Melania Trump
-
వైట్‌హౌస్‌పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు. గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్‌పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్‌ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్‌గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్‌ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్‌్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్‌్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్‌కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్‌లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్‌ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్‌్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్‌ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్‌ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్‌కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్‌ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్‌ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్ అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ ఘటన ఇది. ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు. pic.twitter.com/IGIWzL6SMJ— MELANIA TRUMP (@MELANIATRUMP) July 14, 2024 -
ట్రంప్ దంపతుల విడాకులు ఖాయమేనా..
వాషింగ్టన్: అమెరికాలో వాళ్ల అధికారం ముగిసియడంతో ట్రంప్ దంపతులు వైట్‌హౌజ్ వీడి తిరుగు పయనం అయ్యారు. ఈ నేపథ్యంలో విమానంలో ఫ్లోరిడా చేరుకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లను మీడియా పలకరించింది. అయితే విమానం నుంచి దిగుతున్న వారికి మీడియా ఎదురుపడి ఫొటోలు తీస్తుండగా ట్రంప్ వారిని గుర్తించి కెమెరాలకు ఫోజ్ ఇచ్చారు. అయితే మెలానియా ట్రంప్ మాత్రం ఆగకుండా తన దారిన సైలెంట్‌గా వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెలానియా తీరుపై నెటిజన్లు మీమ్స్ క్రియోట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ట్రంప్‌తో కలిసి ఫోజ్ ఇవ్వడం ఇష్టం లేకే ఆమె ఇలా చేశారంటూ మరోసారి వారి విడాకుల విషయంపై చర్చించుకుంటున్నారు. (చదవండి: వైట్‌హౌజ్‌ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!) If “I’m over it” were a person. pic.twitter.com/CLA8WucyXX — The Lincoln Project (@ProjectLincoln) January 21, 2021 ‘4 సంవత్సరాల తర్వాత మెలానియా చివరకు మళ్లీ సంతోషంగా నవ్వుకుంటున్నారు. ప్రకృతి తనకు సహకరిస్తోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ట్రంప్ వైట్‌హౌజ్‌ను వీడాక మెలానియా విడాకులు ఇవ్వనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మెలానియా తీరు చూసి నెటిజన్లు త్వరలోనే భర్త డొనాల్డ్ ట్రంప్‌కు ఆమె విడాకులు ఇవ్వడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ట్రంప్ రాజకీయ సహాయకురాలు ఓమరోసా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే మెలానియా ట్రంప్‌కు విడాకులు ఇవ్వనున్నారు. తన 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు ఎదురుచుస్తున్నారు. ట్రంప్‌కు భార్యగా తను నిమిషాలు లెక్కబెడుతున్నారు. వైట్‌హౌజ్ వీడిన అనంతరం విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు’ ఒమరోసా తను రాసిన పుస్తకంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. (చదవండి: విడాకులు : మెలానియాకు భారీ మొత్తంలో..) After 4 long years, @MELANIATRUMP can finally smile again! Nature is healing. pic.twitter.com/bRNoR5PBrh — 🌸Sleepy Moogle🌸 (@BaileysComet_xo) January 22, 2021 -
మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ ఓటమి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విధిలేని పరిస్థితుల్లో శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు బుధవారం ఉదయం ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు వైట్‌హౌస్ వీడి ఫ్లోరిడాకు వెళ్లారు. ముందుగా చెప్పినట్టుగానే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరు కాలేదు. అధ్యక్షులు మాత్రమే వినియోగించే మెరైన్ వన్ హెలికాప్ట్టర్‌లో ఫ్లోరిడాలోని తాను నివాసం ఉండబోయే మార్ ఏ లాగో ఎస్టేట్‌కి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్లో మెరైన్ వన్ హెలికాప్టర్లోకి వెళ్లడానికి ముందు ట్రంప్ తనకు వీడ్కోలు చెప్పిన మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. ఏదో ఒక రూపంలో తాను మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్లు చాలా గొప్పగా గడిచాయన్న ట్రంప్ తాము ఎంతో సాధించామని గర్వంగా ప్రకటించుకున్నారు. ‘‘ఇది నాకెంతో గౌరవం, జీవితకాలంలో లభించిన గౌరవం. ప్రపంచంలోనే మీరంతా గొప్ప ప్రజలు. ఈ జగత్తులోనే గొప్ప ఇల్లు ఇది’’ అని కొనియాడారు. ‘‘నేను మీ కోసం ఇంకా పోరాటం చేస్తాను. ఏదో ఒక రకంగా మళ్లీ వస్తా’’ అని ట్రంప్ అన్నారు. నిండైన ఆత్మవిశ్వాసంతో వెళుతున్నా వైట్ హౌస్ మంగళవారం విడుదల చేసిన ట్రంప్ ప్రసంగం వీడియోలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ‘‘నేను ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాను. గట్టి పోరాటాలే చేశాను. మీరు అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. ఇప్పుడు నిండైన ఆత్మ విశ్వాసంతో శ్వేతసౌధాన్ని వీడుతున్నా. మా ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ గర్వంగా మీ ముందు నిలబడ్డాను. వైట్‌హౌస్ వీడి వెళుతున్నప్పటికీ తాను ప్రజాసేవలోనే ఉంటా’’ అని ట్రంప్ చెప్పారు. ఈ చివరి వీడ్కోలు ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. ట్రంప్ నోట్ న్యూయార్క్: నూతన అధ్యక్షుడి ప్ర మాణస్వీకార సమయంలో పదవి వీడుతున్న అధ్యక్షుడు పాటించాల్సిన దాదాపు అన్ని సంప్రదాయాలను పక్కనబెట్టిన ట్రంప్.. ఒక సంప్రదా యాన్ని మాత్రం పాటిం చారు. కొత్త అధ్యక్షుడి కోసం వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఒక సందేశాన్ని ఉంచారు. ఓవల్ ఆఫీస్‌లోని రెజొల్యూట్ డెస్క్‌లో ఈ నోట్‌ను ట్రంప్ పెట్టారు. బైడెన్ ప్రమాణ స్వీకారం కన్నా ముందే ట్రంప్ వాషింగ్టన్‌ను, వైట్‌హౌస్‌ను వీడి ఫ్లారిడాకు పయనమయ్యారు. బైడెన్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్‌తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు. -
మీ అందరికీ గుడ్ బై: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడారు. మరికొన్ని గంటల్లో డెమొక్రాట్ జో బైడెన్ అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న వేళ వైట్‌హౌజ్ సిబ్బందికి ట్రంప్ దంపతులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ నాలుగేళ్లు ఎంతో గొప్పగా గడిచాయి. మనమంతా కలిసి ఎన్నో సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరెంత కఠినశ్రమకోర్చారో ప్రజలకు తెలియదు. అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితకాలంలో లభించిన గొప్ప గౌరవం. అందరికీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నా’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు.(చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) అదే విధంగా.. ‘‘మనది గొప్ప దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. కరోనా మహమ్మారి మనల్ని దారుణంగా దెబ్బకొట్టింది. అయినప్పటికీ మనమంతా కలిసి వైద్యపరంగా ఒక అద్భుతమే చేశాం. తొమ్మిది నెలల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసుకున్నాం’’ అని ట్రంప్ తమ హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం గురించి చెప్పుకొచ్చారు. ఇక కొత్త పాలనా యంత్రాంగానికి ఆల్ ద బెస్ట్ చెప్పిన ట్రంప్.. ‘‘మీకోసం(ప్రజలు) ఎల్లప్పుడూ నేను పాటుపడతాను. ఈ దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. కొత్త ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలి’’ అని సందేశం ఇచ్చారు. కాగా తన సతీమణి మెలానియా కలిసి ఎర్రటి తివాచీపై నడుచుకుంటూ వచ్చిన ట్రంప్.. మెరైన్ వన్ హెలికాప్టర్లో ఎక్కి ఎయిర్‌బేస్‌కు బయల్దేరారు. అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడాకు చేరుకోనున్నారు. -
మిషెల్ మిమ్మల్ని ఎంత గౌరవించారు.. మీరేంటిలా?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం ముగియడానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. వివాదాలు, విమర్శల విషయంలో అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ట్రంప్ రికార్డును సమం చేయలేరు. ఇక అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ట్రంప్ మరిన్ని వివాదాస్పద చర్యలకు పూనుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేయడం.. ఆ తర్వాత ట్రంప్‌పై అభిశంసన ప్రవేశపెట్టడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. రేపు జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోవడం లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రస్తుత ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌పై కూడా నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. వైట్ హౌస్ సంప్రదాయలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘మీ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా దంపతులు మీ విషయంలో ఎంత గౌరవంగా.. హుందాగా ప్రవర్తించారు.. మరి మీరేంటిలా’ అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!) నెటిజనులు మెలానియాను ఇంతటా ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె భవిష్యత్ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్‌కి ఆహ్వానించలేదు. అధికార పరివర్తనలో భాగంగా ప్రస్తుత ఫస్ట్ లేడి.. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కన్నా ముందే భవిష్యత్ ఫస్ట్‌లేడీని ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్‌కి ఆహ్వానిస్తారు. బ్రెస్ ట్రూమన్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం మిషెల్ ఒబామా వరకు అందరు పాటించారు. ఇక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన భర్త పౌరసత్వానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి.. మిషెల్ ఒబామా వాటిని మనసులో పెట్టుకోలేదు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామా, తన భర్తతో కలిసి వెళ్లి మెలానియాను సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం మెలానియా ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పటివరకు ఆమె భవిష్యత్ ఫస్ట్ లేడి జిల్ బైడెన్‌ని కనీస పలకరించిన దాఖలాలు కూడా లేవు. (చదవండి: శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు) Michelle Obama graciously hosted Melania Trump at the White House immediately after 2016 election to ensure a smooth transition. Melania Trump has done absolutely nothing for Dr. Jill Biden. Some people are givers, others takers: pic.twitter.com/lBYWe32wkR — Michael Beschloss (@BeschlossDC) January 18, 2021 దాంతో నెటిజనలు మెలానియాను విమర్శిస్తున్నారు. కొందరు(ఒబామా లాంటి వాళ్లు) ఇవ్వడానికి ఉంటే.. మరికొందరు(ట్రంప్ ఆయన భార్య మెలానియా) లాంటి వాళ్లు తీసుకోవడానికే ఉంటారని దుయ్యబడుతున్నారు. ఇక తన ఫేర్వెల్ మెసేజ్‌లో మెలానియా అమెరికన్లు తమ ఉత్తమమైన చొరవను అనుసరించాలని.. హింస ఎన్నడూ సమాధానం కాదని స్పష్టం చేశారు. -
మెలానియా ట్రంప్ ఇంటి చూపులు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తన మొండి వైఖరిని వీడటం లేదు. జో బైడెన్ ఎన్నికను ఒప్పుకోవటం లేదు. కానీ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. వైట్‌హౌస్‌ను వదిలి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నారామె. వైట్‌హౌస్‌ను వీడిన తర్వాతి పరిస్థితుల గురించి గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. వాషింగ్టన్‌నుంచి మార్-ఎ-లగోకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత సామాగ్రిని తరలించటానికి ప్రయత్నిస్తున్నారంట. 14 ఏళ్ల కుమారుడు బ్యారన్‌తో ఆమె మార్-ఎ-లగోకు వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో తల్లిగా, భార్యగా, అమెరికా ప్రథమ మహిళగా తన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ( వ్యాక్సిన్ మొదట మాకే కావాలి : ట్రంప్ ) కాగా, డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత మెలానియా ఆయనతో విడాకులు తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ గతంలో ఒమరోసా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్.. ఆమెకు భరణం కింద దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించనున్నారని ఆమె తెలిపారు. -
వైట్‌హౌజ్‌ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడిన తర్వాతే ఆయన సతీమణి మెలానియా విడాకుల విషయం గురించి ఆలోచిస్తారని ట్రంప్‌నకు రాజకీయ సహాయకురాలుగా పనిచేసిన ఒమరోసా మానిగాల్ట్ న్యూమన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న సమయంలో విడిపోవడం గురించి ఆలోచిస్తే ట్రంప్ తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే మెలానియా అధికార ప్రతినిధులు మాత్రం ఒమరోసా వ్యాఖ్యలను ఖండించారు. ఇవన్నీ నిరాధార కథనాలు అంటూ కొట్టిపడేశారు. కాగా ట్రంప్‌తో 15 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు మెలానియా ఎదురుచూస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు) వీరిద్దరి బంధం గురించి ‘అన్‌హింగ్డ్’ పేరిట రాసిన పుస్తకంలో ఒమరోసా ప్రస్తావించడం వీటికి బలం చేకూర్చింది. ట్రంప్- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక విడాకులు తీసుకుంటున్నందుకు గానూ ట్రంప్.. తన మూడవ భార్య మెలానియాకు భరణం కింద సుమారు రూ. 500 కోట్లు చెల్లించనున్నారని ఓ పత్రికకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమరోసా పేర్కొన్నారు. కాగా ట్రంప్- మెలానియా దాంపత్యానికి గుర్తుగా వారిద్దరికి బారన్ ట్రంప్ జన్మించాడు. అతడి వయస్సు ఇప్పుడు పద్నాలుగేళ్లు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్న ట్రంప్.. మంగళవారం ఎట్టకేలకు అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.( (చదవండి: పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం: జిన్‌పింగ్) -
విడాకులు : మెలానియాకు భారీ మొత్తంలో..
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు భారీగానే భరణం అందనుంది. కాగా 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడించింది. ‘ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి ఆమె ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’ అని ఒమరోసా తెలిపారు. ఈ విలువ ($68 మిలియన్) దాదాపు 500కోట్లకు పైగానే ఉంటుందని న్యాయనిపుణులు, న్యూమాన్ & రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. (ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే) వారిద్దరికి 14 ఏళ్ల బారన్ ట్రంప్ సంతాపం. కాబట్టి ఆమెకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యూమాన్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. అయితే ట్రంప్ మాజీ భార్యాల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందనుంది. మొదటి భార్యకు 14 మిలియన్ డాలర్లు, రెండవ భార్యకు 2 మిలియన్ డాలర్లను అప్పజెప్పగా తాజాగా మెలానియాకు మాత్రం 68 మిలియన్ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. (‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ ) -
వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో చాలా స్పష్టమైన మెజారిటీతో గెలుపొంది జోబిడెన్ అధ్యక్ష పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు మొత్తం కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇదిలా వుండగా ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, తాను ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురయ్యింది. ఈసారి ట్విటర్ వేదికగా ట్రంప్ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఓటమిని అంగీకరించాలని ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా ట్రంప్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ సన్నిహితులు కూడా ఇంకా అంతా అయిపోయిందని ఓటమిని అంగీకరించాలని ట్రంప్‌కు హితవు పలుకుతున్నాయి. ఇక ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ గౌరవప్రదంగా వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్దాం అని ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయాన్ని ఆమె బహిరంగంగా వెలిబుచ్చలేదు. అయితే ట్రంప్ కుమారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తగ్గటానికి వీలు లేదని మొండిపట్టు మీద ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..! -
ట్రంప్ మెలానియా విడాకులు?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడిం చింది. ‘‘ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’ అని ఒమరోసా తెలిపారు. చాలా కాలంగా విభేదాలు! అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్హౌస్కొచ్చారు. తమ కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్‌లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. చదవండి: ‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ -
మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కు దొరికి పోయారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో మెలానియాకు డూప్‌ను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న తాజా వివాదం వైరల్ అవుతోంది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) వివరాల్లోకి వెళితే గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలి ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది. ఎయిర్ క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదరం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ ‘ఫేక్ మెలానియా’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని మహిళను తన భార్యగా ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య ప్రథమ మహిళ మెలానియీ ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే మిలటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. విపరీతమైన దగ్గు కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలకమైన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ ఆమె ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. So, why do you think they need a #FakeMelania? pic.twitter.com/XpAJkXZiW8 — Bmar✨🏰🏳️🌈|BLM🌊💙 (@Bmar_Matrix) October 25, 2020 That is the $64,000 question. Can we get #FakeMelania trending? https://t.co/27TgMnZbDR pic.twitter.com/vrjIYmKQn9 — voteblue2020 (@lflorepolitics) October 25, 2020 #fakemelania How it started How it’s going pic.twitter.com/w6sgvv6NqF — TheQueerGuy (@TheQueerGuy) October 25, 2020 She very pretty Melania, da? #FakeMelania #PutinsPuppet pic.twitter.com/lVwfu8NYvB — moonshine blind (@moonshineblind) October 26, 2020 -
ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్
వాషింగ్టన్: కరోనావైరస్ సోకిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎడతెగని దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో రానున్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అరుదైన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ప్రతినిధి వెల్లడించారు. మెలానియ భర్త, ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని మెలానియా వదులుకున్నారని స్టెఫానీ గ్రిషామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ నుంచి మెలానియా ట్రంప్ ఆరోగ్యం రోజురోజుకూ చక్కబడుతోంది. కానీ దగ్గు మాత్రం తగ్గడంలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని స్టెఫానీ తెలిపారు ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె, కోలుకుంటున్నప్పటికీ, విపరీతంగా దగ్గుతూ ఉండటంతో ఆమె పెన్సిల్వేనియాలో జరగనున్న ర్యాలీకి వెళ్లడం లేదన్నారు. గత రెండు వారాల్లో ట్రంప్ రోజుకు కనీసం ఒక ర్యాలీతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 2019 నుండి తన భార్యతో వేదికపై కనిపించలేదు. మెలానియా పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే, దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి అతి కీలకమైన ర్యాలీలో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అనారోగ్యం కారణంగా ఆ గోల్డెన్ చాన్స్ ను మెలానియా మిస్ అవుతున్నారని భావిస్తున్నారు. కాగా ఈ నెల ఆరంభంలో ట్రంప్, మెలానియాలతో పాటు వారి కుమారుడు బారోన్ (14) కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. -
డొనాల్డ్ ట్రంప్ కుమారుడికి కరోనా..
వాషింగ్టన్: అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ బుధవారం వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. బారన్ ప్రస్తుతం టీనేజర్ కావడంతో ఎటువంటి లక్షణాలు లేవని మెలానియా తెలిపారు. అక్టోబర్ 2న ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారితో పాటు వైట్ హౌజ్‌లోని సిబ్బంది కొందరికి కరోనా వచ్చింది. మూడు రోజుల పాటు సైనిక ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత వారు కోవిడ్ నుంచి కోలుకున్నారు. చదవండి : నేను సూపర్ మ్యాన్‌ను: ట్రంప్ బుధవారం నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, "నా చిన్న కుమారుడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని చెప్పారు. వైరస్ తనకు చాలా స్వల్ప కాలం కనిపించిందని, బహుశా అతడికి ఈ వైరస్ సోకిందని కూడా తెలిసి ఉండదన్నారు. బారన్ రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల ప్రమాదం లేదన్నారు. కాగా మెలానియా ట్రంప్ తనకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని, అతి త్వరలోనే ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి మొదలుపెడతానని ఆమె చెప్పారు. కరోనా సోకిన తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని పేర్కొన్నారు. అదే విధంగా ముగ్గురికి ఒకేసారి కరోనా సోకడం ఆనందంగా ఉందని.. ఎందుకంటే ఒకరినొకరు చూసుకుంటామని, కలిసి సమయం గడపవచ్చునని మెలానియా తెలిపారు. చదవండి : ట్రంప్‌కి కరోనా నెగెటివ్ -
ట్రంప్ దంపతులు కోలుకోవాలని ప్రార్థించిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని కిమ్ ప్రార్థించినట్లు ఉత్తర కొరియా మీడియా శనివారం ప్రకటించింది. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. (చదవండి: త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ) దీంతో వారి ఆరోగ్యంపై కిమ్ స్పందిస్తూ.. ట్రంప్ దంపతులు త్వరగా మహమ్మారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అయితే ఈ రెండు దేశాల అధ్యక్షులు ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేవారు. ఇటీవల వీరిద్దరూ కలిసి సింగపూర్‌లోని ఓ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. అయితే సమావేశంలో చర్చలు విఫలమైనప్పటికీ.. వీరి మధ్య మాత్రం మైత్రి బలపడింది. అందుకే గతంలో కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ట్వీట్ చేయగా.. ఇవాళ ట్రంప్ ఆరోగ్యంపై కిమ్ స్పందించారు. (చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) -
నేను బాగానే ఉన్నాను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోవిడ్ బారిన పడిన ట్రంప్‌కి ప్రస్తుతం ప్రయోగాత్మక చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తమకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్ దంపతులు బహిరంగంగా కనిపించలేదు. శుక్రవారం మాత్రం అధ్యక్షుడు మాస్క్ ధరించి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. తాను ఆస్పత్రి పాలయ్యానని.. కానీ బాగానే ఉన్నానని తెలిపారు. అన్ని సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా బాగానే ఉన్నారని తెలిపారు ట్రంప్. (కోవిడ్-19 : ట్రంప్ ముందున్న ముప్పు ఇదే!) pic.twitter.com/B4H105KVSs — Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020 వైద్యుల సూచన మేరకు ఇక రాబోయో కొద్ది రోజులు ట్రంప్ వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవడానికి ఈ ప్రయత్నం అన్నారు. ట్రంప్ సహాయకులు మాట్లాడుతూ.. ఆయన తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని.. కానీ మంచి ఉత్సాహంతో ఉన్నారని.. ఆయన చాలా శక్తివంతుడు అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న రెజెనెరాన్ యాంటీబాడీ కాక్టెయిల్ డోస్ ట్రంప్కిచ్చారని వైట్ హౌస్ వైద్యుడు సీన్ కొన్లీ కీలక ప్రకటన చేశారు. (చదవండి: కరోనాతో 500 మంది వైద్యులు మృతి) ట్రంప్ కోసం ప్రార్థించిన బైడెన్ ఇక ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ మాస్క్ ధరించకపోవడం వల్లే ట్రంప్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక మంగళవారం క్లీన్ల్యాండ్లో జరిగిన తొలి చర్య సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటు ట్రంప్‌తో సన్నిహితంగా ఉన్నారు. దాంతో బైడెన్, ఆయన భార్య జిల్ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. తమకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అంతేకాక ట్రంప్, అతని కుటుంబం కోసం తాను ప్రార్థిస్తున్నానని బైడెన్ తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, కరోనావైరస్‌ని తీవ్రంగా పరిగణించినందుకు తాను దాని బారిన పడలేదని అమెరికన్లకు గుర్తుచేశాడు, తన ప్రత్యర్థిలా కాకుండా, తాను మాస్క్‌ని ఖచ్చితంగా వాడానన్నారు. ఇక మాస్క్ ధరించడం అంటే దేశభక్తి కలిగి ఉండటమేనని.. ఎవరికోసమే కాక మీ కోసం ఈ పని చేయాలని కోరారు బైడెన్ -
ట్రంప్‌కు కరోనా!
విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్ గూటికి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోవిడ్ బారిన పడటం ట్రంప్‌నకు షాక్ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్‌తో డిబేట్లో పాల్గొన్న బైడెన్‌కు కూడా కరోనా వస్తుందా? ఒకవేళ వస్తే ప్రధాన అభ్యర్థులిద్దరూ క్వారంటైన్లో ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? నూతన అభ్యర్థులు రంగంలోకి వస్తారా? ఎన్నికలు వాయిదా పడతాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.. వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్ ఆరంభిస్తున్నామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్, మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్‌హౌస్‌లోనే వారి క్వారంటైన్ జరుగుతుందని చెప్పారు. వైట్‌హౌస్ వైద్యుల బృందం, తాను ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రికవరీ దశలో అధ్యక్షుడు తన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తాను వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు ఒక్కరోజు క్రితమే కరోనా సోకినట్లు పరీక్షలో వెల్లడయింది. హోప్ ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నదని, తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. హోప్‌కు కరోనా రావడంతో తను, మెలానియా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ప్రెసిడెంట్‌తో కలిసి హోప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయా ణం చేసింది. ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతున్న తరుణంలో ట్రంప్‌నకు కరోనా సోకడం ఆయన ప్రచార కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కరోనా సోకడంతో ట్రంప్ బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనేకమంది తోటి అమెరికన్లు కరోనా బారిన పడ్డట్లే తామూ కరోనా బారినపడ్డామని, ఇద్దరం కలిసి దీన్ని జయిస్తామని మెలానియా ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు వైట్‌హౌస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు యూఎస్‌లో కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మరణాలు సంభవించాయి. వయోభారం, భారీ కాయం.. అమెరికా అధ్యక్షుల్లో దశాబ్దాల కాలంలో ఎవరూ ఎదుర్కోని సీరియస్ ఆరోగ్యసమస్యను ట్రంప్ ఎదుర్కొంటున్నారని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. 74 ఏళ్ల వయసు, ఒబేసిటీతో ఆయన కరోనా బాధితుల్లో అత్యధిక రిస్కు జోన్లో ఉన్నారని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ కరోనా బాధితుల్లో రిస్కు పెరుగుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి. ఉదాహరణకు 50ల్లో ఉన్న వారికి 40ల్లో ఉన్నవారితో పోలిస్తే తీవ్ర అస్వస్థతకు గురయ్యే చాన్స్ అధికమని, అదేవిధంగా 60, 70ల్లో ఉన్నవాళ్లకు మరింత రిస్కని తెలిపింది. ట్రంప్ ఆరోగ్యం గానే ఉన్నా, అధిక బరువు ఉన్నందున కరోనా సోకితే ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీనికితోడు ట్రంప్ మాస్కు వాడకానికి వ్యతిరేకి. కానీ, ర్యాలీల అనంతరం ప్రతిసారీ ట్రంప్ కోవిడ్ పరీక్ష చేయించుకునేవారు. త్వరలో ఈ సమస్య సమసిపోతుందని చెప్పేవారు. అనూహ్యంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. ప్రముఖుల పరామర్శ అగ్రరాజ్యాధిపతికి కరోనా రావడంపై వివిధ దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, ఆయన భార్య తొందరగా రికవరీ కావాలి, మంచి ఆర్యోగంతో ఉండాలి’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అమెరికన్లతో పాటు తాను కూడా ట్రంప్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. ఈ కష్టకాలంలో ట్రంప్‌నకు తన పూర్తి మద్దతు ఉంటుందని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ట్రంప్ వేగంగా రికవరీ కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆస్ట్రేలియా వ్యవసాయ మంత్రి, టోక్యో గవర్నర్, ప్రపంచ మీడియా సంస్థలు ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించాయి. కరోనాపై ట్రంప్ మొదటినుంచీ విరుచుకుపడుతున్నా చైనా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చైనా సోషల్ మీడియోలో మాత్రం ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు కనిపించాయి. ట్రంప్ పూర్తిగా కోలుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గ్యుటెర్రస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆకాంక్షించారు. కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మాస్కు ధరించడం ఇష్టపడని ట్రంప్‌ను కరోనా ఇష్టపడిందంటూ కొందరు వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విమర్శించే ట్రంప్ ఎట్టకేలకు ఒక విషయాన్ని ‘పాజిటివ్’గా ట్వీట్ చేశారని ఓ చైనీయుడు జోక్ చేశారు. కోవిడ్ బాధితులకు క్రిమిసంహారక(డిస్ఇన్ఫెక్టెంట్) మందులు ఇంజెక్షన్ చేయాలని ట్రంప్ గతంలో అన్నారు కనుక ఇప్పుడు వాటిని తీసుకునే సమయం ట్రంప్‌నకు వచ్చిందని జపాన్ ఇంటర్నెట్ వ్యాపారి హిరోయుకి నిషిమురా వ్యాఖ్యానించారు. తొలి నుంచీ నిర్లక్ష్యమే! కరోనా విపత్తు ఆరంభం నుంచి ట్రంప్ నిర్లక్ష్య వైఖరినే చూపుతూ వచ్చారు. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని, మాస్కు అవసరం లేదని, ఎకానమీని షట్‌డౌన్ చేయక్కర్లేదని చెప్పడమే కాకుండా కరోనాపై జాగ్రత్తలు చెప్పినవాళ్లను ఎగతాళి చేశారు. కానీ చివరకు తానే దాని బారిన పడ్డారు. ప్రజలు ఎక్కువగా భయపడకుండా ఉండేందుకే తాను కరోనాను తక్కువ చేసి చూపానని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. జనవరి 21న యూఎస్‌లో తొలి కరోనా కేసు నమోదయింది. అప్పటి నుంచి కరోనాపై ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు.. జనవరి: కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారదు. అమెరికాలో కరోనా పూర్తి నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి: ఏప్రిల్ కల్లా వేసవి ఆరంభం కాగానే కరోనా మాయమవుతుంది. కరోనా మహ్మమారి తాత్కాలికమే. ఒక్కమారుగా మాయమవుతుంది. మార్చి: అమెరికన్లకు కరోనా రిస్కు చాలా తక్కువ. జాతీయ ఎమర్జెన్సీ అనవసరం. కానీ విధించక తప్పట్లేదు. ఏప్రిల్: కరోనా వైరస్ సోకినవారు డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను ఇంజెక్షన్‌గా తీసుకుంటే చాలా వేగంగా మళ్లీ ఆరోగ్యవంతులుగా మారడం ఖాయం మే: పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువ. షట్‌డౌన్ కొనసాగిస్తే కోవిడ్ మరణాల కంటే ఇతర కారణాలతో∙ ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. జూన్: కరోనా మరణాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. కరోనా కేసుల్లో 99% ప్రమాదరహితాలు. జూలై: ప్రపంచంలో అమెరికాలోనే కరోనా మరణాలు తక్కువ. సెప్టెంబర్: మాస్కు పెట్టుకొని దేశాధినేతలను కలవడం అమర్యాద. అధ్యక్ష పోటీదారు బైడెన్లాగా నేను మాస్కు ధరించను. పెన్స్ చేతికి పగ్గాలు?? ప్రస్తుత అధ్యక్షుడు కరోనా బారిన పడడంతో అమెరికా రాజకీయరంగంలో మార్పులు జరగవచ్చని రాజకీయ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలైతే యూఎస్ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చు. వైస్‌ప్రెసిడెంట్ కూడా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితులుంటే, స్పీకర్ ఆఫ్ హౌస్ తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. అయితే, ఒకపక్క అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది, కీలక పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతల బదిలీ ఉండకపోవచ్చని మరికొందరి అంచనా. అధ్యక్ష అభ్యర్ధులు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలై నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వస్తే పార్టీలకు సైతం అగ్ని పరీక్ష ఎదురుకానుంది. కొత్తగా మరో అభ్యర్థిని ఎంచుకొని, వారితో ప్రచారం నిర్వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కలగలసి అమెరికా రాజకీయ యవనికపై పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలేనని, పరిస్థితి అంతదూరం రాకపోవచ్చని ఎక్కువమంది అంచనా. ట్రంప్ వేగంగా కోలుకోకపోతే మాత్రం పెన్స్ చేతికి పగ్గాలు తాత్కాలికంగానైనా వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యాంగానికి జరిపిన 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడు తాను బాధ్యతలు నిర్వహించలేనని ప్రకటిస్తే ఉపాధ్యక్షుడు తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. తిరిగి అధ్యక్షుడు తాను బాగానే ఉన్నానని స్వయంగా చెప్పేవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష వ్యవహారాలు చూస్తాడు. గతంలో ఎప్పుడు? ► 1985లో రొనాల్డ్ రీగన్ శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జార్జ్ డబ్లు్య బుష్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు. ► 2002, 2007లో కొలనొస్కోపి చేయించుకోవాల్సిన సమయంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ తన బాధ్యతలు, అధికారాలను డిక్ చెనీకి తాత్కాలికంగా బదలాయించారు. రెండో ఆప్షన్ అధ్యక్షుడు తన బాధ్యతలు, అధికారాలు స్వయంగా తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదలాయించడం కాకుండా కేబినెట్లో మెజార్టీ సభ్యులు, ఉపాధ్యక్షుడు తమకు తామే ఇలాంటి బదలాయింపును ప్రకటించవచ్చని యూఎస్ రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేడని భావించిన పక్షంలో కేబినెట్లో అధికులు, ఉపాధ్యక్షుడు కలిసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యూఎస్‌లో ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగించాలంటే పెన్స్‌తో సహా కేబినెట్లోని సీనియర్స్ 15 మందిలో 8మంది ట్రంప్ బాధ్యతలు నిర్వహించలేరని భావించాల్సిఉంటుంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ అంగీకరించకున్నా సెనేట్, హౌస్‌లు ఆమోదిస్తే వాస్తవ రూపం దాలుస్తుంది. పెన్స్ యత్నాలను ట్రంప్ ముందే గమనిస్తే ట్రంప్ తనను ముందే డిస్మిస్ చేయవచ్చు. మరోవైపు ట్రంప్ అనారోగ్యంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికే ఓటింగ్ ఆరంభమైనందున వాయిదా సాధ్యం కాదని ఎక్కువమంది అంచనా. రాజ్యాంగంలో ఎన్నికల తేదీ గురించి ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ఎన్నికలు వాయిదా వేయాలంటే అటు సెనేట్, ఇటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపాల్సిఉంటుంది. ఎన్నికలతో సంబంధం లేకుండా ట్రంప్ పదవీ కాలం వచ్చే జనవరి 20తో ముగియనుంది. బైడెన్‌కు నెగెటివ్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జో బైడెన్‌కు, ఆయన భార్య జిల్ ట్రేసీ జాకొబ్ బైడెన్‌కు శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఇద్దరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు కరోనా సోకినట్లు తేలడంతో బైడెన్ దంపతులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ట్రంప్, బైడెన్ల మధ్య చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెగటివ్ అని తేలడంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని బైడెన్ నిర్ణయించారు. ప్రచారంలో భాగంగా ఆయన మిషిగన్‌కు వెళ్లనున్నారు. -
కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు
-
కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు
వాషింగ్టన్ : ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించుకోలేకపోయారు. తాజాగా ఆయనకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. దీంతో ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష) కాగా ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోనున్నట్టు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ కేసులతో అమెరికా అతలాకుతలమవుతున్నతరుణంలో మాస్కును ధరించాలని, వైద్య సిబ్బంది, అధికారులు హెచ్చరించినా అధ్యక్షుడు బేఖాతరు చేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ ఆసుపత్రి సందర్శన సందర్భంగా నలుపు రంగు మాస్క్ ధరించి అందర్నీ విస్మయపర్చారు. కాగా కరోనాకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7.31 మిలియన్ల మంది వైరస్ బారిన పడగా, మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. -
వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ!
ఏ విధంగానూ తక్కువ కాదు. ఎందులోనూ.. ఎక్కువ కాదు. ఇద్దరిలా కనిపించే ఒకే ఒకరు. ఒకే మాట మీద ఉండే ఇద్దరు. మరేంటి.. పడదనీ.. వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ! సమ ఉజ్జీలంటే ఎవరికి మాత్రం.. పోరు పెట్టాలని ఉండదు? పోటీ చూడాలని ఉండదు? వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం అక్కాచెల్లెళ్ల మధ్య ఉంటే వాళ్లు తల్లీకూతుళ్లలా ఉంటారు. అదే వ్యత్యాసం తల్లీకూతుళ్ల మధ్య ఉంటే వాళ్లు అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. ట్రంప్ భార్య మెలానియా వయసు 50 ఏళ్లు. ట్రంప్ కూతురు ఇవాంక వయసు 38 ఏళ్లు. అయితే వీళ్లు మాత్రం ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నారు. ‘కనిపిస్తున్నారు’ అంటే ప్రత్యర్థులుగా ఉన్నట్లు కాదు. చూసే వారికి అనిపించడం. ఇందుకు కారణం ఉంది. ట్రంప్ ప్రస్తుత సతీమణి, మూడో భార్య మెలానియా. ట్రంప్ మొదటి భార్య కూతురు ఇవాంక. వైట్‌హౌస్‌లో ట్రంప్ తర్వాత వీళ్లిద్దరే ముఖ్యులు. మెలానియా ‘ప్రథమ మహిళ’ అయితే, ఇవాంక.. ట్రంప్ ప్రధాన సలహాదారు. రెండు కత్తులు అనుకోవచ్చా! అలా అనుకుంటే కనుక ట్రంప్‌ను ఒక ‘ఒర’ అనుకోవాలి. ట్రంప్‌ను ఒర అనుకుంటే.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అని కూడా అనుకోవాలి. నిజానికి వీళ్లిద్దరూ ఇమడకుండానే ఉంటున్నారా, ఇమడటం లేదని ప్రపంచం అనుకుంటోందా?! అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఎవరైనా తన కుటుంబంలోని ముఖ్యుల్ని తొలి ప్రసంగపు వేదిక మీదకు తీసుకొస్తారు. ‘నేషనల్ కన్వెన్షన్’ అంటారు ఆ వేదికను. ట్రంప్‌ది రిపబ్లికన్ పార్టీ కనుక అది ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’. నాలుగు రోజుల కన్వెన్షన్ చివరిరోజు.. గురువారం రాత్రి స్టేజి మీద ట్రంప్‌తోపాటు మెలానియా, ఇవాంక ఉన్నారు. ట్రంప్ తర్వాత వేదికపైకి మొదట మెలానియా చేరుకున్నారు. తర్వాత ఇవాంక వచ్చారు. ఇవాంక నవ్వుతూ వచ్చి, తల్లికి విష్ చేసి, నవ్వుతూ వెళ్లి తండ్రికి అటువైపున నిలుచున్నారు. తనకు విష్ చేసిన ఇవాంకకు మెలానియా కూడా నవ్వుతూ విష్ చేసి, ఆమె అటు వెళ్లగానే ఇటు సీరియస్‌గా ముఖం పెట్టేశారు. ‘సీరియస్‌గా కాదు.. అది ఏవగింపు’ అంటోంది మీడియా! మర్నాడు మీడియాలో, సోషల్ మీడియాలో అంతా.. మెలానియా లుక్ గురించే! ‘స్టింక్ ఐ’ అన్నారు. అయిష్టం అన్నారు, అన్ ఇన్వైటింగ్ అన్నారు.. ఏవో చాలా పేర్లు. మొత్తానికి ఆ అమ్మాయంటే ఆమెకు పడటం లేదని ప్రపంచం అంతటా ఫోకస్ అయింది. నిజమా అది! పడట్లేదని చెప్పడానికి చాలా థియరీలు ఉన్నాయి. పడుతుందని చెప్పడానికీ? అందుకు థియరీలు అక్కర్లేదు కదా. ఈ తాజా ‘స్టింక్ ఐ’ థియరీ పైన కూడా ఎప్పట్లా మెలానియా, ఇవాంక ఏమీ కామెంట్ చేయలేదు. అమెరికన్ శ్వేతసౌథంలో గానీ, బ్రిటన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గానీ ఏ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకోరు. నేరుగా దూషించుకోరు. వ్యంగ్యాస్త్రాలను సంధించుకోరు. బ్రిటన్ రాణి, ఆమె చిన్న మనవడు హ్యారీ భార్య మేఘన్ అలాగే ఉన్నారు. ఇక్కడ అమెరికాలో మెలానియా, ఇవాంకా కూడా ఒకరికొకరు అన్నట్లుగానే ఉన్నారు. వీళ్లమీద పుస్తకాలు రాసేవాళ్లే ఒకర్నొకరు ఇలా అన్నారని, అలా అన్నారని రాసేస్తుంటారు. ‘మెలనియా అండ్ మీ’ అని సెప్టెంబర్ 1న ఒక పుస్తకం విడుదల అవుతోంది. రాసింది మెలానియా పూర్వపు స్నేహితురాలు స్టెఫానీ విన్స్టన్. ఇవాంకను, ఆమె టీమ్‌ను మెలానియా ‘స్నేక్స్’ అన్నట్లు స్టెఫానీ అందులో రాశారు. నాలుగేళ్ల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో ఉన్నప్పుడు ఇదే నేషనల్ కన్వెన్షన్‌లో మెలానియా ఇచ్చిన ప్రసంగం అచ్చు గుద్దినట్లు 2008లో మిషెల్ ఒబామా చేసిన ప్రసంగమేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటి గురించి మెలానియా తనతో మాట్లాడుతూ.. ‘ఇవాంక, ఆమె బృందం ఇచ్చిన టెక్స్ట్నే నేను ఆరోజు చదివాను. వాళ్లే నన్ను తప్పుదారి పట్టించారు. వాళ్లు పాములు’ అని అన్నారని స్టెఫానీ ఈ పుస్తకంలో రాశారు. మెలానియాకు, ఈ రచయిత్రికి సత్సంబంధాలు చెడిపోయాక రాయడం మొదలు పెట్టిన పుస్తకం కాబట్టి స్టెఫానీ తల్లీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని వైట్‌హౌస్ అంటోంది. అంతేకాదు.. మెలానియా, ఇవాంక రోజూ చక్కగా మాట్లాడుకుంటారని కూడా లోపలి వాళ్లు చెబుతున్నారు. ప్రథమ మహిళగా మెలానియా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టిన నాటి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలున్నాయి అంటూ గత జూన్‌లో మార్కెట్లోకి వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పుస్తకంలో మేరీ జోర్డాన్ అనే వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ రాశారు. వైట్‌హౌస్ లో ‘ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్’ అని ఉంటుంది. అయితే మెలానియా.. ట్రంప్ మొదటి భార్య కాదు. అలాంటప్పుడు ఆ ఆఫీస్ ఆమెది ఎలా అవుతుందని ఇవాంకా అడ్డుపుల్ల వేశారట! ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్‌ని ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీసుగా మార్పించాలని ఇవాంకా చాలా ప్రయత్నించారని, ఆ ప్రయత్నాన్ని మెలానియా సమర్థంగా ఎదుర్కొన్నారని మేరీ రాసుకొచ్చారు. పుస్తకం వచ్చి రెండు నెలలు దాటిపోయింది. అందులోని తల్లీకూతుళ్ల సంవాదాలపై ఇప్పటివరకు ఇద్దరూ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఒకళ్ల పట్ల ఒకళ్లు గౌరవంగా, బాధ్యతగానే ఉంటూ వస్తున్నారు. ఈ సంగతిని స్వయంగా స్టెఫానీ (‘మెలానియా అండ్ మీ’ రాసిన స్టెఫానీ కాదు. మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ ఈవిడ) 2017లో ‘వ్యానిటీ ఫెయిర్’ పత్రికు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ‘వాళ్లిద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు’ అని ఆమె తెలిపారు. మరి ఈ ‘పడకపోవడం’ అనే ప్రచారం ఏమిటి? వాళ్లిద్దరి మధ్యా అలాంటిదేమైనా ఉంటే బాగుండునని ఆశిస్తున్న వాళ్లు, ఉండే ఉంటుందని ఊహిస్తున్నవాళ్లు చేస్తున్నదే. -
ఇవాంక వర్సెస్ మెలానియా.. వీడియో వైరల్
వాషింగ్టన్: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్(ఆర్ఎన్సీ) చివరి రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండో సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంక, ట్రంప్‌ను పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియాతో కలిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంక.. తన తండ్రిని, మెలానియాను నవ్వుతూ విష్ చేశారు. బదులుగా ప్రథమ మహిళ కూడా చిరునవ్వులు చిందించారు. కానీ సెకన్ల వ్యవధిలోనే ఇవాంకను చూసి మూతి ముడుచుకున్నారు మెలానియా. ఇవాంక అక్కడ నుంచి వెళ్లగానే ప్రథమ మహిళ ముఖం చిట్లించుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు సెకన్ల వీడియో ఎంతగా వైరలవుతుందంటే.. ఇప్పటికే దీన్ని 5 మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: అవన్నీ ట్రంప్ కోతలేనా!) This was so weird. #RNC2020 pic.twitter.com/YHReTl0bfT — Dana Goldberg (@DGComedy) August 28, 2020 ఇప్పటికే ఇవాంకకు, మెలానియా ట్రంప్‌కు పడటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మెలానియా తన స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్ స్టన్ వాకాఫ్ రాసిన పుస్తకంలో మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తావించారని ఆ దేశ మీడియా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లను సైతం చేశారు. ‘మెలానియా అండ్ మీ’:ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ’ అనే పుస్తకంలో మెలానియా తన సవతి పిల్లల గురించి ముఖ్యంగా ఇవాంక తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా రాశారని సమాచారం. మెలానియా ట్రంప్‌కు తెలియకుండా ఆమె స్నేహితురాలు స్టెఫానీ విన్ స్టన్.. మెలానియా వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె ట్రంప్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని వాటిని బహిర్గతం చేయలేదని రాసుకొచ్చారు -
ఫిల్లీ గర్ల్
ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ‘ఫిల్లీ గర్ల్’! అమెరికా ఎన్నికలు అయ్యాక.. ట్రంప్ (ఒకవేళ) ఓడిపోయాక.. బైడెన్ కొత్త అధ్యక్షుడయ్యాక.. ఫిల్లీ గర్ల్ అనే మాట మీరు వింటారు. ఆ ఫిల్లీ గర్ల్.. జిల్ బైడెన్. యు.ఎస్. కొత్త ప్రథమ మహిళ! జిల్ ట్రేసీ పవర్ గర్ల్. ఫిలడెల్ఫియా మెట్రోపాలిటన్ ఏరియాలో పెరిగిన అమ్మాయిల్నెవర్నీ ఆ పట్టణం ఎంతోకాలం పూర్తి అమాయకత్వంతో ఉంచదు. జిల్ ట్రేసీలా న్యూజెర్సీలో పుట్టి వచ్చిన అమ్మాయిల్నైనా సరే, వాళ్లెప్పుడు టీనేజ్‌లోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పదహారేళ్లు వచ్చేటప్పటికే జిల్ ట్రేసీ కూడా ఫిల్లీ గర్ల్ అయిపోయింది. అంటే.. ఫిలడెల్ఫియా సమర్పించిన పవర్ గర్ల్ అన్నమాట! ఆ వయసుకే ఫిలడెల్ఫియా స్పోర్ట్స్ టీమ్‌లోని కళ్లన్నీ జిల్ ట్రేసీ మీద పడ్డాయి. కాస్త తొందరపాటు ఉత్సాహంతో ముందుకు వచ్చిన ప్లేబాయ్ చూపుల్ని ట్రేసీ తన నొప్పించని తృణీకారపు నవ్వుతో పక్కకు తోసేసేది. అందం కాదు ఆ అమ్మాయిలోని గురుత్వాకర్షణ. టఫ్‌గా ఉంటుంది. అది నచ్చేది అబ్బాయిలకు. ‘టఫ్ కుకీ ఫిల్లీ గర్ల్’ అని పేరు కూడా పెట్టేశారు. ఫిజికల్‌గా, క్విజికల్గా ఉన్నవాళ్లను.. ముఖ్యంగా అమ్మాయిల్ని.. ‘టఫ్ కుకీ’లు అనడం ఫిలడెల్ఫియా పరాజిత బాలుర నిస్సహాయ నైజం. పదిహేనేళ్ల వయసులో ట్రేసీ న్యూజెర్సీలో వెయిట్రెస్‌గా చిన్న ఉద్యోగాన్ని వెతుక్కున్నప్పుడే స్లాట్లాండ్ యాస లో ఆమె మాట్లాడే ఫిలడెల్ఫియా ఇంగ్లిష్‌కు సహచరులు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టీ పెట్టగానే భగ్న హృదయులైపోయారు. ట్రేసీకి తల్లి నుంచి వచ్చిన ఆకర్షణీయమైన యాస అది. గృహిణి ఆమె. తండ్రి బ్యాంకు ఉద్యోగి. ట్రేసీ తర్వాత నలుగురూ చెల్లెళ్లే. పద్దెనిమిదేళ్లకే ట్రేసీ డిగ్రీ పూర్తయింది. పందొమ్మిదేళ్లకు పెళ్లి చేసుకుంది. బిల్ స్టీవెన్సన్ అతడి పేరు. ఫుట్‌బాల్ ప్లేయర్. ఫిలడెల్ఫియా స్పోర్ట్ టీమ్‌లో ఆమె మనసును గెలిచినవాడు. మనసును గెలిచాడే గానీ, మనసును తెలుసుకోలేకపోయాడు! పెళ్లయ్యాక ఐదేళ్లే కలిసి ఉన్నారు! మూడో వ్యక్తి ప్రవేశం తన భార్యను తన నుంచి వేరుచేసిందని నాలుగు రోజుల క్రితం కూడా అన్నాడు స్టీవెన్సన్. ఆ మూడో వ్యక్తి.. జో బైడెన్. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి. స్టీవెన్సన్తో విడాకులు తీసుకున్న రెండేళ్లకే జో బైడెన్‌ను పెళ్లి చేసుకున్నారు జిల్ ట్రేసీ. ఈ ఎన్నికల్లో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. జిల్ ట్రేసీ అమెరికా ప్రథమ మహిళ అవుతారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రార్థనామందిరంలో (చాపెల్) 1977 లో జో బైడెన్, జిల్ ట్రేసీల పెళ్లి జరిగింది. బైడెన్‌కు అప్పటికే పిల్లలు ఉన్నారు. భార్య, కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయి, ఇద్దరు కొడుకులతో ఒంటరిగా ఉన్న సమయంలో ట్రేసీ అతడికి పరిచయం అయ్యారు. రెండోసారి పెళ్లి అయేనాటికి ఆమె వయసు 26. బైడెన్‌కు 34 ఏళ్లు. వీళ్లిద్దరికీ ఒక కూతురు. ఇప్పటికి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. పెద్దకొడుకు బ్యూ బైడెన్ పేరున్న లాయర్. బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాడు. చిన్నకొడుకు హంటర్ బైడెన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్. కూతురు ఆష్లీ సోషల్ వర్కర్. ట్రేసీతో పెళ్లయ్యేనాటికే జో బైడెన్ కౌంటీ కౌన్సిల్ సభ్యుడు. ఈ నలభై మూడేళ్ల కెరీర్లో అతడి అత్యున్నత స్థాయి అమెరికా ఉపాధ్యక్ష పదవి. బరాక్ ఒబామాతో కలిసి ఎనిమిదేళ్లు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. జిల్ ట్రేసీ మాత్రం తనకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌లోనే ఉండిపోయారు. బైడెన్ ఉపాధ్యక్షుడు అయ్యాక కూడా ‘ద్వితీయ మహిళ హోదా’ను వార్డ్‌రోబ్‌లో పడేసి, రోజూ కాలేజ్‌కి వెళ్లి రావడం మాత్రం ఆమె మానలేదు. విల్లింగ్టన్లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ గా ఆమె ఉద్యోగ జీవితం మొదలైంది. ప్రస్తుతం ఆమె నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్. బైడెన్ ఒక్కో మెట్టూ రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే జిల్ ట్రేసీ అధ్యాపక వృత్తికి అవసరమైన ఒక్కో డిగ్రీ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆమె.. తన భర్త అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా తను మాత్రం కాలేజ్‌కి వెళ్లొస్తుంటాననే చెబుతున్నారు! ఆమెలోని ‘ఫిల్లీ గర్ల్’.. తనను ఆరాధించిన వారిని సున్నితంగా నిరాకరించిన విధంగానే వైట్ హౌస్ ఇచ్చే గొప్ప హోదా కన్నా, ఇంగ్లిష్ ప్రొఫెసర్ అనే గుర్తింపునే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. -
మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పు
స్లొవేనియా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ స్వస్థలం స్లొవేనియాలో ఏర్పాటైన ఆమె విగ్రహానికి కొందరు నిప్పుపెట్టిన ఘటన వెలుగుచూసింది. జులై 4న అమెరికన్లు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న రోజునే చెక్కతో తయారైన మెలానియా విగ్రహానికి నిప్పంటించారని ఈ విగ్రహం రూపొందించిన కళాకారుడు వెల్లడించారు. ఈ ఘటనపై జులై 5న పోలీసులు తనకు సమాచారం ఇవ్వగానే దెబ్బతిన్న విగ్రహాన్ని తొలగించానని బెర్లిన్‌కు చెందిన అమెరికన్ ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ తెలిపారు. వారు ఇలా ఎందుకు చేశారో తాను తెలుసుకోవాలని భావిస్తున్నానని డౌనీ అన్నారు. ఈ ఘటన అమెరికాలో రాజకీయ చర్చకు తెరలేపుతుందని ఆయన భావిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడిని వివాహం చేసుకున్న వలసదారుగా మెలానియా ట్రంప్ పరిస్థితికి ఇది అద్దం పడుతోందని డౌనీ వ్యాఖ్యానించారు. కాగా మెలానియా ట్రంప్ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. డౌనీ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా పూర్తికానందున ఎలాంటి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. కాగా స్లొవేనియాలో స్దానిక ఆర్టిస్ట్ డిజైన్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వుడెన్ విగ్రహాన్ని కూడా ఈ ఏడాది జనవరిలో దుండగులు దగ్ధం చేశారు. చదవండి : మెలనియా ఫస్ట్ లేడీ ఎలా అవుతారు?.. ఇవాంక -
మెలనియా ఫస్ట్ లేడీ ఎలా అవుతారు?.. ఇవాంక
ట్రంప్ వంటి మహానుభావులు పూర్వాచారాలకు కొత్త నిర్వచనాలను కల్పించుకోవలసిన పరిస్థితులను తెచ్చి పెడుతుంటారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’ అంటారు. వైట్ హౌస్‌లో ఆమెకు ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ ఉంటుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు భార్యగా ఉన్న మెలనియా మూడో సతీమణి. మరి ఈవిడ ఫస్ట్ లేడీ ఎలా అవుతారు? ఈ సందేహం రావలసిన వాళ్లకే వచ్చింది. ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంక తన తల్లికి దక్కవలసిన ‘ఫస్ట్ లేడీ’ టైటిల్ ను మారుతల్లి మెలనియాకు చెందకుండా ఉండటం కోసం ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ పేరును ‘ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీస్’ గా మార్పించేందుకు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని మెలనియా విజయవంతంగా అడ్డుకున్నారట! ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పేరుతో మెలనియా జీవిత చరిత్రను రాసిన వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ మేరీ జోర్డాన్ ఈ సంగతిని పుస్తకంలో వెల్లడించారు. ట్రంప్‌కి ‘సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వయిజర్’ గా కూడా మెలనియాను జోర్డాన్ అభివర్ణించారు. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకంలో అభివర్ణనలు, అవాస్తవాలు తప్ప వేరే ఇంకేమీ లేవని ఇవాంకను సమర్ధించేవారు అంటున్నారు.