Personal life
-
యంత్రంలా మారిన మనిషి
అరుణ్‌కుమార్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. డ్యూటీకి వెళ్లిన తర్వాత నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సమయం దొరికేది కాదు. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు. క్రమేణా అతని పనిపై ప్రభావం చూపింది. అధిక సమయం కార్యాలయంలోనే ఉంటున్నా తాను చేయాల్సిన పనులను పూర్తి చేయలేక పోతున్నాడు. ఇలా ఎంతో మంది కార్పోరేట్ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిని తొలిదశలో గుర్తించకపోవడంతో రాను రాను తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీస్తున్నట్లు పేర్కొంటున్నారు.రమేష్ విజయవాడ నగరంలోని ఓ కార్పొరేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరును మెచ్చిన యాజమాన్యం ఏడాది కిందట మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. అప్పటి నుంచి కొన్ని టార్గెట్లు అప్పగించి వాటిని రీచ్ అవ్వాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో తన టీమ్‌తో పనిచేయించేందుకు నిమిషం ఖాళీ లేకుండా బిజీగా ఉండేవారు. ఈ తరుణంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను కావడంతో ఆ ప్రభావం పనిపై పడింది. యాజమాన్యం ఇచ్చిన టార్గెట్లు రీచ్ కాలేకపోయాడు. దీంతో డిప్రెషన్‌కు లోనయ్యారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు తెలియకుండానే డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఆ ఫలితంగా ఎక్కువ సేపు కార్యాలయంలోనే ఉన్నా ఉత్పాదక శక్తి తగ్గిపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా మారిపోయాడు. తాము పనిచేసే సంస్థ ఇచ్చిన, తాము ఎంచుకున్న టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చేదాకా సెల్ఫోన్లలో మాట్లాడటానికే కాలం సరిపోతుంది. నలుగురిలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు లేవు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. రోజు రోజుకు మానసిక పరిస్థితి దిగజారడం, ఉత్పాదక శక్తి తగ్గిపోతుండటంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే నినాదంతో జరుపుకోనున్నారు.రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి....👉 పనిచేసే చోట ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి👉 ప్రతి రెండు గంటలకు ఒకసారి రిలాక్స్ అయ్యేందుకు సమయం ఇవ్వాలి.👉 పనిలో ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులు వ్యాయామం యోగా, మెడిటేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.👉 కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.👉 కొన్ని చోట్ల టాయిలెట్‌కు వెళ్లెందుకు కూడా సమయం ఉండటం లేదని ఇటీవల సర్వేలు చెప్పాయి. అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలి.👉 మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా కార్యాలయాల్లో చర్యలు తీసుకోవాలి.👉 పది నిమిషాలు మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తే అది ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడుతుందనే విషయాన్ని గ్రహించాలి.👉 వారానికి ఒకసారైనా రిలాక్సేషన్ కోసం ఆత్మీయ బంధువులు, మిత్రులను కలవడం ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.👉 చేసే పనిని ప్రణాళిక బద్దంగా విభజించి చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలిశారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. ముఖ్యంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఒత్తిళ్లు కారణంగా ఉత్పాదకతపై ప్రభా వం చూపుతుంది. డ్యూటీ సమయంలో ఉద్యోగుల రిలాక్సేషన్‌పై యాజమాన్యాలు దృష్టి పెట్టాలి. పని చేసేటప్పుడు రిలాక్సేషన్ కోసం కొంత సమయం కేటాయించాలి. మనస్సు ప్రశాంతంగా ఉండేలా వాతావరణం కల్పించాలి.–డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులుపర్సనల్ లైఫ్‌పై ప్రభావంపనిచేసే చోట ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు పర్సనల్ లైఫ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగానికి, కుటుంబాన్ని బ్యా లెన్స్ చేసుకోలేక పోతున్నారు. దాంపత్య జీవితంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సర్వేల్లో తేలింది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. వారు మనుషుల్లా కాకుండా నిర్దేశించిన పనిని పూర్తి చేసే రోబోల్లా మారుతున్నారు.– డాక్టర్ గర్రే శంకరావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
స్నాతక పాఠం అంటే..?
ఒక వయసులో ఒక స్త్రీ ఒకపురుషుడికి నచ్చిందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చాడనీ...కాబట్టి కలసి జీవించడం... అనేది శాస్త్ర సమ్మతం కాదు. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్ళిపోతుంది, నీ వాళ్ళనుకున్న వాళ్ళు వెళ్లిపోతారు, అధికారం పోతుంది, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.. అన్నీ పోతాయి... అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదయినా ఉంటే.. ఆ వ్యక్తి ధార్మికంగా బతికాడా..అన్నదే! పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వారిద్దర్నీ ఎందుకు కలుపుతున్నారు... ప్రస్థానం అంటే వారిద్దరూ కలిసి ఏం చేయాలి? అన్న దాని గురించి అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు గురువుని తీసుకొచ్చి మంచి విషయాలు చెప్పిస్తారు. దానిని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి ‘‘మీరు వివాహం చేసుకోవాలి. ఇద్దరూ అన్యోన్యంగా బతకడం మీద ఎన్నో జీవితాల అభ్యున్నతి ఆధారపడి ఉంది. ఈ ఏర్పాటు మీ వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే కాదు సుమా! మీ పెద్దల కీర్తి ప్రతిష్ఠలు, నీ తోబుట్టువుల తృప్తి, మీ బిడ్డల భవిష్యత్తు.. ఇలా చాలా ముడిపడి ఉన్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అవగాహనపరిచే ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పదనం. అన్నపానీయాలుగానీ, మరేవయినాగానీ వాటిని సంస్కరించకుండా స్వీకరించం. అటువంటి ఒక ఏర్పాటును నీవు జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు.. ఇక అక్కడినుంచి నీ జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యం అన్న కట్టువిప్పి గృహస్థాశ్రమం అన్న కొత్తకట్టు వేయడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్నమాట ఉండదు. కారణం – ఆ ఆశ్రమంలో క్రమశిక్షణ, విద్యాభ్యాసం, గురువుపట్ల చూపే గౌరవమర్యాదలు ...ఇవన్నీ ఉన్నాయి. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ కట్టుబాటు ఎటు పోయింది? ఎటూ పోలేదు. దాని మీద మరో కట్టు వచ్చి చేరింది. కట్టుమీద కట్టు. ΄పొలంలో పచ్చిగడ్డికోసి మోపుకట్టిన తండ్రిని చూసి కొడుకు ‘‘మోపు గట్టిగా కట్టలేదు’’ అంటే తండ్రి బాధపడతాడని... ‘‘అది వదులుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, మరో కట్టు వేస్తాను’’ అని మోపును మోకాళ్ళతో అదిమి గట్టిగా కట్టి తలమీద పెట్టుకుని ఇంటిబాట పడతాడు. తండ్రి వేసిన కట్టును విప్పి ఆయనను అగౌరవ పరచలేదు. ఆ కట్టు వదులుగా ఉన్నందువల్ల ఎక్కడో దానంతట అదే జారిపోయింది. అంతే.గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యంలో ఏ బంధాలున్నాయో అవి, అక్కడ అలవర్చుకున్న సంస్కారం మాత్రం జీవితాంతం ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎలా సంస్కరిస్తే వ్యక్తి జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమయిన విషయాలను అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. -
అందరూ నన్ను వ్యభిచారిణిలా చూస్తున్నారు: కరాటే కల్యాణి ఆవేదన
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతరమైంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘బతుకుదెరువు కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సేవ కార్యక్రమాలకు వినియోగిస్తాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఎంతోమందికి సాయం చేశాను. కానీ జనాలు అవేవి చూడటం లేదు. తెరపై నేను పోషించిన పాత్రలను బట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తున్నారు. చెప్పాలంటే నన్ను ఓ వ్యభిచారిగా చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి. అవి విన్నప్పుడు నాకు చాలా పెయిన్‌గా ఉంటుంది. నేను తెరపై నటించానంతే, నిజంగా చేయలేదు. బతుకు దెరువు కోసం అలాంటి రోల్స్ చేశాను. నాలోని మంచిని గుర్తించకుండా నాపై అసహ్యమైన కామెంట్స్ చేస్తుంటారు’ అంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తాను అలాంటి దాన్ని కాదని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! రొమాంటిక్ సీన్స్‌లో హీరోలు అలా ప్రవర్తిస్తారు: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
నా భర్త నడిరోడ్డుపై కొట్టాడు, నాకు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది : కరాటే కల్యాణి
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, మాజీ భర్తతో చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. బతుకుదెరువు కోసం సినిమాల్లో నటిస్తున్నాను. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాణానికి మరోవైపు కూడా ఉందని చాలామందికి తెలియదు. నేను రియల్‌లైఫ్‌లో ఎంతోమందికి సహాయం చేశాను. ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. పెళ్లి చేసుకున్నాక ఎన్నో కష్టాలు అనుభవించాను. అతను పెట్టిన టార్చర్ మాటల్లో చెప్పలేను. ఎంత పీక్స్‌కు వెళ్లిందంటే.. బేగంపేట వద్ద నడిరోడ్డుపై నామీద బట్టలు లాగేసి దారుణంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇంక చాలా జరిగాయి. అయినా అతడిలో మార్పు కనిపించలేదు. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఇప్పటికీ నిజమైన ప్రేమకోసం తపిస్తున్నాను. మరో పెళ్లి చేసుకోవాలనుంది అంటూ చెప్పుకొచ్చింది. -
ఆ విషయంలో నాకు- మహేశ్‌కు మధ్య గొడవలు అవుతుంటాయి : నమ్రత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు మహేశ్‌కు సంబంధించిన వ్యాపారాలను చేసుకుంటూ బిజినెస్ విమెన్గానూ రాణిస్తుంది. అంతేకాకుండా భర్త మహేశ్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా పలు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ''మహేశ్-నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా జీవితంలోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి. ఇక భార్యభర్తలుగా మహేశ్‌కు, మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవలు అవుతుంటాయి. వాళ్లు నన్ను అడిగితే నో చెప్తాను.. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్నే అడుగుతారు. ఆయన నో చెప్పరు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. -
పీడీ.. వ్యక్తిగత స్వేచ్ఛపై దండయాత్రే: సుప్రీం
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధం(పీడీ) అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన దండయాత్రేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు చేపట్టే విషయంలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021 నవంబర్ 12న త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన పీడీ ఉత్తర్వును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. పీఐటీఎన్‌డీపీఎస్ చట్టం–1988 కింద అరెస్టు చేసిన నిందితుడిని వెంటనే విడుదల చేయాలని çఆదేశించింది. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తే నిందితులు ఏడాదిపాటు జైల్లోనే ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తమపై నమోదైన కేసుల్లో నిరపరాధినని నిరూపించుకొనే అవకాశం లేకుండా పోతోందంది. ప్రచారం కోసం ఇక్కడికి రావొద్దు కేవలం ప్రచారం కోసం న్యాయస్థానానికి రావొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల)ను ఎన్నికల సంఘం (ఈసీ) కాకుండా కొన్ని కంపెనీలు నియంత్రిస్తున్నాయంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్ వికాస్ పార్టీ వేసిన పిటిషన్‌పై Ôజస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు వాడకంలో ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఇది. ఓటర్ల ఆదరణ పెద్దగా పొందలేని ఓ రాజకీయ పార్టీ ఇటువంటి పిటిషన్ల ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు గ్రూప్–సి ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రూ.50 వేలు జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
సంస్కారం ఉన్న మనుషులు ఇలా మాట్లాడరు.. యాంకర్‌పై సునీత ఫైర్
టాలీవుడ్ సింగర్ సునీత తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాటలతోనే కాకుండా చూడచక్కని రూపంతో హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకుంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన సునీతకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఎన్నో వందల పాటలు పాడిన సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉన్న సునీత తాజాగా వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే సింగర్‌గా ఆమెకు బోలెడంత క్రేజ్ ఉన్నా రెండో పెళ్లి విషయంలో సునీతపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ వచ్చిన ట్రోల్స్‌పై మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించగా సునీత చాలా ఎమోషనల్ అయ్యింది. కెరీర్లో చిత్రగారి తర్వాత 120 హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్ చెప్పానని, చాలామంది ఎంటర్టైన్మెంట్కి కారణమయ్యానంటారు కదా.. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్ జీవితం మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. మన మనిషిని ఒకమాట అనేముందు ఒక్క క్షణం ఆలోచించాలి అంటూ యంకర్ను సూటిగా నిలదీసింది. ప్రస్తుతం సునీత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. సోషల్ మీడియాలో కూడా పలు సంఘటనలపై స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ప్రస్తుతం సహాయ నటుడు, నెగెటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినీ కెరీర్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్రహ్మాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందరిలా సినిమా కష్టాలు పడలేదని, అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగా. మా తండ్రిగారు తహసీల్దార్. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు గారు సైతం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఇదిలా ఉంటే ఆయన నటించిన 'శంకరాభరణం' రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అది చూసిన నేను.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా? అని అనిపించింది. ఎలాగైన పరిశ్రమలోకి వెళ్లాలని అనుకుని, చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ నటన శిక్షణ తీసుకుంటున్న ఆ సమయంలోనే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర తదితరులతో పరిచయం ఏర్పడింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభంలో మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత పదేళ్లపాటు నేను సంతృప్తి చెందే పాత్రలు లభించలేదు. ఇప్పుడు మాత్రం కమెడియన్, సహాయ నటుడు, నెగెటివ్ షేడ్స్ వంటి మంచి పాత్రలు వస్తున్నాయి'' అని తెలిపాడు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి అలాగే ''నేను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. అయితే నేను మ్యారేజ్ చేసుకునే సమయానికే ఆమెకు విడాకులు కాగా, ఒక అబ్బాయి కుడా ఉన్నాడు. ఆమెను ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాను. ఇది వరకే బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు? అని వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ఇప్పడు 'పిట్టకథ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్డాడు'' అని తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. చదవండి: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్‌రామ్‌కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్‌రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
Aaditya Thackeray: మరాఠా రాజకీయాల్లో యువతార
మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన వంశం వారిది. అయినా మూడో తరం వరకు ప్రత్యక్షంగా పోటీ చేసిన దాఖలాలు లేవు. తాత స్థాపించిన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచి అరుదైన రికార్డు లిఖించిన ఘనత శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే సొంతం. శివసేన పార్టీ యూత్ ఐకాన్‌గా వర్తమాన రాజకీయాల్లో వెలిగిపోతున్న 32 ఏళ్ల ఆదిత్య ఠాక్రే.. తన తండ్రి కేబినెట్లో మంత్రిగా కొనసాగుతుండడం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. సోమవారం (జూన్ 13) ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జననం: జూన్ 13, 1990 (బుధవారం) పుట్టిన ఊరు: ముంబై తల్లిదండ్రులు: ఉద్ధవ్, రష్మీ ఠాక్రే తమ్ముడు: తేజస్ ఠాక్రే (వన్యప్రాణుల పరిశోధకుడు) పూర్తి పేరు: ఆదిత్య రష్మీ ఉద్ధవ్ ఠాక్రే పాఠశాల విద్య: బాంబే స్కాటిష్ స్కూల్, ముంబై ఉన్నత విద్య: సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి బీఏ న్యాయ విద్య: కేజీ లా కాలేజీ నుంచి న్యాయ పట్టా ఆహారపు అలవాటు: నాన్వెజిటేరియన్ వ్యక్తిగత వివరాలు: ఇంకా పెళ్లి కాలేదు హాబీస్: కవితలు చదవడం.. రాయడం, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం ఆస్తుల విలువ: 16.05 కోట్లు (2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం) పొలిటికల్ జర్నీ: ► 2010లో రాజకీయ అరంగ్రేటం, శివసేన పార్టీలో చేరిక ► జూన్ 17, 2010లో శివసేన యూత్ విభాగం ‘యువ సేన’ స్థాపన ► యువసేన అధ్యక్షుడిగా తాత బాల్ ఠాక్రే చేతుల మీదుగా నియామకం ► రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్, జమ్మూకశ్మీర్‌లకు యువసేన విస్తరణ ► 2018లో శివసేన జాతీయ కార్యవర్గ కమిటీలో స్థానం ► 2019 అక్టోబర్‌లో ముంబైలోని వర్లీ స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ ► 67,427 మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం ► డిసెంబర్ 30, 2019లో మహారాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం ► మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో యువ మంత్రిగా గుర్తింపు ► మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ వివాదాలు: ► రోహింటన్ మిస్త్రీ పుస్తకాన్ని ముంబై యూనివర్సిటీ సిలబస్ నుంచి తొలగించాలని 2010, అక్టోబర్‌లో ఆందోళన ► సుధీంద్ర కులకర్ణిపై 2015, అక్టోబర్ 12న శివసేన సిరా దాడి, సమర్థించిన ఆదిత్య ఠాక్రే ► 2014 మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా గుజరాతీలు, మరాఠేతరులపై ‘సామ్నా’లో వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణ మరికొన్ని: ► శివసేన యూత్ విభాగం యువసేన అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు ► ‘మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్’ పేరుతో 2007లో తన కవిత సంపుటి ప్రచురణ ► స్వంతంగా పాటలు రాసి 2008లో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ రూపకల్పన ► బాల్ ఠాక్రే సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మ్యూజిక్ ఆల్బమ్ విడుదల ► 2017లో ముంబై జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక చదవండి: ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది -
జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ ఇటీవల 'రన్ వే 24', జాన్ అబ్రహం అటాక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించింది. 'రన్ వే 24' మూవీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ప్రేమపై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది చాలా సహజం అని చెప్పుకొచ్చింది. 'జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్‌ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఉండటం చాలా సహజం. మన లైఫ్‌లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ తెలిపింది. చదవండి: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్ వెబ్ సిరీస్‌గా మారిన అక్షయ్, రకుల్ చిత్రం.. -
సమంత పర్సనల్ లైఫ్‌పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Nandini Reddy On Samantha Personal Life Issues: స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హీరో నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. ఎవరి దారులు వారు చూసుకుంటూ కెరీర్లో అత్యున్నత స్థానానికి ఎదిగేందుకు సామ్, చై ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఎవరో ఒకరు వీరిద్దరి గురించి వారి సన్నిహితుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సమంతకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ', 'జబర్దస్త్' సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, ఆమె విడాకులు తదితర విషయాలపై లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కెరీర్, సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. జబర్దస్త్ సినిమా చేసే సమయంలో సమంతకు ఆరోగ్యం బాలేకపోవడం, అప్పుడే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో నేను ఆమె పక్కన ఉన్నాను. ఆ సమయంలోనే మేము మరింత సన్నిహితులుగా మారిపోయాం. కానీ ఎంత సన్నిహితంగా ఉన్నా మా హద్దులు మాకు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్‌పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం. సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచింది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది.' అని తెలిపింది నందినీ రెడ్డి. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1061263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Vladimir Putin: అదే పుతిన్ బలమా..?
Vladimir Putin Political Career: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న పేరు పుతిన్. పూర్తిపేరు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్. సోవియట్ యూనియన్ హయాంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన పుతిన్ అంచలంచెలుగా ఎదిగారు. రెండుసార్లు రష్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నాలుగోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉక్రెయిన్‌పై అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం, దూకుడు వైఖరే పుతిన్‌ను తక్కువ సమయంలో అగ్రస్థానానికి చేర్చిందని ఆయన అనుచరులు అభిప్రాయపడుతుంటారు. ►1960 సెప్టెంబర్ 1: ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభం. ►12 ఏళ్ల వయసులో సాంబో, జూడోలో శిక్షణ ప్రారంభం. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ పుస్తకాలంటే విపరీతమైన ఆసక్తి. ►సెయింట్ పీటర్స్బర్గ్ హైస్కూల్లో జర్మనీ భాష నేర్చకున్నారు. ►1970లో సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో చేరిక. 1975లో పట్టభద్రుడయ్యారు. సెయింట్ పీటర్స్బర్గ్ మైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి పీహెచ్డీ పూర్తిచేశారు. ►1975లో రష్యా నిఘా సంస్థ కేజీబీలో చేరి 1990 వరకూ సేవలందించాడు. ఫారిన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా 16 సంవత్సరాలు పనిచేశాడు. సోవియట్ పతనం అనంతరం క్రెమ్లిన్‌లో ఉద్యోగిగా చేరారు. ►1997 మార్చి 26న పుతిన్‌ను ప్రెసిడెన్షియల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా నియమించిన అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ ►1998 జూలై 25న పుతిన్‌ను ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసు డెరెక్టర్‌గా నియమించిన ప్రెసిడెంట్ ఎల్సిన్ ►1999 ఆగస్టు 9న ఉప ప్రధానమంత్రిగా నియామకం. అదే రోజు యాక్టింగ్ ప్రైమ్‌మినిస్టర్‌గా పుతిన్‌ను నియమిస్తూ ఎల్సిన్ ఆదేశాలు. ►1999 ఆగస్టులో రష్యా ప్రధానమంత్రిగా ఎన్నిక. ►2000 నుంచి 2004 వరకూ.. 2004 నుంచి 2008 వరకూ రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలు ►2008 నుంచి 2012 దాకా మరోసారి రష్యా ప్రధానమంత్రిగా బాధ్యతలు ►2012 నుంచి 2018 వరకూ మూడోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం) వ్యక్తిగత జీవితం ►జననం 1952 అక్టోబర్ 7 ►సోవియట్ యూనియన్‌లోని లెనిన్గ్రాడ్లో(ఇప్పటి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్) నిరుపేద కుటుంబంలో జననం. ►తల్లిదండ్రులు మరియా మనోవ్నా పుతిన్, వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ ►ల్యూడ్మిలా ఒచెరేటనయాతో పుతిన్ వివాహం. 2013లో విడాకులు. వారికి మరియా పుతిన్, కెటరినా పుతిన్ ఇనే ఇద్దరు ఆడపిల్లలు సంతానం. జిమ్ కోచ్ అలీనా కాబయెవా, సినీనటి వెండీ మర్దోక్‌తో సంబంధాలు నెరిపిన పుతిన్. ►ఆంగ్ల భాష అంటే పుతిన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. మద్యం, సిగరెట్ వంటి దురలవాట్లు లేవని సన్నిహితులు చెబుతుంటారు. ►అధ్యక్షుడిగా పుతిన్ తీసుకొనే వేతనం సంవత్సరానికి 1,12,000 డాలర్లు. ఆయనకు 70 బిలియన్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా. ఖరీదైన కార్లంటే పుతిన్‌కు విపరీతమైన ఆసక్తి. -
కన్నీళ్లు ఆగిపోయాయి..నన్నేమి కదిలించడం లేదు: సింగర్ సునీత
Singer Sunitha Latest Interview About Sp Balu And Her Personal Life: టాలీవుడ్ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు టాలీవుడ్లో ఏ సింగర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలె రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సునీత అటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. పెళ్లి తర్వాత మ్యారెజ్ లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. పెళ్లి తర్వాత నేను ఎలా ఉన్నాను అన్నది మా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నా జీవితం నాకు నచ్చినట్లుగా గౌరవంగా బతకాలనుకున్నాను. అలాగే బతుకుతున్నాను. నా జీవితంపై క్లారిటీ ఉంది. ఇక ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు ఎప్పుడైనా సాయం కావాలంటే చేస్తా. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తా అని పేర్కొంది. ఇక ఈ ఏడాది జరిగిన విషాదాలపై స్పందిస్తూ..2021లో ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా బాలు గారిని పోగొట్టుకున్నా. ఆ విషాదం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది కానీ అంతలా నన్నేమీ కదిలించడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ఎమోషనల్ అయ్యారు. -
అలాంటి అబ్బాయినే పెళ్లిచేసుకుంటా : హీరోయిన్ సదా
జయం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న సదా ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు నాట గుర్తింపు సంపాదించుకుంది. అయితే కొద్దికాలంగా సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ షోలో పాల్గొని సినిమాలు సహా పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినీ పరివ్రమలోకి అడుగుపెట్టానిని, అమ్మ సహకారతోనే హీరోయిన్ అయ్యానని తెలిపింది. జయం చిత్రీకరణ సమయంలో ఓ పెద్ద యాక్సిడెంట్ క్షేమంగా బయటపడ్డాని చెప్పింది. ఇక 2015లో తన తల్లికి క్యాన్సర్ అని తేలడంతో ఒక్కసారిగా మా జీవితాలు మారిపోయాయి. అమ్మ రిటైర్మెంట్కు పది రోజుల ముందు ఆమె పుట్టినరోజు నాడే క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసింది. దీంతో నేను, నాన్న చాలా కృంగిపోయాం. ఆ సమయంలో సినిమా అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేశాను. అసలు అవతలి వాళ్లు ఎవరు? ఏ బ్యానర్? కథేంటి అన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అన్ని ప్రాజెక్టులకు నో చెప్పేదాన్ని.. ఆ సమయంలోనే సినిమాలు దూరమయ్యాయి. అలా చంద్రముఖి, ఆనంద్ సహా పలు సినిమాలను వదులుకున్నాను అని పేర్కొంది. ఇక కొన్నాళ్లు క్రితమే వీగన్‌గా మారిపోయిన సదా..జంతువులకు హానీ కలిగించే ఏ పదార్థాన్ని తీసుకోనని, ఆఖరికి లెదర్ బ్యాగ్ లాంటివి కూడా వాడనని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ..తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వంద శాతం వీగన్ అయి ఉండాలని, అలా ఉంటేనే చేసుకుంటానని, లేదంటే ఇలాగే సింగిల్‌గానే లైఫ్ గడిపేస్తానని వెల్లడించింది. చదవండి : హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్ భర్తతో కలిసి ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత -
సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సీరియల్ కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడున్నరేళ్లుగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో నెంబర్1 స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ వస్తుందంటే అన్ని పనులు పక్కనపెట్టి మరీ సీరియల్‌ను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మలయాళంలో వచ్చిన ‘కరుతముత్తు' అనే సీరియల్ రీమేకే కార్తీకదీపం. ఈ ఒక్క సీరియల్‌తో కేరళలో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. దీంతో రీమేక్‌లోనూ ఆమెనే తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1991 డిసెంబర్2న కేరళలలో జన్మించిన ప్రేమీ విశ్వనాథ్ తండ్రి పేరు విశ్వనాథ్ కాగా, తల్లి కాంచన. లా చదివిన ప్రేమీ విశ్వనాథ్ ఓ ప్రైవేటు సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. ఇక సీరియల్స్‌లో నటించేకంటే ముందే మోడల్‌గానూ రాణించిందని సమాచారం. అంతేకాకుండా సొలోమన్ 3డీ అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈమె అన్నయ్య శివప్రసాద్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ కూడా సోదరుడి లాగే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పనిచేసిందట. ఇక ప్రేమీ విశ్వనాథ్ భర్త డా.వినీత్ భట్ ఆయన ఆస్ర్టాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు సైతం గెలుచుకున్నారు. ఈయన వద్దకు పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్లు వస్తుంటారట. వినీత్ భట్ సూచనలతో తమ పేర్లలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రేమీ విశ్వనాథ్-వినీత్ భట్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కార్తీకదీపంతో బాగా పాపులర్ అయిన వంటలక్కకు తెలుగులో పలు సినీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఇప్పటివరకు ఆమె ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే..
'పెళ్లిచూపులు' సినిమాలో 'నా సావు నేను చస్తా నీకెందుకు' అంటూ ఒక్క డైలాగ్‌తో క్రేజ్ సంపాదిచుకున్న నటుడు ప్రియదర్శి. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ పెళ్లిచూపులు సినిమాలో తెలంగాణ యాసలో ప్రియదర్శి చెప్పిన డైలాగులు బాగా పాపులర్ అవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత జై లవకుశ, స్పైడర్ సినిమాల్లోనూ తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. అయితే 2019లో వచ్చిన 'మల్లేశం' సినిమాలో లీడ్ రోల్ పోషించి సత్తా చాటుకున్నాడు. ఎమోషనల్గానూ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మధ్యే వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఈతరం కమెడియన్స్‌లో ప్రియదర్శికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రియదర్శి ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికి తెలిసినా ఆయన వ్యక్తిగత విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియదర్శి.. తనకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. గతంలో ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు బట్టలు కొనుక్కోడానికి తన భార్య రిచానే డబ్బులు ఇచ్చేదని, అంతేకాకుండా తన మొబైల్, ట్రావెల్ ఖర్చులు కూడా ఆమే కట్టేదని పేర్కొన్నాడు. ప్రియదర్శి భార్య రిచా శర్మ నవలా రచయిత్రి. ఇప్పటికే ఆమె పలు నవలలు రాసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రియదర్శి నాన్నపులికొండ సుబ్బచారి ప్రొఫెసర్‌గా పనిచేశారట. ఆయన పలు పద్యాలు, కవితలు కూడా రాసేవారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..ప్రస్తుతం ప్రియదర్శి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఎప్పుడూ కామెడీ పండించే పాత్రలు ఎంచుకునే అతడు ఈసారి మాత్రం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. చదవండి : 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! 'దమ్ము' హీరోయిన్ కార్తీక ఏం చేస్తుందో తెలుసా? -
ట్రంప్ మెలానియా విడాకులు?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడిం చింది. ‘‘ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’ అని ఒమరోసా తెలిపారు. చాలా కాలంగా విభేదాలు! అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్హౌస్కొచ్చారు. తమ కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్‌లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. చదవండి: ‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ -
నా లైఫ్‌లో మలుపులు లేవు
‘ప్రేమను పంచుదాం. కరోనాను కాదు’’ అంటోంది చిరంజీవి కుటుంబం. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలను ప్లే కార్డుల రూపంలో తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. ‘’ఇంట్లో ఉందాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్‌ను గెలిపిస్తాం’’ అంటూ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్∙తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్లే కార్డుస్ పట్టుకున్నారు. ‘‘నా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఆలోచన లేదు’’ అంటున్నారు చిరంజీవి. తన బయోపిక్ గురించి ఇటీవల ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీలో నా ప్రయాణం చాలామంది యాక్టర్స్‌కు ప్రేరణగా నిలిచింది. ఇండస్ట్రీలో చిరంజీవిగా ఎదగాలని చాలామంది అనుకుంటుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. కానీ నా జర్నీని వెండితెరపై ఓ ఆసక్తికరమైన బయోపిక్‌గా తెరకెక్కించడానికి కావాల్సినన్ని మలుపులు నా జీవితంలో లేవని నాకనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నా ఆటోబయోగ్రఫీ (పుస్తకం)కి చెందిన వర్క్ జరుగుతోంది. అలాగే నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ డాక్యుమెంటరీగా తీయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఆచార్యలో రామ్‌చరణ్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రొఫెసర్‌గా మారిన మాజీ నక్సలైట్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని టాక్. చిరంజీవి శిష్యుడి పాత్రలో కనిపిస్తారట రామ్‌చరణ్. -
నన్ను నవ్వించాలి
‘షేర్షా, లక్ష్మీబాంబ్, ఇందూ కీ జవానీ, భూల్ భులయ్యా 2’ సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు చేయడంలేదు కానీ హిందీలో బిజీగా ఉన్నారు కియారా. మరి.. పర్సనల్ లైఫ్ పట్టించుకునే తీరిక దొరుకుతోందా? అని కియారాని అడిగితే.. ‘హో...భేషుగ్గా.. నా పర్సనల్ లైఫ్‌కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను’’ అన్నారు. మరి.. కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనేవి కూడా అనుకున్నారా? అంటే ‘‘కాబోయే భర్త గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. అతను ఎంతో నమ్మకంగా ఉండాలి. నన్ను నవ్విస్తుండాలి. నా జోక్స్‌కు తను నవ్వాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల తెగువ ఉండాలి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పగలిగే ధైర్యవంతుడై ఉండాలి. ఇతరులతో చాలా మర్యాదగా మసులుకోవాలి. ముఖ్యంగా నేను పురుషుడిని అనే అహంభావం ఉండకూడదు. అది ఉన్నవారిని నేను అస్సలు ఇష్టపడను’’ అని మనసులోని మాటను బయటపెట్టారు కియారా. -
జీవితం తలకిందులైంది!
బాలీవుడ్ అగ్రకథానాయికల జాబితాకు మరింత దగ్గర అవుతున్నారు తాప్సీ. ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో హిట్ టాక్‌తో దూసుకెళుతున్నారీ బ్యూటీ. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం అంత జోష్‌గా లేదని అంటున్నారు. ఇటీవల ఓ వేడుకలో తన వ్యక్తిగత జీవితం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘‘నేను ఢిల్లీలో పుట్టాను. ఇప్పటికీ నా అడ్డా అదే. కానీ అభిమానుల తాకిడి వల్ల అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి బయట తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కేవలం నాకే కాదు.. సరదాగా నాతో బయటకు వచ్చిన నా తోటి వారు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రజల అభిమానాన్ని అర్థం చేసుకోగలను. వారి అభిమానం కోసమే మేం ఇంత కష్టపడుతున్నాం. కానీ మాలాంటి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని వారు గౌరవించాలని కోరుకుంటున్నాను. ‘నో మీన్స్ నో’ (తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘పింక్’లో ఫేమస్ డైలాగ్) అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. షూటింగ్ లేనప్పుడు సాధారణ జీవితం గడపాలని మాకు ఉంటుంది. అందరి అమ్మాయిలలాగే నాకు మాల్స్‌లో తిరిగి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ మాల్స్‌లోకి వెళితే అభిమానుల తాకిడి ఉంటుంది. అందుకే విదేశాల్లో షాపింగ్ చేయాల్సి వస్తోంది. నాకు ఇండియన్ దుస్తులంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీగా మారిన తర్వాత నా జీవితం 180 డిగ్రీలు తిరిగింది. జీవితం తలకిందులైంది’’ అని చెప్పుకొచ్చారు. -
రెండు జీవితాలు గడపడం కష్టమే!
ఇండియాలో మూడు నెలలు.. యూఎస్‌లో మూడు నెలలు.. వేరే దేశాల్లో మిగతా నెలలు.. మొత్తం మీద ప్రియాంకా చోప్రా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇంత హడావిడి జీవితం ఎలా అనిపిస్తోంది? అని ఈ బ్యూటీని అడిగితే – ‘‘లైఫ్‌లో ఇంత బిజీ అవుతానని ఊహించలేదు. చేతినిండా పని ఉండటం లక్. కాకపోతే ఒక్కోసారి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమవుతోంది. రెండు జీవితాలకూ న్యాయం చేయడం కష్టం అనిపించినప్పుడల్లా కాసేపు ఆలోచిస్తా. పర్సనల్‌గా ముఖ్యమైన వాటికి టైమ్ కేటాయిస్తున్నాను. ఆ పనులను వాయిదా వేసుకోవడంలేదు. ఎందుకంటే, కోట్లు సంపాదిస్తాం. వ్యక్తిగత జీవితం లేనప్పుడు ఆ సంపాదన ఏం చేసుకుంటాం?’’ అన్నారు. మీ తప్పులను అద్దంలో చూపించినట్లుగా చెప్పేవాళ్లు ఉన్నారా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే – ‘‘కొంతమంది ఉన్నారు. వాళ్లు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. వాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తాను. పొగిడేవాళ్లనే పక్కన పెట్టుకుంటే మనలో లోపాలు తెలియవు. అందుకే మొహం మీదే విమర్శించేవాళ్లతోనే స్నేహం చేస్తా’’ అన్నారు. -
ఆమెతో ఎఫైర్ ఉందని ఎలా రాస్తారు?
ముంబై: తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు. తన భార్య మలైకా అరోరా స్నేహితురాలు యెల్లో మెహ్రాతో తాను సన్నిహితంగా ఉంటున్నట్టు ఇచ్చిన వార్తలను అతడు తోసిపుచ్చాడు. తన సినిమాల గురించి అడిగేందుకు అందరికీ అర్హత ఉందని, వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్బాజ్ ఖాన్ అన్నాడు. 'నా వ్యక్తిగత జీవితం గురించి ఇష్టమొచ్చినట్టు రూమర్లు రాశారు. మమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి సరిపోయింది. దీని ద్వారా కొంతవరకు మా వెర్షన్ వినిపించగలిగాం. యెల్లో మెహ్రా నాకు స్నేహితురాలు మాత్రమే. ఆమెతో కలిసి ఫొటో దిగితే మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేస్తారా? నేను 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోలు తీసుకుంటే వారందరితో కూడా సంబంధం అంటగడతారా? స్నేహితులతో సంతోషంగా ఫొటో దిగే హక్కు నాకు లేదా? మెహ్రా స్నేహితుడిగా ఆమెను ప్రమోట్ చేసేందుకు, అండగా నిలిచేందుకే ఫొటో తీసుకున్నాను. మా స్నేహాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్టు రాశారు. ఒకవేళ మెహ్రాతో నాకు సీక్రెట్ ఎఫైర్ ఉంటే ఆమెతో దిగిన ఫోటోలను ఎందుకు బయటపెడతాన'ని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించాడు. తెలుగులో వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో అతడు నటిస్తున్నాడు. 'జై చిరంజీవి' తర్వాత అర్బాజ్ ఖాన్ తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. -
గెలుపు
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ పనికి, అలసటకి ఏనాడూ భయపడలేదు శిరీష. ఆఫీసు పని పట్ల వ్యతిరేకతా లేదు. ఎటొచ్చీ వ్యక్తిగత జీవితంలోకి చొరబాటునే వ్యతిరేకిస్తోంది. దానివల్లే కష్టమంతా. ఉద్యోగం పోతుందని భయం వుందా అంటే... ఉంది. అది తనకే కాదు. ఎవరికేనా, ఎప్పుడేనా జరగవచ్చు. కానీ తన విషయంలో మెడమీద కత్తి లాంటి పరిస్థితి. ప్రాజెక్ట్ వెంటనే మరో ప్రాజెక్ట్... తరచుగా ప్రయాణాలు, సరిగా నిద్ర లేని రాత్రులు... పని చాలా ఎక్కువగా, ఒత్తిడిగా వుంటోంది శిరీషకి. ఈ ఐటీ రంగంలో ఇవన్నీ వుంటాయని తెలుసు. తెలిసే భరిస్తోంది. కానీ, ఇది సహజంగా ఏర్పడ్డ పరిస్థితి కాదు. కావాలని సృష్టిస్తున్నది. దానికి కారణం ఎవరో కూడా తెలుసు. త్రినాథ్. ఆ కంపెనీ సర్వ అధికారాలు చేతిలో ఉన్న త్రినాథ్. పనికి, అలసటకి ఏనాడూ భయపడలేదు శిరీష. ఆఫీసు పని పట్ల వ్యతిరేకతా లేదు. ఎటొచ్చీ వ్యక్తిగత జీవితంలోకి చొరబాటునే వ్యతిరేకిస్తోంది. దానివల్లే కష్టమంతా. ఉద్యోగం పోతుందని భయం వుందా అంటే... ఉంది. అది తనకే కాదు. ఎవరికైనా, ఎప్పుడైనా జరగవచ్చు. కానీ తన విషయంలో మెడమీద కత్తి లాంటి పరిస్థితి. అధికారం చేతిలో వున్న త్రినాథ్‌తో పోరాటం. ఏమైనా, రోజు ఆహ్లాదంగా వుండటం లేదు. ఆఫీసంటేనే, శరీరంలోని నరాలన్నీ ముడిపడినట్టు, కడుపులో ఏదో అయిష్టత కలయ తిరుగుతున్నట్లు అసౌకర్యం శిరీషకి. మనసు, శరీరం కూడా బావుండటం లేదు. అసలు విషయంలో గందరగోళమేం లేదు. తన ఉద్దేశం ఏమిటో, తనకేం కావాలో శిరీషతో సూటిగానే చెప్పాడు త్రినాథ్. ఆ విషయమే కాదు, త్రినాథ్ అలా చెప్పటమే అయిష్టమనిపించింది శిరీషకి. త్రినాథ్ చెప్పింది కొత్తగా వుంది. అంతకుముందు అలాంటి కోరికల గురించి ఎప్పుడూ వినలేదు శిరీష. ఆ రోజు... చాలా నెలల క్రితం... త్రినాథ్ కేబిన్‌లో వుంది శిరీష. ఇంక ఎవరూ లేరు. ఇద్దరే ఉన్నారు. సాయంత్రం... టీ తాగుతున్నారు. అకస్మాత్తుగా ఆ విషయం మాట్లాడాడు త్రినాథ్. ‘‘మన ఉద్యోగాలలో టెన్షన్ వుంటుంది. ఎంతో స్ట్రెస్ వుంటుంది. అది నీకూ తెలుసు. ఎంతో కష్టపడి, జీవితంలో ఎన్నింటినో వదులుకుని, ఓ పొజిషన్ సాధిస్తాం. ఆ పొజిషన్ని ఎంజాయ్ చెయ్యటం నా ధ్యేయం. నువ్వంటే నాకు ఇష్టం. అంతకన్నా ఎక్కువగా మోహం, పేషన్. నాతో కలిసి టైమ్ గడుపు. డిన్నర్స్, పార్టీలు, ఏదైనా ఊళ్లు వెళ్లటం... అలా నీ నుంచి నాకు సెక్సేం వద్దు. కావల్సిందల్లా చనువుగా ఉండటం, కొంత స్పర్శ, కొన్ని కౌగిలింతలు, కొన్ని కిసెస్. అంతే!’’ త్రినాథ్ అదే ధోరణిలో అలా చెప్పాడు. దానివల్ల అతని స్ట్రెస్ రిలీజ్ అవుతుందన్నాడు. జీవితం ఎంజాయింగ్‌గా వుంటుందన్నాడు. ఉద్యోగ జీవితంలోని కష్టానికి ఈమాత్రం రిలీఫ్ తప్పు లేదన్నాడు. దీనికి శిరీష అంగీకరించనందుకు, ఆమెకి ఎదురయ్యే కష్టాలేమిటో చెప్పాడు. అంగీకరిస్తే ఎన్నో ఫేవర్స్, సౌకర్యాలు. శిరీష రోజూ స్కూటర్ మీద ఇరవై అయిదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటి నుంచి ఆఫీసుకి వస్తుంది. ఒక్కోసారి ఇల్లు చేరటానికి రాత్రి పదకొండవుతుంది. శిరీష ఒప్పుకుంటే ఈ శ్రమే ఉండదు. ఇంటి నుంచి తీసుకొచ్చి మళ్లీ దింపటానికి కారు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే పనిచేసే వీలు... ఇలా చాలా సౌకర్యాలు. అయినా శిరీష ఒప్పుకోలేదు. కష్టానికే సిద్ధపడింది. ‘‘నువ్వు అనుభవం లేనిదానివి కావు. అయినా ఆ అనుభవం నేను అడగటం లేదు. ఎందుకు నీకింత పంతం. నేను చెప్పినట్టు విను. సుఖపడు. ఏదోనాటికి నువ్వే ఒప్పుకుంటావు. నాకు ఆ నమ్మకం వుంది. మీ ఇంటి పరిస్థితి, నీ కమిట్మెంట్స్ నాకు తెలుసు. ఇంత మంచి జీతం వచ్చే ఉద్యోగం వదులుకోలేవు. ఎప్పటికైనా నా పంతమే నెగ్గుతుంది’’ అని అవకాశం దొరికినప్పుడల్లా చెపుతూనే ఉన్నాడు త్రినాథ్. నిజమే, త్రినాథ్ చెప్పినట్టు తను అనుభవం లేనిది కాదు. శ్రీధర్‌తో ఏడాది పాటు సహజీవనం చేసింది. అందువల్లే మోజుగా వున్నప్పుడు మగవాడి నైజానికి, మోజు తగ్గిన తర్వాత మగవాడి నైజానికి మధ్య వున్న తేడా తెలిసింది. కొత్తలో శ్రీధర్ వేరు. ఏడాది తిరిగేటప్పటికి అతని సున్నితత్వం, నైసిటీస్ అన్నీ అంతరించిపోయాయి. మామూలుగా పెళ్లి చేసుకోవటం కన్నా, కలిసుండి సాధించుకోగలిగిన దగ్గరతనం ఎక్కువన్న భ్రమ తొలగిపోయింది. శ్రీధర్‌తో అలా ఉండి, విడిపోయినందువల్ల త్రినాథ్ చెప్పినట్టు చెయ్యాలనేం లేదు. పాత విలువలు పలచబడ్డాయి. కొత్త విలువలు పూర్తిగా నిలదొక్కుకోలేదు. ఇదో సంధి కాలం. ఆడ, మగ సంబంధాల విషయంలో, ఇది మరింత నిజం. ఈసారి తనెవరికైనా దగ్గరైతే, తొందరపాటుతోనో, ఒత్తిడితోనో కాకూడదు. పరిపూర్ణ విశ్వాసంతో జరగాలి. దేనికోసమో చేసుకునే ఒప్పందంలా, త్రినాథ్ ప్రపోజల్ అసలు నచ్చలేదు. అతని వింత కోరికలూ అయిష్టమే. ‘నిన్ను వేటాడుతూ వుంటాను, కానీ చంపను. చంపుతానేమో అన్న భయంతో హింసిస్తుంటాను’ అని పిల్లి ఎలుకతో సంప్రదించినట్టుంది, త్రినాథ్ వ్యవహారం. శిరీష అయిష్టత, అసమ్మతి త్రినాథ్‌కి తెలుసు. అయినా అతని ధీమా అతనిది. చేతిలో వున్న అధికారం మీద విశ్వాసం. అది ఎటువంటివారినైనా లొంగ దీస్తుందన్న నమ్మకం. అందుకే రకరకాల పనులతో హింసిస్తూనే ఉన్నాడు. శిరీష తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేదు. అలా అని భరించనూ లేదు. శారీరకంగా, మానసికంగా రోజురోజుకీ బలహీనపడుతోంది. ఇది గమనిస్తూనే ఉన్నాడు త్రినాథ్. శిరీష బలహీనపడుతున్న కొద్దీ, తను గెలుపుకి దగ్గరవుతున్నట్టే అన్నది త్రినాథ్ నమ్మకం. అతని వింత సంతోషం రోజురోజుకీ పెరుగుతోంది. మరీ తట్టుకోలేని, ఏ బలహీన క్షణంలోనైనా... ‘పోనీ త్రినాథ్ చెప్పినట్టు ఒప్పుకుంటే, ఈ నరకం తప్పుతుందిగా...’ అని శిరీషకి అనిపించాలి. కానీ అలా కూడా ఎప్పుడూ శిరీష ఆలోచన అటువైపు పోలేదు. ‘శిరీష ఉద్యోగం వదలదు. వదిలేసి వేరే చోట ప్రయత్నం చెయ్యాలన్నా, ఈ ఆఫీసు నుంచి మంచి రిపోర్ట్ కావాలి. అది తన దగ్గర నుంచే జరగాలి. అందువల్ల శిరీష ఇక్కడే వుంటుంది. ఉండి ఎంత కాలం తట్టుకుంటుంది. మరో దారి లేక ఈల్డ్ అవుతుంది’ అని త్రినాథ్ ఎత్తుగడ. ‘ఓపిక అస్సలుండటం లేదు. డిప్ప్రెస్డ్గా వుంటోంది. ఇలాగే గడపాలంటే ఎంతో కాలం సాధ్యం కాదు. ఏం చెయ్యాలి? క్రమేపీ సూసైడ్ టెండెన్సీ.... ఆత్మహత్య ఆలోచనలూ వస్తున్నాయి’. అదీ శిరీష పరిస్థితి. ఉద్యోగం అంటే శ్రమించటం, తెలివితేటలతో పనిచేసి ఫలితం సాధించటం. అందుకు తగిన ప్రతిఫలం పొందటం. ఇది గతంలోని ఓ సామరస్య పద్ధతి. ఇప్పుడు కొన్ని రంగాలలో ఉద్యోగం అంటే రాత్రి, పగలు తేడా లేని శ్రమ. జీవితంలోని మిగిలినవాటినన్నిటినీ పక్కన పెట్టే పరుగు. భద్రత లేని నిత్య సంఘర్షణ. పుష్కలంగా ఆదాయం ఉన్నా మనశ్శాంతి లేని మనుగడ. లక్షల్లో ఆదాయం. అయినా డబ్బు సరిపోని విచిత్ర స్థితి. ఓ ఆర్థిక ఇంద్రజాలం. వీటికి తోడు పంతాలు, పట్టింపులు. వింత కోరికలు. మనో వైకల్యాలు. అధికారం డబ్బుని, డబ్బు అహంకారాన్ని, అహంకారం ఇగోని కల్పిస్తున్న మనస్థితి. పొందటమే ధ్యేయం. త్రినాథ్ నమ్మకంగా ఎదురుచూస్తున్నాడు. శిరీష బలహీనపడీ పడీ లొంగి తీరుతుందని అతని ధీమా. ఆఫీసులో హింసని తట్టుకుని నిలబడటం అంత తేలిక కాదు. అందులో ఓ మగవాడు పూనుకుని అధికార బలంతో ఆడదాన్ని పెట్టే హింస. ఏదైనా జరగటానికి అన్ని రకాల అవకాశం వుంది. ఎన్నో కార్యాలయాల్లో, ఎందరెందరో ఆడవాళ్లు మౌనంగా భరిస్తున్న బాధ. నిజంగా ఆశ్చర్యమే. త్రినాథ్‌కి తల తిరిగినట్టైంది. శుక్రవారం ఆఫీసు నుంచి వెడుతూ, తన రాజీనామా ఇచ్చింది, శిరీష. త్రినాథ్‌కి షాక్ శిరీష రాజీనామా... అతని అధికార గర్వానికి తలవొంపు. అతనికి తెలియదు కానీ, వెంటనే సోమవారం నాడే మరో కంపెనీలో, కొత్త ఉద్యోగంలో చేరింది శిరీష. రిలీవింగ్ లెటర్ లేకుండా, ఏ ఎంక్వయిరీ తమని అడగకుండా, ఎవరైనా శిరీషకి ఉద్యోగం ఇస్తారని త్రినాథ్ అనుకోలేదు. కొత్తచోట ఇంటర్వ్యూకి వెళ్లిన నాడే, తనున్న పరిస్థితి వివరించింది శిరీష. లోపాయికారిగా, తన గురించి వివరాలు కావాలంటే తెలుసుకోమంది. కొత్త కంపెనీవాళ్లు చెయ్యాల్సినది చేశారు. శిరీషని నిస్సందేహంగానే ఉద్యోగంలో చేర్చుకున్నారు. తేడా అల్లా కొత్త కంపెనీ అధికారి పేరు మనోజ్ఞ. స్త్రీగా ఆమెకి ఆ హింస, బాధ తెలుసు. త్రినాథ్ మీద గెలుపు శిరీషదే కాదు... వ్యక్తిగతమే కాదు. ఓ నిబ్బరానిది, ఓ తెగకి అందిన చేయూతది. - వి.రాజారామమోహనరావు -
విరాట్ చాలా పర్సనల్!
ఇంటర్వ్యూ ఏం అడిగినా ఠక్కున సమాధానం చెప్తుంది అనుష్కాశర్మ. అది సినిమాల గురించైనా, తన వ్యక్తిగత జీవితం గురించైనా సరే! ఆ ముక్కుసూటితనమే తన ప్రత్యేకత అని కూడా చెబుతుంది. తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అనుష్క ఓపెన్‌గా చెప్పిన కొన్ని విషయాలివి... అనుష్క ఎలాంటి వ్యక్తి? చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్. ఎవరేం అడిగినా సూటిగానే జవాబిస్తాను. కొందరు అంటుంటారు... మరీ అంత సూటిగా సమాధానాలు చెప్పేస్తే ఎలా అని. మనం సరైన దారిలో వెళ్తున్నామన్న నమ్మకం మనకు ఉన్నప్పుడు దేనినీ లెక్క చేయాల్సిన అవసరం ఉండదని నా నమ్మకం. మీ బలం? క్లారిటీ. అన్ని విషయాల్లోనూ స్పష్టంగా ఉంటాను. ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోను. తీసుకున్న తర్వాత వెనకడుగు వేయను. మీ బలహీనత? తెలియదు. దాని గురించి ఆలోచించను. మనలో బలహీనత ఉందా అని తరచి చూసుకోవడమే పెద్ద బలహీనత. తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? నచ్చిన ఫుడ్ తింటూ... రోజంతా టీవీ చూస్తూ గడిపేస్తాను. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో షికార్లు, షాపింగులు ఉంటాయి కానీ వాటన్నిటికంటే ఇంట్లో టీవీ చూస్తూ గడపడంలోనే ఎక్కువ సంతోషం కలుగుతుంది నాకు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా? అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాను. కత్రినా అంటే చాలా ఇష్టం. అయితే ఎవరితోనైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను తప్ప మరీ రాసుకు పూసుకు తిరగడాన్ని ఇష్టపడను. ఏ ఇద్దరు హీరోయిన్లకూ పడదు అంటుంటారు. అది నిజమేనా? ఎవరో కొందరి మధ్య గొడవలు ఉంటాయి. అంతమాత్రాన గొడవలు పడటమే హీరోయిన్ల పని అన్నట్టు మాట్లాడితే ఎలా! కొట్లాడుకునేవాళ్ల దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్న అడిగితే బాగుంటుంది. ప్రేమ - డబ్బు... దేనికి ప్రాధాన్యతనిస్తారు? ఎప్పుడూ ప్రేమే మొదటి స్థానంలో ఉంటుంది. అది ఉంటే ఇక దేని గురించీ దిగులు ఉండదు. అలా అని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను అని చెప్పను. దానికీ ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏదీ మనకు దొరకదు. ఓ మోస్తరుగా బతకాలన్నా డబ్బు కావాలి. కాబట్టి డబ్బుకీ ప్రాముఖ్యతనిస్తాను. కానీ ప్రేమ కోసమే ఎక్కువ పరితపిస్తాను. కానీ మీరు ప్రేమను గుట్టుగా ఉంచుతారట కదా? ఒక్కసారి నోరు తెరిచి ఏదైనా ఓపెన్‌గా చెబితే దానికి నాలుగు తగిలించి, చిల వలు పలవలు చేసి ప్రచారం చేస్తారు. అందుకని వీలైనంతవరకూ సెలైంట్‌గా ఉంటాను తప్ప గుట్టుగా ఉంచాలని కాదు. విరాట్ కోహ్లీతో నా స్నేహం గురించి తెలిశాక అది తప్ప మరేదీ అడగడం లేదు. తను నా స్నేహితుడు. తనతో పార్టీలకు వెళ్తాను. తన మ్యాచ్‌లకి వెళ్తాను. డిన్నర్లు చేస్తాను. తను మా ఇంటికి కూడా వస్తాడు. అంత మాత్రాన మీ ఇద్దరికీ ఏమైనా ఉందా అని అడిగేస్తే ఎలా! అలాంటి ప్రశ్నలకి నా నుంచి సమాధానం ఎప్పుడూ రాదు. ఎందుకంటే నా వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. బంధాలకు ఎంత విలువ ఇస్తారు? చాలా ఇస్తాను. ఈ లోకంలో అమ్మతో మనకు తొలి బంధం ఏర్పడుతుంది. తర్వాత ఎంతోమంది మన జీవితంలోకి వస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్థానం. కానీ అందరూ మనకు కావలసినవాళ్లే. నా వరకూ నేను ఒక్కసారి ఒకరితో బంధం ఏర్పడితే దాన్ని తెంచుకోవడానికి ఇష్టపడను. ఎలాంటి విషయాలకు బాధపడతారు? అబద్ధాలు నన్ను చాలా బాధిస్తాయి. ఎవరి గురించైనా నిజం మాట్లాడాలి. ఉన్నది చెప్పాలి తప్ప కల్పించి చెప్ప కూడదు. ఓ సినిమా షూటింగ్లో నా వెన్నెముకకు దెబ్బ తగిలింది. నొప్పి తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లాను. బయటికి వస్తున్నప్పుడు ఎవరో ఫొటో తీసి పేపర్లో ప్రచురించారు. అది మాత్రమేనా... అంతకుముందే నేను ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్లి రావడంతో అక్కడ ఏదో జరిగిందని, అందుకే ఆస్పత్రికి వెళ్లానని నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఏవేవో రాసేశారు. ఓ మాట అనే ముందు అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. అది నాకు చాలా విసుగు తెప్పిస్తుంది. ఇంతకీ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వీలైతే ఎదుటివారిని కూడా హ్యాపీగా ఉండేలా చేయాలి. ఒకరికి మంచి చేయాలి తప్ప చెడు మాత్రం చేయకూడదు.