![Melania to divorce Donald Trump as soon as he leaves White House - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/9/trump.jpg.webp?itok=KRRDA7Ep)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడిం చింది. ‘‘ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’ అని ఒమరోసా తెలిపారు.
చాలా కాలంగా విభేదాలు!
అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్‌హౌస్‌కొచ్చారు. తమ కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్‌లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment