రెండేళ్ల క్రితం విడుదలైన హిందీ చిత్రం ‘హిందీ మీడియం’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించింది. సాకేత్ దర్శకత్వంలో ఇర్ఫాన్‌ఖాన్, సాబా క్వామర్, దీపక్ దోబ్రియాల్, షాయన్న పటేల్ ముఖ్య పాత్రలు చేశారు. దినేష్ విజన్ నిర్మించారు. ‘హిందీ మీడియం’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు అప్పట్లోనే స్ట్రాంగ్‌గా వార్తలు వచ్చాయి. అయితే.. ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్య పరిస్థితుల కారణంగా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవల ఇర్ఫాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితులు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్‌కి రావడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ఏంటంటే...ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనా కపూర్‌ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఇంతకుముందు రాధిక ఆప్టే పేరు తెరపైకి వచ్చింది.
రెండేళ్ల తర్వాత ‘వీరేది వెడ్డింగ్’వంటి వందకోట్ల సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన కరీనా ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహార్ పీరియాడికల్ మూవీ ‘తక్త్’లో నటించనున్నారు. ఇప్పుడు‘హిందీ మీడియం’ సీక్వెల్‌లో సెట్ అయితే.. కరీనా మళ్లీ బిజీ ట్రాక్‌లో పడ్డట్లే లెక్క. ‘‘ఇర్ఫాన్‌ఖాన్ తిరిగి వచ్చారు. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాం. మరో రెండు నెలల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని నిర్మాత దినేష్ విజన్ పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్.
మస్త్ బిజీ
Published Mon, Apr 1 2019 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment