సినిమాలో ఏ హీరోయిన్‌ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?
నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్‌రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.
హీరోలే డిసైడ్ చేస్తున్నారు
ఒక సినిమాలో ఆల్‌రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్‌గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్‌ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్‌ను తీసుకుంటారు.
ట్రెండింగ్‌లో ఉన్నవారే కావాలి!
ఎక్కువగా హీరోలు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment