
న్యూఢిల్లీ: చైనా నుంచి చాక్లెట్లు సహా పాలు, పాల ఉత్పత్తులపై నిషేధాన్ని మరో నాలుగు నెలల పాటు కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 దాకా ఇది వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. చైనా పాల ఉత్పత్తుల్లో హానికారకమైన మెలామిన్ (ప్లాస్టిక్స్.. ఎరువుల్లో ఉపయోగించే విషపూరిత రసాయనం) దాఖలాలు ఉన్నాయన్న ఆందోళనతో తొలిసారిగా 2008లో నిషేధం విధించారు.
వాస్తవానికి చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకుంది. దీన్ని కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వస్తోంది. గతంలో విధించిన నిషేధం కాలవ్యవధి ఆదివారం నాటికి తీరిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment