Justin Trudeau
-
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) ఖరారు అయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో తమ కొత్త సారథిగా అధికార లిబరల్ పార్టీ కార్నీని ఎన్నుకుంది. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేయని ఆయన.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త నేత ఎన్నిక దాకా జస్టిన్ ఆ పదవిలో కొనసాగారు. ఇక కొత్త ప్రధానిగా బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు . తాజాగా జరిగిన ఓటింగ్‌లో లిబరల్ పార్టీ సభ్యులు మొత్తం 1,50,000 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు పొలవ్వగా.. క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరినా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి. అంటే కార్నేకు వచ్చిన ఓట్లు 86 శాతమన్నమాట.ఆర్థిక మేధావిగా పేరున్న మార్క్ కార్నీ సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండడం గమనార్హం.ఎవరీ కార్నీ.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే👉మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. 👉2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సరిగ్గా అదే సమయంలో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ టైంలో ఆయన అనూహ్యంగా.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. 👉మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా 2013లో కార్నీ ఎన్నికయ్యారు. తద్వారా ఆ సెంట్రల్ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్‌గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడిన ఆయన.. ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. తాజా లిబరల్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల రేసులో నిలిచిన నలుగురిలో అత్యధికారంగా విరాళాలు సేకరించిన అభ్యర్థి కూడా ఈయనే కావడం గమనార్హం. -
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ట్రూడో కంటతడి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..). అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. "We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN— News18 (@CNNnews18) March 7, 2025 VIDEO CREDITS: News18 -
Mr Trump: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గినట్లే తగ్గి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.కెనడా, మెక్సికోతోపాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తన నిర్ణయంపై మార్కెట్ కుదేలు ప్రభావమేమీ లేదని ఆయన అంటున్నారు. కేవలం అమెరికా కార్ల తయారీదారుల కోసమేనని చెప్పారాయన. అయితే ఒకవైపు కెనడా వాణిజ్య ప్రతినిధులతో చర్చలు.. మరోవైపు మెక్సికో ప్రెసిడెంట్‌తో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం(USMCA) అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటోమేకర్స్‌కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62 శాతం ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కొనాల్సిందేనని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు మాత్రం 10 శాతమే వర్తిస్తుందని తెలిపారు.కెనడా కూడా అమెరికాపై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు 125 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా ేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. అన్ని టారిఫ్‌లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలుకొనసాగిస్తామని తెలిపింది.రాజకీయ దుమారంఅధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అయితే ఇది క్రమంగా రాజకీయ మలుపు తిరిగింది. ట్రంప్‌తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ.. కెనడా-అమెరికాలు భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ.. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. 51వ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. దీంతో కెనడా మండిపడింది. కెనడా ఏనాటికీ అమెరికాలో కలవబోదని కౌంటర్ ఇచ్చింది. కెనడాను అమెరికాలో విలీనం చేసి.. 51వ అమెరికా రాష్ట్రంగా మార్చకుంటామని.. అవసరమైతే ఆర్థిక-సైనిక శక్తులను ఉపయోగిస్తామని ట్రంప్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. -
జెలెన్స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్, జెలెన్స్కీ భేటీ అనంతరం యూరోపియన్ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. జెలెన్స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేసింది. ట్రంప్, జెలెన్స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ ప్రజల కోసం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్స్కీని టార్గెట్ చేస్తూ ట్రంప్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. -
ట్రంప్‌కు పీఎం ట్రూడో కౌంటర్
ఒట్టావా:కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న కామెంట్లకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అమెరికాను ఓడించిన తర్వాత కెనడా ప్రధాని ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. మా దేశాన్ని,మా ఆటను మీరు తీసుకోలేరు’అని ట్రంప్‌కు చురకంటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెనడాపై అమెరికా టీమ్ విజయం సాధించాలని,కెనడా త్వరలో అమెరికా 51వ రాష్ట్రంగా అవతరించాలని ట్రంప్ ఒక పోస్టులో ఆకాంక్షించారు. దీనికి బదులుగా హాకీ మ్యాచ్‌లో కెనడా అమెరికాపై విజయం సాధించిన తర్వాత కెనడా ప్రధాని ట్రంప్‌కు కౌంటర్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.You can’t take our country — and you can’t take our game.— Justin Trudeau (@JustinTrudeau) February 21, 2025అమెరికా,కెనడా మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లలో గత 50 ఏళ్లలో ఎక్కువ మ్యాచ్‌లు కెనడానే గెలుపొందడం గమనార్హం.కాగా4, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత పొరుగు దేశమైన కెనడాపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. -
అమెరికా Vs కెనడా.. ట్రంప్‌కు ప్రధాని ట్రూడో కౌంటర్!
అట్టావా: టారిఫ్‌ల విషయంలో కెనడా, అమెరికా మధ్య రాజకీయం వేడెక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. బలవంతంగా టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కామెంట్స్ చేశారు.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే అది వారి ఇష్టం. అమెరికాపై ప్రతిస్పందనకు మేము సిద్ధంగా ఉన్నాం. మాపై ఉద్దేశపూర్వకంగా టారిఫ్‌లు విధిస్తున్నారు. దీన్ని వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతిస్తాయి. రెండు దేశాల సమిష్టి భద్రతను దెబ్బతిస్తాయి. కెనడాతో వాణిజ్యం అమెరికా దీర్ఘకాలిక శ్రేయస్సు, భద్రతకు ఎంతో ముఖ్యమైనంది. కెనడా ఉక్కు మరియు అల్యూమినియం, కీలకమైన ఖనిజాలు అమెరికాకు ఎంతో అవసరం. వీటిపై మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు నేటి నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు.కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు.Prime Minister Justin Trudeau on Donald Trump's looming 25% tariffs on Canada tomorrow:"If the president does choose to implement any tariffs against Canada, we're ready with a response. A purposeful, forceful but reasonable, immediate response." pic.twitter.com/fUmmqj6sSr— Art Candee 🍿🥤 (@ArtCandee) January 31, 2025 -
California wildfires: కార్చిచ్చుతో రాజకీయం
అమెరికాలో కార్చిచ్చు.. రాజకీయ మలుపు తీసుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్(డెమోక్రటిక్) కారణంగానే మంటలు విస్తరించాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్. అయితే దీనికి గావిన్ కౌంటర్‌గా ఒక లేఖ విడుదల చేశారు.కాలిఫోర్నియా(California)లో మంటలు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలంటూ డొనాల్డ్ ట్రంప్‌ను కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆహ్వానించారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితుల్ని పరామర్శించాలని కోరారు. అంతేకాదు.. ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దంటూ ట్రంప్‌కు చురకలంటించారు. గతంలో ఆరేళ్ల కిందట ట్రంప్(Trump) అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఈ తరహా ఘటన చోటు చేసుకుందని, ఆ టైంలో బాధితుల్ని ఆయన పరామర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు కాలిఫోర్నియా కష్టంలో ఉంటే.. రాజకీయం చేయడం సరికాదన్నారు. కాలిఫోర్నియా కార్చిచ్చు తర్వాత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సత్వరమే స్పందించారని గవర్నర్ గావిన్ తెలిపారు.ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్ నుంచి వెళ్లిపోయే ముందు బైడెన్ తనకు మిగిల్చింది ఇదేనంటూ కాలిఫోర్నియా కార్చిచ్చును ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. మంటల్ని ఆర్పడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు డెమోక్రట్లకు, రిపబ్లికన్లకు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మరోవైపు.. కెనడా(Canada)ను అమెరికా 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో తెలిసిందే. ఈ దరిమిలా.. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫోన్లో మాట్లాడారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘అమెరికా, కెనడా కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు.. అంతకు మించి. కష్టకాలంలో మేం స్నేహితులమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు. I spoke with @GavinNewsom last night. We both know that Canada and the United States are more than just neighbours. We’re friends — especially when times get tough.California’s always had our back when we battle wildfires up north. Now, Canada’s got yours.— Justin Trudeau (@JustinTrudeau) January 10, 2025 -
కెనడా ప్రధాని రేసులో మరో భారత సంతతి నేత
ఒట్టావా: భారత సంతతికి చెందిన మరో నేత కెనడా ప్రధాని రేసులో నిలిచారు. నేపియాన్ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య గురువారం ఈ మేరకు ప్రకటించారు. దేశ పునర్నిర్మాణం కోసం సమర్థమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమని వీడియో ప్రకటనలో ఉద్ఘాటించారు. ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు. ఈ ప్రయాణంలో అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో వైదొలిగిన నేపథ్యంలో ఆయన వారసుడెవరన్నది ఆసక్తికరంగా మారడం తెలిసిందే. భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్‌తో పాటు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ తదితర లిబరల్ పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. I am running to be the next Prime Minister of Canada to lead a small, more efficient government to rebuild our nation and secure prosperity for future generations.We are facing significant structural problems that haven’t been seen for generations and solving them will require… pic.twitter.com/GJjJ1Y2oI5— Chandra Arya (@AryaCanada) January 9, 2025కర్ణాటక టు కెనడాకర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ ర్గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు.మార్చి 9న కొత్త ప్రధానికెనడా కొత్త ప్రధానిని, తమ నాయ కుడిని మార్చి 9న ప్రకటిస్తామని అధికా ర లిబరల్ పార్టీ గురువారం వెల్లడించింది. ఇందుకోసం దేశవ్యాప్త ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది.👉ఇదీ చదవండి : ‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’ -
జీ20 సదస్సులో ఫొటో.. బైడెన్, ట్రూడో మిస్సింగ్!
ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం గమనార్హం. తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్.. కెనడా ప్రధాని జస్టిన్ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్ అయిన బైడెన్, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
కెనడా ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఓటమి ఖాయం
వాషింగ్టన్ డీసీ : కెనడా అధ్యక్ష ఎన్నికలపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారని వ్యాఖ్యానించారు.వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో కెనడా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ ఎక్స్ యూజర్.. జస్టిన్ ట్రూడో ఓడించేందుకు సహయం చేస్తారా అని ఎలాన్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై మస్క్ స్పందిస్తూ.. రాబోయే ఎన్నికలలో ట్రూడో ఓడిపోతారని ట్వీట్లో పేర్కొన్నారు.కెనడా ప్రధాని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరుఫున పియరీ పొయిలీవ్రే, న్యూ డెమోక్రటిక్ పార్టీ నుంచి జగ్మీత్ సింగ్‌నుంచి ట్రూడో కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ఫలితంగా ట్రూడో అధికారాన్ని కోల్పోనున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ విశ్లేషణలపై ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలాన్ మస్క్ స్పందించారు. కాగా, మస్క్ గతంలో ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫ్రీ స్పీచ్‌పై కెనడా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాన్ని ఖండించారు.ప్రత్యేకించి ప్రభుత్వ పర్యవేక్షణ కోసం ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవలు నమోదు చేసుకోవాల్సిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకించారు. Does this mean @elonmusk is going to help get rid of @JustinTrudeau in the next election?Huge news if so!Make Canada Great Again 🇺🇸🇨🇦 pic.twitter.com/D3VxISlLNF— Bret 🍁 (@Bret_Sears) November 7, 2024 -
కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం.. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై దాడి చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. కెనడా అక్రమంగా భారతీయ దౌత్యవేత్తలను నిఘాలో ఉంచింది. కెనడా భారత్‌పై ఆరోపణలు చేసే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. కెనడా భారత్ దౌత్యవేత్తలు నిఘా ఉంచింది. ఇది ఆమోదయోగ్యం కాని విషయం. కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భావిస్తున్నా. కెనడాలో జరిగిన దాడి ఘటన భారత్‌కు ఆందోళన కలిగించింది’’ అని అన్నారు.#Breaking: EAM Dr S Jaishankar reacts to Canada developments "Canada has developed a pattern of making allegations without providing specifics" Unacceptable Indian diplomats put under surveillance "Political space given to extremists force" in #Canada pic.twitter.com/lj9bIjTv91— Rohit Chaudhary (@rohitch131298) November 5, 2024 -
ట్రూడోకు సొంత పార్టీలోనే వ్యతిరేకత
-
కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు
దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వెళ్తున్నవారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. అంతేకాదు, భారత్ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అటువంటి దేశంతో భారత్ సంబంధాలు ఎందుకు క్షీణిస్తున్నట్లు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ సిక్కు పౌరులను భారత్ హత్య చేయిస్తుందని ఆరోపించడం, దాదాపు అటువంటి ఆరోపణనే అమెరికా కూడా చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండవది... భారతదేశంపై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడదాకా వెళ్ళి ఆగుతుంది?గత దశాబ్దంలో ప్రపంచ వలస ప్రస్థానాలకు చెందిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే... భారతీయ వలసలు గణనీయంగా పెరగడం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సింగపూర్ నుంచి దుబాయ్ వరకు, పోర్చుగల్ నుంచి ఇజ్రాయెల్ వరకు భారతీయుల వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. 2014లో కెనడాలో కేవలం 38,364 మంది భారతీయులు శాశ్వత పౌరులుగా మారారు. 2022 నాటికి ఈ సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 1,18,095కి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, 2022లో కేవలం 30 వేల మంది చైనీయులు మాత్రమే కెనడాకు తరలి వెళ్లారు. దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వచ్చిన వారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. పైగా, భారతదేశ అణు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అలాంటప్పుడు, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి?భారతదేశం, ఆంగ్లోస్పియర్ (ఇంగ్లిష్ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే) దేశాల మధ్య సమస్య ఉందని స్పష్టమవుతోంది. విదే శాంగ విధానం, జాతీయ భద్రతతో స్వప్రయోజనాలు నెరవేర్చేందుకు దేశీయ రాజకీయ వ్యూహాలను ట్రూడో మిళితం చేశారని భారత అధి కారులు అభియోగాలు మోపారు. ట్రూడోకి కెనడియన్ సిక్కుల ఓటు అవసరం కాబట్టి వారి ఖలిస్తానీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారు; ఆయన ప్రభుత్వం డ్రగ్ పంపిణీదారులు, భారత వ్యతిరేక ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇస్తోందనీ వీరు ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడా పౌరులను హత్య చేయడానికి భారత ఇంటెలిజెన్స్ అధికారులు, దౌత్య వేత్తలు కుట్ర పన్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.మరోవైపు అమెరికా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, కెనడియన్ సిక్కు హత్యను, అమెరికన్ సిక్కుపై ఇదే విధమైన ప్రయత్నానికి ముడి పెట్టింది. దీంతో దౌత్యపరమైన గందరగోళం ప్రారంభమైంది. త్వర లోనే ఇది పెద్ద గొడవగా మారి పరాకాష్ఠకు చేరింది. కెనడా, అమెరికా, బ్రిటన్లలో ఖలిస్తానీ అనుకూల క్రియాశీలత గురించి భారత్ ఫిర్యాదు... దేశీయ భద్రతా సమస్యలపై ఆధారపడింది. పాశ్చాత్య ప్రభుత్వాలు భారతదేశ ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదన్న మోదీ ప్రభుత్వ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, దౌత్యవేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సహా భారతీ యులకు వ్యతిరేకంగా కెనడా, అమెరికా చేసిన నేరారోపణలు తీవ్రమై నవి. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండోది... భారత్‌పై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? రెండవ ప్రశ్న విషయానికి వస్తే, అమె రికా, కెనడా రెండూ పేర్లను కూడా పేర్కొన్నాయి. పైగా భారతీయు లపైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఉంచాయి.మొదటి ప్రశ్న ముఖ్యమైనది. ఎందుకంటే కెనడా, అమెరికాలు భారతదేశంతో సహేతుకంగానే మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. పైగా చాలావరకు విచక్షణతో ఇవి విషయాలను నిర్వహించ గలవని ఆశించవచ్చు. మొదటి ప్రశ్నకు సంబంధించి కెనడియన్ సిక్కు ఓటర్లతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ట్రూడో పక్షపాత రాజకీయాలు ఆడుతున్నారనేది భారత ప్రభుత్వ అధికారిక అభియోగం. ‘సరిహద్దు’ ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఆరో పణలతో భారత రాజకీయ నాయకులు రాజకీయ పెట్టుబడి పెట్టారని పాకిస్తాన్ ఆరోపిస్తున్న రీతిని ఇది బాగా ధ్వనిస్తోంది. దేశీయ రాజకీ యాలతో జాతీయ భద్రతా సమస్యలను కలపడం రెండు మార్గాలనూ తొలగించివేస్తుంది. పైగా అటువంటి ఆరోపణలను మూడవ పక్షం వారు ఎలా చూస్తున్నారనే అంశంపై జాగ్రత్తగా ఉండాలి. బహుశా, ట్రూడో ప్రభుత్వాన్ని భారతదేశం విస్మరించే స్థాయిలో ఉందనే అభిప్రాయాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆరోపణలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఇదే ప్రధానమైన అభిప్రాయంగా ఉండేది. తర్వాత, అమెరికా గడ్డపై కూడా, గురుపథ్వ సింగ్ పన్నూన్‌ను చంపడానికి భారత అధికారులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. ఇదంతా కేవలం స్నేహితుల మధ్య ఉన్న అపార్థం, అపమ్మకాల వ్యవహారమా? లేక దీంట్లో పెద్ద సమస్యలు ఇమిడి ఉన్నాయా? ఇంగ్లిష్ భాషాధిక్య దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా తమ ’ఫైవ్ ఐస్’ కూటమి ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే, ట్రూడో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఏమంత విశ్వసనీయమైన ప్రతిస్పందనగా అనిపించదు. మరీ ముఖ్యంగా, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భారత ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తోందనే ప్రశ్నను అడిగి తీరాలి.ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ గత వారం తన విజయదశమి ప్రసంగంలో, పాశ్చాత్య ‘ఉదారవాద, ప్రజాస్వా మ్యాలు’ బంగ్లాదేశ్‌లో చేసినట్లుగా భారతదేశంలో ‘అరబ్ స్ప్రింగ్’ తరహా ‘వర్ణ విప్లవాలను’ ప్రదర్శించాలని యోచిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలను వీక్షిస్తున్న ఈ విధానం భారతీయ విదేశీ, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో చేసిన అనేక ప్రసంగాలలో ‘భారతదేశం బాగుండాలని ప్రపంచం కోరుకుంటోంది, కానీ మన సవాళ్లు స్వదేశంలో ఉన్నాయి’ అని తరచుగా చెప్పే వారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలు కలిసి జిహాదీ తీవ్రవాదం, నిరంకుశ చైనా పెరుగుదలపై భారతదేశంలాగే ఆందోళన చెందుతున్నాయనీ, అందువల్లే పాశ్చాత్య ఉదారవాద, ప్రజాస్వామ్య పాలనపై గురిపెట్టిన ఈ రెండు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎదుగుదలకు అవి మద్దతునిచ్చాయన్న దృక్పథంపై ఈ అంచనా ఆధారపడి ఉంది.ఈ దృక్కోణం మారిందా? భారతదేశం ఇకపై ఆంగ్లోస్పియర్ను ‘మిత్రుడు’గా లేదా కనీసం దాని పురోగతిలో భాగస్వామిగా చూడ లేదా? చైనా, పాకిస్తాన్‌లు రెండింటినీ తన జాతీయ భద్రతకు ప్రమా దకారులుగా ప్రకటించిన భారత్ అదే సమయంలో పశ్చిమ ఉదార వాద ప్రజాస్వామ్యాలను దూరం చేసుకోగలదా? విదేశాంగ విధాన నిర్వాహకులు, జాతీయ భద్రతను నిర్వహించే వారి ఆలోచనల మధ్య తప్పు అమరిక ఏదైనా ఉందా? కెనడా ప్రధాని ట్రూడో ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తారు.కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలో పెరుగుతున్న అమెరికా ప్రమేయం పెనుమంటగా మారడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ పర్యవసానాలను కలిగిస్తుంది. మొత్తంమీద ప్రపంచ పర్యావరణం నేడు భారత ఆర్థికవృద్ధికి, పెరుగుదలకి చాలా తక్కువ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం, సంఘ్ పరివార్లు పశ్చిమ దేశాలపై, వాటి సంస్థలపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించడం చూస్తే... పశ్చిమ దేశాలతో భారత్ సంబంధాలు పరీక్షకు గురవుతున్నట్లు, విశ్వాస సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ట్రూడో వ్యవహారం కేవలం ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం కావచ్చు!సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
కెనడాతో కటీఫ్ .. భారత్ కీలక నిర్ణయం
-
ప్రధాని మోదీతో చర్చలు జరిపా: కెనడా ప్రధాని
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. శుక్రవారం లావోస్‌లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయినట్లు స్వయంగా వెల్లడించారు.‘‘మా భేటీలో చర్చించిన అంశాల గురించి పూర్తి వివరాలను వెల్లడించలేను. కానీ కెనడియన్ల భద్రత, చట్టబద్ధపాలనను సమర్థిస్తూ కొనసాగించటం తమ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని చాలాసార్లు చెప్పా. అందుకే వాటిపైనే నేను దృష్టి సారించా. కెనడా.. భారత్‌తో తన వాణిజ్య సంబంధాలు, ప్రజలతో సంబంధాలను అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే ఇరు దేశాల మధ్య పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైనే మేము దృష్టి పెడతాం. తదుపరి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అని అన్నారు. ఇక.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023, జూన్ కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. అయితే.. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆయన ఆరోపణలు చాలా అసంబద్ధమని, కొట్టిపారేసింది. అయితే అప్పటి నుంచీ ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. -
ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం.. కెనడా వెళ్లే విద్యార్థులకు ఝలక్
ఒట్టావా: కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు షాకిస్తూ 2025లో స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు సిద్ధమైంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల రాకపోకలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలో వలసల నియంత్రణకు జస్టిన్ ట్రూడో సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్స్, వర్కర్ల పని అనుమతుల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేలా ప్లాన్ చేసింది. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024లో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం తగ్గితే కేవలం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయని స్పష్టం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు. అంతకుముందు.. 2023లో ఈ సంఖ్య 5,09,390గా ఉండగా.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 1,75,920 స్టడీ పర్మిట్లను జారీ చేశారు. 📢 New Temporary Residence Cuts in Canada! 🇨🇦The Government of Canada has announced key changes to strengthen temporary residence programs and maintain sustainable immigration levels. Here's what you need to know:Reduction in Study Permits: 10% reduction in study permits for…— Seyi Obasi - Work, Live & Study In Canada🇳🇬🇨🇦 (@SeyiSpeaks) September 18, 2024 మరోవైపు..కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగానే ఇలా షరతులు విధించినట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి -
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ
ఒట్టావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. టొరంటో-సెయింట్.పాల్ స్థానానికి మంగళవారం జగిరిన ఉప ఎన్నికలో ట్రూడో నేృత్వంలోని లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. ఈ స్థానం లిబరల్ పార్టీ కంచుకోట స్థానం. లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి.. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవర్ట్ చేతిలో ఓడిపోయారు. డాన్ స్టీవర్ట్‌కు 42 శాతం ఓట్లు రాగా, లెస్లీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. టొరంటో-సెయింట్.పాల్ స్థానంలో లిబరల్ పార్టీ గత 30 ఏళ్లుగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2011లో లిబరల్ పార్టీ తరఫున తక్కువ మంది ఎంపీలు గెలిచినప్పటికీ.. టొరంటో-సెయింట్.పాల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ స్థానాన్ని కోల్పోయిన లిబరల్‌పార్టీకి మొత్తం 338 స్థానాలకు గాను 155 ఎంపీలు ఉన్నారు. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ ఓటమి ట్రూడోకు పెద్ద ఎదరుదెబ్బ అని రాజకీయల విశ్లేషకులు పేర్కొంటున్నారు. టొరంటో-సెయింట్.పాల్ స్థానంలో ఓటమిపై ప్రధాని ట్రూడో స్పందించారు. ‘ఇవి చాలా కష్టమైన పరిస్థితులు. అందుకే, నేను నా టీం కెనడా ప్రజల అభివృద్ధి కోసం మరింత శ్రమిస్తాం’అని అన్నారు. -
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
అట్టావా: భారత్, కెనడా దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత వ్యక్తుల అరెస్ట్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిచారు. ఈ సందర్భంగా ట్రూడో.. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ..‘కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోంది. దేశపౌరుల రక్షణ, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతో కూడిన న్యాయవ్యవస్థ ఉంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు ముగ్గురి అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.శంకర్ మాట్లాడుతూ..‘ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘భారత్ జోక్యం లేదు’.. కెనడాకు విచారణ కమిషన్ షాక్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపణలు చేయటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో ప్రధాని జస్టిన్ ట్రూడ్ సీనియర్ అధికారులతో కూడిన విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ విచారణ కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది. కెనడా ఎన్నికల్లో భారత్ అసలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ‘2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలు మా దృష్టికి రాలేదు’ అని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్‌కు వెల్లడించారు. అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్ ఎజెన్సీ కనుకున్నట్లు విచారణ కమిషన్ వెల్లడించింది. ఇక.. 2019, 2121 కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెర్వీసెస్(సీఎస్ఐఎస్) ఆరోపణలు చేసింది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ప్రతిపక్షాలు దర్యాప్తు చేయాలని ఒత్తిడి పెంచాయి. ఈ వ్యవహారంపై ప్రధాని జస్టిన్ ట్రూడో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు చైనాతో పాటు భారత్ పేరు కూడా ప్రధాని ట్రూడో చేర్చారు. కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసినట్ల మీడియా ద్వారా తెలిసింది. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదు’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ ఫిబ్రవరిలో స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం భారత్ విధానం కాదన్నారు. కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతోందని మండిపడ్డారు. -
Canada: కెనడాలో ‘ట్రూడో’కు షాక్.. సర్వేల్లో సంచలన ఫలితాలు
ఒట్టావా: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం. దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్ ప్రాఫిట్ అంగుస్ రెడ్ సంస్థ(ఏఆర్ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్ ఆఫ్ ద అబోవ్’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ సర్వేలో కన్జర్వేటివ్ నేత పియెర్రే పొలీవర్ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ 206 సీట్లు, లిబరల్స్ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్ -
చదువుకోవడం కష్టమేనా.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!
జీవన వ్యయం పెరిగిపోతున్న తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. తాజా కఠిన నిర్ణయంతో భవిష్యత్‌లో కెనడాలో చదుకోవాలనుకునే విద్యార్ధుల భవిష్యత్ మరింత ఆందోళన కరంగా మారింది. సాధారణంగా భారతీయ విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే..వారి బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.6.14 లక్షలు ఉండాలి. అలా ఉంటేనే కెనడాకు వచ్చిన తర్వాత ఉపాధి లేకపోయినా ఆర్ధిక ఇబ్బందులు ఉండవనే ఈ షరతు విధిస్తుంది. ఇలా కెనడాయే కాదు.. ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఆయా దేశాల్ని బట్టి డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత వీసా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కెనడా రూ.6.14లక్షల డిపాజిట్ నిబంధనను 2000 నుంచి కొనసాగిస్తూ వచ్చింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ థ్రెషోల్డ్‌లో మార్పులు ఈ నేపథ్యంలో కెనడా కాస్ట్ ఆఫ్ లివింగ్ థ్రెషోల్డ్‌ను మారుస్తున్నామని, తద్వారా పెరిగిపోతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇబ్బందుల నుంచి విద్యార్ధులకు ఉపశమనం కలుగుందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో.. ఫుడ్ బ్యాంక్‌ల వైపు అద్దె చెల్లించలేక ఆర్ధిక సంక్షోభం పాటు ఆహారం కోసం ఫుడ్ బ్యాంక్‌ల వైపు మొగ్గు చూపుతున్నానే వార్తల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు తగిన వసతి కల్పించని విద్యాసంస్థలపై ఇమిగ్రేషన్, రెఫ్యూజెస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్సీసీ) చర్యలు తీసుకోనుంది. విద్యా సంస్థలు ఎంతమందికి వసతి సౌకర్యం కల్పిస్తాయో.. ఆ మేరకే విద్యార్ధులకు అనుమతులు ఇస్తాయని తాము భావిస్తున్నట్లు మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. ఓ రకంగా మంచికే వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. -
Trudeau: మళ్లీ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. మళ్ల రాజుకునేలా కనిపిస్తోంది. తాజాగా భారత్‌ను ఉద్దేశించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్ నుంచి తాము మరింత సహకారం కోరుతున్నట్లు ట్రూడో పేర్కొన్నారు. భారత్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని.. కేసు దర్యాప్తుకు ఆదేశ సహాకారం అవసరమని చెప్పారు. కాగా సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూను అమెరికాలో హత్య చేసేందుకు జరిగిన కుట్రను భగ్నం చేసినట్లు అగ్రరాజ్యం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేసిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తా.. పన్నూను చంపడానికి కుట్ర పన్నినట్లు అమెరికా న్యాయ శాఖ బుధవారం తెలిపింది. ఈ క్రమంలో ట్రూడో మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఖలిస్తానీ వేర్పాటువాదుల హత్యకు కుట్ర విషయంలో యూఎస్ నుంచి వస్తున్న వార్తల గురించి తాము మొదటి నుంచి మాట్లాడుతున్నామని ట్రూడో ఈ సందర్భంగా అన్నారు. భారత్ దీనిని తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు లో భారత్ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. భారత్ తమ సహకారాన్ని పెంచాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్‌లో ఖలిస్తానీ వేర్పాటువాదీ హర్దీప్ సింగ్నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారితీశాయి. అయితే ట్రూడో వ్యాఖ్యలను బారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా ఆరోపణల్లో ఎలాంటి వాస్తం లేదని, నిరాధారమైనమైనవని కొట్టిపారేసింది. చదవండి: ‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’! -
జస్టిన్ ట్రూడో Vs నెతన్యాహు.. ఇజ్రాయెల్ దాడులపై కౌంటర్లు..
జెరూసలేం: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులో పిల్లలు, మహిళలు భారీగా సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచమంతా చూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన వైద్యులు, కుటుంబాలను కోల్పోయిన వారిని, ప్రాణాలతో బయటపడినవారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూస్తున్నాము. మహిళలు, పిల్లలను టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికైనా వారి విషయంలో మానవత్వం చూపించాలని కోరారు. ఇదే సమయంలో హమాస్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సామాన్య పాలస్తీనియన్లను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచిపెట్టారని కామెంట్స్ చేశారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నెతన్యాహు.. అక్టోబర్ ఏడో తేదీన హమాస్ దాడుల గురించి ప్రస్తావించారు. వారి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యవాపడ్డారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నది ఇజ్రాయెల్ కాదు. హోలోకాస్ట్ నుండి యూదులపై జరిగిన దాడుల్లో హమాస్ ఎంతో దారుణంగా వ్యవహరించింది. సామాన్య పౌరులను ఊచకోత కోసింది. ఇజ్రాయెల్.. గాజా పౌరుల కోసం సేఫ్ జోన్లు, మానవతా కారిడార్లను అందిస్తోంది. కానీ, హమాస్ వాటిని కూడా అడ్డుపెట్టుకుని నేరాలకే పాల్పడుతోంది. వారి వెనుక దాక్కోని కాల్పులకు తెగబడుతోందన్నారు. హమాస్ అనాగరిక చర్యలను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు. .@JustinTrudeau It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust. While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing… — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 15, 2023 -
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ను నిందించారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని ట్రూడో ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని అమెరికా, మిత్రదేశాలను కోరారు. రూల్ ఆఫ్ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఈ వివాదం ఇరుదేశాల మధ్య అగ్గి రాజేసింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వేదికలపై ట్రూడో ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్‌ను నిందించారు. దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
కెనడాకి బైబై చెబుతున్న భారతీయులు.. కారణం ఇదే?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదారణ గణనీయంగా పడిపోయింది. ట్రూడో రోజురోజుకు.. కెనడా ప్రజల మద్దతు కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు సమాచారం. దాదాపూ 60 శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటుండగా.. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతకు పాపులారిటీ పెరిగిపోయిందని కెనడాకు చెందిన స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ న్యూస్ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ప్రస్తుత ప్రతిపక్ష నేత పియరీ పోయిలివ్రే దాదాపు 40 శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతుండగా..ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 30 శాతం ఓట్లకే పరిమితం కానుంది. ట్రూడో ఆద్వర్యంలో కెనడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు అక్కడి గృహ, ఆరోగ్య సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కార్ విఫలమైందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మూడు రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్లు పోల్స్‌లో పాల్గొన్న వారు చెబుతున్నారు. మరో సర్వేలో ఈ నేపథ్యంలో ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో 2017 నుంచి 2019 మధ్యకాలంలో కెనడాను వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైంది. వస్తున్నారు.. వెళ్తున్నారు గత అక్టోబర్ 31న విడుదలైన ఈ సర్వేలో 2017 నుంచి కెనడాకి గుడ్ బై చెబుతున్నారో.. అదే స్థాయిలో కెనడాకి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వే హైలెట్ చేసింది. అధ్యయనం ప్రకారం, 1982లో లేదా తర్వాత కెనడాలో శాశ్వత నివాసం పొందిన వారిలో 0.9 శాతం మంది ప్రతి సంవత్సరం కెనడాను విడిచిపెట్టారు. అయితే 2019లో ఈ శాతం 1.18 శాతానికి పెరిగింది. ఇది వలసదారుల సగటు రేటుతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపుతుంది. కారణం ఇదే 2019లో దాదాపు 67,000 మంది వలసదారులు కెనడాను విడిచిపెట్టగా, 2017లో 60,000 మంది వలసవెళ్లారు. కెనడాను విడిచిపెట్టిన వలసదారుల పెరుగుదలలో ఈ ధోరణి 1990ల నుండి పెరుగుతోందని అధ్యయనం తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వేలో కెనడాకు కొత్తగా వచ్చే వారి అంచనాలను అందుకోవడంలో కెనడియన్ ప్రభుత్వం విఫలమైన ఫలితంగా, కెనడా నుంచి వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నాయి. కొత్త వలసదారులు క్షీణిస్తున్న గృహ ప్రణాళికలు, ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉపాధి తక్కువగా ఉండటంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న వారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన పరిపాలనలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. -
తీరు మార్చుకోని ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు మారలేదు. మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జోర్డాన్ రాజుతో భారత్ సంబంధాలపై చర్చించారు. కెనడా-భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులపై జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్-హుస్సేన్‌తో ఫొన్లో మాట్లాడారు. దౌత్య సంబంధాలలో వియన్నా కన్వెన్షన్‌ను గౌరవించడంపై చర్చించినట్లు ట్రూడో ఓ ప్రకటనలో తెలిపారు. On the phone today, His Highness @MohamedBinZayed and I spoke about the current situation in Israel. We expressed our deep concern and discussed the need to protect civilian life. We also spoke about India and the importance of upholding – and respecting – the rule of law. — Justin Trudeau (@JustinTrudeau) October 8, 2023 ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇటీవలే యూఏఈ అధ్యక్షునితో కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడారు. భారత్‌తో సంబంధాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయనియమాలపై మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అటు.. కొన్ని రోజుల ముందే యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ జస్టిన్ ట్రూడో మాట్లాడారు. భారత్‌తో కెనడాకు ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. అటు.. నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరించాలని కెనడా కోరుతోంది. సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు సమన్వయంతో పనిచేయాలని అమెరికా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
ట్రూడో కవ్వింపు చర్యలు.. భారత్‌పై యూఏఈ అధ్యక్షునితో చర్చ
ఒట్టావా: భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌తో భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై మాట్లాడారు. అలాగే చట్టాలకు మద్దతునివ్వడం, గౌరవించడంపై ముచ్చటించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై కూడా ట్రూడో మాట్లాడారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షునితో మొబైల్లో మాట్లాడారు. 'ఈ రోజు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాను. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ.. సాధారణ పౌరుల జీవితాలను కాపాడాల్సిన అవసరంపై మాట్లాడాను. ఇండియాతో సంబంధాలపై కూడా చర్చించాం.. చట్టాలకు మద్దతునిస్తూ, గౌరవించడంపై చర్చించాం.' అని ట్రూడో ట్విట్ చేశారు. Trudeau discusses India-Canada row with UAE President Read @ANI Story | https://t.co/WbTR3qq9Pw#IndiaCanada #JustinTrudeau #UAE pic.twitter.com/NCI03teIep — ANI Digital (@ani_digital) October 8, 2023 ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్‌తో భారత్-కెనడా మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ట్రూడో చర్చించారు. దౌత్య సంబంధాలు, చట్టాల గురించి ఇరువురూ మాట్లాడుకున్నారు. అంతర్జాతీయ సంబంధాలను యూకే కట్టుబడి ఉంటుందని రిషి సునాక్ ఈ సందర్భంగ చెప్పారు. ఈ పరిణామాల అనంతరం మళ్లీ యూఏఈ అధ్యక్షునితో ట్రూడో భారత్ గురించి చర్చించడం గమనార్హం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు -
భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి
లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అదేవిధంగా, బ్రిటన్‌లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్‌తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్‌తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత్‌ను వీడిన కెనడా దౌత్యవేత్తలు
ఢిల్లీ: భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కెనడా స్పందించింది. తమ దౌత్య వేత్తలను భారత్ నుంచి ఖాలీ చేయించింది. సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు పరిణామాల అనంతరం దౌత్యవేత్తల సంఖ్యను సమానంగా ఉంచాలని భారత్ కోరిన నేపథ్యంలో కెనడా ఈ మేరకు చర్యలు తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య వేత్తలను దాదాపు 40 మంది వరకు బయటకు పంపించాలని భారత్ కెనడాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరుదేశాల్లో దౌత్య వేత్తలు సమాన సంఖ్యలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్టోబర్ 10 నాటికి చివరి గడువును విధించింది. అప్పటికీ ఖాలీ చేయకపోతే.. రక్షణను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ ఘాటుగా స్పందించింది. అయితే.. కెనడా దౌత్య వేత్తలు ఎంత మంది భారత్‌ను వీడారనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ వారిని మాత్రం సింగపూర్‌కు తరలించినట్లు కెనడాకు చెందిన ఓ మీడియా కథనం వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. భారత్ కెనడా వీసాలను రద్దు చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు -
కెనడా ప్రధానికి చేదు అనుభవం
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. తన మద్దతుదారులను కలవడానికి వచ్చిన ట్రూడోపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెనడాను నాశనం చేస్తున్నావంటూ ట్రూడోను ఉద్దేశించి ఆరోపించాడు. దేశంలో హౌజింగ్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని వాపోయాడు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిన్ ట్రూడో తన మద్దతుదారులను కలవడానికి వచ్చారు. ఓ చిన్నపిల్లాడికి షేక్యాండ్ ఇచ్చి మరో వ్యక్తి వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తి షేక్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ట్రూడోపై విమర్శలు కురిపించాడు. కెనడాలో హౌజింగ్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం మీరే అంటూ ట్రూడోను నిలదీశాడు. ట్రూడో కలగజేసుకుని.. ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదని సమాధానమిచ్చాడు. ఇంతలో ఓ వ్యక్తి ట్రూడోను మరో సమస్యను లేవనెత్తాడు. దేశంలో కార్బన్‌కు కూడా ట్యాక్స్ విధిస్తున్నారంటూ మండిపడ్డాడు. సమాధానమిచ్చిన ట్రూడో.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అంటూ బదులిచ్చారు. Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country". What do you think? pic.twitter.com/rvQux8VScn — Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023 దేశ సంపదను ఉక్రెయిన్‌కు పంపుతున్నారంటూ ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 10 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్‌కు ఎందుకు కేటాయించారో సమాధానమివ్వాలని ప్రశ్నించాడు. కెనడాను నాశనం చేయడానికే ట్రూడో ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రశ్నతో ఇది రష్యా పన్నిన కుట్రగా ట్రూడో అభిప్రాయపడ్డారు. మద్దతుదారులను పలకరించుకుంటూ ముందుకు వెళ్లారు. Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country". What do you think? pic.twitter.com/rvQux8VScn — Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023 2025లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కెనడాకు విదేశీయుల రాక పెరగడంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. హౌజింగ్, నిత్యావసర ధరలు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ కన్జర్వేటివ్ పార్టీ గెలడానికి అనేక అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country". What do you think? pic.twitter.com/rvQux8VScn — Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023 ఇదీ చదవండి: సిరియాలో భీకర డ్రోన్ దాడి.. 100 మందికిపైగా దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు -
పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని జస్టిన్ ట్రూడో చేష్టలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రదర్శించాల్సిన తీరుకాదని విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ కొలువుదీరిన నేపథ్యంలో జస్టిన్ ట్రూడో నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్.. ప్రధాని జస్టిన్ ట్రూడోను సభకు పరిచయం చేస్తూ..'గౌరవనీయులైన ప్రధాని' అని సంబోధించారు. ఇంతలోనే ట్రూడో మధ్యలో కలగజేసుకుని 'చాలా గౌరవనీయులైన ప్రధాని' అని సరిచేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గ్రెగ్ వైపు చూస్తూ నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. The rig is in. Canadian Prime Minister Justin Trudeau gives a wink and bites his tongue at new Speaker of the House of Commons, Greg Fergus. What is going on in Canada? Fergus, who is a liberal, was elected after the previous speaker was forced to resign for praising a Nazi on… pic.twitter.com/WjuaaVuLIu — illuminatibot (@iluminatibot) October 4, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని స్థానంలో ఉండి ట్రూడో వైకరి చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కన్నగీటడం, నాలుకతో సంజ్ఞలు సాధారణ పౌరులకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటిది పార్లమెంట్ సాక్షిగా ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనాయకులు విమర్శలు సందించారు. నాజీ సైన్యంలో పనిచేసిన ప్రముఖునికి పార్లమెంట్లో గౌరవసన్మానం చేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ ఆంటోని రోటా తన పదవికి రాజీనామా చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. యూదులను ఊచకోత కోసిన హిట్లర్ తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి సన్మానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో మాజీ స్పీకర్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదీ చదవండి: మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్ -
సిగ్గు చేటు.. ట్రూడోపై మస్క్ ఆగ్రహం
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో స్వేచ్ఛా హక్కును ట్రూడో ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారాయన. ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవల నియంత్రణ కోసం కెనడా ప్రభుత్వం ఈ మధ్యే కొత్త రూల్ తెచ్చింది. దాని ప్రకారం.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ తప్పనిసరిగా ప్రభుత్వ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలని రూల్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మస్క్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నిబంధనలపై ఓ జర్నలిస్ట్, మస్క్‌ను ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ ద్వారా ఘాటుగానే ఎలన్ మస్క్ స్పందించారు. సిగ్గు చేటు అని ట్రూడో సర్కార్‌పై మండిపడ్డారు. Trudeau is trying to crush free speech in Canada. Shameful. https://t.co/oHFFvyBGxu — Elon Musk (@elonmusk) October 1, 2023 ఇదిలా ఉంటే.. వాక్ స్వేచ్ఛను అణచివేస్తోందన్న ఆరోపణలు ట్రూడో ప్రభుత్వం ఎదుర్కోవడం కొత్తేం కాదు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ట్రక్కు డ్రైవర్ల నిరసనలను అణగదొక్కేందుకు అత్యవసర అధికారాన్ని ఉపయోగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఖలీస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి కూడా. -
భారత్ తప్పించుకోగలదా?
ఖలిస్థానీ సానుభూతిపరుడు, నిషేధిత ‘ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్’ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణ అత్యంత వివాదాస్పదం అయింది. ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ని కాల్చి చంపిన నేపథ్యంలో... భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చనేందుకు ‘విశ్వసనీయమైన ఆరోపణలు’ ఉన్నాయని ట్రూడో గత నెలలో తమ పార్లమెంటులో ప్రకటించారు. దరిమిలా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా దెబ్బతింటూ వచ్చాయి. ఈ పరిణామాలను అమెరికాపై దృష్టిని కేంద్రీకరించి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశ స్పందన మనకు అత్యంత కీలకం కాబట్టి! జస్టిన్ ట్రూడో (కెనడా ప్రధానమంత్రి) ఆరోపణలపై మన ప్రభుత్వ ప్రతిస్పందనను నేను విశ్వసిస్తున్నప్పటికీ, ఒక జర్నలిస్టుగా కొన్ని ప్రత్యేకమైన వాస్తవాలను కూడా మన మది పరిగణనలోకి తీసుకోవాలేమోనని నా ఆలోచన. అయితే ఆ వాస్తవాలు అవసరమైనంత మేర కైనా నివేదనకు వచ్చాయని నేను అనుకోవడం లేదు. కొన్నిసార్లు అవి ఉద్దేశపూర్వకమైన విస్మ రణకు కూడా గురయ్యాయి. అందువల్ల వాటిని మీ దృష్టికి తీసుకురావడం నా కర్తవ్యంగా భావిస్తూ, ముగింపును మాత్రం మీకే వదిలేస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయంతో మిమ్మల్ని ప్రభావితం చేయడం నాకు ఇష్టం లేదు. మొదటిది– ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ ఆరోపణలను లేవనెత్తి ‘‘ఆందోళన వ్యక్తం చేసినట్లు’’ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రాసింది. యూఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ‘‘అత్యున్నత స్థాయుల్లో ఈ అంశంపై చర్చ జరిగింది,’’ అని చెప్పినప్పుడే ఆయన ఈ ‘‘అందోళన వ్యక్తం అవడాన్ని’’ ధ్రువీకరించి ఉండొచ్చు. భారత్‌పై కెనడా చేసిన ఈ ఆరోపణలను బైడెన్ ఎలా చూస్తున్నారన్న విషయమై ఇది మనకు ఏం చెబుతోంది? గట్టి సాక్ష్యాలు ఉన్నాయా? రెండవది– కెనడాలోని అమెరికన్ రాయబారి ఒకటీ లేదా అంతకన్నా ఎక్కువ ‘పంచనేత్ర నిఘా కూటమి దేశాలు’ (ఫైవ్–ఐస్ కంట్రీస్: యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా) రహస్య సమాచారాన్ని అట్టావా (కెనడా రాజ ధాని)తో పంచుకున్నట్లు రూఢి పరిచారు. వాటిలో ఒక దేశం యూఎస్ఏ అని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది: ‘‘చూస్తుంటే కెనడా దగ్గర ‘పొగలు గక్కే తుపాకీ’ (వివాదానికి తావులేని సాక్ష్యం) ఉన్నట్టు కన బడుతోంది. ఆ దేశంలోని భారతీయ దౌత్యవేత్తల సమాచార వ్యవస్థలోకి చొరబడటం అన్నది పన్నాగంలో (వారికి) ప్రమేయం ఉందన్న సంకే తాలను ఇస్తోంది.’’ ఈ చొరబాట్లు ఏం చెబు తున్నాయి? అవి నిజంగానే పొగలు గక్కుతున్న తుపాకీతో సమానమైనవా? మూడవది – ఆరంభంలో జేక్ సల్లివాన్, ఆ మర్నాడు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్: ‘‘మేమే మా కెనడియన్ సహోద్యోగులతో చాలా దగ్గరగా సంప్రదింపులు జరుపుతున్నాం. కేవలం సంప్రదింపులు మాత్రమే కాదు, ఈ అంశంపై వారితో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అంటే ఏమిటి? కెనడా దగ్గర ఉన్న సమాచారం ఎలాంటిదో మాత్రమే కాదు,అందులోని నాణ్యత ఎంతటిదో కూడా వాషింగ్టన్కు అవగాహన ఉందని ఇది సూచిస్తోందా? నాల్గవది – ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్లింకెన్, ‘‘ఈ పరిశోధనలో కెనడాతో కలిసి ఇండియా పని చేయడం చాలా ముఖ్యం. దీనికి బాధ్యులెవరో చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు దానికై అదే జరిగి, ఫలితం వైపునకు దారి తీయాలి’’ అన్నారు. ఆయన అలా అన్నది ఒక పత్రికా సమావేశంలో అయినప్పటికీ అది న్యూఢిల్లీకి ఒక సందేశం అనుకోవాలా? ఐదవది – ‘‘ఇలాంటి చర్యలకు మీకు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులేమీ ఉండవు. దేశంతో నిమిత్తం లేకుండా మేము గట్టిగా నిలబడి, మా ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటాం’’ అని సల్లివాన్ అనడం చూస్తుంటే, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిది అబద్ధం? ఆరవది–కెనడా జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్... కెనడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ హెడ్‌తో కలిసి ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబరులో ఐదు లేదా ఆరు రోజులు ఢిల్లీలో ఉండి, భారత నిఘా సంస్థలకు సమాచారం అందించినట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్ల డించింది. అయితే భారత ప్రతినిధి మాత్రం... ‘‘కెనడా అప్పుడు గానీ, ఇప్పుడుగానీ, ఎప్పుడూ గానీ తమతో ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని పంచుకోలేదు’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి సమాచారం ఏదీ లేకుంటే జోడీ థామస్ భారత దేశంలో పది రోజుల పాటు ఎందుకు గడిపినట్లు? ఏడవది– మన భారత ప్రతినిధి అరిందమ్ బాగ్చి కెనడాను... ‘‘ఉగ్రవాదులకు, తీవ్రవాదు లకు, వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్వర్గ ధామం’’ అని పేర్కొన్నారు. ఆ మాటలు సాధార ణంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వాడుతుంటారు. అలాంటిది తమ నాటో మిత్రపక్షం, జీ–7 సభ్య దేశం, మరీ ముఖ్యంగా సన్నిహిత, సాంస్కృతిక పరిచయాలు కలిగిన తమ పొరుగు దేశం అయిన కెనడా గురించి ఇండియా అలా అనడాన్ని అమెరికా ఎలా చూస్తుంది? అమెరికా వైఖరి కీలకం ఎనిమిదవది– అట్లాంటిక్‌కు ఇరు వైపులా ఉన్న అనేక ఆంగ్ల భాషా వార్తాపత్రికలు భారతదేశం ఇలా ఎలా మారిందీ అని ప్రశ్నల్ని లేవదీశాయి. ఉదాహరణకు, ‘ది అబ్జర్వర్’ పత్రిక ‘‘స్వదేశంలో, విదేశాలలో మోదీ ప్రభుత్వ విధానం ప్రజా స్వామ్యం పట్ల ఆ దేశ నిబద్ధత, భాగస్వామ్య దేశంగా తన విశ్వసనీయతల పైన సందేహాలను లేవనెత్తుతోంది’’ అని రాసింది. ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ నికోలస్ క్రిస్టోఫ్ పాకిస్తాన్ పాలకుడు జనరల్ జియాతో మోదీని పోల్చారు. ‘ది ఎకనామిస్ట్’ నిర్మొహమాటంగా ‘‘ఇది కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం’’ అని పేర్కొంది. మన దేశం గురించి ఇలాంటి వ్యాఖ్య లన్నిటికీ మనం ఎలా స్పందించాలి? చివరిగా– ఒక అధికారిక ప్రకటనలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రూడో ఆరోపణలను ‘‘పూర్తిగా తిరస్కరించింది’’. వాటిని ‘‘అసంబద్ధము, ప్రేరణపూరితమూ అయినవి’’గా పేర్కొంది. బైడెన్ గురించి మనకు తెలిసిన దానిని బట్టి... అలాగే సల్లివాన్, బ్లింకెన్‌ల ప్రకటనలను బట్టి చూస్తే అమెరికా ఈ ప్రతిస్పందనను అంగీ కరిస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడు నేను అమెరికా పైననే నా దృష్టిని కేంద్రీకరించాను. ఎందుకంటే ఆ దేశ ప్రతిస్పందన చాలా ముఖ్యమైనది. భారత్ కేవలం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటుండగా, బ్లింకెన్ అంటున్న ‘అంతర్జాతీయ అణచివేత’లో దోషి కచ్చితంగా అమెరికానే అని నాకు తెలుసు. అయినప్పటికీ అమెరికా దీని నుంచి పదే పదే తప్పించుకుంటూ వచ్చింది. భారత్ కూడా అలా తనపై వచ్చిన ఆరో పణల నుంచి తప్పించుకోగల స్థితిలో ఉందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్ కెనడా వివాదం.. జైశంకర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో భారత్ కెనడాల మధ్య రగులుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖమంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడరాదని అన్నారు. ఈ సందర్భంగా భారత్-కెనడా వివాదంపై జై శంకర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని తెలిపారు. ‘మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు అని జైశంకర్ పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కెనాడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం మాతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, మేము కూడా దానిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్‌కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో తమ అభర్ధనలకు కెనడా స్పందించలేదని అన్నారు. చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే మీరు ఎలా స్పందిస్తారని అడిగారు. మేము మీ దేశంపై విమర్శలు చేసాం, మీ కాన్సులేట్లపై దాడులకు పాల్పడ్డం. పోస్టర్లు పెట్టాం. దీనిని మీరు సాధారణమైనవిగా భావిస్తారా? ఇదే వేరే దేశానికి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు. కెనడాలో జరుగుతున్నది జనరల్‌గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా మాకు కెనడా, కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌లతో చర్చించాం’ అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆదేశ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ భేటీ అయ్యారు. భారత్- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. చదవండి: సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో -
సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో
టొరంటో: ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారి, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరు గుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. అదేసమయంలో, ఖలిస్తాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య ఘటనకు సంబంధించిన వాస్తవాల వెల్లడిలో సహకారానికి భారత్ ముందుకురావాలని కోరారు. భారత్‌పై బలమైన ఆరోపణలున్నప్పటికీ సన్నిహితంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాంట్రియల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ వేదికపై కీలకంగా మారిన భారత్‌తో కెనడా, మిత్ర దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నా. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌తో సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాం’అని చెప్పారు. అదే సమయంలో చట్టపాలన కలిగిన దేశంగా, నిజ్జర్ హత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు భారత్ తమతో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో వాషింగ్టన్లో జరిగే సమావేశంలో ఇదే విషయాన్ని బ్లింకెన్ ప్రస్తావిస్తారని కూడా బైడెన్ ప్రభుత్వం చెప్పిందన్నారు. -
వర్రీ ఎందుకు సార్! ప్రస్తుతం మనం చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి!
వర్రీ ఎందుకు సార్! ప్రస్తుతం మనం చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి! -
Trudeau: భారత్‌పై స్వరం మార్చి ఆ వెంటనే..
మాంట్రియల్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. ఒక్కసారిగా స్వరం మార్చారు. భారత్‌తో సత్సంబంధాల విషయంలో కెనడా కట్టుబడి ఉందని.. ఆ విషయంలో వెనక్కి తగ్గబోదంటూ వ్యాఖ్యానించారాయన. గురువారం మాంట్రియల్లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్లోబల్ స్థాయిలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత చూస్తున్నాం. ఇలాంటి టైంలో కెనడా, దాని మిత్రపక్షాలు భారత్‌తో సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలనే తీవ్రంగా ప్రయత్నిస్తాయి’’ అని వ్యాఖ్యానించారాయన. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కిందటి ఏడాది మేం(కెనడా) ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అందించాం. తమ దేశం ఇప్పటికీ భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి కట్టుబడి ఉంది అని తెలిపారు. అమెరికా మాతోనే.. అయితే అదే సమావేశంలో ఆయన కాసేపటికి మళ్లీ పాతపాటే పాడారు. నిజ్జర్ హత్యోదంతాన్ని మళ్లీ హైలైట్ చేశారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరోవైపు నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. భారత్ విదేశాంగ మంత్రితో భేటీ సమయంలో ఈవిషయాన్ని లేవనెత్తుతానని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాటిచ్చారని ట్రూడో వెల్లడించారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్‌గా తీసుకోవాలని ట్రూడో పిలుపు ఇచ్చారు. ‘‘కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో మాతో కలిసి భారత్ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలి. కెనడియన్‌కు మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికా మాతోనే ఉంది’’ అని పేర్కొన్నారు. -
కెనడా ప్రధాని క్షమాపణలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది. ఎందుకు వివాదం..? యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం -
ఆచితూచి వ్యవహరించాల్సిందే!
కెనడాలోని ఒక సిక్కు నాయకుడి హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. రాజకీయంగా తన ప్రాచుర్యం క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఖలిస్తాన్ అనుకూలురు ఉన్న ‘ఎన్డీపీ’ తన సంకీర్ణంలో కొనసాగేందుకు ట్రూడో ఈ పని చేసుండాలి. 2018 నాటి భారత పర్యటనలో తనను పట్టించుకోలేదన్న ట్రూడో అసంతృప్తి కూడా మరో కారణం కావొచ్చు. ఏమైనా ఈ వ్యవహార ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాల సంబంధాలపై పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, ఖలిస్తాన్‌కు మద్దతునివ్వని ప్రపంచవ్యాప్త సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈమధ్య పెద్ద దుమారమే లేపారు. ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని గురుద్వారా వెలుపల జరిగిన కెనడా సిక్కు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్న ట్రూడో ప్రకటన ఇరు దేశాల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలకు నగదు బహుమతి కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండి ఉంటే అది అసాధారణమైన విషయమే అవుతుంది. కాకపోతే పరిస్థితులను గమనించినప్పుడు నిజ్జర్ హత్య పక్కా గ్యాంగ్ వార్‌ను పోలుతుంది. నిజ్జర్ పూర్వాపరాలను గమనించినా హత్యకు గ్యాంగ్ వారే కారణమని అనిపించడం ఖాయం. సత్యం ఏమైనప్పటికీ ట్రూడో ఆరోపణల పుణ్యమా అని ఇప్పుడు భారత్ పరువుకు కొంత భంగం కలిగింది. అది కూడా జీ–20 సమావేశాలను అధ్యక్ష స్థానంలో ఉంటూ విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఇబ్బందికరమైంది. కామన్ వెల్త్ దేశమైన, భారతీయ సంతతివారు ఎక్కువ సంఖ్యలో ఉన్న, ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలకమైన కెనడాతో భారత్ సంబంధాలిప్పుడు అట్టడుగు స్థాయికి చేరాయి. అయితే ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది: చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే భారత్ సాయం కచ్చితంగా అవసరమని అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, పశ్చిమ యూరప్, జపాన్ భావిస్తున్నాయి. ఈ భాగస్వామ్యానికి కొన్ని పరిమితులు లేకపోలేదు. అదే సమయంలో నాటో, జీ–7 దేశాల సభ్య దేశాలతో వ్యవహరించే సందర్భంలో వ్యవహారం మారిపోయేందుకు అవకాశా లెక్కువ. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్ చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమవుతుంది: ‘‘ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రత్యేకమైన మినహాయింపులు ఎవరికీ ఉండవు. దేశం ఏదైనా సరే, మా ప్రాథమిక నైతిక సిద్ధాంతాల రక్షణ కోసం నిలబడతాం. అలాగే దగ్గరి భాగస్వామి అయిన కెనడా లాంటి దేశాలతో సంప్రదింపులు జరిపి చట్టాన్ని పరిరక్షించేందుకు వారు చేసే ప్రయత్నాల్లోనూ, దౌత్యపరమైన ప్రక్రియల్లోనూ సహకరించుకుంటాం’’ అన్నారు ఆయన. తిరస్కరించిన భారత్ కెనడాలో ఓ సిక్కు నేత హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న విషయాన్ని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. అర్థం లేని, దురుద్దేశపూరిత ఆరోపణలుగా కొట్టి పారేసింది. అయితే ఇంతటితో కథ ముగిసిపోయిందని అనుకునేందుకు వీల్లేదు. వట్టి తిరస్కా రాలతోనో, ఉగ్రవాదంపై చర్యల విషయంలో ట్రూడో నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టడంతోనో సమస్య సమసిపోదు. కెనడాలోని కొంతమంది సిక్కులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం వెనుక చాలా చరిత్రే ఉంది. అయితే ప్రస్తుతం నిజ్జర్ లాంటివాళ్లు చేస్తున్న క్రిమినల్ కార్యకలాపాలపై భారత్ ఎక్కువగా దృష్టి పెట్టాలి. నిజ్జర్ రాజ కీయాలు, ఉగ్రవాద, హింసాత్మక కార్యక్రమాల్లో ఆయన ప్రమేయం వంటివి ఎత్తి చూపడం ఆయన హత్యను సమర్థించినట్లు కనిపించవచ్చు. మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాల్లో ఈ రకమైన ఆలోచన బలపడవచ్చు. కానీ నిజ్జర్ కార్యకలాపాలపై ఉన్న సమాచారం మొత్తాన్ని భారతీయ నిఘా సంస్థలు కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలతో పంచుకోవడం మేలు. ట్రూడో ఆరోపణలను గట్టిగా తిరస్కరించడం ద్వారా భారత్ సరైన పనే చేసింది. భారతీయ దౌత్యవేత్తను కెనడా తిప్పి పంపడంతో భారత్ కూడా అదే పని చేయడమూ తగిన ప్రతిచర్యే. కానీ, పరిస్థి తులు మరింత దిగజారకుండా ఉండటం ఇరు దేశాలతోపాటు భారత్‌తో మరింత ఎక్కువ సంబంధాలు కోరుకుంటన్న పాశ్చాత్య మిత్రులకూ అత్యవసరం. కెనడాతో మనకున్న సంబంధాలు కాస్తా అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల మైత్రిపై ప్రభావం చూపరాదు. అదే జరిగితే ఈ అంశాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకునేందుకు చైనా, పాకిస్తాన్ కాచుకు కూర్చున్నాయన్న విషయం మరవరాదు. కెనడా రాజకీయాలూ చూడాలి... ప్రస్తుత దౌత్య సమస్యకు కెనడాలోని స్థానిక రాజకీయ పరి స్థితులూ కారణం కావచ్చు. ట్రూడో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్నారన్న నెపంపై కెనడా లోని కొంత మంది సిక్కులపై విమర్శలు చేయడం కూడా తగదు. దీనివల్ల కెనడాలోని మెజారిటీ సిక్కులు, ఇతర దేశాల వారు, మరీ ముఖ్యంగా భారతీయ సిక్కులను దూరం పెట్టినట్టుగా ఉండకూడదు. ఖలిస్థాన్ డిమాండ్‌కు వీరందరూ దూరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖలిస్తాన్ భయాన్ని ఎత్తిచూపాలన్న ఉబలాటం ఉండొచ్చు, కానీ ఇది ఉద్దేశించని నష్టం కలిగించే ప్రమాదం ఉంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రూడో విమర్శలకు దిగడం వెనుక ఆయనకున్న వ్యక్తిగత ఆసక్తి ఏమిటన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కెనడా రాజకీయాల్లో విదేశాల ప్రమేయంపై ఇప్పటికే విచారణ సాగుతోంది. దేశంలో చైనా కార్యకలాపాలపై చెక్ పెట్టలేకపోయారన్న అంశం ట్రూడోకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఈ అంశం దాన్ని పక్కదోవ పట్టించగలదు. ట్రూడో ప్రభుత్వం మనుగడ కోసం సిక్కు రాజకీయ పార్టీ, ఖలిస్థాన్ ఉద్యమ అనుకూలురు ఎక్కువగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) మద్దతు అవసరం. ఇందుకోసమే ట్రూడో భారత్‌పై ఈ రకమైన విమర్శలకు దిగి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా... 2018లో భారత పర్యటన సందర్భంగా తనను అంతగా పట్టించుకోలేదని ట్రూడో భావించడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణం కావచ్చు. ‘అన్ని పర్యటనలను అంతం చేసే పర్యటన’ అని ట్రూడో అప్పట్లోనే ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యక్తిగతమైన భారత వ్యతిరేక భావన ఇప్పుడు ఇలా అనాలోచిత తప్పుడు ఆరోపణలకు దారితీసి ఉండవచ్చు. వ్యక్తిగా ట్రూడోతో ఉన్న సంబంధాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను నిర్ణయించే పరిస్థితి ఉండరాదు. రాజకీయంగా, వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల పరంగానూ ఇరు దేశాల మధ్య సఖ్యత ఎంతో అవసరం. భారత్ – కెనడా సంబంధాల ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాలతో మనకున్న సంబంధాలపై కూడా ఉండవచ్చు. ట్రూడోతో మన గొడవ కాస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. పంజా బ్లో ఇప్పటికే ఈ అంశంపై అసంతృప్తి రగులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రూడో ప్రభుత్వంపై భారత్‌కు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సిక్కు కుటుంబాలు తమ స్వస్థలాలకు రావడాన్ని అడ్డుకోవడం మార్గం కాదు. ఏమైనా, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా ఉండాలని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం..!
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్‌ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం. ఇండియా-కెనడా వివాదం.. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
ఈ పరిస్థితి మారేదెట్లా?
భారత – కెనడా సంబంధాలు కొంతకాలంగా ఇరుకునపడ్డ మాట నిజమే కానీ, గత వారం రోజుల పరిణామాలతో అధఃపాతాళానికి పడిపోయాయి. కెనడా పౌరుడైన ఓ ఖలిస్తానీ సిక్కును భారత్ హతమార్చిందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో గత వారం చేసిన ఆరోపణ ఒక్కసారిగా పరిస్థితిని దిగజార్చింది. భారత ప్రభుత్వం ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడం, కెనడా తన మాట వెనక్కి తీసుకోకపోవడం, వరుస దౌత్యవేత్తల బహిష్కరణలు... కొద్దిరోజులుగా వేడిని పెంచుతూ వస్తున్నాయి. భారత్‌లో పర్యటించదలచినవారికి అనేక జాగ్రత్తలు చెబుతూ కెనడా ప్రత్యేక సూచన లిస్తే, కెనడా దేశస్థులకు వీసాల జారీని భారత్ నిలుపు చేసింది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన భారత సర్కార్ సదరు ఖలిస్తానీ మద్దతుదార్లకు దేశంలో ఉన్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం మొదలెట్టింది. తాజాగా ఐరాస వేదికపైనా అంతర్లీనంగా కెనడా వైఖరిని ఎండగట్టింది. వరుస చూస్తే,రెండు దేశాల మధ్య దౌత్యఘర్షణకు ఇప్పుడప్పుడే తెర పడేలా కనపడట్లేదు. ఈ వ్యవహారంలో తప్పంతా కెనడా ప్రధానిదే. వారం క్రితం భారత్‌పై తీవ్ర ఆరోపణతో రెండు దేశాల మధ్య దౌత్య తుపాను రేపిన ట్రూడో ఇప్పటి వరకు సాక్ష్యం చూపలేకపోయారు. అదేమంటే, ‘ఫైవ్ ఐస్’ గూఢచర్య కూటమి సేకరించిన సమాచారమే ఈ ఆరోపణకు ఆధారమని కెనడా దేశపు మీడియాలో లీకులు వస్తున్నాయి. ఆ మాటకొస్తే ట్రూడో హయాంలో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన అరాచకాలు అనేకం. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కొని యాడే శకటాలు, దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తూ ‘‘కిల్ ఇండియా’’ పేరిట పోస్టర్లు, హిందూ ఆలయాలపై దాడుల లాంటివన్నీ ఆయన ఏలుబడిలో ఎగసిపడ్డవే. కెనడాలోని సిక్కు ఓట్ల కోసం తీవ్రవాద సభలకు సైతం ఆయన హాజరయ్యారు. అప్పట్లోనే భారత దౌత్యవేత్తలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కెనడా ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలకే ట్రూడో పెద్ద పీట వేస్తున్నట్టున్నారు. ఖలి స్తానీ మద్దతుదారుల్ని సంతోషపరచి, నాలుగు ఓట్లు ఎక్కువ సంపాదించాలన్నదే ఆయన తాప త్రయంగా కనిపిస్తోంది. పరిణతి లేని ఆయన రాజకీయ చర్యలపై నిపుణులైన కెనడా దౌత్యవేత్తలు ఇప్పటికే పెదవి విరిచారు. 2018లో భారత పర్యటన సందర్భంగా నేరస్థుణ్ణి విందుకు ఆహ్వానించి ఫోటోలు దిగి రచ్చ రేపిన ట్రూడో తన తాజా చర్యలతో ఏకంగా భారత్‌తో బంధానికే పూర్తిగా నిప్పంటించేశారు. నిజానికి, భారత అభ్యర్థనపై 2016 నుంచి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్‌లో ఉన్న తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ జూన్ 18న గుర్తు తెలియని దుండగుల తుపాకీ కాల్పులకు చనిపో యాడు. నాలుగు నెలల తర్వాత ట్రూడో నిద్ర లేచి, అది భారత్ చేసిన హత్య అనడం విడ్డూరం. పడిపోతున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే జస్టిన్ ట్రూడో ఇలా అంతర్జాతీయంగా భారత్‌పై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో 1968 నుంచి 1984 మధ్య కెనడా ప్రధానిగా పనిచేసిన ఆయన తండ్రి ప్రియర్ ట్రూడో సైతం ఇలాగే పెడసరంగా వ్యవహరించారు. సిక్కు తీవ్రవాది తల్విందర్ సింగ్ పర్మార్‌ను అప్పగించమని అభ్యర్థిస్తే నిరాకరించారు. చివరకు ఆ తీవ్రవాది ఓ ఉగ్రసంస్థకు అధిపతై, 1985లో ఎయిరిండియా విమానాన్ని బాంబు పెట్టి పేల్చేసి, 329 మంది మరణానికి కారణ మయ్యాడు. 2016లో తండ్రి లానే కొడుకు ప్రధాని కాగానే, ఆ కేసులో శిక్షపడ్డ ఏకైక వ్యక్తి పెరోల్‌పై విడుదలయ్యాడు. 2018లో ట్రూడో భారత్ సందర్శించినప్పుడు అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తాము అన్వేషిస్తున్న తీవ్రవాదుల జాబితాను అందజేశారు. తాజాగా మరణించిన నిజ్జర్ పేరూ అందులో ఉంది. ఈసారి పెద్ద ట్రూడో బాటలోనే చిన్న ట్రూడో చర్యలేమీ చేపట్టలేదు. నిజ్జర్ మరణంపై ఇంతవరకు చేసిన దర్యాప్తు, అనుమానితులు, అదుపులో తీసుకున్న పేర్లేమీ కెనడా చెప్పట్లేదు. ఇండియాపై ఆరోపణలు చేసి పది రోజులవుతున్నా తన వాదనకు బలం చేకూర్చే సాక్ష్యమేమీ ట్రూడో చూపలేకపోయారన్నది గుర్తించాలి. ఈ గొడవ ఇలా నడుస్తుండగానే, నాజీ సంబంధాలున్న ఓ వయోవృద్ధుడిని శుక్రవారం కెనడా పార్లమెంట్ గౌరవించి, మరో తప్పు చేసింది. ఆఖరికి స్పీకర్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాము నెత్తిన పెట్టుకుంటున్న వ్యక్తుల నేపథ్యం తెలుసుకోవడంలో కెనడా పాలనా యంత్రాంగం విఫలమవుతోందనడానికి ఇది మరో మచ్చుతునక. భారత్ సైతం విదేశీగడ్డపై నివసిస్తూ, మాతృదేశానికి ద్రోహం చేయాలని చూస్తున్నవారిపై ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి. ఈ ఖలిస్తానీలకు నిధులెక్కడ నుంచి వస్తున్నాయి, వారికి తెరచాటు అండదండ ఎవరనేది కనిపెట్టి, సాక్ష్యాధారాలతో అంతర్జాతీయంగా బట్టబయలు చేయాలి. దేశంలో ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల లాంటి వంద తలనొప్పులున్న ట్రూడో నిరాధార ఆరోప ణలకు దిగే కన్నా ముందు ఆ సమస్యలపై దృష్టి పెట్టాలి. ఎనిమిదేళ్ళ క్రితం ఎన్నుకున్న తనను 63 శాతం మంది ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణాలు గ్రహించాలి. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు, నిధుల కోసం ఆయన పార్టీ వర్గాలు ఖలిస్తానీ అనుకూల వర్గాలపై అతిగా ఆధారపడడం మానుకోవాలి. పౌరుల భావస్వేచ్ఛను పరిరక్షించాల్సిందే కానీ, ఆ మిషతో తీవ్రవాదం సాగిస్తే సహించబోమని అక్కడి సిక్కు ప్రవాసీలకూ స్పష్టం చేయాలి. కెనడాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. అక్కడి పర్యాటకుల సంఖ్యలో నాలుగో స్థానం మనదే. కెనడాకెళ్ళే విద్యార్థుల్లో 40 శాతం మనవాళ్ళే. అందుకే ఎన్నికల్లో గెలుపోటముల కన్నా దేశాల మధ్య దశాబ్దాల బంధం ముఖ్యమని ట్రూడో గ్రహించాలి. భారత్ సైతం పరిస్థితిని చక్కదిద్దడమెలాగో ఆలోచించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇరుపక్షాలకూ కావాల్సిన అమెరికా మధ్యవర్తిత్వమూ అందుకు కలిసిరావచ్చు. -
భారత్‌తో సైనిక సంబంధాలకు ఢోకా లేదు: కెనడా సైనికాధికారి
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొంత మేర దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న మాట వాస్తవమే కానీ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్. అది రాజకీయ సమస్య.. భారత్ వేదికగా జరుగుతున్న ఇండో పసిఫిక్ సైన్యాధ్యక్షుల సదస్సులో పాల్గొనేందుకు 30 దేశాల సైన్యానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కెనడా డిప్యూటీ ఆర్మీ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. పీటర్ స్కాట్ మాట్లాడుతూ.. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని.. కెనడా భారత్ మధ్య జరుగుతున్న వివాదానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నాకు తెలిసినంతవరకు ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారమవ్వాలని దానిలో మేము జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఇండో పసిఫిక్ దేశాల కోసం.. మా ప్రధాని ఆ విషయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లోనే ప్రస్తావించారని దానిపై విచారణ కూడా కొనసాగుతోందని ఆయన కోరినట్లు భారత్ సహకరిస్తే విచారణ తొందరగా జరిగే అవకాశముంటుందన్నారు. ఇక ఆ సమస్య రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను ఏమాత్రం ప్రభావితం చేయదన్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో ముందురోజు మాట్లాడానని ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారం కావాలని దాని వలన సైనిక సంబంధాలకు ఎటువంటి భంగం కలగకూడదని ఇద్దరం తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇండో-పసిఫిక్ దేశాలకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని. అన్ని వేళ్ళూ అటువైపే.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్‌పై ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఆయన చేసిన ఆరోపణలను ఖండించిన విషయం తెలిసిందే. అత్యధిక ప్రపంచ దేశాలు కూడా కెనడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. ట్రూడో ఆరోపణలు నిరాధారమైనవని చెబుతూ ఉగ్రవాదానికి కెనడా కేంద్రంగా మారుతోందని అన్నారు. #WATCH | Delhi: Canada's Deputy Army Chief Major General Peter Scott says, "We're very grateful to be here as part of the Indo-Pacific Armies Chiefs Conference (IPAC), 2023. Canada continues to look for opportunities where we can participate in training or exercises with partners… pic.twitter.com/QCVwXEIMgB — ANI (@ANI) September 26, 2023 ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు అడ్డగా కెనడా: భారత్‌కు శ్రీలంక మద్దతు -
భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై అమెరికా నెమ్మదిగా ఒత్తిడి పెంచుతోంది. ఈ కేసులో కెనడాకు సహకరించాలని ప్రైవేట్‌గా, బహిరంగంగా అభ్యర్థించామని స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయబద్ధంగా నిందితులను కోర్టులో హాజరుపరచాలని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. కెనడా ఆరోపణలపై కలత చెందామని పేర్కొన్న ఆయన.. ఆ దేశంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న US హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా కూడా నిజ్జర్ హత్య కేసుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. బాధ్యులైనవారికి కఠిన శిక్షలు పడాలని అన్నారు. ఇందుకు భారత్ సహకరించాలని కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో -
ఉగ్రవాదులకు అడ్డగా కెనడా: భారత్‌కు శ్రీలంక మద్దతు
శ్రీలంక విదేశాంగశాఖ మంత్ర అలీ సబ్రీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కెనడా భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై మంగళవారం ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొంతమంది ఉగ్రవాదులకు కెనడా సురక్షిత ప్రాంతంగా మారిందని విమర్శించారు. అందుకే కెనడా ప్రధాని ట్రూడో ఎటువంటి ఆధారాలు లేకుండానే దారుణమైన ఆరోపణలతో ముందుకొచ్చినట్లు అనిపిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ఆరోపణలే శ్రీలంకపై కూడా చేశారు. కానీ మా దేశంలో ఎలాంటి హత్యాకాండ జరగలేదని అందరికీ తెలుసు. అంతేగాక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలతో కలిసి పనిచేసిన వారికి కెనడా పార్లమెంట్‌లోకి ట్రూడో ఆహ్వానించి, సత్కరించడం నిన్న చూశాను. ఆయన చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. ట్రూడో సంగతి నాకు తెలుసు. అందుకే నిరాధార ఆరోపణలతో ట్రూడో ముందుకు రావడం నాకేం ఆశ్యర్చం అనిపించలేదు. చదవండి: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల కెనడాలో పర్యటించిన సందర్భంగా అక్కడి పార్లమెంట్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి రెండో ప్రపంచ యుద్ధ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను స్పీకర్ ఆంటోనీ రోటా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడు అంటూ స్పీకర్ పొగడటంతో.. అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, జలెన్‌స్కీ సహా అందరూ నిల్చొని చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. దీనిపై వివాదం చెలరేగడంతో.. పొరపాటు జరిగిందంటూ ఆదివారం స్పీకర్ ఆంటోనీ క్షమాపణలు చెప్పారు. దీనిపై తాను రాజీనామాకు కూడా సిద్దమేనని ప్రకటించారు. అటు, కెనడా ప్రధాని ట్రూడో కూడా ఇలా జరిగినందుకు కలత చెందానని అన్నారు. ఇది కెనడా పార్లమెంటుకు, కెనడియన్లందరికీ చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పారు. -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
భారత్‌తో సంబంధాలు కీలకమే.. కానీ: కెనడా మంత్రి
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడా మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. నిజ్జార్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉండొచ్చుంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ తాజాగా కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు తమకు ముఖ్యమైనవని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో బ్లెయిర్ మాట్లాడుతూ.. నిజ్జార్ హత్య ఆరోపణల వ్యవహారం భారత్‌తో తమ బంధానికి సంబంధించి సవాలుతో కూడుకున్న సమస్యగా మారుతోందన్నారు. అదే సమయంలో చట్టాన్ని, తమ పౌరులను రక్షించడం ముఖ్యమని అన్నారు. అందుకు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజనిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆరోపణలే నిజమని తేలితే.. కెనడా గడ్డపై, కెనడియన్ పౌరుడి హత్య విషయంలో తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు తీవ్ర ఆందోళన నెలకొంటుందని అన్నారు. చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన కెనడాకు ఉప్పందించింది అమెరికానే నిజ్జర్ హత్య అనంతరం ఆ నిఘా సమాచారాన్ని అగ్రరాజ్యం అమెరికానే ఆ దేశానికి అందజేసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సదరు సమాచారాన్ని ఆధారంగా చేసుకునే కెనడా భారత్‌పై నేరుగా ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోందని ఆ కథనం పేర్కొంది. తమ దేశంలోని భారత దౌత్యాధికారుల సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా కెనడా నిఘా విభాగాలు ఇదే విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు కూడా భావిస్తున్నారు. -
అమెరికా ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు
న్యూయార్క్: కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్థానీ నేతల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్థానీ నేతలు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే గురుద్వారాలో ఉండగా.. కాల్పులు జరిపి నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ కేసులో భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించింది. నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు ఎఫ్‌బీఐ అధికారులు తనను కలిసినట్లు అమెరికన్ సిక్కుల కోఆర్డినేటర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనతోపాటు మరో ఇద్దరు సిక్కు నేతలను కూడా ఎఫ్‌బీఐ అధికారులు కలిశారు. నిజ్జర్ హత్యకు ముందే హెచ్చరికలు.. నిజ్జర్ హత్యకంటే ముందే కెనడాలో సిక్కు నేతలను నిఘా వర్గాలు హెచ్చరించాయంట. ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. సిక్కు నేతల ప్రాణాలకు ముప్పు ఉందని అంతకంటే ముందే సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఎన్ఐఏ అప్పట్లో కేసులు నమోదు చేసింది. అతనిపై రూ.10 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించింది. మోహాలీలోని కోర్టులో అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే.. ఆయన్ను జూన్ 18న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ 'జస్టిస్ ఫర్ సిక్' అనే అమెరికా ఆధారిత సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. చంఢీగర్, అమృత్సర్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నడిచాయి. ఉపా చట్టం కింద భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్‌లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు. Set up helpline for Indian students, NRIs in Canada: Punjab BJP chief urges Centre #India #Canada https://t.co/dT8lYAE9qm — IndiaToday (@IndiaToday) September 23, 2023 'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్దీప్ కౌర్ కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? -
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు. భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు. అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్ నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్‌లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్లో చూసే తెలుసుకున్నా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సిల్‌గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్‌సర్‌లోని ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు. -
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందన్న విశ్వసనీయ సమాచారాన్ని ఇండియాకు తాము కొన్ని వారాల క్రితమే తెలియజేశామని అన్నారు. గత సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం కంటే ముందే భారత్‌కు చెప్పామని స్పష్టం చేశారు. ఇండియాతో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమోయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. కెనడా పౌరుని హత్యలో భారత్ జోక్యం అంటూ మండిపడ్డారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న చర్యగా అభిప్రాయపడింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని భారత్ కోరింది. కానీ కెనడా ఇప్పటివరకు ఆధారాలను వెల్లడించలేదు. ఇండియా జవాబుదారీగా ఉండాలి: అమెరికా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇండియాకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..? -
Canada–India relations: అక్కడి నుంచే సమాచారం
టొరంటో: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా చేసిన ఆరోపణలకు ఫైవ్ ఐస్ నెట్వర్క్ అందించిన సమాచారమే ఆధారమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కెనడా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని ఒక గురుద్వారాలో నిజ్జర్‌ను దుండగులు కాల్చి చంపిన తర్వాత కెనడా ప్రభుత్వం సాగించిన విచారణలో అయిదు కళ్ల కూటమిలో ఒక భాగస్వామ్య దేశం అందించిన సమాచారం ఆధారంగానే భారత్ ప్రమేయం ఉందన్న అనుమానాలు వచ్చాయని సీబీసీ న్యూస్ ఒక కథనంలో వెల్లడించింది. కెనడాలో భారత్ దౌత్యవేత్తల కమ్యూనికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ దేశం కెనడాకు పంపినట్టుగా తెలిపింది. మానవ మేధస్సు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ దేశం పంపిన సమాచారంలో భారత్ ప్రమేయంపై అనుమానాలున్నట్టు తెలుస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాలు సభ్యత్వం ఉన్న ఆ కూటమిలో ఏ దేశం భారత్ ప్రమేయం ఉందని చెబుతున్న సమాచారం అందించిందో సీబీసీ న్యూస్ వెల్లడించలేదు. కెనడాలో విద్వేషానికి చోటు లేదు భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హిందువుల్ని బెదిరిస్తున్న వీడియో మరింతగా ఆందోళనల్ని పెంచుతోంది. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం వీడి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన కెనడా ప్రభుత్వం ఇలాంటి విద్వేషపూరితమైన చర్యలకి తమ దేశంలో చోటు లేదని పే ర్కొంది. కెనడాలో నివసిస్తున్న వారెవరూ భయాందోళనలకు లోనుకావల్సిన పని లేదని హామీ ఇచి్చంది. భారత్‌కు ప్రత్యేక మినహాయింపులుండవ్: అమెరికా ఖలిస్తాన్ అంశంలో కెనడా, భారత్ మధ్య రగిలిన చిచ్చుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలకు సంబంధించి తాము భారత్ దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఈ అంశంలో భారత్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. భారత్‌తో బంధాల బలోపేతం కోసమే కెనడా వైపు అమెరికా మాట్లాడడం లేదన్న ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్‌కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్‌కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్‌కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్–కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాద పరిణామాలను దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిశితంగా పరిశీలిస్తోంది. కెనడాలోని తమ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వారి అభిప్రాయం ప్రకారం తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదని పేర్కొంది. ఖలిస్తానీ వేర్పాటువాది హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. పలు భారతీయ ఐటీ దిగ్గజాలు కెనడాలో కార్యకలాపాలను సాగిస్తుండటంతో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కామ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ప్రస్తుతానికైతే టెక్ పరిశ్రమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం లేకపోయినా.. ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సి ఉంటుందని పరిశ్రమ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. -
ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో జీ20 సదస్సుకి వచ్చినప్పుడు కాస్త విభిన్నంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం హోటల్ లలిత్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేశారు. ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్లో సాధారణ గదిలో బస చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని అభాండాలు వేస్తున్న ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ట్రూడో సొంత విమానానికి సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన ప్రయాణం వాయిదా పడింది. అప్పుడు భారత్ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. తన విమానం సిద్ధమయ్యాక రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 12న బయల్దేరి వెళ్లారు. -
ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత్
ఢిల్లీ: కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే.. ప్రతిష్ట పొందుతోందని దుయ్యబట్టారు. ఇరు దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఉగ్రవాదుల కార్యకలాపాలను యధేచ్చగా జరగనిచ్చేలా అవకాశాన్ని కల్పించడం, ఉగ్రవాదులకు ఫండింగ్ సమకూర్చడం వంటి చర్యలకు కెనడా స్వర్గధామంగా మారింది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలని కోరితే స్పందన లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని కెనడాను కోరుత్నునాం.' అని అరింధమ్ బాగ్చి తెలిపారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారులను కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేనడా ప్రయాణాలపై పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్‌లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పత్‌లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్‌ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
భారత్- కెనడా మధ్య విభేదాలు.. ఎవరీ పవన్ కుమార్ రాయ్?
India-Canada diplomatic row ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంతో భారత్- కెనడా మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పవన్ కుమార్ రాయ్‌ను కెనడా విదేశాంగశాఖ ఆ దేశం నుంచి బహిష్కరించింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు పలు ఆంక్షలు విధించాయి. అక్కడి భారతీయులకు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. అలాగే తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కెనడాకు వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? ఎవరీ పవన్ కుమార్ రాయ్ పవన్ కుమార్ రాయ్ కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. భారత్, కెనడా మధ్య ఏర్పడిన ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అతనే ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. పవన్ కుమార్ రాయ్ 1997 బ్యాచ్ కు చెందిన పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి. రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధిత కేసులను సమర్ధవంతంగా పరిష్కరించిన చరిత్ర ఆయనకు ఉంది. 2010 జులై 1 నుంచి డిప్యుటేషన్ పై ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అంతకుముందు జలందర్, అమృత్ సర్ జిల్లాల సీనియర్ ఎస్పీగా పనిచేశారు. అతని సేవలను గుర్తించిన పంజాబ్ ప్రభుత్వం జనవరి 31, 2023న అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) స్థాయి పదోన్నతి కల్పించింది. రాయ్‌కు భారత ఇంటెలిజెన్స్ విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) మాజీ చీఫ్ సమంత్ కుమార్ గోయెల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2018లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కేంద్రం నియమించింది. అనంతరం కెనడాలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఎంపికయ్యారు. కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు, భారత్ నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) అధినేత హర్దీప్ సింగ్‌ను గత జూన్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. జూన్ 18న పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. అయితే హర్దీప్సింగ్ నిజ్జర్‌ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అతడిని పట్టించిన వారికి 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది., -
కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను కూడా ఇరుదేశాలు జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. అయితే.. ఇంతటి చర్యలకు కారణం ఒక్క ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ హత్య కేసుపై ట్రూడో వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. కొన్ని రోజులుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న ఖలిస్థానీ వివాదం, ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. హర్దిప్ సింగ్ హత్య కేసుతో చిలికి చిలికి గాలివానలా మారింది. అమృత్ పాల్‌సింగ్‌తో మొదలు.. పంజాబ్‌లో ఖలిస్థానీ ప్రబోధకుడు అమృత్ పాల్సింగ్పై మార్చిలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత దౌత్య కార్యాలయం ఎదుటు నిరసనకు దిగారు. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య అధికారుల భద్రత కెనడా ప్రభుత్వం చూసుకోవాలని కోరింది. ఈ చర్యల తర్వాత కెనడాలోని బ్రాంప్టన్‌లో ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ ఖలిస్థానీ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇలాంటి చర్యలకు మద్దతు తెలపరాదని దుయ్యబట్టారు. ఇండియా, కెనడా మధ్య సంబంధాలకు ఈ చర్యలు ఏమాత్రం మంచిది కాదని హితువు పలికారు. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. ఈ కేసుపై కెనడా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కౌన్సిల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలే కారణమని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు ఆరోపించారు. భారత దౌత్య అధికారులే నిజ్జర్ హత్యకు కారణమని టొరెంటోలో జులై 8న నిర్వహించిన ర్యాలీలోని పాంప్లెట్లలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ20 సమ్మిట్.. ఆ సారి ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదం పెరుగుతుండటం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆవాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి అసాంఘీక శక్తులను అణిచివేయడంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దీనికి స్పందించిన ట్రూడ్రో కెనడా భావవ్యక్తీకరణ స్వేచ్చను గౌరవిస్తుందని అన్నారు. శాంతికాముకమైన నిరసనలకు అనుమతి ఉంటుందని పేర్కొంటూ.. అల్లర్లను కూడా సహించబోమని స్పష్టం చేశారు. కొంతమంది చేసే చర్యలకు ఓ వర్గాన్ని మొత్తం ఆపాదించడం సరికాదని అన్నారు. ఇదీ కాకుండా విమానం సాంకేతిక కారణాల వల్ల జీ20 మీటింగ్ అనంతరం కెనడా ప్రధాని ట్రూడో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం విమానం ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన ఉపయోగించుకోలేదు. దాదాపు 36 గంటలు ఢిల్లీలోనే ఉండి, సాంకేతిక సమస్యలు ముగిశాక కెనడాకు బయలుదేరారు. ఈ పరిణామాల అనంతరం గత సోమవారం నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని వివాదాస్పదంగా మాట్లాడారు. తమ పౌరుల పట్ల విదేశీ జోక్యం సహించబోమని మండిపడ్డారు. ఇలా.. అమృత్ పాల్ సింగ్‌తో మొదలైన వివాదం.. జీ20 సమ్మిట్ అనంతరం బయటపడింది. ఇదీ చదవండి: Trudeau Avoids Media Questions: ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం -
కెనడా వక్రబుద్ధి
దశాబ్దాలుగా సక్రమంగా లేని భారత్–కెనడా దౌత్య సంబంధాల్లో మరోసారి పెను తుపాను రేగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా కెనడా ప్రవర్తనే ఈ పొరపొచ్చాలకు కారణమైంది. ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను మొన్న జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఉదంతంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ఆరోపించారు. అంతేకాక ఈ విషయంలో భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారిని ఆ దేశం బహిష్కరించింది. దీనికి ప్రతిచర్యగా మన దేశం కూడా ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో పనిచేస్తున్న సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని కొట్టిపారేసింది. పనిలో పనిగా ఇరు దేశాలూ తమ తమ పౌరు లకు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్ వెళ్లే కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తే, కెనడా సందర్శించే భారత్ పౌరులపై ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నదని మన దేశం హెచ్చరించింది. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకోవటం వంటి ఉదంతాలు మనకు పాకిస్తాన్, చైనాలతోనే ఎక్కువ. 2013లో అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రగడే పట్ల అనుచితంగా ప్రవర్తించి సంకెళ్లు వేసి నిర్బంధించిన ఉదంతం తర్వాత మన దేశం అమెరికా దౌత్యవేత్తలకు అంతవరకూ ఉండే ప్రత్యేక సదుపాయాలను ఉపసంహరించింది. గత కొంతకాలంగా కెనడాలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తానీ ఉద్యమకారులు రెచ్చిపోతున్నారు. ఇదిలా కొనసాగితే ఇరు దేశాల దౌత్యసంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉన్నదని దౌత్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక్క కెనడాయే కాదు... బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో కూడా ఖలిస్తానీ ఉద్యమకారుల పోకడలు ఆందోళనకరంగానే ఉంటున్నాయి. భారత కార్యాలయాలపై, దేవాలయాలపై దాడులు, మన పౌరులను గాయపరచటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. హింసాత్మక ఘటనలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని మన దేశం కోరుతున్నా అక్కడి ప్రభుత్వాల స్పందన అంతంతమాత్రం. ఉద్యమకారులపై చర్యలు తీసు కోవటం మాట అటుంచి ఏకంగా మన ప్రభుత్వంపైనే కెనడా నిందారోపణలకు దిగింది. పాశ్చాత్య దేశాలు తమకు ముప్పు ముంచుకొచ్చినప్పుడు తప్ప ఇతర సమయాల్లో ప్రజాస్వామ్యం గురించి ప్రవచిస్తుంటాయి. 2001లో ఉగ్రవాదులు తమ దేశంలో పెనువిధ్వంసం సృష్టించి, వందలాది మంది మరణానికి కారకులయ్యాక అమెరికా గ్వాంటనామో బేలో శత్రు దుర్భేద్యమైన జైలు నిర్మించి కేవలం ఉగ్రవాదులన్న అనుమానంతో దశాబ్దాల తరబడి ఎందరినో ఏకాంతవాసంలో నిర్బంధించింది. ఇప్పటికీ ఆ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా ఎందరో మగ్గిపోతున్నారు. అలాంటి దేశాలు భారత్‌కు సూక్తులు చెబుతున్నాయి. నిఘా వ్యవస్థల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు గతంలోనే ‘ఫైవ్ అయిస్’ (పంచ నేత్రాలు) పేరిట ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఖలిస్తానీ ఉద్యమకారుల ఆగడాల గురించి ఈ వ్యవస్థ వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలియదుగానీ... తాజాగా కెనడా చేసిన ఆరోపణలపై మాత్రం అందులోని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆందోళన’ వ్యక్తం చేశాయి. ఈమధ్యే న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు నిజ్జార్ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చానని ట్రూడో అంటున్నారు. మోదీ సైతం ఖలిస్తానీ వాదుల ఆగడాలపై ఆయనను ప్రశ్నించారు. నిజ్జార్ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఈలోగానే ట్రూడో అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడారన్నది ఆశ్చర్యకరం. మొదటినుంచీ కెనడా అంతర్గత రాజకీయాలు భారత్–కెనడా సంబంధాలను శాసిస్తున్నాయి. కెనడాలో భారతీయుల సంఖ్య దాదాపు 14 లక్షలు. ఇది కెనడా జనాభాలో 3.7 శాతం. అందులో సగం మంది సిక్కులు. కొన్ని నియోజకవర్గాల్లో సిక్కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వారిపై ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం ఉండటం కెనడా రాజకీయాల్లో వారి ప్రాబల్యాన్ని పెంచింది. అందుకే కావొచ్చు...పంజాబ్‌లో 90వ దశకంలోనే అంతరించిన ఖలిస్తానీ ఉద్యమం ఇంకా అక్కడ సజీవంగా మనుగడలో ఉంది. 2021 ఎన్నికల్లో ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ మెజారిటీ సాధించలేక సిక్కు నేత జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమాక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచీ ఖలిస్తాన్ ఉద్యమకారుల విషయంలో కెనడా మరింత మెతకగా ఉంటోంది. కొత్తగా అమెరికా కనుసన్నల్లో ఏర్పాటైన ఇండో–పసిఫిక్ కూటమి తర్వాత భారత్‌తో భాగస్వామ్యం కోసం కెనడా తహతహలాడటం మొదలుపెట్టినా, ఖలిస్తానీ వాదులు ఆ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఏదో ఒక ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన నిజ్జార్ వివాదరహితుడేమీ కాదు. 2007లో పంజాబ్‌లోని ఒక సినిమా హాల్లో బాంబు దాడి మొదలుకొని ఇంతవరకూ 20 కేసుల్లో నిందితుడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్. ఇతగాడే కాదు...అనేకమంది మాఫియా ముఠాల నేతలు కెనడాలో ఆశ్రయం తీసుకుంటూ భారత్‌లో నేరాలకు దిగుతున్నారు. వీరిని అప్పగించమని మన దేశం కోరుతున్నా కెనడా పెడచెవిన పెడుతోంది. కెనడా తీరుతెన్నులపై మన దేశం దౌత్య యుద్ధం సాగించాలి. జరుగుతున్నదేమిటో ప్రపంచ దేశాలకు వివరించాలి. కెనడాలో చదువులకూ, ఉపాధికీ వెళ్లిన మన పౌరుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
ఒట్టావా: ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. 'కెనడా హిందువులారా.. మీరు మా దేశ రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. మీ గమ్యం భారతదేశం. కెనడాను వదిలి వెళ్లండి. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాకు విధేయులుగా ఉంటారు. కెనడా రాజ్యాంగం ప్రకారం వారు నడుచుకుంటారు.' అని పేర్కొంటూ పన్నూన్ ఓ వీడియోను విడుదల చేశాడు. అక్టోబర్ 29న వాంకోవర్‌లో కెనడా సిక్కులు సమావేశమవ్వాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని రిఫరెండంపై ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఇండియా ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య వేత్తలను కూడా పలుమార్లు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా పన్నూర్ వారం క్రితం హెచ్చరికలు జారీ చేశారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: Canada-India Dispute: ముంబయిలో ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు -
భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ
లండన్: కెనడా-భారత్ మధ్య వివాదం మెల్లగా ఎల్లలు దాటుతోంది. ప్రపంచ దేశాల నేతలు కూడా ఈ తగువుపైనే దృష్టి పెట్టారు. కెనడా ప్రధాని అగ్రరాజ్యం అమెరికా మద్దతు కోరుతుండగా తాజాగా బ్రిటీష్ సిక్కు ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్ కెనడాలోని సిక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినేలా సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు గురైన ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తమ దేశ పౌరుడని తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుందని అందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇది జరిగిన వెంటనే కెనడా విదేశాంగ శాఖ మంత్రి అక్కడి భారత దౌత్యాధికారిని బహిష్కరించడం అంతే దీటుగా స్పందించి భారత్ కూడా కెనడా దౌత్యధికారిని బహిష్కరించడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే కెనడా భారత్ చర్యను ఖండించాలంటూ అమెరికాను విజ్ఞప్తి చేసింది. దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు కానీ కెనడాలోని సిక్కు ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్. ఎక్స్ వేదికగా ఆయన రాస్తూ కెనడాలోని పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడ ఉంటున్న చాలా మంది సిక్కుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆత్రుతతోనూ, కోపంతోనూ, భయంతోనూ ఉన్నారని అన్నారు. కెనడా ప్రధాని సన్నిహితులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. సత్వర న్యాయం కోసం మేము కూడా యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. Concerning reports coming from #Canada. Many #Sikhs from #Slough and beyond have contacted me; anxious, angry or fearful. Given Canadian PM Trudeau stated they’ve been working with close allies, we’re in touch with UK Gov to ensure justice is delivered.https://t.co/U4ceflJmHq — Tanmanjeet Singh Dhesi MP (@TanDhesi) September 19, 2023 ఇది కూడా చదవండి: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు -
భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో అటు కెనడా.. ఇటు భారత్ దౌత్య అధికారులను దేశం విడిచివెళ్లాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాయి. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాది అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఖలిస్థానీల మద్ధతును కూడగట్టుకోవడం వంటి కొన్ని రాజకీయ సమీకరణాల కోసమే ట్రూడో ఈ చర్యలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు.. ఇంతకు అవేంటంటే..? ట్రూడో పాలనపై వ్యతిరేకత కెనడాలో ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ కష్టకాలంలో ఉంది. ట్రూడో పాలనపై అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అబాకస్ డేటా సర్వే కూడా ఈ విషయాన్నే వెల్లడించింది. కెనడా యువత లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారట. ప్రజాభిప్రాయాన్ని సేకరించే ఆంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ట్రూడో పట్ల కేవలం 33 శాతం మంది మాత్రమే సానుకూల వైఖరి కలిగి ఉన్నారు. దాదాపు 63 శాతం మందికి ట్రూడో పాలనపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. అటు.. భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కి ట్రూడో పర్యటన ఆ దేశంలో విమర్శలకు దారి తీసింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా కెనడా ప్రధాని ట్రూడో భారత్‌లోనే రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. దీంతో కెనడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఎంతటి దారుణానికి దిగజారిందో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ద్రవ్యోల్భణం, ధరలు.. ట్రూడో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవన నిర్మాణాల నుంచి కనీస నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఖర్చులు అమాంతం పెరిగాయి. ద్రవ్యోల్బణం, అధిక విదేశీయుల తాకిడి విపరీతంగా హెచ్చయింది. ఇమ్మిగ్రేషన్లను పెంచడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ట్రూడో భావించాడు. కానీ కొత్తగా వస్తున్నవారితో నిరుద్యోగం, జీవన వ్యయం, సేవల కొరతతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రే సమర్థవంతంగా పరిష్కరించగలడని ప్రజలు భావిస్తున్నారు. ఆ పార్టీ మద్దతు కోసమే.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రేకు కెనడాలో రోజురోజుకు ఆధరణ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పియర్ పోయిలీవ్రే ప్రధాని అవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగమీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ మద్దతు పార్టీ ఎన్డీపీ మద్దతు అవసరమని ట్రూడో భావించాడని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీపీ 24 సీట్లు సాధించింది. మళ్లీ విజయం సాధించాలంటే ఎన్డీపీ మద్దతు కీలకమని లిబరల్ పార్టీ భావించి ఉంటుందని సమాచారం. అందుకే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై జస్టిన్ ట్రూడో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: కెనడాకు షాకిచ్చిన భారత్.. ఐదు రోజుల్లో వెళ్లిపోవాల్సిందే.. -
కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు
న్యూఢిల్లీ: కెనడా విషయంలో భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్నీ స్పష్టం చేస్తూ దేశ ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యంగా ఉగ్రవాదంపై భారత్ దేశం ఎప్పుడూ రాజీ పడదని రాశారు. భారతదేశం తీవ్రవాదిగా ముద్ర వేసిన ఖలిస్థాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కెనడా వైఖరిపై భారత్ దీటుగా స్పందించింది. కెనడాలోని భారత దౌత్యాధికారిని బహిష్కరించిన నేపథ్యంలో భారత్ లోని కెనడా హైకమిషనర్ ని కూడా బహిష్కరించి ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కానీ కెనడా ప్రధాని తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌పై నిందలు వేస్తున్నారని వాస్తవానికి కెనడా ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని అణచడంలో విఫలమైందని ఫలితంగా ఖలిస్తానీ మద్దతుదారులు కెనడాలో ఉంటూనే భారత్‌లో హింసాకాండలకు పాల్పడుతున్నారని భారత ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 'ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న పోరాటంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ విశ్వసిస్తోందని ముఖ్యంగా ఉగ్రవాదం భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగిస్తుంది కాబట్టి దేశ ప్రయోజనాలకే ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వాలి' అని రాశారు भारतीय राष्ट्रीय कांग्रेस का हमेशा से मानना रहा है कि आतंकवाद के ख़िलाफ़ हमारे देश की लड़ाई में किसी भी तरह का कोई समझौता नहीं होना चाहिए। विशेष रूप से तब जब आतंकवाद से भारत की संप्रभुता, एकता और अखंडता को ख़तरा हो। हमारे देश के हितों और चिंताओं को हमेशा सर्वोपरि रखा जाना चाहिए।… — Jairam Ramesh (@Jairam_Ramesh) September 19, 2023 ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముఖద్వారం వద్ద ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది నిజ్జర్‌ను విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ హత్య తరువాత ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారతదేశంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాదంపైనా, భారత వ్యతిరేక కార్యకలాపాలపైనా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం అనేకమార్లు కెనడా ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేకపోయింది. చివరకు జీ20 సదస్సు సమయంలో కూడా కెనడా ప్రధానికి భారత ప్రధాని ఈ విషయంపై మందలించారు. దాని పర్యవసానమే భారత దౌత్యాధికారి బహిష్కరణ. భారత ప్రభుత్వం కూడా దీటుగా స్పందించడంతో కెనడా ఇరకాటంలో పడింది. ఇది కూడా చదవండి: కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఐదు రోజుల్లో వెళ్లిపోండి.. -
భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. రాయబారిపై వేటు
ఒట్టావా: కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారముందని అన్నారు. ఇదే ఏడాది జూన్‌లో సర్రేలోని గురుద్వారా ముఖద్వారం వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్‌లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే ఆ అధికారి పేరుని మాత్రం వెల్లడించలేదు. #BREAKING: Canadian Foreign Minister @melaniejoly says Canada has expelled a top Indian diplomat accusing India of killing a Khalistani radical Canadian Citizen. Canada is escalating a diplomatic standoff with India. Expect more fireworks in coming days. pic.twitter.com/IldOaOwow8 — Aditya Raj Kaul (@AdityaRajKaul) September 18, 2023 ఈ నేపథ్యంలో ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపిన కేసులో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని దీనికి సంబంధించి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. హత్యోదంతంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అని ప్రకటించారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమావేశాల సమయంలోనే ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర ప్రధాని ట్రూడో తెలిపారు. India Canada ties on the brink. Canadian PM Justin Trudeau accuses Indian govt of killing Khalistani leader Hardeep Singh Nijjar in the Canadian Parliament. pic.twitter.com/gXpMrWWuTf — Sidhant Sibal (@sidhant) September 19, 2023 భారత రాయబారిపై వేటు.. ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు. ఈ మేరకు టొరంటో మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఒట్టావాలోని భారత ఎంబసీ స్పందించలేదు. తీవ్రంగా ఖండించిన భారత్.. ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత్ జోక్యం ఉందంటూ ఆ దేశం అసంబద్ద, ప్రేరేపిత ఆరోపణలు చేస్తోంది. చట్టబద్దమైన పాలన పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలే చేశారు. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం. కెనడాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటివి జరగడం కొత్తేం కాదు. అలాంటి వాటిల్లోకి భారత ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలో నుంచి భారత వ్యతిరేక శక్తులను వెళ్లగొట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మేం మరోసారి కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. #WATCH | Canadian High Commissioner to India, Cameron MacKay leaves from the MEA headquarters at South Block, New Delhi. pic.twitter.com/zFAaTFfeAP — ANI (@ANI) September 19, 2023 ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం? -
భారత్-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్
ఒట్టావా: భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో ఆ చర్చలను తిరిగి ప్రారంభిచాల్సి ఉండగా తాజాగా మరోసారి ఇవి వాయిదా పడ్డాయి. భారత్‌తో జరగాల్సిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆదేశ వాణిజ్యశాఖ మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారని సదరుశాఖ అధికార ప్రతినిధి శాంతి కోసెంటినో తెలిపారు. అయితే వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగుచూసింది. సెప్టెంబర్9, 10 న భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ 20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాధినేతలతో ధైపాక్షక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఖలిస్థానీ సానుభూతిపరులకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని నేరుగా ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అక్కడ నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. -
చేజేతులా చేసుకున్నదే!
జీ20 ముగిసినా దాని ప్రకంపనలింకా తగ్గలేదు. ఢిల్లీ శిఖరాగ్ర సదస్సుకు హాజరై, భారత ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకున్న మిగతా ప్రపంచ నేతలందరికీ ఇది చిరస్మరణీయ అనుభవమేమో కానీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మటుకు ఇది పీడకలగా పరిణమించింది. భారత ప్రధాని నుంచి సాదర స్వాగతం అందకపోగా, ఖలిస్తానీ తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయకపోవడంపై ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్ ఆయనకు తలంటి పంపినట్టు వార్త. ఎలాగోలా సదస్సు ముగియగానే తిరుగు ప్రయాణం అవుదామంటే ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు. భారత్‌లో కెనడా ప్రధాని చేదు అనుభవాలన్నీ సొంత గడ్డపై ప్రతిపక్షాలకు కావాల్సినంత మేత ఇచ్చాయి. మంగళవారం ట్రూడో తిరుగు పయనమయ్యారు కానీ, భారత్ పర్యటనలో ఆయనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. భారత్ నుంచి పంజాబ్‌ను వేరుచేయాలని కోరుతున్న ఖలిస్తానీ ఉద్యమకారులు, వారి మద్దతు దార్లపై కెనడా మెతకగా వ్యవహరిస్తోందని భారత వాదన. ట్రూడో మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ తమ దేశీయ విధానమని సమర్థించుకుంటున్నారు. తమ అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందనేది కెనడా సర్కార్ ఆరోపణ. జీ20 వేళ ఆదివారం ట్రూడో, మోదీల మధ్య భేటీలో ఇరుపక్షాలూ తమ తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. భారత– కెనడా సంబంధాలు ఇటీవల అంత కంతకూ దిగజారుతున్నాయనడానికి ఆ భేటీ వార్తలే తార్కాణం. ఇరుదేశాల మధ్య చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందమూ నత్తనడకన సాగే ప్రమాదంలో పడింది. ఇది ఎవరికీ శ్రేయోదాయకం కాదు. గతంలో 2018లో ప్రధానిగా ట్రూడో తొలి భారత సందర్శన సైతం ఘోరంగా విఫలమైంది. శిక్ష పడ్డ తీవ్రవాదిని విందుకు ఆహ్వానించి, అప్పట్లో ఆయన గందరగోళం రేపారు. అప్పటితో పోలిస్తే, ఇప్పటి పర్యటన మరీ ఘోరం. కీలక మిత్రదేశాల నుంచి దూరం జరిగిన కెనడా, భారత్‌తో తనబంధాన్ని మరింత బలహీనపరుచుకుంది. వెరసి, ఈ ప్రాంతంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లు రెంటికీ కెనడా దూరమైంది. ఎన్నికల్లో జోక్యం, కెనడియన్ పౌరుల కిడ్నాప్, ఆర్థిక యుద్ధతంత్రం వగైరాల వల్ల చైనాకు దూరం జరగడం అర్థం చేసుకోదగినదే. కానీ, రాజకీయ కారణా లతోనే ట్రూడో భారత్‌ను దూరం చేçసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కెనడా జనాభా 4 కోట్ల యితే, భారత జనాభా 140 కోట్లు. కెనడా ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెట్టింపు. అలా చూస్తే, భారత్‌తో బంధం కెనడాకు అవసరం, లాభదాయకం. ఆ సంగతి ట్రూడో విస్మరించారు. మునుపటి ప్రధాని స్టీఫెన్ హార్పర్ హయాంలో ఢిల్లీతో వాణిజ్యాన్ని ఒటావా విస్తరించింది. వ్యవసాయ సామగ్రి, ఎరువులు, అణువిద్యుత్‌కు అవసరమయ్యే యురేనియమ్ భారత్‌కు కెనడా అందిస్తూ వచ్చింది. ట్రూడో హయాంలో ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఇటీవలే సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని ఆపేశారు. భారత్‌లో మోదీ విధానాలు కెనడాలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయని ట్రూడో భావన. అందుకే, వీలైనంత దూరం జరగాలని చూస్తున్నారు. కెనడాలో ఎక్కువగా ప్రవాసీ సిక్కులుండడంతో, వారి మద్దతుకై తంటాలు పడుతున్నారు. భారత్‌లో 2020 నాటి రైతుల ఆందోళనలపై ట్రూడో మాట్లాడుతూ ఇప్పుడు జీ20లో అన్నట్టే భావప్రకటన స్వేచ్ఛల్ని ప్రబోధించారు. తీరా కెనడాలో అలాంటి నిరసనలే ఎదురైతే, అత్యవసర చట్టం ప్రయోగించారు. మైనారిటీలపై మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని తప్పుపడుతున్న ట్రూడో కెనడాలో చేస్తున్నది అదే! అంతర్జాతీయ సంబంధాల్లో కెనడా ఇప్పుడు దోవ తప్పింది. ఐరాస భద్రతామండలి తాత్కాలిక సభ్యత్వం కోసం ఆ దేశం చేసిన గత రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 20వ శతాబ్దిలో శాంతి పరిరక్షణ ప్రయత్నాలకు మారుపేరుగా, ఐరాస శాంతిపరిరక్షక దళానికి సృష్టికర్తగా నిలిచిన కెనడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తని స్థితికి చేరింది. ఒకప్పుడు వర్ణవివక్షపై పోరాటంలో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటులో ముందుండి, మానవ భద్రతకై మందుపాతరల నిషేధ ఒప్పందం కావాలని కూడా పోరాడిన దేశం గత రెండు దశాబ్దాల్లో ఊహించని మార్గం పట్టింది. 2005 తర్వాత ఆ దేశం తన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోనే లేదు. దేశంలో, ప్రపంచ పరిస్థితుల్లో శరవేగంతో మార్పులు వచ్చినా ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రతిస్పందనతోనే విదేశాంగ వాహనాన్ని నెట్టుకొస్తోంది. ఫలితంగా ప్రపంచంలో కెనడా పేరుప్రతిష్ఠలే కాదు... ప్రభావమూ దెబ్బతింటోంది. తక్షణమే కెనడా విదేశాంగ విధానానికి దశ, దిశ కావాలని విశ్లేషకులు అంటున్నది అందుకే! గత ఇరవై ఏళ్ళలో డయాస్పొరా రాజకీయాలు, వ్యక్తిగత రాగద్వేషాలతో కెనడా విదేశాంగ విధానం తప్పటడుగులు వేస్తోంది. మధ్యప్రాచ్యంపై మునుపటి హార్పర్ ప్రభుత్వం, భారత్‌తో వ్యవహారంలో ఇప్పటి ట్రూడో సర్కార్ వైఖరి అందుకు మచ్చుతునక. చమురు, సహజవాయువు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో కెనడాది అగ్రపీఠం. అలాగే, యురేనియమ్, అనేక కీలక ఖనిజాలు అక్కడ పుష్కలం. దాన్ని సానుకూలంగా మలుచుకొని విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుకొనే అద్భుత అవకాశం ఉన్నా అక్కడి పాలకులు ఆ పని చేయట్లేదు. ఇప్పటికైనా కెనడా బయటి ఒత్తిళ్ళను బట్టి నడవడం మానాలి. దేశాన్ని కలసికట్టుగా నిలిపే స్పష్టమైన లక్ష్యాలను పౌరులకు అందించాలి. కీలక అంతర్జాతీయ అంశాల్లో తమ వైఖరిని స్పష్టం చేయాలి. భారత్‌తో బంధాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడంతో ఆ పనికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే, పాలకుల పనికిమాలిన చర్యల వల్ల కెనడాకు ఆర్థిక నష్టం కలిగితే అది పాలకుల పాపమే. ట్రూడో ఇకనైనా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వదిలి, విశ్వవేదికపై సమస్త కెనడియన్ల ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిది. -
ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా
న్యూఢిల్లీ: విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు భారత్‌ను వీడారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన.. మంగళవారం కెనడాకు బయల్దేరి వెళ్లారు. వాస్తవాడానికి ట్రూడో సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత సెప్టెంబర్ 10న (ఆదివారం) సాయంత్రం తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ ముందస్తు తనిఖీ సమయంలో ఆయన అధికారిక విమానంలో(ఎయిర్‌బస్ CFC001) సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు రోజులుగా భారత్‌లోనే చిక్కుకుపోయారు. దీంతో 36 గంటలపాటు ట్రూడో, ఆయన బృందం ఢిల్లీలోనే స్టే చేయాల్సి వచ్చింది. రెండు రోజుల అనిశ్చితి అనంతరం కెనడా ప్రధాని చివరకు నేడు(మంగళవారం) మధ్యాహ్నం 1.10 గంటలకు స్వదేశానికి బయలుదేరారు. ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్లు, ఇప్పుడు ఇది ఎగరడానికి సిద్ధంగా ఉందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడ్కోలు పలికారు. ట్రూడో క్షేమంగా కెనాడాకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి కెనడా ఎయిర్‌ఫోర్స్ మరో విమానం భారత్‌కు తరలిస్తున్న సమయంలో ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. ఇక కెనడా అధికారిక విమానాలు ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లో యూరోపియన్ యూనియన్‌తో చర్చల కోసం బెల్జియం బయల్దేరిన కెనడా ప్రధాని విమానంలో సాకేంతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ అయిన అరగంటలోనే తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. ఇక 2019 అక్టోబర్‌లోనూ ట్రూడో వీఐపీ విమానం ఓ గోడను పొరబాటున ఢీకొంది. అప్పట్లో దీని ముక్కుభాగం, కుడిభాగం ఇంజిన్ దెబ్బతింది. దీంతో ఆ విమానాన్ని పలు నెలలపాటు వాడకుండా పక్కకు పడేశారు. చదవండి: Monu Manesar: గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్ అదే ఏడాది డిసెంబర్లో ట్రూడో నాటో సమ్మిట్‌కు హాజరు కావడానికి బ్యాకప్ విమానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అయితే రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో లోపం ఉన్నట్లు గుర్తించినందున ఆ జెట్ కూడా లండన్‌లో నిలిచిపోయింది. వరుస షాక్‌లు ఇదిలా ఉండగా.. ట్రూడో భారత్ పర్యటన మొత్తం గందరగోళంగానే గడించింది. ఇందుకు ఆయన అందరితోనూ అంటీ ముట్టన్నట్లుగా వ్యవహరించడమే కారణం. అమెరికా, బ్రిటన్, భారత్, యూఏఈ దేశాల అధినేతలతో జస్టిన్ ట్రూడో కలవలేదు. ప్రధాన వేదికపై కూడా ఆయన కనిపించలేదు. చివరికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన విందులోనూ కూడా ఆయన కనిపించలేదు. ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు. ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలతో సరిగా కలవలేదని, ట్రూడోను ఎవరూ పట్టించుకోలేదని.. ఆయన్ను పక్కకు పెట్టారని అక్కడి పత్రికలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చదవండి: LIbiya: లిబియాలో పెను విపత్తు.. 2000 మందికిపైగా మృతి కాగా జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ ట్రూడో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని ఏకంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు.. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. -
తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. కెనడాకు మోదీ సూచన
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు. కెనడాలోని భారతీయుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. భారత దౌత్య కార్యాలయాలపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలతో, మాదక ద్రవ్యాల ముఠాలతో, మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారితో తీవ్రవాద శక్తులు అంటకాగుతున్నాయని, ఈ పరిణామం కెనడా భద్రతకు సైతం ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ అవాంఛనీయ ధోరణికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిన్ ట్రూడోకు సూచించారు. తీవ్రవాదులను ఏరిపారేయడానికి భారత్, కెనడా పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ, ట్రూడో ఆదివారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, కెనడాకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. విభిన్న రంగాల్లో భారత్–కెనడా సంబంధాలపై ట్రూడోతో విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. చదవండి: మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు: ట్రూడో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రశంసించారు. వాతావరణ మార్పులపై పోరాటం, ఆర్థిక ప్రగతి వంటి అంశాల్లో భారత్, కెనడా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కెనడాలో ఇటీవలి కాలంలో ఖలిస్తాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలు పెరగడంపై స్పందిస్తూ.. తమ దేశంలో హింసకు తావులేదని, విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకొనే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఎవరో కొందరు వ్యక్తుల చర్యలను మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించడం సరైంది కాదన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో ఖలిస్తాన్ తీవ్రవాదం ప్రస్తావనకు వచ్చిందని వెల్లడించారు. భారత్, కెనడా మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వివరించారు. -
కెనడా ప్రధాని ట్రూడో దంపతుల విడాకులు.. 18 ఏళ్ల వైవాహిక బంధం
టొరంటో: దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు బుధవారం ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగరీ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ జంట ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. వారు 2005 ఏడాదిలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అధికారంలో ఉంటూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన రెండో కెనడా ప్రధాని ట్రూడో. ఆయన తండ్రి, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కూడా విడాకులు తీసుకున్నారు. దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా పేరొందిన తండ్రి నుంచి జస్టిన్ రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్నారు. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. -
భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’
కెనడా: ఒకపక్క ఖలిస్థాన్ మద్దతుదారుల ఆకృత్యాలు పెరిగిపోతుంటే కెనడా ప్రభుత్వం చూసి చూసినట్టు వ్యవహరిస్తోందని భారత విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుబట్టారు. వారు చెప్పేదాంట్లో వాస్తవం లేదని తాము ఉగ్రవాద చర్యలపై ఎప్పుడూ కఠినంగానే వ్యవహరించామని అన్నారు. కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ బ్లూ 39వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీలో ప్రదర్శించిన ఖలిస్తానీలు ఇటీవల భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. జులై 8న ఖలిస్తానీల స్వేఛ్చ ర్యాలీ నిర్వహించనున్నట్లు దౌత్య కార్యాలయం ఎదుట పోస్టర్లను ప్రదర్శించారు. ఖలిస్తానీల చర్యలపై పలు అగ్రదేశాలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కెనడా ప్రధాని వైఖరిని తప్పుబట్టింది. ఖలిస్తానీలపై మెతక వైఖరి మన రెండు దేశాల సంబంధాలకే ప్రమాదమని చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వారు ఖలిస్థాన్ మద్దతుదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారు చెప్పేది వాస్తవం కాదు. కెనడా ఎప్పుడూ హింసను ప్రేరేపించే తీవ్రవాదం పైన కఠినంగానే వ్యవహరించింది. వ్యవహరిస్తుంది కూడా. దేశంలో అందరికీ భావ ప్రకటన స్వేఛ్చ ఉంటుందని అలాగే హింసను తీవ్రవాదంపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల ఖలిస్తానీలు భారత దౌత్య కార్యాలయంపై దాడికి కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి ప్రతి కదలికనూ గమనిస్తోందని మా పెరట్లో పాములు పడగ విప్పి బుసలు కొడుతున్నాయని ఎప్పుడు కాటేసి చంపుతాయన్నదే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న.. అని అన్నారు. ఇది కూడా చదవండి: నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు -
భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని
కెనడా: కెనడాలో బహిష్కరణ వేటుకు గురైన 700 మంది భారత విద్యార్థులకు భరోసానిచ్చారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. బహిష్కృత విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇందులో వారి తప్పేమీ లేదు. వారిని మోసం చేసినవారిని పట్టించేందుకు తగిన సాక్ష్యాధారాలను వారు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో భారత విద్యార్థులకు కొంత ఉపశమనం లభించినట్టయ్యింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం... కెనడాలో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగాల్లో చేరిన కొంత మంది విద్యార్థులు ఇటీవల శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోగా ఈ ఫేక్ ఆఫర్ లెటర్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫేక్ కసల్టెన్సీల చేతిలో మోసపోయిన సుమారుగా 700 మంది విద్యార్థులు తమ చేతిలో బహిష్కృత లెటర్లను పట్టుకుని కెనడా వీధుల్లోకి వచ్చారు. భారత విదేశాంగ శాఖ చొరవతో ఈ ప్రస్తావనను కెనడా పార్లమెంటరీ కమిటీలో ప్రవేశపెట్టగా వారంతా భారత విద్యార్థులకు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. వెంటనే విద్యార్ధులపై బహిష్కరణను తొలగించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ సందర్బంగా ఫేక్ ఆఫర్ లెటర్లను ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కన్సల్టెన్సీలపై చర్యకు తీసుకోవాలన్న బిల్లును కూడా సభ ఆమోదించింది. కెనడా ప్రధాని హామీ.. అంతకుముందు భారత సంతతికి చెందిన ఎంపీ జగ్మీత్ సింగ్ ఎవరో స్వార్ధపరులు చేసినదానికి విద్యార్థులను శిక్షించడం సరికాదు. దీనిపై స్పందించమని కోరగా కెనడా ప్రధాని స్వయంగా మాట్లాడుతూ.. విద్యార్థుల బహిష్కరణ వేటు అంశం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. విదేశాల నుండి వచ్చే విద్యార్థులు మా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు. ఇది కూడా చదవండి: రష్యా నుంచి.. మరో ఎయిరిండియా విమానంలో తరలింపు -
కెనడాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం
టొరంటో: చైనాకు చెందిన టిక్‌టాక్‌పై కెనడా నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన మొబైల్ పరికరాలు వేటిలోనూ దాన్ని వాడకూడదని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులెవరూ దీన్ని వాడొద్దని ఆదేశించింది. ప్రైవసీకి, భద్రతకు ఈ యాప్ వల్ల చాలా రిస్కుందని కెనడా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ధారించినట్టు ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ మోనా ఫోర్టియర్ తెలిపారు. ఇది ప్రారంభమేనని, మున్ముందు మరిన్ని చర్యలుంటాయని ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. డెన్మార్క్‌లో ప్రభుత్వ మొబైళ్లు తదితరాల్లో టిక్‌టాక్‌ను నిషేధించాలని పార్లమెంటు పేర్కొంది. అమెరికా నెల రోజుల్లోపు ప్రభుత్వ మొబైళ్లు తదితర పరికరాల్లో నుంచి టిక్‌టాక్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. -
విదేశీయులకు షాకిచ్చిన కెనడా
స్థిరాస్తుల (ఇళ్లు) కొనుగోళ్లు,అమ్మకాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1,2023 నుంచి రెండేళ్ల పాటు కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు. కోవిడ్ -19 కారణంగా 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పలువురు రాజకీయ నాయకులు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆ కొరత తగ్గించాలని కెనడీయన్లు ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఆ మరసటి ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాట బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీయే ట్రూడో రెండోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి సామాన్యుల వరకు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కొత్త చట్టంతో కెనడాలో ఇల్లు కొనుగోలు చేసే అవకాశం విదేశీయులు కోల్పోనున్నారు. వడ్డీ రేట్ల పెంపు కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (సీఆర్ఈఏ) లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2022లో ఇళ్ల ధరలు యావరేజ్‌గా $800,000 పెరిగాయి. ఆ తర్వాత 13శాతం తగ్గాయి. అదే సమయంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా మార్టిగేజ్ ఇంట్రస్ట్ రేట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి ఇళ్ల ధరలు 38శాతం పెరిగినట్లు నివేదించగా.. అమ్మకానికి ఉన్న గృహాల జాబితా ప్రీకోవిడ్ ముందుకు చేరాయని తెలిపింది. ఆందోళనలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఇళ్ల కొనుగోళ్లపై కెనడా ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయంపై ఆదేశ రియల్ఎస్టేట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం కెనడియన్లు, ప్రత్యేకించి వింటర్ సీజన్లో ఇక్కడ ఉన్న ఇళ్లను అమ్మేసి విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి, లేదంటే విదేశీయులు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటే మెక్సికో, యూఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. చివరిగా::: మోర్టిగేజ్లోన్ అంటే ఓ వ్యక్తికి సొంతంగా ఓ ఇల్లు ఉండి పోషణ నిమిత్తం మోర్టిగేజ్లోన్ పేరిట కొంత మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్‌గా తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు విఫలమైనా, లేదంటే మరణించినా.. మోర్టిగేజ్లోన్లో ఉన్న ఇంటిని బ్యాంక్ అధికారులు వేలంలో అమ్మేస్తారు. ఆక్షన్‌లో వచ్చిన మొత్తంలో ఎంత లోన్ ఇచ్చారో తీసుకొని మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. -
తప్పేముంది?.. చైనా అధ్యక్షుడికి స్ట్రాంగ్ కౌంటర్
బాలి: ఇండోనేషియా వేదికగా జరిగిన జీ-20 సదస్సుల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మధ్య కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది. సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ మీడియాకు విడుదల చేసింది కెనడా ప్రధాని కార్యాలయం. అయితే.. ఈ వ్యవహారాన్ని జిన్‌పింగ్ తప్పుబట్టారు. ట్రుడో సమక్షంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నివివరాలూ మీడియాకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదన్నారు. చర్చలు జరిపే పద్ధతే ఇది కాదన్నారు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదని వాదించారు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందామని జిన్‌పింగ్ కుండబద్దలు కొట్టారు. అయితే.. దానికి కెనడా ప్రధాని ట్రోడో గట్టి బదులే ఇచ్చారు. చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ కాదన్నారు. చర్చల్లో అన్ని అంశాలపై ఏకాభిప్రాయాలు కుదరవని, కొన్నింటికి సమ్మతి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇద్దరు నేతలూ మాట్లాడుకునేది కెనడా జర్నలిస్ట్ తన కెమెరాలో రికార్డ్ చేశారు. The Cdn Pool cam captured a tough talk between Chinese President Xi & PM Trudeau at the G20 today. In it, Xi express his displeasure that everything discussed yesterday “has been leaked to the paper(s), that’s not appropriate… & that’s not the way the conversation was conducted” pic.twitter.com/Hres3vwf4Q — Annie Bergeron-Oliver (@AnnieClaireBO) November 16, 2022 ఇక ఇరు దేశాల మధ్య మంగళవారం జరిగిన భేటీలో.. కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని ట్రుడో తప్పుబట్టారు. ఈ భేటీలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టు సమాచారం. అంతేకాదు.. 2019 ఎన్నికల సమయం నుంచి అనేక విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని కెనడా ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై ట్రుడో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనాను హెచ్చరించారు. ఈ వివరాలు కెనడా మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి. 2018లో కెనడాలో అమెరికా అరెస్ట్ వారంట్‌పై చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్ట్ చేసినప్పుడు చైనా మండిపడింది. ప్రతీకారంగా.. ఆ వెంటనే ఇద్దరు కెనెడా జాతీయులను గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఇప్పుడు జీ20 చర్చలకు ఒక రోజు ముందు కెనడా వాణిజ్య రహస్యాలను చైనాకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఓ చైనా జాతీయుడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై చైనా కూడా గుర్రుగా ఉంది. ఇదీ చదవండి: పోలండ్‌పైకి క్షిపణుల దాడి.. అదిరిపోయే ట్విస్ట్ -
కత్తులతో మారణకాండ.. 10మంది మృతి.. 15మందికి గాయాలు
ఒట్టావా: కెనడాలో ఇద్దరు దుండగులు కత్తులలో రెచ్చిపోయారు. సంప్రదాయ తెగలు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. కన్పించిన వారినళ్లా పొడుచుకుంటూ వెళ్లారు. మొత్తం రెండు ప్రాంతాల్లో 13 చోట్ల విధ్వంసం సృష్టించారు. ఈ మారణకాండలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. కెనడా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి దారుణ ఘటన జరగలేదు. అమెరికాలో మాత్రమే తరచూ మాస్ షూటింగ్‌లు, హత్యలు జరగుతుంటాయి. ఈ ఘటనపై కెనడా ప్రధాని ట్రుడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఇద్దరు నిందుతులు డెమియన్ సాండర్సన్(31), మైల్స్ సాండర్సన్(30) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వీరి ఫోటోలను కూడా విడుల చేశారు. అయితే నిందితులు ఏ కారణంతో దాడి చేసి ఉంటారనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. మృతులంతా జేమ్స్ స్మిత్ క్రీ నేషన్, వెల్డన్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌లో 3,400 మంది మాత్రమే నివసిస్తారు. వ్యవసాయం, వేట, చేపలు పట్టడమే వీరి వృత్తి. వెల్డన్‌లో 200మంది మాత్రమే జీవిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎవరినో లక్ష్యంగా చేసుకునే దుండృగులు ఈ కిరాతక చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. చదవండి: మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ప్రయోగం -
సంచలనం: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు ప్లాన్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు జరిగిన కుట్ర జరిగింది. ఈ హత్యకు పాల్పడాలని అనుకుంది ఎవరో కాదు.. యువ నటుడు ర్యాన్ గ్రాంథమ్(24). తల్లి హత్యకేసులో నిందితుడిగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ర్యాన్ గ్రాంథమ్.. ఈ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రివర్‌డేల్’, ‘డెయిరీ ఆఫ్ ఏ వింపీ కిడ్’ ఫేమ్ ర్యాన్ గ్రాంథమ్.. కెనడా ప్రధాని ట్రూడో హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. 2020 మార్చి 31వ తేదీన స్క్వామిష్ టౌన్హౌజ్లో తన ఇంట్లో తల్లి బార్బరాను తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసు బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తల్లిని హత్య చేసిన తర్వాత.. తన కారులో ఆయుధాలను, మందు గుండును, మ్యాప్ సాయంతో కెనడా రిడ్యూ కాటేజ్ వైపు బయలుదేరాడు గ్రాంథమ్. అక్కడే ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ విషయాన్ని పోలీసుల స్టేట్మెంట్లో గ్రాంథమ్ నిర్ధారించాడు కూడా. ఇదిలా ఉంటే.. గ్రాంథమ్ మానసిక స్థితి బాగోలేదని, చాలా కాలంగా డిప్రెషనలో ఉన్నాడని, ప్రధాని నివాసంలో తాను సృష్టించాలనుకున్న నరమేధం తాలుకా ట్రయల్స్‌లో భాగంగానే.. తల్లిని హతమార్చి ఉంటాడని ప్రాసెక్యూటర్ డోన్నెల్లీ కోర్టుకు వెల్లడించారు. అయితే తాను వాన్కోవర్ పోలీసులకు లొంగిపోవాలనే వెళ్లినట్లు నిందితుడి తరపున ప్రాసిక్యూటర్ వాదించారు. రివర్డేల్లోనూ ర్యాన్ పాత్ర ‘కిల్లర్’ కావడం గమనార్హం. -
పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా
ఒట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడా ఊహించని నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై నిషేధం విధించింది. పుతిన్‌తో పాటు మరో వెయ్యి మంది రష్యన్ జాతీయలు మీద(రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు ఉన్నారు) కూడా బ్యాన్ విధిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది కెనడా. రష్యా ఉక్రెయిన్ గడ్డపై పాల్పడుతున్న యుద్ధనేరాలకు ప్రతిగానే పుతిన్, ఆయన అనుచర గణం ఎంట్రీపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా.. పాశ్చాత్య దేశాల తరపున ఉక్రెయిన్‌కు మద్ధతు చెప్పిన నేతల జాబితాలో ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా చేరిపోయారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత.. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్లో కెనడా సైతం భాగమైంది. ఈ తరుణంలో రష్యా, ట్రూడోతో పాటు సుమారు 600 మంది కెనడా ప్రముఖులపై నిషేధం విధించింది. దీనికి ప్రతిగానే ఇప్పుడు ప్రత్యేక చట్టం ద్వారా పుతిన్ అండ్ కోపై నిషేధం విధించింది కెనడా. ఇదిలా ఉండగా.. ఈ నెల మొదట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్‌పై హఠాత్తుగా పర్యటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో.. ముందుగా ఇర్విన్ పట్టణాన్ని రష్యా బలగాలు నాశనం చేశాయి. అందుకే కెనడా ప్రధాని ట్రూడో ఇర్విన్‌లోనే పర్యటించారు. అక్కడి పౌరుల ఇళ్లు దెబ్బతినడంపై ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యి.. యుద్ధంలో ఉక్రెయిన్‌కు కెనడా మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించాడు కూడా. చదవండి: నియంతలు అంతం కాక తప్పదు: జెలెన్స్కీ -
కెనడాలో 2025 దాకా ట్రూడో చేతికే పగ్గాలు
టొరంటో: కెనడాలో జస్టిన్ ట్రూడో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్నారు. అధికార లిబరల్ పార్టీ, విపక్ష న్యూ డెమొక్రటిక్ పార్టీ్ట(ఎన్డీపీ) మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీనికి న్యూ డెమొక్రటిక్ పార్టీ ఓకే చెప్పాల్సి ఉందని సమాచారం. గత సెప్టెంబర్‌లో కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్ పార్టీ 338 స్థానాలకుగాను 159 చోట్ల గెలిచింది. అయితే మెజారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో జగ్మీత్సింగ్ నేతృతృంలోని విపక్ష ఎన్డీపీ మద్దతు ట్రూడో ప్రభుత్వానికి అవసరమైంది. 2015లో 43 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ట్రూడో రికార్డు సృష్టించారు. చదవండి: (Ukraine Russia War: రసాయన దాడి ఖాయం: బైడెన్) -
కెనడాలో ఎమర్జెన్సీ.. వారిపై కఠిన చర్యలు..
ఒట్టావా: కరోనా నిబంధనలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడాలో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర అధికారాల చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం ప్రకటించారు. దీనిప్రకారం నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే దీన్ని పరిమిత కాలం పాటు, కొద్ది ప్రాంతాల్లో, అవసరం మేరకే ఉపయోగిస్తామని ట్రూడో చెప్పారు. సైన్యాన్ని ప్రయోగించబోవడం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ట్రక్ డ్రైవర్లు రెండు వారాలకు పైగా సరిహద్దులను, ఒట్టావా వీధులను వాహనాలతో దిగ్బంధించారు. చదవండి: (ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు సిద్ధం: రష్యా) -
ఇది మంచి పద్ధతి కాదు.. ముగించాల్సిందే!
కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని.. దేశాలన్నీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఉధృతం చేస్తున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో వ్యతిరేక ఉద్యమం మొదలైంది. కానీ, ఈ ఉద్యమాన్ని ‘‘ఆమోదయోగ్యం కాదు” అని అంటున్నాడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. కెనడాలో ట్రక్కర్ల నిరసన చెయ్యి దాటిపోయింది. ఇంతకాలం దేశం మధ్యలో కొనసాగిన నిరసనలు.. ఇప్పుడు సరిహద్దుల దాకా చేరుకున్నాయి. సెంట్రల్ ఒట్టావాతో పాటు సరిహద్దులను సైతం మూసేస్తున్నారు నిరసనకారులు. పరిస్థితులు చేజారిన తరుణంలో.. ప్రధాని ట్రూడో సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ట్రక్కర్లు నిరసనకు సంఘీభావంగా విండ్సర్, యుఎస్ నగరం డెట్రాయిట్ మధ్య అంబాసిడర్ బ్రిడ్జ్ దిగ్బంధనంలో ఎక్కువ మంది వ్యక్తులు చేరడంతో.. ఈ చేష్టలు కెనడా ఆర్థిక పునరుద్ధరణకు ముప్పు కలిగిస్తుందని ట్రూడో హెచ్చరిస్తున్నారు. ‘‘దిగ్బంధనాలు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలు ఆమోదయోగ్యం కాదు. వ్యాపారాలు, తయారీదారులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి” అని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని ట్రూడో ప్రసంగించారు. దిగ్బంధనాలతో మహమ్మారిని అంతం చేయలేం.. సైన్స్‌తోనే అంతం చేయడం వీలవుతుంది. ప్రజారోగ్య చర్యలతో దీనిని ముగించాలి అని ట్రక్కర్లను ఉద్దేశించి ప్రసంగించారాయన. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి ఏం చేయాలో అది ప్రతీదీ చేసుకుంటూ పోతాం అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. కెనడియన్ రాజధాని ఒట్టావాలో రెండు వారాల పాటు సాగిన ట్రక్కర్లు నిరసనకు సంఘీభావంగా విండ్సర్ డెట్రాయిట్ మధ్య అంబాసిడర్ బ్రిడ్జ్ దిగ్బంధనం వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ట్రేడ్ కారిడార్‌గా ఉన్న ఈ వంతెన గుండా నిత్యం 40వేల మంది రాకపోకలు చేస్తుంటారు. దాదాపు 323 మిలియన్ డాలర్ల విలువైన సరుకుల రవాణా సాగుతుంటుంది. కోవిడ్ ఆరోగ్య నిబంధనలపై కోపంతో సరిహద్దు వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తే.. ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన కెనడా, మరింత దిగజారిపోక తప్పదని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అంతకుముందు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ.. వంతెన దిగ్బంధనంపై కెనడియన్ సరిహద్దు ఏజెన్సీలతో యుఎస్ అధికారులు టచ్‌లో ఉన్నారని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. -
ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు
ఒట్టోవా: దేశంలో జరుగుతున్న టీకా వ్యతిరేక నిరసనలపై మిలటరీని ప్రయోగించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభిప్రాయపడ్డారు. నిరసనలపై మిలటరీ ప్రయోగం సహా అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని గతంలో పోలీసులు చెప్పారు. అయితే ట్రూడో మాత్రం ఇప్పట్లో ఆ అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్‌కు, కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది జరుపుతున్న నిరసనలతో కొన్ని వారాలుగా కెనెడా సతమతమవుతోంది. ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ట్రంప్ లాంటి వారి మద్దతు కూడా లభించింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వాలు సాయం కోరితే అప్పుడు మాత్రమే మిలటరీ ఉపయోగంపై ఆలోచిస్తామని ట్రూడో తెలిపారు. చదవండి: భారత్‌తో సంబంధాలపై ఉక్రెయిన్ ప్రభావం లేదు -
ట్రూడో టార్గెట్‌గా ఆందోళనలు
టొరెంటో: కరోనా టీకా తప్పనిసరి నిబంధన, కోవిడ్ నిబంధనల పాటింపును వ్యతిరేకిస్తున్నవారి నిరసనలు కెనెడాలో పెరిగిపోయాయి. ఆందోళనకారులు రాజధాని నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్ హిల్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కొందరు నిరసనకారులు జాతీయ మృతవీరుల స్మారకాన్ని అవమానించడం, సైనికుల సమాధిపై డ్యాన్సులు చేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఆందోళనకారులు స్వస్తిక్ గుర్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వీరికి దేశీయుల నుంచి పెద్దగా సానుభూతి లభించకున్నా వీరు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు. ఇలాంటివారి సంఖ్య స్వల్పమని, అబద్ధాలను వీళ్లు ప్రచారం చేస్తున్నారని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో దుయ్యబట్టారు. కేవలం టీకా తప్పనిసరి నిబంధనలు ఎత్తివేయడంతో తమ నిరసన ఆగదని, ట్రూడో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్లో చాలా నిబంధనలను ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు విధించినా నిరసనకారులు మాత్రం ట్రూడో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. -
కెనడా ప్రధానికి కరోనా.. ఇంకా అజ్ఞాతంలోనే!
టొరెంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కరోనా సోకింది. అయితే తనకు బాగానే ఉందని ట్రూడో సోమవారం ప్రకటించారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. పబ్లిక్ హెల్త్ నింబంధనలు పాటిస్తూ.. వారం రోజులపాటు దూరంగా ఉంటూనే పనిచేస్తానని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ట్విటర్లో తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఇంకా కరోనాతో పోరాటం ముగిసిపోలేదు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో కొంతమంది చేస్తున్న నిరసనలు బాధకరమని తెలిపారు. అలాంటి ప్రవర్తనకు దేశంలో చోటులేదని ఓ రహస్య ప్రాంతం నుంచి ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు. దేశంలో ప్రజల నిరసనల నేపథ్యంలో ప్రధాని ట్రూడో.. భార్య పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియరాలేదు. జస్టిన్ ట్రూడోపై సోషల్ మీడియాలో నేటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. కెనడా దేశంలో ప్రజలకు కరోనా వాక్సిన్ తప్పనిసరి చేయడంపై అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రజలు పెద్ద ఎత్తున ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని జస్టిన్ ట్రూడో అజ్ఞాతంలోకి వెళ్లారు. This morning, I tested positive for COVID-19. I’m feeling fine – and I’ll continue to work remotely this week while following public health guidelines. Everyone, please get vaccinated and get boosted.— Justin Trudeau (@JustinTrudeau) January 31, 2022 -
రహస్య ప్రదేశంలోకి కెనడా ప్రధాని?!
ఒట్టోవా: దేశరాజధానిలోని అధికారిక నివాసం నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించాయని మీడియా కథనాలు వెల్లడించాయి. దేశంలో కరోనా టీకా తప్పనిసరని వ్యతిరేకించే నిరసనకారులు భారీగా రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు ప్రధానిని, ఆయన కుటుంబాన్ని రహస్యప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది. ‘‘ఫ్రీడం కాన్వాయ్’’ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా పలువురు ట్రక్కు డ్రైవర్లు భారీ ట్రక్కులతో రాజధానికి ర్యాలీగా బయలుదేరారు. సరిహద్దుల నుంచి దేశంలోకి వచ్చే ట్రక్కు డ్రైవర్లకు తప్పక టీకా సర్టిఫికెట్ ఉండాలని కెనెడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పలువురు ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా నిబంధనలను వ్యతిరేకించేవారు ఈ ట్రక్కర్లకు మద్దతునిస్తున్నారు. వీరంతా శనివారం భారీ సంఖ్యలో రాజధానికి చేరారు. టీకా తప్పనిసరి నిబంధనలు, ప్రజారోగ్య నిబంధనలు తొలగించాలని వీరు డిమాండ్ చేస్తున్నారని సీబీసీ(కెనెడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) తెలిపింది. నిరసనకారులు ట్రూడోకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని మెయిల్ న్యూస్ తెలిపింది. యుద్ధవీరుల స్మారకానికి అవమానం నిరసనకారుల్లో కొందరు ప్రఖ్యాత వార్ మెమోరియల్పైకి ఎక్కి డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. దీన్ని కెనడా మిలటరీ ఉన్నతాధికారి జనరల్ వేన్ ఈరె, రక్షణ మంత్రి అనితా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. సైనికుల సమాధులపై నిరసనకారులు నృత్యాలు చేయడం తనను ఎంతో బాధిస్తోందని వేన్ చెప్పారు. తరాల క్రితం సైనికులు పోరాడింది ప్రజల హక్కుల కోసమని, ఇలాంటి నిరసనల కోసం కాదని హితవు పలికారు. వీరంతా సిగ్గుతో తలవంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన సమర్థనీయం కాదని అనితా ఖండించారు. ఇవి కెనడియన్లకు పవిత్ర స్థలాలని, దేశం కోసం పోరాడినవారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. రాజధాని వీధుల్లో దాదాపు పదివేల మంది చేరిఉండొచ్చని, భారీగా హింస జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని గతంలోనే ప్రధాని ట్రూడో అనుమానం వ్యక్తం చేశారు. అయితే నిరసనకారులు చాలా స్వల్పమని, మెజార్టీ దేశస్తులు వీరితో ఏకీభవించరని చెప్పారు. ఇస్లామోఫోబియాను వ్యతిరేకిద్దాం! దేశంలో పెరిగిపోతున్న ముస్లిం వ్యతిరేకత సహించరానిదని ప్రధాని ట్రూడో అభిప్రాయపడ్డారు. దేశంలో పెరిగే ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తామని ఆదివారం ప్రకటించారు. కెనడా ముస్లింల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు ముగింపు పలకాలని, తద్వారా వారికి రక్షణ కల్పించాలని కోరారు. దేశంలోని ముస్లిం సమాజానికి భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని క్యుబెక్ సిటీ మసీదుపై దాడి జరిగి ఐదేళ్లవుతున్న సందర్భంగా పాటించే నేషనల్ డే రోజున ప్రభుత్వం ప్రకటించింది. ట్రూడో ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. -
ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని
కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతంలోని తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. ఈ సంఘటన మనసుని కదిలించే" విషాదంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూడో శుక్రవారం మాట్లాడుతూ... "అమెరికా సరిహద్దుల గుండా ప్రజల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం. మానవ అక్రమ రవాణాదారుల బాధితులు...మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే కోరిక నెరవేరకుండానే ఆ కుటుంబం అలా చనిపోవడం చాలా విషాదకరం. ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిచేసేలా తాము చేయగలిగినదంతా చేస్తున్నాం." అని అన్నారు. పైగా కెనడా స్మగ్లింగ్‌ను ఆపడానికి , ప్రజలకు సహాయం చేయడానికి యునైటెడ్ స్టేట్స్తో కలిసిపనిచేస్తోందని ట్రుడో చెప్పారు. అక్రమ వలసదారులు సాధారణంగా అమెరికా నుండి కెనడాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని కెనడియన్ అధికారులు వెల్లడించారు. అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత నుంచే కెనడాలోకి కాలినడకన సరిహద్దు దాటడం పెరిగిందని తెలిపారు. ఈ మేరకు గురువారం మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) నలుగురి మృతదేహాలను దక్షిణ మధ్య మానిటోబాలోని ఎమర్సన్ ప్రాంతానికి సమీపంలో యుఎస్ కెనడా సరిహద్దులోని కెనడియన్ వైపు కనుగొన్నాం అని చెప్పారు. అయితే మృతులంతా గుజరాత్‌కి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు అని, తీవ్రమైన చలికి గురికావడం వల్లే మరణించారని తెలిపారు. ఈ మేరకు ఆర్సీఎంపీ నాలుగు మృతదేహాలను కనుగొన్న వెంటనే అసిస్టెంట్ కమిషనర్ జేన్ మాక్‌లాచీ దీనిని హృదయ విదారక విషాదంగా పేర్కొన్నారు. పైగా మంచుతుఫానులో ఈ కుటుంబం చిక్కుకున్నట్లు తాము గుర్తించాం అని చెప్పారు. ఈ మేరకు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా మరణించిన వారి జాతీయతను ధృవీకరించడమే కాక, ఈ సంఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు. అంతేకాదు బిసారియా మాట్లాడుతూ...ఇది ఘోరమైన విషాదం. సమన్వయ సహాయం కోసం భారత కాన్సులర్ బృందం మానిటోబాకు వెళ్లనుంది. ఈ ఆందోళనకరమైన సంఘటనలను పరిశోధించడానికి మేము కెనడియన్ అధికారులతో కలిసి పని చేస్తాము" అని బిసారియా ట్వీట్ చేశారు. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్..) -
హ్యాట్రిక్ కొట్టిన ట్రూడో
టొరాంటో: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంటు ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. అయితే మెజార్టీ సీట్లు సాధించాలన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రపంచంలో మరే దేశం సాధించలేని విధంగా కరోనా కొమ్ములు వంచిన ఆయన దానినే ఎన్నికల అస్త్రం చేసుకొని రెండేళ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈ సారి మెజార్టీ ప్రభుత్వం ఏర్పడితే విధాన పరమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవచ్చునని ఆశించారు. కానీ ఇంచుమించుగా 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. 338 స్థానాలున్న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార లిబరల్ పార్టీ 156 స్థానాలను గెలుచుకోగా, కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకు పరిమితమైనట్టుగా ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మేజిక్ మార్కు 170 దాటుతుందనుకున్న ట్రూడో ఆశలు నిరాశయ్యాయి. 27 స్థానాలను దక్కించుకున్న న్యూ డెమొక్రాటిక్ పార్టీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ప్రధాని జస్టిన్ ట్రూడో థాంక్యూ కెనడా అంటూ వినమ్రంగా ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ముందస్తు ఎన్నికలతో కెనడా ప్రజలపై ఎన్నికలు ఆర్థిక భారాన్ని మోపడం మినహా ప్రయోజనమేదీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎన్నికలకు వెళ్లి ట్రూడో సాధించిందేమిటో చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఓటమి అంగీకరించిన ఎరిన్.. ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు ఎరిన్ ఒ టూలే తన ఓటమిని అంగీకరించారు. మూడోసారి ప్రధాని అయిన ట్రూడోని అభినందించారు. అయితే ఎన్నికల్లో ఆయన ట్రూడోకి గట్టి పోటీయే ఇచ్చారు. -
ముందస్తు మంత్రం ఫలిస్తుందా?
ఒట్టావా: కెనడా పార్లమెంటుకి రెండేళ్లు గడువు ఉండగానే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 20న (సోమవారం) జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కఠినమైన ఆంక్షల్ని విధించి కరోనా మహమ్మారి కొమ్ములు వంచిన దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అదే తనని మళ్లీ విజయతీరాలకు నడిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. కరోనాని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకొని కన్జర్వేటివ్ నాయకుడు ఎరిన్ ఒ టూలే ఢీ అంటే ఢీ అంటున్నారు. కెనడాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా ప్రకటిస్తారు. కానీ, ఈసారి కరోనా ముందు జాగ్రతల్లో భాగంగా భౌతికదూరం పాటించాలని ఎక్కువ మంది ఓటర్లు మెయిల్ ఇన్ ఓటు విధానాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకీ ముందస్తు ఎన్నికలు 338 స్థానాలున్న కెనడా పార్లమెంటులో లిబరల్ పార్టీకి ప్రస్తుతం 155 మంది సభ్యుల బలమే ఉంది. ఇతర పార్టీలతో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ప్రధాని ట్రూడో కీలక నిర్ణయాలకి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నందుకు ప్రజలు ఆదరిస్తారని, అత్యధిక సీట్లు సాధించి మెజార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలన్న ఆశతో ట్రూడో రెండేళ్లు గడువు ఉండగానే ఎన్నికలకు వెళుతున్నారు. ఆగస్టు 15న ట్రూడో ముందస్తు ఎన్నికపై ప్రకటన చేస్తూ కోవిడ్‌ని తరిమికొట్టినవారే దేశ పునర్నిర్మాణాన్ని చేయగలరంటూ పిలుపునిచ్చారు. 2015లో తొలిసారిగా నెగ్గిన ట్రూడో హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. గట్టిపోటీ ఇస్తున్న ఎరిన్ ట్రూడోకి కన్జర్వేటివ్ పార్టీ నేత ఎరిన్ ఒ టూలే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కెనడాలో ఈ మధ్య మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో దానిని ఎన్నికల సభల్లో ఎరిన్ ప్రస్తావిస్తున్నారు. ‘‘కోవిడ్ ఫోర్త్‌వేవ్ ముంగిట్లో ఉన్నాం. ఈ సమయంలో ఎన్నికలకు వెళితే మళ్లీ కేసులు పెరిగిపోతాయి. పరిస్థితి మొదటికొస్తుంది. అదే నాకు ఆందోళనగా ఉంది’’అంటూ ఎరిన్ పదే పదే చెబుతూ ఓటర్ల మైండ్‌సెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు ప్రకటించిన సమయంలో అధికార లిబరల్స్కి 35.6% ఓటర్ల మద్దతు ఉందని, కన్జర్వేటివ్స్‌కి 28.8% ఓటర్ల మద్దతు ఉందని సీబీసీ న్యూస్ పోల్ ట్రాకర్‌లో వెల్లడైతే, తాజాగా.. లిబరల్స్కి 31.6%, కన్జర్వేటివ్లకి 31.1% మంది ఓటర్ల మద్దతు ఉందని తేలింది. అయితే ఎవరు నెగ్గినా మెజార్టీ స్థానాలు దక్కవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. బరిలో 49 మంది భారతీయులు కెనడా ఎన్నికల్లో మనోళ్లు కూడా సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కెనడియన్లు 20 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అందులో నలుగురు ట్రూడో ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఈసారి 49 మంది ప్రవాస భారతీయులు ఎన్నికల బరిలో నిలిచారు. లిబరల్ పార్టీ నుంచి 15 మంది, కన్జర్వేటివ్ పార్టీ నుంచి 16 మంది ఉండగా ఇతర పార్టీలు కూడా భారతీయులకు టిక్కెట్లు ఇచ్చాయి. -
రెచ్చిపోయిన నిరసనకారులు: కెనడా ప్రధానిపై రాళ్ల దాడి
ఒట్టావా: కెనడాలో నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై రాళ్ల దాడి చేశారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధానిపై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు రాళ్లు విసిరారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన కెనడాలోని ఒంటారియాలో చోటుచేసుకుంది. కెనడాలో వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేశారు. అయితే ఆ దేశంలో వ్యాక్సిన్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. చదవండి: జైలులో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి ఈ క్రమంలో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఒంటారియోలో ఎన్నికల సభకు పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో వ్యాక్సిన్ వ్యతిరేకులు ప్రధాని కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. ఈ సమయంలో రెచ్చిపోయి చిన్న చిన్న రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ప్రధాని సురక్షితంగా బయటపడగా ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడిపై ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. ‘నా భుజంపై కొన్ని చిన్న రాళ్లు తగిలాయి. అయితే ఈ దాడితో నేను బెదరడం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ దాడిపై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించి ప్రధానిపై దాడిని ఖండించారు. అయితే దాడికి పాల్పడడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని నిబంధన విధించడమేగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాలని ప్రధాని ట్రూడో ఆందక్షలు విధించారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా తప్పనిసరి చేశారు. అయితే దీనికి కొందరు ‘యాంటీ వ్యాక్సిన్’ ఉద్యమం లేవనెత్తారు. ఆందోళనకారులు వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రధానిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది. సెప్టెంబర్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ట్రూడో పార్టీకి ప్రతికూల ప్రభావం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. -
కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న వ్యక్తి నామినేట్
టొరంటో: కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న న్యాయమూర్తి జస్టిస్ మొహ్మద్ జమాల్‌ను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నామినేట్ చేశారు. కెనడా సుప్రీం కోర్టుకు నామినేట్ అయిన మొదటి శ్వేతేతర వ్యక్తి జమాల్ కావడం విశేషం. ప్రస్తుతం పదవీ విర మణ చేయనున్న రోసాలీ సిలబెర్ మాన్ అబెల్లా స్థానంలో జమాల్ తన విధులు నిర్వర్తి స్తారని ట్రూడో స్పష్టం చేశారు. దేశ ఉన్నత న్యాయస్థానంలో జమాల్ తన విధు లను చక్కగా నిర్వర్తిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఆయన్ను నామినే ట్ చేయడం కూడా సంతోషంగా ఉందని చెప్పారు. జమాల్ 1981లో కెన్యాలో పుట్టినప్పటికీ, ఆయన మూలాలు భారత్‌లో ఉన్నాయి. చదవండి: ఇరాన్లో ఎలక్షన్.. హైదరాబాద్‌లో ఓటింగ్ -
మూసేసిన స్కూల్లో పిల్లల అస్థిపంజరాలు లభ్యం
ఒట్టోవా: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమ్లూప్స్ ఇండిజీనియస్ రెసిడెన్షియల్ స్కూల్లో సుమారు 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడడం కలకలం రేపింది. కాగా 1978లోనే ఈ పాఠశాలను మూసేశారు. తాజాగా బయటపడిన అవశేషాల్లో ఎక్కువ మంది మూడేళ్ల లోపు పిల్లలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భూమిలోకి చొచ్చుకుపోయే ఒక ప్రత్యేకమైన రాడార్ సాయంతో పిల్లల అస్థిపంజరాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇది చాలా బాధకరమైన సంఘటన అని.. సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2015లో ట్రూత్ అండ్ రీకాన్సిలేషన్ అనే ఒక కమిటీ ఈ స్కూల్‌పై అధ్యయనం చేపట్టింది. ఆ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగుచూడడం అప్పట్లో సంచలనంగా మారింది. 1840 నుంచి 1978 మధ్యలో పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేసి క్రిస్టియన్ చర్చిలు ఆధ్వర్యంలో నడుసున్న కమ్లూప్స్ పాఠశాలలో చేర్పించేవారు. అలా దాదాపు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడేవారని ఒక రిపోర్టులో బయటపడింది. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు 3200 మంది చనిపోయారని.. అందులో 215 మంది పిల్లలను స్కూల్ గ్రౌండ్‌లోనే ఖననం చేసినట్లు తేలింది. చిన్నపిల్లల మృతికి సంతాపంగా నివాళి ప్రకటిస్తున్న కెనడా ప్రజలు అయితే 2008లో కెనడా ప్రభుత్వం అప్పట్లో ఈ ఘటనపై క్షమాపణలో కోరింది. ఇక ఈ విషయంపై 2015 నుంచి ఆరేళ్లుగా దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటీష్ కొలంబియా కార్యాలయంతో కలిసి విచారణ చేస్తున్నామని.. బయటపడ్డ పిల్లల అస్థిపంజరాలను భద్రపరుస్తామని వారు తెలిపారు. చదవండి: ప్రియురాలితో బోరిస్ రహస్య వివాహం! అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి -
విదేశీ సంబంధాలపై బైడెన్ దృష్టి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని బైడెన్ చెప్పారు. కెనడా ప్రధానితో పాటు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడర్తో బైడెన్ మాట్లాడారు. ఈ వారంలో మరికొంత మంది విదేశీ నాయకులతో బైడెన్ మాట్లాడతారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రిగా నల్లజాతీయుడు అస్టిన్ అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. అగ్రరాజ్యానికి నల్లజాతీయుడు ఒకరు రక్షణ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్ రక్షణ మంత్రిగా అస్టిన్ నామినేషన్‌ను రికార్డు స్థాయిలో 93–2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్ టామ్ మూయిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్ విధుల్లో చేరారు. ట్రంప్ అభిశంసనపై ఫిబ్రవరి 8న సెనేట్‌లో విచారణ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై ఫిబ్రవరి 8నుంచి సెనేట్‌లో విచారణ మొదలు కానుంది. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పి అరాచకం సృష్టించడమే కాకుండా అయిదు నిండు ప్రాణాలు బలైపోవడానికి పరోక్షంగా కారణమవడంతో ట్రంప్‌పై ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానిని ప్రతినిధుల సభ ఆమోదించడం తెలిసిందే. ట్రంప్ ప్రస్తుతం గద్దె దిగిపోయినప్పటికీ అభిశంసన ప్రక్రియను అధికారికంగా ముగించాలన్న గట్టి పట్టదలతో డెమొక్రాట్లు ఉన్నారు. ఫిబ్రవరి 8 సోమవారం సభ ప్రారంభం కాగానే ట్రంప్ అభిశంసనే ప్రధాన ఎజెండగా ఉంటుంది. ఆయనపై నమోదు చేసిన అభియోగాలను చదువుతారు. ఆ మర్నాడు కొత్త సెనేట్ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 100 మంది సభ్యుల బలం ఉండే సెనేట్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు సరిసమానంగా చెరి 50 స్థానాలున్నాయి. సెనేట్ చైర్మన్, దేశ ఉపాధ్యక్షురాలు కమల ఓటుతో డెమొక్రాట్లదే సభలో ఆధిక్యం ఉంటుంది. -
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్‌పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్‌షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్‌లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
కెనడా ప్రధాని వ్యాఖ్యలు: భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా తలదూర్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి చర్యలు ఇకపై కొనసాగితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో కెనడా హైకమిషనర్‌కు ఆ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను తెలియజేసింది. ( తల్లి మాటతో.. కోట్లు సంపాదించాడు ) కెనడాలోని భారత కమిషన్, కౌన్సిలేట్ల ముందు ఉగ్రవాద కార్యాకలాపాల సమావేశాలను ప్రోత్సహించటం శాంతి, భద్రతలకు ముప్పవుతుందని తెలిపింది. కాగా, గత సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై మాట్లాడుతూ.. ‘‘ శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’’ అని అన్నారు. (ఆ బాధను అర్థం చేసుకోగలను: ట్రూడో) -
ఆ బాధను అర్థం చేసుకోగలను: ట్రూడో
ఒట్టావా/న్యూఢిల్లీ: ‘‘శాంతియుత నిరసన హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతునిస్తుంది’’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు సంఘీభావం తెలిపారు. ‘‘ఇండియాలో రైతు నిరసనల గురించి వస్తున్న వార్తలు వింటున్నాం. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా ఉన్నారోనన్న విషయం మనల్ని కలవరపెడుతుంది. మీ అందరి మనసుల్లో చెలరేగుతున్న కల్లోలం గురించి నేను అర్థం చేసుకోగలను. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాళ్లకు మనం అండగా ఉన్నాం’’ అంటూ సిక్కు సోదరులకు అభయమిచ్చారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ ఈవెంట్లో జస్టిన్ ట్రూడో ప్రసంగించారు. ఈ మేరకు.. ‘‘ఒక సమస్య గురించి చర్చించడం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఈ విషయం గురించి భారత అధికారులతో మాట్లాడి మన ఆందోళనను తెలియజేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇది’’ అని ట్రూడో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.(చదవండి: చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం) వేలాది మంది పంజాబ్, హరియాణా నుంచి ఢిల్లీకి పయనమై కేంద్రానికి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. అనేక పరిణామాల అనంతరం ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం వారితో మట్లాడి సమస్యలకు పరిష్కారం కనుగొంటామని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కాగా దేశ రాజధానిలో భారత రైతులు చేస్తున్న నిరసనపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం. (చదవండి: ఆస్తుల వెల్లడిలో రిషి సునక్‌పై పలు అనుమానాలు) View this post on Instagram A post shared by World Sikh Organization (@worldsikhorg) -
కరోనా సోకిన అగ్ర నేతలు వీరే !
ఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. ఈ జాబితాలో సామాన్య ప్రజలే కాదు అగ్రరాజ్యాల అధిపతులు సైతం కరోనా మహమ్మారికి అతీతం కాదు. ప్రపంచ దేశాల్లో కరోనా బారినపడ్డ నేతలు ఎవరెవరో తెలుసుకుందామా... డొనాల్డ్ ట్రంప్: కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి మాస్క్ పెట్టుకోకుండా తిరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు మాస్క్ పెట్టుకోక తప్పలేదు. అక్టోబర్ 1న ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. 'వాల్టర్ రీడ్'లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. క్వారంటైన్‌కు వెళ్లి నాలుగు రోజులు కూడా ఉండకుండా తిరిగి 'వైట్‌హౌస్'కు చేరుకున్నాడు. ఐతే ఈ సారి మాస్క్ పెట్టుకొని కనిపించారు. తన కారులో మాస్క్ ధరించి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. జాన్ బోరిస్: బ్రిటన్ ప్రధాని 'జాన్ బోరిస్'కు ఏప్రిల్ 5న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఏప్రిల్ 9 వరకు ఐసీయూలో చికిత్స పొందాడు. కొన్ని రోజులకు పూర్తిగా కోలుకున్నారు. జైర్ బొల్సొనారో: బ్రెజిల్ అధ్యక్షుడు 'జైర్ బొల్సొనారో'కు జూలై 7న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. జీయనైన్ ఆనెస్: బొలివియా తాత్కాలిక అధ్యక్షురాలు 'జీయనైన్ ఆనెస్'కు జూలై 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 'సెల్ఫ్ ఐసోలేషన్'లో ఉంటూ చికిత్స పొందారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకున్నారు. అమిత్ షా: భారత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. సోఫియా గ్రెగోర్ ట్రూడాయ్: కెనడా ప్రధాని 'జస్టిన్ ట్రూడాయ్' సతీమని సోఫియాకు మార్చిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 'సెల్ఫ్ ఐసోలేషన్'లో ఉంటూ చికిత్స పొందారు. (ఇదీ చదవండి: ట్రంప్ మరో ప్రధాన సలహాదారుడుకి పాజిటివ్) -
వ్యాక్సిన్ అందరికీ పంచాలి: ట్రూడో
న్యూఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న దేశాల్లో కెనడా కూడా చేరింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణకొరియా, ఇథియోపియా సహా మరో మూడు దేశాలకు చెందిన దేశాధినేతలతో కలిసి రాసిన ఆర్టికల్ వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైంది. (కరోనా వ్యాక్సిన్‌పై ‘ఆక్స్ఫర్డ్’ ముందడుగు!) ‘వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడతాయి. అందుకోసమే ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నా.. అది అందరికీ చేరాలి’ అంటూ ట్రూడో ట్వీట్ కూడా చేశారు. ఈ మేరకు తనతో పాటు ఆర్టికల్ రాసిన ఇతర దేశాధినేతలను ట్యాగ్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్–19 వ్యాక్సిన్ మానవ ప్రయోగాల్లో మూడో దశకు, ప్రాథమిక టెస్టుల్లో మోడర్నా వ్యాక్సిన్ పని తీరు మెరుగ్గా ఉందని వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రూడో ఈ కామెంట్లు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా వ్యాక్సిన్లను కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నారు. (మార్చి నెలకు ఆరు కోట్ల కేసులు..!) -
చైనాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం
ఒట్టావా: పరస్పర ప్రతివిమర్శలతో కెనడా, చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో హంకాంగ్‌పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా కెనడా ‘అప్పగింత ఒప్పందాన్ని’ రద్దు చేసింది. అలాగే మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం-రెండు విధానాలు’ అన్న పద్దతిని తాము పాటిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హంకాంగ్‌కు మిలిటరీ వస్తువుల ఎగుమతిని రద్దు చేస్తూ.. కెనడా నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మిలిటరీ వస్తువులు చైనా ప్రధాన భూభాగం కోసం వినియోగించబడుతున్నట్లు కెనడా అనుమానిస్తోంది. అందువల్లే మా విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత అంశంలో ఇది ఎంతో ముఖ్యమైన నిర్ణయం’ అన్నారు ట్రూడో. అయితే ‘అప్పగింత ఒప్పందాన్ని’ రద్దు చేయడంపై హాంకాంగ్ అధికారులు నిరాశ వ్యక్తం చేశారు. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా') కెనడా, చైనా మధ్య సంబంధాల విషయంలో గత కొంతకాలంగా ఉద్రిక్తలు నెలకొన్నాయి. చైనీస్ టెలికాం దిగ్గజం వావే టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె, సంస్థ సీఎఫ్ఓ మెంగ్ వాంఝూను ఓ కేసులో అనుమానితురాలిగా పేర్కొంటూ అమెరికా ఆమెపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో వావే అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో కెనడాలో తలదాచుకున్న మెంగ్ వాంఝాని అమెరికా అభ్యర్థనపై కెనడా పోలీసులు 2018 డిసెంబరులో అరెస్టు చేశారు. అదే సమయంలో గూఢచర్యం ఆరోపణలపై కెనాడకు చెందిన మైఖేల్ కోవ్రీ, మాజీ దౌత్యవేత్త, వ్యాపారవేత్త మైఖేల్ స్పావర్లను చైనా అరెస్టు చేసింది. వారికి కనీసం దౌత్యపరమైన సాయం పొందేందుకు కూడా చైనా అనుమతించడం లేదు. ఫలితంగా ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ప్రకటన చేశారు. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) అయితే మెంగ్ వాంఝాని విడిచిపెడితే.. కెనడా పౌరులను విడదుల చేస్తానని చైనా వెల్లడించింది. ఈ అంశంలో ప్రధాని మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. కానీ ట్రూడో మాత్రం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. చైనా షరతుకు అంగీకరించి.. మెంగ్ వాంఝాను విడిచిపెడితే.. ఇక భవిష్యత్తులో ఏ కెనడా పౌరుడికి కూడా రక్షణ కల్పించలేమని ఆయన అన్నారు. ఇప్పుడు చైనా షరతుకు తలవంచితే.. రానున్న రోజుల్లో కూడా అది ఇలానే ప్రవర్తిస్తుందని ట్రూడో అభిప్రాయపడుతున్నారు. చైనా ఖైదీల విడుదల ప్రక్రియ ఆ దేశ తాకట్టు దౌత్యవిధానాలకు అద్దం పడుతుందని ట్రూడో విమర్శించారు. -
'తండ్రిగా వాడి కోరికను తీర్చా'
కెనడా : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక కన్నతండ్రిగా తన కొడుకు కోరికను తీర్చాడు. కరోనాతో ఎమర్జెన్సీ విధించిన కెనడాలో ఆంక్షలను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సవరిస్తోంది. తాజాగా ట్రూడో తన 6 ఏళ్ల కొడుకు హెడ్రిన్తో కలిసి బుధవారం క్యూబెక్ ప్రావిన్స్‌లోని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వచ్చిన ఫోటో ఒకటి వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ.. ' దేశానికి ప్రధానినైనా .. నేను ఓ బిడ్డకు తండ్రినే. సాధారణ ప్రజల్లానే నాకు నిబంధనలు వర్తిస్తాయి. ఇన్నాళ్లు లాక్డౌన్ ఉండడంతో నా కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్లలేకపోయాను. తాజాగా దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో నా కొడుకు ఐస్‌క్రీం కావాలని అడిగాడు. తండ్రిగా వాడి కోరిక తీర్చాలి కాబట్టి ఐస్‌క్రీం పార్లర్‌కు వచ్చా. హెడ్రిన్కు ఇష్టమైన వెనీలా ఫ్లేవర్ కోన్ తీసుకోవడంతో వాడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. కరోనా నేపథ్యంలో ప్రతీ షాపు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఇన్నాళ్లు షాపులు మూసేయడంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. కొన్ని రోజుల్లోనే పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నా.' అంటూ తెలిపారు. అనంతరం కొడుకు హెడ్రిన్తో కలిసి ఐస్‌క్రీం తినేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా మర్చిలో కెనడాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మార్చి మధ్యలోనే అత్యవసర సేవలు మినహ దేశం మొత్తం లాక్డౌన్ విధించారు. కెనడాలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 8,484 మంది కరోనాతో మృతి చెందారు.(భారత్‌కు భారం..డ్రాగన్‌కు వరం) -
కెనడా చరిత్రలోనే దారుణమైన ఘటన
ఓట్టావా : 35 ఏళ్ల క్రితం జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182పై జరిగిన ఉగ్రదాడి కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైనదని, ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు ఆ ఘటన నిదర్శనమని ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 182 ఎంపరర్ కనిష్కలో ఉగ్రవాదులు బాంబు పెట్టిన ఘటన జరిగి 35 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా బాధిత కుటుంబాలు ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలతో నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ సైతం ఓ వీడియోలు విడుదల చేశారు. ఆ వీడియోలో.. దేశానికి అదో పెద్ద షాకని, అప్పటి సామూహిక భద్రతను ప్రమాదంలో పడేసిందని అన్నారు. కెనడా నుంచి యూకే వెళుతున్న విమానం పేలటంతో 329 మంది అమాయకులు మరణించారని, వారిలో 280 మంది కెనడియన్లు ఉన్నారని అన్నారు.('జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది') కాగా, 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182, ఎంపరర్ కనిష్కలో ఖాలిస్తాని ఉగ్రవాదులు బాంబు పెట్టారు. ఈ ఘటనలో 329 మంది మృత్యువాత పడ్డారు. దారుణ సంఘటనకు గుర్తుగా జూన్ 23వ తేదీని ‘‘ నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజమ్ ఇన్ కెనడా’’గా జరుపుకుంటున్నారు. ఆ రోజున బాధిత కుటుంబాలు అంతా ఒక చోట చేరి చనిపోయిన తమ వారికి నివాళులు అర్పిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సామూహిక సమావేశాలపై ఆంక్షలు ఉండటంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా నివాళులు అర్పించారు. కొంతమంది మాత్రమే అక్కడి స్మారక స్థలాల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. -
'జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది'
కెనడా : న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) అధినేత జగ్మీత్ సింగ్ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన సభ్యుడి పట్ల వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా జగ్మీత్సింగ్కు తాను మద్దతుగా ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం తెలిపారు. కెనడాలో ఫెడరల్ పార్టీకీ నాయకత్వం వహించిన మొదటి సిక్కు సభ్యుడిగానూ, మైనారిటీగానూ జగ్మీత్ సింగ్ నిలిచారు. కాగా దేశంలోని ఫెడరల్ పోలీస్ ఫోర్స్ దైహిక జాత్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్డీపీ మోషన్లో సంతకం చేయాలంటూ వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతను బుధవారం జగ్మీత్ సింగ్ అడిగారు. మోషన్లో సంతకం చేయడానికి బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ ఒప్పుకోకవడంతో జగ్మీత్ గొడపడ్డారు. దీంతో జగ్మీత్ పార్లమెంట్ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురయ్యారు. ఈ అంశంపై ట్రూడో స్పందిస్తూ..' బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ వర్ణ వివక్షపై సంతకం చేయడానికి నిరాకరించడం నిరాశపరిచింది. మన దేశంలో ప్రతి భాగంలోనూ, ప్రతి సంస్థలోనూ దైహిక జాత్యహంకారం ఉంది. ఆ వివక్షతను గుర్తించి, దాన్ని పరిష్కరించడమే మొదటి అడుగుగా భావించాలి.దీనిపై ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ చేసిన సూచనకు తాను మద్దతుగా ఉన్నా. ఒకే దేశంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఇలాంటి మంచి విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్డీపీ మోషన్‌పై సంతకం చేయడానికి నిరాకరించిన బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతతో జగ్మీత్ గొడవపడ్డారు. దీంతో క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన జగ్మీత్‌ను పార్లమెంట్ చాంబర్ నుంచి బహిష్కరించారు. జగ్మీత్ క్షమాపణ చెబుతారనే అనుకుంటున్నా.. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే హౌస్ ఆఫ్ కామన్ అధ్యక్షుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పరిస్థితి అంతదూరం వెళ్లదనే నేను అనుకుంటున్నా.' అంటూ తెలిపారు. ('ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా సిద్ధం') మొత్తం 338 సీట్లలో జగ్మీత్ నేతృత్వంలోని ఎన్డీపీకి 24 సీట్లు, వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి 32 సీట్లు ఉన్నాయి. గత నెలలో జాత్యంహకార దాడిలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ప్లాయిడ్‌కు మద్దతుగా వర్ణ వివక్షను రూపుమాపాలని, కెనడియన్ పోలీస్ వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాలంటూ పార్లమెంట్లో ఎన్డీపీ తన పోరాటం కొనసాగిస్తుంది. -
ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు
-
జార్జ్‌కు న్యాయం జరగాలి: కెనడా ప్రధాని
ఒట్టావా: ఆఫ్రికన్- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. అంగరక్షకులు వెంటరాగా.. నలుపు రంగు మాస్కు ధరించి.. మోకాళ్లపై కూర్చుని జార్జ్‌కు న్యాయం జరగాలన్న నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ‘‘నో జస్టిస్- నో పీస్’’(న్యాయం జరగకుంటే శాంతి ఉండదు) కార్యక్రమానికి హాజరైన ట్రూడో ప్రసంగించకుండానే తిరిగి వెళ్లిపోయారు. అయితే జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉపన్యసించిన పలువురు వక్తలను ఆయన ప్రశంసించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. కాగా తొలుత ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్న ప్రశ్నకు బదులివ్వని ట్రూడో.. ఒక్కసారిగా అక్కడకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరచడం విశేషం. అయితే ఆయన అక్కడకు చేరుకోగానే కొంతమంది.. ‘‘స్టాండప్ టూ ట్రంప్’’ అని నినదించడం గమనార్హం. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’) ఇదిలా ఉండగా.. జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో వారికి మద్దతు తెలిపిన ఒట్టావా పోలీసులు.. తాము తమ పౌరుల హక్కులను కాపాడతామంటూ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలకు భద్రత కల్పించడమే మా పని. మా ప్రజలు, కమ్యూనిటీ సభ్యుల హక్కులను గౌరవిస్తాం. అన్యాయాలను ఎదురించేందుకు వారు గళమెత్తిన సమయంలో సంయమనంతో వ్యవహరిస్తాం. వారి ఆవేదన, విసుగును మేం అర్థం చేసుకోగలం’’అని పేర్కొన్నారు. కాగా అమెరికాలోని మినియాపోలిస్‌లో ఓ పోలీస్ అధికారి ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాలితో నొక్కిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాత్యహంకార దాడిని నిరసిస్తూ అగ్రరాజ్యంలో నిరసనలు భగ్గుమంటున్నాయి.(జార్జ్ ఒక నేరస్థుడు.. రెండో వైపు కూడా చూడండి) -
హోంవర్క్‌లో డౌట్స్ వస్తే నేనున్నా: ప్రధాని
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలను చూశారు. చిన్నచిన్న ఉద్యోగాల నుంచి మొదలుకుని ఉపాధ్యాయుడిగానూ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ప్రధానిగా దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఇదిలా వుండగా ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా పలు దేశాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు స్కూళ్లకు వచ్చే పరిస్థితి లేదు. ఆన్లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో నుంచే హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో పిల్లలకు తన అవసరం ఆవశ్యకమని భావించిన ప్రధాని ట్రూడో మరోసారి ఉపాధ్యాయుడిగా మారేందుకు సిద్ధమయ్యారు. (కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య) పిల్లలు, వారి తల్లిదండ్రులకు హోమ్‌వర్క్‌లో ఏవైనా అర్థం కాక ఇబ్బంది పడితే నిరభ్యంతరంగా అడగవచ్చని, సాయం చేసేందుకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్లో వీడియో సందేశం అందించారు. మనమంతా కలిసి ముందుకు సాగడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలోని వాంకోవర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలో గణితం, ఫ్రెంచ్‌తో పాటు మానవత్వ విలువలను కూడా పిల్లలకు బోధించేవారు. ఇదిలా వుండగా కరోనా బారిన పడిన ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి ఈ మధ్యే కోలుకున్న విషయం తెలిసిందే. (అక్కడ బుల్లెట్ తగిలినా బతికేసింది) -
సముద్రంలో కుప్పకూలిన మిలిటరీ విమానం
టొరంటో : కెనడాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. నాటో టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ప్రయాణించిన హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతు ఆయ్యారని తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, వారంతా క్షేమంగా భయటపడాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మెరైన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ అబ్బిగైల్ కోబ్రౌగా గుర్తించినట్లు పేర్కొన్నారు. (కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి) ఘటనపై కోబ్రౌ తల్లి మాట్లాడుతూ..నా అందమైన గారాలపట్టి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ వాపోయింది. హెలికాప్టరులో రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు సభ్యులతో పాటు మరో ఇద్దరు సెన్సార్ ఆపరేటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరి కుటుంబాలకు ప్రాథమికంగా సమాచారం అందించామని, అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. (కెనడా ప్రధాని.. వర్క్ ఫ్రమ్ హోమ్ ) -
అగ్నిప్రమాదం.. ఆస్పత్రిలో ప్రధాని తల్లి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తల్లి మార్గరెట్ ట్రూడో నివసిస్తున్న అపార్టుమెంటులో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్థానిక మీడియా షేర్ చేసింది. ఈ ఘటనలో మార్గరెట్ గాయాలపాలైనట్లు పేర్కొంది. అదే విధంగా తీవ్రంగా అలుముకున్న పొగ కారణంగా ఆమె శ్వాస తీసుకోలేకపోతున్నారని.. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది. ఆమె కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య) ఇక ఈ విషయంపై ప్రధాని జస్టిన్ ట్రూడో ట్విటర్ వేదికగా స్పందించారు. తన తల్లి మార్గరెట్‌తో మాట్లాడానని.. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. తమ కోసం ప్రార్థించిన వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే స్పందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదే విధంగా అపార్టుమెంటులోని ఇతర కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాగా ప్రధాని జస్టిన్ ట్రూడో తల్లి, దివంతగ ప్రధాని పిర్రే ట్రూడో సతీమణి అయిన మార్గరెట్ రేడియో కెనడాలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె డౌన్‌టౌన్ రెసిడెన్స్‌లో నివసిస్తున్నారు. తొలుత ఐదో అంతస్తులో అంటుకున్న మంటలు.. అపార్టుమెంటు మొత్తం వ్యాపించాయి. 70 మంది ఫైర్‌ఫైటర్లు రంగంలోకి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. I spoke with my mom, and thankfully she’s doing fine. Thanks to everyone who reached out and sent us well wishes. I’d also like to thank the first responders for their incredible work, and I’m keeping the other families affected by this fire in my thoughts today. — Justin Trudeau (@JustinTrudeau) April 28, 2020 -
కరోనా నుంచి కోలుకున్న ప్రధాని భార్య
ఒటావో : కరోనా వైరస్ బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్నారు. 16రోజుల చికిత్స అనంతరం గ్రెగొరీ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా సోఫి గ్రెగొరీ మార్చి 12న లండన్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వల్ప జ్వరం రావడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని నిర్దారించారు. దీంతో అప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయిన ఆమెకు తగిన చికిత్స అందించారు. ప్రధాని ట్రూడో భార్యకు వైరస్ సోకడంతో ఆయన కూడా ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వరించారు. కాగా వ్యాధి నుంచి పూర్తి కోలువడంతో చాలా సంతోషంగా ఉందంటూ సోఫీ గ్రెగోరి ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ కెనడాలోను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆదేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేల దాటిపోయింది. మృతుల సంఖ్య 61కి చేరింది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంక్షల్ని మరింత కఠినం చేశారు. -
కెనడా ప్రధాని.. వర్క్ ఫ్రమ్ హోమ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు దేశ ప్రధానులను సైతం వణికిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కూడా ఈ వైరస్ బారిన పడింది. తన భార్య సోఫీకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనతో సహా ముగ్గురు పిల్లలకు కరోనా లక్షణాలు లేవని జస్టిన్ ట్రూడో తెలిపారు. కరోనా దృష్యా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను తన ఇంటి దగ్గర నుంచే ట్రూడే నిర్వహిస్తున్నారు. ప్రపంచ నాయకులతో ముఖ్యమైన చర్చలను తన ఇంటి నుంచే కొనసాగిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ఇంటి నుంచే నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలు తీర్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ట్రుడో చెప్పినట్లు బ్రిటన్‌కు చెందిన జాతీయ మీడియా పేర్కొంది. కెనడా ప్రభుత్వం అన్ని విదేశీ కార్యక్రమాలను రద్దు చేసుకుందని.. కేవలం పరిమిత సంఖ్యలో విమానాశ్రయాలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించిందని అధికారులు తెలిపారు. కరోనా వల్ల కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు 5 వారాలు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: అసలు ఆ ప్రమాదం జరిగేదే కాదు! -
ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!
ఒటావా: అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనకుండా ఉన్నట్లయితే ఉక్రెయిన్ విమాన దుర్ఘటన జరిగేది కాదని కెనడా ప్రధాని జిస్టిన్ ట్రూడో అన్నారు. ఇరు దేశాల పరస్పర ప్రతీకార దాడుల వల్ల ఎంతో మంది మృత్యువాతపడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్ పౌరులు, 10 మంది స్వీడిష్ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్ పౌరులు) మరణించారు. ఇక వీరిలో 63 మంది కెనడియన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సంతాప సభకు హాజరైన ట్రూడో మాట్లాడుతూ.. ‘‘మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు లేనట్లయితే ఆ ఘటనలో మృతి చెందిన కెనడియన్లు.. ప్రస్తుతం వారి వారి కుటుంబాలతో కలిసి ఇంట్లో హాయిగా ఉండేవారు. ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా మారాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రాంతంలో అమెరికా సృష్టించిన ఉద్రిక్తతలు సద్దుమణగాల్సిన అవసరం కూడా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. (విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్) కాగా తొలుత విమానం ప్రమాదంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. బోయింగ్ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్ కూల్చివేసిందని తమకు పలు ఇంటలెజిన్స్ నివేదికలు అందాయన్నారు. ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. అంతేగాకుండా విమానంపై క్షిపణి దాడి జరిగినట్లు ఉన్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఎట్టకేలకు తామే ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ అంగీకరించిన విషయం తెలిసిందే. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఇరాన్... బాధితుల కుటుంబాలు తమను క్షమించాలని అభ్యర్థించింది. ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం ఇరాన్ మరో దాడి.. అమెరికా ఆగ్రహం! -
176 మంది మృతి; కెనడాకు ఇరాన్ విఙ్ఞప్తి!
టెహ్రాన్: ఇరాన్- అమెరికాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంపై పలువురు పాశ్చాత్య దేశాల అధినేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఉక్రెయిన్ విమానం కుప్పకూలిందని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. బోయింగ్ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్ కూల్చివేసిందని తమకు పలు ఇంటలెజిన్స్ నివేదికలు అందాయన్నారు. టెహ్రాన్ నుంచి బయల్దేరగానే విమానం కుప్పకూలడం వెనుక ఇరాన్ దాడుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చకపోయినా.. దాడుల్లో భాగంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.(దద్దరిల్లుతున్న ఇరాక్.. మరో రాకెట్ దాడి) ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించిందని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొంది. అదే విధంగా ఈ ఘటనపై దర్యాప్తుతోపాటు, బ్లాక్‌బాక్స్‌లో సమాచారాన్ని విశ్లేషించేందుకు 45 మందితో కూడిన ఉక్రెయిన్ అధికారుల బృందం ఇరాన్‌కు చేరుకుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న.. కెనడా వద్ద ఏదైనా సమాచారం ఉంటే దానిని వెంటనే తమతో పంచుకోవాలని విఙ్ఞప్తి చేసింది. (అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు) కాగా ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానం బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్ పౌరులు, 10 మంది స్వీడిష్ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్ పౌరులు) మరణించారు. ఇక వీరిలో 63 మంది కెనడియన్లు ఉండటంతో కెనడా ఈ ఘటనపై సీరియస్‌గా ఉంది. మరోవైపు.. తమ దేశ పౌరుల మృతికి, విమాన ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు.. ఆయా దేశాల ప్రతినిధులను ఇరాన్ రావాల్సిందిగా కోరింది. (కూలిన విమానం... ) -
సరికొత్త చరిత్ర.. ఆయనకు ఉరిశిక్ష!
ఎన్నికల్లో కుట్ర లేదని ఈ ఏడాది ప్రారంభంలో క్లీన్చిట్ పొందిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అనూహ్యంగా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. గే వివాహాలను తైవాన్ చట్టబద్ధం చేయగా... స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని బ్రూనే నిర్ణయం తీసుకుంది. కెనడా పీఠంపై మరోసారి ట్రూడో కొలువుదీరగా.. బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతి పటేల్ కీలక బాధ్యతలు స్వీకరించారు. వీటితో పాటు ఈ ఏడాది చోటుచేసుకున్న మరెన్నో అంతర్జాతీయ పరిణామాలపై సాక్షిడాట్ కామ్ అందిస్తున్న సంక్షిప్త వార్తల సమాహారం. జనవరి 5 హౌజ్‌లో.. 181 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. కొత్తగా కొలువుదీరిన అమెరికా ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్, టర్బైన్) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. జనవరి 5 అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్! అమెరికా ప్రయోగించిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించింది. హెచ్- 6కె అనే బాంబర్ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. జనవరి 8 బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హసీనా కేబినెట్లో కేవలం ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. అమెరికా దాడుల్లో అల్ ఖైదా బడావీ మృతి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ముఖ్యనాయకుడు జమాల్ అల్ బడావీ అమెరికా వాయుసేన దాడుల్లో మరణించినట్లు ఆ దేశం వెల్లడించింది. అల్‌ఖైదా తరఫున యెమెన్‌లో కార్యకలాపాలు నిర్వహించే బడావీ.. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. దీంతో బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. జనవరి 11 వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. కాగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. జనవరి 13 అమెరికా చరిత్రలో షట్‌డౌన్ రికార్డు అమెరికా-మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ రికార్డును ట్రంప్ ప్రభుత్వం అధిగమించింది. జనవరి 18 ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్‌వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. జనవరి 29 పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!! సుమన్ కుమారి అనే మహిళ పాకిస్తాన్‌లోని ఓ కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్-షాదాద్కోట్ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. జనవరి 31 అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు అమెరికాలో అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26 300 మంది ఉగ్రవాదుల హతం? పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. మార్చి 26 అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని రాబర్ట్ ముల్లర్ విచారణ కమిటీ తేల్చింది. మార్చి 29 ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..! ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. అదే విధంగా.. దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష అమలు చేయనుంది. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. ఏప్రిల్ 21 బాంబు పేలుళ్లతో రక్తమోడిన కొలంబో శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. మే 17 గే వివాహాలను చట్టబద్ధం చేసిన తైవాన్ స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు సా యింగ్-వెన్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. జూన్ 6 థాయ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా(65) ఎన్నికయ్యారు. 2014లో ఇంగ్లక్ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌర ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. జూలై 01 ఉత్తర కొరియాలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్‌మున్‌జొమ్ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమైంది. జూలై 26 అమెరికాలో మళ్లీ మరణశిక్షల అమలు దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. జూలై 26 బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్ బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్.. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్(హోం మంత్రి), రిషి సునక్(ఆర్థిక శాఖ సహాయ మంత్రి), అలోక్ శర్మ (ఇంటర్నేషనల్ డెవలప్మెంట్)లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 15 భారత్‌ను హెచ్చరించిన ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమర్శించారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్‌లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. సెప్టెంబరు 7 ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సెప్టెంబరు 11 ఇమ్రాన్‌కు ఐరాస షాక్ జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నానా రాద్ధాంతం చేస్తున్న పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి (ఐరాస) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ వ్యవహారం భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అంశమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటరీస్ ఉద్దేశమని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ స్పష్టం చేశారు. సెప్టెంబరు 23 చరిత్రాత్మకంగా హౌడీ మోదీ! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు. అక్టోబరు 23 కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో! కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకొన్నారు. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్‌కుగానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డిస్ట్రిక్ట్స్‌లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అక్టోబరు 29 ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా బాగ్దాదీ చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నవంబరు 9 కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం భారత్, పాకిస్తాన్లను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని.. పాక్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. నవంబరు 19 పాక్ అణు క్షిపణి పరీక్ష భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్-1’ను పాక్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. నవంబరు 21 ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. నవంబరు 26 హాంకాంగ్ ఎన్నికల్లో చైనాకు షాక్ హాంకాంగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేవలం 59 మంది, మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. చైనా అనుకూల పార్టీకి చెందిన 155 మంది ఓడిపోయారు. నవంబరు 29 శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల సాయం శ్రీలంక అభివృద్ధికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. డిసెంబరు 4 అనూహ్యం: కమలా హ్యారిస్ అవుట్! అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల అభ్యర్థిత్వ పోటీ నుంచి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్(54) నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్ ప్రకటన చేశారు. డిసెంబరు 9 మిస్ యూనివర్స్‌గా జోజిబినీ తుంజీ ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. డిసెంబరు 12 ఫిన్‌ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్నవారే. డిసెంబరు 15 మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్-2019 కిరీటం దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. డిసెంబరు 18 ముషారఫ్‌కు మరణశిక్ష సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. డిసెంబరు 20 ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. అనంతరం సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ. -
తొలి హిందూమంత్రిగా అనితా ఆనంద్
ఒటావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా ఇటీవల ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో జరిగిన హౌస్ ఆఫ్ కామన్స్ సభకు ఆమె అర్హత సాధించారు. అలాగే తొలి హిందూ పార్లమెంటేరియన్‌గా కూడా అనిత ప్రత్యేక గుర్తింపును పొందారు. టొరంటోలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. తొలిసారి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. కాగా అనిత తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు కావడం విశేషం. బుధవారం ఏర్పడిన నూతన వర్గంలో మరో ముగ్గురు కొత్త వారికి కూడా ట్రూడో చోటుకల్పించారు. వీరంతా ఇండో-కెడియన్కు చెందిన సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు. -
కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో!
ఒటావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకునే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డి్రస్టిక్ట్స్కుగానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డి్రస్టిక్ట్స్లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇండియన్ కెనడియన్ అయిన జగీ్మత్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పారీ్ట(ఎన్డీపీ) 24 సీట్లు గెలుచుకుని ‘కింగ్ మేకర్’గా అవతరించింది. అయితే, 2015 నాటి ఎన్నికల కన్నా ఈ సారి ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య తగ్గింది. ఆ ఎన్నికల్లో ఎన్డీపీ 44 సీట్లు గెల్చుకుంది. బ్లాక్ క్యూబెకాయిస్ 32, గ్రీన్ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి. బ్లాక్ క్యూబెకాయిస్, గ్రీన్ పార్టీ ట్రూడో ప్రభుత్వంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రూడోకు మరో 13 మంది సభ్యుల మద్దతు అవసరం. పార్లమెంట్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కెనడియన్ల హక్కుల కోసం పోరాడుతామని ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జగీ్మత్ సింగ్ వ్యాఖ్యానించారు. కెనడాలోని ఒక రాజకీయ పారీ్టకి నేతృత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతర నేత 40 ఏళ్ల జగీ్మత్ సింగ్నే కావడం విశేషం. ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్డీపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచిన జగీ్మత్ సింగ్ గతంలో క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ట్రూడో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. కెనడా ప్రజలు ప్రగతిశీల అజెండాకు ఓటేశారని ఫలితాల అనంతరం ట్రూడో వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్న ట్రూడో ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవిచూడాల్సి వచి్చంది. ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూబెక్, అల్బెర్టా తదితర ప్రావిన్స్‌ల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ భారీగా దెబ్బ తిన్నది. ట్రూడో ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని కన్సర్వేటివ్ పార్టీ నేత షీర్ వ్యాఖ్యానించారు. మరోసారి ఎన్నికలు వస్తే తమదే విజయమన్నారు. 2.74 కోట్ల ఓటర్లును కెనడాలో ఈ ఎన్నికల్లో 65% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 97 మంది మహిళలు గెలిచారు. మోదీ శుభాకాంక్షలు: కెనడా ఎన్నికల్లో విజయం సాధించిన జస్టిన్ ట్రూడోకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, బహుళత్వ విలువల విషయంలో భారత్, కెనడాలు ఒకటేనన్న మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ట్రూడోతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మంగళవారం ట్వీట్ చేశారు. -
కెనడా ఎన్నికలు: మరోసారి ట్రూడో మ్యాజిక్..
-
మరోసారి ట్రూడో మ్యాజిక్..
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 388 సీట్లుకు లిబరల్స్ 156 స్థానాలు దక్కించుకోగా.. ప్రతిపక్ష కన్సర్వేటీవ్స్ 122 స్థానాలకే పరిమితమయ్యారు. ప్రవాస భారతీయుడు జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ 23స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. కెనడాలో మెజార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 170 స్థానాలు అవసరం. కాబట్టి చిన్న పార్టీలతో కలిసి ట్రూడో మైనార్టీ ప్రభుత్వాన్ని నడపనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలియజేశారు. తమ ప్రగతిశీల అజెండాకు ప్రజలు పట్టంకట్టారని, ఆధునిక కెనడా ఆవిష్కరణకు కృషి కొనసాగిస్తానని ట్రూడో ఎన్నికల విజయం అనంతరం ప్రకటించారు. -
మెలానియా, ట్రూడో ఫొటోపై విపరీతపు కామెంట్లు!
పారిస్ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల ఫొటోపై నెటిజన్లు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని...చాలా మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ #మెలానియాలవ్స్ట్రూడో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ 7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు పలువురు వారి జీవిత భాగస్వాములతో హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం దేశాధినేతల కుటుంబాలు ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. ఫొటోలు దిగుతున్న సమయంలో మెలానియా తన పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను మర్యాదపూర్వకంగా ముద్దుపెట్టుకున్నారు. ఇక అదే సమయంలో పక్కనే ఉన్న ట్రంప్ కళ్లు కిందకు వాల్చుకున్నట్లుగా ఉన్న ఫొటోను రాయిటర్స్ ట్విటర్లో షేర్ చేసింది. ‘ జీ7 ఫ్యామిలీ ఫొటోషూట్‌లో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ముద్దాడారు. అప్పుడు ట్రంప్ కిందకు చూస్తుండిపోయారు’ అంటూ జీ 7 సదస్సు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మెలానియా-ట్రూడో-ట్రంప్‌ల ఫొటోపై స్పందించిన నెటిజన్లు...‘ట్రంప్‌నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్ చేయడానికి వెనుకాడటం లేదనుకుంటా’ అంటూ విపరీర్థాలతో కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది గతంలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రూడో పక్కన కూర్చున్న ఫొటోను, ప్రస్తుతం మెలానియా ఫొటోను పోలుస్తూ...‘ ఇవాంకా, మెలానియా ట్రూడో వైపు ఎలా చూస్తున్నారో గమనించండి. మీ జీవితంలో అట్లాంటి వ్యక్తి రావాలని కోరుకోండి. ఎంతైనా ట్రూడో భలే అందగాడు. ఇదే కాదు గతంలో ఎన్నోసార్లు మెలానియా ట్రూడోను ఇలాగే చూశారు. అసలు విషయం ఏమిటో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. First lady Melania Trump kisses Canadian Prime Minister Justin Trudeau during the #G7 family photo as President Trump looks on. More of today’s top photos: https://t.co/xLPy8OSSmW pic.twitter.com/m5285qjAFr — Reuters Top News (@Reuters) August 26, 2019 -
సౌదీ యువతికి కెనడా ఆశ్రయం
టొరంటో/బ్యాంకాక్: థాయిలాండ్‌లో చిక్కుకుపోయిన సౌదీఅరేబియా యువతి రహాఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్(18) శనివారం ఎట్టకేలకు కెనడాకు చేరుకుంది. ఇంట్లో వేధింపులు తట్టుకోలేక థాయ్‌లాండ్‌కు పారిపోయివచ్చిన రహాఫ్‌కు ఆశ్రయమిస్తామని కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం తెల్సిందే. ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ చొరవతోనే ఇది సాకారమైందని థాయ్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ ముఖ్య అధికారి సురాచత్ హక్‌పర్న్ తెలిపారు. సౌదీకి చెందిన రహాఫ్ మహ్మద్ అల్‌ఖునన్ తల్లిదండ్రుల ఆంక్షలను తట్టుకోలేక, తనకు నచ్చినట్టుగా బతికేందుకు కువైట్ నుంచి థాయ్‌లాండ్ మీదుగా ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు యత్నించారు. అయితే తగిన పత్రాలు లేకపోవడంతో రహాఫ్‌ను జనవరి 5న థాయ్‌లాండ్ అధికారులు ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు. దీంతో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ హోటల్ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్‌మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. రహాఫ్‌కు ఆశ్రయం కల్పించే విషయమై ఆస్ట్రేలియా, కెనడా సహా పలు దేశాలతో ఐరాస చర్చించింది. అయితే వేగంగా స్పందించిన కెనడా తాము రహాఫ్‌కు ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించగా, అందుకు ఆమె అంగీకరించారు. కాగా, ఈ విషయంలో తనకు సాయం చేసిన ప్రతీఒక్కరికి రహాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయంతో సౌదీతో ఆ దేశ సంబంధాలు మరింత దిగజారనున్నాయి. ఇంతకుముందు సౌదీలో మహిళా హక్కుల కార్యకర్తలకు మద్దతు పలకడంతో కెనడాపై సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
‘20 ఏళ్ల క్రితమే మమ్మల్ని వదిలి వెళ్లావు’
‘ఈరోజుతో నువ్వు 43వ వసంతంలోకి అడుగుపెట్టేవాడివి. కానీ 20 ఏళ్ల క్రితమే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. నా చిన్నారి తమ్ముడిని ప్రేమిస్తూనే ఉంటా. హ్యాపీ బర్త్‌డే మైక్’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన తమ్ముడు మిచెల్ ట్రూడోకు నివాళులు అర్పించారు. తన సోదరుడిని గుర్తుచేసుకుంటూ.. జస్టిన్ చేసిన భావోద్వేగపూరిత ట్వీట్ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ‘మీరు మీ సోదరుడిని ఎంతగా మిస్సవుతున్నారో ఊహించగలను. ఎందుకంటే నేను కూడా 23 ఏళ్ల ప్రాయంలో నా తమ్ముడు (తన పేరు కూడా మిచెల్)ని కోల్పోయానంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మిచెల్ ట్రూడోకు నివాళులర్పిస్తూ మరి కొంతమంది సంతాపం తెలిపారు. కాగా కెనడా మాజీ ప్రధాని అయిన పెర్రీ ట్రూడోకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు జస్టిన్ ట్రూడో కెనడా ప్రస్తుత ప్రధాని. రెండో కుమారుడు అలెగ్జాండర్ ట్రూడో ఫిల్మ్ మేకర్, జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇక అందరికంటే చిన్న వాడైన మిచెల్ ట్రూడో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మిచెల్ పడవ ప్రమాదంలో మృతిచెందాడు. కొకానే సరస్సులో విహరిస్తుండగా గల్లంతైన మిచెల్ శవం కూడా దొరకపోవడంతో ట్రూడో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగి 20 ఏళ్లవుతున్నా తన తమ్ముడి ఙ్ఞాపకాలు ఇంకా మదిలో మెదులుతున్నాయంటూ జస్టిన్ భావోద్వేగానికి లోనయ్యారు. You would have been 43 today, but you’ve been gone 20 years now. I love you, little brother. Happy birthday Miche. pic.twitter.com/wJHnoJ8V1V — Justin Trudeau (@JustinTrudeau) October 3, 2018 -
ట్రంప్‌పై ప్రతీకారం : బిలియన్ డాలర్ల టారిఫ్‌లు
అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన వ్యక్తం చేయడమే కాకుండా.. ట్రంప్‌పై ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నాయి. చైనా, భారత్, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు.. తాజాగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లను విధించింది. కెనడియన్ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ కార్యాలయం విధించిన డ్యూటీలకు దెబ్బకు దెబ్బగా బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం శుక్రవారం సుంకాల విధించే ఉత్పత్తుల తుది జాబితాను విడుదదల చేసింది. జూలై 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొన్ని ఉత్పతుల పన్నులు 10 శాతం నుంచి 25 శాతమున్నాయి. ఇది తీవ్రతరం కాదు, అలా అని వెనక్కి తీసుకోలేం అని కెనడియన్ విదేశీ మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ అన్నారు. పన్నులు విధించిన ఉత్పత్తుల్లో కెచప్, గట్టి కోసే యంత్రాలు, మోటర్ బోట్స్ ఉన్నాయి. మొత్తంగా 12.6 బిలియన్ డాలర్లు సుంకాలను కెనడా అమెరికాపై విధించింది. ఇది డాలర్‌కు డాలర్ స్పందన అని ఫ్రీల్యాండ్ చెప్పారు. తమకు మరో దారి లేదన్నారు. చాలా అమెరికా ఉత్పత్తుల్లో ఆర్థిక సంబంధనమైన వాటితో పోలిస్తే రాజకీయపరమైనవే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ తమతో వాణిజ్య యుద్ధానికి తెరలేపితే, దానికి కూడా సిద్దమయ్యే ఉన్నామని హెచ్చరించారు. అయితే అల్యూమినియం, స్టీల్‌పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ట్రంప్, దిగుమతి చేసుకునే మెటల్స్ వల్ల అమెరికా దేశ రక్షణకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులు, ఆటో పార్ట్‌లపై విధించిన టారిఫ్‌లు కూడా దేశ రక్షణకు చెందిన టారిఫ్‌లని పేర్కొన్నారు. ఆటో పార్ట్‌లపై టారిఫ్‌లు విధించడంపై కెనడా ఎక్కువగా ఆందోళన చెందుతోంది. కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇవి ముఖ్యమైనవి. అమెరికాలో తయారయ్యే కార్ల విభాగాలను కెనడాలోనే తయారు చేస్తారు. వీటి ఫలితంగానే అమెరికా ఉత్పత్తులపై కెనడా బిలియన్ డాలర్ల టారిఫ్‌లను విధించింది. -
ట్రంప్‌పై నమ్మకం లేదా?
ఒట్టావా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లే షాకిచ్చారు. ఓ సర్వేలో మెజార్టీ అమెరికన్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తమ మద్ధతు ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. జీ-7 దేశాల సదస్సు ముగిశాక.. వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్-ట్రూడోల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనెడాలోని ఓ న్యూస్ ఏజెన్సీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఓ సర్వే నిర్వహించింది. ఇరు దేశాల ప్రజలు(ఎంతమంది అన్నదానిపై స్పష్టత లేదు) పాల్గొన్న ఐపీఎస్వోఎస్ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. 72 శాతం మంది కెనడియన్లు, 57 శాతం మంది అమెరికన్లు ఈ పరిస్థితులను చక్కదిద్దే సత్తా ట్రూడోకే ఉందని తేల్చారు. 14 మంది కెనడియన్లు, 37 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్ధతుగా ఓట్లేశారు. ఆ లెక్కన మెజార్టీ అమెరికన్లు ట్రంప్‌కు ఆ దమ్ము లేదని తేల్చేశారన్న మాట. ఇక మెజార్టీ ప్రజలు మాత్రం ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎన్ఏఎఫ్టీఏ)-1994ను సవరించాలన్న ట్రంప్ నిర్ణయంపై కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే 70 శాతం మంది కెనడియన్లు తాము అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటున్నామని సర్వేలో పేర్కొన్నారు. మరోపక్క చాలామట్టుకు మాత్రం ఇరు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధంతో ద్వైపాక్షిక ఒప్పందాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 13-14 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించగా, తాజాగా సర్వే నివేదిక బహిర్గతమైంది. సర్వే నివేదిక.. ట్విటర్ సౌజన్యంతో... -
‘నరకంలో స్పెషల్ రూమ్’.. దుమారం!
వాషింగ్టన్ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అనుచిత వ్యాఖ్యలు చేసిందుకుగానూ వైట్‌హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో క్షమాపణలు కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ట్రూడోను ఉద్దేశించి ‘నరకంలో మీకు ప్రత్యేక చోటు’ ఉంటుందని వ్యాఖ్యానించినట్లు ఒప్పుకున్నారు. స్థానిక మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాలను వెల్లడించింది. ‘ఇటీవల జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా ఉద్దేశాన్ని స్పష్టంగా తెలపాలనుకున్నా. కానీ నేను ఉపయోగించిన భాష సరైంది కాదని’ పీటర్ నవరో వివరణ ఇచ్చుకున్నారు ‘కెనడాతో మాకు ఎలాంటి విభేదాలు లేవు. అమెరికా - కెనడాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతాయి. దౌత్య సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటుండదు. పరిశ్రమలు, సంస్థలు, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని’ ట్రేడ్ మినిస్టర్ ఫ్రాన్సిస్ ఫిలిప్ అన్నారు. వైట్‌హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ లారీ కుడ్లో కూడా కెనడా ప్రధాని ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఇటీవల జీ–7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన విషయం తెలిసిందే.‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి పచ్చి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్ (పన్ను)లు ఎక్కువగా ఉన్నాయని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
కెనడా ప్రధానిపై ట్రంప్ గరం
క్యుబెక్: జీ–7 శిఖరాగ్ర సదస్సు అనంతరం సభ్య దేశాలు విడుదలచేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. సదస్సు ముగియడానికి ముందే సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందిం చారు. ట్రూడో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రకటనను నమ్మొద్దని మా ప్రతినిధులకు చెప్పాను. జీ–7 సమావేశ సమయంలో ఎంతో అణకువ, మర్యాదగా నటించిన ట్రూడో నేను వెళ్లిన తరువాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు చెప్పారు’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టారిఫ్‌ల పెంపునకు ట్రంప్ భద్రతను సాకుగా చూపడం.. క్లిష్ట సమయాల్లో అమెరికా మిత్ర దేశాలకు మద్దతుగా నిలిచిన కెనడా మాజీ నాయకులను అవమానించడమేనని జస్టిన్ ట్రూడో మీడియా ముందు వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్లపై ట్రూడో కార్యాలయం స్పందిస్తూ.. తమ ప్రధాని ఇంతకుముందు చెప్పని కొత్త విషయాలు వేటినీ చెప్పలేదని వెల్లడించింది. -
మోదీకి గట్టి షాకిచ్చిన కెనడియన్లు
ఒట్టావా : ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అక్కడ ఆయన క్రేజ్ గురించి తరచూ వార్తల్లో చూస్తుంటాం. అయితే కెనడియన్లు మాత్రం ఈ విషయంలో మోదీకి గట్టి షాకే ఇచ్చారు. అసలు మోదీ ఎవరో తమకు తెలీదంటూ ఓ సర్వేలో వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగుస్ రెయిడ్ ఇన్స్టిట్యూట్(ఏఆర్ఐ) అనే సంస్థ కెనడియన్లపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 75 శాతం మంది కెనడియన్లు అసలు నరేంద్ర మోదీ అంటే ఎవరో తమకు తెలియదని చెప్పారు. జీ7 దేశాల సమావేశం నేపథ్యంలో జీ7, బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాధినేతల గురించి ప్రజల్లో ఏ మాత్రం అవగాహన ఉందని తెలుసుకోవటానికి ఈ సర్వే నిర్వహించారు. ‘మోదీ ఎవరు?’ ఈ విషయమై ఏఆర్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాచి కర్ల్ మాట్లాడుతూ.. ‘మా దగ్గర సరైన గణాంకాలు లేవు గానీ.. మోదీ ఎప్పుడూ ఇంగ్లీష్‌లో మాట్లాడలేదు. అందుకే పశ్చిమ దేశాల మీడియాను, ప్రజలను ఆయన అంతగా ఆకట్టుకోలేకపోయారనుకుంటా. ఇండియాతో ఉన్న వాణిజ్య సంబంధాల గురించి కెనడా ప్రజలకు అవగాహన ఉంది. కానీ మోదీకి ఇక్కడి ప్రజల్లో పాపులారిటీ లేదన్నది ఈ సర్వేతో స్పష్టమైంది. కెనడాలో ఆయనేమంత బిగ్ సెలబ్రిటీ కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రభావంతమైన, వ్యూహాత్మకమైన, బలమైన నాయకత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందిన దేశాధినేతలు అనే మూడు అంశాల్లో మాత్రం కొంతమంది నరేంద్ర మోదీ తమకు తెలుసని కొందరు చెప్పారంటూ షాచి పేర్కొన్నారు. ‘ట్రంప్ ఓ దురహంకారి’ 24 పదాలతో ఓ జాబితాను తయారు చేసిన నిర్వాహకులు.. ఆయా దేశాల అధినేతలకు ఏ పదం సరిపోతుందో తెలపాలంటూ సూచించారు. అయితే ఈ సర్వేలో అత్యధికంగా 74 శాతం మంది కెనడియన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అత్యంత దురహంకారిగా పేర్కొన్నారు. ‘అబద్దాలకోరు, నిజాయితీలేని వ్యక్తి, అవినీతిపరుడు’ అనే పదాలు ట్రంప్‌కు చక్కగా సరిపోతాయంటూ వారు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో తమ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోపై కెనడియన్లు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొసమెరుపు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్‌కు సర్వేలో టాప్ ర్యాంకు లభించగా.. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అత్యంత శక్తివంతమైన నేతగా, అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కెనడియన్లు ఓటు వేశారు. -
కెనడాలో పెను విషాదం
-
ఘోర ప్రమాదం: 13 మంది ప్లేయర్లు మృతి
ఒట్టావా : కెనడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐస్ హాకీ జట్టుకు చెందిన 13 మంది ఆటగాళ్లు, ఓ డ్రైవర్ మృత్యువాత పడ్డారు. దీంతో కెనడా క్రీడా ప్రపంచంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కెనడాలోని సస్కచివాన్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కెనడా అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్ కెనడా మౌంటెడ్ పోలీసుల కథనం ప్రకారం.. హంబోల్డ్ బ్రాంకోస్ జట్టుకు చెందిన జూనియర్ ఐస్ హాకీ ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం కలిపి 28 మంది ఓ బస్సులో వెళ్తున్నారు. సస్కచివాన్లోని టిస్డేల్లో హైవేపై వెళ్తుండగా వీరి వెళ్తున్న బస్సు, ఓ ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 13 మంది ఆటగాళ్లు, డ్రైవర్ మృచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రధాని సంతాపం ఐస్ హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేకపోయానంటూ ట్వీట్ చేశారు. -
భారత్ పర్యటనే ట్రూడో కొంప ముంచబోతుందా?
ఒట్టావా : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పర్యటన ఆయన కొంప ముంచబోతోందా? అంటే.. అవుననే సర్వేలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ ఓటమి పాలు కావటం ఖాయమని చెబుతున్నారు. తాజాగా అక్కడ నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. కెనడియన్ నెట్వర్క్ అయిన గ్లోబల్ న్యూస్ తాము నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ట్రూడో ఎనిమిది రోజుల భారత పర్యటన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణమని తెలిపింది. అందులో ఫెడరల్ ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీకి కేవలం 33 శాతం ఓట్లను మాత్రమే కైవసం చేసుకుని ఓటమి పాలవుతుందని తేల్చేసింది. మొత్తం పోలింగ్‌లో పాల్గొన్నవారిలో 40 శాతం ప్రజలు భారత్‌తో సంబంధాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేవలం 16 శాతం మాత్రమే ఇరు దేశాల మైత్రిపై ఆసక్తి చూపినట్లు సర్వేలో తేలిందని గ్లోబల్ న్యూస్ సీఈవో, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు డార్రెల్ల్ బ్రిక్కర్ వెల్లడించారు. అంతేకాదు ఓటింగ్‌లో ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 54 శాతం ప్రజలు ఓటేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యతిరేకంగా ఎన్నికల దాకా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బ్రిక్కర్ అభిప్రాయపడ్డారు. 2019 అక్టోబర్‌లో కెనెడా ఫెడరల్ ఎన్నికలు జరగనున్నాయి. -
ట్రుడో టూర్లో అపశ్రుతులు
వేరే దేశాల అధినేతలు అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు వారికి సాదరంగా ఆహ్వానం పలకడం, మంచి అతిథి సత్కారాలు అందించి వీడ్కోలు పలకడం దౌత్య మర్యాదల్లో భాగం. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకో అడుగు ముందుకేసి స్వయంగా విమానాశ్రయానికెళ్లి ఆ అధినేతలకు స్వాగతం పలికి, వారిని హత్తుకుని ప్రేమాభిమానాలు చాటుతున్నారు. కొందరిని తన స్వరాష్ట్రం గుజరాత్ తీసుకెళ్లారు. ఆ అధినేతల రాకను హర్షిస్తూ ట్వీటర్ ద్వారా సందేశాలివ్వడం కూడా మోదీయే ప్రారంభించారు. ఇవన్నీ వారిని మనకు మరింత దగ్గర చేసే చర్యలు. పరస్పర ఆధారిత ప్రపంచంలో ఇవి మేలు కలిగించేవే. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, జపాన్ ప్రధాని షింజో అబేలకు ఇలాంటి ఘన సత్కారాలే లభించాయి. కానీ ఈ నెల 17 నుంచి 24 వరకూ మన దేశంలో సకుటుంబ సమేతంగా ఎనిమిది రోజులపాటు పర్యటించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు మాత్రం ఆ మాదిరి ఆదరణ లభించలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మాత్రమే వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన కుటుంబం తాజ్‌మహల్‌కు వెళ్లినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్గానీ, ఆయన కేబినెట్లో మరెవరైనాగానీ అక్కడ లేరు సరిగదా జిల్లా అధికారులు మాత్రమే ఆయనను పలకరించారు. జస్టిన్ ట్రుడో, ఆయన కుటుంబ సభ్యులు మన దేశ పర్యటన కోసం కొంత కసరత్తు కూడా చేసినట్టున్నారు. విమానం నుంచి వెలుపలికి వచ్చి ఆ దంపతులు, వారితోపాటు పిల్లలు ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. ఆ తర్వాతే మెట్లు దిగి కిందికొచ్చారు. వారందరి వస్త్ర ధారణలో భారతీయం మెరిసింది. ఈ వారం రోజుల పర్యటనలోనూ అధికారిక కార్యక్రమం ఉన్నది ఒక్క అరపూట మాత్రమే. అయితే ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. ఆ కార్యక్రమం సందర్భంగా నరేంద్ర మోదీ ట్రుడోను హత్తుకున్నారు. వారి పిల్లలతో ఉల్లాసంగా కబుర్లు చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ట్రుడో కలిసినా ఆయన ముక్తసరిగా, ముభావంగా ఉన్నారు. సరిగ్గా ఆరేళ్లక్రితం అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఆరు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు సైతం ఇప్పుడు ట్రుడోకు లభించిన నిరాదరణ వంటిదే ఎదురైంది. కెనడా జనాభా 3.6 కోట్లు కాగా అందులో 10 లక్షలమంది భారత సంతతి పౌరులుంటారు. వీరిలో సగంమంది సిక్కులు. కొన్ని ప్రాంతాల్లో వీరి జనాభా అత్యధికం. రాజకీయంగా నిర్ణయాత్మకం. ఈ సిక్కుల్లో అధిక శాతంమంది ట్రుడో నేతృత్వంలోని పార్టీకి గట్టి మద్దతుదారులు. ట్రుడో ప్రభుత్వంలో నలుగురు సిక్కు మతస్తులున్నారు. డోనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడయ్యాక అమెరికా ఎడాపెడా వీసా నిబంధనలను కఠినం చేస్తున్న వర్తమానంలో అనేకులు కెనడావైపు ఆశగా చూస్తున్నారు. మన సాఫ్ట్వేర్ నిపుణులపై అమెరికా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ వేధిస్తుంటే వారికి కెనడా స్వాగతం పలుకుతోంది. పర్మినెంట్ రెసిడెన్సీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ‘ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ’ప్రారంభించి దానికింద సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఇంజనీరింగ్, వైద్యవిద్య తదితర రంగాల్లో నిపుణులైనవారు ఉద్యోగం లేకున్నా ఆర్నెల్ల వీసాపై రావడానికి అవకాశం ఇస్తోంది. ఫలితంగా ఆయా రంగాల్లో నిపుణులైనవారు కెనడాకు వెళ్లి ఉపాధి వెదుక్కునే వీలుంటుంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులకు పుష్కలంగా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ట్రుడోకు ఘన స్వాగతం లభించాలి. కానీ సిక్కు వేర్పాటువాదుల విషయంలో ఆ దేశం విధానాలు మన దేశానికి ససేమిరా నచ్చడం లేదు. వారిపట్ల కఠినంగా ఉండాలని మన దేశం డిమాండు చేస్తుంటే కెనడా పట్టించుకోవడం లేదు. ఇది ఇటీవల తలెత్తిన ధోరణి కాదు. పంజాబ్‌లో ఉగ్రవాదం పెచ్చరిల్లిన 80వ దశకం నుంచీ ఈ సమస్య ఉంది. 1985 జూన్‌లో కెనడాలోని టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానాన్ని మిలిటెంట్లు పేల్చే యడంతో 329మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో స్థిరపడ్డ సిక్కు నేతలు ఈ మిలిటెంట్లకు అండదండలిచ్చారని, వారిపై చర్య తీసుకోవాలని మన దేశం కోరినా అక్కడి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అందువల్లే లోగడ హార్పర్‌కు గానీ, ఇప్పుడు ట్రుడోకు గానీ ఘనస్వాగతం లభించలేదు. ఇదంతా చాలదన్నట్టు ట్రుడో రాక సందర్భంగా ఢిల్లీలోని కెనడా హైకమిషనర్ ఇచ్చిన విందులో ఖలిస్తాన్ మాజీ నాయకుడు జస్పాల్ సింగ్ అత్వాల్ పాల్గొన్నాడు. 1986లో కెనడా వెళ్లిన పంజాబ్ మంత్రి మాలిక్సింగ్ సిద్ధుపై హత్యాయత్నం చేసిన కేసులో అత్వాల్ 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. అతడు నిషేధిత అంతర్జాతీయ సిక్కు ఫెడరేషన్ కార్యకర్త. అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తికి ట్రుడో కార్యక్రమాల్లో చోటివ్వడం కెనడా చేసిన తప్పే కావొచ్చుగానీ... అసలు అతనికి భారత్ వీసా ఎలా లభించింది? ఈ మధ్యకాలంలో విదేశీయులు కొందరిని విమానాశ్రయాలనుంచే వెనక్కి పంపిన మన అధికారుల కన్నుగప్పి అతడెలా రాగలిగాడు? ట్రుడో పర్యటనలో కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అణు సరఫ రాదార్ల బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ ప్రవేశానికి తమ మద్దతుంటుందని ట్రుడో చెప్పారు. రెండు దేశాల మధ్య 840 కోట్ల డాలర్ల వాణిజ్యం ఉంది. కానీ ఈ అనుకూలాంశాలన్నీ అత్వాల్ ఉదంతం మింగేసింది. అధినేతల పర్య టనలున్నప్పుడు ఇరు దేశాల మధ్యా రెండు మూడు నెలల ముందు నుంచి కసరత్తు జరుగుతుంది. ఎవరెలాంటి పరిమితులు పాటించాలి...ఏ అంశాల్లో కలిసి కదలాలన్న అవగాహన ఉంటుంది. అవి ముగియకుండానే ట్రుడో వచ్చిన పర్య వసానంగా అంతా రసాభాసగా ముగిసినట్టు కనబడుతోంది. కెనడాతో సమస్యలుంటే ప్రస్తుతం రాకపోవడమే మంచిదన్న సంకేతాలు పంపాలి. అంతా సవ్యంగా ఉన్నదనుకున్నప్పుడే పిలవాలి. ట్రుడోను అవమానించారంటూ కెనడా మీడియా చేసిన వ్యాఖ్యల ప్రభావం అక్కడి మన పౌరులపై కూడా ఉంటుంది. ప్రపంచ దేశాల్లోనూ పలచనవుతాం. ఇలాంటి ఇరకాట పరిస్థితులు పునరావృతం కాకుండా చూడటం అవసరం. -
అతిథి దేవోభవ మాటల్లోనేనా?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావించినట్లయితే దాన్ని అంతగా పట్టించుకోవలసిన పని లేదు. కానీ అది వాస్తవమేనన్న అభిప్రాయం ప్రస్తుతం బాగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవం కంటే ఎరుక ప్రధానం అనడానికి ఇదొక స్పష్టమైన సందర్భం. దీని అర్థం ఏమిటంటే, భారత ప్రభుత్వం ట్రూడోను నిర్లక్ష్యం చేయనప్పటికీ–దాని ఉద్దేశం అది కాదని నమ్మడానికే నేను సిద్ధపడుతున్నాను–అలా చేసిందన్న ఆరోపణలకు గురికావడమే కాకుండా, దోషిగా నిలిచిందనే. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్య విషయం ఏమిటంటే, తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం జస్టిన్ ట్రూడోకు స్పష్టంగా తెలిసి ఉండటమే. తనకు అవమానం జరిగిందని ట్రూడో భావిం చనప్పటికీ, తాను అవమానానికి గురైనట్లు చాలామంది భారతీ యులు నమ్ముతున్నట్లు ఆయనకు తెలిసింది. పైగా అలాంటి అభిప్రాయం ట్రూడో సొంత దేశానికి కూడా చాలా స్పష్టంగా ఏర్పడింది. కాబట్టి నిజం ఏదైనప్పటికీ, తనను నేరుగా ఎవరూ అవమానించనప్పటికీ అలాంటి అనుభూతి ఆయనకు కలిగే ఉంటుంది. ఇరుదేశాల్లో ఏ పక్షానికీ ఇది మంచి చేసేది కాదు. ఏదేమైనప్పటికీ, ఈ అంశంలో వాస్తవాలకేసి నేను పరిశీలించదలిచాను. తనకు సరైన స్వాగతం లభించలేదని ట్రూడో భావిస్తున్నట్లు ఇవి సూచిస్తున్నాయా? ఉద్దేశపూర్వకంగానైనా లేక మరోవిధంగానైనా సరే దీనికి సమాధానం అవును అన్నదే. కెనడా ప్రధానికి స్వాగతం చెప్పడానికి భారత ప్రధాని విమానాశ్రయానికి రాలేదన్నదే ఒక అసందర్భమైన విషయం. కాగా, ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధుల స్థాయి సరైందేనా? పూర్తి స్థాయి కేబినెట్ మంత్రి విమానాశ్రయంలో కనబడలేదు. పైగా, కేంద్రప్రభుత్వం ఒక అనామక సహా యమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను అక్కడికి పంపింది. కెనడాతో మన సంబంధాలను మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉన్నందున ఆయనకు స్వాగతం పలకడానికి మన విదేశాంగ మంత్రి వచ్చి ఉంటే ఉత్తమంగా ఉండేది కదా. ఇది చిన్న విషయమే అనుకుంటే మరిన్ని ఘటనలు కూడా జరిగాయి. కెనడా ప్రధాని ఆగ్రా, అహమ్మదాబాద్ నగరాలను సందర్శించినప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు ఆయనను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. వారు ఇతర కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారంటే సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ ట్రూడో కెనడా ప్రధానమంత్రి. పైగా తాను ఇటీవలే భారత్ సందర్శనకు వచ్చిన కెనడా టూరిస్టు కాదు. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ రాష్ట్రాలను సంద ర్శించినప్పుడు ఈ సీఎంలిద్దరూ హాజరయ్యారు. ఈ విషయం కెనడా ప్రజలకు, వారి మీడియాకు స్పష్టంగా తెలిసే ఉంటుంది. అన్నిటికంటే మించి జస్టిన్ ట్రూడోకు స్వాగతం చెబుతూ ట్వీట్ పంపడంలో ప్రధాని మోదీ వైపు నుంచి జరిగిన వైఫల్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అది వైఫల్యమేనా? అది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఘటనలు కాకతాళీయంగా జరగవు. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవే. స్పష్టం కాకపోవచ్చు కానీ సూచనప్రాయంగా అయినా సరే వీటి వెనుక ఒక సందేశం ఉంది. ఆ సందేశం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే దాన్ని మనం అనేక రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. వీటిలో ఒక వ్యాఖ్యానాన్ని ఉపేక్షించడానికి వీల్లేదు. చాలా తరచుగా ట్వీట్లు చేస్తూ, డాంబికమైన కౌగిలింతలను ఆయుధంగా చేసుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు పాటిస్తున్న ఈ నిశ్శబ్దం కెనడియన్లకు చాలానే బోధపరుస్తుంది. బోధపర్చింది కూడా. ఈ ఉదంతంలో అతి ముఖ్య విషయం ఏదంటే, ఇంతవరకు జరుగుతూ వచ్చిన పరిణామాలు ఏవీ అవసరం లేదన్నదే. కెనడాతో మనకున్న అభిప్రాయభేదాలను లాంఛనప్రాయ చర్చలకు వదలిపెట్టవచ్చు. అక్కడే వీటికి మంచి పరిష్కారం దొరుకుతుంది. కానీ మీరు ఒకరిని మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు సాదరస్వాగతానికి హామీ ఇచ్చేలా అతిథితో యుక్తంగా వ్యవహరించాల్సి ఉంది. దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని సృష్టించాక, పదే పదే అలాంటి అభిప్రాయాలనే పునరావృతం చేయడం, వ్యాప్తిలోకి తీసుకురావడం వల్ల మీరు మీ అతిథితో చెడుగా వ్యవహరిస్తున్నారని అందరూ నమ్మేలా చేస్తుంది. అతిథి దేవోభవ భావనకే ఇది వ్యతిరేకం. అతిథిని దైవంగా భావించే భారతీయ సంప్రదాయం నుంచి తమను మినహాయించారనే భావనతోటే ట్రూడో దంపతులు స్వదేశానికి వెళతారని నేను భయపడుతున్నాను. చివరగా మన ఈ తరహా స్వాగతం, తన ఖలిస్తాన్ అనుకూల విధానాలను సవరించుకునేలా ట్రూడోను ప్రోత్సహిస్తుందా అని నా సందేహం. మన ఆతిథ్యం మరీ లాంఛనం కాకుండా మరింత ఉదారంగా ఉండినట్లయితే, అది తనకు నచ్చచెప్పేలా ఉండేది. ఒక తేలికపాటి పాఠాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అదేమిటంటే.. మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిని మీరు ఎన్నటికీ బాధించవద్దు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
ప్రధాని వేషంతో.. పరేషాన్..!!
న్యూఢిల్లీ: దుమారం రేగుతోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమర్శల పాలవుతున్నారు. వారం రోజుల పాటు ఇండియాలో పర్యటించేందుకు ఫిబ్రవరి 17న వచ్చిన ట్రూడో సంప్రదాయానికి భిన్నంగా కాషాయ వస్త్రాలతో కూడిన బాలీవుడ్ వేషధారణలో తిరగడంతో ఈ విమర్శల పరంపర ప్రారంభమైంది. దీనిపై నెటిజన్లు, మీడియా కెనడియన్ ప్రధానిపై మండిపడుతున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందిసూ..''ఇంతలా నటించాల్సిన అవసరం లేదు. ట్రూడో వ్యవహారం ఆక్షేపనీయంగా ఉంది. మీలా మేము రోజూ అంత ఆహార్యంగా బట్టలు ధరించలేము. బాలీవుడ్లో కూడా అలాంటి వస్త్రాలు వేసుకోరు'' అంటూ ట్వీట్ చేశారు. ట్రూడో చేతులు జోడించి ప్రజలకు దండాలు పెడుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. విమర్శలకు బదులిస్తూ.. ట్రూడో తనకు సంప్రదాయ దుస్తుల అంటే అమితమైన ఇష్టమని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తాను సూట్ వేసుకోలేదనా? లేదా సంప్రదాయ దుస్తులు ఎందుకు వేసుకున్నాననా? తేల్చుకోవాలన్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకో.. ఓ ట్వీ్టర్ ఖాతాదారుడు 90వ దశకంలో వచ్చిన బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ 'దిల్వాలే దుల్హానియా లేజాయెంగే' చిత్రంలోని సందర్భాన్ని గుర్తుచేస్తూ చేతులకు గోరింటాకు పెట్టుకో.. అని ట్రూడోను గేలీ చేశాడు. ట్రూడో సినిమా ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నాడు.. హాస్యనటుడు ట్రెవర్ నొహ ట్రూడోని ఉద్దేశించి..కెనడా ప్రధాని ఆస్కార్ పురస్కార చిత్రం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' లోని జయహో పాట ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నారని జోక్ పేల్చారు. కాగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ట్రూడో చేస్తున్న ఇండియా పర్యటనను 'విపత్తుని కొని తెచ్చే సందర్శన' అంటూ వ్యాఖ్యానించింది. స్వేచ్ఛావహ వాతావరణం గల దేశానికి అధినేత, స్త్రీవాది, సినిమా హీరోని పోలిన రూపం, ప్రజల పక్షపాతి అన్న పేరున్న జస్టిన్ ట్రూడో వ్యవహారం చూసి అందరూ నివ్వెర పోయారని తెలిపింది. ట్రూడో తన వారం రోజుల ఇండియా పర్యటనను ఏ మాత్రం ప్రయోజనం లేకుండా నిరాశతో నింపేశారని చురకలంటించింది. -
మా సమగ్రతను ప్రశ్నిస్తే సహించం
న్యూఢిల్లీ: భారత్ ఐక్యతను, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను సవాలుచేస్తే సహించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాజకీయ లక్ష్యాలు, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి మతాన్ని దుర్వినియోగం చేసేవారికి ప్రపంచంలో ఎక్కడా చోటు ఉండకూడదన్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులపై కెనడా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. శుక్రవారం నాడిక్కడ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ అయిన మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు.‘ ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. భిన్న సంస్కృతులున్న భారత్, కెనడా వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఉగ్రవాదం, తీవ్రవాదాలే ప్రధాన ముప్పు. వీటిని తుదముట్టించడానికి కలసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాం’ అని మోదీ అన్నారు. ట్రూడో పర్యటన సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, ఇంధన భద్రత, ఉన్నత విద్య, సైన్స్ అండ్ ఐటీ, మేధో సంపత్తి హక్కులు, అణు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ట్రూడో దేశమంతా పర్యటించడాన్ని ఉటంకిస్తూ.. భారత్‌లోని భిన్నత్వం ఈ పర్యటనలో ఆయనకు అర్థమై ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ట్రూడోకు ఘన స్వాగతం: అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రూడో కుటుంబానికి మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రూడోను మోదీ ఆలింగనం చేసుకున్నారు. పర్యటనలో భాగంగా ట్రూడో కుటుంబం రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించింది. మోదీ–ట్రూడోల సమావేశం అనంతరం ‘విభిన్న సంస్కృతులు, జాతుల సమాజాలున్న భారత్, కెనడాలు ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు, సమన్యాయ పాలనకు కట్టుబడి ఉన్నాయి. అల్‌కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి అంగీకరించాం’ అని భారత్–కెనడాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీలను కలుసుకున్నారు. ట్రూడో భార్య, పిల్లలతో సరదాగా ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ -
‘కనిష్క’ దారుణాన్ని మరచిపోయారా?
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఖలిస్థాన్ టెర్రరిస్ట్, 1986లో జరిగిన పంజాబ్ మంత్రి మలికియత్ సింగ్ సిద్ధూ హత్య కేసులో దోషి జస్పాల్ అత్వాల్ భారత్‌కు ఎలా వచ్చారు? భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ ట్రూడోతో ఈ నెల 20వ తేదీన ఎలా ఫొటో దిగారు? నగరంలోని కెనడా హైకమిషన్ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో దంపతుల గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఆయన్ని ఎందుకు ఆహ్వానించారు? అన్న ప్రశ్నలతో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటిష్ కొలంబియాలో వ్యాపారస్థుడిగా స్థిరపడిన జస్పాల్ అత్వాల్తోపాటు మరో 225 మందిపై భారత్‌కు రావడంపైనున్న ఆంక్షలను 2015లో ప్రధాని కార్యాలయం తొలగించినట్లు 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సిఫార్సు మేరకు కెనడా పర్యటనను ముగించుకొని వచ్చిన నరేంద్ర మోదీ ‘ట్రావెల్ బ్లాక్‌లిస్ట్’ నుంచి వీరి పేర్లు తొలగించినట్లు పార్లమెంట్‌కు ఇచ్చిన వివరణలో ఉందని తెల్సింది. ఖలిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నందున భారత్ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ దంపతులను నరేంద్ర మోదీ పెద్దగా పట్టించుకోవడం లేదని ఇటు అధికార వర్గాలు, అటు బీజేపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా గుర్తు రావాల్సిన మరో ముఖ్యమైన అంశాన్ని మర్చిపోయారు. 1985, జూన్ 23వ తేదీన కెనడా నుంచి భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ‘కనిష్క’ విమానాన్ని ఖలిస్థాన్ ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చివేయగా 329 మంది మరణించిన విషయం. అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్యకు చెందిన ఉగ్రవాదులే కెనడాలో ఆ విమానంలో బాంబు పెట్టారు. అదే యువజన సంఘానికి చెందిన వ్యక్తి ఇప్పటి జస్పాల్ అత్వాల్. మరణించిన 329 మందిలో 280 మంది కెనడా పౌరులు లేదా శాశ్వత కెనడా రెసిడెన్సీ కలిగిన పౌరులు మరణించినప్పటికీ కెనడాలో జరిగిన పెద్ద విమానం పేలుడు ప్రమాదంగాగానీ లేదా భారత్–కెనడా విమానం పేలుడు ప్రమాదంగాగానీ గుర్తించడానికి కెనడా ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది. చివరకు భారత్ అంతర్జాతీయ వేదికలపై విమానం పేల్చివేయడాన్ని ‘కెనడా 9–11’ గా వ్యవహరిస్తూ రావడం వల్ల దాన్ని పెద్ద దుర్ఘటనగా గుర్తించింది. ఖలిస్థాన్ ఉద్యమం పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. -
ఖలిస్తాన్ ఉగ్రవాదికి ఆహ్వానం
న్యూఢిల్లీ: ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్ద తు ఇవ్వబోమని హామీ ఇచ్చి ఒక్కరోజు గడవకముందే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దేశరాజధానిలో గురువారం ట్రూడో గౌరవార్థం కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ నిర్వహించనున్న విందుకు ఆ దేశ అధికారులు సాక్షాత్తూ ఓ ఉగ్రవాదికి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీని ట్రూడో కలుసుకోవడానికి కేవలం ఒక్కరోజు ముందే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రూడో.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1986లో కెనడా పర్యటనకు వెళ్లిన పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్ధూపై వాంకోవర్‌లో హత్యాయత్నం చేసిన ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ సభ్యుడు జస్పాల్ అత్వాల్‌కు కెనడా అధికారులు గురువారం విందుకు ఆహ్వానం పంపారు. మంత్రిపై దాడి చేసినందుకు అప్పట్లో జస్పాల్‌కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ట్రూడో గౌరవార్థం అంతకుముందు ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరైన జస్పాల్, ఏకంగా కెనడా ప్రధాని భార్య సోఫీ, మంత్రి అమర్జిత్ సోహీలతో ఫొటోలు కూడా దిగాడు. ఈ ఫొటోల్లో ఉన్న జస్పాల్‌ను కెనడియన్ మీడియా గుర్తించడంతో ఆ దేశ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కెనడా హైకమిషన్.. జస్పాల్‌కు పంపిన ఆహ్వానాన్ని రద్దుచేసింది. తన సిఫార్సుతోనే కెనడా హైకమిషన్ సిబ్బంది జస్పాల్‌ను విందుకు ఆహ్వానించారని కెనడా ఎంపీ రణ్‌దీప్ సురాయ్ అంగీ కరించారు. జస్పాల్ భారత్‌కు వచ్చేందుకు వీసా ఎలా లభించిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది. -
కెనెడా ప్రధాని డిన్నర్.. ఉగ్రవాదికి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొనే విందు కోసం ఖలిస్తానీ ఉగ్రవాదికి ఆహ్వానం అందించటం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రూడో కోసం ఢిల్లీలోని కెనడా హైకమిషర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఓ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఖలీస్థాన్ ఉద్యమకారుడు జస్పల్ అట్వల్కు కెనడా రాయబార కార్యాలయం ఆహ్వానం పంపింది. మీడియాలో దీనిపై కథనాలు రావటంతో పంజాబ్ ప్రభుత్వం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. కెనడియన్ ఎంబసీ స్పందించింది. ఆయన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. 1986లో పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్దూపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో జస్పల్ను కోర్టు ఉగ్రవాదిగా తేల్చింది. ఈ కేసులో జస్పల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. జస్పల్ సభ్యుడిగా ఉన్న ఇంటర్నేషనల్ సిక్క్ యూత్ ఫెడరేషన్‌పై నిషేధం కూడా విధించబడింది. జైలు నుంచి బయటికొచ్చాక కెనడా రాజకీయాల్లో జస్పల్ క్రియాశీలకంగా వ్యవహరించటం ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తాయి.ఇక తాజాగా ట్రూడో హాజరయిన ముంబై ఈవెంట్లో సందడి చేసిన జస్పల్.. ట్రూడో భార్య సోఫీతో, కెనెడా మంత్రి అమర్జీత్ సోహితో ఫోటోలు కూడా దిగారు. -
‘ఖలిస్తాన్’కు మద్దతు ఇవ్వం
అమృత్సర్: భారత పర్యటనలో భాగంగా బుధవారం పంజాబ్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబ సమేతంగా పంజాబీ సంప్రదాయ వస్త్రధారణతో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ట్రూడో, కెనడా రక్షణమంత్రి హర్జిత్ సజ్జన్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఓ హోటల్లో దాదాపు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో ఉంటూ పంజాబ్‌లోని యువతను విద్వేష నేరాలు, ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్న 9 ఖలిస్తాన్ వేర్పాటువాదుల జాబితాను అమరీందర్ ట్రూడోకు అందజేశారు. వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. భారత్ సహా మరెక్కడా వేర్పాటువాద ఉద్యమాలకు కెనడా మద్దతివ్వబోదని ట్రూడో హామీ ఇచ్చినట్లు పంజాబ్ సీఎం మీడియా సలహాదారు రవీన్ థుక్రల్ తెలిపారు. క్యూబెక్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని తాను ఎదుర్కొన్నాననీ, ఇలాంటి హింసతో వచ్చే ప్రమాదాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఈ సమావేశంలో ట్రూడో చెప్పినట్లు వెల్లడించారు. ‘తమ ప్రభుత్వం ఎలాంటి వేర్పాటువాద ఉద్యమానికి మద్దతివ్వబోదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం. ట్రూడో వ్యాఖ్యలు భారత్‌లోని అందరికీ చాలా ఊరట కల్గించాయి. భవిష్యత్‌లో కూడా వేర్పాటువాద శక్తుల్ని ఏరివేయడానికి కెనడా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం’ అని భేటీ అనంతరం అమరీందర్ ట్వీట్ చేశారు. అంతకుముందు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గోబింద్‌సింగ్ లంగోవాల్లు ట్రూడో కుటుంబానికి స్వర్ణ మందిరంలోకి ఘన స్వాగతం పలికారు. భార్య, ఇద్దరు చిన్నారులతో కలసి ఆలయంలో ప్రార్థనల్లో పాల్గొన్న ట్రూడో.. ఆ తర్వాత ఇక్కడి గురు రాందాస్‌జీ లంగర్లో కుటుంబ సభ్యులతో కలసి చపాతీలు తయారుచేశారు. -
మోదీ ఆలింగనాలు ట్రూడోకు లేవా?
న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంట కేంద్ర మంత్రులెవరూ కనిపించడం లేదు. సంప్రదాయ దుస్తుల్లో తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం, సబర్మతీ ఆశ్రమం సందర్శించినప్పుడు ఆయనతో భార్య, ముగ్గురు పిల్లలే ఉన్నారు. కెనడాతో(జనాభా మూడున్నర కోట్లు) పోల్చితే చిన్న దేశం ఇజ్రాయెల్(84 లక్షలు) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల ఇండియా వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు. కెనడాతో భారత్‌కు వందేళ్లకు పైగా సంబంధాలున్నాయి. అక్కడ భారత సంతతికి చెందిన జనాభా సుమారు నాలుగు శాతం(దాదాపు 14 లక్షలు). ఈ నేపథ్యంలో వారం రోజుల అధికారిక పర్యటనపై వచ్చిన ట్రూడోతో భారత సర్కారు అంటీముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు. కెనడాలో దాదాపు 1.4% జనాభా, పార్లమెంటులో 17 మంది సభ్యుల ప్రాతినిధ్యమున్న సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, పరోక్షంగా మద్దతిస్తోందని మోదీ సర్కారు, ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ‘ఖలిస్తాన్’పై నిరసనా? పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొద్దిమంది మద్దతు ఇచ్చిన మాట నిజమే. 1985లో టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు దారిలోనే బాంబులతో కూల్చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను వేటాడి చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’ అని వర్ణించడం అప్పటి కేంద్ర సర్కార్లకు నచ్చలేదు. ఇప్పటికీ కెనడా సిక్కుల్లో కొద్ది మంది ఖలిస్తాన్ ప్రస్తావన తేవడం ఇండియాకు మింగుడుపడడం లేదు. ట్రూడో మంత్రివర్గంలో కేబినెట్ (రక్షణ శాఖ) మంత్రి హర్జీత్‌సింగ్ సజ్జన్ ఖలిస్తానీ సానుభూతిపరుడంటూ కిందటేడాది ఆయనను కలుసుకోవడానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ నిరాకరించారు. కెనడా యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేస్తున్న, అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ‘ ట్రూడో పర్యటనను మోదీ చూసీచూడనట్టు వ్యవహరించడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాద సమస్యకు సంబంధించి కెనడా సర్కారు వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నామని భారత్ ఇలా బలమైన సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది’’ అని బ్రూకింగ్స్ ఇండియాలో నిపుణుడు ధ్రువ జైశంకర్ అన్నారు. -
ట్రూడోతో పేచీ దేనికి?
శనివారం నుంచి దేశంలో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంట భారత మంత్రులు ఎవరూ తిరగడం లేదు. ఆగ్రా తాజ్‌మహల్. అమృత్సర్ స్వర్ణదేవాలయం, గుజరాత్ సబర్మతీ ఆశ్రమం సందర్శించినప్పుడు ట్రూడోతోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలే కనిపించారు. భారతీయ దుస్తుల్లో ఉన్న ట్రూడో ఫ్యామిలీ ఫోటోలే పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. కిందటివారం దిల్లీ విమానాశ్రయంలో దిగిన ట్రూడోకు స్వాగతం పలికిన భారత అధికారుల్లో ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ సభ్యులెవరూ లేరు. (సాక్షి ప్రత్యేకం) కెనడాతో(జనాభా మూడున్నర కోట్లు) పోల్చితే చిన్న దేశం ఇజ్రాయెల్(84 లక్షలు) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల ఇండియా వచ్చినప్పుడు రాజధాని ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు. అదీగాక కెనడాతో వందేళ్లకు పైగా భారత్‌కు సంబంధాలున్నాయి. అక్కడ భారత సంతతికి చెందిన జనాభా నాలుగు శాతం(దాదాపు 14 లక్షలు) ఉన్నారు. ఇండియా మాదిరిగానే కెనడా ప్రజాస్వామ్యి దేశం. (సాక్షి ప్రత్యేకం) ఈ నేపథ్యంలో వారం రోజుల అధికార పర్యటనపై వచ్చిన ట్రూడోతో భారత సర్కారు అంటీముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు. కెనడాలో దాదాపు 1.4 శాతం జనాభా, పార్లమెంటులో 17 మంది సభ్యుల ప్రాతినిధ్యమున్న సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, పరోక్షంగా మద్దతిస్తోందని మోదీ సర్కారు, ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించడమే ట్రూడోకు ఘనస్వాగతం లభించకపోవడానికి కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సిక్కుల కార్యక్రమంలో ట్రూడో కిందటేడాది ట్రూడో పాల్గొన్న టోరంటో సిక్కుల కార్యక్రమంలో 1984 అమృత్సర్ సైనిక చర్యలో మరణించిన సంత్ జర్నాయిల్‌సింగ్ భింద్రన్‌వాలే ఫోటోలున్న పోస్టర్లు ప్రదర్శించారు. పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొద్దిమంది మద్దతు ఇచ్చిన మాట నిజమే. 1985లో టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు దారిలోనే బాంబుపేలుడుతో కూల్చేశారు. ఈ కేసులో శిక్షపడిన ఒకే ఒక సిక్కు తీవ్రవాది రెండు దశాబ్దాలు జైలు జీవితం గడిపాడు. (సాక్షి ప్రత్యేకం) కెనడా కోర్టు ఆదేశంపై కింటేడాది ఆయనను విడుదల చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను వేటాడి చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’ అని వర్ణించడం అప్పటి కేంద్ర సర్కార్లకు నచ్చలేదు. ఇప్పటికీ కెనడా సిక్కుల్లో కొద్ది మంది ఖలిస్తాన్ ప్రస్తావన తేవడం ఇండియాకు మింగుడుపడడం లేదు. కిందటేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ(ఆమ్) తరఫున కెనడా నుంచి వచ్చిన సిక్కులు ప్రచారం చేయడమేగాక ఆ పార్టీకి నిధులు సమకూర్చారంటూ పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఆరోపించారు. ట్రూడో మంత్రివర్గంలో కేబినెట్ (రక్షణ శాఖ) మంత్రి హర్జీత్‌సింగ్ సజ్జన్ ఖలిస్తానీ సానుభూతిపరుడంటూ కిందటేడాది ఆయనను కలుసుకోవడానికి అమరీందర్ నిరాకరించారు. (సాక్షి ప్రత్యేకం) ఖలీస్తానీలే అసలు సమస్యా? ఇంథన భద్రత నుంచి విద్యారంగం వరకూ కెనడా, ఇండియా మధ్య పలు రంగాల్లో 600 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగిందని 2016 అంచనాలు చెబుతున్నాయి. కెనడా యూనివర్పిటీల్లో చదువుకునే, అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేసే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. (సాక్షి ప్రత్యేకం) అమెరికాలో మాదిరిగాకాక కెనడాలో భారతీయులకు శాశ్వత నివాస సౌకర్యం(పీఆర్) తేలికగా లభిస్తోంది. ఇలా అనేక రకాలుగా దశాబ్దాలపాటు సత్సంబంధాలు కొనసాగుతున్న రెండు ప్రజాతంత్ర దేశాల మధ్య ప్రస్తుత ‘పేచీ’కి ఖలిస్తాన్ సమస్య ఒక్కటే అసలు కారణం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ట్రూడో, మోదీ మధ్య సన్నిహిత రాజకీయబంధం లేకపోవడమే ప్రస్తుత వివాదానికి మరో కారణమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ‘‘ ట్రూడో పర్యటనను మోదీ చూసీచూడనట్టు వ్యవహరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాద సమస్యపై కెనడా సర్కారు వైఖరిపై తమకు తీవ్ర అసంతృప్తిగా ఉందని భారత్ ఇలా బలమైన సంకేతం పంపించినట్టు కనిపిస్తోంది.’’ అని బ్రూకింగ్స్ ఇండియాలో నిపుణుడు ధ్రువ జైశంకర్ అన్నారు. (సాక్షి ప్రత్యేకం) -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'పంజాబ్‌కు ఏం కాదు.. కలిసే ఉంటుంది'
సాక్షి, అమృత్సర్ : ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. భారత్‌లోగాని, మరెక్కడైనాగానీ విభజన ఉద్యమాలకు తమ దేశం మద్దతివ్వబోదని చెప్పారు. ఖలిస్థాన్ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు కూడా తన వంతు కృష్టి చేస్తానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు ట్రూడో హామీ ఇచ్చారు. పంజాబ్ ఎప్పటికీ కలిసే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని ఆయన హామీ ఇచ్చారు. కెనడాలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తుండటంతో ట్రూడో పంజాబ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ డిమాండ్ సరైనది కాదని, ఐక్య పంజాబ్ తమకు కావాలని, ఈ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు తమకు సహకరించాలని ట్రూడోను సీఎం అమరిందర్ సింగ్ కోరారు. 'నేను ట్రూడోకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఖలిస్తాన్ అనేది ప్రధాన సమస్య. దీనికోసం వివిధ దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా కెనడా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి మీరు సహకరించొద్దు. ఐక్యభారత్కు సహకరించాలి' అని తాను ట్రూడోను కోరినట్లు చెప్పారు. అందుకు ట్రూడో నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. -
షారుక్‌ను కలిసిన కెనడా ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను కలిశారు. సినీ, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమానికి ట్రుడో సంప్రదాయ బంగారు వర్ణ షేర్వాణీని ధరించి రావడం చూపరులను ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్లు షారూక్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా పలువురు ట్రుడోతో తాము కలిసిఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు షారుక్‌తో తన ఫోటోలను ట్రుడో సైతం షేర్ చేయడంతో పాటు కొత్త నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇండో-కెనడా భాగస్వామ్యాలతో సినిమాల నిర్మాణం ఊపందుకుంటుందని వెల్లడించారు. భారత, కెనడా చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తాయని ట్రూడో పేర్కొన్నారు. కెనడా ప్రధాని వారం రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. -
నాట్ జస్ట్ మిసెస్ ట్రూడో
‘‘కాబట్టి డియర్.. ఒక నాయకుడిగా నువ్వు ప్రజల కష్టాలు తొలగించాలంటే శాంత చిత్తంతో సుస్థిర నిర్ణయాలు తీసుకోవాలి. అదెలా అలవడుతుందో తెలుసా? ఒకటి నా పాటతో, రెండు యోగా సాధనతో..’’ అంటూ గట్టిగా నవ్వేస్తారు సోఫీ గ్రెగ్వా ట్రూడో. ఇదేదో ప్రైవేటు సంభాషణ కాదు.. వందల మంది అతిథులు, పదుల సంఖ్యలో మీడియా కెమెరాల సాక్షిగా ఇచ్చిన సలహా. ‘యెస్ మై లవ్.. ఏనాడైనా నీ మాట కాదన్నానా.. అసలు నువ్వే లేకుంటే నేను ప్రధానమంత్రిని అయ్యేవాడినా’ అని శిరస్సు వంచుతారు జస్టిన్ ట్రూడో! ప్రస్తుతం ఆ జంట తొలిసారి మన దేశంలో పర్యటిస్తున్నారు. ప్రపంచంలోనే వైశాల్యంలో రెండో అతిపెద్ద దేశం కెనడాకు 2015లో యువ(43ఏళ్ల వయసులో) ప్రధానిగా ఎన్నికయ్యారు జస్టిన్ ట్రూడో. శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన కెనడాను ఆయన పరిపాలిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాల్లోని భిన్నత చాలాసార్లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ట్రంప్ వచ్చిన తర్వాత వలసదారుల్ని అమెరికా గెంటేస్తే.. వారిని కెనడాకు రమ్మని ఆహ్వానం పలకడంగానీ, పాక్ సాహసబాలిక మలాలకు కెనడా పౌరసత్వమిచ్చి సత్కరించడంగానీ, ఎప్పుడో 1914లో హిందూ, సిక్కు, ముస్లింలు ఉన్న ఓడను కెనడా వెనక్కి పంపిన ఘటనకు.. 2016లో జస్టిన్ ట్రూడో క్షమాపణలు చెప్పడం, మొన్నటి పొంగల్ వేడుకల్లో సౌత్ ఇండియన్ స్టైల్లో పంచె కట్టడంగానీ, నిన్నటికినిన్న తొలిసారి భారతావనిపై అడుగుపెట్టినప్పుడు కుటుంబమంతా చేతులు జోడించి నమస్కరించిన తీరుగానీ.. ట్రూడో శాంతచిత్తాన్ని, భార్య సూచనల్ని ఆచరిస్తున్నాడన్న వాస్తవాన్ని తెలియపరుస్తాయి. యోగాసాధనతో తను తాను నూతనంగా మలుచుకున్న సోఫీ గ్రెగ్వా ట్రూడో.. జర్నలిస్టుగా, సేవాకార్యక్రమాల నిర్వాహకురాలిగా, మహిళలు, బాలికల సాధికారతకోసం శ్రమిస్తోన్న ధీరగా ఇప్పటికే పేరు సంపాదించారు. అందుకే అభిమానులు ఆమెను ‘ఫస్ట్ లేడీ’ అనడంకన్నా ‘నాట్ జస్ట్ మిసెస్ ట్రూడో’ అని గౌరవించుకుంటారు. ఇండియాలో ఆమెకంటూ ప్రత్యేక షెడ్యూల్ : కెనడా కేంద్రంగా మహిళా సాధికారత కోసం పనిచేస్తోన్న పలు స్వచ్ఛంద సంస్థల్లో సోఫీ ట్రూడో వాలంటీర్‌గా కొనసాగుతున్నారు. ఆ లాభాపేక్షరహిత సంస్థలన్నీ.. బాలికా విద్య, మహిళలు, గర్భిణుల ఆరోగ్యం, కేన్సర్ నివారణ, మానసిక రుగ్మతల నిర్మూలన, గృహ హింసకు వ్యతిరేక, తదితర లక్ష్యాలతో పనిచేస్తున్నాయి. సేవా కార్యక్రమాలకు నిధులు సేకరించడం దగ్గర్నుంచి క్షేత్రస్థాయి పనుల దాకా అన్నీ తానై వ్యవహరిస్తుందామె. ‘బికాజ్ ఐయామ్ ఎ గర్ల్’, ‘ది షీల్డ్ ఆఫ్ ఎథీనా’, ‘వాటర్‌క్యాన్’ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సేవా సంస్థలకు సోఫీ అంబాసిడర్ కూడా. ఢిల్లీ విమానం ఎక్కేముందు..‘‘నమస్తే, మేం ఇండియాకి వెళుతున్నాం.. ఇరుదేశాల(కెనడా-భారత్) మధ్య సంబంధాలు బలపడటం ఒక ఎత్తైతే, భారత మహిళలు, బాలికల సాధికారత గురించి తెలుసుకుని, వారితో నేరుగా మాట్లాడబోవడం గొప్ప విషయంగా భావిస్తున్నా’’ అని సోఫీ తన ఫేస్బుక్లో రాసుకున్నారు. ఏడురోజుల భారత పర్యటనలో భర్త వెన్నంటే కాకుండా తనకంటూ ప్రత్యేక షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారామె. ముంబైలోని సోఫియా కాలేజీలో విద్యార్థినులతో భేటీ, మహిళల, బాలికల సాధికారత కోసం పనిచేస్తోన్న ఎన్జీవోలను కలుసుకోవడం, ఢిల్లీలో ‘న్యూట్రిషన్ ఇంటర్నేషనల్’ ఎన్జీవో కార్యాలయాన్ని సందర్శించడం తదితర కార్యక్రమాల్లో సోఫీ పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు.. ప్రేమికులయ్యారు.. లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా రెండోతరం నాయకుడు, ఆ దేశానికి 15 ఏళ్లపాటు ప్రధానిగా సేవలందించిన వ్యక్తి జోసెఫ్ ఫిలిప్ ట్రూడో. ఆయన పెద్దకుమారుడే జస్టిన్ ట్రూడో. జస్టిన్ తమ్ముడు మిచెల్‌కు సోఫీ క్లాస్మేట్. అలా చిన్నతనంలోనే జస్టిన్-సోఫీలు స్నేహితులయ్యారు. కొంతకాలంపాటు ఎవరి చదువుల్లో వారు బిజీ అయిపోయి మళ్లీ 2003లో ఓ చారిటీ ప్రోగ్రామ్‌లో కలుసుకున్నారు. కొద్దినెలల డేటింగ్ తర్వాత 2005లో పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. జేవియర్ జేమ్స్ ట్రూడో(పెద్దకొడుకు), ఎల్లా గ్రేస్ మార్గరేట్ ట్రూడో(కూతురు), హాడ్రిన్ గ్రెగ్వా ట్రూడో(చిన్నోడు). పెద్దింటి కోడలు అయినప్పటికీ సోఫీ తన ఇంటిపేరును మాత్రం మార్చుకోలేదు. జస్టిన్ కూడా ఆమెను ‘గ్రెగ్వా ట్రూడో’గా సంబోధించడానికి ఇష్టపడతారు. జీవితాన్ని మార్చేసిన యోగా.. మాంట్రియల్‌కు చెందిన స్టాక్‌బ్రోకర్-నర్స్ దంపతులకు జన్మించిన సోఫీ.. టీనేజ్‌లో ఉన్నప్పుడు బులిమియా నెర్వోసా (అతిగా ఆహారం తీసుకునే) రుగ్మతకు గురయ్యారు. అది చికిత్స అవసరమైన తీవ్ర స్థాయి రుగ్మత కావడంతో బయటపడేందుకు చాలా కష్టపడాల్సివచ్చింది. కెనడాలోని భారతీయ స్నేహితుల ద్వారా యోగా గురించి తెలుసుకున్న సోఫీ.. క్రమం తప్పకుండా అభ్యసించి పూర్తిగా కోలుకున్నారు. అప్పటినుంచి యోగా ఆమె జీవితంలో ముఖ్య భాగమైపోయింది. 2012నాటికి గుర్తింపు పొందిన యోగా శిక్షకురాలయ్యారు. తాను పాల్గొనే ప్రతి కార్యక్రమంలో యోగా విశిష్టతను గుర్తుచేస్తూ ఉంటారామె. జర్నలిస్టుగా ఖ్యాతి : మాంట్రియల్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్ డిగ్రీ పట్టాసాధించిన సోఫీ.. ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో రిసెప్షనిస్టుగా కెరీర్ ప్రారంభించి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత రేడియో అండ్ టెలీవిజన్ స్కూల్లో జర్నలిజం పాఠాలు నేర్చుకుని న్యూస్ టిక్కర్లు రాసేపనిలో చేరారు. కళలు, సాంస్కృతిక అంశాలు, సినిమాలపై గట్టి పట్టున్న ఆమెను.. ఎల్‌సీఎన్ చానెల్వాళ్లు రిపోర్టర్‌గా తీసుకున్నారు. విజయవంతంగా వార్తలు అందించిన ఆమె పలు టీవీ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించారు. ప్రఖ్యాత సీటీవీ చానెల్లో ఐదేళ్లు పనిచేసిన సోఫీ.. ‘ఈ టాక్’ ప్రోగ్రామ్ ద్వారా మరింత పేరు సంపాదించారు. 2016లో మార్టిన్ లూథర్ కింగ్ డే(జనవరి 18) సందర్భంగా ఒట్టావాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సోఫీ.. ఆఖర్లో ఓ పాట పాటి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘స్మైల్ బ్యాక్ ఎట్ మీ’ పేరుతో స్వయంగా కంపోజ్ చేసిన ఆ పాటను తన కూతురికోసం రాశానని సోఫీ ప్రకటించారు. ‘ Some people doubt that angels can fly.. Some people fight without knowing why అంటూ మొదలైన పాట.. What's between you and me.. When you smile back at me వాక్యాలతో ముగియగానే స్టాండిగ్ ఓవేషన్ లభించింది. - సాక్షి వెబ్‌డెస్క్ వివిధ సందర్భాల్లో భారత సంతతి సమూహాలతో ట్రూడో.. -
ఆయన్ను కాదని కర్ణాటకకు మోదీ
న్యూఢిల్లీ : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో సోమవారం గుజరాత్లో పర్యటిస్తున్నారు. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ట్రుడోతో కలసి గుజరాత్‌కు రావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో మోదీ పర్యటించనున్నారు. మోదీ ప్రవర్తనపై కెనడా ప్రధానమంత్రి బాధ పడుతున్నారట. ఈ మేరకు కెనడీయన్ మీడియా పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహులతో కలసి ప్రధాని మోదీ గతంలో గుజరాత్లో పర్యటించారు. ప్రధాని స్థాయి వ్యక్తితో కలసి పర్యటించకుండా.. మోదీ కర్ణాటకలో పర్యటించడంపై కెనడా మీడియా విరుచుకుపడింది. కెనడాలో పెరుగుతున్న సిక్కుల రాడికలిజమ్, ఖలిస్తాన్ దేశ ఏర్పాటుకు మద్దతులపై ఈ ప్రభావం ఉంటుందని భారత్‌ను హెచ్చరించింది. దీనిపై స్పందించిన భారత అధికారులు.. అతిథ్యానికి విచ్చేసిన ప్రతి ప్రతినిధితో కలసి ప్రధానమంత్రి పర్యటించలేరని చెప్పారు. గత శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో కలసి ప్రధాని పర్యటించలేదని వివరించారు. కాగా, గుజరాత్ పర్యటనలో ట్రుడో.. అక్షరధామ్ ఆలయం, సబర్మతీ ఆశ్రమంను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు వచ్చే శుక్రవారం జస్టిన్ ట్రుడోతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అవుతారు. -
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన జస్టిన్ ట్రూడో
-
సబర్మతీ ఆశ్రమంలో.. సంప్రదాయ దుస్తుల్లో!
సాక్షి, అహ్మదాబాద్ : భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గుజరాతీ సంప్రదాయ దుస్తులు ధరించి భార్య సోఫీ, పిల్లలు జేవియర్, హడ్రియెన్, ఎల్లా గ్రేస్‌తో కలిసి ట్రూడో సబర్మతి ఆశ్రమాన్ని తిలకించారు. సబర్మతిలోని మహాత్మాగాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడో, ఆయన భార్య సోఫీ చరఖా తిప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ట్రూడో ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ ఎదురుగా సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రూడో శనివారం ఢిల్లీకి వచ్చారు. 2012 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. -
తాజ్ ముందు ట్రూడో.. ఫొటోలో టవల్‌తో కేజ్రీవాల్!
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆదివారం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్ ఎదుట ట్రూడూ భార్య, పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. అయితే, ఈ ఫొటోలో ఓ పొరపాటు కాంగ్రెస్ నేత శశి థరూర్ కంటబడింది. ఆయన ఆనందభరితలయ్యారు. వెంటనే ట్వీట్ చేశారు. తాజ్‌మహల్ ముందు ట్రూడో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలో స్విమ్మింగ్ దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి పడగలిగాడు. ఏకంగా ప్రధాని ఫొటోలో ఫొటోబాంబ్ అయ్యాడు’ అని శశి ట్వీట్ చేశారు. నిజానికి శశి ట్వీట్ చేసిన ఆ ఫొటోలో ట్రూడో కుటుంబం వెనుక ఉన్నది ఎవరో కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజ్ ముందు ట్రూడో ఫ్యామిలీ ఫొటోలో ఆయన టవల్లో ఉన్నట్టు ఎవరో ఫొటోషాప్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండా నిజమైన ఫొటోనేమోనని థరూర్ అనుకున్నారు. తర్వాత ఆయన సారీ చెప్పారు. అది ఫొటోషాప్ చేసిన చిత్రమని గుర్తించలేకపోయానని, సోషల్ మీడియాలో నిజంగా అనిపించే చిత్రాలను కూడా నమ్మలేమని ఆయన ట్వీట్ చేశారు. Sir who photoshopped this? And is this man arvind kejriwal? — Wasi Mohammad (@WasiMd110) 18 February 2018