ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ | Taapsee Pannu Reveals OTTs Dont Want to Spend Money on Promoting Small Films | Sakshi
Sakshi News home page

OTT: ప్రమోషన్‌ చేయలేం.. ప్రతి సినిమా తీసుకోలేమంటున్నాయి.. తాప్సీ

Published Sat, Jul 6 2024 1:43 PM | Last Updated on Sat, Jul 6 2024 1:56 PM

Taapsee Pannu Reveals OTTs Dont Want to Spend Money on Promoting Small Films

ఓటీటీల పుణ్యమా అని చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. అటు లాభాల బాట పడుతున్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం మరొకటి ఉందంటోంది హీరోయిన్‌ తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఏం జరిగేదంటే ఓటీటీల దగ్గర ప్రతి సినిమాకు ఓ ప్యాకేజీ మాట్లాడేసుకునేవారు.

ఓటీటీల యూటర్న్‌
దీనివల్ల మూవీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నాలేకున్నా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ అంతగా రాకపోయినా నష్టం వాటిల్లకపోయేది. కానీ ఇప్పుడు ఓటీటీలు కూడా యూటర్న్‌ తీసుకున్నాయి. ప్రతి సినిమాను తీసుకోలేమని చెప్తున్నాయి. వాటిని ప్రమోట్‌ చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టలేమని చేతులెత్తేస్తున్నాయి. పెద్ద స్టార్స్‌ లేని చిన్న సినిమాను ఆడియన్స్‌ చూసేలా చేయడం కష్టమని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ భావిస్తున్నాయి. ఎంతోకొంత ప్రమోషన్‌ చేసి థియేటర్‌లో విడుదల చేయమని, ఆ తర్వాతే ఫలానా వారానికి ఓటీటీలో తీసుకుంటామని చెప్తున్నాయి' అని తాప్సీ పేర్కొంది.

సినిమా
కాగా తాప్సీ చివరగా డంకీ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా' మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో విక్రాంత్‌ మాస్సే, సన్నీ కౌశల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఖేల్‌ ఖేల్‌ మే మూవీలోనూ తాప్సీ కనిపించనుంది.

చదవండి: అనంత్‌ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్‌ స్టార్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement