టొరంటో: చైనాకు చెందిన టిక్‌టాక్‌పై కెనడా నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన మొబైల్ పరికరాలు వేటిలోనూ దాన్ని వాడకూడదని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులెవరూ దీన్ని వాడొద్దని ఆదేశించింది.
ప్రైవసీకి, భద్రతకు ఈ యాప్ వల్ల చాలా రిస్కుందని కెనడా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ధారించినట్టు ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ మోనా ఫోర్టియర్ తెలిపారు. ఇది ప్రారంభమేనని, మున్ముందు మరిన్ని చర్యలుంటాయని ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. డెన్మార్క్‌లో ప్రభుత్వ మొబైళ్లు తదితరాల్లో టిక్‌టాక్‌ను నిషేధించాలని పార్లమెంటు పేర్కొంది. అమెరికా నెల రోజుల్లోపు ప్రభుత్వ మొబైళ్లు తదితర పరికరాల్లో నుంచి టిక్‌టాక్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment