ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్‌లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’
గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్‌రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్‌లతో మాట్లాడాడు.
‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు.
అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్.
చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది.
‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్‌లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్‌లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్.
యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్‌లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్‌ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది.
పర్సనలైజ్‌డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది.
‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్‌లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్.
నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు.
‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి.
‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్‌లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్.
‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం.
ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్‌లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది.
‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం.
‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం.
ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్‌లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment