మద్దతుగా నిలిచారు. ఎవరైనా నటుడు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తే ఇలా అనేవారు కాదని వారు ప్రశ్నించారు. కాగా ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఆదిపురుష్’లో కరీనా భర్త సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తుండడం విశేషం. -
‘మూడో బిడ్డను’ పరిచయం చేసిన కరీనా కపూర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన పుస్తకాన్ని లాంచ్ చేశారు. తనలోని రచయిత్రిని నిద్ర లేపిన ఆమె ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక విధంగా ఇది తన మూడో బిడ్డ లాంటిదని కరీనా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఒకవీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరి బిడ్డల్ని కడుపులో మోస్తున్న సమయం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైందన్నారు. వంటగదిలో అవెన్ లోంచి ఈ బుక్ హాట్ హాట్ కాపీని బయటకు తీయడం విశేషం. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి మానసిక, శారీరక అనుభవాలు, కష్ట నష్టాలను, పలువురి నిపుణులు సలహాలు, సూచనలను ఇందులో పొందుపర్చినట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. అలాగే తన పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా పేర్కొన్నారు. కరీనా కపూర్ 2020లో తన మొదటి బిడ్డ తైమూర్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా కరీనా 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. కాబోయే తల్లులకు సహాయకారిగా ఉండేలా కీలకమైన చిట్కాలను, సమాచారాన్ని ఇందులో రాయబోతున్నట్టు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డ పుట్టాడు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
కరీనా సినిమాలను బాయ్‌కాట్ చేయాలి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్లో మొదలైన నెపోటిజంపై చర్చ నేటికీ కొనసాగుతోంది. స్టార్ కిడ్స్‌పై విమర్శలు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో కరీనా కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కరీనా కపూర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరీనా చిత్రాలను బాయ్‌కాట్ చేయాలంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం చర్చకు రాగా కరీనా స్పందిస్తూ.. ‘బాలీవుడ్లో మాత్రమే నెపోటిజం ఉన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ మరణంతో ఇది తారా స్థాయికి చేరింది. స్టార్కిడ్స్ని ఇండస్ర్టీలోకి తెచ్చినప్పుడు ఈ ప్రేక్షకులే కదా వాళ్లని అసలైన స్టార్స్‌గా చేసేది. ఒకరికి స్టార్ ఇమేజ్ తేవాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది వారి చేతిలోనే ఉంటుంది. సరే స్టార్ కిడ్స్ సినిమాలు నచ్చకపోతే చూడటం మానేయండి. మిమ్మల్ని ఎవరూ బలవంతంగా సినిమా చూడమని చెప్పరు కదా’ అంటూ ఫైర్ అయ్యారు. (ఓటీటీలో సడక్ 2) కరీనా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెకు అహంకారం బాగా పెరిగిందని, ఆమె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రి రణ్‌ధీర్ కపూర్, కుమార్తెగా, కరిష్మా కపూర్ సోదరిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టిన కరీనా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల చేయాలని భావించానా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరీనా కపూర్పూ ట్రోల్స్ కారణంగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. (లాల్‌సింగ్ వాయిదా పడ్డాడు) #KareenaKapoorKhan Wait. What? Sahi to keh rahi h. Audience banati h. Mat jao na. You people make nepo kids star. Now she is getting trolled for harsh truth she said.#KareenaKapoorKhan pic.twitter.com/eNP3t7j7EV — Mamta Dagar 🇮🇳 (@TheMamtaDagar) August 10, 2020 -
బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?
స్వీటీ అనుష్కకు టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సూపర్ హిట్ సినిమా అరుంధతి. ఈ సినిమాతో అనుష్క లేడీ సూపర్ స్టార్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 2009లో రిలీజ్ అయినా ఈ సినిమా సౌత్‌లో సెన్సేషన్ సృష్టించటంతో అప్పట్లోనే బాలీవుడ్ రీమేక్‌పై వార్తలు వినిపించాయి. అయితే అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా బాలీవుడ్లో సౌత్ సినిమాల రీమేక్‌లు ఘనవిజయం సాధిస్తున్న నేపథ్యంలో మరోసారి అరుంధతి రీమేక్ తెర మీదకు వచ్చింది. బాలీవుడ్లో జేజమ్మ పాత్రకు కరీనా కపూర్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. పెళ్లి తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న కరీనా ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీషోస్తోనూ బిజీగా ఉంది. ఒకవేళ కరీనా అరుంధతి పాత్రకు నో అన్న పక్షంలో అనుష్క శర్మను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి చిత్రాన్ని బాలీవుడ్లో ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. -
కొడుకులా మాట్లాడుతూ మురిసిపోతున్న కరీనా!
సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలు చేసే అల్లరి పనులు, ముద్దు మాటలను చూసి మురిసిపోతుంటారు. అలాగే వారు చేసే అల్లరి చేష్టల గురించి బంధువులకు, స్నేహితులకు చెబుతూ తెగ సంబర పడిపోతుంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా తన కుమారుడు తైమూర్ అల్లరి, ముద్దు ముద్దు ముచ్చట్ల గురించి చెబుతూ మురిసిపోతోంది. తాజాగా కరీనా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తైమూర్ గురించి అడగ్గానే కరీనా అనందపడిపోతూ.. తైమూర్ అల్లరి గురించి ఇలా చెప్పుకొచ్చారు. తైమూర్‌లా మాట్లాడుతూ (కిడ్ వాయిస్)తో ‘అబ్బా కిదర్ హై.. అబ్బా కిదర్ హై’ అంటూ రోజులో ఒక పదిసార్లు అడుగుతుంటాడని, అప్పుడు నేను.. నాన్న బాత్ రూంలో ఉన్నాడు బేటా అని చెప్పి తైమూర్ ప్రశ్నలకు పుల్‌స్టాప్ పెడతానంటూ చెప్పుకొచ్చారు. కాగా కరీనా ఇటీవలె ఇర్ఫాన్ ఖాన్‌తో నటిస్తున్న ఆంగ్రేజి మీడియం సినిమా షూటింగ్‌ను లండన్‌లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్‌తో చేస్తున్న గుడ్ న్యూస్ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓ టీవీ షోలో నటిస్తూ బిజీగా ఉన్న కరీనా.. ఏడాది తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తఖ్త్’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు చెప్పారు. ఇందులో కరీనాతో పాటు మరో స్టార్ హీరో, హీరోయిన్ అలియా భట్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, ఆదిత్యరాయ్ కపూర్లు కూడా నటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, భూమి ఫడ్నేకర్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram Kareena imitating #Taimur is the cutest thing you'll see today! 😍 #TheLoveLaughLiveShow #AllNewRomedy #KareenaKapoorKhan . . . @therealkareenakapoor @kareenakapoorteam @kareenakapoorkhanoffi @kareenakapoorrcafe @iamkareenakapoor @kareena_kapoors_world_fc @kareena.kapoor.official @taimuralikhanx @taimuralikhanpataudi_ . . #romedynow #romedystories #entertainment #entertainmentcenter #igers #instadailypic #instadailyphoto #igersdaily #actor #actress #celebrity #stars #grandslam #lovelaughlive #love #laugh #bollywood #KareenaKapoor #taimuralikhan #saifalikhan #nawab #kareenakapoorfans #taimurmemes #bollywoodfashion #bollywoodactress #bebo A post shared by Romedy NOW (@romedynow) on Sep 19, 2019 at 10:30pm PDT -
బేడీలు వేస్తాం!
పువ్వులు పట్టుకున్న ముద్దుగుమ్మల చేతులు లాఠీలు పట్టుకున్నాయి. తమ పెర్ఫార్మెన్స్తో థియేటర్స్‌లో ప్రేక్షకుల మనసులను లాక్ చేయాలని ఈ ముద్దుగుమ్మలు తమలోని అదర్ సైడ్‌ని చూపించడానికి రెడీ అయిపోయారు. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసాఫీసర్లుగా కనిపించి, విలన్లను రప్ఫాడించడానికి సిద్ధమైన ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ‘నిశ్శబ్దం’ చిత్రం కోసం ఆమెరికా పోలీసాఫీసర్ అవతారం ఎత్తారు అంజలి. ఈ గెటప్‌లో సెట్ కావాలని దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారామె. ఇటీవల ఈ సినిమాలో అంజలి పాత్ర చిత్రీకరణ మొదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, మాధవన్, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో గ్లామరస్‌గా రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పాయల్ రాజ్‌పుత్, రాయ్ లక్ష్మి, రేవతి, జ్యోతిక అటు చెన్నైకి వెళితే హీరోయిన్లు జ్యోతిక అండ్ రేవతి ఇద్దరూ కలిసి ఒకే పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. వీరిద్దరి డ్యూటీ ‘జాక్‌పాట్’ అనే తమిళం సినిమా కోసం. ఈ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో మరో భామ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆమె ఎవరో కాదు.. నటి, డాటరాఫ్ శరత్‌కుమార్. ఓ డాగ్‌ని వెంటపెట్టుకుని పోలీసాఫీర్‌గా ఓ కేసును దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె ఇన్విస్టిగేషన్ రిపోర్ట్‌ను ‘డానీ’ సినిమాలో చూడాలి. ఈ కేసును సంతానమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్గా కనిపించిన రాయ్ లక్ష్మి ఇప్పుడు కన్నడంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆమె స్కెచ్ హీరో సుదీప్ కోసమే. పోలీస్‌గా ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ‘కోటిగొబ్బ 3’ సినిమాలో తెలుస్తుంది. మొన్నామధ్య ఫైటింగ్, ఫైరింగ్ గట్రా నేర్చుకున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మీ. ఇంత కష్టపడింది ఆమె కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో పోలీస్ గెటప్ వేయడం కోసమే. పీవీఆర్ గురుప్రసాద్ ఈ చిత్రానికి డైరెక్టర్. సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్ భామలు కొందరు పోలీస్‌సైరన్ మోగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌కు పరిచయం అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఈ సినిమాలో శ్రద్ధాది పోలీస్ పాత్రే అని ఆల్రెడీ విడుదలైన ‘సాహో’ టీజర్ చెబుతోంది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం గన్ పట్టుకున్నారు కరీనా కపూర్. ఈ సినిమాకు హోమి అడ్జానియా దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా డ్యూటీ చేస్తున్నారు రాణీ ముఖర్జీ. శివాజీ రాయ్ అనగానే ‘మర్దానీ’ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ‘మర్దానీ 2’లో రాణీముఖర్జీ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి కథ అందించిన∙గోపీ పుత్రన్ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ -
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ప్రస్తుతం లండన్‌లో హాలిడే మోడ్‌లో ఉన్నారు కరీనా. తన టీవీ డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ కోసం ఒక్క రోజు ముంబై వచ్చి, షూట్ కంప్లీట్ చేసుకుని మళ్లీ లండన్ ఫైట్ ఎక్కారని బాలీవుడ్ సమాచారం. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో’లో కరీనా జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత రెండు వారాలుగా ఒక్క రోజు కోసం ముంబై రావడం, లండన్ వెళ్లడం జరుగుతోందట. ఇక అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసిన కరీనా.. త్వరలో ‘అంగ్రేజీ మీడియం’ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారు. ఇంకా కరణ్ జోహార్ ‘తక్త్’, ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమాల్లో కరీనా హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇలా... సినిమాలు, టీవీ షోలు, హాలిడేలతో ‘మై లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటున్నారు కరీనా. -
డ్యూటీకి వేళాయె
‘హిందీ మీడియం’ (2017) సీక్వెల్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాకీ డ్రెస్ వేసి లాఠీ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆఫీసర్‌గా కరీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లే టైమ్ దగ్గరైంది. ఈ నెల 15న ఆమె ముంబైలో చార్జ్ తీసుకోనున్నారని తెలిసింది. కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్ర చేస్తున్నారు కరీనా కపూర్. ‘అంగ్రేజీ మీడియం’ చిత్రానికి హోమి ఆదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇర్ఫాన్‌ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. అయితే కథ పరంగా ఇర్ఫాన్‌కు కరీనా జోడీగా నటించడం లేదని తెలిసింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మొదలైంది. ఆ తర్వాత ముంబైలో ఓ వారం రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత షూటింగ్ షెడ్యూల్ కోసం లండన్ ఫ్లైట్ ఎక్కుతారట ఈ టీమ్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
చల్లగా.. చిల్‌గా..
సమ్మర్ స్టార్ట్ అయ్యింది. ఎండ తీవ్రత పెరిగింది. దీంతో బాలీవుడ్ తారలు కొందరు వెకేషన్ కోసం మ్యాప్‌ను ముందు వేసుకుని నచ్చిన ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసి ఎయిర్‌పోర్టుకు దారి వెతుక్కుంటున్నారు. సూట్‌కేస్‌లు సర్దుకుని చల్లని ప్రదేశాల్లో ల్యాండైపోతున్నారు. కొందరు విదేశాలను చుట్టొచ్చేశారు. కొందరు అక్కడ చిల్ అవుతున్నారు. ఐశ్వర్యారాయ్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, సారా అలీఖాన్‌లు ఆల్రెడీ సర్దుకున్న సూట్‌కేసులను ఫారిన్లో ఓపెన్ చేసి, చిల్ అయి వచ్చేశారు. మరి.. వీళ్లంతా ఎక్కడెక్కడి వెళ్లారో తెలుసుకోవాలంటే మాత్రం మ్యాటర్ కంటిన్యూ చేయండి. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులు వెళ్లారు ఐశ్వర్యారాయ్. అక్కడికే వెళ్లొచ్చారు కత్రినాకైఫ్, కృతీసనన్, మలైకా అరోరాఖాన్. ‘గుడ్‌న్యూస్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన గుడ్మూడ్లో లండన్ తిరిగొచ్చారు కరీనాకపూర్. భార్య మీరా కపూర్‌తో కలిసి షాహిద్ కపూర్ స్పెయిన్‌లో హాలీడే టైమ్ ఎంజాయ్ చేశారు. జార్జియాలో జాలీగా గడిపొచ్చిన కొత్త దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ లేటెస్ట్ లవ్‌బర్డ్స్ ఫర్హాన్అక్తర్, షిబాని దండేకర్ మెక్సికోలో చిల్ అయ్యారు. మాజీ మిస్ ఇండియా సుస్మితాసేన్ తన బాయ్‌ఫ్రెండ్ (బాలీవుడ్ మీడియా అలానే చెబుతోంది) రోహ్మన్తో కలిసి న్యూయార్క్‌లో ప్రేమ పరుగు తీశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ న్యూయార్క్‌లో వాలిపోయారు. స్నేహితులతో కలిసి న్యూయార్క్‌ని రౌండప్ చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు హీరోయిన్లు తమ సినిమాల షూటింగ్ డేట్స్‌ను చూసుకుని ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఇంకా ఎంతమంది స్టార్స్ చల్లని ప్రదేశాల్లో చిల్ కావడానికి వెళతారో చూడాలి. సారా అలీఖాన్, స్నేహితులతో కరీనా -
చిన్ని రోల్లో చిన్నోడు
ముంబై ఇండస్ట్రీ సర్కిల్లో తైముర్ అలీఖాన్ తెలియనివారుండరు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్. బయట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లకు పని పెడుతుంటాడు ఈ బుడతడు. వారానికొక్కసారైనా తన కొత్త స్టిల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఆ మధ్య తైముర్ బొమ్మలను తయారు చేసి కేరళలో అమ్మారు కూడా. రెండేళ్లు నిండిన ఈ బుడతడు తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుడ్ న్యూస్’లో చిన్న గెస్ట్ రోల్ చేయనున్నాడట ఈ చిన్నోడు. పది నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడట. తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశాడట తైముర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మరి కొన్ని సినిమాల్లో కనిపిస్తాడా? వేచి చూడాలి. -
మస్త్ బిజీ
రెండేళ్ల క్రితం విడుదలైన హిందీ చిత్రం ‘హిందీ మీడియం’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించింది. సాకేత్ దర్శకత్వంలో ఇర్ఫాన్‌ఖాన్, సాబా క్వామర్, దీపక్ దోబ్రియాల్, షాయన్న పటేల్ ముఖ్య పాత్రలు చేశారు. దినేష్ విజన్ నిర్మించారు. ‘హిందీ మీడియం’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు అప్పట్లోనే స్ట్రాంగ్‌గా వార్తలు వచ్చాయి. అయితే.. ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్య పరిస్థితుల కారణంగా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవల ఇర్ఫాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితులు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్‌కి రావడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ఏంటంటే...ఈ సినిమాలో హీరోయిన్గా కరీనా కపూర్‌ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఇంతకుముందు రాధిక ఆప్టే పేరు తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత ‘వీరేది వెడ్డింగ్’వంటి వందకోట్ల సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన కరీనా ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహార్ పీరియాడికల్ మూవీ ‘తక్త్’లో నటించనున్నారు. ఇప్పుడు‘హిందీ మీడియం’ సీక్వెల్లో సెట్ అయితే.. కరీనా మళ్లీ బిజీ ట్రాక్‌లో పడ్డట్లే లెక్క. ‘‘ఇర్ఫాన్‌ఖాన్ తిరిగి వచ్చారు. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాం. మరో రెండు నెలల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని నిర్మాత దినేష్ విజన్ పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. -
ఆయనతో డేటింగ్ చేయాలని ఉంది!
కరీనా కపూర్ బాలీవుడ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన రోజులవి. జేపీ దత్తా తెరకెక్కించిన ‘రెఫ్యూజీ’ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన హీరోయిన్గా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సందర్భంగా సిమి గరేవాల్ నిర్వహించే ‘రెండెజ్వస్’ టీవీ షోలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితం గురించి పలు విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూలో భాగంగా ఎవరితో డేటింగ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? అని సిమి ప్రశ్నించగా.. కరీనా అనూహ్యరీతిలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను డేటింగ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన అంటే ఆసక్తి కలుగుతోందని, ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందని ఆమె తెలిపారు. ‘ఈ విషయం చెప్పాలో లేదో అర్థం కావడం లేదు. ఇది చెప్పడం వల్ల వివాదాస్పదమైనా పర్లేదు. రాహుల్ గాంధీ. ఆయన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మ్యాగజీన్లు తిరగేస్తున్నప్పుడు ఆయన ఫొటోలను చూస్తుంటాను. ఆయనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి నేను వచ్చాను. రాజకీయ కుటుంబం నుంచి ఆయన వచ్చారు. కాబట్టి మా మధ్య ఆసక్తికరమైన సంభాషణ ఉంటుందని అనుకుంటున్నాను’ అని ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు కరీనా బదులిచ్చారు. సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలై.. సినిమాలు కంటిన్యూ చేస్తున్న ఈ భామ ప్రస్తుతం ‘గూడ్ న్యూస్’, ‘థక్త్’ భారీ సినిమాల్లో నటిస్తున్నారు. -
కరీనా అవునా!
కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇందుకు సాక్ష్యంగా ‘గుడ్‌న్యూస్’ సినిమా సెట్లో కరీనా పాల్గొన్న ఫొటోలను చూపిస్తున్నాయి. ఆ ఫొటోలను చూసి కరీనా గర్భవతి అని కొందరు ఊహించుకున్నారు. అయితే కరీనా గర్భవతిగా కనిపించబోతున్నది వెండితెరపై. సంతానం కోసం తాపత్రయపడే భార్యాభర్తల నేపథ్యంలో సాగే చిత్రం ‘గుడ్‌న్యూస్’. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జీత్ సింగ్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూట్లోనే ప్రెగ్నెంట్ లేడీ గెటప్‌లో కనిపించారు కరీనా. ఇదిలా ఉంటే 2012లో సైఫ్, కరీనాలకు పెళ్లైన విషయం, వీరికి రెండేళ్ల కుమారుడు తైముర్ అలీఖాన్ ఉన్న విషయం తెలిసిందే. -
డ్రీమ్ గాళ్‌తో హాట్ గాళ్
ఎవరైనా సెలబ్రిటీని కలిసే అవకాశం వస్తే ఓ ఫొటోనో లేదా సెల్ఫీనో దిగడానికి ఆశపడతాం. సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన తారలను కలిస్తే? వాళ్లూ కచ్చితంగా అదే చేస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ హాట్ గాళ్‌గా యూత్‌ని ఆకర్షించారు. కానీ ఆమె ఈరోజు ఈ స్టేజ్‌కి రావడానికి గల కష్టం వెనక ఓ డ్రీమ్‌గాళ్ ఉన్నారట. ఆవిడే కరీనా కపూర్. ఇటీవల పాయల్‌కి తన డ్రీమ్గాళ్ని కలుసుకునే ఛాన్స్ దొరికింది. దాంతో వెంటనే కరీనాతో ఓ సెల్ఫీ దిగి ‘‘కల నిజమైంది. నా డ్రీమ్‌గాళ్ కరీనాను కలుసుకున్నాను. ఇది నెరవేరడానికి పదేళ్లు పట్టింది. నేను యాక్టర్ అవ్వడానికి కరీనానే కారణం. తను నాకు ఇన్స్పిరేషన్’’ అని అన్నారు. ∙కరీనాతో పాయల్ -
వెంటాడే గతం : నేను షారుక్‌ను కాదు..
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ కెరీర్లో అత్యంత మెరుగైన దశను ఎంజాయ్ చేస్తున్నా గతంలో తనకు ఎదురైన గడ్డు పరిస్థితులపై బాహాటంగా ఆవేదన వెళ్లగక్కారు. కరీనా కపూర్, తనయుడు తైమూర్లతో కాలం తెలియకుండా గడుపుతున్న సైఫ్ అలీఖాన్ కెరీర్ తొలినాళ్లలో ఆటుపోట్లతో పాటు అమృతా సింగ్‌తో విడాకుల సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2005లో ఓ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ అమృతతో విడాకులు, పిల్లలు సారా, ఇబ్రహిం అలీలను కలుసుకునేందుకు తనను అనుమతించకపోవడంపై మధనపడ్డారు. వీటికితోడు విడాకుల సెటిల్మెంట్లు, భరణం చెల్లింపులతో దాదాపు దివాలా పరిస్థితి ఎదుర్కొన్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పిల్లలను కలిసేందుకు తనను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమృతా సింగ్‌కు విడాకుల పరిష్కారంలో భాగంగా రూ 5 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఆమెకు రూ 2.5 కోట్లు చెల్లించానని తన కుమారుడు పెరిగి పెద్దయ్యేవరకూ నెలకు రూ లక్ష చెల్లిస్తానని చెప్పారు. తాను షారుక్ ఖాన్ కాదని, తన వద్ద అంత డబ్బులేదని చెప్పుకొచ్చారు. తాను డేటింగ్లో ఉన్న రోసాతో కలిసి చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నానని చెప్పారు. అలాంటి సైఫ్ ఇప్పుడు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. వరుస హిట్లతో పాటు వెబ్‌సిరీస్ విజయాలతో ఊపుమీదున్నారు. కుమార్తె సారాతో అనుబంధం మెరుగుపడి త్వరలోనే ఆమెను బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారు. -
సెలవు కావాలి
‘‘యాక్టర్‌గా రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడుతుంటాం. ఈ హడావిడిలో మళ్లీ హుషారుగా పరిగెత్తాలంటే సెలవు తీసుకోవాలని సెలవిస్తున్నారు బాలీవుడు భామ కరీనా కపూర్. సెలవు తీసుకోవడం గురించి కరీనా మాట్లాడుతూ – ‘‘పని చేస్తున్నప్పుడు మన బెస్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడూ పని చేస్తుండటానికి మనమేం మిషన్లు కాదు. కొన్ని సార్లు బ్రేక్ తీసుకొని జీవితాన్ని ఆస్వాదించాలి. ఇలా సెలవు తీసుకోవడం నాకు చాలా ఇష్టం. మనలో కొత్త ఉత్సాహం నింపుకోవడానికి హాలీడేస్ బాగా ఉపయోగపడతాయి. ఆ హాలీడేను నా ఫ్యామిలీ, నా దగ్గరి వాళ్లతో గడపటానికి ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారామె. బాబుకు జన్మనిచ్చాక కరీనా నటించిన ‘వీరే ది వెడ్డిం గ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ముగ్గురు బలి
క్వీన్ ఎలిజబెత్ గారింటి కొత్త వధువు మేఘన్ మార్కెల్, బాలీవుడ్ పురుషాహంకారాల విధ్వంసకారిణి కంగనా రనౌత్, తను తనులాగే మాట్లాడే కరీనా కపూర్.. ఈ ముగ్గురూ.. ఫెమినిస్టులమని చెప్పుకున్నందు వల్ల అంతోఇంతో కోల్పోయారు! ‘ఫెమినిజం’ అనే మాట, ‘నేను ఫెమినిస్టును’ అనే ఆత్మవిశ్వాసపు ప్రకటన.. ఈవారంలో ముగ్గురు ఆరాధ్య దేవతల్ని బలి తీసుకుంది! ఎక్కడైనా దేవతలు బలి కోరుతారు. దేవతలే బలవుతారా?! దేవతలు అని మనం అనుకున్నాం తప్ప, మనల్ని అనుకోమని వాళ్లేమీ అనలేదు. కనుక వాళ్లు బలి అవడంలో తప్పు మనదే, బలి అయినందువల్ల కింద పడిన.. వాళ్ల కిరీటమూ మనం పెట్టిందే. క్వీన్ ఎలిజబెత్ గారింటి కొత్త వధువు మేఘన్ మార్కెల్, బాలీవుడ్ పురుషాహంకారాల విధ్వంసకారిణి కంగనా రనౌత్, తను తనులాగే మాట్లాడే కరీనా కపూర్.. ఈ ముగ్గురూ.. ఫెమినిస్టులమని చెప్పుకున్నందు వల్ల అంతోఇంతో కోల్పోయారు! వీరిలో కంగనా.. ‘క్లే ఫీట్ ఐడల్’గా (బురదకాళ్ల దేవత) మిగిలిపోయారు. పెళ్లికి కాస్త ముందు మేఘన్ ‘నేను ఫెమినిస్టునని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను’ అని ప్రకటించడం.. ఆమెకు పుట్టబోయే కూతుళ్లను సింహాసన వారసత్వానికి దూరం చేసింది. బ్రిటిష్ చట్టాల ప్రకారం ‘జెండర్ న్యూట్రల్’గా ఉండేవాళ్లే రాజులు గానీ, రాణులు గానీ అవుతారు. కరీనా సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్పై నెట్లో ఇప్పటికీ వెటకారాల వరద ఉద్ధృతం అవుతూనే ఉంది. ‘స్త్రీ, పురుష సమానత్వాన్ని విశ్వసిస్తాను. అలాగని నేను ఫెమినిస్టును కాను’ అని కరీనా అనడాన్ని లోకం తప్పుపడుతోంది. ఫెమినిజం అంటేనే స్త్రీ,పురుష సమానత్వం అని కదా అని లోకం పాయింట్. ఇప్పుడిక కంగనా అదే ఫెమినిజానికి బుక్అయ్యారు. మిగతా ఇద్దరిలా కాదు కంగనా. కరడుగట్టిన ఫెమినిస్టు. ఇష్టం వచ్చినట్లు బతికేస్తారు. ఇష్టం లేని దాన్ని ఉతికేస్తారు. కరణ్‌జోహార్ బంధుప్రీతిని, హృతిక్ రోషన్ కపట ప్రేమను ఇలాగే బట్టబయలు చేశారు. పెద్ద పెద్ద స్టార్లను నిర్లక్ష్యంగా చూశారు. ‘ఎంత పొగరు!’ అని అంత కోపంలోనూ ఇండస్ట్రీ ఆమెను ఆరాధించింది. అలాంటి అమ్మాయి ఇటీవల కాన్స్ ఫెస్టివల్లో సహ నటుడు జిమ్ సర్భ్ వేసిన రేప్ జోక్‌కి దడేల్మని నవ్వడం సోషల్ క్రిటిక్స్‌కి నచ్చలేదు. జోక్ ఏమిటన్నది అలా ఉంచితే.. ఒక స్త్రీవాది.. రేప్ జోక్‌కి నవ్వడం పెద్ద చర్చ అయింది. ఇప్పుడు ఆమెను ఇంకో వివాదం చుట్టుకుంది. ‘మీరు భారతీయురాలై ఉంటే కనుక చీర ఎలా కట్టుకోవాలో మీకు తెలిసుండాలి’ అని ఓ ఫ్యాషన్ షోలో కంగనా అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ఒక ఫెమినిస్టు ఇలా మాట్లాడ్డం ఏమిటని! ఫెమినిస్టు ఎలా మాట్లాడతారు? అసలు ఎలా మాట్లాడాలి? కంగనా వల్ల తలెత్తిన ప్రశ్నలకు మళ్లీ కంగనానే సమాధానం. ఆమె బలమైన ఫెమినిస్టు. జబ్బు పడిన సమాజానికి ఫెమినిజం శక్తిమంతమైన ఔషధం అని ఆమె ఒపీనియన్. ఒపీనియన్ కాదు. అలాగని వాదిస్తారు కూడా. ఫెమినిజం సిద్ధాంతం కాదంటారు. అదొక పరిహారం అంటారు. స్త్రీ, పురుషుల్లో రక్తం ఒకేలా ప్రవహిస్తుంది కదా. అప్పుడు.. ఒకే పనికి ఒకే జీతం ఎందుకుండదని అడుగుతారు. సమాజంలోని ఈ అసమానతలకు ఫెమినిజమే విరుగుడని అంటారు. అంత స్ట్రాంగ్ ఫెమినిస్ట్, గ్లోబల్ ఉమన్.. ‘మన చీరలు, మన సంస్కృతి’ అనడం ఏంటనే చూపుడు వేలు రెండ్రోజులుగా ఆమెనే చూస్తోంది. చూపుడు వేళ్లను పట్టించుకునేంత వీక్ కాదు కంగనా, కరీనా, మేఘన్. ఫెమినిజం అనే మాటకు ఇప్పుడు ఒకే అర్థం సరిపోదు. ఉన్న ఆ ఒక్క అర్థంలోనే ఇమిడిపోయేవి కావు కంగనా, కరీనాల నవ్వులు, స్టేట్మెంట్లు. ఇక మేఘన్ ఫెమినిజానికి బ్రిటన్ ఎలాగూ పట్టని కుర్చీనే. మేఘన్కూ అది పట్టింపు లేని పీఠమే. మాధవ్ శింగరాజు -
కరీనా.. మీరే కరెక్ట్
ఎంత కాదన్నా కరీనా ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. సెటైరిస్టుల బ్రెయిన్‌లే కాస్త అందంగా ఆలోచించడం నేర్చుకోవాలి. రేపు ‘వీరె ది వెడ్డింగ్’ రిలీజ్ అవుతోంది. మూవీ ట్రైలర్లో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరాభాస్కర్, శిఖా తల్సానియా.. ఈ నలుగురు అమ్మాయిలూ మగాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఫెమినిస్టులేమో అనుకుంటాం.. ‘ఫెమినిజం’ అంటే మనకు అర్థమయ్యేదాన్ని బట్టి! బోల్ట్‌గా ఉంటారు. బోల్ట్‌గా మాట్లాడేస్తుంటారు. నలుగురూ చిన్ననాటి స్నేహితులు. కరీనా పెళ్లికి మిగతా ముగ్గురూ వస్తారు. మగాళ్ల గురించి కబుర్లే కబుర్లు. వీళ్ల చుట్టూ పెళ్లికథ ప్రదక్షిణలు చేస్తుంటుంది. ‘వీరె ది వెడ్డింగ్’ అంటే ‘నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి’ అని అర్థమట! ఈ అర్థం పంజాబీలోనా, హిందీలోనా, మరింకేదైనా భాషలోనా తెలీదు. సినిమా సంగతటుంచితే, బయట ఈ నలుగురమ్మాయిలూ ఎవరికి వాళ్లు ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. అంటే ఇంటెలిజెంట్లు. అయితే కరీనా ఇంటెలిజెన్స్ మీద కొత్తగా సందేహాలొస్తున్నాయి సెటైరిస్టులకి! ‘వీరె ది వెడ్డింగ్’ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో కరీనా మాట్లాడింది ఏమీ అర్థం కాలేదట. అందుకే ఈ సందేహాలు. ‘‘స్త్రీ,పురుష సమానత్వాన్ని నమ్ముతాను. అలాగని ఫెమినిస్టునని చెప్పను. నేను మహిళను. అంతకన్నా కూడా మనిషిని. నేను కరీనా అని చెప్పుకోడానికి ఎంత గర్వపడతానో, సైఫ్ అలీఖాన్ భార్యను అని చెప్పుకోడానికి అంతే గర్వపడతాను’’ అన్నారు ఆ ఈవెంట్లో కరీనా. ఆ మాటల్ని పట్టుకున్నారు సోషల్ మీడియా సెటైరిస్టులు! ‘ఫెమినిజం అంటే సమానత్వమే కదా. సమానత్వాన్ని నమ్ముతాను అంటోంది, ఫెమినిస్టును కాదని అంటోంది. కరీనా ఒకసారి డిక్షనరీ చూస్తే బాగుంటుంది. ఫెమినిజం అంటే ‘పురుష ద్వేషం’ అని ఆమె అనుకుంటున్నట్లుంది’ అని సెటైర్లు మొదలయ్యాయి. అవి అక్కడితో ఆగలేదు. గతంలో ఆమె వేర్వేరు సందర్భాలలో ఇచ్చిన వేర్వేరు స్టేట్మెంట్లలోకి కూడా వెళ్లిపోయి వాటిల్లో ఇంటెలిజెన్స్ పాళ్లు ఏమాత్రం లేవని ఆమె అజ్ఞానాన్ని తవ్వి పోస్తున్నారు! గతంలో ఒక ఈవెంట్లో కరీనాను ఎవరో.. ‘మీరు వాడే ల్యాప్‌టాప్ ఏంటి? మీ హార్డ్‌వేర్ ఏంటి? అని అడిగారు. ఆ సమయంలో ‘సోనీ వాయో’ ల్యాప్‌టాప్ ప్రమోషన్లో ఉన్నారు కరీనా. ‘ఏ హార్డ్వేరో నాకు తెలీదు. అయితే నా దగ్గరున్నది మాత్రం గ్రీన్ వన్’ అని చెప్పారు. అంటే ఆకుపచ్చ రంగుదని. దాన్ని బయటికి తీశారు! ఇంకోసారి.. ‘నేను అనుకోవడం గత పదీ పదిహేనేళ్లలో ఇంత లోతైన పాత్రను ఏ నటీ వేసి ఉండదు’ అని అన్నారు కరీనా. ఆమె అన్నది ‘మై ప్రేమ్ కి దీవానీ హూ’ చిత్రం గురించి. దాన్ని బయటికి తీశారు! ‘చాలామంది నటులు స్క్రిప్టు చదువుతారు. నేనూ చదవడానికి ప్రయత్నిస్తాను. కానీ నిద్రపట్టేస్తుంది’ అని ఐదేళ్ల క్రితం పీటీఐ ఇంటర్వ్యూలో అన్నారు కరీనా. దాన్నీ బయటికి తీశారు! ‘రా.వన్’ ప్రాజెక్ట్‌లోకి తనెందుకు వచ్చిందీ చెబుతూ, ‘నేను అందంగా కనిపించడానికి మాత్రమే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను. ఈ స్టంట్లూ అవీ నాకు కష్టమైన పనులు. పాటల్లో నటించడం, చక్కగా కనిపించడం ఎంజాయ్ చేస్తాను. అందుకే షారుక్‌తో.. పాటలు నాకిచ్చి, మీ స్టంట్లు మీరు చేసుకుంటానంటేనే సినిమాలో నేనుంటాను అన్నాను’ అని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు కరీనా. దాన్నీ బయటికి తీశారు! ‘పెళ్లిరోజుకి సైఫ్‌కి మీరు.. మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సోనీ వాయో ల్యాప్‌టాప్‌ని గిఫ్టుగా ఇస్తారా?’ అని అడిగితే ‘సైఫ్ దగ్గర ఆల్రెడీ సోనీ వాయో ఉంది. కానీ ఆయన మ్యాక్ వాడతారు’ అన్నారు కరీనా. దాన్నీ బయటికి తీశారు. తీసి, ఆమె తెలివితేటల్ని సందేహించారు. కరీనా తెలివితేటల మీద ఉన్న ఈ సందేహాలు ఆమె అందం మీద, ఆమె నటన మీద మాత్రం నిస్సందేహంగా ఉండవు. కాటుక ఎక్కువ తక్కువ పెట్టుకున్నా, లిప్‌స్టిక్ షేడ్స్ ఈవెన్‌గా లేకున్నా ఆమె ఒరిజినల్ అందం ఆమెదే. అదెక్కడికీ పోదు. కరీనా ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా ఇలాగే.. కుదరని కాటుకలా, సమంగా లేని షేడ్లుగా ఎందుకు చూడకూడదు? ఫెమినిజం అంటే డిక్షనరీలోని అర్థం ఏమిటో ఆమెకు తెలియకున్నా, ఫెమినిజాన్ని ఆమె ‘పురుషద్వేషం’గా పొరపడుతున్నా, ఆమె వ్యక్తం చేసిన భావాలను డిక్షనరీ మీనింగ్కి ఎలాబరేషన్గా చూసే ప్రయత్నాన్ని మనం ఎందుకు చెయ్యకూడదు! అలా చేస్తే కరీనా ఇచ్చిన మిగతా స్టేట్మెంట్లలో కూడా తవ్వి తియ్యడానికి ఏమీ ఉండదు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నంత మాత్రాన హార్డ్‌వేర్ గురించి, సాఫ్ట్వేర్ గురించి తెలిసుండాలా?! అలాగైతే ఏం సంబం«దం ఉంటుందని ఏళ్లుగా మేల్ ప్రోడక్ట్స్‌కి ఫిమేల్ మోడలింగ్‌ని ఇప్పించుకుంటున్నాం. సెలబ్రిటీలను.. సంబంధం లేకుండా, సందర్భం లేకుండా, వాళ్ల సమ్మతి లేకుండా, వాళ్లేదో టాపిక్‌లో ఉన్నప్పుడు, మనం ఏవో ప్రశ్నలు వేస్తుంటాం. ఆ ప్రశ్నల కన్నా, వాటికి కరీనా చెప్పిన సమాధానాలు తెలివైనవి కావా?! సెటైరిస్టులు ఎన్ని సెటైర్లు వేసినా, కరీనా ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. సెటైరిస్టుల బ్రెయిన్‌లే కాస్త అందంగా ఆలోచించడం నేర్చుకోవాలి. – మాధవ్ శింగరాజు -
ఆ ప్రశ్నలు ఇప్పుడొద్దు
నలుగురు అమ్మాయిల గ్యాంగ్. ఒకరు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. మరొకరు పెళ్లి కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. ఇంకొకరు విడాకుల కోసం వెయిట్ చేస్తున్నారు. నాలుగో అమ్మాయి ప్రస్తుతానికి పెళ్లికి రెడీ అవుతోందట. మరి.. ఫైనల్‌గా వీరి కథకు శుభం కార్డ్ ఎలా పడింది? అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. శశాంక ఘో‹ష్ దర్శకత్వంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిక్షా తల్సానియా ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. అమ్మాయిల గ్యాంగ్‌తో ట్రైలర్ మూవీపై ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాను జూన్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ట్రైలర్ లాంచ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అండ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కామెంట్స్ గురించి సోనమ్ కపూర్ అండ్ స్వర భాస్కర్‌ను కొశ్చన్ చేశారు అక్కడి పాత్రికేయులు. అయితే క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని ఈజీగా దాటవేశారు ఈ బాలీవుడ్ భామలు. ‘‘మీరు అడిగిన ప్రశ్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాకు చెందినది కాదు.ఈ సినిమా ఫంక్షన్ నుంచి డైవర్ట్ కావడం ఇప్పుడీ సందర్భంలో సరికాదనిపిస్తోంది’’ అని తెలివిగా చెప్పారు స్వరభాస్కర్. ‘‘క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది కాదు. ఇప్పుడు సరోజ్‌ఖాన్ కామెంట్స్ గురించి స్వరభాస్కర్ స్పందిస్తే అది హెడ్లైన్ అవుతుంది. సినిమా గురించి కాదు’’ అని సోనమ్ కపూర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీనాకపూర్, తల్సానియా కూడా పాల్గొన్నారు. -
వీరే ది వెడ్డింగ్ ట్రైలర్.. వెరీ బోల్డ్
ముంబై : తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్ ఖాన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో ‘వీరే ది వెడ్డింగ్’ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నలుగురు స్నేహితురాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. 2 నిమిషాల 49 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. శశాంఖ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబోతో పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. సోనమ్ కపూర్‌కు ఎదురైన సమస్య గురించి మిగిలిన ముగ్గురు స్నేహితురాల్ల మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ట్రైలర్ బోల్డ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్. కరీనా కపూర్‌కు ఓ యువకుడు ప్రపోజ్ చేయడంతో పెళ్లి కోసం సిద్ధమైన ఆమె ఇచ్చే బ్యాచిలరేట్ పార్టీ, సంగీత్, ఇతర పెళ్లి వేడుకలతో సరదాగా సాగుతుంది. అదే సమయంలో నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. బాలాజీ టెలిఫిల్మ్స్, అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మించాయి. బెబో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వీర్ ది వెడ్డింగ్ మే 1న విడుదల కానుంది. -
అక్షయ్‌ను హెచ్చరించిన కరీనా!
సెలబ్రిటీలు ఏం చేసినా ఓ కన్ను కనిపెడుతూనే ఉంటుంది. అలాంటిది సెలబ్రిటీల పిల్లలంటే మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల కంటే వారి పిల్లలే ఎక్కువగా ట్రెండ్ అవుతుంటారు. ఇలాంటి లిస్ట్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది తైమూర్ అలీ ఖాన్. పుట్టిన రోజు నుంచే సెలబ్రిటీగా మారిన తైమూర్.. తన క్యూట్ చిక్స్‌తో ఎంతో మందిని ఆకర్షించాడు. తైమూర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా...కరీనా కపూర్, అక్షయ్‌కుమార్‌ను హెచ్చరించింది. అది కూడా తైమూర్ విషయంలో. అక్షయ్‌ను ఉద్దేశిస్తూ...‘తైమూర్ వల్ల నీకు ముప్పు ఉంది. నీకు ఉన్న అభిమాన గణాన్ని తైమూర్ దాటేయగలడు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్’ అంటూ ఓ కార్యక్రమంలో పేర్కొంది. ప్రస్తుతం కరీనా ‘వీరే ది వెడ్డింగ్’ షూటింగ్లో బిజీగా ఉంది. ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్ ధరించాడు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు. -
కరీనాకేమయ్యింది...
న్యూ ఢిల్లీ : కరీనా కపూర్‌కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది...మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా...అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే కరీనా కపూర్ అప్పుడప్పుడు ర్యాంప్ వాక్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్ వాక్‌చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్లో తైమూర్ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్ వాక్ చేశారు. తన అభిమాన డిజైనర్ మనిష్ మల్హోత్రా కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరాతో కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అమృత అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని అమృత అరోరానే అందంగా ఉందని కామెంట్ చేశారు. తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా శశాంక్ ఘోష్ ‘వీర్ ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్ లు కీలక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు -
స్క్రీన్ టెస్ట్
► ఎన్టీఆర్–జయప్రద ఫేమస్ సాంగ్ ‘ఓలమ్మి తిక్క రేగిందా..’ పాటను ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ పాటలోని ‘మేల్ వాయిస్’ ఎవరిదో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) ఎస్.ఎస్.రాజమౌళి సి) జూ. యన్టీఆర్ డి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం ► ‘డాడీస్ లిల్ గాళ్’ అనే టాటూ ఏ ప్రముఖ బాలీవుడ్ నటి చేతిపై ఉంటుంది? ఎ) ప్రియాంకా చోప్రా బి) దీపికా పదుకోన్ సి) విద్యాబాలన్ డి) కరీనాకపూర్ ► సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా? ఈ డైలాగ్‌ను రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) జనార్థన మహర్షి బి) సాయిమాధవ్ బుర్రా సి) క్రిష్ డి) పరుచూరి బ్రదర్స్ ► నాకు ఓల్డ్ స్టైల్ రొమాన్సే (1990ల్లో) ఇష్టం అని చెప్పే హీరోయిన్ ఎవరు? ఈ హీరోయిన్ తండ్రి కూడా పెద్ద హీరోనే. తండ్రి తనకు రొమాంటిక్ స్టోరీలు చెప్పేవారని ఆమే చెప్పారు. ఎ) శ్రుతీహాసన్ బి) కీర్తీ సురేష్ సి) కార్తీక డి) వరలక్ష్మీ ► మరియప్పన్ అనే క్రీడాకారుని జీవితం ఆధారంగా ఓ చిత్రం (బయోపిక్) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తానని ప్రకటించారు. మరియప్పన్ ఏ క్రీడకు చెందినవాడు? ఎ) క్రికెట్ బి) బాక్సింగ్ సి) లాంగ్ జంప్ డి) హై జంప్ ► ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న భామ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రద్ధా కపూర్ బి) కంగనా రనౌత్ సి) ఇలియానా డి) రకుల్ ప్రీత్ ► ‘దేవదాసు’ చిత్రానికి మొదట అనుకొన్న హీరోయిన్ సావిత్రి కాదు. మరి ఎవరై ఉంటారో కనుక్కోండి? ఎ) భానుమతి బి) యస్. వరలక్ష్మి సి) అంజలీదేవి డి) ‘షావుకారు’ జానకి ► ‘శంకరాభరణం’ చిత్రంలో మంజు భార్గవి కొడుకు పాత్రలో నటించింది ఓ అమ్మాయి. తర్వాత కాలంలో ఆమె నటిగా చాలా పాత్రలు పోషించారు. ఆమె పేరేంటి? ఎ) శ్రీలక్ష్మీ బి) తులసి సి) ప్రగతి డి) రజిత ► యలవర్తి నాయుడమ్మ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్త. ఆయన మనవరాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడెవరు? ఎ) నాని బి) రామ్‌చరణ్ సి) కల్యాణ్‌రామ్ డి) ఆది ► ‘మనం దేన్నైతే అసహ్యించుకుంటామో దేవుడు అందులోంచి ముంచి లేపుతాడు’ అనేది ‘మహానుభావుడు’ సినిమాలో డైలాగ్. సినిమాలో ఈ డైలాగ్‌ను ఏ కమెడియన్ చెప్తాడు? ఎ) భద్రం బి) ‘వేన్నెల’ కిశోర్ సి) టిల్లు వేణు డి) రఘుబాబు ► ‘దాన వీర శూర కర్ణ’ సినిమా దర్శకుడెవరు? ఎ) కమలాకర కామేశ్వరరావు బి) కె.వి. రెడ్డి సి) విఠలాచార్య డి) ఎన్టీ రామారావు ► ప్రభాస్ తన మొదటి చిత్రం ‘ఈశ్వర్’తో మొదలుకొని ‘బాహుబలి’ రెండు పార్టులతో కలిపి ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 18 బి) 21 సి) 14 డి) 25 ► ‘ఆకలేస్తే అన్నం పెడతా మూడొస్తే ముద్దుల్ పెడతా చిన్నోడా..’ అనే పాటను పాడింది ఎవరు? ఎ) శ్రేయా ఘోషల్ బి) గీతా మాధురి సి) మమతా మోహన్‌దాస్ డి) దామిని ► యస్.యస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10న. అదే రోజు పుట్టిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) రాశీఖన్నా బి) కాజల్ అగర్వాల్ సి) శ్రియ డి) రకుల్‌ప్రీత్ సింగ్ ► కమల్‌హాసన్ నటించిన ‘దశావతారం’ సినిమా దర్శకుడెవరు? ఎ) కె.యస్. రవికుమార్ బి) పి.వాసు సి) సురేశ్‌కృష్ణ డి) లింగుస్వామి ► ‘అబ్బ దబ్బ జబ్బ..’ అనే డైలాగ్ చాలా పాపులర్. ఈ డైలాగ్‌లో నటించిన లేడీ కమెడియన్ శ్రీలక్ష్మీ. ఆమెకు జోడీగా నటించిందెవరు? ఎ) ఏవీయస్ బి) బ్రహ్మానందం సి) ధర్మవరపు డి) సుధాకర్ ► 2017లో రిలీజైన సినిమాకు 2016వ సంవత్సరానికి నేషనల్ అవార్డు లభించింది.ఆ సినిమా పేరేంటి? ఎ) ౖఖñ దీ నం 150 బి) గౌతమిపుత్ర శాతకర్ణి సి) బాహుబలి డి) శతమానం భవతి ► నటుడు వెంకటేశ్ ఎవరి సిద్ధాంతాలను నమ్ముతారో తెలుసా? ఎ) స్వామి వివేకానంద బి) రమణ మహర్షి సి) రామకృష్ణ పరమహంస డి) స్వామి పరిపూర్ణానంద ► 19. ఈ ఫొటోలోని లక్ష్మణుని పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుపట్టండి ? ఎ) కాంతారావు బి) హరనాథ్‌బాబు సి) శోభన్‌బాబు డి) చలం ► ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) భావన డి) కాజల్ అగర్వాల్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) బి 4) ఎ 5) డి 6) ఎ 7) డి 8) బి 9) ఎ 10) బి 11) డి 12) ఎ 13) సి 14) డి 15) ఎ 16) బి 17) బి 18) బి 19) ఎ 20) ఎ -
స్క్రీన్ టెస్ట్
► ఈ నటుని అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. కె. బాలచందర్ తొలి కోడి కూసింది’ సినిమా కోసం ఆయన పేరు మార్చారు? ఆ నటుడెవరు? ఎ) రఘువరన్ బి) ప్రకాశ్‌రాజ్ సి) జీవా డి) రమేశ్ అరవింద్ ► రియల్ లైఫ్ కపుల్ అయిన కృష్ణ, విజయనిర్మల రీల్‌పై అన్నా చెల్లెళ్లుగా నటించిన సినిమా పేరేంటి? ఎ) బొమ్మలు చెప్పిన కథ బి) అల్లూరి సీతారామరాజు సి) పండంటి కాపురం డి) సాక్షి ► బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో కలిసి ‘మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్’ (మర్ద్) అని ఒక క్యాంపైన్ నిర్వహించారు? ఈ క్యాంపైన్‌కి తన వాయిస్ వినిపించిన తెలుగు టాప్ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) నాని సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ సహాయనటి తర్వాత కాలంలో చాలా పేరు తెచ్చుకున్నారు? ఆమె ఎవరై ఉంటారు? ఎ) సుద బి) తెలంగాణ శకుంతల సి) అల్లరి సుభాషిణి డి) ప్రగతి ► ‘వినవే బాల నా ప్రేమ గోల..’ అంటూ ఈ నటుడు పాడిన పాటను ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటూనే ఉంటారు? ఈ పాట పడిన నటుడెవరు? ఎ) రమణారెడ్డి బి) రేలంగి సి) పద్మనాభం డి) రాజనాల ► ‘అబ్బాయిగారు’లో వెంకటేశ్ సవతి తల్లిగా నటించిన జయచిత్ర కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా? ఎ) భారతంలో ఒక అమ్మాయి బి) యవ్వనం కాటేసింది సి) చిల్లరకొట్టు చిట్టెమ్మ డి) సోగ్గాడు ► తెలుగు ‘ప్రేమఖైదీ’లో హరీష్ హీరో. అదే సినిమా హిందీ రీమేక్‌లో కూడా అతనే హీరో. హిందీ సినిమాలో అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బాలీవుడ్ నటితర్వాత చాలా పెద్ద స్టార్ అయ్యారు? ఆమె ఎవరు? ఎ) మాధురీ దీక్షిత్ బి) కరీనా కపూర్ సి) కరిష్మా కపూర్ డి) టబు ► ‘కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ ఉండదు’ అని రజనీకాంత్ ఏ సినిమాలో చెప్తాడు? ఎ) భాష బి) అరుణాచలం సి) నరసింహా డి) శివాజి ► దర్శక మేధావి ‘జెంటిల్మెన్ శంకర్’ ఏం చదువుకున్నారో తెలుసా? ఎ) మెకానికల్ ఇంజనీర్ బి) లా సి) లెదర్ టెక్నాలజీ డి) టక్స్‌టైల్ డిజైనింగ్ ► శ్రుతీహాసన్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) @యువర్స్ ట్రూలీ శ్రుతి బి) @ శ్రుతీహాసన్ సి) @ మీ శ్రుతీహాసన్ డి) @ శ్రుతీ సేస్ ► 2009లో ‘మిస్ టీన్ వరల్డ్’ టైటిల్ నెగ్గిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఐశ్వర్యా రాయ్ బి) సుస్మితా సేన్ సి) అమీ జాక్సన్ డి) ఆండ్రియా ► అంతస్తులు చిత్రంలో ‘దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా’అంటూ హుషారెత్తించిన కథానాయిక ఎవరో గుర్తున్నారా? ఎ) జమున బి) బి. సరోజా దేవి సి) భానుమతి డి) కృష్ణకుమారి ► ‘ఇంతేనయా తెలుసుకోవయా, ఈ లోకం ఇంతేనయా’ అనే పాట రాసిన రచయిత ఎవరు? ఎ) దాశరథి బి) వేటూరి సుందర రామ్మూర్తి సి) సముద్రాల డి) ఘంటసాల ► మహా శక్తిమాన్’ అనే హిందీ త్రీడి ఫిలిమ్‌కి దర్శకత్వం వహించింది ఓ ప్రముఖ తెలుగు కెమేరామేన్? ఆయనెవరు? ఎ) వి.యస్.ఆర్. స్వామి బి) ఎస్. గోపాల్‌రెడ్డి సి) జయనన్ విన్సెంట్ డి) జయరామ్ ► దర్శక–నిర్మాతగుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) సొగసు చూడతరమా బి) రామాయణం సి) లాఠీ డి) చూడాలని ఉంది ► పరుచూరి బ్రదర్స్ రచయితలుగా ఏ హీరోతో ఎక్కువ సినిమాలకు పనిచేశారు? ఎ) కృష్ణ బి) బాలకృష్ణ సి) చిరంజీవి డి) నాగార్జున ► యం.యం. కీరవాణి ఏ సంగీత దర్శకుని దగ్గర శిష్యరికం చేశారో చెప్పుకోండి చూద్దాం? ఎ) కేవీ మహదేవన్ బి) ఇళయరాజా సి) యం.ఎస్. విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ఎన్టీఆర్, ఛాయాదేవి ఉన్న ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) కన్యాశుల్కం బి) శకుంతల సి) విజయం మనదే డి) మంగళసూత్రం ► నటుడు మంచు విష్ణు ఏ క్రీడలో యూనివర్సిటీ కెప్టెన్‌గా వ్యవహరించారు? ఎ) వాలీబాల్ బి) బాస్కెట్‌బాల్ సి) క్రికెట్ డి) హాకి ► ఈ క్రింది ఫోటోలోని బాలుణ్ణి గుర్తుపట్టారా? ఎవరతను? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) అక్కినేని నాగార్జున సి) కాంతారావు డి) హరనాథ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) బి 5) బి 6) డి 7) సి 8) సి 9) ఎ 10) బి 11) సి 12) సి 13) ఎ 14 ) ఎ 15) సి 16) ఎ 17) డి 18) ఎ 19) బి 20) ఎ -
కరీనా పెళ్లికి ఇదే ఆహ్వానం!
కరీనా కపూర్ పెళ్లి సైఫ్ అలీ ఖాన్‌తో అయింది కదా! ఇప్పుడు పెళ్లికి ఆహ్వానం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. అసలు విషయంలోకి వెళదాం. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి రెడీ అవ్వడం అంటేనే ఆడవాళ్లకు అదో పెద్ద విషయం. చీర అంటే దానికి తగ్గ నగలు, లెహెంగా అంటే దానికి మ్యాచింగ్ జ్యువెలరీ... పెట్టుకొనే బొట్టు, వేసుకునే జడ, దిద్దుకునే కాటుక, లిప్‌స్టిక్... ఇలా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటారు. ఇక్కడున్న రెండు ఫొటోల్లో ఒక ఫొటోలో అమ్మాయిలు సీరియస్‌గా రెడీ అవుతున్న దృశ్యాన్ని చూస్తున్నారు కదా. ఒక బ్యూటీ ఇంకో బ్యూటీకి కొంగు సాయం చేస్తోంటే, మరో సుందరి పాదరక్షలు వేసుకుంటోంది. ఇంకో అమ్మాయి జాకెట్ హుక్స్ పెట్టడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? అన్నట్లు చూస్తోంది. ఇక, ఒక అమ్మాయి మాత్రం ఏ యాక్టివిటీ లేకుండా అలా నిలబడి ఉంది. అంటే... ఆల్రెడీ రెడీ అయిందన్న మాట. ఇంతకీ ఈ నలుగురూ ఎవరంటే? కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా. ఈ నలుగురి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘వీరీ ది వెడ్డింగ్’. కరీనా కపూర్ పెళ్లి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం వేడుకలే. పెళ్లికి అందరూ రెడీ అవుతున్న ఒక ఫొటోను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం విడుదల చేసింది. బుధవారం మరో స్టిల్ రిలీజ్ చేసింది. ‘ముహూర్తం ఫిక్స్’ అనే పోస్టర్ అది. అంటే... విడుదల తేదీ ముహూర్తం అన్నమాట. ‘ఇదే మా ఆహ్వానం.. సేవ్ ది డేట్’ అని రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. శశాంకా ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాలో కరీనా పెళ్లి వేడుకలు పసందుగా ఉంటాయట. విడుదల చేసిన రెండు లుక్స్‌లో ఆ కళ కనిపిస్తోంది కదూ! నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇంగ్లిష్ మూవీ ‘క్విక్ గన్ మురుగన్’ తీసిన శశాంకా హిందీలో ‘ముంబై కట్టింగ్’, ‘కూబ్సూరత్’ సినిమాలు తీశారు. వీటిలో ‘ముంబై కట్టింగ్’ 11 కథలతో తీసిన సినిమా. ఒక కథకు శశాంకా దర్శకత్వం వహించారు. -
మా ఆయన పద్మశ్రీ లాక్కోవట్లేదు: కరీనా
సైఫ్ అలీఖాన్‌కు గతంలో ఇచ్చిన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకుంటోందని కథనాలు రావడంతో.. ఆయన భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. అవన్నీ వదంతులేనని, అవార్డు వెనక్కి తీసుకోవట్లేదన్న విషయాన్ని అధికారులు ఒక లేఖ ద్వారా తమకు తెలియజేశారని చెప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కరీనా విలేకరులను పిలిచి మరీ ఈ లేఖ విషయం తెలిపింది. కళా రంగంలో సేవలు అందించినందుకు గాను 2010 సంవత్సరంలో సైఫ్ అలీఖాన్‌ను ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ముంబైలోని ఓ హోటల్లో ఎన్నారై వ్యాపారవేత్త మీద దాడి చేసిన సంఘటనలో ముంబై కోర్టు అతడిపై నేరారోపణ చేయడంతో ప్రభుత్వం పద్మశ్రీని వెనక్కి తీసుకుంటుందంటూ కథనాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటూ నేరుగా ప్రభుత్వం నుంచే లేఖ వచ్చిందని, అందువల్ల ఇక ఎవరూ దీని గురించి ఎలాంటి కట్టుకథలు రాయనక్కర్లేదని తెలిపింది.