సిద్ధార్థ్
2018 బాలీవుడ్‌లో మంచి హిట్ సాధించి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్’. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్‌హిట్ చిత్రం సౌత్‌లో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌ను సిద్ధార్థ్‌తో చేయాలనుకున్నారు దర్శక–నిర్మాతలు. బాల్ ఆయన కోర్ట్‌లో ఉంది. వెంటనే సిద్ధార్థ్ ‘‘అంథాధూన్’ లాంటì అద్భుతమైన చిత్రం రీమేక్‌లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్‌గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్‌లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్‌లో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురాన కూడా ‘చెయ్ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్‌లో సిద్ధార్థ్ కనిపిస్తారో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment