extension
-
‘మహా కుంభమేళాను పొడిగించండి’
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్‌రాజ్ ఘాట్ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు కూడా. మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) రూట్లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్‌రాజ్ సంగమ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.ఇదీ చదవండి: స్టార్ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా? -
మహిళలకు భారీ వడ్డీ పథకం కొనసాగుతుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. పన్ను రేట్ల తగ్గింపు, పెంపు, సంబంధిత గడువులు, మినహాయింపు పరిమితులు, ప్రభుత్వ పథకాలు.. ఇలా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 2023 బడ్జెట్లో ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ (Mahila Samman Savings Scheme)పైనా అటువంటి చర్చే సాగుతోంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అనేది మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వన్ టైమ్ పొదుపు పథకం. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పథకం ప్రస్తుతం బ్యాంకులు రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌కు ప్రభుత్వం ప్రకటించిన చివరి పెట్టుబడి తేదీ మార్చి 31 సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కేంద్రం నుండి దీనికి పొడిగింపు లభిస్తుందో లేదో చూడాలి.మహిళల ఆర్థిక చేరిక, సాధికారతను ప్రోత్సహించడంలో ముఖ్యమైన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పాత్ర పోషిస్తుందని వన్ ఫైనాన్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీ తాడనే అన్నారు. ఈ పొదుపు పథకాన్ని పరిమిత అవకాశంగా ప్రవేశపెట్టారని, ఇది ఆకర్షణీయమైన 7.5 వడ్డీ రేటు అందిస్తున్నప్పటికీ ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవని చెప్పారు. "మహిళల కేంద్రీకృత విధానాలపై ప్రభుత్వ స్థిరమైన దృష్టిని దృష్టిలో పెట్టకుంటే ఈ పథకాన్ని పొడిగించవచ్చు లేదా ఇదే విధమైన ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టవచ్చు" అని ఆయన ఎకనామిక్స్ టైమ్స్‌తో అన్నారు.మరోవైపు ఈక్విటీ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ల వైపు డిపాజిటర్ల దృష్టి మళ్లడంతో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌కు పెద్దగా ఆదరణ లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు, సీఈవో స్నేహ జైన్ అభిప్రాయపడుతున్నారు.రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి గతంలో చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాలు గతంలో బలమైన పనితీరును ప్రదర్శించాయని వివరించారు. అయితే వీటి ప్రభావం నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ (NSSF) పథకంపై పడినట్లు తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో రూ. 20,000 కోట్ల డిపాజిట్లు తగ్గిపోయాయి.7.5 శాతం వడ్డీ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు మార్చి 31లోపు ఖాతా తెరవడం మంచిది. ఇందులో కనీస డిపాజిట్ రూ. 1,000 కాగా గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 7.5 శాతం వడ్డీ వార్షిక వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది. ఇది ఖాతా తెరిచిన తేదీ నుండి రెండు సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. -
అస్కీ మాజీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఇన్వాయిస్లతో కుట్ర పూరితంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు (అస్కీ) చెందిన రూ.88.91 లక్షలు స్వాహా చేసిన కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) శుక్రవారం మాజీ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మిని అరెస్టు చేసింది. ఈ గోల్‌మాల్‌లో ఆమె పీఏగా పని చేసిన ఎం.రవికుమార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించామని డీసీపీ ఎన్.శ్వేత పేర్కొన్నారు. అస్కీ ఆధీనంలో సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ అడ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ పేర్లతో కేంద్రాలు పని చేస్తున్నాయి. అస్కీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన భాగ్యలక్ష్మి ఎక్స్‌టెన్షన్‌పై వీటికి డైరెక్టర్‌గా పని చేశారు. 2021–24 మధ్య ఈమె హయాంలో అనేక శిక్షణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు జరిగాయి. ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి పలు ఏజెన్సీలు, కన్సల్టెంట్లతో పాటు పలువురు విక్రేతలు సేవల్ని వినియోగించుకున్నారు. ఆయా ఏజెన్సీలు, విక్రేతలు ఇచి్చన ఇన్వాయిస్ల ఆధారంగా అస్కీ నిధుల నుంచి చెల్లింపులు చేశారు. ఈ విక్రేతలు, కన్సల్టెంట్స్ జాబితాలో హర్యానాలోని గుర్గావ్కు చెందిన షేక్ అభిషేక్ ఇమ్లాక్, నగరానికి చెందిన బల్లపు శృతి, నలమస రజని, మాదాపూర్‌కు చెందిన ఎం.బుర్రయ్య, పాండురంగనగర్‌కు చెందిన ధనలక్ష్మి ఉన్నారు. వీరు ఇచ్చిన ఇన్వాయిస్ల ఆధారంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి 2021 మార్చి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.88.91 లక్షల చెల్లింపులు చేశారు. తన పీఏ రవికుమార్ సాయంతో ఆ నగదును వారి నుంచి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చెల్లింపులతో పాటు ఇతర కార్యకలాపాల నేపథ్యంలో భాగ్యలక్ష్మిని ఈ ఏడాది ఆగస్టు 16న అస్కీ విధుల నుంచి తొలగించింది. శుక్రవారం ఆమెను అరెస్టు చేసిన సీసీఎస్ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్జైలులో రిమాండ్‌లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. -
‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వెల్లడించింది. ఆవిష్కర్తలు తమ ఎంట్రీలను సమర్పించడానికి ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది 6వ ఎడిషన్‌తో ముందుకు వచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ తెలంగాణలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.స్థానిక సవాళ్లకు పరిష్కారాలను తీసుకువచ్చే ఉద్దేశంతో, తమ ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు తయారు చేసిన ప్రజలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, ఆ ఆవిష్కరణలను ఆగస్టు 15న ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది.దరఖాస్తులను వాట్సాప్ ద్వారా 9100678543కు పంపించాలి. పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణ గురించి 100 పదాల వివరణ, నాలుగు అధిక-రిజల్యూషన్ చిత్రాలతో పాటు రెండు వీడియోలు (2నిమిషాలలోపు) పంపించాలని ఇన్నోవేషన్ సెల్ తెలిపింది. -
21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
సాక్షి, అమరావతి : మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10.30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లుఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆ వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.టీడీపీ నేతలు అస్మిత్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని అభ్యర్థించడంతో ఈ నెల 6వ తేదీ వరకు వారందరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.వాదనలు ముగిసేలోపు అర్ధరాత్రి అవుతుందిపిన్నెల్లి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. హైకోర్టుకు వేసవి సెలవుల కారణంగా అత్యవసర కేసులను విచారిస్తుండటంతో ఈ వ్యాజ్యాలు రాత్రి 9.30 గంటల సమయంలో విచారణకు వచ్చాయి. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.అంతేకాక ఈ నెల 6న విచారణకు రానున్న వ్యాజ్యాలను పరిష్కరించాలని హైకోర్టుకు తెలిపిందన్నారు. తమ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలన్నింటినీ కోర్టు ముందు ఉంచి వాదనలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఆ తరువాత తమ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు స్పందించాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యే లోపు అర్థరాత్రి దాటుతుందని నిరంజన్‌రెడ్డి వివరించారు. పైపెచ్చు సుప్రీంకోర్టు 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించి తీరాలని చెప్పలేదని, ఎలాంటి గడువు నిర్దేశించకుండా ఆ రోజున విచారణకు వచ్చే వ్యాజ్యాలను పరిష్కరించాలని మాత్రమే చెప్పిందన్నారు.అనంతరం ఆయన కేసుకు సంబంధించిన వాదనలను వినిపించారు. పోలీసులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందని వివరించారు. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు దురుద్దేశపూర్వకంగా ఉందన్నారు. ఉదయం 10.30 నుంచి విరామం లేకుండా వరుసగా అనేక కేసులు విచారణ జరిపి న్యాయమూర్తి తీవ్రంగా అలసిపోయినట్లు ఉండటాన్ని గమనించిన నిరంజన్‌రెడ్డి.. విచారణను శనివారానికి వాయిదా వేయాలని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పారు. శనివారం తాను కేసు వినేందుకు నిబంధనలు అనుమతించవని, ప్రధాన న్యాయమూర్తి అనుమతించాల్సి ఉంటుందని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు.అలా అయితే విచారణను వచ్చే వారానికి (13వ తేదీకి) వాయిదా వేయాలని, ఆ రోజున పూర్తిస్థాయి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తాము కూడా ఉదయం నుంచి పలు కేసుల్లో వాదనలు వినిపిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరారు.వాదనలు విని తీర్పు చెప్పేలోపు తెల్లారుతుందిఫిర్యాదుదారు శేషగిరిరావు తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. మూడు క్రైం నంబర్లు ఒకే అంశానికి సంబంధించినవైనందున, అన్నింటినీ కలిపే విచారించాలని కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. అన్ని వ్యాజ్యాలపై వచ్చే వారం విచారణ జరుపుతానని తెలిపారు. ఇప్పటికే 10.20 అయిందని, ఇప్పుడు వాదనలు విని, తీర్పు చెప్పేలోపు తెల్లారి అవుతుందని, తాను అందుకు సిద్ధమేనని, అయితే కోర్టు సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. విచారణను వాయిదా వేయడంపై పోసాని వెంకటేశ్వర్లు అభిప్రాయం కోరగా, ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిన్నెల్లి అరెస్ట్ విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాయిదాకు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.అలాంటి మాటలు ఇంకెవరి ముందైనా చెప్పండిపోలీసు అధికారి నారాయణ స్వామి (పిన్నెల్లి ఫిర్యాదు మేరకు ఇతన్ని ఎన్నికల సంఘం విధులకు దూరంగా ఉంచింది) తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు చేయకుంటే బాగుండదన్నారు. దీనిపై మళ్లీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఈ వాదనపై న్యాయమూర్తి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘సుప్రీం కోర్టుకు వెళితే వెళ్లనివ్వండి. ఎవరో వెళతారని మీరెలా చెబుతారు? ఇలాంటివన్నీ ఇంకెవరి ముందైనా చెప్పండి. ఈ కోర్టుకు కాదు.కోర్టు పని వేళలు సాయంత్రం 4.15 గంటల వరకే. ఈ సమయం దాటి కేసులు విచారించకూడదు. మరి దీని గురించి ఏమంటారు’ అంటూ న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కి తగ్గిన అశ్వనీ కుమార్ కోర్టును క్షమాపణలు కోరారు. అల్లర్లలో నారాయణస్వామి తలకు తీవ్ర గాయమైందన్నారు. దీనికి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. నారాయణస్వామి తలకు తగిలిన గాయం స్వల్పమైనదేనని, ఈ విషయాన్ని ఆయన సమర్పించిన మెడికల్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుందని చెప్పారు. స్వల్ప గాయమని డాక్టర్లు చెబుతుంటే, తీవ్రమైనదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. -
బెయిల్ పొడిగింపు.. కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించటాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్.. చీఫ్ జస్టిస్‌కు డీవై చంద్రచూడ్‌కు పంపించింది. తదుపరి ఈ పిటిషన్ లిస్ట్‌కు రావటం అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంత బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ జూన్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును కోరాను. తన అనారోగ్యం రీత్యా వైద్య పరీక్ష చేయించుకోవటం కోసం బెయిల్ పొడగించాలని కోరారు. ఈ మేరకు తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు.‘‘ఇది అరవింద్ కేజ్రీవాల్ విషయం. ఆయనకు మరో ఏడు రోజులు బెయిల్ పొడగించాలి’’ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ‘‘ బెయిల్ పొడగింపు పిటిషన్ ఇప్పుడు అత్యవసరంగా విచారించటం వీలు కాదు. అందుకే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ముందుకు పంపుతున్నాం. ఆయన ఈ పిటిషన్ లిస్ట్ చేయటంపై నిర్ణయం తీసుకుంటారు’’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది. -
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. మనోజ్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్‌కుమార్, చరణ్‌ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది. -
రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్‌సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.పోలింగ్ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీకరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలుకొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలోని ఖానాపూర్ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ముథోల్. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి. వరంగల్ లోక్‌సభ స్థానంలోని స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట్. మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోని డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట్. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ). -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు -
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు! -
SRH Vs MI: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు. -
సుప్రీంకోర్టు తలుపు తట్టిన SBI
సాక్షి, ఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఆమధ్య సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల బాండ్ల విషయంలో విధించిన డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికల బాండ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై.. చర్చనీయాంశమైన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఆ సమయంలో.. ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లపై వివరాలు అందిస్తే.. వాటిని వారం రోజుల్లో ఈసీ తన సైట్లో పొందుపర్చాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు విధించిన మూడు వారాల గడువు ప్రకారం.. మార్చి 6వ తేదీనే ఎస్బీఐ కేంద్ర ఎన్నికల సంఘానికి డాటా సమర్పించాల్సి ఉంది. అయితే ఇందుకు సమయం సరిపోదని.. జూన్ 30వ తేదీ దాకా గడువు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది ఎస్బీఐ. ఇక ఎస్బీఐ పిటిషన్‌పై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ స్పందించారు. లంచాలు, కాంట్రాక్టులు పొందిన వివరాలు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికలు ముగిసే వరకు సమయం కోరుతున్నారంటూ ఆరోపించారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. -
గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్–1996కి అనుబంధంగా ఓ తాత్కాలిక నిబంధన(అడ్‌హక్ రూల్)ను అమల్లోకి తీసుకొచ్చారు. రెండేళ్లపాటు వయోపరిమితి పొడిగింపు అమల్లో ఉండనుంది. పోలీసు, ఎక్సైజ్, ఆబ్కారీ, అగ్నిమాపక, అటవీ, జైళ్ల శాఖ వంటి యూనిఫార్మ్ సర్విసు పోస్టులకు ఈ వయోపరిమితి పొడిగింపు వర్తించదు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు మాత్రమే. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ 2022 మార్చి 19న ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే నెల 18తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోనుంది. నిరుద్యోగుల నుంచి మళ్లీ వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని ఈసారి మరో 2 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి పెంపునకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఏపీలో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. దీంతో జనవరి 22న(సోమవారం) తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. చదవండి: అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు.. దేశానికే తలమానికం: సీఎం జగన్ -
ఆరు లేన్లు అయ్యేనా?
చౌటుప్పల్: త్వరలో హైవే విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయరహదారి ఆరు లేన్ల విస్తరణకు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. మంత్రి ప్రకటనతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఓటీ పద్ధతిన నాలుగు లేన్లుగా విస్తరణ హైదరాబాద్ – విజయవాడ మధ్య 275 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు, ఏపీలోని విజయవాడ నుంచి నందిగామ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విస్తరించారు. మిగిలిన 180 కిలోమీటర్లు మాత్రం బీఓటీ పద్ధతిన నాలుగులేన్లుగా నిర్మించారు. ఈ పనులను జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఈ పనులకు అప్పటి సీఎం రోశయ్య 2010 మార్చిలో నార్కట్‌పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి మూడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుము వసూలు చేస్తోంది. కోర్టును ఆశ్రయించిన జీఎంఆర్ సంస్థ ఈ హైవేను ఆరులేన్లుగా విస్తరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ ముందస్తుగా కోర్టును ఆశ్రయించింది. తాము బీఓటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పనులు చేశామని, టోల్ వసూలు చేసుకునేందుకు తమకు ఇంకా గడువు ఉందని, పెట్టుబడి కింద టోల్ వసూళ్లు అనుకున్న మేరకు రానందున మరికొంత కాలం అనుమతి ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. దీంతో విస్తరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు హైదరాబాద్– విజయవాడ హైవే దేశంలోనే అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు పొందింది. టోల్‌ప్లాజాల లెక్కల ప్రకారం రోజూ సగటున 40వేల నుంచి 50వేల వాహనాలు ఈ మార్గంలో వెళుతున్నాయి. దీనిపై ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అన్ని విధాలుగా ప్రయోజనం హైవేను ఆరు వరుసలుగా విస్తరిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వాహనదారులు, ప్రయాణికులకు సమయం కూడా కలిసివస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. – చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సర్విస్ రోడ్లు ఏర్పాటు చేయాలి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న హైవేపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించడానికి ఆరు వరుస లు అవసరం. విస్తరణతోపాటు హైవే వెంట ఉన్న అన్ని గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు నిర్మించాలి. – బాతరాజు సత్యం, పంతంగి సర్పంచ్ -
రూ.2 వేల నోట్ల మార్పిడికి 7 వరకు గడువు
ముంబై: రూ.2 వేల నోట్ల ఉపసంహరణ గడువును రిజర్వ్ బ్యాంక్ మరో వారంపాటు, అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. మే 19వ తేదీ నుంచి మొదలైన రూ.2 వేల నోట్ల ఉపసంహరణ, మార్పిడి ప్రక్రియలో సెప్టెంబర్ 19వ తేదీ వరకు ప్రజలు రూ. 3.42 లక్షల కోట్ల విలువైన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని శనివారం ఒక ప్రకటనలో ఆర్బీఐ వెల్లడించింది. దేశంలో మే 19వ తేదీ వరకు చెలామణిలో ఉన్న కరెన్సీలో ఇది 96 శాతానికి సమానమని పేర్కొంది. ప్రస్తుతం రూ.14 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని తెలిపింది. అక్టోబర్ 7వ తేదీ తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చని, అయితే ఆ అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయా ల్లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. -
ఆర్బీకేల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్‌లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్‌లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్‌గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు. స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్ఏ, వీహెచ్ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్ ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు : కీలక పరిణామం
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై చేసిన ఆరోపణలపై విచారణను ముగించేందుకు గడువును 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు గడువును పొడిగించాలని కూడా సెబీ కోరింది. ఈ ఏడాది మేలో, ఈ అంశంపై అప్డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. సెబీ 15 రోజుల పొడిగింపును ఎందుకు కోరింది? అదానీ గ్రూప్‌పై యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు సంబంధించి తాను దర్యాప్తు చేస్తున్న 24 లావాదేవీలలో 17 విచారణను పూర్తి చేసినట్లు సెబి తెలిపింది. మిగిలిన అంశాలపై విచారణ త్వరలోనే పూర్తి చేయనుంది. అయితే తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి ఇతర నియంత్రణ సంస్థలు , విదేశీ అధికార పరిధి నుండి మరింత సమాచారం కోరినట్లు సెబీ సుప్రీంకు తెలియజేసింది. విదేశీ లావాదేవీల ప్రమేయం కారణంగా కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు తీరని సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏర్పాటు సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణల మేరకు నిబంధనలకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ తన గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేసిందా? సంబంధిత-పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైందా? అనే విషయాలపై సెబీ విచారణ చేపట్టింది. మరోవైపు అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ అదానీ పోర్ట్స్ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్‌తో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కాగా తమ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో చేసిన తప్పుడు ఆరోపణలని హిండెన్‌బర్గ్ వాదనను గౌత అదానీ గట్టిగా తోసిపుచ్చారు. కేవలం తమ స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని, కుట్రపూరితంగానేకంపెనీ ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ముందు ఈ తప్పుడు నివేదికను వెల్లడించారని 2023 వార్షిక సాధారణ సమావేశంలో స్పష్టం చేశారు. -
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ.. మొత్తం 400 కిలో మీటర్లు
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని నిర్ణయించినట్లు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కి, మంత్రివర్గ సహచరులకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొత్తగా వచ్చే మెట్రో కారిడార్లను పేర్కొన్నారు. కొత్త మెట్రో కారిడార్లు ఇవే.. ఓఆర్ఆర్ మెట్రో జేబీఎస్ నుంచి తూముకుంట ప్యాట్నీ నుంచి కండ్లకోయ, ఇస్నాపూర్ నుంచి మియాపూర్ మియాపూర్ నుంచి లక్డికాపుల్ ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట్ ఉప్పల్ నుంచి బీబీనగర్ తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు (ఫార్మా సిటీ) షాద్‌నగర్ మీదుగా శంషాబాద్ (ఎయిర్పోర్ట్) -
ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం: సుప్రీం స్పష్టీకరణ
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా Sanjay Kumar Mishra పదవీకాలం పొడగింపుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు పొడిగింపు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూనే.. జులై 31వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగవచ్చని మంగళవారం కేంద్రానికి తెలిపింది. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఈ జాతీయ సంస్థ చీఫ్ బాధ్యతలను 2018 నవంబర్‌లో ఎస్కే మిశ్రా చేపట్టారు. అయితే రెండేళ్లకే ఆయన వయోపరిమితి రిత్యా(60 ఏళ్ల) రిటైర్ కావాల్సి ఉంది. కానీ, కేంద్రం మాత్రం రకరకాల సవరణలు, ప్రత్యేక ఆదేశాలతో ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది. ఈ క్రమంలో రాజకీయ దుమారం చెలరేగగా.. మధ్యలో సుప్రీం కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఆర్డినెన్స్‌ల వంకతో ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ► 2020 నవంబర్‌లో మరో ఏడాదికి కేంద్రం పొడిగించగా.. ఆ సమయంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ‘పొడిగింపు ప్రత్యేక సందర్భాల్లో.. అదీ తక్కవ కాల వ్యవధితో మాత్రమే ఉండాలని స్పష్టంగా కేంద్రానికి తెలిపింది. అంతేకాదు.. ఎస్కే మిశ్రాను ఈడీ చీఫ్‌గా కొనసాగించకూడదని స్పష్టం చేసింది కూడా. ► అయినప్పటికీ.. 2021 నవంబర్‌లో మరో మూడు రోజుల్లో ఆయన రిటైర్ అవ్వాల్సి ఉండగా.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్1946 తోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003కి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లు తీసుకురాగా.. అప్పటి రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో కేంద్రానికి మరింత బలాన్ని దక్కినట్లయ్యింది. ► 1997కి ముందు ఈడీ, సీబీఐల డైరెక్టర్ పదవీకాలం నిర్ధిష్టంగా ఉండేది కాదు. కేంద్రం ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడు తొలగించేది. ► ఆ తర్వాత పదవీ కాలం రెండేళ్లు చేశారు. ► అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్ 2021 ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితికి పెంచింది. అది ముగిశాక వాళ్ల పని తీరు ఆధారంగా మరో ఏడాది పొడిగించుకోవచ్చు. ► అలా కిందటి ఏడాది నవంబర్‌లో మిశ్రాను ఈడీ డైరెక్టర్‌గా మరో ఏడాది పొడిగించిది కేంద్రం. దీంతో మిశ్రా 2023 నవంబర్‌లో రిటైర్ కావాల్సి ఉంది. కానీ.. ► సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు చేసిన సవరణపై తీవ్ర స్థాయిలో రాజకీయపరంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విడివిడిగా ఎనిమిది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీళ్లలో కాంగ్రెస్, టీఎంసీ, తరపున కూడా కొందరు నేతలు ఉన్నారు. అయితే.. రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్లు కోర్టును ఆశ్రయించారని కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. ఆయా పార్టీలకు చెందిన నేతలు మనీలాండరింగ్ ద్వారా ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్నారని.. అందుకే కోర్టుకు చేరారని తెలిపింది. ► ఇక ఇదే ఏడాది ఫిబ్రవరిలో అమికస్ క్యూరి(కోర్టు స్నేహితుడు) కేవీ విశ్వనాథన్.. జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనానికి ఎస్కే మిశ్రా బాధ్యతల పొడిగింపు చెల్లదని నివేదించారు. ► ఇక పిటిషన్లపై అన్ని వర్గాల వాదనలు విన్న జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. మే 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ► దఫదఫాలుగా ఎస్కే మిశ్రాను ఈడీ చీఫ్‌గా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన పొడిగింపు చెల్లదని ఇవాళ్టి ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే.. కేంద్రం విజ్ఞప్తి చేయడంతో జులై 31వ తేదీ వరకు కొనసాగవచ్చని మాత్రం పేర్కొంది. -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. -
ఏపీ: సంక్రాంతి స్కూళ్ల సెలవుల సవరణ..ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి 2023కి సెలవుల్ని సవరించింది విద్యాశాఖ. ఈ మేరకు సవరణ ప్రకటనతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. జనవరి 19వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. ఈ మేరకు రీ నోటిఫై చేసిన ఉత్తర్వులను విడుదల చేసింది. అకడమిక్ క్యాలెండర ప్రకారం.. తొలుత 11 నుంచి 16వ తేదీ వరకే సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల విజ్ణప్తి మేరకు అదనంగా ఒకరోజు సెలవు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముక్కనుము నేపథ్యంలోనే ఈ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవుల్లో మార్పులు కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశాయి.దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే.. అకడమిక్ క్యాలెండర్ చెదరకుండా ఉండేందుకు.. ఏదో ఒక సెలవు రోజు పనిచేసేలా షరతుతో సెలవు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ విద్యాశాఖ. -
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి తరలివచ్చి ఏపీలో స్థిర నివాసముంటున్న వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించేందుకు గత ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర విభజన అనతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచి్చన వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఏడేళ్ల పాటు స్థానికత కల్పిస్తూ 2014లో రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఏడేళ్ల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏడేళ్లకు బదులు పదేళ్లుగా సవరణలు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయగా.. ఉద్యోగుల స్థానికతకు సంబంధించి 1975నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్)లో సవరణలు చేస్తూ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి స్థిరపడిన వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్(రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్లు)లో సవరణలు చేస్తూ.. విద్యా సంస్థల ప్రవేశాల్లో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) -
హైదరాబాద్ మెట్రో.. కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. నాగోల్-ఎల్బీ నగర్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. -
విదేశీ వాణిజ్య విధానం ఆరు నెలలు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య విధానాన్ని (2015–20) మరో ఆరు నెలల పాటు, 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో వాస్తవానికి దీని గడువు ముగియాల్సి ఉంది. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావద్దన్న డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ఉత్తర కొరియా పర్యటనలు మరో ఏడాది పాటు నిషేధం!
వాషింగ్టన్: ఉత్తర కొరియా పర్యటన నిషేధం మరో ఏడాది పాటు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ నిషేధం ఆగస్టు 31, 2023 వరకు ఉంటుందని అమెరికా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నిషేధాన్ని అమెరికా 2017 నుంచి అమలు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది నిషేధాన్ని పెంచుతూనే ఉంది అమెరికా. యూఎస్ పౌరులకు ఉత్తర కొరియా పర్యటన అత్యంత ప్రమాదకరమని వారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా యంత్రాంగం పేర్కొంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రత్యేకంగా ఆ పర్యటనకు ధృవీకరించనప్పుడే మినహా మరే ఏవిధంగాను అమెరికా వీసాలు చెల్లుబాటు కావని పేర్కొంది. 2017లో ప్రచార పోస్టర్ని దొంగలించాడనే ఆరోపణలతో అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్బియర్ని ఉత్తర కొరియా పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఉత్తరకొరియా పర్యటనలను అమెరికా నిషేధించడం ప్రారంభించింది. (చదవండి: యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..) -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. దయచేసి ఆగస్ట్ 31 వరకు పొడిగించండి అని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. అలాగే ఇన్‌కంటాక్స్ పోర్టల్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. డెడ్‌లైన్ పొడిగింపులేదని ప్రకటించిన తరువాత పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపు దారులు ట్విటర్లో గగ్గోలు పెడుతున్నారు. గడువుపెంచండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. గడువు తేదీని పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో #Extend_Due_Date ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. టాక్స్ అఫీషియల్స్ ఏమైనా మెషీన్లా.. కాదు కదా.. తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌తో వారు పనిచేస్తున్నారు. ఆగస్టు 31 వరకు గడువు పెంచాల్సిందే అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. పోర్టల్ పనిచేయడం లేదని మరికొంతమంది, ఫన్నీ కమెంట్స్, రకరకాల మీమ్స్‌తో ట్విటర్లో హల్చల్ చేస్తున్నారు. #Extend_Due_Date_Immediately Tax professionals are not machines. They are working under a lot of stress and tension. Fix 31st August for non audit returns for ever. — K K Atal (@kkatal88) July 26, 2022 #Extend_Due_Date_Immediately #incometaxportal Sitting in office trying to download 26AS/AIS/TIS: pic.twitter.com/ciV0pjGLTg — Atish Paliwal (@atishpaliwal22) July 23, 2022 Clients with pending ITRs looking at their CAs : #Extend_Due_Date_Immediately #Extend_Due_Dates pic.twitter.com/N6yI9CSyyA — Yum (@upsehooon) July 24, 2022 Right now:-#Extend_Due_Date_Immediately#IncomeTaxReturn pic.twitter.com/JO5TJuEDwh — Bhavya (@iconic232001) July 26, 2022 -
AP: ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయం 2 నెలలు పొడిగింపు
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయం మరో 2 నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 31 వరకు ఉద్యోగుల వసతిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతులు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. -
టీఎస్ ఐసెట్, లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తు గడువును ఆలస్య రుసుముతో వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4 వరకు గడువు పొడిగించినట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా సోమవారంతో గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (చదవండి: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..) -
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చలాన్లపై రాయితీని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోం శాఖ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.250 కోట్లు వసూలైనట్లు హోంశాఖ తెలిపింది. చదవండి: రేవంత్‌రెడ్డి చిప్పకూడు తింటావ్.. జాగ్రత్త..! రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు, ఈ అవకాశాన్ని పొడిగించాలని విజ్ఞప్తులు రావడంతో పొడిగించామని వివరించారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి కోరారు. -
తప్పు చేసినా శిక్షకు అతీతులా?
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి. ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్‌బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది. రామ్వా, మణిపూర్‌లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్‌పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్ఐఆర్ పేర్కొందని అన్నారు. గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు. 1983లో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్ఎస్పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది. ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్‌తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది. మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్‌గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది. ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది. 2021 డిసెంబర్లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్ఎస్పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి. – నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, రచయిత -
త్వరలో 5జీ నెట్వర్క్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఊరిస్తోన్న 5 జీ నెట్వర్క్ సేవలు మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు రావడం మినహా.. అసలు 5జీ నెట్వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మొబైల్ కంపెనీలో ఎడాపెడా 5జీ హ్యాండ్సెట్లను రిలీజ్ చేస్తూ మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. నవంబరులోపే 5జీ ట్రయల్స్ కోసం 2021 మే నెలలో ప్రభుత్వం టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్టీఎల్లు అనుమతి పొందాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం నవంబర్‌లోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. గడువు పెంచండి నవంబరు సమీపిస్తుండటంతో ఇక కమర్షియల్‌గా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశించిన వారికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి చేయలేకపోయామని, ట్రయల్స్‌కి మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కోలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కారణం అదేనా 5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ డాట్ తదితర ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది టెలికం కంపెనీలో కోరినట్టు మరోసారి ట్రయల్స్ గడువు పెంచితే 5 జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు 2022 ఏప్రిల్–జూన్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వోడఫోన్ ఐడియా చేపట్టిన ట్రయల్స్‌లో నెట్ స్పీడ్ 3.7 గిగాబైట్ పర్ సెకండ్‌గా రికార్డు అయ్యింది. చదవండి:ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట -
TS: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అక్టోబర్ 20 వరకూ గడువును పెంచారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని జూనియర్ కాలేజీలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. -
ఏపీ: వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాదిపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు వారానికి ఐదు రోజుల పనిదినాలు విధానాన్ని మరి కొంతకాలం కొనసాగించాలని ఏపీ సచివాలయం సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరఫున ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు ఏపీ: గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలు రద్దు -
రఘురామకృష్ణరాజు రిమాండ్ పొడిగింపు
సాక్షి, అమరావతి: అసత్య ప్రచారంతో సమాజంలో విద్వేషాలు రేకెత్తించి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్న కేసులో నిందితుడైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామకృష్ణరాజు మళ్లీ గుంటూరు జైలుకు రావల్సిన అనివార్యత ఏర్పడింది. గుండెకు శస్త్ర చికిత్స జరిగినందున రఘురామకృష్ణరాజుకు మే 21న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిబంధనల ప్రకారం ఆయన గుంటూరు జైలుకు వచ్చి బెయిల్ పత్రాలపై సంతకం చేసి బెయిల్‌పై విడుదల కావాల్సి ఉంది. బెయిల్ షరతుల ప్రకారం గతనెల 28న రూ.లక్ష విలువైన రెండు ష్యూరిటీలను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించారు. వాటిని అదేరోజున న్యాయస్థానం ఫారం–43తో సహా గుంటూరు జైలుకు పంపించింది. వాటిపై నిందితుడి సంతకం తీసుకుని సమర్పించాలని ఆదేశించింది. అందుకోసం రఘురామకృష్ణరాజు గుంటూరు జైలుకు రావాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. దాంతో రఘురామ సంతకం లేని పత్రాలను గుంటూరు జైలు సూపరింటెండెంట్ ఈ నెల 10న సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. బాండ్ పత్రాలపై నిందితుడు సంతకం చేయనందున ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయినట్టు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనపై రిమాండ్ వారెంట్ మనుగడలో ఉన్నట్టుగానే భావిస్తున్నామని కూడా తేల్చిచెప్పింది. కాబట్టి ఎంపీ రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. చదవండి: దొంగ జీవోలు తెచ్చి ఆ భూములు అమ్మారు: విజయసాయిరెడ్డి -
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం.. కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇచ్చింది. ఈ నెల 19 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలవుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తెలంగాణ: మరో వారంలో ఇంటర్ ఫలితాలు నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే జూన్ 30 వరకు మరోమారు సెలవులను పొడిగించింది. ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోన్నుట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల కట్టడి కోసం లాక్డౌన్ విధించి ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్ -
Telangana Lockdown: పొడిగించాలా? వద్దా?.. 30న నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అన్న అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. దీని కోసం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. కరోనా రెండో వేవ్ ఉధృతిని నియంత్రిం చడానికి ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించగా, ఇప్పటికే ఒకసారి పొడిగిం చారు. ఈ నెల 30తో ఇది ముగియ నుంది. లాక్డౌన్ ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా సడలింపులు, మినహాయింపులు ఇచ్చి మరో వారం పది రోజులపాటు లాక్డౌన్ పొడిగించవచ్చని సమాచారం. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేస్తే మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో పొడిగింపునకే ప్రభుత్వం మొగ్గు చూపనుంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు అమలు చేస్తున్నారు. దీన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచాలని వ్యాపార వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థిరాస్తి రంగ వ్యాపారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు నిర్మాణ రంగ ప్రాజెక్టుల పనులు కొనసాగించేందుకు కొత్తగా సడలింపులిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే సిమెంట్, స్టీల్, హార్డ్‌వేర్ దుకాణాలకు సడలింపులు ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకోనుంది. కాగా.. వానాకాలం పంటల సాగు ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాల సరఫరా తదితరాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రైతుబంధు సొమ్ము పంపిణీపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. -
ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం -
ఆంధ్రప్రదేశ్ నిట్.. విస్తరణతో ఫిట్
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విస్తరణ రెండో దశ పనుల నిమిత్తం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారవుతోంది. రానున్న కాలంలో నిట్‌లో బీటెక్ ఇన్‌టేక్ సీట్లు 850, పీజీ సీట్లు 300, ఎంటెక్ సీట్లు 300, పీహెచ్డీ సీట్లు 300కు పెరుగుతాయని అంచనా. రానున్న ఐదేళ్ల కాలంలో దశలవారీగా పెరగనున్న సీట్లు, అందుకు అనుగుణంగా నిర్మించే శాశ్వత భవనాలు, ఇతర సౌకర్యాల నిమిత్తం ఎంత ఖర్చవుతుందనే అంచనాలను డీపీఆర్ రూపంలో రూపొందిస్తున్నారు. భవనాల నిర్మాణంలో భాగంగా వన్, వన్–బీగా పేర్కొనే భవనాల నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ పనులు పూర్తవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే కేంద్ర ఆర్థిక శాఖ సమావేశంలో డీపీఆర్‌కు ఆమోద ముద్ర లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు రాష్ట్ర విభజన అనంతరం తాడేపల్లిగూడెంలో ఏర్పాటైన ఏపీ నిట్ ప్రాంగణంలో తొలి దశలో రూ.415 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించారు. బాలికల కోసం 5, బాలుర కోసం 7 వసతి గృహాలు నిర్మించారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2 వేల మంది విద్యార్థులకు సరిపడా వసతి ఉంది. పరిపాలనా భవనం, డొక్కా సీతమ్మ మెస్, వర్క్‌షాప్, ల్యాబ్ కాంప్లెక్స్, లైబ్రరీ, జిమ్, క్రీడా ప్రాంగణాలు, ప్రెసిడెన్షియల్ సూట్ గల గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విస్తరణ రెండో దశ పనుల నిమిత్తం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారవుతోంది. రానున్న కాలంలో నిట్‌లో బీటెక్ ఇన్‌టేక్ సీట్లు 850, పీజీ సీట్లు 300, ఎంటెక్ సీట్లు 300, పీహెచ్డీ సీట్లు 300కు పెరుగుతాయని అంచనా. 8 కోర్సులు ఏపీ నిట్‌లో ప్రస్తుతం బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంఎంఈ) కోర్సులు ఉన్నాయి. వీటిలో 2019–20 వరకు 480 సీట్లు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి 120 సీట్లతోపాటు సూపర్ న్యూమరరీ కోటా కింద వచ్చిన మూడు సీట్లతో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 603కు పెరిగాయి. ఎంటెక్‌లో ఆరు కోర్సులు, ఐదు డిపార్టుమెంట్లు, ఉన్నాయి. రానున్న కాలంలో సీట్ల సంఖ్య మరింత పెరగనుంది. రూ.800 కోట్లతో భవనాల నిర్మాణం రానున్న ఐదేళ్లలో నిట్‌లో పెరగనున్న సీట్లను అంచనా వేసి రూ.800 కోట్లతో భవనాల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి విభాగానికి ప్రత్యేక భవనం నిర్మించనున్నారు. ఇంక్యుబేషన్ సెంటర్, ఇండస్ట్రియల్ కొలాబ్రేషన్ సెల్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, అధ్యయనం, పరిశోధనల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చేరే విదేశాల విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహం, ఫ్యాకల్టీ, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం చేపట్టనున్నారు. నిట్‌లో విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ సామర్థ్యాన్ని భవిష్యత్ అవసరాల కోసం 4.5 మెగావాట్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్‌లో మిగులుతున్న 200 కిలోవాట్స్ విద్యుత్‌ను భవిష్యత్‌లో గ్రిడ్‌కు ఇవ్వకుండానే నిట్ అవసరాలకే వినియోగించుకునేలా ప్రతిపాదించారు. నిట్ క్యాంపస్‌కు రెండో వైపున కూడా గేట్ ఏర్పాటు చేయనున్నారు. కాలుష్య నివారణలో భాగంగా క్యాంపస్‌లో విద్యుత్ బస్సులు నడపడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. వీటి కొనుగోలుకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యువబుల్ ఎనర్జీ రాయితీ ఇవ్వనుంది. -
టెట్ వ్యాలిడిటీ శాశ్వతం..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్సీటీఈ భావిస్తోంది. 2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి. మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. వీరికీ వర్తిస్తుందా?: ఉమ్మడి ఏపీలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్–1లో 1,35,105 మంది, పేపర్–2లో 1,66,262 మంది అర్హత సాధించా రు. రెండో టెట్‌లో పేపర్–1లో 24,578 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడో టెట్‌లో పేపర్–1లో 26,382 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. అయితే అందులో టెట్ స్కోర్ పెంచుకునేందుకు రెండోసారి మూడోసారి రాసిన వారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి మూడు టెట్లలో మొత్తంగా 7 లక్షల మందికి పైగా అర్హత సాధించగా, అందులో తెలంగాణ విద్యార్థులు 3 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇప్పటికే వారందరి టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. వారి విషయంలో ఎన్సీటీఈ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. -
డీఆర్డీఓ: సతీష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చైర్మన్ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండుళ్ల పాటు పొడిగించింది. ప్రస్తుతం డీఆర్డీఓ చీఫ్‌గా కొనసాగుతున్న సతీష్‌రెడ్డిని మరో రెండేళ్లు అదే పదవిలో కొసాగించాలని సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్వర్వులు సైతం జారీచేసింది. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.1985లో డీఆర్డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. -
టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్ ఊరట
వాషింగ్టన్ : టిక్‌టాక్ నిషేధం అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక అర్డర్ జారీ చేశారు. టిక్‌టాక్ విక్రయానికి దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌కు మరో 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ మేరకు కొత్త ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. తద్వారా టిక్‌టాక్‌కు కొంత ఉపశమనం లభించింది. జాతీయ భద్రతకు హాని కలిగిస్తోందనేందుకునమ్మదగిన ఆధారాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాల ఆధారంగా దేశ ప్రయోజనాలకు, భద్రతకు ముప్పుగా మారిన టిక్‌టాక్ పై చర్య తీసుకునే అవకాశం ఉందని నమ్ము తున్నానంటూ ఆగస్టు 14 న (నిన్న) జారీ చేసిన ఉత్తర్వుల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ గడువులోపల అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించుకోండి..లేదంటే వ్యాపారంపై నిషేధం తప్పదని స్పష్టం చేశారు. ఈ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం 90 రోజుల గడువు లోపల టిక్‌టాక్‌ను ఏదైనా అమెరికా సంస్థ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి నవంబర్, 12తో కొత్త గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఈ గడువు సెప్టెంబరు 15 వరకు మాత్రమే. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?) కాగా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని సొంతం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ కొనుగోలు ఒప్పందాన్ని బైట్‌డాన్స్ తప్పనిసరిగా విదేశీ పెట్టుబడుల కమిటీకి నివేదించాలని, గణనీయమైన భాగం తమ ట్రెజరీకి చేరాలని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘దిశ’ ఘటన ఎన్కౌంటర్ విచారణ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ ఎన్కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిషన్‌కు మరో ఆరు నెలల గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దారుణంలో నిందితులను ఎన్కౌంటర్లో కాల్చి చంపిన ఘటనపై సుప్రీంకోర్టు గత డిసెంబర్ 12న న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ ఈ ఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని, కమిషన్ విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని నాటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ప్రకారం ఆగస్టు 3తో నివేదిక సమర్పణకు గడువు ముగియనుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో కమిషన్ న్యాయ విచారణ కోసం సమావేశాలు నిర్వహించలేకపోయిందని కమిషన్‌కు కౌన్సిల్‌గా ఉన్న న్యాయవాది కె.పరమేశ్వరన్ సుప్రీంకోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగించాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కమిషన్ గడువును పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అమెజాన్ ఉద్యోగులకు శుభవార్త
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ వంటి ప్రముఖ కార్పోరేట్ కంపెనీలన్నీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రం హోం' ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రమ్ హోం పాలసీని వచ్చే ఏడాది జనవరి 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటినుంచే సమర్థవంతంగా పనిచేయగలిగేవారికి కాలపరిమితిని విస్తరిస్తున్నామని తెలిపింది. అయితే ఆఫీసులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. ఆఫీసులోకి ప్రవేశించే ముందు టెంపరేచర్ చెక్ చేసి అనుమతిస్తున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇంతకుముందు మే నెలలో అమెజాన్.. ఉద్యోగులకు అక్టోబర్ 2వరకు వర్క్ ఫ్రం హోం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ గడువును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఉద్యోగుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమంటూ పేర్కొంది. (ఇక రిలయన్స్ రిటైల్‌పై ముకేశ్ దృష్టి! ) -
నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువు... ఏడాది పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: బిల్డర్లు, డెవలపర్లకు శుభవార్త. కరోనా సృష్టించిన సంక్షోభంతో కుదేలైన స్థిరాస్తి రంగ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఇటీవల స్థిరాస్తి వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశమై చేసిన పలు విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని పలు వెసులుబాట్లను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేయడంతో కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో స్థిరాస్తి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూలీలు లేక జాప్యం నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, కూలీలు లేకపోవడంతో పనులు పూర్తికాకున్నా గడువు ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువును మరో ఏడాది పాటు పొడిగించింది. 2020 మార్చి 25 నుంచి 2021 మార్చి 31 మధ్యకాలంలో గడువు పూర్తి కానున్న ప్రాజెక్టుల గడువు ఆటోమేటిక్‌గా మరో ఏడాది పాటు పొడిగించిందని, ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులు/ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ స్పష్టం చేసింది. సంబంధిత యజమాని/ డెవలపర్ దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. ఈ మేరకు అరవింద్‌కుమార్ ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఇంపాక్ట్ ఫీజు వాయిదాల పొడిగింపు... భవన నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ‘సిటీ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు’ను వాయిదాల్లో చెల్లించేందుకు గతంలో కల్పించిన వెసులుబాటు ఈ ఏడాది మార్చి 7 తో ముగిసిపోగా, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని అరవింద్ కుమార్ ఈ నెల 6న ఉత్తర్వులిచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవడానికి భవన అనుమతుల జారీ సమయంలో వాయిదాలకు సంబంధించిన పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వాలని, గ్రౌండ్/ఫస్ట్/సెకండ్ ఫ్లోర్లో 5% అదనపు స్థలాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుందన్నారు. వాయిదాల్లో ఫీజులు చెల్లించవచ్చు.. కొత్త భవన, లేఅవుట్ నిర్మాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతుల కోసం జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏకు చెల్లించాల్సిన బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్మెంట్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు, క్యాపిటలైజేషన్ చార్జీలతో పాటు ఇతర అన్ని చార్జీలను నాలుగు సమాన అర్ధవార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. 2021 మార్చి 31 వరకు పొందే అన్ని అనుమతులకు ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. 2021 మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు స్వీకరించిన కొత్త దరఖాస్తులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అనుమతులు పొందే సమయంలో తొలి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మూడు వాయిదాలను నిర్దేశిత గడువులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చేలా పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించాలి. చెల్లించాల్సిన ఫీజుల వివరాలను తెలియజేస్తూ లేఖ జారీ చేసిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. భవనం/ లే అవుట్ అనుమతులు పొందే సమయంలో బిల్డర్/ డెవలపర్ మొత్తం ఫీజులను ఒకేసారి చెల్లించాలని భావిస్తే ప్రోత్సాహకంగా మొత్తం చార్జీలపై 5 శాతం తగ్గింపును అమలు చేయనున్నారు. నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే జాప్యం కాలానికి 12 శాతం వడ్డీతో కలిపి వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. -
లాక్డౌన్ పొడిగింపుపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు ఉధృతి నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొంది. లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రూమర్ల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని హెచ్చరించింది. కాగా జూన్ 15 నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. Claim: A message on Facebook claiming strict #Lockdown from 18th June. #PIBFactCheck: It's #Fake. There is no such plan under consideration. Please beware of rumour mongers. pic.twitter.com/NqSXOpy9n9 — PIB Fact Check (@PIBFactCheck) June 14, 2020 మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రెండురోజుల పాటు (16,17 తేదీలు) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్ననేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింతగా రెక్కలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కాగా కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను దాదాపు 75 రోజులపాటు కేంద్రం కొనసాగించింది. జూన్ 8 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారిగా భారీగా సడలిస్తూ వచ్చింది. (చదవండి: హీరోయిన్ పెళ్లి: ఇన్‌స్టాలో వీడియో) -
వాహన పత్రాల చెల్లుబాటు పొడిగింపు..
సాక్షి, న్యూఢిల్లీ: వాహనాల ఫిట్ నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తో సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. కరోనా విజృంభిస్తుండటం, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఫ్రిబ్రవరి 2020తో పత్రాల చెల్లుబాటు ముగిసిన వారు రెన్యూవల్ చేయించుకోవడానికి జూన్ వరకు మొదట గడువునిచ్చిన కేంద్రప్రభుత్వం జూన్ నాటికి దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పౌరులకు ఇబ్బంది కలిగించకూడదే ఉద్దేశంతో వాహన పత్రాల చెల్లుబాటు తేదీని పొడిగించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం అందించింది. (వైరస్ బారిన ఒకే కుటుంబంలో 26 మంది) -
సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్ సర్వీస్‌లో కొనసాగనున్నారు. (పటిష్టంగా కేంద్ర ప్యాకేజీ అమలు) -
మరో మూడునెలలు మారటోరియం?
సాక్షి, ముంబై: ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం రుణాలు చెల్లింపుపై ఇప్పటికే కల్పించిన మారటోరియంను మరోసారి పొడిగించనుంది. లాక్డౌన్ పొడగింపు నేపథ్యంలో రుణాల ఈఎంఐల చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కలాపాలు నిలిచిపోయాయి. చిన్నా, పెద్ద పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో అన్ని రకాల రుణాల చెల్లింపుపై ఆర్బీఐ ఊరటనిచ్చింది. మార్చి 1, 2020 , మే 31, 2020 మధ్య చెల్లించాల్సిన బకాయిలపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించింది. దీని ప్రకారం 2020 ఆగస్టు 31 వరకు కంపెనీలు చెల్లించనవసరం లేదు. అయితే తాజాగా లాక్డౌన్ మే 31 వరకు పొడిగించడంతో ఈ వెసులుబాటును మరో మూడు నెలలు పొడిగించాలని భావిస్తోంది. రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడంతో గడువు లోపల (సెప్టెంబరులో) ఆయా కంపెనీలు చెల్లించాల్సినవి వడ్డీతో కలిపి చెల్లించే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని ఎస్బీఐ పరిశోధన అంచనా వేసింది.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రుణాల సమగ్ర పునర్నిర్మాణం, రీ క్లాసిఫికేషన్ కోసం బ్యాంకులకు 90 రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. అయితే వడ్డీతో కలిపి లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, నిబంధనల ప్రకారం అలాంటి వారి ఖాతాను నిరర్ధక రుణాలుగా వర్గీకరించవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ విస్తరణను కోవిడ్-19 అప్పుగా పరిగణిస్తుందో లేదో కూడా ఆర్బీఐ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై ఆర్బీఐ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. (వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు - కిరణ్ మజుందార్ షా) కరోనా వైరస్ మహమ్మారి కట్టడిగా గాను ముందుగా జనతా కర్ఫ్యూను , అనంతరం 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే వైరస్ తగ్గుముఖం పట్టకపోడంతో దీన్ని మే 3 వరకు ఆ తర్వాత మళ్ళీ మే 17 వరకు పొడిగించింది. కేంద్రం తాజాగా లాక్డౌన్ 4.0ను మే 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే. (శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..) -
లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్టపడకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఈ నెల (మే 31 ) చివరి వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశంపై చర్చించామని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రదేశాల్లో లాకడౌన్ 3.0 ముగిసేలోపు కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. (లాక్డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం ) కాగా బుధవారం రాత్రికి మహారాష్ట్రలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 25922 కు చేరగా, 975 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ కారణంగా 596 మంది మరణించారు. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా వైరస కేసుల సంఖ్య 81970 కు చేరగా, మరణాల సంఖ్య 2649 చేరింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడవ దశ లాక్డౌన్ మే17వతేదీతో ముగియనుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్డౌన్ కొనసాగనుందని సూచించిన సంగతి తెలిసిందే. చదవండి : మూడ్ లేదు.. ఇక తెగతెంపులే వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు -
మహారాష్ర్టలో లాక్డౌన్ పొడిగింపు!
ముంబై : అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న మహారాష్ర్టలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు గురువారం జరిపిన సమీక్షలో రాష్ర్టంలో మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రులు బాలాసాహెబ్ తోరత్ సహా ఇతర పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. కరోనా నివారణకు మే నెలఖారు వరకు లాక్డౌన్ పొడిగించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (మహారాష్ట్రలో మహమ్మారి బారిన పోలీసులు) ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహారాష్ర్టలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేసేందుకు లాక్డౌన్ పొడిగింపే శరణ్యమని భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఉద్దవ్ తెలిపారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కార్మికులను పంపేటప్పడు ఆయా ప్రభుత్వాలతో అనుమతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రుణమాఫి పొందిన రైతలకు రుణాలు ఇవ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంకును కోరినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్నారు. దీనికి సంబందించి ఇప్పటికే ఆర్బీఐతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అధేవిధంగా రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. -
లాక్డౌన్; జపాన్ కీలక నిర్ణయం
టోక్యో : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జపాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మే31 వరకు పొడిగించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి సోమవారం జపాన్ ప్రధాని షింజో అబే వివిధ నిపుణుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. లాక్డౌన్ పొడిగింపుకే ప్రధాని మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికల్లా దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 15,589 మందికి కరోనా వైరస్ సోకగా, 530 మరణించారు. (పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం ) కోవిడ్ నివారణకు నెలరోజుల పాటు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు ఏప్రిల్7 న ప్రధాని షింజో అబే ప్రకటించారు. మే 7న ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే లాక్డౌన్ పొడిగింపుకే ప్రధాని మొగ్గుచూపుతున్నట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. కరోనా వ్యాప్తి తగ్గితే త్వరలోనే పార్కులు, మ్యూజియం వంటి ప్రాంతాలను తెరిగి తెరవడానికి అనుమతిస్తామని జపాన్ ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఏర్పడిన అడ్డంకులను కొంత వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. (వీడియో షేర్ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్! ) -
లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టంతో మొదలైంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నడుమ సెన్సెక్స్ 1700 పాయింట్లను కోల్పోయింది. అమెరికా-చైనా ట్రేడ్ వార్, కరోనా వైరస్ కట్టడికోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరో 2వారాల పొడగింపు, ఏప్రిల్‌లో ఆటో అమ్మకాలు శూన్యం కావడం లాంటి కారణాలు ఈ నష్టాలకు దారితీశాయని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం1683 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 32008 వద్ద, నిఫ్టీ 492 పాయింట్లను నష్టపోయి 9369 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, మెటల్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కేవలం సిప్లా, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే 1-1.50 శాతం లాభ పడుతున్నాయి. (జియో మరో భారీ డీల్) -
భారత ప్రొఫెషనల్స్‌కు ఊరట..
లండన్ : బ్రిటన్‌లో భారత ప్రొఫెషనల్స్‌కు యూకే తీపికబురు అందించింది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న భారత్ సహా వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ హెల్త్‌కేర్ సిబ్బంది, ప్రొఫెషనల్స్‌కు వీసా గడవును మరింత పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. బ్రిటన్ హోంమంత్రి, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ ఈ మేరకు ప్రకటించారు. అక్టోబర్ 1తో వీసా గడువు ముగియనున్న వైద్యులు, రేడియోగ్రాఫర్లు, సామాజిక కార్యకర్తలు, ఫార్మసిస్టుల వీసాలను ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ప్రీతి పటేల్ వెల్లడించారు. వీరందరికీ ఉచిత వీసా గడువు పొడిగింపు అందుబాటులోకి రానుంది. చదవండి : బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు -
హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్ : కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) సోమవారం తన వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది. కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న, తాము ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ పలువురు టెకీలు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు మరోసారి టెలివిజన్ తెరముందు ప్రత్యక్షమై దేశంలో కరోనా వైరస్‌ను కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన గత నెల రోజుల్లో టెలివిజన్ తెరమీదకో, రేడియోలోకో వచ్చి సామాజిక దూరం పాటించండని, చప్పట్లు కొట్టండని, లైట్లు ఆర్పేయండీ, కొవ్వొత్తులు వెలిగించండంటూ పిలుపునిచ్చారు. అష్టకష్టాలకు ఓర్చుకొని ఇళ్లకు పరిమితమవుతూ సామాజిక దూరం పాటిస్తున్నందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ఎంతో వినమ్రంగా చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు నిర్వర్తించాల్సిన విధుల గురించి ఆయన ఎంతో చక్కగా విడమర్చి చెప్పారు. కానీ కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలేమిటో వివరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా 600 ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని, లక్ష పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనతో అన్నార్థులను ఆదుకుంటామని అన్నారు. పంటల కోతలను అనుమతించాలని అధికారులకు సూచించారు. అంతకుమించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పనేలేదు. రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయి ఆకలిదప్పులతో అలమటిస్తున్న వలస కార్మికుల సంగతేమిటీ? ఉపాధి కోల్పోయి రోడ్డునపడి రేషన్ కార్డులు, భవన నిర్మాణ కూలీల కార్డులు లేక అన్నమో రామచంద్రా! అంటున్న వారి సంగేతేమిటో చెప్పనేలేదు. (మోదీ ముందుంది అతి పెద్ద సవాల్!) ఉపాధి కోల్పోయిన పేదలకు రేషన్ కార్డులపై అదనంగా బియ్యం, పప్పులతోపాటు నెలకు 1500 నుంచి 2000 రూపాయల వరకు నగదు చెల్లిస్తామని పలు రాష్ట్రాలు హామీ ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు ఇంతవరకు నగదును చెల్లించలేక పోయాయి. ఈ విషయాలను ప్రస్తుతానికి పక్కన పెడితే అత్యవసరంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. 1. ప్రధాన మంత్రి కళ్యాణ్ యోజన పథకాన్ని కేవలం లబ్దిదారులకే కాకుండా ఇతరులకు వర్తింప చేస్తారా? అందుకు సరసడా నిధులు అందుబాటులో ఉన్నాయా? 2. రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికుల సంగతి ఏమిటీ? వారిని మాతృరాష్ట్రానికి లేదా అతిథి రాష్ట్రానికి పంపిస్తారా? లేదా లాక్డౌన్ ముగిసే వరకు సరిహద్దు తాత్కాలిక షెల్టర్లలో ఉండాలా? వలస కార్మికులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 3. తాత్కాలిక షెల్టర్లు ఆరోగ్యకరంగా లేకపోతే వారేమి చేయాలి? 4. వారి మీద పోలీసులు అన్యాయంగా లాఠీచార్జీ చేయకుండా చర్యలేమైనా తీసుకుంటారా? 5. తర తమ భేదం లేకుండా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికి రేషన్ బియ్యం సరఫరాకు చర్యలు తీసుకుంటారా? 6. గిడ్డంగుల్లో పేరుకుపోయిన అధనపు ధాన్యం నిల్వలను కేంద్రం విడుదల చేస్తుందా? 7. రాష్ట్రాలకు బకాయి పడివున్న కోట్లాది రూపాయల నిధులను కేంద్రం విడుదల చేస్తుందా? 8. రాష్ట్రాలకు అవసరమైతే కేంద్రం అప్పులిస్తుందా? 9. దేశంలో వైద్య వ్యవస్థ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 10. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్ సూట్ల కొరత తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 11. కరోనా పరీక్షల కిట్ల సంగతేమిటీ? ఆర్టీ–పీసీఆర్, యాంటీబాడీ రెండు విధాన పరీక్షలకు సంబంధించిన కిట్లు ఉన్నాయా? 12. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా పరికరాల నిల్వలు ఎంతున్నాయి? 13. లాక్‌డౌన్‌తో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ఉద్దీపణ పథకాలేమైనా సిద్ధం చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్రం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. -
ఇక ‘స్మార్ట్ లాక్డౌన్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని పొడిగించడం ఖాయమేనని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) దేశాన్ని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావించనున్నారు? లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండబోతోందా? గత మూడువారాలుగా కొనసాగిన విధంగా కఠినంగానే ఉండబోతోందా? ఆంక్షల సడలింపుపై ఏవైనా నిర్ణయాలుంటాయా? ఉంటే.. ఎలాంటి మినహాయింపులుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్‌తో ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ.. మరో రెండు వారాల పాటు నిర్బంధం ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి పడిపోతుందోనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ లాక్డౌన్ కాకుండా.. ఆర్థికాభివృద్ధికి వీలు కల్పించే ‘స్మార్ట్ లాక్డౌన్’ను ప్రధాని ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు దేశæ ఆర్థికాభివృద్ధి పైనా(జాన్ భీ.. జహాః భీ) దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. మద్యం అమ్మకాలకు ఒత్తిడి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాల విషయం ప్రస్తావించారు. ఖజానాకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై ఆంక్షల సడలింపును వారు కోరారు. బార్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వకుండా.. పాక్షికంగా, రోజులో కొన్ని గంటల పాటు అయినా మద్యం అమ్మకాలకు వీలు కల్పించాలన్నారు(దీనిపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి). దాంతో, రాష్ట్రాలు కోరితే.. ఆంక్షల సడలింపులో భాగంగా.. మద్యం అమ్మకాలను పాక్షికంగా అనుమతించే అవకాశం ఉంది. ► స్వల్ప స్థాయిలో దేశీయ విమాన, రైల్వే, మెట్రోరైల్ సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. అయితే, 30 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేలా ఆంక్షలు పెట్టే అవకాశముంది. ► కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను పలువురు సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. -
లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ఈ రోజుతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని నిబంధనల సడలింపు ఉంటుందని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. పలు రాష్ట్రాలు ఏప్రిల్ 14 తరువాత కనీసం రెండు వారాల లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతుండగా ప్రభుత్వం మాత్రం కోవిడ్–19ను నిరోధించడం, అదే సమయంలో దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలను మొదలుపెట్టడం అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని ఓ అధికారి తెలిపారు. భౌతిక దూరం కచ్చితంగా పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులూ ప్రధాని ప్రకటించవచ్చునని అంచనా. ప్రాణాలతోపాటు, జీవనోపాధులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని గత శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వ్యాఖ్యానించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్నప్పుడు నేను ప్రాణముంటే ప్రపంచం ఉంటుందని చెప్పాను. దేశంలోని అధికులు దీన్ని అర్థం చేసుకున్నారు. ఇళ్లల్లోనే ఉండి తమ బాధ్యతలు నెరవేర్చారు. ఇప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాణాలతోపాటు జీవనోపాధులపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’ అని మోదీ ఆ సమావేశంలో వివరించారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. కార్యాలయాలకు కేంద్ర మంత్రులు.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనువుగా సోమవారం పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని తమ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు. ‘లాక్డౌన్లో ఎక్కువ కాలం ఇంటి నుంచే పనిచేశాను. ఈ రోజు శాస్త్రి భవన్‌లోని కార్యాలయానికి తిరిగి వచ్చా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధమైంది’’అని బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సోమవారం తమ తమ కార్యాలయాలకు వచ్చిన వారిలో ఉన్నారు. జాయింట్ సెక్రటరీలు, అంతకంటే పై స్థాయి అధికారులకు రవాణా సౌకర్యం ఉండటం వల్ల వారు కార్యాలయాలకు రాగా.. రెండు, మూడు, నాలుగో తరగతుల ఉద్యోగులు వంతుల వారీగా వస్తున్న విషయం తెలిసిందే. అవసరమైనంత రక్షణ ఏర్పాట్లతో గుర్తించిన పరిశ్రమలు, సేవలను అందుబాటులోకి తేవాలని దేశీ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక మండలి ఇప్పటికే సూచించింది కూడా. -
జాన్ బీ, జహాన్ బీ రెండూ ముఖ్యం: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపుపై ఉత్కంఠ కొనసాగుతుండగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు చాలా కీలకమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం దష్టి ‘జాన్ హైతో జహాన్ హై’ నుంచి ‘జాన్ బీ ఔర్ జహాన్ బీ’ పైకి దృష్టి మళ్లిందని ప్రకటించడం ప్రధానంగా పలువురి దష్టిని ఆకర్షించింది. ‘ప్రాణముంటే ప్రగతి అదే ఉంటుంది’ నుంచి ‘ప్రాణం ఉండాలి. ప్రగతీ ఉండాలి’ అన్నది ఆయన ప్రాస వ్యాక్యానికి అర్థం. ‘మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్ర, మనము ఉండాలి, ప్రపంచం ఉండాలి... అనేది నేటి మంత్ర. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో సరిపోయినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు. అయితే సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ టెలి కాన్ఫరెన్స్ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ గందరగోళాన్ని రేపింది. లాక్ డౌన్ పొడిగింపుపై సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించడం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని అటు మమతా బెనర్జీ కూడా వెల్లడించారు. అయితే ఈ ప్రకటనను ఖండించిన కేంద్రం... ప్రధాని ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రసంగం కూడా వాయిదా పడిందని, సోమవారం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. -
ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదు : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుందనే వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది. యథావిధిగా ఈ ఆర్థిక సంవత్సరం 31.3.2020 తో ముగుస్తుందని తెలిపింది. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదని, మార్చి 31 తో ముగియనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత స్టాంప్ చట్టంలో చేసిన మరికొన్ని సవరణలకు సంబంధించి 2020 మార్చి 30న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఆర్థిక సంవత్సరం పొడిగింపు లేదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. కరోనా కల్లోలం కారణంగా కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని3 నెలలు పొడిగించిందంటూ వార్తలు వెలువడ్డాయి. 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుందని సూచించాయి. అయితే ఈ అంచనాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగియనున్న నేపథ్యంలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాల ఫైలింగ్ ను, ప్యాన్-ఆధార్ లింకింగ్ గడువున, జీఎస్టీ ఫైలింగ్ లాంటి కొన్ని అంశాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. (చదవండి : తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?) -
కరోనా కల్లోలం.. ఆర్థిక ఉపశమనం!
న్యూఢిల్లీ : కోవిడ్–19 వైరస్ కారణంగా ప్రజలు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను మూడు నెలల పాటు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ►2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ►అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు ఈ నెలాఖరు వరకే ఉండగా, ఇది సైతం జూన్ 30 వరకు పెరిగింది. ►మార్చి, ఏప్రిల్, మే నెలల జీఎస్టీ రిటర్నులను ఎటువంటి జరిమానాలు లేకుండా జూన్ నెలాఖరు వరకు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆలస్యపు రిటర్నులపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు పెనాల్టీ, ఆలస్యపు రుసుములు ఉండవు. రూ.5 కోట్ల టర్నోవర్ దాటిన వారు సైతం జూన్ నెలాఖరు వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కానీ, గడువు దాటిన తర్వాత కాలానికి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ►ఆధార్, పాన్ అనుసంధాన గడువు జూన్ 30 వరకు పెరిగింది. ►ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డెబిట్‌కార్డు లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇది మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. మెట్రోల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు మూడు మించితే, నాన్ మెట్రోలో ఐదు లావాదేవీల తర్వాత ప్రస్తుతం చార్జీ విధిస్తున్నారు. ►సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణలో విఫలమైతే వసూలు చేసే చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసింది. ►డిజిటల్ రూపంలో చేసే వాణిజ్య లావాదేవీల చార్జీలతగ్గింపు. ►ఆదాయపన్ను వివాదాల పరిష్కారానికి తీసుకొచ్చిన వివాద్సే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగింపు. దీనివల్ల జూన్ నాటికి చేసే చెల్లింపులపై అదనంగా 10 శాతం చార్జీ ఉండదు. ►పొదుపు సాధనాల్లో పెట్టుబడులు లేదా మూలధన లాభాల పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడుల గడువు, నోటీసుల జారీ గడువును కూడా మూడు నెలలు పొడిగించారు. ►ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ పన్ను మదింపు, రెగ్యులర్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, ఎస్టీటీ ఆలస్యపు చెల్లింపులపై వడ్డీ రేటు 12/18 శాతానికి బదులు 9 శాతం వసూలు చేస్తారు. ►కంపెనీల డైరెక్టర్ల బోర్డులు చట్ట ప్రకారం 120 రోజులకోసారి సమావేశం కావాల్సి ఉండగా, ఈ గడువును కూడా మరో 60 రోజులు పొడిగించారు. దివాలా చర్యల సడలింపు ప్రస్తుతం రూ.లక్ష మేర రుణ చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని రూ.కోటికి పెంచినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) పెద్ద ఎత్తున దివాలా చర్యలు ఆగిపోతాయని మంత్రి చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితే ఏప్రిల్ 30 తర్వాత కూడా కొనసాగితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016 చట్టంలోని సెక్షన్ 7, 9, 10లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని పరిశీలిస్తాము. దీనివల్ల కంపెనీలు పెద్ద సంఖ్యలో దివాలా చర్యల బారిన పడకుండా నిరోధించినట్టు అవుతుంది’’ అని మంత్రి తెలిపారు. అతి త్వరలో ప్యాకేజీ ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ముగింపు దశలో ఉందని, దీన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతీ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్–19 ఎకనమిక్ టాస్క్‌ఫోర్స్ కూడా పని ప్రారంభించింది. టాస్క్‌ఫోర్స్ పని ఎన్నో అంచనాలతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఇది ముగింపు దశలో ఉంది’’ అని మంత్రి వివరించారు. స్టాక్ మార్కెట్లను గమనిస్తున్నాం ఆర్థిక శాఖ, ఆర్బీఐ, సెబీ తదితర అన్ని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు కలసి కట్టుగా పనిచేస్తూ.. కోవిడ్–19 కారణంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులను, పరిణామాలను గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రోజులో మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే సెబీ కొన్ని చర్యలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కోవిడ్–19 మన దేశంలోకి ప్రవేశించిన నెల రోజుల్లోనే సెన్సెక్స్ 15 వేల పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 4 వేల పాయింట్లకు పైగా పడిపోయిన విషయం తెలిసిందే. -
ఖాయిలాపడ్డ పరిశ్రమల్లో ఐటీ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ పరిశ్రమలను తూర్పు హైదరాబాద్‌లో కూడా విస్తరించే ప్రణాళికలున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మల్లాపూర్, నాచారం పారిశ్రామికవాడల్లో మూతపడ్డ పరిశ్రమలను ఐటీ సంస్థలుగా మార్చేందుకు నిర్ణయించామని, దీనికి సంబంధించి త్వరలో శుభవార్త వెల్లడిస్తామన్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు జనగామ, హుజురాబాద్ లాంటి చిన్న పట్టణాల్లో కూడా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం అసెంబ్లీలో పద్దులపై చర్చకు ఆయన ఆదివారం రాత్రి సమాధానమిచ్చారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ పెరుగుదల రేటు 16.89 శాతంగా ఉందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరును కూడా ఇటీవల వెనక్కి నెట్టామన్నారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ యంగ్వన్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడికి సిద్ధమైందన్నారు. పౌరులకు అనుగుణంగా.. రాష్ట్రంలో పట్టణ జనాభా 44 శాతానికి చేరుకోవటంతో పౌరులకు అనుగుణంగా పురపాలక విధానం రూపొందించినట్లు కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 141 పట్టణాల్లో ప్రజలకు మెరుగైన జీవనప్రమాణాలు ఉండేలా 42 అంశాలతో చెక్‌లిస్టు ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఔటర్ రింగురోడ్డు వరకు హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా రూ.50 వేల కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందులో రూ.10 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించామన్నారు. టీఎస్ఐపాస్ను ఆదర్శంగా తీసుకోవాలని నీతి ఆయోగ్ ఇతర రాష్ట్రాలకు సూచించడం గౌరవంగా ఉందన్నారు. ఇప్పుడు టీఎస్‌బీపాస్‌ను ఏప్రిల్ 2న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ వరకు ప్రత్యేకంగా మురుగు నీటిపారుదల కోసం మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం రావాలని, దాని ఆధారంగా ఎవరినైనా పదవీచ్యుతులను చేయాల్సి వస్తే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో జనసంఖ్య పెరుగుతున్నందున, భారం తగ్గించేందుకు సమీకృత టౌన్‌షిప్స్ కోసం ముసాయిదా సిద్ధమైందని వివరించారు. పట్టణ ప్రగతి కోసం రూ.148 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర పార్టీలు సహకరిస్తున్నాయి.. పారిశ్రామికాభివృద్ధి విషయంలో ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయని, ఈ తరహా రాజకీయ స్థిరత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదని మంత్రి చెప్పారు. ఫార్మా సిటీ లో వచ్చే పరిశ్రమలు ఏరకమైన కాలుష్యాన్ని వెదజల్లవని చెప్పారు. దేశంలో ఉ త్పత్తయ్యే మందుల్లో 40 శాతం వరకు మన వద్దే తయారవుతున్నాయని, ప్రపంచానికి మూ డో వంతు వ్యాక్సిన్ మనమే సరఫరా చేస్తున్నామని వివరించారు. ఫార్మాసిటీలో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలొచ్చేలా చూస్తామని, అయితే స్థానికులకు ఉద్యోగాలంటే కొన్ని సంస్థలు వెనక్కి మళ్లే ప్రమాదం ఉందని, దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇసుక ద్వారా మైనింగ్ విభాగానికి గతేడాది రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫార్మాసిటీ ఏర్పాటుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో ఫార్మా కంపెనీల వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని, దీంతో కాలుష్యం తలెత్తే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ఫా ర్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, కాలుష్యం ఉంటే ఏర్పాటుచేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అందరితో చర్చించాకే అంతర్జాతీయ ప్రమాణాలతో కా లుష్యరహితంగానే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని, అందులో రాజీ పడేది లేదని కేటీఆర్ చెప్పారు. -
పీఆర్సీ గడువు మరోసారి పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) గడువు మరోసారి పొడిగించే అవకాశం ఉంది. ఈ నెలలో గడువు ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు పొడిగించాలని పీఆర్సీ కమిటీ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. దీంతో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పీఆర్సీ వ్యవహారాలే కాకుండా రాష్ట్ర కార్యాలయాలు, జిల్లాల్లో వర్క్‌లోడ్, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, ఉండాల్సిన సిబ్బంది సంఖ్య, ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు నిబంధనలు తదితర అంశాలను తేల్చే బా«ధ్యతలను ప్రభుత్వం పీఆర్సీకి అప్పగించింది. అయితే ఇవన్నీ కసరత్తు చేసేందుకు మరింతగా సమయం అవసరం కావడంతో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దీంతో పీఆర్సీ అమలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈలోగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసేందుకు కొంత ఉపశమనం కలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. డీఏ మెర్జ్ చేయడమా.. ఐఆర్ ఇవ్వడమా? పీఆర్సీ అమలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వడమా? లేక పీఆర్సీ అమలు చేయాల్సిన 1–7–2018 నాటికి ఉన్న డీఏను బేసిక్ పేలో కలిపి కొత్త బేసిక్‌తో వేతనాలు చెల్లించడమా? అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాల్సి వచ్చినా ప్రభుత్వంపై అధికంగా ఆర్ధికభారం పడుతుంది. ఒక్క శాతం ఐఆర్ ఇవ్వాలంటే ఏటా రూ.225 కోట్ల చొప్పున వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ గతంలోనే అంచనా వేసింది. ఈ లెక్కన 27 శాతం ఇవ్వాలంటే రూ.6,075 కోట్లు అవసరమవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 శాతం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దీంతో ఐఆర్ కాకుండా పీఆర్సీ అమలు చేయాల్సిన తేదీ 1–7–2018 నాటికి ఉన్న కరువు భత్యాన్ని (డీఏ) ప్రస్తుతం ఉన్న పాత బేసిక్ పేలో కలిపి కొత్త వేతనం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. 1–7–2018 నాటికి 30,292 శాతం డీఏ ఉండగా, ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు 3.244 శాతం డీఏ పెరిగి ప్రస్తుతం 33.536 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ అమలు తేదీ నాటికి ఉన్న డీఏను మెర్జ్ చేసి కొత్త బేసిక్ పేతో వేతనం ఇస్తే ఉద్యోగులకు కొంత ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెరుగుతుంది. దానికి మిగతా 3.244 డీఏ, ఇతర అలవెన్స్‌లు కూడా కలుస్తాయి. దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా హెచ్ఆర్ఏపై రూ.20వేల పరిమితి ఉంది. అంటే రూ.66,640 బేసిక్ పే దాటితే ఆయా ఉద్యోగులకు కొత్త వేతనం వస్తుందే తప్ప.. హెచ్ఆర్ఏ పెరగదు. అయితే బేసిక్ పే రూ.66,640లోపు ఉన్న ఎక్కువ మంది ఉద్యోగులకు మాత్రం హెచ్ఆర్ఏ రూపంలో ప్రయోజనం చేకూరనుంది. పదవీ విరమణ వయసు పెంపు.. ఉద్యోగులకు కొంత ప్రయోజనం చేకూర్చడంతోపాటు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడం ద్వారా వారికి కొంత శాంతపరచవచ్చని, ఫలితంగా పీఆర్సీ ఆర్థిక భారం నుంచి మినహాయింపు పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంపునకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా 2023 మార్చి 31 నాటికి రిటైరయ్యే 26,133 మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. వీటిన్నింటినీ వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదీ వేతన లెక్క... జిల్లాల్లో రూ.42,490–96,110 స్కేల్లో పనిచేసే ఉద్యోగికి ప్రస్తుతం వస్తున్న వేతనం (రూ.లలో) బేసిక్ పే 77,030 ప్రస్తుత డీఏ (33.5366 శాతం) 25,833 హెచ్ఆర్ఏ (12 శాతమైతే) 9,244 మొత్తం 1,12,107 ––––––––––––––––––––––––––––––––––– డీఏ మెర్జ్ చేస్తే వచ్చే వేతనం (రూ.లలో) బేసిక్ పే 77,030 1–7–2018 నాటికి ఉన్న డీఏ (30,292 శాతం) 23,334 ఆ డీఏ కలిపితే వచ్చే బేసిక్ పే 1,00,364 1–7–2018 తరువాత పెరిగిన డీఏ (3.244 శాతం) 3,256 హెచ్ఆర్ఏ (12 శాతమైతే..) 12,044 మొత్తం వేతనం 1,15,664 ––––––––––––––––––––––––––––––––– అదే ఉద్యోగికి 27 శాతం ఐఆర్ ఇస్తే.. బేసిక్ పే 77,030 ఇప్పటివరకు ఉన్న డీఏ (33.536 శాతం) 25,833 హెచ్ఆర్ఏ (12 శాతమైతే) 9,244 ఐఆర్ 20,798 మొత్తం వేతనం 1,32,905 -
మద్యం... పొడిగింపు తథ్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా అక్టోబర్ 31 వరకు పాత లైసెన్సులతో షాపులు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో మరో నెల రోజుల పాటు పాతషాపులే కొనసాగేలా నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అయితే, 3 నెలలు రెన్యువల్ చేయాలనే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగినా, మున్సిపల్ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ప్రస్తుతానికి నెల రోజుల రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి, ఎక్సైజ్ శాఖ ప్రతి రెండేళ్లకోసారి ఒక పాలసీని రూపొందిస్తుంది. రాష్ట్రంలో ఎన్ని వైన్‌షాపుల(ఏ4 షాపులు)కు అనుమతినివ్వాలి? లైసెన్స్ ఫీజు ఎంత నిర్ధారించాలి? టెండర్లు ఎలా స్వీకరించాలి? అనే అంశాలతో 2017–19 సంవత్సరాలకు గాను 2017లో వచ్చిన ప్రస్తుత పాలసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూపొందించిన కొత్త పాలసీని ఆమోదించడంలో కొంత జాప్యం జరిగింది. పాలసీని ఆమోదించి ప్రకటించాలల్సిన సమయంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి రావడంతో కేసీఆర్ ఈ పాలసీ కోసం సమయం కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీ కాకపోయినా ప్రస్తుత పాలసీలో కొన్ని మార్పులు మాత్రమే చేసి ఆ మార్పుల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ 1 నుంచి కొత్త షాపులు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు కొనసాగడం, ఆ తర్వాత బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో టెండర్ల స్వీకరణలో ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయంతో షాపులు రెన్యువల్ చేయాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తోన్న ఎక్సైజ్ పాలసీని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై కూడా స్పష్టత రాలేదని తెలుస్తోంది. దీంతో మరో నెల రోజుల పాటు రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపులు పాత లైసెన్సులతోనే కొనసాగనున్నాయి. -
బార్ లైసెన్సుల అనుమతి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న బార్‌షాపుల అనుమతులను మరో ఏడాదికి పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు 2బీ బార్ లైసెన్సులను రెన్యువల్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వైన్‌షాపుల లైసెన్సుల కాలపరిమితి ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చర్చించినట్లు తెలిసింది. సోమవారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
చైనా పాలకు షాక్!
న్యూఢిల్లీ: చైనా నుంచి చాక్లెట్లు సహా పాలు, పాల ఉత్పత్తులపై నిషేధాన్ని మరో నాలుగు నెలల పాటు కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 దాకా ఇది వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. చైనా పాల ఉత్పత్తుల్లో హానికారకమైన మెలామిన్ (ప్లాస్టిక్స్.. ఎరువుల్లో ఉపయోగించే విషపూరిత రసాయనం) దాఖలాలు ఉన్నాయన్న ఆందోళనతో తొలిసారిగా 2008లో నిషేధం విధించారు. వాస్తవానికి చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకుంది. దీన్ని కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వస్తోంది. గతంలో విధించిన నిషేధం కాలవ్యవధి ఆదివారం నాటికి తీరిపోయింది. -
ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు
-
'ఉపకార’ దరఖాస్తు గడువు పొడిగింపు!
► నెల రోజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం ► 13.5 లక్షల మందిలో దరఖాస్తు చేసింది 3.45 లక్షలే సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు గడువు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా.. సగం మంది విద్యార్థులు కూడా దరఖాస్తులు సమర్పించలేదు. ఒకవైపు పలు కోర్సు ల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో గడువు ను తప్పనిసరిగా పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13.5 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటివరకు 3.45 లక్షల మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. మెజారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవ డంతో గడువు తేదీని నెల రోజుల పాటు పొడిగిం చాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించింది. ‘ముందస్తు’ కష్టమే.. ఉపకార వేతనాల పంపిణీలో జాప్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ముందస్తు దర ఖాస్తు స్వీకరణకు ఉపక్రమించింది. ఆగస్టులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే నవంబర్‌కి వాటిని పరిశీలించి అర్హులను నిర్ధారించి.. డిసెంబర్ నుంచి ఉపకార వేతనాలు పంపిణీ చేయాలని భావించింది. జూన్ మూడో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందస్తు ఆలోచన గాడితప్పినట్లయింది. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. డిగ్రీ ప్రవేశాలకు సంబందించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీంతో ఈ రెండు కేటగిరీ లకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియకు మరికొంత సమయం తీసుకోనుంది. దరఖాస్తుల గడువు నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వానికి ఎస్సీ అభివృద్ధి శాఖ నివేదించిన నేపథ్యంలో.. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనుంది. దీంతో డిసెంబర్ వరకు దరఖాస్తుల పరిశీలనకే సమయం గడిచిపోతుంది. ఇక ముందస్తుగా చేయాలనుకున్న ఉపకార వేతనాల పంపిణీ ఆలస్యం కానుందని అధికారులు చెబుతున్నారు. -
కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపు
న్యూఢిల్లీ: భారత్ ‘ఎ’, అండర్–19 క్రికెట్ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శిక్షణలో రాటుదేలిన కుర్రాళ్లు ఆ వెంటనే అండర్–19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. అలాగే భారత్ ‘ఎ’ జట్టు నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలవగలిగింది. ‘క్రమశిక్షణ, అంకితభావంతో యువ ఆటగాళ్లను ద్రవిడ్ ముందుకు తీసుకెళుతున్నారు. గత రెండేళ్లుగా వర్థమాన ఆటగాళ్లను సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే రెండేళ్లు కూడా ఇలాంటి ఫలితాలతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. మరోవైపు రెండేళ్ల పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు తీసుకోనుండటంతో ద్రవిడ్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గతంలో పది నెలల పాటు జాతీయ జట్లకు కోచ్‌గా చేసి రెండు నెలల పాటు ఐపీఎల్లో భాగస్వామిగా ఉండేందుకు బోర్డు అనుమతిచ్చింది. అలాగే నిబంధనల ప్రకారమే కోచ్ కోసం ఇతర అభ్యర్థులను పిలవకుండా ద్రవిడ్‌కు పొడిగింపునిచ్చినట్టు బోర్డు పేర్కొంది. -
నీళ్లొస్తాయ్
కొవ్వూరు/నిడదవోలు/భీమవరం : జిల్లాలోని కాలువలకు నీటి విడుదలను మరో రెండు రోజులు పొడిగించారు. వాస్తవంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి కాలువలను మూసివేయాలని నిర్ణయించారు. అయితే, వరి కోతలు పూర్తికాకపోవడం, శివారు ప్రాంతాల్లోని తాగునీటి చెరువులు నిండకపోవడంతో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నది నుంచి మరో రెండు రోజులపాటు నీరివ్వాలని నిర్ణయించారు. బ్యాంక్ కెనాల్ పరిధిలోని వడ్డిలంక కాలువ ద్వారా మంచినీటి చెరువుల్ని నింపాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే 80 శాతంపైగా చెరువులను నీటితో నింపామని, రానున్న రెండు రోజుల్లో అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. పశ్చిమ డెల్టాకు ప్రస్తుతం 4,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటి విడుదలను నిలిపివేస్తారు. తిరిగి జూన్ 1వ తేదీన విజ్జేశ్వరంలోని గోదావరి హెడ్ స్లూయిస్ తలుపులు తెరుస్తారు. రొయ్యల చెరువులకు తరలించడంతో సమస్య ఎన్నడూ లేనివిధంగా ఈసారి రొయ్యలు, చేపల చెరువులకు నీటిని పెద్దఎత్తున తోడుకోవడంతో జిల్లాలోని మంచినీటి చెరువులకు కొరత ఏర్పడింది. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు బడా వ్యక్తులు ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్ల సాయంతో కాలువల్లోని నీటిని ఆక్వా చెరువుల్లో తోడుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, సెంట్రల్ డెల్టాలకు ఈనెల 10వ తేదీన కాలువల్ని మూసివేశారు. అదే రోజున పశ్చిమ డెల్టాకూ నీటి విడుదలను నిలిపివేయాల్సి ఉండగా.. చేలు, చెరువులకు వెళ్లాల్సిన నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించారు. దీంతో మంచినీటి చెరువులు నిండలేదు. ఈ నేపథ్యంలో కాలువల మూసివేతను మరో వారం రోజులపాటు పొడిగించి.. సోమవారం సాయంత్రం 6 గంట లకు నీటి విడుదలను నిలిపివేయాలని భావించారు. అయినప్పటికీ మంచినీటి చెరువులు నిండకపోవడం, శివారు ప్రాంతాల్లో వరి చేలు కోత దశకు చేరుకోకపోవడంతో మరో రెండు రోజులపాటు నీటి విడుదలను పొడిగించక తప్పలేదు. అయినా.. మంచినీటి చెరువులు పూర్తిగా నిండుతాయో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. -
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్‌గా టక్కర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అనుమతించాల్సిందిగా గతంలో కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తొలుత మూడు నెలల పాటు సీఎస్‌గా టక్కర్ కొనసాగించేందుకు అనుమతించింది. ఆ అనుమతి ఈ నెలాఖరుతో(నవంబర్ 30) ముగిసింది. అయితే టక్కర్‌ను మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి గత నెలలో మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం టక్కర్ పదవీ కాలాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం అమోదం తెలిపింది. -
సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. వాస్తవంగా టక్కర్ ఆగస్టు నెలాఖరునే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్‌గా టక్కర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తొలుత మూడు నెలల పాటు సీఎస్‌గా టక్కర్ కొనసాగించేందుకు అనుమతించింది. ఆ అనుమతి ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టక్కర్‌కు మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి గత నెలలో మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం టక్కర్ పదవీ కాలాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం అమోదం తెలిపింది. -
కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లోనే రిటైర్ అయిన కుమార్‌కు సంబంధించి ఇది రెండో పొడగింపు. ప్రస్తుతం ఎన్ఐఏ పర్యవేక్షిస్తోన్న ఉడీ ఉగ్రదాడి, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి, బుర్ద్వాన్, సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో పేలుడు తదితర కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో డీజీ మార్పు సరికాదన్న అభిప్రాయం మేరకు ఆయన పదవికాలాన్ని పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. అయితే కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాత్రం ఎన్ఐఏ చీఫ్ కొనసాగింపును తప్పుపట్టారు. శరద్ కుమార్ హిందూ సంస్థ ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మక్కా మసీదు పేలుడు, మాలేగావ్, మోదాసా పేలుళ్ల కేసుల దర్యాప్తు నీరసంగా సాగుతుండటాన్ని ఉదహరిస్తూ.. ముస్లిం నిందితుల విషయంలో ఒకరకంగా, హిందూ ఉగ్రవాదుల విషయంలో మరో రకంగా ఎన్ఐఏ వ్యవహరిస్తోందని విమర్శించారు. 1979 ఐపీఎస్ బ్యాచ్ హరియాణా క్యాడర్ కు చెందిన శరద్ కుమార్ 2013, జులై 30న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2015 అక్టోబర్ లో ఉద్యోగ విరమణ చేయాల్సిఉండగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు సర్వీసును పొడిగించింది. తాజా పొడగింపుతో 2017 అక్టోబర్ వరకు శరద్ కుమారే ఎన్ఐఏ చీఫ్ వ్యవహరించనున్నారు.