Tapsee Pannu
-
'అప్పటికే నా పెళ్లి అయిపోయింది'.. తాప్సీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ పన్ను తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లి గతేడాదిలోనే అయిపోయిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గతేడాది డిసెంబర్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. ఉదయ్‌పూర్‌లో కేవలం వివాహా వేడుక మాత్రమే నిర్వహించామని తాప్సీ అసలు విషయాన్ని రివీల్ చేసింది. వ్యక్తిగత విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని.. అందుకే బయటపెట్టలేదని పేర్కొంది. పర్సనల్ విషయాలు బయటపెడితే వర్క్ లైఫ్ దెబ్బతింటుందని చెప్పుకొచ్చింది.కాగా.. ఈ ఏడాది మార్చిలో ఉదయ్ పూర్లోని ఓ కోటలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆమె సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తర్వాత వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది తాప్సీ. -
TaapseePannu సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైకే వావ్ (ఫోటోలు)
-
పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్.. రెడ్ డ్రెస్‌లో తాప్సీ !
రెడ్ డ్రెస్‌లో తాప్సీ పన్ను హోయలు..భూటాన్ పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్..మెహందీ లుక్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్..క మూవీ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ
సినిమాలో ఏ హీరోయిన్ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.హీరోలే డిసైడ్ చేస్తున్నారుఒక సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్ను తీసుకుంటారు.ట్రెండింగ్‌లో ఉన్నవారే కావాలి!ఎక్కువగా హీరోలు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.చదవండి: ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..? -
నేను సెలబ్రిటీ మాత్రమే.. పబ్లిక్ ప్రాపర్టీని కాదు: తాప్పీ
సెలబ్రిటీలను చూడగానే ముఖ్యంగా సినీ నటీనటులు కనిపిస్తే వారితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. కెమెరామెన్లు అయితే వారిపైపు దూసుకుపోతారు. అయితే, కొందరు సెలబ్రిటీలు అభిమానులతో సెల్ఫీలు దిగుతుంటారు. మరి కొందరు వారి నుంచి తప్పించుకుని వేగంగా వెళ్లిపోతారు. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇక ఫొటోగ్రాఫర్స్ అయితే వెంటపడి మరీ సెలబ్రిటీలను ఫొటోలు తీస్తుంటారు. వీటిలో నటి తాప్సీ ఏ కోవకు చెందిన నటినో తెలుసా? మొదట్లో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా నటించి పేరు, డబ్బు గడించిన నటి తాప్సీ. ఆ తరువాత బాలీవుడ్లో అవకాశాలు రావడంతో దక్షిణాది చిత్రాలపై చిన్నచూపు చూపడం మొదలెట్టారు. ముఖ్యంగా తెలుగు దర్శకులు హీరోయిన్ల బొడ్డు, నడుము ఎక్కువగా చూపిస్తుంటారని ఆరోపణలు చేసి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత మాట మార్చి తానలా అనలేదు అంటూ రాగాలు తీశారనుకోండి. కాగా ఇటీవల ఒక భేటీలో ఫోటోగ్రాఫర్లతో గొడవ గురించి స్పందిస్తూ ‘నేను సెలబ్రిటీనే అయితే పబ్లిక్ ప్రాపర్టీని కాదు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. దీనిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. నాపై ఎవరైనా అరిస్తే ఊరుకోను. వెంటనే తిరిగి సమాధానం ఇచ్చేస్తాను. కెమెరాలతో నాపైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటి..? ఇది కరెక్ట్ కాదు. ఇబ్బంది ఎదురైనప్పుడు తెర వెనుక లేదా ముందు స్త్రీలు లేదంటే లేదు అంతే.. నేను మొదట అమ్మాయిని.. ఆ తరువాతనే నటిని. నేనిలా చెప్పడం వల్ల ఈ వృత్తికి తగిన వ్యక్తిని కాదు అని భావించవచ్చు. అయితే నటన నాకు నచ్చిన వృత్తి’ అని నటి తాప్సీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
తాప్సీ భర్త మథియాస్ సంచలన ప్రకటన.. ఇకపై
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి కోచ్ మథియాస్ బో కీలక ప్రకటన చేశాడు. కోచింగ్ విధుల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సాత్విక్- చిరాగ్ వైఫల్యం నేపథ్యంలో మథియాస్ బో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మథియాస్ శిక్షణలో సాత్విక్- చిరాగ్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగారు. కొన్నాళ్లుగా అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ జంట.. విశ్వ క్రీడల్లో కనీసం కాంస్యమైనా సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సాత్విక్- చిరాగ్.. మలేషియా ద్వయం ముందు తలవంచారు.ప్యారిస్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో ఆరోన్ చియా- వూయీ యిక్ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి పతక రేసు నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనుకాగా.. సాత్విక్- చిరాగ్‌లను మథియాస్ బో ఓదార్చాడు. ఈ క్రమంలో శనివారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు మథియాస్ బో.అలసిపోయిన ముసలి వ్యక్తిని‘‘కోచ్‌గా నా ప్రస్థానం ముగిసిపోయింది. భారత జోడీ కోచ్‌గా కొనసాగలేను. ఇక్కడే కాదు.. ప్రస్తుతానికి ఎక్కడా పనిచేయలేను. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో ఎక్కువ సమయం గడిపేశాను. అయినా కోచ్‌గా ఉంటే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేనేమో అలసిపోయిన ముసలి వ్యక్తిని. మనం ఊహించిన ఫలితాలు రాకపోతే కచ్చితంగా నిరాశచెందుతాం. మీరు కష్టపడే తత్వం ఉన్న ఆటగాళ్లు. పతకంతో ఇండియాకు తిరిగి రావాలని ఎంతగా ఆకాంక్షించారో.. అందుకోసం ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. అయితే, ఈసారి ఆ కల నెరవేరలేదు.గర్వపడేలా చేశారుగాయాలు వేధించినా.. వెనకడుగు వేయలేదు. నొప్పిని భరించేందుకు ఇంజక్షన్లు తీసుకున్నారు. అంకితభావంతో ఇక్కడిదాకా వచ్చారు. ప్రతీ మ్యాచ్ మనసు పెట్టి ఆడారు. నన్ను గర్వపడేలా చేశారు’’ అంటూ మథియాస్ బో.. సాత్విక్- చిరాగ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. భారత్‌లో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయంటూ సహచరుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.మథియాస్ వచ్చిన తర్వాతేకాగా మథియాస్ బో వచ్చిన తర్వాతే తాము ఆటలో మరింతగా రాటుదేలామని సాత్విక్- చిరాగ్ గతంలో పలు సందర్భాల్లో పేర్కన్నారు. తమ విజయాల వెనుక బో కష్టం కూడా ఉందని పేర్కొన్నారు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బో మరెవరో కాదు.. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను భర్త అన్న సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రేమపదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్ కోసం భర్తతో కలిసి ప్యారిస్ వెళ్లిన తాప్సీ.. డెన్మార్క్‌లో తాము ఇల్లు కొనుగోలు చేశామని.. కొన్నాళ్లు అక్కడే ఉంటామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల మథియాస్ బో రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Mathias Boe (@mathias.boe) -
అంబానీ కుటుంబంతో నాకు పరిచయం లేదు: స్టార్ హీరోయిన్
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్ష్‌న్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.అయితే కొందరు సినీతారలు ఈ పెళ్లి దూరంగా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఒకరు. తాజా ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. వివాహానికి ఎందుకు హాజరు కాలేదో కారణాలను వెల్లడించింది. తనకు అంబానీ కుటుంబంతో ఎలాంటి రిలేషన్ లేదని తాప్సీ తెలిపింది. ఎవరి పెళ్లికైనా అతిథులతో కమ్యూనికేషన్ ఉంటేనే వెళ్లేందుకు ఇష్టపడతానని ఆమె పేర్కొంది. నాకు వ్యక్తిగతంగా వారితో ఎలాంటి పరిచయం లేదన్నారు. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమని తాప్సీ వెల్లడించింది. కాగా.. తాప్సీతో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి హాజరు కాలేదు. -
ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ
ఓటీటీల పుణ్యమా అని చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. అటు లాభాల బాట పడుతున్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం మరొకటి ఉందంటోంది హీరోయిన్ తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఏం జరిగేదంటే ఓటీటీల దగ్గర ప్రతి సినిమాకు ఓ ప్యాకేజీ మాట్లాడేసుకునేవారు.ఓటీటీల యూటర్న్దీనివల్ల మూవీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నాలేకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అంతగా రాకపోయినా నష్టం వాటిల్లకపోయేది. కానీ ఇప్పుడు ఓటీటీలు కూడా యూటర్న్ తీసుకున్నాయి. ప్రతి సినిమాను తీసుకోలేమని చెప్తున్నాయి. వాటిని ప్రమోట్ చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టలేమని చేతులెత్తేస్తున్నాయి. పెద్ద స్టార్స్ లేని చిన్న సినిమాను ఆడియన్స్ చూసేలా చేయడం కష్టమని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ భావిస్తున్నాయి. ఎంతోకొంత ప్రమోషన్ చేసి థియేటర్లో విడుదల చేయమని, ఆ తర్వాతే ఫలానా వారానికి ఓటీటీలో తీసుకుంటామని చెప్తున్నాయి' అని తాప్సీ పేర్కొంది.సినిమాకాగా తాప్సీ చివరగా డంకీ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా' మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఖేల్ ఖేల్ మే మూవీలోనూ తాప్సీ కనిపించనుంది.చదవండి: అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్ -
అందువల్లే నాకు సినిమా ఛాన్సులు: తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఝమ్మంది నాదం సినిమాలో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఆ తర్వాత టాలీవుడ్లో రవితేజ, మంచుమనోజ్, గోపిచంద్, ప్రభాస్ లాంటి హీరోల సరసన మెరిసింది. తెలుగులో చివరిసారిగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో కనిపించింది. గతేడాది డంకీ, ధక్ ధక్ హిందీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తనకు అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.తాప్సీ మాట్లాడుతూ..' తనను నటి ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉంటారో మనందరికీ తెలుసు. తాను బాలీవుడ్లో ఉండేందుకు కారణమైన ప్రీతీకి ఎప్పుడూ చెడ్డపేరు తీసుకురాను. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా. నేను ఆమెను కేవలం బిగ్ స్క్రీన్‌పైనే చూశా' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఇటీవలే తాప్సీ తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా అనే చిత్రంలో కనిపించనున్నారు. -
నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదిగి ఆ తరువాత ఉత్తరాదిలో రాణిస్తున్న నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో గ్లామర్‌నే నమ్ముకున్న ఈ ఢిల్లీ బ్యూటీ హిందీలో అభినయానికి ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాదు అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన డంకీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ప్రస్తుతం ఈ భామ పిర్ ఆయి హసీన్ దిల్రూబా, కెల్కెల్ మెయిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తే నటించడానికి రెడీ అంటున్న తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తనకు తానే సవాల్‌గా మారినట్లు తెలిపారు. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. నటనలో మంచి స్థాయిలో ఉన్నా.. దాని నుంచి బయటకు వచ్చి ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు.తాను నటిస్తున్న పాత్రల స్వభావాలను తన దృష్టితో చూస్తున్నానని.. మాటల్లో మాత్రమే కాకుండా కల్పనల నుంచి పుట్టే ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నానన్నారు. కాగా నటిగా తానీ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదన్నారు. అందుకు కఠినంగా శ్రమించినట్లు చెప్పారు. నిత్యం ముందడుగు వేస్తూ ఎదుగుతూ వచ్చానన్నారు. అలా ఇది తన శ్రమకు దక్కిన స్థానం అని అన్నారు. అందుకే తాను చాలా సంతోషంగా ఉన్నానని తాప్సీ అన్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్‌కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్,జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్ డంకీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో టాలీవుడ్ సినిమాలు అయిన సలార్,యానిమల్,గుంటూరు కారం, హాయ్‌నాన్న వంటి చిత్రాలు టాప్ టెన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్‌లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
యానిమల్‌పై మండిపడ్డ స్టార్ హీరోయిన్.. ఆ విషయంలో నేనైతే!
సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి రాధికా శరత్‌కుమార్ యానిమల్ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు. -
ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవను.. నా బ్యూటీ సీక్రెట్ అదే: తాప్సీ
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెరంగేట్రం చేసిన మోడల్ తాప్సీ పన్ను. 2010లో విడుదలైన ఈ మూవీలో గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ ఢిల్లీ అందం.. 2011లో ఆడుకాలంతో కోలీవుడ్‌లో అడుగిడింది. ఇక వరుణ్ ధావన్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఛష్మే బద్దూర్’తో బీ-టౌన్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. థప్పడ్ వంటి వుమెన్ ఓరియంటెడ్ సినిమాతో సత్తా చాటింది. నటిగా రోజురోజుకూ మరింత మెరుగుపడుతున్న ఈ సోగకళ్ల సుందరి తన బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేసింది. తన ఉంగరాల జుట్టు అందంగా కనిపించడానికి అమ్మే కారణమంటూ మురిసిపోయింది. నిద్ర దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవను. కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతాను. స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్..మాయిశ్చరైజింగ్.. హైడ్రేటింగ్ కంపల్సరీ. అలాగే నా జుట్టు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. తెలుసు కదా.. కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో! ఆ క్రెడిట్ మా అమ్మదే! నా జుట్టు కోసం కొబ్బరి నూనెలో మందార ఆకులు, ఉసిరి ఎట్సెట్రా ఇన్‌గ్రీడియెంట్స్ వేసి స్పెషల్ ఆయిల్ తయారు చేస్తుంది. ఆ ఆయిల్‌ని రోజూ రాత్రి తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేస్తా! అందుకే కర్లీ హెయిర్ అయినా కాస్త సాఫ్ట్‌గా కనపడుతుంది’’ అని తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. చదవండి: ఆపకుండా గట్టిగా నవ్వితే చనిపోతారా? దీనిలో నిజమెంతంటే... -
హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?
స్టార్ హీరోయిన్ తాప్సీపై కేసు నమోదైంది. ఇటీవలే ముంబయిలో జరిగిన లక్మీ ఫ్యాషన్ షోలో ఓ మతాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆమెపై ఫిర్యాదు చేశారు. ఫ్యాషన్ షోలో పాల్గొన్న తాప్సీ తన మెడలో లక్ష్మీదేవి లాకెట్ ధరించి పాల్గొనడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. నటి తాప్సీ పన్నుపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ మార్చి 27న పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మార్చి 12న ముంబయిలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. ర్యాంప్ వాక్ సమయంలో లక్ష్మీ దేవి చిత్రం ఉన్న హారాన్ని ధరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది. -
ఎవరు మర్చిపోలేని ఆట ఆడి చూపిస్తా.. ఆసక్తిగా ట్రైలర్
Taapsee Pannu Starrer Shabaash Mithu Trailer Released: ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం 'శభాష్ మిథూ'. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్, కెప్టెన్‌గా మారడం, క్రికెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
తాప్సీ 'శభాష్ మిథు' అనిపించుకునేది ఆరోజే..
Taapsee Pannu Shabaash Mithu Movie Release Date Fixed: శభాష్ మిథు ఆట చూపించే డేట్‌ను ఫిక్స్ చేసింది ఆ చిత్ర బృందం. నిజానికి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది 'శభాష్ మిథు' చిత్రం. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారు అయింది. జూలై 15న విడుదల చేయనున్నట్లు శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రకటించింది చిత్ర యూనిట్. తాప్సీ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మిథాలీ రాజ్ సాధించిన విజయాలతోపాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను మూవీలో ప్రస్తావించినట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో పేర్కొంది. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'డంకీ' సినిమాతో బిజీగా ఉంది తాప్సీ. ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడు. చదవండి: షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు -
Mishan Impossible: యాభై లక్షలు ఇస్తారంట్రా?
‘అరెస్ట్.. ఇన్ఫ్లుయెన్స్.. బెయిల్.. ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి’ అంటూ తాప్సీ చెప్పే డైలాగ్‌తో ‘మిషన్ ఇంపాజిబుల్’ ట్రైలర్ విడుదలయింది. తాప్సీ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘దావూద్ ఇబ్రహీంని పట్టుకుంటే యాభై లక్షలు ఇస్తారంట్రా, యాభై లక్షలంటే ఎంత డబ్బులు?, చాలా డబ్బులు రా.. ఇవే డబ్బులు రాజమౌళికి ఇస్తే ‘బాహుబలి’పార్ట్ 3 తీస్తాడు..’ అంటూ ముగ్గురు బాలనటులు చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ నటించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్'.. విడుదల తేది ప్రకటించిన మేకర్స్
'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన తాప్సీ పన్ను అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనదైన నటనతో టాలీవుడ్లో వచ్చిన క్రేజ్‌తో సడన్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్లో తాప్సీతోపాటు ముగ్గురు చిన్నారులు పరుగు తీస్తూ కనిపించారు. ఈ సినిమాలో మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషిస్తుండగా మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్నారు. April 1 Vidudhala !! My team and I are excited to show you all our final product Shower your love and blessings on us the way you did for " Agent Sai Srinivasa Athreya "@MatineeEnt @taapsee @RavindraVijay1 @iamMarkKRobin @UrsVamsiShekar #Mishanimpossible pic.twitter.com/hVb9BnDvPD — Swaroop RSJ (@swarooprsj) February 28, 2022 -
అందంగా కనపడేందుకు ఏం చేశానో తెలుసా.. సీక్రెట్ చెప్పిన తాప్సీ
Tapsee Pannu Revealed About Her Beauty Secret: అందం అంటే అందరికీ ఆరాటమే. ఎన్నేళ్లు ఒంటిపైకి ఎగబాకిన అందంగా కనపడాలనే కోరిక మాత్రం చావదు. అందుకే అందంగా కనపడేందుకు అందవిహీన పనులు కూడా చేస్తుంటారు కొందరు. ఏం చేసైనా సరే అందంగా కనపడాలనేదే వారి తాపత్రయం. మరీ ఏం చేద్దాం. అందంగా కనపడాలంటే తప్పదుగా మరీ అంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు అయితే బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా అందంతో ఆకట్టుకోవాలనుకుంటారు. అప్పుడేగా అభిమానులు, ఆఫర్స్, రెమ్మ్యునరేషన్స్ పెరిగేది. అందం పెరిగితే అన్ని పెరుగుతాయని అందం కోసం కష్టపడుతుంటారు హీరోయిన్స్. అలా అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది హీరోయన్ తాప్సీ. పింక్, తప్పడ్, హసీనా దిల్‌రుబ వంటి విభిన్న చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది తాప్సీ. ప్రస్తుతం మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. 'నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. సినిమాల్లో చూపించే హీరోయిన్స్‌లా నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు అందంగా కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. టీవీలో కనిపించే నటీమణులకు సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక.. నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. నిజం చెప్పాలంటే.. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. జీవితాన్ని ప్రేమతో జీవించాలని, మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్సీ అందానికి అసలైన సీక్రెట్ తెలిపింది. ఇది చదవండి: వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి: తాప్సీ -
వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి: తాప్సీ
ఓ ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. ఇప్పుడు శభాష్ మిథూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. 'ఉదయయం 8 గంటలకు ఒక కల వచ్చింది. క్రికెట్ కేవలం జెంటిల్మెన్ గేమ్ అవ్వని రోజు ఒకటి వస్తుంది. నీలి రంగులో మహిళలు త్వరలో వచ్చేస్తారు అని తన అభిమానులకు తాప్సీ చెప్పింది. మాది ఒక టీమ్ అవుతుంది. దానికి ఒక గుర్తింపు వస్తుంది. నీలి రంగులో మహిళలు త్వరలో రాబోతున్నారు. వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి' అని తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది తాప్సీ. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) తాప్సీ పన్ను రష్మీ రాకెట్లో జెండర్ సమస్యలు ఎదుర్కొనే అథ్లెట్‌గా నటించింది. ఇప్పుడు మరో స్పోర్ట్స్‌కు సంబంధించిన చిత్రం శభాష్ మిథూలో లీడ్ రోల్ ప్లే చేయనుంది. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపకిక్గా రూపొందిస్తున్నారు. 2005, 2007లో ప్రపంచ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ జట్టుకు మిథాలీ నాయకత్వం వహించింది. 20 ఏళ్ల ఆటను పూర్తి చేసిన తర్వాత 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. -
మనం కలిస్తే చోలే భాటురే తిందాం.. కేబీసీ కంటెస్టెంట్‌కి తాప్సీ ఆఫర్
టాలీవుడ్లో స్టార్స్‌తో సినిమాలు చేసి తన కంటూ గుర్తింపు పొందింది నటి తాప్సీ పన్ను. అనంతరం ‘పింక్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టి అక్కడ కూడా మంచి పేరునే సంపాదించుకుంది ఈ బ్యూటీ. తర్వాత వరుస సినిమాలతో తన ప్రతిభని చాటుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అయితే తాజాగా ఓ అభిమాని ఒకరికి సోషల్ మీడియాలో ఆఫర్ ఇచ్చింది ఈ బ్యూటీ. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-13’కి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో కంటెస్టెంట్‌గా సాహిల్ అహిర్వార్ అనే వ్యక్తి వచ్చాడు. షోలో బిగ్ బీ అతన్ని ‘మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?’ అని అడగగా.. తాప్సీ పన్ను అన్ని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె నా క్రష్, లవ్ అని తెలిపాడు. ‘పింక్’, ‘బాద్లా’ వంటి సినిమాల్లో అమితాబ్ కలిసి తాప్సీ స్క్రీన్ షేరు చేసుకుంది. దీంతో ఆ సాహిర్ సైతం ఆమె గురించి కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడిగాడు. ‘ఆమెకి ఇష్టమైన ఫుడ్ ఏది?’ అని కంటెస్టెంట్ అడగగా.. నాకు తెలియదు అని బిగ్ బీ తెలిపాడు. కాగా ఈ వీడియో చూసిన తాప్సీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యింది. ‘సాహిల్.. నాకు చోలే భాటురే అంటే ఎంతో ఇష్టం. ఒక వేళ మనం కలిస్తే అది తిద్దాం. ఏడు కోట్ల ప్రశ్నకు చేరినందుకు అభినందనలు’ అంటూ ఆ వీడియోని షేర్ చేసింది తాప్సీ. ఫ్యాన్‌కి ఓ హీరోయిన్ ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ Sahil mujhe chole bhature sabse zyada pasand hai, kabhi miloge toh zaroor saath khayenge! Filhaal 7 crore tak pohochne ke liye bohot mubarakbaad 🙏🏽👏🏾 https://t.co/NDLcZxSalz — taapsee pannu (@taapsee) October 20, 2021 -
వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ
తెలుగుతో పాటు దాదాపు అన్ని సౌతిండియా ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. తాను త్వరలోనే పగ తీర్చుకుంటానని ఓ ఇంటర్వూలో తెలిపింది. ఎవరిపై అనుకుంటున్నారా సినిమా అవార్డులు ఇచ్చేవారిపై. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో ‘రష్మి రాకెట్’ అనే మూవీలో లీడ్‌రోల్ నటిస్తోంది. అయితే ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వూలో మాట్లాడింది. అందులో ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడగగా..‘నాకో అవార్డు ఇవ్వండని ఎవరిని అడగాలి. ఏం చేయాలో నాకు తెలీదు. నేను నటనలో నా బెస్ట్ చూపిస్తూ వెళ్లడం మాత్రమే నా చేతుల్లో ఉంది. అయినా రెగ్యులర్ అవార్డే ఇంత వరకు రాలేదు. నేషనల్ అవార్డు కోసం ఎలా లాబియింగ్ చేయగలను’ అని తెలిపింది. నిజానికి ‘పింక్’ సినిమాలో తన నటనకి గుర్తింపుతో పాటు అవార్డు వస్తుందని తాప్పీ అనుకుంది. కానీ అలాంటిదేమి జరగలేదు. కొన్నింట్లో నామినేషన్ కూడా రాలేదు. ఈ తరుణంలో తన పర్మామెన్స్‌కి పదును పెట్టుకుంటూ.. ప్రతిభ ఉన్న వారికి కాకుండా కాకా పట్టేవారికి అవార్డులు ఇచ్చే వారిపై పగ తీర్చుకుంటానని ఈ బ్యూటీ చెప్పింది. అయితే తాప్సీ నటించిన తాజా చిత్రం ‘రష్మీ రాకెట్’ అక్టోబర్ 15న ఓటీటీ విడుదల కానుంది. కాగా ఈ భామ ప్రస్తుతం ఇండియన్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌గా వస్తున్న ‘శభాష్ మిథు’తోపాటు ‘లూప్ లపేటా’, ‘దోబారా’ వంటి వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. చదవండి: ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై -
ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై
తాప్సీకి పొగడ్తలు ఎలా తీసుకోవాలో, అలాగే అవమానాలకు ఎలా స్పందించాలో కూడా తెలుసు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘రష్మీ రాకెట్’. ఈ సినిమాలో గుజరాతీ స్పింటర్ రష్మీ పాత్రలో నటిస్తోంది. అథ్లెట్ బాడీ కోసం ఈ నటి పడిన కష్టానికి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘మహాసముద్రం’ ట్రైలర్ రీలీజ్ ఎప్పుడంటే..? అయితే ఇటీవల ఆమె ఈ సినిమా సంబంధించిన వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఎవరో చెప్పుకోండి?’ అంటూ క్యాప్షన్‌ని దానికి జోడించింది. దానికి ఓ నెటిజన్ ‘ఇలాంటి శరీరం తాప్సీ పన్నుకే ఉంటుంది’ అని ఇబ్బందికరమైన కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కి స్పందించిన తాప్పీ.. ‘నేను చెబుతున్న.. ఈ లైన్ గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 23 వరకు వేచి ఉండు. నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. మీకు ధన్యవాదాలు’ అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ విషయంలో ఆమె స్నేహితురాలు లక్ష్మీ మంచుతో పాటు ఎంతో మంది అభిమానులు ఈ బ్యూటీకి సపోర్టుగా కామెంట్స్ పెట్టారు. అయితే ఆమె సమాధానాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ట్రైలర్ గురువారం (సెప్టెంబర్ 23న) విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సినిమాని అక్టోబర్ 15న జీ5 యాప్‌లో విడుదల చేయనున్నారు. పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్ All I will say is…. Just remember this line and wait for 23rd September :) And advance mein THANK YOU I really worked hard for this compliment 🙏🏽 https://t.co/O5O8zMRzP0 — taapsee pannu (@taapsee) September 20, 2021 -
తాప్సీ `మిషన్ ఇంపాజిబుల్’లో మలయాళ విలక్షణ నటుడు
టాలీవుడ్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. రీసెంట్గా ఈ అమ్మడు`మిషన్ ఇంపాజిబుల్` సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ స్టార్స్ అందరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మలయాళ నటుడు హరీశ్ పేరడీ తీసుకున్నారు. మలయాళ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, కళ్లతోనే విలనిజాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపుపొందారు. ఎరిడ, తంబి, మెర్సల్, ఖైది, స్పైడర్, రాక్షసి, పులి మురుగన్, భూమియిలే, మనోహర, స్వకార్యం, మడ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, విక్రమ్ వేద ఇలా నలబైకి పైగా చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టడమే కాదు.. ఓ ప్రత్యేకస్థాన్ని సంపాదించిపెట్టాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు. -
తాప్సీ పెళ్లి కండీషన్లు, కష్టమేనంటున్న పేరెంట్స్!
Tapsee Pannu: బాలీవుడ్లో సత్తా చాటుతున్న తాప్సీ ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా వెలుగొందింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తాప్సీకి ఇక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడే తన యాక్టింగ్‌కు మరింత పదును పెడుతూ వుమెన్ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు ఎలాంటి భర్త కావాలి? ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది? అన్న విషయాల గురించి స్పందించింది. తను వేలు పట్టి నడిచేవాడు తన మనసుకు మాత్రమే నచ్చితే సరిపోతదని, తల్లిదండ్రులకు కూడా నచ్చాలంది. వాళ్లతో కలివిడిగా ఉండాలని, అలాంటి అబ్బాయితోనే ఏడడుగులు నడుస్తానని కరాఖండిగా చెప్పింది. అంతే కాదు తాను డేట్ చేసినవారితో కూడా ఈ విషయాన్ని ముందే చెప్పానని తెలిపింది. రిలేషన్షిప్ కోసం సమయం కేటాయిస్తానంటున్న తాప్సీ అనవసరంగా టైంపాస్ మాత్రం చేయనని స్పష్టం చేసింది. అయితే తానింకా అనుకున్న స్థాయిని అందుకోలేదంటోంది తాప్సీ. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటే టైం అనేదే ఉండదని, కేవలం రెండు సినిమాలతో సరిపెట్టుకునే స్థాయికి వచ్చినప్పుడే వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించగలను అని పేర్కొంది. అయితే ఇలా కండీషన్స్ పెట్టుకుంటూ పోతే తనెక్కడ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారట తాప్సీ పేరెంట్స్. -
ఆ సీన్లలో నటించడానికి నాకేం భయం లేదు: నటుడు
ముంబై: రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడతానన్న హీరోయిన్ తాప్సీ పన్ను వ్యాఖ్యలపై నటుడు విక్రాంత్ మాసే స్పందించాడు. నటన తన జీవితంలో భాగమని, తానెప్పుడూ ఇలాంటి వాటికి భయపడనని పేర్కొన్నాడు. తాప్సీ ఏదో సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే హెడ్‌లైన్స్ వేసి మరీ ప్రచారం చేశారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తమకు ఇటువంటి వార్తల వల్ల మరింత పబ్లిసిటి వస్తుందని పేర్కొన్నాడు. కాగా తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే, హర్షవర్దన్ రాణె పర్ధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హసీన్ దిల్రూబా’. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాప్సీ మాట్లాడుతూ... ‘‘విక్రాంత్, హర్షవర్దన్ రొమాంటిక్ సీన్లలో నటించేందుకు భయపడ్డారు. నా ఇమేజ్ గురించి భయపడ్డారో లేదంటే మరేదైనా కారణమో తెలియదు. నేను ప్రతిసారి ఈ విషయం గురించి డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసేదాన్ని’’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై విక్రాంత్ స్పందిస్తూ... ‘‘ అలాంటిదేమీ లేదు. తాప్సీ చాలా సరదా మనిషి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. వాగుడుకాయ కూడా. ఐదు నిమిషాలకు మించి సైలెంట్‌గా ఉండలేదు. తనేదో సరదాకి మా గురించి అలా మాట్లాడింది. కానీ, వార్తల్లోకొచ్చేసరికి తను మా గురించి సీరియస్‌గా కామెంట్ చేసినట్లు వక్రీకరించారు. ఏదైతేనేం మాకు కావాల్సినంత ప్రచారం దొరుకుతోంది. నిజానికి మీడియాతో మా అనుబంధం విడదీయరానిది. మేం దాని గురించి ఎప్పుడూ బాధపడం. నటన నా మొదటి ప్రాధాన్యం. నేను దేనికీ భయపడను. అయితే, కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో ఒక్కోసారి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ... ఇద్దరు నటుల మధ్య పరస్పర సహాయసహకారాలు, ప్రొఫెషనలిజం ఉన్నపుడు అదేమీ పెద్ద విషయం కాబోదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా కనికా థిల్లాన్ కథ అందించిన హసీన్ దిల్రూబా సినిమాను వినీల్ మాథ్యూ తెరకెక్కించాడు. -
హల్చల్: అమీషా ఫ్లయింగ్ కిస్, హెబ్బా రాకింగ్ లుక్స్
► చిరునవ్వుల చిలక నజ్రియా ► అభిమానులకు అమీషా పటేల్ ఫ్లయింగ్ కిస్ ► చీరకట్టుతో చంపేస్తోన్న ఊర్వశి రౌతేలా ► యోగాసనం వేసిన కృతి కర్బందా ► జలకాలాట ఆడుతున్న శ్రియా ► వీకెండ్లో ఏం చేస్తుందో వీడియోతో సహా చెప్పేసిన రాశీ ఖన్నా ► మేడ మీద కీర్తి సురేశ్ యోగాసనాలు ► పక్క టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయంటూ దానివంకే చూస్తున్న హెబ్బా పటేల్ ► రష్యా వీధుల్లో చీరకట్టుతో తాప్సీ చక్కర్లు View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
దాదీ మళ్లీ తిరిగొస్తారనుకున్నా: తాప్సీ ఎమోషనల్
ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షూటర్స్ ద్వయం (చంద్రో తోమర్–89, ప్రకాశీ తోమర్–84)లో ఒకరైన చంద్రో తోమర్ ఇటీవల తుదిశ్వాస విడిచారు. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంతోనే ఆమె కన్ను మూశారు. ఈ షూటర్స్ ద్వయం జీవితం ఆధారంగా హిందీలో ‘సాండ్ కీ ఆంఖ్’ (2019) చిత్రం రూపొందింది. తుషార్ హీరానందాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చంద్రోగా భూమీ పెడ్నేకర్, ప్రకాశీగా తాప్సీ నటించారు. ఇటీవల చంద్రో మరణించినప్పుడు భూమి, తాప్సీ ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రీకరణ రోజులను గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రో మరణం, ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రీకరణ అనుభవాల గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘సాండ్ కీ ఆంఖ్’ అధికారిక ప్రకటన రావడానికి కొన్ని రోజుల ముందు మేం ఓ స్టూడియోలో చంద్రో, ప్రకాశీగార్ల రాక గురించి ఆసక్తిగా ఎదురుచూశాం. వారు వారి జీవితాల్లో సాధించిన ఘనతలు వారి పట్ల మా గౌరవాన్ని మరింత పెంచాయి. మా హృదయాల్లో వారికి అత్యున్నత స్థానం కల్పించాము. అందుకే చంద్రో, ప్రకాశీ దాదీ (బామ్మ)లను చూడాలన్న మా ఉత్సాహం క్షణక్షణానికి పెరిగింది. వాళ్లు వచ్చిన తర్వాత వారితో నేను, భూమి నాన్‌స్టాప్‌గా మాట్లాడాం. జీవితంలో వారు చేసిన పోరాటం, పడ్డ కష్టాలు విన్న మాకు అవి స్ఫూర్తినిచ్చాయి. దాదీలు చంద్రో, ప్రకాశీల తరం వేరు. మా తరం వేరు. వారి అనుభవాలు, వారు ఎదుర్కొన్న సంఘటనలు, జీవితంలో వారు సాధించిన పరిణతి వంటి వాటిని మేం (తాప్సీ, భూమి) స్క్రీన్ పై ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. వారిలా ఉండడానికి ప్రయత్నించాం. ఈ ప్రాసెస్‌లో మా జీవితంలో మేం ఎంతో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చంద్రో దాదీ లేరంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల కరోనా రావడానికి ముందు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకుంటున్న చంద్రో దాదీని నేను కలిశాను. ఆమె నన్ను చూసి, గుర్తు పట్టి ఆనందించారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా తిరిగి వచ్చేస్తారనుకున్నాను. కానీ అప్పుడు ఆమె ఫైట్ చేసి, ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. అప్పటిలానే ఈసారి కూడా ఫైట్ చేసి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని ఆశించాం. షఫేలీ (చంద్రో మనవరాలు) ద్వారా మేం చంద్రో దాదీ హెల్త్ ఆప్డేట్స్ తెలుసుకునేవాళ్లం. చంద్రో ఇక లేరని, కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారని షఫేలీ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఇటీవల మా అమ్మమ్మగారు చనిపోయినప్పుడు బాగ్పత్ (చంద్రో నివసించే ప్రాంతం) మీదుగా ఏడాది తర్వాత ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని, కోలుకుంటున్నారని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ‘సాండ్ కీ ఆంఖ్’ షూటింగ్ సమయంలో దాదీ, నేను ఒకే గదిలో ఉన్నాం. ఆమెతో నేను ఎంతో సరదాగా ఉండేదాన్ని. వారి ఇంట్లో రెండు నెలలు ఉన్నాం. నా కుటుంబ సభ్యురాలిగా దాదీని భావించాను. ఆమె లేరనే నిజం చాలా బాధగా ఉంది’’ అని తాప్సీ ఎమోషనల్ అయ్యారు. చదవండి: నోరు మూస్కో, నా టైమ్ వేస్ట్ చేయకు: తాప్సీ -
నోరు మూస్కో, నా టైమ్ వేస్ట్ చేయకు: తాప్సీ
సోషల్ మీడియా వచ్చాక ప్రతివాడు సూక్తులు చెప్పడం, సలహాలు ఇవ్వడం, ఎవర్ని పడితే వాళ్లను నోటికొచ్చినట్లు తిట్టడం, ఇతరులను ఆడిపోసుకోవడం బాగా అలవాటైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల మీద అక్కసు చూపించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. వాళ్లు ఏ పోస్టు పెట్టినా, ఏం చేసినా విమర్శించడానికి రెడీగా ఉంటారు కొందరు. అయితే సెలబ్రిటీలు ఇలాంటి బ్యాచ్‌ను పెద్దగా పట్టించుకోరు, కానీ కొన్నిసార్లు వీళ్ల తీరు తలనొప్పి తెప్పిస్తే మాత్రం కౌంటరివ్వకుండా ఉండలేరు. తాజాగా తన మీద కామెంట్ చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిపారేసింది హీరోయిన్ తాప్సీ. కరోనా వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి సోషల్ మీడియా ద్వారా తనకు తోచినంత సాయం చేస్తోంది తాప్సీ. ఆక్సిజన్, రెమిడిసివిర్ కోసం సంప్రదించాల్సిన నంబర్లను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆమె తీరును తప్పుపట్టాడు. 'ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు నీ కారు ఇవ్వొచ్చు కదా, దానితో వాళ్లు పని చేసుకుంటారు' అని కామెంట్ చేశాడు. ఇది చూసి చిర్రెత్తిపోయిన తాప్సీ నోరు మూసుకో.. అంటూ మండిపడింది. కరోనాతో ఆగమవుతున్న ఈ దేశం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు నోరు విప్పవద్దని హెచ్చరించింది. తన విలువైన సమయాన్ని ఇలాంటి చెత్త మెసేజ్‌లతో వృధా చేయొద్దని కోరింది. తానేం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయనివ్వండని కోరింది. Can you please shut up! Like just STFU ! If this is all u wanna say in these times then hold on until this country gets back to breathing normally and then get back to your shit ways until then DONT CROWD MY TIMELINE WITH YOUR NONSENSE and let me do what I am doing! https://t.co/is6bUOG6mA — taapsee pannu (@taapsee) April 26, 2021 చదవండి: అతడి చెంప పగలగొడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్ తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే -
తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి ప్రముఖ నటి తాప్సీని టార్గెట్ చేశారు. గతంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ తాప్సీపై నోరు పారేసుకున్న కంగనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 3 న జరిగిన ఆదాయపు పన్ను దాడుల గురించి తాప్సీ ట్వీట్ చేసిన కొన్ని గంటల తరువాత కంగనా కౌంటర్ ఎటాక్ చేశారు. ముఖ్యంగా ‘సస్తీ కాపీ’ అని రంగోలి చందేల్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన తాప్సీపై ఎదురు దాడికి దిగారు. తాప్సీ ఎలాంటి తప్పు చేయపోతే కోర్టు ద్వారా నిర్దోషిగా బయటకురావాలంటూ సవాల్ విసిరారు. (ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ) ‘‘నువ్వు ఎప్పటీకి చీప్ ఆర్టిస్ట్‌వే.. ఎందుకంటే నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి. పన్నులు ఎగ్గొట్టిన మీ రింగ్ మాస్టర్ కశ్యప్‌పై 2013లో కూడా దాడులు జరిగాయి. ప్రభుత్వ నివేదిక బయటికి వచ్చింది. నువ్వు నిర్దోషివైతే కోర్టులో నిరూపించుకో’’ అంటూ కంగనా ట్వీట్ చేశారు. కాగా తన నివాసంలో ఐటీ సోదాలపై తాప్సీ శనివారం ట్విటర్ ద్వారా స్పందించారు. గత మూడు రోజులుగా జరిగిన ఘటనలపై వరుస ట్వీట్ల ద్వారా వివరించారు. పారిస్‌లో తనకు బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం ఐటీ అధికారలు వెతికారని, కానీ అలాంటిదేమీ లేదని తేలిందని వెల్లడించారు. అలాగే రూ. 5 కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే ఆర్థికమంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తు లేదంటూ తాప్సీ ట్వీట్ చేశారు. (అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత) కాగా బాలీవుడ్లో ఐటీ దాడులు కలకలం రేపిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణలతో తాప్సీతో పాటు దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, నిర్మాత మధువర్మ సహా పలువురి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. (అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు) You will always remain sasti because you are sab rapists ka feminist... your ring master Kashyap was raided in 2013 as well for tax chori... government official’s report is out if you aren’t guilty go to court against them come clean on this ... come on sasti 👍 — Kangana Ranaut (@KanganaTeam) March 6, 2021 -
ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ
సాక్షి, ముంబై: తన నివాసంలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ మొదటిసారి పెదవి విప్పారు. గత మూడు రోజులుగా వెలుగు చూసిన పరిణామాలపై ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి ఐటీ అధికారులు తన నివాసంలో ఏం సోదా చేశారో వెల్లడించారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదన్నారు తాప్సీ. అలానే తాను ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని.. కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్లో పేర్కొన్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఇటీవల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ‘నేను ఎవరిపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. 2013లో కూడా వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. వీటిపై తాప్సీ తాజాగా స్పందించారు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత -
అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కక్ష్య కట్టి ఇలా దాడులు చేస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. కావాలనే వారిని ఇబ్బంది పెట్టడానికి ఇలా దాడులు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం కూడా తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రొడక్షన్ కంపెనీకి సంభందించి వందల కోట్ల రూపాయలకు పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. అయితే దాన్ని లెక్కల్లో వెల్లడించలేదు. సుమారు 300 కోట్ల రూపాయలకు కంపెనీ అధికారులు సరైన పత్రాలు చూపించలేకపోతున్నారు. ప్రొడక్షన్ కంపెనీ లావాదేవీలను తారుమారు చేశారు. వాస్తవ విలువకు బదులు తక్కువ విలువను లెక్కల్లో చూపించారు. అంతేకాక దాదాపు రూ. 350 కోట్ల రూపాయలకు పన్ను ఎగవేశారు. ఇక ప్రముఖ నటి కేవలం 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు రశీదులను మాకు అందజేశారు. అలానే ప్రముఖ నిర్మాత/దర్శకుడికి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారు.. ఈ మొత్తాని కూడా పన్ను ఎగవేశారు.. నటి విషయంలో కూడా ఇలాంటి అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తాం’’ అన్నారు. ఐటీ శాఖ అధికారులు తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో శుభాషిశ్ సర్కార్ తదితరుల నివాసాల్లో తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ముంబై, పుణెలోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ‘క్వాన్', ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధుల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దు పోయేదాకా కొనసాగాయి. పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం తాప్సీ, కశ్యప్‌ను అధికారులు ప్రశ్నించారు. కశ్యప్ 2011లో ‘ఫాంటమ్ ఫిల్మ్స్' పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. 2018లో దీన్ని మూసివేశారు. అయితే ఈ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఐటీశాఖ దర్యాప్తు జరుపుతున్నది. అందులో భాగంగానే ఆ సంస్థ ప్రమోటర్లు అయిన అనురాగ్ కశ్యప్, దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే, నిర్మాత వికాశ్ బెహల్, డిస్ట్రిబ్యూటర్ మధు మంతెన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు ‘లోదుస్తులతో ఫోటోలు షేర్.. నీ రేటెంత’ -
సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: రైతు ఉద్యమానికి మద్దతిస్తూ.. అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు బుధవారం ఇండియాలో కలకలం రేపాయి. మా అంతర్గత విషయంలో మీ జోక్యం ఏంటి అంటూ క్రీడా, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతి విద్వేశ ప్రచారం నుంచి దేశాన్ని కాపాడే బాధ్యతలో సెలబ్రిటీలు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఏక్తా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు సోషల్ మీడియాలో ‘ఇండియాటుగెదర్’ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. ‘‘రైతుల ఉద్యమాన్ని సాకుగా తీసుకుని దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దంటూ’’ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇండియాటుగెదర్ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. వీరిదిలా సాగుతోంటే మరోవైపు దిల్జిత్ దోసాంజ్, కంగనా రనౌత్‌ల మధ్య మరో రచ్చ నడిచింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజనులు మరో ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తెచ్చి.. సెలబ్రిటీలను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు వారు గుర్తించిన ఆ ఆసక్తికర అంశం ఏంటంటే ఇండియాటుగెదర్‌లో భాగంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ చేసిన ట్వీట్స్ రెండు ఒకేలా ఉన్నాయి. అక్షరం పొల్లు పోకుండా.. సేమ్ టూ సేమ్ ఉన్నాయి. వీటిని చూసిన నెటిజనుల ‘‘ఎవర్ని ఎవరు కాపీ కొట్టి ఉంటారో అర్థమై చావడం లేదే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇద్దరి ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసి రీ ట్వీట్ చేస్తూ.. ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి ట్వీట్స్ మాత్రమే కాక మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్ అన్ని సేమ్ ఒకేలా ఉండటంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాక దేశంలో పలు ముఖ్యమైన అంశాలపై కామ్‌గా ఉండే బాలీవుడ్.. రైతుల ఉద్యమం అంశంలో మాత్రం మూకుమ్ముడిగా స్పందించడం ఏంటో అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్ వార్) అయితే సెలబ్రిటీల తీరును మరి కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తున్నారు. సెలబ్రిటీలంతా ఒకే సమయంలో ఒకేలాంటి ట్వీట్లు చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్ని పేయిడ్ ట్వీట్లు.. లేదా బలవంతంగా.. ఒత్తిడి చేయడం వల్ల ఇలా ట్వీట్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ పన్ను చేసిన ట్వీట్ ఆలోచన రేకెత్తిస్తోది. ‘‘ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక జోక్ మీ విశ్వాసాన్ని.. ఒక ప్రదర్శన మీ మత విశ్వాసాన్ని కించపరిస్తే.. అప్పుడు మీరు ప్రచార గురువుగా మారడానికి బదులు.. మీ విలువల వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలి’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: కోహ్లి మద్దతు.. నెటిజనుల విమర్శలు) If one tweet rattles your unity, one joke rattles your faith or one show rattles your religious belief then it’s you who has to work on strengthening your value system not become ‘propaganda teacher’ for others. — taapsee pannu (@taapsee) February 4, 2021 ఇక రైతులకు మద్దతుగా నిలిచిన నటి స్వరా భాస్కర్ ప్రతీ అంశంలో బాలీవుడ్‌ని నిరంతరం ప్రశ్నిస్తున్న వారిని ఎద్దేవా చేస్తూ.. మరో ట్వీట్ చేశారు. ‘రైతులకు మద్దతుగా నిలబడండి.. ఈ అంశంపై బాలీవుడ్ స్పందించాలి అనే వారికి ఇదిగో సమాధానం.. ఇప్పడేం అంటారు’ అంటూ స్వరా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. और बोलो ‘Speak Up Bollywood.. Speak up Celebrities’ 🤪🤪🤪🤪🤪🤪 — Swara Bhasker (@ReallySwara) February 3, 2021 -
తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే
ఇండస్ట్రీకి పరిచయమై పుష్కర కాలం పూర్తయినా కూడా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఇటీవల పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ వైవాహిక బంధాన్ని, సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్ చేస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూనే మరోవైపు భర్త గౌతమ్ కిచ్లుకు తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా భర్తతో కలిసి పలు దేశాల్లో విహరించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవే కాకుండా కాజల్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కమల్ హాసన్ ఇండియన్-2లో కూడా నటిస్తోంది. అంతేగాక భర్త గౌతమ్‌తో కలిసి కుషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ భామ. ఇదిలా ఉండగా డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కాజల్ వైదొలిగినట్లు వార్తలు వినిపిస్తన్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకోగా ఆమె స్టానంలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నును తీసుకున్నట్లు వినికిడి. కాగా కాజల్, తేజ కాంబినేషన్లో ఇప్పటికే లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రితో పాటు సీతా సినిమాలు వచ్చాయి. -
నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్
బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ మౌనం వీడారు. అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. "వావ్, నా నోరు మూయించడానికి చాలా సమయం పట్టింది. ఈ ప్రయత్నంలో ఎన్నో అబద్ధాలు ఆడావు. మీరూ ఒక స్త్రీ అయినప్పటికీ ఎందరో ఆడవాళ్లను ఇందులోకి లాగారు." (చదవండి: కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు) కొంచెమైనా గౌరవాన్ని కాపాడుకోండి మేడమ్.. నేను చెప్పదలచుకుందేంటంటే.. మీ ఆరోపణలన్నీ నిరాధారమైనవే. నాపై ఆరోపణలు వేసే క్రమంలో బచ్చన్ కుటుంబాన్ని, నా ఆర్టిస్టులను ఇందులో లాగావు. కానీ విఫలమయ్యావు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. ఇది నేరం అంటే నేను అందుకు అంగీకరిస్తాను. కానీ నాతో కలిసి పని చేసిన మహిళలు ఎవరితోనూ చెడుగా ప్రవర్తించలేదు, అలాంటి వాటిని సహించను కూడా!" అని అనురాగ్ పేర్కొన్నారు. కాగా ఈ వివాదంతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. పాయల్‌కు కంగనా మద్దతు తెలుపుతండగా, అనురాగ్‌కు తాప్సీ సపోర్ట్‌గా నిలిచారు. కాగా పాయల్ ఘోష్ బాలీవుడ్లో కన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో కనిపించారు. ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్, ప్రయాణం సహా పలు చిత్రాల్లో నటించారు. (చదవండి: డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత) -
నీ అభిమానిని తాప్సీ: హృతిక్
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ పన్ను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తనకేం మాట్లాడాలో తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం పంచుకున్నారు. అసలు విషయమేమిటంటే.. తాప్సీ శనివారం 33వ వసంతంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. ‘‘ నీ అభిమాని నుంచి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తాప్సీ. ఈ సంవత్సరం ఎంతో ఎంతో బాగుండాలి. బిగ్ హగ్’’అంటూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రత్యేకంగా విష్ చేశాడు. ఇందుకు స్పందించిన తాప్పీ.. ‘‘ఈ మెసేజ్ చూసి నేను నిశ్ఛేష్టురాలైపోయాను. అసలు ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. నా గత బర్త్‌డే గిఫ్ట్ ఇది. నేను మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తానో తెలుసు కదా. థాంక్యూ’’అంటూ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.(కంగనా వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ) అయితే వీరిరువురి మధ్య సంభాషణపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తాప్సీకి హృతిక్ అభిమాని అయిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కంగనా- హృతిక్‌ల మధ్య గతంలో నడిచిన ప్రేమ వ్యవహారం వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్‌తో వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలుత గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఆమె... విభిన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. పింక్, బేబీ, నామ్ షబానా, ముల్క్, బద్లా, సాంధ్ కీ ఆంఖ్, థప్పడ్ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. Happy birthday to you @taapsee . From a fan . Have a super duper year ahead. Big hug — Hrithik Roshan (@iHrithik) August 1, 2020 -
జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్
హీరోయిన్ ఒక హత్య చూస్తుంది. కెవ్వున అరుస్తుంది. పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది. హీరో ఒక హత్య చూస్తాడు. కెవ్వున అరవబోయిన.. హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు. అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది. అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది. తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడు హీరోయిన్లే ముందుగా స్పందించారు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు. స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది.. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం. ప్రియాంక చోప్రా శాడ్ అండ్ యాంగ్రీ. నేరం ఏదైనా, చనిపోయేంతగా నిందితుల్ని కొట్టడం అమానుషం. ఆ తండ్రీకొడుకుల కుటుంబాల పరిస్థితిని ఊహించలేకపోతున్నాను. మనమంతా వారికి సపోర్ట్‌గా నిలవాలి. వారి తరఫున మాట్లాడాలి. కరీనా కపూర్ ఇంతటి దుర్మార్గాన్ని సహించకూడదు. కాఠిన్యంపై నోరు తెరవడం మన సామాజిక బాధ్యత. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా పోరాడాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి మద్దతుగా నిలవాలి. ఖష్బూ జయరాజ్ బెనిక్స్‌ల విషయంలో చట్టం తన పని తను చేసుకుపోయి దోషులైన పోలీసులకు శిక్ష విధిస్తుందని మనం ఆశించవచ్చా? వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాజల్ అగర్వాల్ నా మనసును మెలిపెట్టింది. సిక్ అయ్యాను. దీనిపై మౌనం వహించకూడదు. అందరం మన నిరసనను వినిపించాలి. ఆ తండ్రీకొడుకుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి. తాప్సీ పన్ను తరచు జరుగుతుండే వాటిలో ఇదొకటి కావచ్చు. కానీ ఈ ఒక్కటీ ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు దోహదం అవ్వాలి. వాళ్లెవరో తెలియని వారు కావచ్చు. కానీ వారిపై జరిగిన అమానుషం భీతినిగొల్పింది. నరాలను మెలితిప్పింది. హన్సిక వింటేనే భీతిగొల్పుతోంది! పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే అవమానం. దేశానికి కూడా. దోషుల్ని ఉపేక్షించకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి తీరాలి. జెనీలియా నిశ్చేష్టురాలిని అయ్యాను. ఆ ఘటన గురించి విని నా మనసు గాయపడింది. ఇలాంటిది జరగవలసింది కాదు. గుండె పగిలిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రకుల్ ప్రీత్‌సింగ్ గుండె బద్ధలైపోయింది. మనసు చెడిపోయింది. ఈ క్రూరత్వం అమానుషమైనది. కడుపులో తిప్పేసింది. వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. ‘సింగం’ వన్, టు, త్రీ.. సినిమాల డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ ‘డీప్ షాక్’లో ఉన్నారు. పోలీసుల్ని తనెంతో ఉన్నతంగా, గొప్పగా చూపించాడు! కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనను డైరెక్టర్ హరి మరచిపోలేకపోతున్నారు. పోలీసులను హీరోలుగా చూపించినందుకు ప్రాయశ్చిత్తంగా ఇక ఆయన సింగమ్ 4ను తీయాలన్న తన ప్రయత్నాలను విరమించుకోవచ్చనే అనిపిస్తోంది. అయితే ‘సింగమ్’ సిరీస్ హీరో సూర్య ఇంతవరకు ఆ తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై నేరుగా ఏమీ వ్యాఖ్యానించలేదు! బహుశా ఇవాళో, రేపో ఏమైనా ఖండన వంటిదేమైనా ట్వీట్ చేస్తారేమో. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక ‘పోలీస్ హీరో’గా తన అభిప్రాయాన్ని వెల్లడించవలసింది. ఆయన ఒక్కరనే కాదు, మిగతా స్టార్ హీరోలు కూడా! ఘటన జరిగి నేటికి వారం. చప్పుడు లేదు. ఉండవలసినంత లేదు. యు.ఎస్.లో గత నెల జార్జి ఫ్లాయిడ్ ఏ విధంగానైతే ఒక పోలీసు చేతిలో చనిపోయాడో.. అదే విధంగా తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని శంతన్కుళంలో తండ్రి జయరాజ్ (58), కొడుకు బెన్నిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. లాక్డౌన్ పని వేళల ఆంక్షల్ని ఉల్లంఘించి తమ సెల్‌ఫోన్ దుకాణాన్ని నడుపుతున్నారన్న ఆరోపణపై ఈ నెల 19 ఆ తండ్రీకొడుకులను పోలీస్‌లు ఆరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్ర రక్తస్రావంతో జూన్ 22 సాయంత్రం కొడుకు, 23 ఉదయం తండ్రి చనిపోయారు. ఏడు రోజులైంది. మానవ హక్కుల సంఘాల వాళ్లింకా పూర్తిగా బయటికి రాలేదు! తమిళ ప్రముఖులెవరూ ఖండనలు ఇవ్వలేదు! హర్హా భోగ్లే, శిఖర్ ధావన్, రితేశ్ దేశ్‌ముఖ్, రాజ్‌దీప్ సర్దేశాయ్, హీరో విశాల్, రాహుల్ గాంధీ, జయం రవి, జీవా.. మరి కొందరు మాత్రం పోలీసుల ‘బ్రూటల్ యాక్ట్’ తమను నిర్ఘాంతపరిచిందని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు. తమిళనాడు సీయం స్పందించి, కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టును కోరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరికంటే ముందుగా, ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు ఈ ఘటనపై మాట్లాడ్డం, న్యాయం జరగాలని కోరడం, పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలియజేయడం విశేషం. మునుపెన్నడూ ఇంతమంది హీరోయిలు ఇలా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నీ’ అంటూ ప్రియాంకా చోప్రా లాజ్ ఏంజెలిస్ నుంచి ట్వీట్ చేశాక.. సింగర్ సుచిత్ర.. పోలీసుల రాక్షసత్వం పై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆ తండ్రీ కొడుకులను ఎలా చిత్రహింసలు పెట్టి చంపిందీ తమిళ్లో, ఇంగ్లిష్‌లో వివరించారు. ఇంకా.. హన్సిక, ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, పరిణీతి చోప్రా, ఈషా రెబ్బా, రమ్యా సుబ్రహ్మణ్యన్, తమన్నా భాటియా, కైరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, జెనీలియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, కరీనా కపూర్.. ఆ ఘటన తమను ఎంతగానో నిర్ఘాంత పరిచిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మౌనంగా ఉండటం సేఫ్ అనే భావన సాధారణంగా సెలబ్రిటీలలో ఉంటుంది. ఏమాట అంటే ఎటుపోయి వస్తుందోనన్న భయం కూడా ఉంటుంది. వీళ్లేం చేశారో, వాళ్లకెందుకు అంత కోపం వచ్చిందో అని ఆలోచించేవారూ ఉంటారు. అయితే హీరోయిన్లు అలా అనుకోవడం లేదు. నిజమైన హీరోల్లా తమ కోపాన్ని, తమ ఆవేదనను, తమ మనసులోని మాటను ధైర్యంగా బయటికి చెబుతున్నారు. -
తాప్సీ ఫారిన్ ప్రియుడు.. ఫ్యామిలీ రియాక్షన్
‘ఝుమ్మందినాదం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అలరించిన నార్త్ హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ప్రభాస్‌తో కలిసి నటించిన ‘మిస్టర్ పరెఫెక్ట్’ కూడా తాప్సీకి అదృష్టాన్ని తీసుకరాలేకపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ ఢిల్లీ భామ. అయితే అక్కడ అదృష్టం కొద్ది వరుస చిత్రాలతో చేస్తూ బిజీగా మారిపోయారు. అందరూ ఆలోచింపచేసే చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వరుస సినిమాలు, విజయాలతో ఉన్న తాప్సీ తాజాగా తన ప్రియుడిని అధికారికంగా మీడియా ముందుకు తీసుకొచ్చింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఇద్దరు పలు సందర్బాల్లో బయట కనిపించినా కూడా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. ఎట్టకేలకు వీరిద్దరి మద్య వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. స్వయంగా తాప్సి ఇతడే నా ప్రియుడు అంటూ తాజాగా ఓ ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. తన ప్రేమని తల్లిదండ్రులు అంగీకరించాకే అందరికి చెబుతున్నట్లు తాప్సీ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ప్రేమని దాచడానికి కారణం నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసమేనన్నారు. అయినా తను ఎవరితో ప్రేమలో ఉన్నాను అనే విషయం కుటుంబానికి తెలుసని.. అది ప్రపంచానికి తనకు అవసరం వచ్చినప్పుడు చూపించొచ్చని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల అంగీకారం లేకపోతే.. ఏ ప్రేమ జీవితాంతం ఉండదని తాప్సీ అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయంపై తాప్సీ తల్లి నిర్మల్జీత్ కూడా మాట్లాడారు. ‘నాకు తాప్సీపై పూర్తి నమ్మకం ఉంది. ఆమె తన జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకున్నా.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆమెకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. తాప్సీ సినిమా కెరీర్ విషయానికి వస్తే ఇటీవల ‘థప్పడ్’ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా ‘జన గణ మన’ అనే తమిళ ప్రాజెక్టుకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. తాప్సి తెలుగు సినిమాలతో కెరీర్ ఆరంభించినప్పటికీ.. బాలీవుడ్లోనే బ్రేక్ అందుకున్నారు. చదవండి: ప్రభాస్‌తో ప్యాన్ ఇండియా చిత్రం.. రాజు భారీ స్కెచ్? 15 ఏళ్లు : జనాల గుండెల్లో ‘భద్ర’ -
‘ఉరిశిక్షను ఆలస్యం చేసినవారు సిగ్గుపడాలి’
నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్రవారం ఉరి తీసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. ఏడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయమే గెలిచిందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్) తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు స్పందించారు. ‘‘చాలా కాలం వేచి ఉన్నాం. న్యాయం జరిగింది. నిర్భయ ఘటనపై ఇప్పుడు జరిగిన విషయం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. న్యాయం కోసం నిరంతర పోరాటం, కృషి చేసిన నిర్భయ తల్లిదండ్రులకు, న్యాయవాదులకు నా సెల్యూట్. న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది. ఇలాంటి దురాగతాలకు సత్వర న్యాయం దక్కాలి, బలమైన చట్టాలుండాలి’’ అని ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్లో మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ఈ నెల 22న (ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపుకు అందరూ మద్ధతివ్వాలని కోరారు. (నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!) Long awaited but Justice done!! #NirbhayaVerdict restores our faith in the judiciary. Saluting her parents and their advocates for their continuous unflinching efforts. Respect for our judicial system🙏🙏 still advocating for stricter laws and quicker verdicts in heinous crimes🙏 — Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2020 నిర్భయ కేసు దోషులును ఉరి తీశారు. అన్న వార్తతో ఈ రోజు ప్రారంభమైంది. న్యాయం జరిగింది.- తమన్నా ఇలాంటి నమ్మశక్యంకాని వార్త. ఏడు సంవత్సరాల తరువాత, నిర్భయ కేసు దోషులను ఉరితీశారు. న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన నిర్భయ తల్లికి, న్యాయవాదికి నా వందనం - రవి తేజ నిర్భయకు న్యాయం జరిగింది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఓ ఉదాహరణగా నిలవాలి. అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారికి ఉరిశిక్ష విధించాలి. మహిళను గౌరవించండి. ఉరిశిక్షను ఇన్నేళ్లపాటు ఆలస్యం చేసిన వారు సిగ్గు పడాలి. జై హింద్ - రిషి కపూర్ ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడింది. చాలా సంవ్సరాల తర్వాత ఈ రోజు నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రిస్తారు. తాప్సీ అలాగే ఈ ఘటనపై మరికొంత మంది తారలు కూడా స్పందించారు. శ్రద్ధాకపూర్, రితేష్ దేశ్‌ముఖ్, రవీనాటాండన్, ప్రీతి జింటా, మధుర్ భండార్కర్ తదితరులు వారి ట్విటర్స్ అకౌంట్స్ ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. (జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) Beginning the day with the incredible news that the #Nirbhayacase convicts are executed. Justice has been served. — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 20, 2020 Such incredible news...After seven long years, Nirbhaya case convicts have finally been executed! I Salute the mother and the lawyer who fought tirelessly for so many years to get justice🙏#NirbhayaVerdict — Ravi Teja (@RaviTeja_offl) March 20, 2020 Nirbhaya Justice. “Jaisi karni waisi bharni” Let this set an example not only in India but world over. Punishment for rape is by death. You have to respect womanhood. Shame on the people who delayed the execution. Jai Hind! pic.twitter.com/ENyjTxwlMI — Rishi Kapoor (@chintskap) March 20, 2020 It’s done. Finally. I hope the parents can finally sleep slightly better tonight after YEARS. It’s been a long long battle for them. Asha Devi 🙏🏼 https://t.co/XidMPTzKm4 — taapsee pannu (@taapsee) March 20, 2020 -
బూతులు తిట్టి సారీ చెప్పిన దర్శకుడు
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థప్పడ్’ (చెంపదెబ్బ అని అర్థం). ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తొలివారం రూ.23 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లపై ఓ వెబ్సైట్ కాస్త వ్యంగ్యంగా ‘థప్పడ్కు ప్రేక్షకులు చెంప పగిలేలా సమాధానమిచ్చారు’ అని శీర్షిక పెట్టింది. సాధారణంగా సినిమాల మీద వచ్చే ఇలాంటి విమర్శలను దర్శకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హాకు మాత్రం ఆ టైటిల్ చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముందీ.. వార్త రాసిన వాళ్లను ఎడాపెడా తిట్టేశాడు. చెప్పడానికి కూడా వీల్లేని బూతులు అనేశాడు. ‘వీళ్లు సినిమా వ్యాపారం నుంచి వ్యభిచారం బిజినెస్‌లోకి మారిపోయారు. నా డబ్బులు.. నా సినిమా.. నా లాభం. మధ్యలో మీకేంటి..? నేనేమైనా మీకు షేర్లు అమ్మానా? పోనీ మీరేమైనా షేర్లు నాకు అమ్మారా? ముందు వెళ్లి సినిమా చూడండి. వీలైతే ఇష్టపడండి, లేకపోతే ద్వేషించండి. అది మీ ఇష్టం’ అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నాడు. (ఆ విషయం గురించి దయచేసి అడగకండి: తాప్సీ) ‘సినిమా విడుదలైన రెండు మూడు రోజుల తర్వాతే అసలైన కలెక్షన్ల వివరాలు తెలుస్తాయి. దీని కన్నా ముందే వెల్లడించే కలెక్షన్లు కేవలం ఊహాగానాలు, ఇంకా ఇష్టమొచ్చినట్లుగా రాసుకొన్నవి మాత్రమే’నని పేర్కొన్నాడు. అయితే సిన్హ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీ తిట్లలో మహిళలను కించపరుస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని మొట్టికాయలు వేశారు. దీంతో అతను తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. థప్పడ్ చిత్రాన్ని కించపరచడంతో కోపం పట్టలేకపోయానని.. ఈ క్రమంలో తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలని అనుభవ్ పేర్కొన్నాడు. (తాప్సీ ‘థప్పడ్’ మూవీ రివ్యూ) -
తాప్సీ ‘థప్పడ్’ మూవీ రివ్యూ
టైటిల్: థప్పడ్ నటీనటులు: తాప్సీ పన్ను, దియా మీర్జా, కముద్ మిశ్రా, రత్నా పాఠక్ షా, తన్వీ అజ్మీ, పావిల్ గులాటి సంగీతం: అనురాగ్ సాకియా, మంగేశ్ థాకడే దర్శకత్వం: అనుభవ్ సిన్హా నిర్మాతలు: భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, అనుభవ్ సిన్హా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్లో దూసుకుపోతున్నారు. తొలుత గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఆమె... విభిన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఆమె నటించిన పింక్, బేబీ, నామ్ షబానా, ముల్క్, బద్లా, సాంధ్ కీ ఆంఖ్ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇక సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే తాప్సీ తాజాగా నటించిన చిత్రం థప్పడ్(చెంపదెబ్బ అని అర్థం). ముల్క్, ఆర్టికల్ 15 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్ సిన్హా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒకే ఒక చెంపదెబ్బ ఓ మహిళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది.. ఆమెకు తన అస్థిత్వాన్ని ఎలా గుర్తు చేసింది తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘చెంపదెబ్బ’ అనే చిన్నపాయింట్‌తో తెరకెక్కడం.. భర్త అహం కారణంగా భార్య మనస్సులో చెలరేగిన కల్లోలం.. దాని కారణంగా వివాహ బంధం బీటలు వారిన తీరు తదితర సున్నితమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ముగింపు తీసుకుందనే విషయం తెరపై చూడాల్సిందే. కథ ఏంటంటే.. అమృత సబర్వాల్(తాప్సీ పన్ను) ఓ సాధారణ గృహిణి. భర్త విక్రమ్(పావిల్ గులాటి)తో కలిసి ఢిల్లీలో నివసిస్తూ ఉంటుంది. డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న తన ఆశయాన్ని పక్కనబెట్టి మరీ భర్త, డయాబెటిక్ పేషెంట్ అయిన అత్త(తన్వీ అజ్మీ)కి సేవలు చేస్తూ ఉంటుంది. కుటుంబానికి సేవ చేయడం, భర్త ఎదుగుదలలోనే తన సంతోషాన్ని వెదుక్కుంటుంది. అయితే విక్రమ్ కూడా భార్యను ప్రేమగానే చూసుకున్నా.. పితృస్వామ్య భావజాలం కారణంగా.. ఓ రకమైన అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. భార్య కంటే కూడా పనిమీదే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ ఉంటాడు. ఇలా వారి జీవితం సాగిపోతున్న సమయంలో విక్రమ్.. ఏర్పాటు చేసిన ఓ పార్టీ అమృత ఆలోచనలను మార్చివేస్తుంది. అందరి ముందు భర్త తనను కొట్టిన చెంపదెబ్బకు సమాధానం వెదికే క్రమంలో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వేధింపులు, సొంత వాళ్ల నుంచి ఎదురయ్యే ఒత్తిడులు.. వీటన్నింటినీ అధిగమించి ఆత్మగౌరవం కోసం తను పోరాడిన తీరు ప్రధానంగా దర్శకుడు కథను అల్లుకున్నాడు. ఎలా ఉందంటే... అమృత- విక్రమ్‌ల అనుబంధం... వైవాహిక జీవితంలో చిన్న చిన్న సర్దుబాట్లు.. ఇలా దాదాపుగా ప్రతీ ఇంట్లో కనిపించే సాధారణ దృశ్యాలను తెరపై చూపించిన దర్శకుడు.. విక్రమ్.. అమృతపై చేయిచేసుకునే సన్నివేశంతో కథను కీలక మలుపు తిప్పాడు. భర్తకు అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టే అమృత... ఇలా భర్త తనను అందరి ముందు చెంపదెబ్బ కొట్టడాన్ని ఎలా పరిగణిస్తుంది? ప్రతీ బంధంలోనూ సర్దుబాట్లే తప్ప నిజమైన ప్రేమ ఉండదని గ్రహిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? తను చేసిన న్యాయపోరాటంలో గెలిచిందా లేదా వంటి సున్నిత భావోద్వేగాలతో కథను నడిపించాడు. ఆడ అయినా మగ అయినా ప్రతీ మనిషికీ ఆత్మగౌరవం ఉంటుందని మరోసారి గుర్తుచేశాడు. ఏ పరిస్థితుల్లో భార్యపై చేయి చేసుకున్నా అది గృహహింస కిందకే వస్తుందని సగటు భర్తలకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశాడు. ‘‘నీ కోసం నా జీవితం ధారబోశాను కాబట్టి నువ్విలా చేయకుండా ఉండాల్సింది’’ అంటూ భర్త నుంచి విడిపోయేందుకు సిద్ధమైన అమృత.. విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే.. ‘‘నీ భర్తకు లేదా నీకు వివాహేతర సంబంధం ఉందా.. ఒక్క చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్తావా అంటూ మహిళా లాయర్ ప్రశ్నించే తీరు.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ తల్లి ఆమెకు చెప్పే మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఈ న్యాయ పోరాటంలో కేవలం తను మాత్రమే కాకుండా.. తనలాంటి ఎంతో మంది సగటు గృహిణులు.. గృహహింసను కూడా ‘ప్రేమ, బంధం’లో భాగమేనంటూ సర్దిచెప్పుకొంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న అమృత.. ఈ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి నడుం కట్టడం.. చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్లడం ఎంతవరకు సమంజసం అంటూ చుట్టుపక్కల వారు ప్రశ్నించినా.. ‘‘ ఈ సమాజంలో మార్పు రావాలంటే నా పని నన్ను చేసుకోనివ్వండి. మీ పని మీరు చేసుకోండి’’ అంటూ తన అస్థిత్వం కోసం పోరాడిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఎవరెలా నటించారంటే.. థప్పడ్ సినిమాతో తాప్సీ నటిగా మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. సాధారణ గృహిణిగా, ఆత్మగౌరవం కోసం పోరాడే స్త్రీగా తన పాత్రలోని రెండు విభిన్న కోణాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక తాప్సీ భర్తగా నటించిన పావిల్ గులాటి తన పరిధి మేరకు నటించగా... తాప్సీ తండ్రి పాత్రలో నటించిన కుముద్ మిశ్రా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాప్సీ తల్లిగా నటించిన రత్నా పాఠక్ షా, పక్కింటి మహిళగా దియా మీర్జా పాత్రలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఓవరాల్‌గా ఈ సినిమా లింగ సమానత్వానికై కృషి చేసేవాళ్లు, భావోద్వేగాలను అర్థం చేసుకునే వారిని అలరించినా.. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం కోపం తెప్పిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముల్క్, ఆర్టికల్ 15 సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనుభవ్ సిన్హా.. మూడో సినిమాలోనూ సామాజిక సందేశం మిళితం చేసి.. తన మార్కును చూపించాడు. భార్యపై చేయిచేసుకునే భర్తలను సమర్థించే సమాజపోకడలకు తనదైన స్టైల్లో ‘చెంపదెబ్బ’ కొట్టినట్లుగా సమాధానం ఇచ్చాడు. -
థప్పడ్ ట్రైలర్ 2 వచ్చేసింది.. కానీ ఓ ట్విస్ట్
ముల్క్, ఆర్టికల్ 15 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థప్పడ్.. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్‌కపూర్, కుముద్ మిశ్రా తదితరులు నటించారు.. జనవరి 31న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్‌పై ప్రముఖులందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ను చూసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తాప్సీ నటనను అభినందించారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తలు సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అయితే కోపంలో భర్త ఓ రోజు పార్టీలో అందరి ముందు భార్య చెంప చెళ్లుమనిపిస్తాడు. దీంతో షాక్‌కు గరైన తాప్సీ భర్త నుంచి విడాకులు కోరుతుంది. ప్రేమించే భర్త కొడితే సర్ధుకుపోవాలి కానీ కోర్టు వరకు వెళ్తావా అని అందరూ అంటుంటారు. కానీ తనకు ప్రేమ కావాలి. గౌరవం కావాలి అని చెబుతుంది. ఇక చివరికి ఏం జరిగిందనేది కథాంశం. (వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!) ఇక ట్రైలర్ పై విశేష స్పందన లభించడంతో చిత్ర యూనిట్ తాజాగా సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో కాస్త ట్విస్ట్ పెట్టారు. మొదటి ట్రైలర్‌ను జోడిస్తూ.. భర్త తాప్సీని కొట్టిన అనంతరం .. ఆమె కెమెరా వైపు చూసి మాట్లాడుతూ.. ‘‘తరువాత సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారా.. మహిళపై ఇలాంటి హింసను నేను సహించను. మీరు కూడా సహించకండి.. వెంటనే ఈ చర్యలపై యూట్యూబ్‌కు రిపోర్ట్ చేయండి.’ అంటూ సూచించారు. కాగా ఇదంతా సినిమా ప్రమోషన్లలో ఒక భాగంగా తెలుస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.(కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు!) -
థాంక్యూ తాప్సీ: మిథాలీ రాజ్
తన జీవితాన్ని వెండితెరపై వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అన్నారు. తన కథను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు వయాకామ్ 18 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా.. ‘శభాష్ మిథు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాప్సీ ప్రధాన పాత్రలో రాహుల్ డోలకియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో శభాష్ మిథుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా... ‘‘నీ అభిమాన క్రికెటర్ ఎవరు అని తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్లను మీ అభిమాన మహిళా క్రికెటర్ అడగండి’’... ఈ స్టేట్మెంట్ ప్రతీ క్రికెట్ ప్రేమికుడిని ఒక్క క్షణం ఆలోచింపజేసింది. నిజానికి వాళ్లు ఆటను ప్రేమిస్తున్నారా లేదా ఆటగాళ్లను ప్రేమిస్తున్నారా అనే ప్రశ్నను తలెత్తించింది. మిథాలీ రాజ్ నువ్వు గేమ్ ఛేంజర్’ అంటూ ఆమె మాటలను ఉటంకిస్తూ తాప్సీ తన పవర్ఫుల్ లుక్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందుకు స్పందించిన మిథాలీ రాజ్... ‘‘ థాంక్యూ తాప్సీ!!... నువ్వు నా జీవితాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నావు’’ అని ట్వీట్ చేశారు. నువ్వు దీన్ని మైదానం అవతల పడేలా కొడతావు అంటూ క్రికెట్ భాషలో ఆమె నటనా కౌశల్యంపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా నిర్మాణ సంస్థ వయాకామ్18 కు కూడా ధన్యవాదాలు తెలిపారు. (స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్ మిథు' ఫస్ట్ లుక్) It’s really time to stand up for the women in blue . Thank you @AndhareAjit the poster looks really good . https://t.co/Np3sia5oeo — Mithali Raj (@M_Raj03) January 29, 2020 -
స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్ మిథు' ఫస్ట్ లుక్
ప్రస్తుతం దేశంలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ధోని, సచిన్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందిన సంగతి తెల్సిందే. వారి దారిలోనే మహిళా ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్. భారత్ క్రికెట్‌కి ఎనలేని సేవలందించిన ఆమె జీవిత నేపథ్యంలో తాజాగా ఓ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వయాకామ్ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మిథాలీ బయోపిక్‌లో ఆ నటి.. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తోంది. షారుఖ్ ఖాన్‌తో ‘రాయీస్’ మూవీ రూపొందించిన రాహుల్ డోలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘శభాష్ మిథు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. కాగా నేడు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో తాప్సీ మిథాలీ పాత్రలో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2021 ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. “I have always been asked who’s your favourite male cricketer but you should ask them who their favourite female cricketer is.” The statement that made every cricket lover pause n introspect that do they love the game or the gender playing it.@M_Raj03 you are a ‘Game Changer’ pic.twitter.com/2VlxYpXmSM — taapsee pannu (@taapsee) January 29, 2020 -
నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ
జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిపై బాలీవుడ్ తారలు స్పందించారు. హీరోయిన్ స్వరా భాస్కర్, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్ దేశ్‌ముఖ్ ట్విటర్ వేదికగా ఈ హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలోకి చోరబడి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విచక్షణా రహితంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులతోపాటు జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, నటి స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్వరా భాస్కర్ తల్లి జేఎన్‌యూలో ఉంటూ.. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు సహాయం అందిచాలని తన తల్లిని కోరారు. ‘‘ఢిల్లీ వాసులకు అర్జెంట్ అప్పీల్. బాబా మంగ్నాథ్ మార్గంలోని ప్రధాన గేట్ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడండి. ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురండి’’ అని కోరారు.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం) Urgent appeal!!!! To all Delhiites PLS gather in large numbers outside the Main Gate of JNU campus on Baba Gangnath Marg.. to pressure the govt. & #DelhiPolice to stop the rampage by alleged ABVP masked goons on JNU campus. PLS PLS share to everyone in Delhi!🙏🏿🙏🏿 9pm on 5th. Jan pic.twitter.com/IXgvvazoSn — Swara Bhasker (@ReallySwara) January 5, 2020 స్వరా పోస్టు చేసిన దానిపై స్పందించిన షబానా అజ్మీ..దాడిని కేవలం ఖండిస్తే సరిపోదు. ఈ చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాంపస్‌లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు. ‘ఇదంతా నిజంగా జరుగుతుందా... ఓ పీడకలలా అనిపిస్తోంది. నేను ఇండియాలో లేను. దాడి కారణంగా 20 మంది విద్యార్థులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు’ అని షబానా పేర్కొన్నారు. కాగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించాల్సిన చోట ఇలా జరగడం దారుణమని, ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుందని హీరోయిన్ తాప్సీ అన్నారు.. వీరితో పాటు రితేష్ దేశ్‌ముఖ్, దియా మిర్జా, విశాల్ దాద్లానీ సైతం ఈ ఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. This is beyond shocking ! Condemnation is not enough. Immediate action needs to be taken against the perpetrators . https://t.co/P5Arv9aNhj — Azmi Shabana (@AzmiShabana) January 5, 2020 such is the condition inside what we consider to be a place where our future is shaped. It’s getting scarred for ever. Irreversible damage. What kind of shaping up is happening here, it’s there for us to see.... saddening https://t.co/Qt2q7HRhLG — taapsee pannu (@taapsee) January 5, 2020 Why do you need to cover your face? Because you know you are doing something wrong, illegal & punishable. There is no honour in this-Its horrific to see the visuals of students & teachers brutally attacked by masked goons inside JNU-Such violence cannot & should not be tolerated — Riteish Deshmukh (@Riteishd) January 5, 2020 -
‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’
నాకంత పరిజ్ఞానం లేదు అంటోంది నటి తాప్సీ. ఇంతకీ ఈ అమ్మడు చెప్పొచ్చేదేమిటీ అనేగా మీ ప్రశ్న. తాప్సీ ఢిల్లీ భామ అయినా తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో నటించేసి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో ఆడుగళం చిత్రంతో రంగప్రవేశం చేసి ఈ తరువాత ఆరంభం, కాంచన 2, గేమ్ ఓవర్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే కోలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. కాగా సాధారణంగా సక్సెస్ వచ్చినప్పుడు కొన్ని అహంకార మాటలు దొర్లుతాయి. అందుకు నటి తాప్సీ అతీతం కాదు. దక్షిణాదిలో నటిగా గుర్తింపు పొందిన తరువాత బాలీవుడ్లో అవకాశాలను అందుకుంది. ఆ తరువాత దక్షిణాది సినిమాను తక్కువగా చిత్రీకరించి, ఇక్కడి సినిమా వాళ్లను కించపరచేలా మాటలను తూలింది. ఆ తరువాత క్షమాపణ చెప్పిందనుకోండి. ఇప్పుడు దక్షిణాదితో అడపాదడపా నటిస్తూ దృష్టి నంతా బాలీవుడ్‌పైనే సారిస్తోంది. అక్కడ ఈ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే అక్కడ కూడా ఈ బ్యూటీ కొందరి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోందట. అందేంటంటే ఈ అమ్మడు ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనే నటిస్తోంది. నిజానికి అలాంటి కథా చిత్రాలే తాప్సీకి పేరు తెచ్చిపెడుతున్నాయి. అయితే అలాంటి హీరోయిన్ సెంట్రిక్ పాత్రల్లో నటించరాదని, స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే కథా పాత్రల్లో నటించాలని తాప్సీపై ఆమె సన్నిహితులు కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ విషయాన్ని తనే బయట పెట్టింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని అటుంచితే ఇప్పుడు దేశం అట్టుడికిపోతున్న అంశం పౌరసత్వ బిల్లు. దీనిపై బాలీవుడ్, కోలీవుడ్ టాలీవుడ్ నటీనటులు రకరకాలుగా స్పందిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ విషయంపై నటి తాప్పీ మాత్రం చాలా తెలివిగా స్పందించింది. తనకు అంత రాజకీయ పరిజ్ఞానం కాదు కదా, సాధారణ పరిజ్ఞానం కూడా లేదు అని బదులిచ్చింది. ఒక అంశంపై మాట్లాడే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అంది. నిజానికి తనకు పౌరసత్వ చట్టం గురించే సరిగా అవగాహన లేదని చెప్పింది. కాబట్టి ఈ విషయంలో తానెలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని దయచేసి దాని గురించి అడగకండి అంటూ విజ్ఞప్తిచేసింది. అయితే ఏదో ఒక విషయం జరగబోతోందన్నది మాత్రం తెలుస్తోందని తాప్సీ పేర్కొంది. చదవండి: నా రెమ్యూనరేషన్ పెంచేశాను కానీ.. ఆ కోరికైతే ఉంది! -
మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..
సాక్షి, హైదరాబాద్ : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషిస్తున్నట్టు హీరోయిన తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్ మితు పేరిట తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్ చేశారు.మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని తాను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసే అవకాశం రావడం గర్వకారణమని, శభాష్మిథులో మిథాలీ తనను తాను సరైన రీతిలో చూసుకునేలా నటిస్తానని తాప్సీ చెప్పుకొచ్చారు. చివరిగా తాను కవర్‌డ్రైవ్ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తాప్సీ పేర్కొన్నారు. -
అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ
ముంబై : ఢిల్లీ నగరం చాలా ప్రత్యేకమైనదని.. అక్కడ నివసించే ప్రజలకు ప్రత్యేకమైన వ్యవహారశైలి ఉంటుందని.. బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ అన్నారు. దేశంలో ఉన్న చాలా నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీకి చాలా ప్రత్యేకత ఉందన్నారు. తాను కాలేజీ రోజుల్లో సినిమాలకు రాకముందు మోడలింగ్ చేశానని. అప్పుడు తనకు ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం అలవాటని చెప్పారు. కాగా , ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాక బయట తినటం మానేశానని.. బయట తినటం లేదని చెప్పుకొచ్చారు. తన శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి బయటి ఆహారం తీసుకోవడం లేదన్నారు. ఒక వేళ తిన్నా కూడా ఢిల్లీలో లభించే ఫుడ్‌లా రుచిగా, నాణ్యమైన ఎక్కువ కాలరీలు లభించే ఆహారం ఇతర నగరాల్లో ఉండటం లేదని తాప్సీ పేర్కొన్నారు. తనను చూసి చాలా మంది.. ఢిల్లీ అమ్మాయి అని గుర్తుపడుతున్నారని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. కాగా తాప్సీ పుట్టి, పెరిగింది ఢిల్లీ నగరమే అన్న విషయం తెలిసింది. ఢిల్లీలో పుట్టిన అమ్మాయిగా తనకు హింది భాష మీద బలమైన పట్టు ఉందన్నారు. ఈ నగరంలో కొన్ని సమయాల్లో ప్రతికూల విషయాలు ఇబ్బందిపెట్టినా.. ఆ విషయాలకు ఎలా దూరంగా ఉండాలో తెలుసని చెప్పారు. ఈ నగరానికి చాలా రుణపడి ఉన్నానంటూ.. కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇతర భాషల కంటే తాను హింది భాషలా చాలా స్పష్టంగా మాట్లాడుతానని, తాను మాట్లాడే విధానం , ఉచ్ఛరణ బాగుంటుందని చెప్పుకొచ్చింది ఈ ఢిల్లీ బ్యూటీ. తాను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని, ఆసక్తి కూడా ఉండేది కాదని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు సినిమాలు చూడటానికి వెళ్లేవారు కాదని.. తాను మాత్రం కాలేజీ రోజుల్లో స్నేహితులతో చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చూశాని చెప్పారు. తాను సినిమాలు చేయటం మొదలు పెట్టినప్పుడు.. తన సహచర నటులతో పోల్చుకుంటే సినిమా పరిజ్ఞానం చాలా తక్కువని అన్నారు. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన.. తాప్సి పింక్ , మిషన్ మంగల్, నామ్ షబానా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తాప్సీ.. తాజాగా 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ‘సాంద్ కీ ఆంఖ్’ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. -
నా రెమ్యూనరేషన్ పెంచేశాను కానీ.. : తాప్సీ
తన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా హిట్లతో బాలీవుడ్, కోలివుడ్లో దూసుకుపోతుంది అందాల భామ తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిస్తూ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్ సిస్టర్స్ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా ‘సాండ్ కి ఆంఖ్’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరస హిట్లు రావడంతో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. దీనిపై తాప్సి తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత రెండేళ్లలో తన పారితోషకం బారీగా పెరిగిందని.. అయితే తనతో పాటు నటిస్తున్న నటులతో పోలిస్తే అది చాలా తక్కువేనని చెప్పుకొచ్చింది. ఒకేసారి ఎక్కువగా సంపాదించేయాలనే కోరిక తనకు లేదని తెలిపింది. తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పింది. రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టడం తనకు ఇష్టం లేదని తెలిపింది. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఇతరుల దయపై ఆధారపడేదాన్నని... ఇప్పుడు సినిమాలు తననే వెతుక్కుంటూ వచ్చేంత స్థాయికి చేరుకున్నానని చెప్పింది. సాండ్ కీ ఆంఖ్ చిత్రం దిపావళి కానుకగా విడుదల కానుంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు
సాక్షి, సినిమా : హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్ సిస్టర్స్ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో రూపొందించిన చిత్రం సాండ్ కి ఆంఖ్. తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తూ, అరవైయేళ్ల బామ్మలుగా నటించారు. తుషార్ హీరానందని దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించింది. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ 20 మిలియన్ల వ్యూస్‌ను దాటి దూసుకెళ్తోంది. -
భార్య... భర్తకు తల్లిగా నటిస్తే ఇలాగే అడిగామా?
‘సారాంశ్‌లో అనుపమ్ ఖేర్ పాత్ర గురించి ఇలాగే ప్రశ్నించామా? నర్గిస్ దత్ ..సునీల్ దత్(వీరిద్దరు భార్యాభర్తలు)కు తల్లిగా నటించినపుడు ఈ విధంగానే స్పందించామా? జాన్ ట్రవోల్టా యూదు వ్యక్తిగా కనిపించినపుడు ఇదే ప్రశ్న అడిగామా? ఆమిర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమాలో కాలేజీ యువకుడిగా నటిస్తే ఇలాగే ప్రశ్నల వర్షం కురిపించామా? లేదంటే ఈ ప్రేమపూర్వకమైన విమర్శలు మాకు మాత్రమే పరిమితం చేశారా అంటూ బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రతీ విషయాన్ని నెగిటివ్‌గా చూడటంలోనే ఆనందం దొరకుతుందా.. ప్రయోగాత్మక పాత్రలు పోషించే వారిని విమర్శించే నైజం రోజురోజుకు పెరిగిపోతోందా అని ఫైర్ అయ్యారు. ఇంతకీ ఈ ఢిల్లీ భామకు అంతగా కోపం తెప్పించిన విషయం ఏంటంటే...60 ఏళ్ల తర్వాత షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి వందల కొద్దీ పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితాల ఆధారంగా ‘సాంద్ కీ ఆంఖ్’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రకాశీ తోమర్‌గా తాప్సీ నటిస్తుండగా.. భూమి ఫడ్నేకర్ చంద్రో తోమర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ క్రమంలో తాప్సీ, భూమి నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరికొంత మంది మాత్రం...‘ 60 ఏళ్ల బామ్మలకు బదులు తాప్సీ, భూమి వంటి మూడు పదుల వయస్సున్న ఆర్టిస్టులను ఎంపిక చేసి దర్శకుడు తప్పు చేశాడు. ఒరిజినాలిటీ మిస్సయింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాప్సీపై నిప్పులు చెరిగే క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి కూడా ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా నైనా గుప్తా వంటి సీనియర్ నటీమణులు కూడా...‘ నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మా వయసుకు తగ్గ పాత్రలు కూడా మాకు రాకుండా చేస్తే ఎలా. కనీసం ఇలాంటి పాత్రలకైనా మమ్మల్ని తీసుకోండి అంటూ దర్శకులకు సూచించారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు తాప్సీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇక అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్ హిరానందన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. I hope and can only hope this will answer the question once n for all coz honestly now it’s getting boring for us to repeat ourselves. So all you lovely people here goes my RESPONSE -#SaandKiAankh pic.twitter.com/guldaTWaks — taapsee pannu (@taapsee) September 24, 2019 -
‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’
బాలీవుడ్లో హీరోయిన్ తాప్సీ, కంగన సోదరి రంగోలి మధ్య రాజుకున్న మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా తాప్సీ కంగనను ఉద్దేశిస్తూ.. ‘ఓ మహిళ మరో మహిళకు మద్దతుగా ఉండాలని కంగన ఎప్పుడూ చెబుతుంటుంది. మరి ఆమె నా ‘మిషన్ మంగళ్’ సినిమాను అభినందించినట్లు నాకు తెలియలేదు. ఈ సినిమాలో ఐదుగురం ఆడవాళ్లం ఉన్నాము. మరి ఆమె మమ్మల్ని మెచ్చుకుందా’ అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాప్సీ వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి తీవ్రంగా మండి పడ్డారు. ఈ మేరకు రంగోలి ట్విటర్లో.. ‘ప్రతి రోజు కంగనను విమర్శిస్తున్నావ్.. అసలు నిన్ను ఎందుకు మెచ్చుకోవాలి. ఇంత వరకూ నువ్వు ఏం సాధించావ్. అక్షయ్, విద్యాబాలన్‌లు ఉన్న సినిమాలో ఓ రెండు నిమిషాల పాత్ర, అమితాబ్ బచ్చన్ సినిమాలో ఓ పాత్ర చేసినందుకు నిన్ను మెచ్చుకోవాలా. సినిమా అంతా ఒకే రకమైన హావభావాలు వ్యక్తం చేసే నిన్ను ఏ విషయంలో పొగడాలి. విలేకరులు నిన్ను పిలిచింది కంగన గురించి ప్రశ్నించడానికి కానీ.. నీ పనిని, గొప్పతనాన్ని పొగడటానికి కాదు. నా ప్రశ్నలకు సిల్లీగా కాకుండా హుందగా స్పందిచగల్గితే.. స్పందించు.. లేదా వదిలేయ్’ అంటూ తాప్పీని విమర్శిస్తూ రంగోలి ట్వీట్ చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై తాప్సీ ఎలా స్పందిస్తారో చూడాలి. yeh Madam is attacking Kangana everyday,arrey bhai tune kya kiya hai for what we should praise you? 2 mins role in a film lead by Akshay Kumar and Vidya Balan. Or playing character roles in Big B films or carrying same confused expression through all your film...(contd) @taapsee https://t.co/wcDfjvYllH — Rangoli Chandel (@Rangoli_A) August 15, 2019 -
‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డిని విమర్శించబోయి తానే విమర్శల పాలవుతున్నారు నటి తాప్సీ. వివరాలు.. కబీర్‌సింగ్ చిత్రంలో కియారా అద్వాణీ, షాహీద్ కపూర్ల మధ్య వచ్చే సన్నివేశాల గురించి సందీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరలేపాయి. సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు లక్ష్మి తదితరులు సందీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సందీప్‌ను విమర్శించే ఉద్దేశంతో తాప్సీ చేసిన ఓ ట్వీట్ తెగ ట్రోల్ అవుతుంది. నాగపూర్‌కు చెందిన ఓ యువకుడు అనుమానంతో తన ప్రేయసి తల పగలగొట్టి చంపేశాడు. ఇందుకు సంబంధించిన వార్త అన్ని ఆంగ్ల మీడియా సైట్లలో వచ్చింది. ఈ క్రమంలో తాప్సీ దీనికి సంబంధించిన ఓ ఆర్టికల్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో... వారి ప్రేమను నిరూపించుకోవడానికి ఇలా చేశారు’ అంటూ పరోక్షంగా సందీప్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. Or maybe let’s just say they were madly in love with each other n this ‘act’ was to validate his TRUE love for her. 🤷🏻♀️ https://t.co/BGmhA7XHyM — taapsee pannu (@taapsee) July 15, 2019 దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇతరుల చావు వార్తల్లో మీకు వ్యంగ్యం కనిపించిందా అంటూ తాప్సీని ట్రోల్ చేస్తున్నారు. విమర్శలపై స్పందించిన తాప్సీ ‘వ్యంగ్యోక్తులను అర్థం చేసుకోలేని వారు నన్ను, నా ట్వీట్‌ను పట్టించుకోవద్దు’అంటూ మరో ట్వీట్ చేశారు. Statutory warning: people with no sense of sarcasm kindly ignore me n my tweet. Thank you , it was nice not knowing you 🙏🏼 https://t.co/OhIeOd6ZYf — taapsee pannu (@taapsee) July 15, 2019 -
‘ఇబ్బంది కలిగితే ఫాలో అవ్వొద్దు’
తనపై కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ చేసిన విమర్శలను నటీ తాప్సీ చాలా కూల్‌గా కొట్టిపారేసింది. ‘జీవితం చాలా చిన్నది. ప్రస్తుతం నా జీవితం ఎంతో సాఫీగా సాగుతోంది. ఇలాంటి విషయాలపై మాట్లాడి నా సమయాన్ని వృథా చేయాలనుకోవడంలేదు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఎప్పుడూ తన ట్వీట్లతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ చెల్లెలు తాజాగా తాప్సీని ఉద్దేశించి చేసిన ట్వీట్ బాలీవుడ్లో దుమారం రేపింది. ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ సినిమా ట్రైలర్ చూసిన నటీ తాప్సీ ట్విట్టర్లో ‘ట్రైలర్ చాలా బావుంది. సినిమాపై మొదటి నుంచి ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ఉంది’ అని పోస్ట్ చేసింది. వెంటనే స్పందించిన రంగోలీ ‘కొంతమంది కంగనాను కాపీ కొట్టి వాళ్ల దుకాణం నడుపుతుంటారు. ట్రైలర్ చూసి అందరూ ప్రశంసిస్తారు. కానీ కంగనా నటనను గుర్తించరు’ అని బదులిచ్చింది. బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ ఈ విషయంపై రంగోలీని వారించగా.. ‘కంగనాకు డబుల్ ఫిల్టర్ అవసరమని చెప్పడానికి తాప్సీ ఎవరు? దయచేసి అసలు సమస్యను అర్థం చేసుకొండి’ అని ఆయనకు రీట్వీట్ చేసింది. ఇక తన చెల్లెలి వ్యాఖ్యల్ని కంగనా సమర్థించింది. ‘రంగోలి ట్వీట్లను చదివాను. మణికర్ణిక సినిమాపై మాట్లాడాలని రంగోలీ వరుణ్ ధావన్‌ను కోరగా.. అతను స్పందించక పోవడం, తాప్పీ నన్ను అతివాది, డబుల్ ఫిల్టర్ అవసరమని కామెంట్ చేయడంతో ఆమె కలత చెందింది. అనురాగ్ తాప్సీని ఎలాగైతే సమర్థిస్తున్నాడో, అలానే నా సోదరి కూడా నన్ను సమర్థిస్తోంది. ఆమె ట్వీట్లతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే.. ఆమెను ట్విట్టర్లో ఫాలో చేయడం మానుకోండి’ అని కంగనా చెప్పుకొచ్చారు. కంగనా, రాజ్‌కుమార్ రావు నటించిన ఈ చిత్రానికి మొదటగా ‘మెంటల్ హై క్యా’ అనే టైటిల్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు విధించిన ఆంక్షల కారణంగా ప్రస్తుతం ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ అని పేరు మార్చారు. ఈ చిత్రం జూలై 26వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఫోన్ లోపల పెట్టు.. లేదంటే పగలగొడతాను’
షూటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ పాత్ర ప్రభావం నుంచి త్వరగా బయటకు రాలేను అంటున్నారు తాప్సీ. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ‘సినిమాలో నేను పోషించబోయే పాత్ర కోసం నన్ను నేను చాలా త్వరగానే మార్చుకుంటాను. కానీ షూటింగ్ అయిపోయాక ఆ పాత్ర నుంచి అంత త్వరగా బయటపడలేను. కొంత కాలం పాటు ఆ పాత్ర ప్రభావం నా మీద అలానే ఉంటుంది. దీని వల్ల ఓ సారి ఓ వింత అనుభవం ఎదురయ్యింది నాకు. మన్మార్జియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది’ అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు తాప్పీ. ‘ఓ రోజు నేను మా చెల్లి డిన్నర్ కోసమని బయటకు వెళ్లాం. డ్రైవర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మా అనుమతి లేకుండా ఫోటోలు తీయడం ప్రాంరంభించాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ వ్యక్తితో మర్యాదగా ఫోన్ తీసి లోపల పెట్టు.. లేదంటే దాన్ని పగలగొడతాను అని హెచ్చరించాను. సాధారణంగా నాకు ఎప్పుడు అంత కోపం రాదు. కానీ మన్మార్జియా చిత్రంలో నేను పోషించిన రూమి పాత్ర ప్రభావంతో అలా ప్రవర్తించాను. నన్ను చూసి మా చెల్లి కూడా ఆశ్చర్యపోయింది’ అన్నారు తాప్పీ. ప్రస్తుతం మిషన్ మంగళ్ సినిమాతో బిజీగా ఉన్నారు తాప్సీ. -
‘నాకు ఇళ్లు అద్దెకివ్వడానికి భయపడ్డారు’
ఒకానొక సమయంలో నాకు ఉండటానికి ఇళ్లు కూడా దొరకలేదు అంటున్నారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సీ.. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకున్నారు. ‘ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించే రోజుల్లో ఎన్నో కష్టాలు చవి చూశాను. ముఖ్యంగా నాకు ఎక్కడా ఇళ్లు అద్దెకు దొరకలేదు. కారణం నేను సినిమాల్లో నటిస్తానని చెప్పడం. సినిమా రంగం వారు అంటే జనాలకు పెద్దగా నమ్మకం ఉండదు. 500 ఖర్చు చేసి థియేటర్‌కు వచ్చి మమ్మల్ని చూడ్డానికి ఇష్టపడతారు కానీ మేం కూడా వారితో పాటు కలిసి ఉండటానికి వారు ఒప్పుకోరు. ఈ విషయంలో నేను చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముంబైలో నాకు ఇళ్లు దొరకడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింద’న్నారు. అదే హైదరాబాద్‌లో ఇంటి విషయంలో తనకు ఎలాంటి సమయ్యలు ఎదురుకాలేదని తెలిపారు. ‘నేను ఢిల్లీ అమ్మాయిని. ఆలోచన విధానంలో హైదరాబాద్, ఢిల్లీ రెండు ఒకేలా ఉంటాయి. ఈ ప్రదేశం నాకు ఎంతో నచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ కుదురుకున్నాను. ప్రస్తుతం ఓ అపార్ట్మెంట్లో నా చెల్లితో కలిసి సంతోషంగా ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ఢిల్లీలోనే ఉంటున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం తాప్సీ అక్షయ్ కుమార్‌తో కలిసి మిషన్ మంగళ్ చిత్రంలో నటిస్తున్నారు. -
నయన్‌తో కోలీవుడ్‌కు.. తాప్సీతో బాలీవుడ్‌కు
సంగీత రంగంలో ఉరకలేస్తున్నాడు యువ సంగీత దర్శకుడు రోన్ ఈత్తన్ యోహాన్. ఈయన తండ్రి రాజన్ ప్రముఖ గిటారీస్ట్, తాత జావీద్ సంగీత కళాకారుడే. తండ్రి ప్రోత్సాహంతో స్వయంకృషితోనే సంగీత దర్శకుడిగా ఎదిగాడు. లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని నేర్చుకున్నాడు. అంతే సంగీతదర్శకుడిగా అవకాశం వరించేసింది. అగ్రనటి నయనతార సెంట్రిక్ కథా పాత్ర లో నటించిన మాయ చిత్రానికి సంగీతాన్ని అందిం చే అవకాశం. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అంతే ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో మాయ వంటి సంచలన విజయం సాధిం చిన చిత్రం తరువాత అరవిందస్వామి, శ్రియ నటించిన నరకాసురన్, సిగై, ఇరవా కాలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఇక మలయాళంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ఒప్పం చిత్రానికి నేపధ్య సంగీతం అందించారు. కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా న టించిన కేశవా చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారు. తాజాగా టాలీవుడ్‌ను టచ్ చేశారు. అక్కడ మదనం అనే అందమైన ప్రేమ కథా చిత్రంలో పరిచయం అవుతున్నారు. నయనతార మాయ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన యోహాన్ ఇప్పుడు తాప్సీ నటించిన గేమ్ఓవర్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొంది త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని రోన్ ఈత్తన్ యోహాన్ సాక్షితో పంచుకున్నారు. తన కు గురువు ఇళయరాజా, స్ఫూర్తినిచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్, ఇష్టమైన సంగీత దర్శకుడు ఆర్డీ. బర్మన్ అనీ చెప్పారు. హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్న తనకు మెలోడీ పాటలంటేనే ఇష్టం అని తెలిపారు. తెలుగులో నాగార్జున, ప్రభాస్, విజయ్‌దేవరకొండ తనకు నచ్చిన హీరోలని చెప్పారు. తమిళంలో విజ య్, అజిత్ అంటే ఇష్టం అని, దర్శకుడు మ ణిరత్నం, సెల్వరాఘవన్ వంటి దర్శకుల చిత్రాలకు పని చేయాలని ఆశిస్తున్నానని చెప్పాడు. సంగీతంతో పాటు కథలు రాయడంలో ఆసక్తి ఉందని, భవిష్యత్‌లో దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉందని రోన్ ఈత్తన్ యోహాన్ వెల్లడించాడు. -
కాలేజీ గర్ల్‌లా కనిపిస్తే ఏమీ అనలేదే?!
వయస్సు మళ్లిన పాత్రల్లో నటిస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడమేంటని హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. ముప్పై ఏళ్ల వయస్సులో కూడా కాలేజీ అమ్మాయిలా కనిపించినపుడు ఏమీ అనని వారు ఇప్పుడెందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించారు. టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసిన సంగతి తెలిసిందే. తొలుత గ్లామర్ డాల్ పాత్రలకే పరిమితమైన తాప్సీ ఇటీవల కాలంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంలో ‘సాంద్ కీ ఆంఖ్’ అనే సినిమాకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో తాప్సీ కనిపించనున్నారు. ఇందులో తాప్సీతో పాటు మరో బ్యూటీ భూమి ఫడ్నేకర్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం పట్ల తాప్సీ స్పందించారు. ‘ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 30 ఏళ్ల వయస్సులో నేను కాలేజీ అమ్మాయిగా నటించినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అలాగే కొంతమంది అరవై ఏళ్ల వయస్సులోనూ చిన్న పిల్లల క్యారెక్టర్లు వేసినా పట్టించుకోరు. మరి చాలెంజింగ్ రోల్స్ చేస్తున్న నన్ను, భూమిని ఎందుకు తప్పుబడుతున్నారు. మా లుక్‌ను హేళన చేస్తున్నారు. ఇది సరైంది కాదు. ఇది మా జీవితంలో రిస్క్ కాదు. ఒక గొప్ప అనుభూతి. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎంతో స్ఫూర్తినిస్తాయి’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా 60 ఏళ్ల తర్వాత షూటర్స్‌గా తమ కెరీర్‌ను స్టార్ట్ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితాల ఆధారంగా ‘సాంద్ కీ ఆంఖ్’ తెరకెక్కింది. అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్ హిరానందన్ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. -
ఆకట్టుకుంటోన్న ‘గేమ్ ఓవర్’ ట్రైలర్
తన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా హిట్స్ కొడుతూ బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న తాప్సీ.. మరో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘బాద్లా’ సినిమాతో తాప్పీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఓవర్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను రానా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో తాప్సీ నటన ప్రధాన ఆకర్షణగా ఉండబోతోన్నట్లు తెలుస్తోంది. వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
ట్రాక్‌లోనే ఉంది
తాప్సీ, భూమి ఫడ్నేకర్ ముఖ్య తారలుగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో తాప్సీ, భూమి గన్ షూటర్స్‌గా నటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రో అండ్ ప్రకాషి తోమర్ అనే షార్ప్ షూటర్స్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే అనురాగ్ కశ్యప్ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం గురించి అనురాగ్ స్పందించారు. ‘‘ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెల 10న షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. ‘‘ఈ సినిమా గురించి నన్ను ఇప్పటివరకు చాలా మంది అడిగారు. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా సరైన ట్రాక్‌లోనే ఉంది. త్వరలో మరిన్ని విషయాలు తెలుస్తాయి’’ అని తాప్సీ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మిషన్ మంగళ్’ సినిమాతో తాప్సీ, ‘పతీ పత్నీ ఔర్ ఓ’ చిత్రంతో భూమి బిజీ బిజీగా ఉన్నారు. -
అప్పుడు సినిమాలు ఆపేస్తా!
తాప్సీ కెరీర్ ప్రజెంట్ ఎంత స్పీడ్‌గా దూసుకెళ్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ తాప్సీ మాత్రం జీవితాంతం నటిగా కొనసాగే ఆలోచన లేదని చెబుతున్నారు. ‘‘ప్రజెంట్ నేను పైకి ఎదుగుతున్నానంటే మరెవరో కిందకు దిగుతున్నట్లే. భవిష్యత్‌లో నా వంతు రాదని గ్యారంటీ ఏంటి? అందుకే నేను జీవితాంతం నటిగా కొనసాగలని అనుకోవడం లేదు. నన్ను ఆడియన్స్ ప్రోత్సహించినంత వరకు, నాకు వస్తున్న పాత్రలు ఎగై్జటింగ్ అండ్ చాలెంజింగ్‌గా ఉన్నంత వరకు మాత్రమే సినిమాలు చేస్తా. అలా కుదరడం లేదని నా మనుసు నాకు చెప్పిన నాడు సినిమాలు ఆపేస్తా’’ అని చెప్పుకొ చ్చారు తాప్సీ. ఇక సినిమాల విషయానికి వస్తే... హిందీలో తాప్సీ నటించిన ‘సూర్మ, ముల్క్, మన్మర్జియాన్’ వంటి సినిమాలతో పాటుగా ఆమె తెలుగులో చేసిన ‘నీవెవరో’ కూడా ఈ ఏడాదే రిలీజైన సంగతి తెలిసిందే. మరో చిత్రం ‘తడ్కా’ విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ‘పింక్’ సినిమా తర్వాత అమితా»Œ æబచ్చన్, తాప్సీ కలిసి నటిస్తున్న ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
అందుకు ఎంతోమంది ఉన్నారు.. టోన్ మార్చిన తాప్సీ!
సాక్షి, తమిళ సినిమా: కమర్షియల్ హీరోయిన్ పాత్రలు పోషించేందుకు చాలామంది ఉన్నారంటోంది తాప్సీ.. ఇంతకుముందు దక్షిణాదిలో అలాంటి గ్లామర్ పాత్రల కోసమే వెంపర్లాడిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్లో పింక్, నామ్ షబనా వంటి కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడంతో టోన్ మార్చేసింది. బాలీవుడ్లో కాస్త గుర్తింపు రావడం, చేతిలో చిత్రాలు ఉండడంతో ఈ అమ్మడు ధోరణి మారిపోయిందని సినీ జనాలు అంటున్నారు. ఇంతకు తాప్సీ ఏమన్నారంటే.. ‘కొన్ని సందర్భాల్లో నేను కాస్త భయపడతాను. అయితే అది మంచికే అనుకుంటాను. భయం లేదంటే ఏదో తప్పు జరుగుతుందనే అర్థం. నేను కొత్త చిత్రాల ఎంపిక సమయంలో భయపడతాను. అయితే ఆ భయం చిత్రాల విడుదల సమయంలో ఉండదు. నా నుంచి ఎలాంటి నటనను ఆశిస్తున్నారన్న విషయం గురించి ఎక్కువగా ఆసక్తి చూపుతాను. శ్రమతోనే నేనీ స్థాయికి చేరుకున్నాను. ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామా అన్నదే ముఖ్యం. మనం విజయపథంలో ఉంటే చాలు. వైవిధ్యభరితమైన కథాచిత్రాల్లో నటిస్తున్నప్పుడు ఎలాంటి విమర్శలు వస్తున్నాయన్నది ఆసక్తిగా చదువుతాను. అయితే కమర్షియల్ పాత్రల్లో నటించినప్పుడు వచ్చే విమర్శల గురించి పట్టించుకోను. నెటిజన్ల విమర్శలనూ పెద్దగా కేర్ చేయను. తొలిరోజుల్లో నన్ను విమర్శించే వారికి బదులిచ్చేదాన్ని. అయితే ఆ తరువాత మా నాన్న సలహాతో విమర్శలకు బదులివ్వడం మానేశాను. స్థాయి పెరిగినప్పుడు నిన్ను కిందకు పడేయడానికి కొందరు ప్రయత్నిస్తారు అని సన్నిహితులు చెప్పారు. అది నిజం అని గ్రహించాను. నిజం చెప్పాలంటే విమర్శల కారణంగా నాకెలాంటి బాధ లేదు. నన్ను నిజాయితీగా ఫాలో అయ్యేవారి కోసమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాను. వారిలో ఒకరిద్దరి ప్రశ్నలకు సరదాగా బదులిస్తుంటాను. మరో విషయం ఏమిటంటే నన్ను విమర్శించడం వల్ల నాకే మంచి పబ్లిసిటీ వస్తుందని వారు గ్రహించడంలేదు. ఇకపోతే కమర్షియల్ చిత్రాల్లో నటించడం నచ్చిందా? సామాజిక సందేశమున్న చిత్రాల్లో నటించడం నచ్చిందా? అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ రెండు విషయాలు కలిసిన కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. సామాజికపరమైన పాత్రల్లో నటించే అవకాశాలే నాకు ఎక్కువగా వస్తున్నాయి. కమర్శియల్ కథా చిత్రాల్లో నటించడానికి చాలామంది నటీమణులు ఉన్నారు. అలాంటి పాత్రలకు వారు ఉన్నప్పుడు నన్నెందుకు దర్శక నిర్మాతలు ఎంచుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ విషయంలో నాకూ బాధ లేదు’ అని తాప్సీ చెప్పుకొచ్చారు. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌లో టాప్ హీరోయిన్!
టాలీవుడ్లో ఈ ఏడాది సంచలనం రేపిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ కొట్టింది. ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉందంటూ ఎన్ని విమర్శలు వచ్చినా.. అవి సినిమా సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఇక ఇలాంటి సంచలనం సృష్టించిన సినిమా వస్తే.. ఊరికే ఉంటారా? ఇతరా భాషల వాళ్లు రీమేక్ అంటూ ఎగబడతారు. ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ ‘అర్జున్‌రెడ్డి’ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా... ‘ఆర్ఎక్స్ 100’ను ఆది పినిశెట్టి హీరోగా తమిళంలో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్రను డామినేట్ చేస్తూ.. హీరోయిన్ పాత్ర ఉంటుంది. మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆదితో ఇదివరకే నటించిన తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఇక తాప్సీ.. పాయల్ రాజ్‌పుత్‌ను మరిపించేలా ఘాటు సీన్లలో ఏ మేరకు నటిస్తుందో చూడాలి. ‘గుండెల్లో గోదారి’, విడుదలకు సిద్దంగా ఉన్న ‘నీవెవరో’ సినిమాల్లో ఆది, తాప్సీలు కలిసి నటించారు. -
ట్రోలింగ్.. దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన తాప్సీ
సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోవడంతో భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ తమకు నచ్చని వ్యక్తులను కించపరచడం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేసే సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు సెలబ్రిటీలు వీటిని పట్టించుకోరు. కానీ తాప్సీ వంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైనమెట్స్ మాత్రం దిమ్మ తిరిగే సమాధానాలతో ట్రోలర్స్ నోరు మూయిస్తున్నారు. దక్షిణాది సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. బేబీ, నామ్ షబానా, పింక్ వంటి సినిమాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. తాప్సీ అంటే నచ్చని ఓ వ్యక్తి మాత్రం... ‘తాప్సీ అసలు ఏమాత్రం అందంగా ఉండదు. ఆమె ముఖం చాలా చెత్తగా ఉంటుంది. నాకు తెలిసి మరో రెండు సినిమాల్లో మాత్రమే చూడగలం. ఆ తర్వాత బాలీవుడ్ తెరపై నుంచి కనుమరుగైపోతుందంటూ’ అక్కసు వెళ్లగక్కాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన తాప్సీ... ‘అయ్యె ఆల్రెడీ ముల్క్, మన్మర్జియాన్, బద్లా సినిమాల్లో నటించేశానే. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను. మిమ్మల్ని చాలా నిరుత్సాహ పరిచాననుకుంటా. కానీ ఏం చేద్దాం మీరు ఇంకొంచెం బాధను దిగమింగాల్సిందే. ఓ నటిగా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాను. కేవలం ముఖాలు చూసే మీరు ఇకపై నటనను కూడా చూస్తే బాగుంటుంది. జై శ్రీరాం’ అంటూ వరుస ట్వీట్లతో అతడి నోరు మూయించారు. తాప్సీ సమాధానంతో సంతోష పడిన ఆమె అభిమానులు.. మేడమ్ మీరు ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా ఉండాలి. మంచి సమాధానమిచ్చారంటూ ఆమెకు అండగా నిలిచారు. But 3 toh already ho gayi.... #Mulk #Manmarziyaan and then #Badla and sorry to disappoint u but main already do aur sign kar chuki hu..... thoda toh aur jhelna padega 🤷🏻♀️ https://t.co/4KDAkqMHyb — taapsee pannu (@taapsee) July 27, 2018 Matlab Entertainment toh provide kar rahi hu main aapko. Matlab actress ka kaam toh ho gaya 😁 P.S- please apna taste behtar keejiye toh picturein bhi dekh payenge. Jai ShreeRam 🙏🏼 https://t.co/83wHBK84Mo — taapsee pannu (@taapsee) July 27, 2018 -
‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్..’
పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంపై హఠాత్తుగా దేశ ద్రోహులు అనే ముద్ర పడింది. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతో పాటు మీడియా అత్యుత్సాహం కూడా తోడవడం వారిని మరింతగా కుంగదీస్తోంది. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ లాయర్ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి’ ఇదీ సంక్షిప్తంగా ‘ముల్క్’ సినిమా కథ. కోర్టు రూంలో జరిగే డ్రామా ప్రధానంగా నడిచే ఈ సినిమాను దర్శకుడు అనుభవ్ సిన్హా తెరకెక్కించారు. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణా, రాజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన.. ‘ముల్క్’ సినిమా ఆగస్ట్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ‘నేర చరిత గల ముస్లిం కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు, వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం కల్పించేందుకే అనుభవ్ ఈ సినిమా తీస్తున్నట్టు ఉంది. అసలు ఈ సినిమా వెనుక ఉన్నది ఎవరంటూ’ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తనపై ట్రోల్ చేస్తోన్న వారందరికి దిమ్మ తిరిగేలా ఓపెన్ లెటర్‌తో సమాధానమిచ్చారు ‘ముల్క్’ దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్..’ మిమ్మల్ని, మీ ఆలోచనా ధోరణిని చూస్తుంటే జాలి వేస్తోంది. మీ పనికిమాలిన ట్రోలింగ్ వల్ల ఎంతో మంది వ్యక్తుల కెరీర్లు, జీవితాలు ప్రభావితమవుతాయని మీకసలు తెలిసినట్టు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి(సోషల్ మీడియా) రావడం. ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం. ఇది కాదు కావాల్సింది’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సినిమా నిర్మాతల గురించి తెలియజేస్తూ.... ‘‘ముల్క్’ సినిమాకు దావూద్ ఇబ్రహీం గానీ, కాంగ్రెస్ పార్టీగానీ, లేదా ఆరెస్సెస్ గానీ డబ్బులు సమకూర్చడం లేదు. కావాలంటే దావూద్, రాహుల్ గాంధీ, మోహన్ భగవత్‌లను మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి. ఈ సినిమా దర్శకుడిగా చెప్తున్నా.. దీపఖ్ ముకుత్, ఆయన తండ్రి కమల్ ముకుత్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా తెలుకోండి’ అంటూ అనుభవ్ ఓ సుదీర్ఘ లేఖ రాశారు. An open letter to all the trolls. Bring it on!!! pic.twitter.com/QSLMOBLmnz — Anubhav Sinha (@anubhavsinha) July 15, 2018 -
ఫస్ట్ ప్లేయర్.. నెక్ట్స్ లాయర్!
జస్ట్ 14 డేస్ గ్యాప్‌లో రెండు సార్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు కథానాయిక తాప్సీ. ముందు హాకీ ప్లేయర్‌గా గ్రౌండ్లో దుమ్ము దులిపి, ఆ నెక్ట్స్ లాయర్‌గా కోర్టులో వాదిస్తారు. విషయం ఏంటంటే... హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవితం ఆధారంగా షాద్ అలీ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సూర్మ’ జూలై 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్లో దిల్జీత్‌సింగ్ నటించగా, ఫిమేల్ లీడ్ హార్ప్రీత్కౌర్ పాత్రలో తాప్సీ నటించారు. ఇక తాప్సీ లాయర్ ఆర్తీ పాత్రలో నటించిన చిత్రం ‘ముల్క్’. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ కూడా చేశారు. ‘ముల్క్’ చిత్రాన్ని జూలై 27న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అభినవ్ సిన్హా దర్శకత్వంలో రిషి కపూర్, ప్రతీక్ బబ్బర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా, మనోజ్ పవ్వా, నీనా గుప్త ముఖ్య తారలుగా నటించారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరువు, మర్యాదల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుంది. ఇప్పుడు అర్థం అయ్యింది కదా! 14డేస్‌లో గ్యాప్‌లో తాప్సీ ప్లేయర్‌గా, లాయర్‌గా ఎలా వస్తారో! అంతేకాదండోయ్... తాప్సీ నటించిన మరో రెండు హిందీ చిత్రాలు ‘తడ్కా, మన్మర్జియాన్’ కూడా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. బీటౌన్ సరే.. మరి టీటౌన్ (తెలుగు)లో తాప్సీ సినిమాల గురించి అంటే.. అక్కడికే వస్తున్నాం. ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక సింగ్ ముఖ్య తారలుగా తెలుగులో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా టైటిల్‌ను హీరో నానీ రేపు వెల్లడిస్తారు. -
నాని చేతుల మీదుగా టైటిల్ అనౌన్స్మెంట్!
కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై నాని, ఆది పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ల నటనకు ప్రశంసలు దక్కాయి. మళ్లీ కోన వెంకట్ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు చిత్రయూనిట్. మే 24న 11 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ టైటిల్‌ను నాని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సీ, రితికా సింగ్ నటించనున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఎమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం. -
మనసంతా నువ్వే!
తమిళసినిమా: సంచలన తారల్లో తాప్సీ ఒకరు. ఈ భామ వివాదాస్పద నటిగా కూడా పేరు గాంచింది. అప్పుడెప్పుడో ఆడుగళం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఢిల్లీ భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్నా, ఎందుకనో ఇక్కడ పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.అదే విధంగా టాలీవుడ్‌లోనూ ప్రముఖ స్టార్స్‌తో నటించినా స్టార్ ఇమేజ్ను పొందలేకపోయింది. అలాంటి సమయంలో బాలీవుడ్ ఈ బ్యూటీని ఆదుకుంది. అక్కడ నామ్ షబానా చిత్రం మంచి విజయాన్ని సాంధించింది. ఇక అమితాబ్‌బచ్చన్‌తో నటించిన పింక్ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు తాప్సీ చేతిలో ఉన్నాయి. మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక ప్రయత్నం చేసే తాప్సీ తనకు వచ్చిన ఓ ప్రేమలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాంటి వాటిలో ఇటీవల ఒక అభిమాని రాసిన ప్రేమ, పెళ్లి ప్రపోజల్ లేఖ తాప్సీని విస్మయం పరచిందట. ఈ లేఖను ఈ అమ్మడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అందులో ఏముందంటే నేను మద్యం తాగను, మాంసాహారం భుజించను. అన్నింటికంటే ముఖ్యం నేను చాలా నిజాయితీపరుడ్ని. నీపై నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఎలాంటి పరిక్షలకైనా సిద్ధం. నా విన్నపాన్ని పరిశీలించడం మరచిపోవద్దు. నా మనసంతా నువ్వే నిండిపోయావు అని రాశాడు. ఈ ప్రేమలేఖ నటి తాప్సీని ఎంతగానో ఆకట్టుకుందట. తనకు వచ్చిన వాటిలో ఇదే ఉత్తమప్రేమలేఖ అని తాప్సీ పేర్కొంది. ఇప్పుడీ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
బ్యాట్ పట్టేదేవరు?
యస్.. బ్యాట్ పట్టి క్రీజ్‌లో బాదేదెవరు? గ్రౌండ్లో ఆపోజిట్ టీమ్‌ని పరిగెత్తించేదెవరు? తాప్సీనా లేక సోనాక్షి సిన్హానా? వీరిద్దరిలో ఎవరు?... ఇదిగో ఇలాంటి చర్చే ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతోంది. ఇంతకీ అసలు కహానీ ఏంటంటే.. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బయోపిక్స్ మంత్రం ఎలా వర్క్ అవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైలోని ఓ ప్రముఖ నిర్మాణసంస్థ ఆల్రెడీ రైట్స్‌ను దక్కించుకున్నారట. అయితే మిథాలీ పాత్రకు సోనాక్షి సిన్హా, తాప్సీలను ఆ నిర్మాణ సంస్థ సంప్రదించారని బాలీవుడ్ టాక్. ఆల్రెడీ సందీప్‌సింగ్ బయోపిక్‌లో తాప్సీ హాకీ ప్లేయర్‌గా నటించారు. సో... తాప్సీనే ఫైనల్‌గా ఫిక్స్ అవుతారని కొందరు అంటుంటే.. లేదు..లేదు.. సోనాక్షి సిన్హానే సెలక్ట్ అవుతారని మరికొందరు అంటున్నారు. తాప్సీ బ్యాట్ పట్టుకుంటారా లేక తొలి బయోపిక్ కోసం సోనాక్షి బ్యాట్ పట్టుకుంటారా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. -
షబానా మామూలు అమ్మాయి కాదు!
‘‘షబానా చాలా ధైర్యవంతురాలు. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసుకోగల నేర్పు ఉన్న అమ్మాయి. శత్రువులకు ఆ అమ్మాయి అంటే దడ. మొత్తానికి షబానా మామూలు అమ్మాయి కాదు’’ అని తాప్సీ అంటున్నారు. తాప్సీ ఈ రేంజ్లో పొగుడుతున్నారంటే షబానా ఆమెకు కావాల్సిన అమ్మాయి అనుకుంటున్నారా? అదేం కాదు. షబానా అంటే ఎవరో కాదు.. తాప్సీయే. ప్రస్తుతం ఆమె కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘నామ్ షబానా’. అంటే పేరు.. షబానా అని అర్థం. ఇందులో టైటిల్ రోల్‌ను తాప్సీ చేస్తున్నారు. ఈ ఢిల్లీ బ్యూటీకి హిందీలో బాగా పేరు తెచ్చిన ‘బేబీ’కి సీక్వెల్ ఇది. ‘బేబీ’లో తాప్సీ నటన బాగా నచ్చి, సీక్వెల్‌కి కూడా ఆమెనే తీసుకున్నారు చిత్రదర్శకుడు నీరజ్ పాండే. ‘బేబీ’లో తాప్సీ చిన్నపాటి ఫైట్స్ చేశారు. కానీ, సీక్వెల్లో రిస్కీ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తారు. ఆరేళ్ల కెరీర్లో ఇప్పటివరకూ తాప్సీ టైటిల్ రోల్ చేయలేదు. ‘‘మొదటిసారి ఈ అవకాశం దక్కింది. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరింత మంచి అవకాశం ఈ సినిమా’’ అని తాప్సీ అన్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం కోసం తాప్సీ ‘మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్’, జపనీస్ మార్షల్ ఆర్ట్ అయిన ‘ఐకిడో’, ఆత్మ రక్షణ కళ ‘క్రావ్ మగా’ నేర్చుకున్నారు. ‘‘ఈ మూడు కళలు ఎందుకు నేర్చుకున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. రోజుకి రెండు గంటలు ఇవి నేర్చుకోవడం.. 12 గంటలు షూటింగ్ చేయడం.. ఫుల్ బిజీ’’ అని తాప్సీ పేర్కొన్నారు. -
అమితాబ్‌ను తాప్సీ వెక్కిరించిందా?
అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్ దిగ్గజం. ఆయనంటే ప్రతి ఒక్కరికీ ఎక్కడలేని గౌరవం ఉంటుంది. అంతదూరంలో పెద్దాయన కనిపించగానే ఎదురెళ్లి మరీ పాదాభివందనాలు చేస్తారు. కానీ ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం అలాంటి అమితాబ్ బచ్చ్ను వెనకాల నుంచి వెక్కిరించింది!! అంత ధైర్యం ఆమె ఎలా చేసిందని అనుకుంటున్నారా? ఆ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చనే తన ట్విట్టర్ ద్వారా వివరించారు. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో వస్తున్న 'పింక్' సినిమా షూటింగ్ జరుగుతుండగా తాప్సీతో పాటు మరికొందరు కలిసి కెమెరా వైపు చూస్తూ సరదాగా నాలుక బయటపెట్టి, చిత్రమైన పోజులతో వెక్కిరిస్తున్నట్లుగా ఫొటో తీయించుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయానికి అమితాబ్ బచ్చన్ లాయర్ దుస్తులలో మేకప్‌లో ఉండి, సీరియస్‌గా స్క్రిప్టు చూసుకుంటున్నారు. అనుకోకుండా వీళ్లు తీయించుకున్న ఫొటో ఫ్రేములోకి అమితాబ్ కూడా వచ్చేశారు. ఇదే విషయాన్ని ఆ ఫొటోతో సహా అమితాబ్ ట్వీట్ చేశారు. T 2238 - And then you get photobombed by your colleagues !! PINK on set pic.twitter.com/1rIObTEetP — Amitabh Bachchan (@SrBachchan) 26 April 2016 -
జోరుగా హుషారుగా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా... హాయి హాయిగా.. తియ్య తియ్యగా’ అనే పాట గురించి తాప్సీ, చార్మీకి తెలుసో తెలియదో కానీ.. ఈ పాటలోలానే ఈ ఇద్దరూ ఇటీవల జోరుగా షికారు చేశారు. నచ్చినవాళ్లతో షికారు చేస్తూ.. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరూ జాయింట్‌గా వెళ్లలేదు. తాప్సీ తన చెల్లెలు షగున్‌తో వెళ్తే, చార్మీ తన స్నేహితులతో వెళ్లారు. ఎంజాయ్మెంట్కి చిరునామా అనే పేరు తెచ్చుకున్న ఇండియాలోని ఓ ప్రదేశానికి చార్మి వెళ్తే, తాప్సీయేమో విదేశాలకు వెళ్లారు. ఈ ఇద్దరి విహార యాత్రలో చాలా కబుర్లే ఉన్నాయి... చాలా చలిగా ఉంది బాబోయ్! ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉన్నారు. ఎప్పట్నుంచో చిన్న బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ బ్రేక్ పూర్తిగా నా చెల్లెలి కోసమే అంటున్నారామె. ఇటీవల బ్రేక్ తీసు కున్న ‘‘కొత్త ప్రయాణం.. కొత్త గమ్యం.. ఫ్లయిట్ జర్నీకి టైమ్ అవు తోంది. నేనెక్కడికి వెళుతున్నానో? ఊహించగలుగుతారా?’’ అని ఫేస్బుక్ ద్వారా చిన్న ట్విస్ట్ ఇచ్చారు. కాసేపటికి ‘‘న్యూయార్క్ వెళుతున్నా’’ అని స్పష్టం చేశారు. అలా ఈ మధ్య న్యూయార్క్‌లో ఈ అక్కాచెల్లెళ్ల సందడికి కొదవే లేదు. ఆ నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచీ తాము దిగిన ఫొటోల్లో కొన్నింటిని ట్విట్టర్, ఫేస్బుక్లో పెట్టారు. అక్కడ అడుగుపెట్ట గానే ఓ పెద్ద వీధిలో ఫొటో దిగి, ‘‘చాలా చలిగా ఉంది బాబోయ్’’ అని పేర్కొన్నారు తాప్సీ. ఆ తర్వాత ఓ క్లబ్లో జరిగిన మ్యూజికల్ షోకి వెళ్లారు. రెండో రోజు బస్ జర్నీ చేశారు. గంటలు గంటలు షాపింగ్ చేశారు. కామెడీ సెల్లార్ అనే ప్రోగ్రామ్‌కి వెళ్లి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మూడో రోజున అక్కడి ఫేమస్ సెంట్రల్ పార్క్‌కి వెళ్లారు. అలాగే 102 అంతస్తులున్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బయట నిలబడి, తాప్సీ, షగున్ సెల్ఫీ దిగారు. అంతా బాగానే ఉంది కానీ, 9/11 మెమోరియల్ మ్యూజియమ్ దగ్గరకు వచ్చేటప్పటికీ నవ్వు మాయమైపోయిందనీ, చాలా బాధ అనిపించిందనీ అన్నారు. ఇంకా న్యూయార్క్‌లోని పలు ప్రదేశాలను సందర్శించారు. దాదాపు ఆరు రోజుల పాటు చెల్లెలు షగున్‌తో ఎంజాయ్ చేసి, ‘మళ్లీ ఇక్కడికి వచ్చేవరకు బై.. బై.. అమెరికా.. నెక్ట్స్ టైమ్ వాతావరణం బెటర్‌గా ఉండాలి’ అంటూ అమెరికాకు ముద్దుగా విన్నవించుకున్నారు తాప్సీ. ప్రతి అందమైన విషయానికీ ఓ ఎండింగ్! చార్మి ట్రిప్ గురించి చెప్పాలంటే... తను ఒకరిద్దరితో కాదు... దగ్గర దగ్గర పదిమందితో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఎంజాయ్మెంట్కి చిరునామా అని పేరు తెచ్చుకున్న గోవాకు ఇటీవల వెళ్లారామె. సాగర తీరాల్లో స్నేహితులతో కలిసి చార్మి ఏ రేంజ్లో సందడి చేస్తున్నారో ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. గోవాలో దొరికే టేస్టీ టేస్టీ సీ ఫుడ్స్ ఓ పట్టు పట్టారు. ఈ హాలీడే ట్రిప్‌లో డైటింగ్ గురించి పట్టించుకోకూడదని ఫిక్స్ అయినట్లున్నారు. అందుకే మొహమాటం లేకుండా లాగించేశారు. ‘‘ఒక్కోసారి ఆరోగ్యానికి ఏదైతే మంచిది అనుకుంటామో అదే చెడు చేస్తుంది కూడా’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు చార్మి. దానికి కారణం.. ఫుడ్ పాయిజన్ కావడమే. ‘‘ఫుడ్ పాయిజన్ అయిన రోజు రాత్రి కాళరాత్రే’’ అన్నారీ బ్యూటీ. పగటి పూట మాత్రమే కాదు.. అర్ధరాత్రి కూడా చార్మీ తన ఫ్రెండ్స్‌తో గోవా వీధుల్లో ఎంజాయ్ చేశారు. దాదాపు వారం రోజులు ఈ ట్రిప్‌ను ఎంజాయ్ చేసి, ‘ప్రతి అందమైన విషయానికీ ఓ ఎండింగ్’ ఉంటుంది అంటూ హాలీడే ట్రిప్ ఎండింగ్ గురించి పేర్కొన్నారామె. -
సహజీవనం మేలే
ఎవరికీ ద్రోహం చేయకుండా సహజీవనం ఎంతో మేలని నటి తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఉత్తరాది బ్యూటీకి చాలా కాలం తర్వాత కోలీవుడ్‌లో కాంచన -2 చిత్రంతో సంతృప్తికరమైన సక్సెస్ వచ్చింది. బాలీవుడ్లో బేబి చిత్రం విజయం సాధించింది. రెట్టింపు సంతోషంతో ఉన్న తాప్సీతో చిన్న భేటి.. ప్ర: అందాల భరిణి లాంటి మీకు కాంచన-2 చిత్రంలో దెయ్యంగా నటించడానికి ఎలా ధైర్యం వచ్చింది? జ: కాంచన- 2 చిత్రం కథ విన్న తర్వాత నటించాలా..? వద్ద..? అన్న నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు పట్టింది. దెయ్యం పాత్రలో నటించేందుకు ముందు సంకోచించిన మాట వాస్తవమే. లారెన్స్ ఇది చాలా మంచి పాత్ర అని, నువ్వు తప్ప వేరొకరు న్యాయం చేయలేరని చెప్పడంతో అంగీకరించాను. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం ఫలించింది. ప్ర: మీరు నటించిన హిందీ చిత్రం బేబి, కాంచన-2 ఏక కాలంలో విడుదలై విజయం సాధించడం గురించి...? జ: 2014లో నేను నటించిన ఒక చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఇది బాధాకర విషయం. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతాయన్న నమ్మకం మాత్రం ఉండేది. ఆ నమ్మకం వమ్ము కాలేదు. రెండూ హిట్ కావడం ఆనందంగా ఉంది. కాంచన - 2 చిత్రంలో నా నటనకు పలువురి నుంచి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ప్ర: సినీ పరిశ్రమలో మీకు లక్ష్మి మంచు మినహా వేరే స్నేహితులు లేరట నిజమేనా..? జ: నిజమే. నాకు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు స్నేహితురాలు అంటే లక్ష్మి మంచునే. నాకు సినిమా రంగంలో అధికంగా స్నేహితులు ఉండాలని కోరుకోవడం లేదు. అదేవిధంగా సినిమా రంగానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండకూడదన్నదే నా భావన. సినిమాకు బయట నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ప్ర: ఓ కదల్ కన్మణి చిత్రంలో హీరో హీరోయిన్లు సహజీవనం సాగించినట్టు చూపించారు దీన్ని సమర్థిస్తారా? జ: పెళ్లి కాకుండా సహజీవనం చేయడం మేలే. వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుంటే పిల్లలకు సమస్యలు తప్పవు. అదే సహజీవనం చేస్తే నచ్చకుంటే విడిపోవచ్చు. తద్వారా ఎవరికీ సమస్య ఉండదు. ప్ర: ఇంటర్నెట్లో హీరోయిన్ల అశ్లీల దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్? జ: ఒక నటిని తప్పుగా చిత్రీకరించి సోషల్ నెట్‌వర్క్‌లో ప్రచారం చేసే వాళ్లు కచ్చితంగా బుద్ది లేని వారే. అందుకే ప్రస్తుతం సమాజంలో అత్యాచార సంస్కృతి పెరుగుతోంది. అందుకు కారణమైన వారిని అవయవాలను కత్తిరించాలి. అదే సరైన శిక్ష. ప్ర: మీపై వస్తున్న వదంతుల గురించి? జ: నేను జీవితంలో చాలా నేర్చుకున్నాను. ఎవర్ని నమ్మాలో, నమ్మకూడదో తెలుసుకున్నాను. నాపై జరుగుతున్నది అసత్య ప్రచారమే కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్ర: పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? జ: అందుకు చాలా సమయం ఉంది. నటించడం ఇక చాలు అనుకున్నప్పుడు పెళ్లికి సిద్ధమవుతాను. వివాహానంతరం క చ్చితంగా నటించను. -
నిర్మాతగా తాప్సీ?
కథానాయికలు నిర్మాతలుగా మారడం ఇప్పటి ట్రెండ్. మొన్న అనుష్క శర్మ నిర్మాతగా మారి ‘ఎన్‌హెచ్ 10’ తీసి విజయం సాధించారు. ప్రియాంకా చోప్రా కూడా ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా తాప్సీ కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను భయపెట్టిన ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి హిందీలోకి రీమేక్ చేయాలని తాప్సీ భావిస్తున్నారట! -
తాప్సీ సుందరాకాండ్
తాప్సీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. అయితే... తెలుగుతెరపై కాదు... హిందీ తెరపై. సినిమా పేరు ‘సుందరాకాండ్’. బాలీవుడ్లో తాప్సీ నటిస్తున్న అయిదవ చిత్రం ఇది. ఈ మధ్యే... బాలీవుడ్లో ఆమె నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం హిందీలో ‘బేబీ’ అనే సినిమా చేస్తున్నారామె. ఇది కాకుండా మరో చిత్రంలో కూడా నటించడానికి అంగీకరించారు. ఇటీవల ఇంకో చిత్రానికి పచ్చజెండా ఊపారు. అదే ‘సుందరాకాండ్’. బాలీవుడ్ ఛాన్స్‌ల కోసం తోటి తారలంతా ఆశగా ఎదురుచూస్తోంటే.. తాప్సీ మాత్రం జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్లో ఇలా వరుస అవకాశాలు దక్కించుకోవడం నిజంగా విశేషమే. ఇప్పటివరకూ వచ్చిన పోలీస్ పాత్రల్లో భిన్నమైన పాత్ర ఇందులో తాప్సీ చేయబోతున్నట్లు బాలీవుడ్ టాక్. ఇప్పటిదాకా అందాన్నే ఆయుధంగా చేసుకొని యువతరాన్ని ఉర్రూతలూగించిన తాప్సీ... ‘సుందరాకాండ్’ ద్వారా అభినయ తారగా కూడా ఎదగడం ఖాయమని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ప్రియా మిశ్రా ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్ కథానాయకుడు. -
తాప్సీ, హన్సికలకు సెలవులు
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపూ తెలియకపోయినా... నూతనోత్సాహం కోసం పనికి కొన్ని రోజులు విరామం ఇవ్వాలనిపిస్తుంది. ఇటీవల తాప్సీ, హన్సికలకు అలానే అనిపించింది. అంతే.. ఓ సారి తమ డైరీ తిరగేశారు. కొన్ని రోజులు షూటింగ్‌కి విరామం ఇచ్చే పరిస్థితి కనిపించడంతో విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. విడివిడిగా నిర్ణయం తీసుకుని ఈ ఇద్దరూ విదేశాలు చెక్కేశారు. హన్సిక వెళ్లి ఇప్పటికి ఐదారు రోజులైంది. ముందు ఆమ్స్టర్ డామ్, అటునుంచీ బార్సిలోనా వెళ్లారామె. ఈ హాలిడే ట్రిప్ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నారో ఏమో... ఇక్కణ్ణుంచి వెళ్లేటప్పుడు జుత్తుకి పింక్ రంగు వేయించుకున్నారు. విదేశాల్లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఆ ఫొటోలను ట్విట్టర్లో కూడా పొందుపరుస్తున్నారు హన్సిక. ఇక, తాప్సీ విషయానికొస్తే.. ఈ బ్యూటీ విదేశాలు వెళ్లి మూడు, నాలుగు రోజులవుతోంది. ఇక్కణ్ణుంచి వెళ్లే ముందు.. ‘‘ఇటీవల కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నాను. ఆ మీటింగ్స్‌లో బోల్డన్ని ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. వాటిని త్వరలో మీతో పంచుకుంటా’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దాన్నిబట్టి, ఏదైనా భారీ చిత్రంలో తాప్సీ నటించనున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అసలు విషయం తాప్సీ చెబితే ఆ ఊహాలకు తెరపడుతుంది. ప్రస్తుతం ఆమె ఏథెన్స్లో ఉన్నారు. సెలవులు ముగిసే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారామె. మొత్తం మీద తాప్సీ, హన్సిక సెలవులను పూర్తిగా ఆస్వాదించి, ఓ నూతనోత్సాహంతో వస్తారని ఊహించవచ్చు. -
ఆఫర్లు లేక అల్లాడుతున్న తాప్సీ
-
ఎందరిని ప్రేమిస్తాను...?
‘‘నేనెంత మందినని ప్రేమిస్తాను ఇప్పటికే చాలా మందితో కలుపుతూ రాశారు. మీ రాతలకు అంతం ఉండదా?’’ అంటూ మండిపడుతోంది నటి తాప్సీ. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్ కొచ్చి పడిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తరువాత వందాన్ వెండ్రాన్, మరందేన్ మన్నిత్తేన్, ఆరంభం వంటి చిత్రాల్లో నటించింది. ఆరంభం షూటింగ్ సమయంలో ఆర్యతో ప్రేమాయణం అంటూ, అంతకు ముందే ఒక తెలుగు నటుడితో కలుపుతూ సాగిన ప్రచారం పెద్ద సంచలనాన్నే రేకెత్తించింది. తాజాగా మరో కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలంటూ ప్రచారం జోరందుకుంది. ఆయనెవరో కాదు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్ బోవ్ నే. ఈ ప్రేమ పక్షులిద్దరూ నిత్యం ఫేస్బుక్ ద్వారా మాటల రొమాన్స్ చేసుకుంటున్నారట. సమయం దొరికినప్పుడల్లా జంటగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. ప్రస్తుతం షాదీ డాట్‌కామ్ అనే హిందీ చిత్రంలో తాప్సీ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల చండీగఢ్‌లో జరిగింది. ఆ సమయంలో తాప్సీని కలుసుకోవడానికి మాథ్యూస్ ముంబాయి నుంచి చండీగఢ్ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు తన ట్విట్టర్లో తనకో మంచి గర్ల్‌ఫ్రెండ్ దొరికింది. ఆమె మరెవరో కాదు నటి తాప్సీనే అంటూ మ్యాథ్యూస్ పోస్ట్ చేయడంతో వీరి మధ్య లవ్వాట మొదలైందనే ప్రచారం ఇటీవల కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించాలని తాప్సీని అడగితే ఆగ్రహంతో అగ్గిమీద గుగ్గిలయ్యింది. ‘‘నా గురించి నా వ్యక్తి గత జీవితం గురించి ఇప్పటికే చాలా వదంతులు ప్రచారం చేశారు. అలాంటి వాటికి బదులిచ్చి అలసిపోయూను. ఇకపై ఎలాంటి గ్యాసిప్స్ కు సమాధానం చెప్పేది లేదు. ఇతరులతో నన్ను చేరుస్తూ రాయడానికి అంతం లేదా? ఇలా నేనెంతమందిని ప్రేమిస్తాను. రోజుకో కథ రాస్తున్నారు’’ అంటూ తాప్సీ రుసరుసలాడుతోంది. నిప్పులేనిదే పొగరాదని ఈమె ఎరుగదేమో!