షబానా మామూలు అమ్మాయి కాదు! | I have never passed an audition: Tapsee Pannu | Sakshi
Sakshi News home page

షబానా మామూలు అమ్మాయి కాదు!

Published Thu, Oct 6 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

షబానా మామూలు అమ్మాయి కాదు!

షబానా మామూలు అమ్మాయి కాదు!

 ‘‘షబానా చాలా ధైర్యవంతురాలు. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసుకోగల నేర్పు ఉన్న అమ్మాయి. శత్రువులకు ఆ అమ్మాయి అంటే దడ. మొత్తానికి షబానా మామూలు అమ్మాయి కాదు’’ అని తాప్సీ అంటున్నారు. తాప్సీ ఈ రేంజ్‌లో పొగుడుతున్నారంటే షబానా ఆమెకు కావాల్సిన అమ్మాయి అనుకుంటున్నారా? అదేం కాదు. షబానా అంటే ఎవరో కాదు.. తాప్సీయే. ప్రస్తుతం ఆమె కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘నామ్ షబానా’. అంటే పేరు.. షబానా అని అర్థం. ఇందులో టైటిల్ రోల్‌ను తాప్సీ చేస్తున్నారు.
 
  ఈ ఢిల్లీ బ్యూటీకి హిందీలో బాగా పేరు తెచ్చిన ‘బేబీ’కి సీక్వెల్ ఇది. ‘బేబీ’లో తాప్సీ నటన బాగా నచ్చి, సీక్వెల్‌కి కూడా ఆమెనే తీసుకున్నారు చిత్రదర్శకుడు నీరజ్ పాండే. ‘బేబీ’లో తాప్సీ చిన్నపాటి ఫైట్స్ చేశారు. కానీ, సీక్వెల్‌లో రిస్కీ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తారు. ఆరేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ తాప్సీ టైటిల్ రోల్ చేయలేదు. ‘‘మొదటిసారి ఈ అవకాశం దక్కింది.
 
  నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరింత మంచి అవకాశం ఈ సినిమా’’ అని తాప్సీ అన్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం కోసం తాప్సీ ‘మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్’, జపనీస్ మార్షల్ ఆర్ట్ అయిన ‘ఐకిడో’, ఆత్మ రక్షణ కళ ‘క్రావ్ మగా’ నేర్చుకున్నారు. ‘‘ఈ మూడు కళలు ఎందుకు నేర్చుకున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. రోజుకి రెండు గంటలు ఇవి నేర్చుకోవడం.. 12 గంటలు షూటింగ్ చేయడం.. ఫుల్ బిజీ’’ అని తాప్సీ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement