పారిస్ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల ఫొటోపై నెటిజన్లు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని...చాలా మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ #మెలానియాలవ్స్‌ట్రూడో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ 7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు పలువురు వారి జీవిత భాగస్వాములతో హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం దేశాధినేతల కుటుంబాలు ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. ఫొటోలు దిగుతున్న సమయంలో మెలానియా తన పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను మర్యాదపూర్వకంగా ముద్దుపెట్టుకున్నారు.
ఇక అదే సమయంలో పక్కనే ఉన్న ట్రంప్ కళ్లు కిందకు వాల్చుకున్నట్లుగా ఉన్న ఫొటోను రాయిటర్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. ‘ జీ7 ఫ్యామిలీ ఫొటోషూట్‌లో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ముద్దాడారు. అప్పుడు ట్రంప్ కిందకు చూస్తుండిపోయారు’ అంటూ జీ 7 సదస్సు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మెలానియా-ట్రూడో-ట్రంప్‌ల ఫొటోపై స్పందించిన నెటిజన్లు...‘ట్రంప్‌నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్ చేయడానికి వెనుకాడటం లేదనుకుంటా’ అంటూ విపరీర్థాలతో కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది గతంలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రూడో పక్కన కూర్చున్న ఫొటోను, ప్రస్తుతం మెలానియా ఫొటోను పోలుస్తూ...‘ ఇవాంకా, మెలానియా ట్రూడో వైపు ఎలా చూస్తున్నారో గమనించండి. మీ జీవితంలో అట్లాంటి వ్యక్తి రావాలని కోరుకోండి. ఎంతైనా ట్రూడో భలే అందగాడు. ఇదే కాదు గతంలో ఎన్నోసార్లు మెలానియా ట్రూడోను ఇలాగే చూశారు. అసలు విషయం ఏమిటో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
First lady Melania Trump kisses Canadian Prime Minister Justin Trudeau during the #G7 family photo as President Trump looks on. More of today’s top photos: https://t.co/xLPy8OSSmW pic.twitter.com/m5285qjAFr
— Reuters Top News (@Reuters) August 26, 2019
Comments
Please login to add a commentAdd a comment