జీవితం తలకిందులైంది! | Taapsee Pannu Says I Shop Outside The Country | Sakshi
Sakshi News home page

జీవితం తలకిందులైంది!

Published Wed, Sep 18 2019 4:19 AM | Last Updated on Wed, Sep 18 2019 4:31 AM

Taapsee Pannu Says I Shop Outside The Country - Sakshi

బాలీవుడ్‌ అగ్రకథానాయికల జాబితాకు మరింత దగ్గర అవుతున్నారు తాప్సీ. ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో హిట్‌ టాక్‌తో దూసుకెళుతున్నారీ బ్యూటీ. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం అంత జోష్‌గా లేదని అంటున్నారు. ఇటీవల ఓ వేడుకలో తన వ్యక్తిగత జీవితం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘‘నేను ఢిల్లీలో పుట్టాను. ఇప్పటికీ నా అడ్డా అదే. కానీ అభిమానుల తాకిడి వల్ల అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి బయట తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కేవలం నాకే కాదు.. సరదాగా నాతో బయటకు వచ్చిన నా తోటి వారు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రజల అభిమానాన్ని అర్థం చేసుకోగలను. వారి అభిమానం కోసమే మేం ఇంత కష్టపడుతున్నాం. కానీ మాలాంటి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని వారు గౌరవించాలని కోరుకుంటున్నాను. ‘నో మీన్స్‌ నో’ (తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘పింక్‌’లో ఫేమస్‌ డైలాగ్‌) అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. షూటింగ్‌ లేనప్పుడు సాధారణ జీవితం గడపాలని మాకు ఉంటుంది. అందరి అమ్మాయిలలాగే నాకు మాల్స్‌లో తిరిగి షాపింగ్‌ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ మాల్స్‌లోకి వెళితే అభిమానుల తాకిడి ఉంటుంది. అందుకే విదేశాల్లో షాపింగ్‌ చేయాల్సి వస్తోంది. నాకు ఇండియన్‌ దుస్తులంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీగా మారిన తర్వాత నా జీవితం 180 డిగ్రీలు తిరిగింది. జీవితం తలకిందులైంది’’ అని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement