siddhartha
-
కంప్యూటర్ కమాండర్.. సిద్ధార్థ
తెనాలి: ఈ చిన్నోడు సామాన్యుడు కాదు. కంప్యూటర్ లాంగ్వేజెస్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దిట్ట. కంప్యూటర్ సైంటిస్టులకే పాఠాలు చెబుతాడు. ఐఐటీ విద్యార్థులకు (IIT Students) రోల్ మోడల్. కంప్యూటర్ ప్రపంచం మెచ్చిన డేటా సైంటిస్ట్ (Data Scientist). పన్నెండేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేసిన ఘనుడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన డేటా సైంటిస్ట్‌గా గూగుల్‌తోనే చెప్పించుకున్న తెనాలి చిన్నోడు. పేరు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ (Siddharth Srivastav Pilli). ఇప్పుడు వయస్సు 17 ఏళ్లు. చదువుతున్నది ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం. హైదరాబాద్ ఐఐటీలో (Hyderabad IIT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగానూ పని చేస్తున్నాడు. వారంలో మూడు రోజులు చదువు.. మూడు రోజులు ఉద్యోగం. ఏడో తరగతి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌పై పట్టు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో సిద్ధార్థకు చిన్నతనం నుంచీ కంప్యూటర్‌పై బలమైన అభిరుచి కలిగింది. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్పించారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు.సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులూ చేయటంతో ఆత్మవిశ్వాసం కలిగింది. అప్పుడే ఉద్యోగం చేస్తానని తండ్రితో చెప్పాడు. తండ్రి పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మరింత పరిజ్ఞానం కోసం తండ్రి అతడిని ఓ కంప్యూటర్ సంస్థలో చేర్చాలని తీసుకెళ్లగా.. బాలుడన్న కారణంతో చేర్చుకోలేదు. దీంతో తండ్రి ఆన్లైన్ కోర్సుల్లో చేర్పించారు. ఇలా వీడియోలు చూస్తూ స్వయంగా అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై గట్టి పట్టు సాధించాడు. ఉద్యోగ సాధన ఉద్యోగం చేస్తానని మరోసారి చెప్పినా భారత్‌లో సాధ్యం కాదని తండ్రి చెప్పేశారు. పట్టువదలని సిద్ధార్థ తనే ఓ రెజ్యూమె తయారు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడుతూనే.. వయసు, చదువు తక్కువన్న భావనతో పట్టించుకోలేదు. సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసిన మోంటెగ్న్ కంపెనీ సీఈవో ‘నీతో వండర్స్ చేయిస్తా’ అంటూ ఉద్యోగం ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి షరతు విధించడంతో మూడు రోజులు ఉద్యోగానికి ఓకే చేశారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు.కొద్దికాలంలోనే అదే హోదాతో మరో సంస్థకు మారాడు. నెలకు రూ.45 వేల వేతనంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేశాడు. మూడురోజులు స్కూలుకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులూ నిర్వహించాడీ బాల మేధావి. అవార్డులు, అవకాశాలు.. సిద్ధార్థ ప్రతిభను గుర్తించిన బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ బుడతడిని స్వయంగా ఆహ్వానించి భూకంపాలను ముందుగానే గుర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అప్పగించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోనే గటిక్ కాలేజిలో ఇంటర్లో చేరాడు. మరోవైపు అక్కడి ట్రిపుల్ ఐటీలో రీసెర్చ్ ఇంజినీరుగానూ పరిశోధన కొనసాగించాడు. ఇంకోవైపు కోడింగ్ క్లాసులూ చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేయసాగాడు. ఇవన్నీ గమనించిన ఐఐటీ–హైదరాబాద్ అతడికి ఆర్టిఫిషియల్ ఇంజినీరుగా ఉద్యోగాన్నిచ్చింది.చదవండి: అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’ప్రస్తుతం సిద్థార్థ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూనే.. ఏడాదిగా ఐఐటీలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల శాంసంగ్ కంపెనీ జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సాల్వ్ ఫర్ టుమారో’ పోటీలో టాప్ టెన్‌లో ఒకడిగా వచ్చాడు. కృత్రిమ మేధలో అతడి నవీన ఆలోచన అందులో ఎంపికైందని సిద్థార్థ తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. 2022–23లో ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డునూ సిద్ధార్థ అందుకున్నాడు. ‘సాక్షి’ మీడియా చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. జాతీయస్థాయి న్యూస్ ఛానల్స్ ఇతని ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి.ఇదే లక్ష్యం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవిత చరిత్రలు, బిల్ గేట్స్ మాటలు, స్టీవ్ జాబ్స్ పనితీరుతో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నట్టు సిద్ధార్థ చెప్పాడు. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండాలని, మంచి గేమ్ డిజైన్ చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా చేస్తానని, వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్‌కు రూపకల్పన చేయాలనే ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు తెలిపాడు. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఇందుకోసం ఇన్ఆర్గానిక్ అవకాశాలను (వేరే సంస్థను కొనుగోలు చేయడం వంటివి) పరిశీలిస్తామని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలి పారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని వివరించారు.అగ్ని ప్రమాద బీమా వంటి జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్ఐసీకి నైపుణ్యాలు లేవని, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మా త్రం చేయగలదని మొహంతి తెలిపారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరించి ఒకే గొడుగు కింద లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేసే విధంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయొచ్చనే అంచనాల నేపథ్యంలో మొహంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
తెనాలి: తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ చిరు ప్రాయంలోనే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్ ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్‌పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. నాలుగైదేళ్లు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ, ఆన్లైన్ కోర్సులతో సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోంటెగ్న్ కంపెనీ సీఈవో సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్ చేశారు. ఆవిధంగా ఏడో తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల వేతనంతో చేరాడు. తర్వాత ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటూ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్లో వినూత్న గేమ్ డిజైనింగ్‌లో కృషిచేస్తున్నాడు. వారంలో మూడురోజులు పాఠశాలకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులు నిర్వహించాడీ బాలమేధావి.మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తిచేసిన సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడమనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకూ పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐఐటీ కొత్తగా ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మెషీన్ లెరి్నంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగా సిద్ధార్థకు అవకాశం కల్పించింది. -
బాతు పిల్లతో ఆడుకుందామనుకుంటే.. మిగిలిన విషాదం!
ఖమ్మం: బాతు పిల్లతో ఆడుకుందామనుకున్నారు.. దానిలా నీటిలో అటూ.. ఇటూ.. తిరుగుదామనుకున్నారు.. కానీ, బాతును తేలియాడనిచ్చిన నీరు చిన్నారులను ముంచేసింది.. ముక్కు పచ్చలారని చిన్నారులను.. బంగారు భవిష్యత్ ఉన్న ఆ పిల్లలను విగతజీవులుగా మార్చింది.. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రు లు గుండెలు బద్ధలయ్యేలా విలపించారు.. దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.. హాహాకారాలు చేస్తూ గుండెలు బాదుకున్నారు.. వీరి ఆర్తనాదాలతో సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఎస్సీకాలనీకి చెందిన కోలా సిద్ధార్థ (12), ఇసరం వికాస్ (7), చేవల రుషి కలిసి ఇళ్లకు సమీపంలో ఉన్న హెచ్.పుల్లయ్య వరిపొలంలోని నీటిగుంత దగ్గరికి వెళ్లారు. వికాస్ బాతుపిల్ల కాలికి తాడు కట్టి నీళ్లల్లో ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో రాయిపై నిల్చొని వంగి ఆడిస్తుండగా జారిపోయాడు. గమనించిన సిద్ధార్థ.. వికాస్ కాళ్లను పట్టుకొని కాపాడే యత్నంలో ఆతను కూడా నీటిలో పడిపోయాడు. ఒడ్డున ఉన్న రుషి పరిగెత్తుకుంటూ వచ్చి సమీపంలో వాలీబాల్ ఆడుతున్న వికాస్ తండ్రి శ్రీను, యువకులకు చెప్పాడు. హుటాహుటిన వారు వెళ్లి నీటిలో మునిగిన సిద్ధార్థ, వికాస్‌ను బయటకు తీసి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కూలి పనులే ఆధారం.. మృతుడు కోలా సిద్ధార్థ తండ్రి మహేశ్ ఆటోడ్రైవర్. తల్లి నాగమణి వ్యవసాయ కూలీ. వికాస్ తండ్రి శ్రీను ఐరన్ రాడ్‌బెండింగ్ వర్కర్. తల్లి గంగ కూలి పనులు చేస్తుంటారు. ఆదివారం సెలవు కావటంతో పిల్లలు ముగ్గురు ఎప్పటిలాగే ఆడుకోవటానికి వెళ్లారు. సిద్ధార్థ 6వ తరగతి, వికాస్ ఒకటో తరగతి కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సిద్ధార్థకు తమ్ముడు బాలు, వికాస్‌కు తమ్ముడు వెంకట్ ఉన్నారు. ఇద్దరు ఒకే వీధి పిల్లలు మృతిచెందటంతో కాకర్లపల్లి ఎస్సీకాలనీ కన్నీటిసంద్రమైంది. సత్తుపల్లి పట్టణ సీఐ మోహన్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. ఇవి చదవండి: ఖాకీ వలలో విద్యార్థిని విలవిల -
అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం
హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఈ రోజు ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు... తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్ తదితర అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
తెరపైకి ‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ బయోపిక్
‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ్ జీవితం త్వరలోనే తెరపైకి రానుంది. ఆయన బయోపిక్‌ను రూపొందించనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్లు శుక్రవారం ప్రకటించాయి. ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్, ప్రోసెంజీత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకంగా ఆధారం ఆయన బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు స్పస్టం చేశారు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య కాగా నిన్న సదరు నిర్మాణ సంస్థలు మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపాయి. ఈ సందర్భంగా ‘కాఫీ మనందరి జీవితంలో భాగం చేసి వీజీ సిద్ధార్థ్ వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించారు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్ ఘటన. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అయిన వీజీ సిద్ధార్థ్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఒడిదుడుకులకు సంబంధించి లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే ‘కాఫీ కింగ్: ది స్వీఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డేత్ ఆఫ్ కెఫె కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్’. ఇది వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ. చదవండి: Sai Pallavi: ఆ వీడియో బయటకు రావడంతో దారుణంగా ట్రోల్ చేశారు, ఇక అప్పడే.. అందుకే ఆయన బయోపిక్ హక్కులను తీసుకున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని టీ-సీరిస్ చైర్మన్ భూషన్ కూమార్ తెలిపాడు. కెఫె కాఫీ డే ఫౌండర్‌గా వీజీ సిద్ధార్థ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆనతి కాలంగో గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి వీజీ సిద్ధార్థ్ 2019 జూలైలో ఆకస్మాత్తుగా కర్ణాటకలోనే ఓ నది శవమై తేలారు. అప్పటికి ఆయనకు 59 ఏళ్లు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేంటో ఇప్పటికి తెలియదు. సిద్ధార్థ మరణాంతరం ఆయన భార్య మళవిక హెగ్డే కెఫె కాఫీ డే బాధ్యతలు చేపట్టారు. చదవండి: భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..! -
భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..!
మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. ఇక నుంచి ఆమెను అందరూ ఒక ఆదర్శంగా తీసుకుంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఆమె ఎవరో?.. ఆమె ఎందుకు ప్రత్యేకమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తన భర్త సిద్ధార్థ్ విధికి తల వంచితే.. మాళవిక హెగ్డే మాత్రం విధిని ఎదిరించి బలంగా నిలబడ్డారు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక ద ఎకనమిక్ టైమ్స్‌కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని చదివితే ఆమె ఎంత స్పష్టతతో ఉన్నారో.. ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతుంది. కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని తెలిపారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (చదవండి: బంపర్ ఆఫర్..! సాఫ్ట్ వేర్ జాబ్‌కు రిజైన్ చేస్తే రూ.4లక్షలిస్తాం!!) -
సస్పెన్స్ థ్రిల్లర్
తేజేశ్వర రెడ్డి, సిద్ధార్థ, భరత్ సాగర్ హీరోలుగా ప్రియాన్ష, అనోన్య హీరోయిన్లుగా మాస్టర్ కుశాల్ రెడ్డి కీలక పాత్రలో నటించనున్న చిత్రం ‘భిక్ష’. ‘మహానగరంలో శివచందు’, ‘సాయే దైవం’, ‘2 ఫ్రెండ్స్’, ‘స్నేహవే ప్రీతి (కన్నడ)’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జిఎల్బి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జిఎల్బి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మా చిత్రాన్ని ప్రారంభించాం. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, హైదరాబాద్, కరీంనగర్, కంఠాత్మకూర్, హంపీ, విజయవాడ, వైజాగ్‌లలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్ర రెడ్డి, సంగీతం: శ్రీపాల్, సహ నిర్మాత: తీగుళ్ళ స్వప్నకిరణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భిక్షపతి గౌడ్ వడ్డేపల్లి. -
అమర్త్య హెగ్డేతో డీకేశీ కుమార్తె నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, వరుడి తాతయ్య ఎస్ఎం కృష్ణ నివాసంలో ఈ వేడకను నిర్వహించారు. కాగా డీకేశీ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన అమర్త్య సైతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. కాగా 2019 జూలైలో అదృశ్యమైన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ.. ఆ తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో శవమై కనిపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇక ప్రస్తుతం వారి వ్యాపారాలను సిద్ధార్థ భార్య మళవిక నిర్వహిస్తున్నారు. కాగా సిద్ధార్థ, శివకుమార్ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందని వారి సన్నిహితులు తెలిపారు. (వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!) -
కాఫీ డే సిద్ధార్థ కోడలిగా డీకేశి కుమార్తె!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు ఇచ్చే వివాహం జరిపించాలని వారి కుటుంబ పెద్దలు నిర్ణయించారు. శివకుమార్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన అమర్త్య సైతం వ్యాపారంలో కొనసాగుతున్నారు. కాగా వీరిద్దరి పెళ్లిపై చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకేశి కుటుంబ సభ్యులు వెళ్లినట్టు అయన సన్నిహితుల ద్వారా తెలిసింది. (‘కాఫీ కింగ్’ విషాదాంతం) ఇక ఐశ్యర్య-అమర్త్య వివాహంపై శివకుమార్ మాట్లాడుతూ.. సిద్ధార్థ ఉన్నప్పుడు వీరి వివాహానికి సంబంధించి ఓ సారి ప్రస్తావన వచ్చిందని చెప్పారు. జూలై 31 నాటికి ఆయన మృతి చెందిన ఏడాది పూర్తి అవుతుందని.. ఆ తరువాత పెళ్లి తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. సిద్ధార్థకు శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ బార్య మళవికా చూసుకుంటున్నారు. (ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ) -
కాఫీ డే కేసు: వెలుగులోకి షాకింగ్ విషయాలు
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది జూలైలో ఆయన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో కాఫీడే బోర్డు దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్ కాఫీ డే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే దాదాపు రూ.2000 కోట్లకు సంబంధించి లెక్కలు తేలలేదని తెలుస్తోంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే ఈ నివేదికను బయటపెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా సిద్దార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లు ఒక లేఖ బయటపడిన విషయం తెలిసిందే. చదవండి: సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్ 'అందులో ఓ పారిశ్రామిక వేత్తగా తాను విఫలమయ్యానని, కంపెనీ ప్రతి ఆర్థిక లావాదేవీకి తనదే బాధ్యత అని తెలిపారు. తాను నిర్వహించిన లావాదేవీల వివరాలు కాపీ డే బోర్డు, ఆడిటర్లు , సీనియర్ మేనేజ్మెంట్కు కూడా తెలియదని' అందులో పేర్కొన్నారు.తాజాగా కాఫీ డే బోర్డు జరిపిన దర్యాప్తులో వందల కొద్ది లావాదేవీలను కొన్ని నెలలపాటు దర్యాప్తు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డే, వీజీ సిద్ధార్థకు చెందిన పర్సనల్ బిజినెస్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఫైనలైజ్ చేస్తున్నారు. కాగా.. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ? కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!! -
ఎల్లలు దాటుతున్న ‘స్పందన’
ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రిక ‘స్పందన’ కార్యక్రమం ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. అర్జీలు తీసుకోవడం, అధికారులకు పంపడానికి పరిమితం కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో తిరుగు సమాధానం కూడా ఇస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై చర్చ నెలకొంది. దీంతో దీనిని మరింత విస్తృతపరిచేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నిర్ణయించారు. సుదూర ప్రాంతాల్లో ఉండే జిల్లాకు చెందిన వారికి సైతం ఈ సేవలు అందించాలని.. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉందన్న భావన వారిలో కల్పించాలని సంకల్పించారు. కార్యక్రమం నిర్వహణ ఇలా.. ప్రతి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లా ఎస్పీ తన వద్దకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడతారు. మ.2.30–4.00 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పోలీసుస్టేషన్లకు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఆన్లైన్ స్పందన కార్యక్రమానికి సంబంధించి టైమ్‌స్లాట్‌ను నిర్ణయించనున్నారు. విదేశాలలో ఉండేవారు ముందుగా ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన ప్రకాశం జిల్లా వాట్సప్ నంబర్ 9121102266కు లేదా ‘ప్రకాశం పోలీస్’ ఫేస్బుక్ అకౌంట్‌కు ఒక రిక్వెస్ట్ పంపుకోవాలి. దీంతో తమకు ఫలానా సమయంలో కుదురుతుందని పేర్కొంటూ ఆ సమయాన్ని వాట్సప్ ద్వారా ఒక లింక్ ఇస్తారు. దాని ద్వారా నేరుగా ఎస్పీతో మాట్లాడేందుకు అవకాశం కలుగుతుంది. ఇలా మాట్లాడిన వారికి కూడా ఆన్లైన్ లేదా వారి బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్తే స్పందన రశీదును కూడా అందజేస్తారు. ‘స్పందన’కు విచ్చేసి వెయిటింగ్ హాలులో వేచిఉన్న ప్రజానీకం (ఫైల్) నేటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. సీఎం ఆదేశాలను జిల్లా ఎస్పీ స్ఫూర్తిగా తీసుకున్నారు. ఫిర్యాది, విచారణాధికారి, తాను ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి ఈనెల 25 నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందనను నిర్వహించాలని నిర్ణయించారు. తామూ జిల్లాకు చెందిన వారమేనని, తమ సమస్యలను చెప్పుకునేందుకు ఓ ప్లాట్‌ఫాం అవసరమంటూ తమ ఆవేదనలను ఇప్పటికే ఎస్పీకి ఫేస్బుక్ ద్వారా పలువురు తెలియజేశారు. భూ సమస్యలను సైతం రెవెన్యూ, భూసర్వే విభాగం తదితర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా పరిష్కరిస్తుండడంతో జర్మనీ, హైదరాబాదు నుంచి ఎస్పీకి వినతులు అందాయి. దీంతో స్పందనను విశ్వవ్యాప్తం చేయాలని నిర్ణయించారు. ప్రజల కోసమే పోలీస్ పోలీసు శాఖపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ‘స్పందన’ మంచి అవకాశంగా నాకు అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారికి సెలవులు లభించక ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించా. ఇక విదేశాల్లో ఉండేవారి వెతలు చెప్పక్కర్లేదు. వారి సమస్య ప్రకాశం జిల్లా పరిధిలోనిది అయినపుడు వారికి కూడా న్యాయం జరగాలి కదా అన్న ఉద్దేశంతో ఆన్లైన్ స్పందనను ప్రారంభిస్తున్నాం. – సిద్ధార్థ కౌశల్, ప్రకాశం జిల్లా ఎస్పీ -
బిగ్‌బాస్: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా!
బిగ్‌బాస్ హిందీ సీజన్ 13కు ఎన్ని వివాదాలు ఎదురైనప్పటికీ హోస్ట్ సల్మాన్‌ఖాన్ షోను పరుగులు పెట్టిస్తున్నాడు. పైగా ఇందులో పాల్గొంటున్న అందరూ సెలబ్రిటీలే కావడం షోకు అదనపు ఆకర్షణగా మారింది. ఇక ఈ షోలో పాల్గొంటున్న కొయినా మిత్ర ఇబ్బందికర అనుభవాన్ని ఎదుర్కొంది. తాజా ఎపిసోడ్లో తోటి కంటెస్టెంట్ సిద్ధార్థ డే బాత్రూం గడియ పెట్టుకోకుండా స్నానం చేస్తున్నాడు. ఆ విషయం తెలియని కొయినా నేరుగా డోర్ తెరిచి బాత్రూంలోకి వెళ్లబోయింది. ఈ హఠాత్పరిణామంతో అతను గట్టిగా కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న పరాస్ చాబ్రా, మహీరా శర్మ ఏం జరిగిందంటూ కొయినాను అడిగారు. అప్పటికీ షాక్‌లోనే ఉన్న కొయినా కాసేపటికి తేరుకుని జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో పరాస్, మహీరా పగలబడి మరీ నవ్వారు. అనుకోకుండా జరిగింది అంటూ కొయినా వాళ్లకు సంజాయిషీ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని మళ్లీ సిద్ధార్థ డేకు గుర్తు చేసి అతన్ని ఇబ్బందిపెట్టకండి అని కోరింది. ముఖ్యంగా ఇంటి సభ్యులకు ఎవరికీ చెప్పకండి అని కొయినా వేడుకుంది. అయితే వాళ్లు ఆమె మాటలను పట్టించుకోలేదు. పరాస్ వెళ్లి అసిమ్తో చెప్పగా అతను ఇంటి సభ్యులందరికీ చాటింపు వేశాడు. దీంతో సిద్దార్థ్ డే స్నానం చేసి బయటికి రాగానే షేమ్ షేమ్ అంటూ పాటలు పాడుతూ ఇంటి సభ్యులు అతన్ని ఆటపట్టించారు. -
కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి
సాక్షి, మైసూరు: కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో వీజీ సిద్ధార్థ ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ముందు ఆయన తన తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. మరోవైపు అనారోగ్య కారణాల నేపథ్యంలో గంగయ్య హెగ్డేకు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. చదవండి: కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా -
అమ్మకానికి కాఫీ డే ’గ్లోబల్ పార్క్’
న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. అలాగే, అనుబంధ సంస్థ అల్ఫాగ్రెప్ సెక్యూరిటీస్‌లో కూడా వాటాలను ఇల్యూమినాటి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రతిపాదనకు కూడా సీడీఈ బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ‘రుణభారం తగ్గించుకునే మార్గాలపై డైరెక్టర్ల బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో భాగమైన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కి విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. మదింపు ప్రక్రియ, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించడం మొదలైనవన్నీ పూర్తయ్యాకా వచ్చే 30–45 రోజుల్లో ఈ డీల్ పూర్తి కావచ్చు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు సీడీఈ తెలియజేసింది. ఈ రెండు ఒప్పందాలతో కాఫీ డే గ్రూప్ రుణభారం గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. ఇన్వెస్టర్లు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లు మొదలైన సంబంధిత వాటాదారులందరికీ ఈ డీల్స్ ప్రయోజనకరంగా ఉండగలవని వివరించింది. ఆతిథ్య, రియల్టీ తదితర రంగాల్లోని అన్‌లిస్టెడ్ వెంచర్స్ కారణంగా వీజీ సిద్ధార్థ నెలకొల్పిన సీడీఈ రుణభారం రెట్టింపై రూ. 5,200 కోట్లకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల సిద్ధార్థ అదృశ్యం కావడం, ఆ తర్వాత నేత్రావతి నదిలో శవమై తేలడం ఆయన మరణంపై సందేహాలు రేకెత్తించాయి. సిద్ధార్థ అకాల మరణంతో జూలై 31న స్వతంత్ర డైరెక్టర్ ఎస్వీ రంగనాథ్ సీడీఈ తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. రంగనాథ్‌తో పాటు సీవోవో నితిన్ బాగ్మానె, సీఎఫ్‌వో ఆర్ రామ్మోహన్‌లతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. -
సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు?
కర్ణాటక ,బొమ్మనహళ్లి : కాఫీ కింగ్, కేఫ్ కాఫీడే అధినేత, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దేశ విదేశాల్లో సైతం వ్యాపారం చేస్తున్న సిద్ధార్థ తన వ్యాపారం కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో అప్పలు తీర్చడం కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఓ అధికారి సిద్ధార్థను తీవ్రంగా వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వేధింపులు తాళలేకనే సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృదు స్వభావిగా పేరున్న సిద్ధార్థ షేర్ మార్కెట్లో రోజు రోజుకు తన కంపెనీ షేర్లు పడిపోవడంతో ఆయన కొంతమేర ఆందోళన పడ్డారని, అప్పులు పెరిగిపోవడం, మరొవైపు వేధింపులు ఆయనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయని సిబ్బంది భావిస్తున్నారు. గత సోమవారం ఉదయం బెంగళూరు నుంచి మంగళూరు వైపు వెళ్లిన సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు, ఆ మొబైల్ నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధార్థ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత అది హత్య, లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. చేతనహళ్లిలో కమ్ముకున్న విషాద ఛాయలు కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ మరణించి మూడు రోజులు గడచినా కూడా ఆయన స్వగ్రామం అయిన చేతనహళ్లిలో స్థానికులు ఆయనను మరిచిపోలేకున్నారు. సిద్ధార్థ తిథి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ భార్య మాళవిక, కుమారులు అమర్థ్య, ఇషాన్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరో పక్క సిద్ధార్థకు చెందిన ఎస్టేట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, కార్మికులు సైతం తిథి కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ యజమానిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. -
‘కేఫ్ కాఫీ డే’లో మరో కొత్త కోణం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కాఫీ సంస్కృతిలో కొత్త విప్లవానికి వాకిటి తెరచిన ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన కాఫీ డేలకు సంబంధించి రోజుకొక సామాజిక కోణం వెలుగులోకి వస్తోంది. కాఫీ డే ప్రతి స్టోర్‌లో రకరకాల కాఫీలు కలిపే నిపుణుల్లో ఎక్కువ మంది మూగ, చెవుడు వాళ్లేనట. వాళ్లకే రకరకాల కాఫీల సువాసనలు సులభంగా పసిగట్టే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా వారు రుచులను కూడా సరిగ్గా గుర్తించగలరట. ఇలాంటి వాళ్లను కార్పొరేట్ రంగం సాధారంగా పనిలోకి తీసుకోదు. ఒక్క కాఫీ కేఫ్‌ల రంగంలోనే అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సమాజంలో అంతగా ఆదరణలేని మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ద్వారా కొంత సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు ఉండడమే కాకుండా సువాసనలను సులభంగా పసిగట్టే వారి నైపుణ్యం కేఫ్‌లకు ఉపయోగపడుతుందని, ఆ ఉద్దేశంతోనే అలా ఎక్కువ మందిని తీసుకున్నట్లు మార్కెటింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణన్ తెలిపారు. ఇలా మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ఒక్క ‘కేఫ్ కాఫీ డే’లకే పరిమితం కాలేదు. కేఎఫ్సీలోని ‘కాఫీ కోస్టా’ అవుట్లెట్లకు కూడా విస్తరించింది. వాటిల్లో ఒక్క కాఫీలను తయారు చేసే నిపుణులే కాకుండా కాఫీలను, స్నాక్స్‌ను సరఫరా చేసే వాళ్లలో కూడా ఎక్కువ మంది మూగ, చెవిటి వాళ్లేనట. వాళ్లంతా సైగలతోనే మాట్లాడుకుంటారట. వారు పరస్పరం నోరు విప్పు మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కాఫీ హౌజ్‌లు నిశ్శబ్దంగా ఉంటాయట, అలాంటి నిశ్శబ్ద ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారని, ఒక్క బెంగళూరులోని తమ ‘కాఫీ కోస్టా’ అవుట్ లెట్లలో దాదాపు 200 మంది మూగ, చెవిటి వాళ్లు పనిచేస్తున్నారని ఓ అవుట్లెట్ మేనేజర్ వివరించారు. చెవిటి సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు కాగితంపై రాయించి తీసుకుంటారని ఆయన తెలిపారు. అయితే మేనేజర్ మాత్రం మూగ, చెవుడు కాకపోవడమే కాకుండా మూగ భాష కూడా రావాలని ఆయన చెప్పారు. స్టార్‌బక్ కాఫీ హౌజుల్లో కూడా ఎక్కువ మంది చెవిటి వాళ్లే పనిచేస్తున్నారని తెల్సింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు డీసీ స్టార్‌బక్స్ అమెరికా రాజధాని వాషింగ్టన్లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు కూడా చెవిటి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారట. మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడానికి ఈ కార్పొరెట్ కాఫీ సంస్థలు రెండు కారణాలే చెబుతున్నాయిగానీ మూడో కారణం కూడా ఉందని మనం ఊహించవచ్చు. చెవిటి వాళ్లు కాస్త తక్కువ వేతనాలకు దొరకుతారన్న విషయం తెల్సిందే. -
సిద్ధార్థ మరణంపై దర్యాప్తు వేగిరం, పోలీస్ కమిషనర్ బదిలీ
సాక్షి, బెంగళూరు: కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థ మరణంపై దర్యాప్తు చేసేందుకు పోలీసు బృందం రంగంలోకి దిగింది. మిస్టరీగా మారిన సిద్ధార్థ మృతిపై దర్యాప్తును కోదండరాం నేతృత్వంలోని దర్యాప్తు బృందం ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన అధికారులు తాజాగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్( సీఎఫ్ఓ)తో పాటు మరికొంతమందిని విచారించినున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న సీఎఫ్ఓ, ఇతర అధికారులకు పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కీలక మైన పోస్ట్‌మార్టం నివేదిక ఈ రోజు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంపై దర్యాప్తునకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళూరు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ గురువారం వెల్లడించారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (మంగళూరు సౌత్ సబ్ డివిజన్) టీ కోదండరాం ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే మరణం ఎలా జరిగిందో స్పష్టం చేసే కీలకమైన పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇప్పటికే బృందం సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను, ఉద్యోగులను ప్రశ్నించి చాలా సమాచారం సేకరించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మందిని కూడా ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. సిద్ధార్థకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామనీ, వీటిని పోలీసులు విశ్లేషిస్తున్నారని పాటిల్ చెప్పారు. ఇది ఇలా ఉంటే పోలీస్ కమీషనర్ (క్రైమ్)సందీప్ పాటిల్‌ను బెంగళూరుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఆదేశాలు జారి చేసింది. ఈయన స్థానంలో మైసూరు ఇంటిలిజెన్స్ డిఐజీగా ఉన్న డా. సుబ్రహ్మణ్యేశ్వర రావును కొత్త పోలీసు కమిషనర్‌గా నియమించింది. అలాగే మంగళూరు నగర డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) హనుమంతరాయను కూడా దావణగెరే పోలీసు సూపరింటెండెంట్‌గా బదిలీ చేసింది. 2004 బ్యాచ్‌కు చెందిన సందీప్ పాటిల్‌ను పాటిల్ ఫిబ్రవరి 21న మంగళూరు కమిషనర్‌గా నియమించింది. ఐదు నెలలు ఇక్కడ పనిచేసిన పాటిల్ ను బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) గా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుబ్రహ్మణ్యేశ్వరావు బెంగళూరులోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐదేళ్లపాటు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. కాగా సిద్ధార్ధ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అన్నికోణాల్లో సమగ్ర దర్యాప్తు సాగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ అధికారుల వేధింపులతో విసిగిపోయాననీ, తన తప్పులకు తానే బాధ్యుడనని, క్షమించాలని పేర్కొంటూ లేఖరాసి సిద్ధార్ధ కనిపించకుండా పోవడం, 36 గంటల తరువాత నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించడం తదితర పరిణామాలు తెలిసినవే. Karnataka: Mangaluru Commissioner of Police Sandeep Patil has been transferred. Dr. Subramanyeshara Rao to be the new Commissioner — ANI (@ANI) August 2, 2019 -
‘కాఫీ కింగ్’ విషాదాంతం
దాదాపు నాలుగు దశాబ్దాలుగా భిన్న తరాలకు చెందిన లక్షలాదిమందికి మధురమైన క్షణాలను పంచుతూ, వారి జీవితాల్లో ఒక తీయని జ్ఞాపకంగా చెరగని ముద్ర వేసుకున్న సంస్థ ‘కెఫే కాఫీ డే’. అందుకే ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆచూకీ లేకుండా పోయారన్న వార్త ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు వారంతా భయపడినట్టే 36 గంటల తర్వాత సిద్దార్థ విగతజీవుడై కనబడ్డారు. సంస్థ ఉద్యోగులనూ, బోర్డు సభ్యులనూ ఉద్దేశించి ఆయన రాసినట్టు చెబుతున్న ఒక లేఖ ఆయనదేనని ఇంకా ధ్రువీకరించకపోయినా, అందులో ప్రస్తావించిన అంశాలు ఆందోళన కలిగిస్తాయి. ఆయన సన్నిహిత మిత్రులు, బంధువులు మాత్రమే కాదు... వ్యాపారరంగంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినవారు సైతం సిద్దార్థ సమర్థత గురించి, ఆ రంగంలో ఆయన దీక్ష, పట్టుదల గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడతారు. ఆయన ఆధ్వర్యంలోని సంస్థల ఉద్యోగులకు కూడా ఎప్పుడూ ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్నారని తెలియలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన తెలియనివ్వలేదు. కానీ ఆ లేఖ గమనిస్తే ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఎలాంటివో, ఆయన ఎంత నిస్సహాయంగా మిగిలిపోయారో అర్థమవుతుంది. విఫల వ్యాపారవేత్తగా మిగిలిపోయానన్న ఆవేదన అందులో కనిపిస్తుంది. సంస్థ నిలదొక్కుకోవడానికి, అది లాభాల బాట పట్టడానికి ఆయన చేసిన కృషి పెద్దగా ఫలించకపోవడం, అందుకోసం చేసిన అప్పులు అపరిమితంగా పెరిగిపోవడం, ఈలోగా ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడం, ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారుల వేధింపులు వంటివి ఆయన తనువు చాలించాలని నిర్ణయించు కోవడానికి దారితీసి ఉండొచ్చునని లేఖలోని అంశాలు చెబుతున్నాయి. సహజంగానే ఐటీ శాఖ తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. పైపెచ్చు ఆయన దగ్గర నల్లధనం పట్టుబడిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై తన వైఖరేమిటో చెప్పేందుకు సిద్దార్థ లేరు. కానీ ఆయనకున్న అప్పుల కన్నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ గనుక బకాయిల గురించి ఆయన బెంబేలెత్తే సమస్యే లేదన్నది సన్నిహితుల వాదన. ఏ రంగంలోనైనా నిపుణత సాధించి, ఉన్నత శిఖరాలు అందుకునేవారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. విజేతలను అందరూ ఆరాధనా భావంతో చూస్తారు. కానీ ఆ విజేతల ఆంతరంగిక పరిస్థితి వేరు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వారు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎక్కడ వెనక్కి తగ్గినా వైఫల్యం తలుపుతట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, క్రీడలా, రాజకీయాలా అన్న అంశాలతో నిమిత్తం లేదు. ఏ రంగం వారికైనా ఇది తప్పదు. జయాపజయాలను సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, నిత్యం సవాళ్లను ఎదుర్కొనే సాహసం సహజంగా అలవడేవి కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులతో, వ్యక్తులతో పోరాడుతూనే...తనపై తాను పోరాటం చేసుకుంటే తప్ప ఇవి సాధ్యపడవు. తామున్న రంగంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తూ సమున్నతంగా ఎదగడానికి శ్రమించేవారందరికీ ఇది వర్తిస్తుంది. సిద్దార్థ అటువంటివారు. ఆయన నిజాయితీపరుడు గనుకే, విలువలను నమ్ము కున్నవాడు గనుకే, సున్నితమనస్కుడు గనుకే ఒక్కుమ్మడిగా చుట్టుముట్టిన సమస్యలతో ఒత్తిళ్లకు లోనై ఉసురు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారికి ఈ బెడద ఉండదు. వారు విజేతలుగా తమను తాము చిత్రించుకోవడానికి శ్రమిస్తారు. అందుకోసం అన్ని రకాల చీకటి పనులకూ పాల్పడతారు. పాపం బద్దలైందని తెలిశాక దూరతీరాలకు పారి పోతారు. సిద్దార్థ రాసినట్టు చెబుతున్న లేఖలో ప్రస్తావనకొచ్చిన వేధింపుల అంశాన్ని ఐటీ శాఖ ఖండిస్తున్నది. కానీ దాంతో ఏకీభవించేవారు తక్కువ. ఇప్పుడే కాదు... ఎన్నాళ్లుగానో ఒక్క ఐటీ శాఖపైన మాత్రమే కాదు, నియంత్రణ వ్యవస్థలన్నిటి వ్యవహారశైలిపైనా ఆరోపణలున్నాయి. దేశంలో కార్పొ రేట్ తిమింగలాలుగా పేరుబడ్డ పది పదిహేను శాతంమంది రాజకీయ ప్రాపకంతో కులాసాగా ఉంటారు. వారి జోలికెవరూ పోరు. మధ్య, కింది స్థాయిలవారికి మాత్రం నిత్యం ఒత్తిళ్లు, వేధింపులు తప్పవు. ఇవన్నీ పైవారికి తెలిసే జరుగుతున్నాయని అనలేం. ఈ మధ్యే ఐటీ శాఖలో పలు ఆరోపణలున్నాయన్న కారణంతో 20మంది ఉన్నతాధికారులను కేంద్రం రిటైర్ చేసింది. ‘కెఫే కాఫీ డే’కు ఎదురైన వైఫల్యాలకు గల కారణాలను కేవలం సిద్దార్థలోనే చూడటం కూడా సరికాదు. మన దేశంలో ఇంకా అంతగా వేళ్లూనుకోని ఖరీదైన కాఫీ క్లబ్‌ల సంస్కృతిని ఆధారంగా చేసుకుని రూపొందించుకున్న వ్యాపార నమూనా ఆయన అనుకున్నట్టుగా విస్తరించి ఉండకపోవచ్చు. కానీ ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన సంస్థలకంటే మెరుగ్గా ఆయన నిలదొక్కుకోగలిగారు. ఆ సంస్కృతిని పెంచగలిగారు. ‘కెఫే కాఫీ డే’తో పోలిస్తే ఇతర సంస్థలు మన దేశంలో నామ మాత్రంగా మిగిలిపోయాయి. అయినా మూడు నాలుగేళ్లుగా ఆ సంస్థకు నష్టాలు తప్పడం లేదు. ఇది కేవలం ఆ సంస్థకు మాత్రమే పరిమితమైన స్థితి కాదు. మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు సకల రంగాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంతో సహా అన్నీ ఒడి దుడుకులు ఎదుర్కొంటున్నాయి. జీఎస్టీ బకాయిలు భారీయెత్తున పోగడుతున్నాయి. ఉపాధి అవకాశాల లేమి, వేతనాల్లో కోతలు, అనిశ్చితి వగైరాల వల్ల వినిమయం బాగా తగ్గింది. వెనకా ముందూ చూసి ఖర్చు పెట్టే స్థితి వచ్చింది. ఒకప్పుడు ‘కెఫే కాఫీ డే’లవంటి ఖరీదైన దుకాణాలకు వెళ్లడం తమ హోదాకు చిహ్నంగా భావించినవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించకతప్పడం లేదు. నియంత్రణ వ్యవస్థలు ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. బకాయిలున్నవారందరినీ ఒకే గాటన కట్టి, అందరినీ నేరగాళ్లుగా చూసే వైఖరిని విడనాడాలి. అప్పుడు సిద్దార్థవంటి వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలు నిబ్బరంతో ముందడుగు వేయడానికి వీలవుతుంది. -
కాఫీ చేదయింది!
-
ఏం కష్టం వచ్చిందో?