ఆయనతో డేటింగ్‌ చేయాలని ఉంది! | Heroin Kareena wanted to go on a DATE with Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఆయనతో డేటింగ్‌ చేయాలని ఉంది!

Published Sat, Mar 2 2019 2:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Heroin Kareena wanted to go on a DATE with Rahul Gandhi - Sakshi

కరీనా కపూర్‌ బాలీవుడ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన రోజులవి. జేపీ దత్తా తెరకెక్కించిన ‘రెఫ్యూజీ’ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ సరసన హీరోయిన్‌గా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సందర్భంగా సిమి గరేవాల్‌ నిర్వహించే ‘రెండెజ్వస్‌’ టీవీ షోలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితం గురించి పలు విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూలో భాగంగా ఎవరితో డేటింగ్‌ చేయాలని మీరు కోరుకుంటున్నారు? అని సిమి ప్రశ్నించగా.. కరీనా అనూహ్యరీతిలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తాను డేటింగ్‌ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన  అంటే ఆసక్తి కలుగుతోందని, ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందని ఆమె తెలిపారు.

‘ఈ విషయం చెప్పాలో లేదో అర్థం కావడం లేదు. ఇది చెప్పడం వల్ల వివాదాస్పదమైనా పర్లేదు. రాహుల్‌ గాంధీ. ఆయన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మ్యాగజీన్‌లు తిరగేస్తున్నప్పుడు ఆయన ఫొటోలను చూస్తుంటాను. ఆయనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి నేను వచ్చాను. రాజకీయ కుటుంబం నుంచి ఆయన వచ్చారు. కాబట్టి మా మధ్య ఆసక్తికరమైన సంభాషణ ఉంటుందని అనుకుంటున్నాను’ అని ఎవరితో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు కరీనా బదులిచ్చారు. సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలై.. సినిమాలు కంటిన్యూ చేస్తున్న ఈ భామ ప్రస్తుతం ‘గూడ్‌ న్యూస్‌’, ‘థక్త్‌’ భారీ సినిమాల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement