నోరు మూస్కో, నా టైమ్‌ వేస్ట్‌ చేయకు: తాప్సీ | Tapsee Pannu: Dont Crowd My Timeline With Your Nonsense | Sakshi
Sakshi News home page

కారు ఇవ్వమన్న నెటిజన్‌.. నోరు మూయ్‌ అన్న తాప్సీ

Published Tue, Apr 27 2021 3:49 PM | Last Updated on Tue, Apr 27 2021 6:21 PM

Tapsee Pannu: Dont Crowd My Timeline With Your Nonsense - Sakshi

తన మీద కామెంట్‌ చేసిన వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేసిపారేసింది హీరోయిన్‌ తాప్సీ. నోరు మూసుకో.. అంటూ..

సోషల్‌ మీడియా వచ్చాక ప్రతివాడు సూక్తులు చెప్పడం, సలహాలు ఇవ్వడం, ఎవర్ని పడితే వాళ్లను నోటికొచ్చినట్లు తిట్టడం, ఇతరులను ఆడిపోసుకోవడం బాగా అలవాటైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల మీద అక్కసు చూపించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. వాళ్లు ఏ పోస్టు పెట్టినా, ఏం చేసినా విమర్శించడానికి రెడీగా ఉంటారు కొందరు. అయితే సెలబ్రిటీలు ఇలాంటి బ్యాచ్‌ను పెద్దగా పట్టించుకోరు, కానీ కొన్నిసార్లు వీళ్ల తీరు తలనొప్పి తెప్పిస్తే మాత్రం కౌంటరివ్వకుండా ఉండలేరు. తాజాగా తన మీద కామెంట్‌ చేసిన వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేసిపారేసింది హీరోయిన్‌ తాప్సీ. 

కరోనా వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి సోషల్‌ మీడియా ద్వారా తనకు తోచినంత సాయం చేస్తోంది తాప్సీ. ఆక్సిజన్‌, రెమిడిసివిర్‌ కోసం సంప్రదించాల్సిన నంబర్లను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆమె తీరును తప్పుపట్టాడు. 'ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు నీ కారు ఇవ్వొచ్చు కదా, దానితో వాళ్లు పని చేసుకుంటారు' అని కామెంట్‌ చేశాడు. ఇది చూసి చిర్రెత్తిపోయిన తాప్సీ నోరు మూసుకో.. అంటూ మండిపడింది. కరోనాతో ఆగమవుతున్న ఈ దేశం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు నోరు విప్పవద్దని హెచ్చరించింది. తన విలువైన సమయాన్ని ఇలాంటి చెత్త మెసేజ్‌లతో వృధా చేయొద్దని కోరింది. తానేం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయనివ్వండని కోరింది.

చదవండి: అతడి చెంప పగలగొడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్‌

తేజ సినిమా: కాజల్‌ పోయి.. తాప్సీ వచ్చే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement