Shabana
-
ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్ బాబు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆ బాబు జన్మ నిజంగా ఆ కుటుంబానికి అద్భుతమే. జీవితాలపై ఆశలు వదిలేసుకున్న క్షణాల నుంచి, పొత్తిళ్లలో పసిగుడ్డును ప్రాణాలతో చూసుకునే క్షణం వరకు.. ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపింది. షబానా పర్వీన్ నిండు గర్భిణి. సోమవారం రాత్రి ఆమె తన భర్త, అత్త, ఇద్దరు పిల్లలతో ఈశాన్య ఢిల్లీలో ఉన్న కరవాల్‌నగర్‌లోని తమ ఇంట్లో నిద్రపోతోంది. హఠాత్తుగా ఒక గుంపు ఆ ఇంట్లోకి చొరబడింది. బూతులు తిడుతూ ఆ కుటుంబంపై దాడికి దిగింది. పర్వీన్ భర్తను విచక్షణారహితంగా కొట్టింది. పర్వీన్ పైనా దాడి చేసింది. ఆమె పొత్తికడుపుపైనా కొట్టారు. ఇంటికి నిప్పంటించారు. ప్రాణాలు దక్కవనే ఆ కుటుంబం భావించింది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ కుటుంబం దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు అల్ హింద్ ఆసుపత్రికి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లారు. అక్కడ పర్వీన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. (ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) ఈ సందర్భంగా పర్వీన్ అత్త నసీమా మాట్లాడుతూ.. గుంపుగా వచ్చిన కొందరు మమ్మల్ని దూషించారు. నా కొడుకును కొట్టారు. వారిలో కొందరు గర్భిణి అయిన నా కోడలును పొత్తి కడుపులో తన్నారు. వారి బారి నుంచి ఆమెను రక్షించడానికి వెళితే నాపై కూడా దాడి చేశారు. మాకు ఆ రాత్రి కాళరాత్రే అవుతుందని అనుకున్నాం. దేవుడి దయతో మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఈ దాడిలో మేం సర్వం కోల్పోయినా ... బిడ్డ పుట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితి. మాకు ఏమీ మిగల్లేదు. మా స్వస్థలానికి వెళ్లి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే’ అని వాపోయింది. కాగా ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. ఉన్మాద ముకలు ఇళ్ళు, షాపులపై దాడి చేసి, వాహనాలకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. (అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు) -
గర్భవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు
మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఇన్స్పెక్టర్ మన్మోహన్ వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి అలియాస్ షబానా(26)కు ఆరేళ్ల క్రితం హన్మకొండకు చెందిన రఫిక్‌తో పరిచయం ఏర్పడింది. ఇరువురు ప్రేమించుకున్నారు. మతం మారితేనే తమ కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని రఫిక్ చెప్పడంతో కృష్ణవేణి మతం మార్చుకుంది. 2013 ఆగస్టులో వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణవేణి అలియాస్ షబానాకు ఐదు సార్లు అబార్షన్ కావడంతో వేధింపులు ప్రారంభమయ్యాయి. రఫిక్‌తో పాటు అతని తల్లితండ్రులు, కుటుంబసభ్యులు తరచూ వేధిస్తుండడంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె తల్లితో కలిసి మల్లికార్జుననగర్‌లో ఉంటోంది. ప్రస్తుతం గర్భిణి అయిన షబానాను రఫిక్ పట్టించుకోకపోవడమేగాక అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడు. దీంతో గత జులైలో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వేధింపులు మానుకోకపోవడంతో బాధితురాలు మంగళవారం రఫిక్ అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలితో తన్నాడు:కృష్ణవేణి అలియాస్ షబానా ప్రేమించిన వ్యక్తి కోసం మతాన్ని మార్చుకున్నాను. వేధింపులు తీవ్రం కావడంతో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గర్బవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు. తనకు పరిచయమున్న పోలీస్ అధికారితో బెదిరిస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు సైతం వేరే పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. -
వైట్నర్ మత్తులో మహిళల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ఇన్నాళ్లూ యువకులు మాత్రమే వైట్నర్కు బానిసై జీవితాలు నాశనం చేసుకోగా.. ప్రస్తుతం ఈ వ్యసనం మహిళలకు కూడా పాకింది. వైట్నర్ తాగిన మత్తులో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ వద్ద శనివారం రాత్రి నలుగురు మహిళలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడికి యత్నించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన షబానా, పర్వీనా, జబానా, అయేషాలు వైట్నర్ సేవనానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరు మదీనా కాలనీ, ఫలక్‌నుమా జైతున్ హోటల్, ఇంజన్‌బౌలి ప్రాంతాలలో రోడ్లపై ట్రాఫిక్‌ను అడ్డగించడం.. చెప్పులు విసరడం.. బూతులు తిట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై రెండు మూడు రోజులుగా 100 డయల్‌కు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఎస్సైలు రమేష్ నాయక్, గొకారీ నేతృత్వంలో వైట్నర్లపై శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఫాతిమా నగర్‌కు చెందిన గోరీ బీ అనే మహిళ శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన 12 ఏళ్ల చిన్న కూతురు సభా బేగాన్ని వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఇంట్లోనీ వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ‘నీ పెద్ద కుమార్తె ముంతాజ్ బేగం తన భర్త హాజీతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. నీ పెద్ద కుమార్తె వస్తేనే చిన్న కుమార్తె సభా బేగాన్ని విడిచి పెడతామంటూ పర్వీనా అనే మహిళ బెదిరించి మిగిలిన ముగ్గురితో కలిసి తీసుకెళ్లిందని’ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు మహిళలు నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లి బాలికను వారి చెర నుంచి విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే సమయంలో నలుగురు మహిళలు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసిన గోరీ బీని పోలీసుల సమక్షంలోనే కొట్టడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి స్థితిని గమనించి పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వంపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళలు పోలీసులను దుర్భాషలాడుతూ.. చెప్పులు విసరసాగారు. అంతటితో ఆగకుండా ప్రధాన రహదారిపైకి వచ్చి వాహనదారులకు ఆటంకం కల్పించారు. మహిళా పోలీసులు వారిని పట్టుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కిడ్నాప్, న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
జలీల్ ఖాన్ కుమార్తె షబానాకు చుక్కెదురు!
సాక్షి, విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కు రాజకీయ ఆరంభంలోనే చుక్కెదురవుతోంది. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అడ్డగోలుగా పార్టీని ఫిరాయించి పచ్చ కండువా కప్పుకున్న జలీల్‌ఖాన్‌కు టీడీపీలో అనేక మంది వ్యతిరేకులు ఉన్నారు. ఖాతూన్‌ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఖాతూన్‌కు వ్యతిరేకంగా ఫత్వా... మాజీ మేయర్ మల్లికాబేగం 2009లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. అయితే బుర్కా ధరించకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదంటూ ముస్లిం మతపెద్దలపై ఒత్తిడి తెచ్చి జలీల్‌ఖాన్ ఫత్వా జారీ చేయించారు. ఈ ఫత్వా జారీ చేయడం వల్లనే తాను ఓడిపోయానని మల్లికా బేగం నమ్ముతున్నారు. ఇప్పుడు షబానా ఖాతూన్ ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తారంటూ.. ఫత్వా జారీ చేయాలంటూ మతపెద్దలపై ఒత్తిడి పెంచి విజయం సాధించారు. గతంలో అమలు చేసిన పత్వా ఇప్పుడు వర్తిస్తుందని మత గురువు మౌలానా ఖదీర్ రిజ్వీ స్పష్టం చేశారు. అయితే దీన్ని జలీల్‌ఖాన్, ఆయన కుమార్తె ఖాతూన్‌లు లెక్క చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఫత్వా గురించి మాట్లాడిన జలీల్‌ఖాన్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారని, దానికి మత పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటారని పలువురు ముస్లిం సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫత్వా జారీ చేసే సమయంలో జుమ్మా మసీదు వక్ఫ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనూ వ్యతిరేకత... షబానా ఖాతూన్‌కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా బలమైన నాయకుడు. ఖాతూన్‌కు సీటు ఇస్తున్నట్లు ప్రచారాన్ని తప్పుపడుతున్నారు. పార్టీకి పనిచేసిన తనను పక్కన పెట్టడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీని ప్రభావం ఖాతూన్ ఎంపికపై పడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తండ్రి అవినీతే తనకు శాపమా? ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అవినీతి ఖాతూన్‌కు శాపంగా మారుతుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ ఎదురుగా జమ్మా మసీదు వక్ఫ్ ఆస్తిని తన అనుచరులకు అప్పచెప్పందుకు ప్రయత్నించడం దాన్ని ప్రతిపక్షాలన్నీ అడ్డుకున్న విషయాన్ని ముస్లింలే గుర్తు చేస్తున్నారు. దీని ప్రభావం ఖాతూన్ ఎంపికపై పడుతుందని చెబుతున్నారు. రాజకీయాల కోసం ఫత్వా జారీ సరికాదు చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): రాజకీయాల కోసం ఫత్వాలను వాడుకోవడం ఇస్లాంకు విరుద్ధ్దమని ఆవాజ్ ముస్లిం ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మీరా హుస్సేన్ అన్నారు. పశ్చిమ నిÄæూజకవర్గంలో టీడీపీ తరçఫున పోటీ చేసే అంశంలో ఫత్వాలను జారీ చేసే అంశం తెరపైకి రావడంతో పలువురు ముస్లిం మత పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం చిట్టినగర్ మోతీ మసీదు వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2009 ఎన్నికలలో మాజీ మేయర్ మల్లికాబేగం పోటీచేసే అంశంపై ఫత్వా జారీ చేయడం. ఇప్పుడు జలీల్‌ఖాన్ కుమార్తెకు ఫత్వా జారీ చేయడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం ఫత్వాలను జారీ చేయడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇస్లాం మతాన్ని వాడుకోవడం ఇస్లాం విధానాలకు విరుద్ధమన్నారు. నిరసన కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు బేగ్, జవహార్, బాషా, సుభానీ, ఖాజ, సలీం, ఇమాం సాహెబ్ కరిముల్లా పాల్గొన్నారు. -
జలీల్ ఖాన్ కుమార్తెపై ఫత్వా
-
జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను గతం వెంటాడుతుంది. 2009 ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ అనుసరించిన వైఖరి.. ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌పై ఫత్వా జారీకి కారణమయింది. వివరాల్లోకి వెళితే.. అప్పటి ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ఆ స్థానంలో మాజీ మేయర్ మల్లికా బేగంను బరిలోకి దించింది. దీంతో జలీల్ ఖాన్ ఆమెపై ఫత్వా జారీ చేసేలా మతపెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే కారణంతో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారు. తనకు జరిగిన అన్యాయంపై మల్లికా బేగం తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫత్వా జారీ చేయడం వల్లే తాను అప్పటి ఎన్నికల్లో ఓడిపోయానని ఆరోపించారు. తనకులాగే షబానాపై కూడా ఫత్వా ఎందుకు జారీ చేయలేదని ముస్లిం మత పెద్దలను నిలదీశారు. ముస్లిం మహిళనని కూడా చూడకుండా జలీల్ ఖాన్ తనపై విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ముస్లిం ఓట్లు తనకు పడకుండా జలీల్ ఖాన్ మతంను అడ్డుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫత్వా జారీ చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించిన జలీల్ ఖాన్.. తన కుమార్తెను ఎలా రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మత పెద్దలు షబానాపై పత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన జలీల్ ఖాన్.. తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. -
భయపెట్టడానికే పారిపోయా..
చిత్తూరు, మదనపల్లె క్రైం : ‘భర్తను భయపెట్టడానికే ఇంటి నుంచి పారిపోయాను. ఇప్పటికైనా మారి అనుమానించకపోతే కాపురం చేస్తా. లేదంటే అమ్మగారి ఇంటికి వెళ్లిపోతాను’ అని షబానా తెలిపింది. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీలో ఉంటున్న ముస్తఫా భార్య షబానా ఆదివారం భర్త వేధింపులు తాళలేక బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాట్సాప్‌లో మదనపల్లె మోతీనగర్‌లో ఉంటున్న తల్లి దిల్షాద్కు మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో మదనపల్లె రూరల్ పోలీసులు తల్లీబిడ్డల అదశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో షబానా సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అదృశ్యం కావడానికి గల కారణాలను రూరల్ సీఐ రమేష్‌కు వివరించింది. తన భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. అనుమానంతో తనను వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఈ బాధలు భరించలేక భర్తను భయపెట్టేందుకు బిడ్డలను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లినట్టు తెలిపింది. పత్రికల్లో కథనాలు రావడంతో పోలీసు స్టేషన్‌కు వచ్చినట్టు వివరించింది. అదృశ్యమైన మహిళ, ఆమె పిల్లలు రూరల్ పోలీసు స్టేషన్‌కు రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
షబానా మామూలు అమ్మాయి కాదు!
‘‘షబానా చాలా ధైర్యవంతురాలు. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసుకోగల నేర్పు ఉన్న అమ్మాయి. శత్రువులకు ఆ అమ్మాయి అంటే దడ. మొత్తానికి షబానా మామూలు అమ్మాయి కాదు’’ అని తాప్సీ అంటున్నారు. తాప్సీ ఈ రేంజ్లో పొగుడుతున్నారంటే షబానా ఆమెకు కావాల్సిన అమ్మాయి అనుకుంటున్నారా? అదేం కాదు. షబానా అంటే ఎవరో కాదు.. తాప్సీయే. ప్రస్తుతం ఆమె కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘నామ్ షబానా’. అంటే పేరు.. షబానా అని అర్థం. ఇందులో టైటిల్ రోల్‌ను తాప్సీ చేస్తున్నారు. ఈ ఢిల్లీ బ్యూటీకి హిందీలో బాగా పేరు తెచ్చిన ‘బేబీ’కి సీక్వెల్ ఇది. ‘బేబీ’లో తాప్సీ నటన బాగా నచ్చి, సీక్వెల్‌కి కూడా ఆమెనే తీసుకున్నారు చిత్రదర్శకుడు నీరజ్ పాండే. ‘బేబీ’లో తాప్సీ చిన్నపాటి ఫైట్స్ చేశారు. కానీ, సీక్వెల్లో రిస్కీ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తారు. ఆరేళ్ల కెరీర్లో ఇప్పటివరకూ తాప్సీ టైటిల్ రోల్ చేయలేదు. ‘‘మొదటిసారి ఈ అవకాశం దక్కింది. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరింత మంచి అవకాశం ఈ సినిమా’’ అని తాప్సీ అన్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం కోసం తాప్సీ ‘మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్’, జపనీస్ మార్షల్ ఆర్ట్ అయిన ‘ఐకిడో’, ఆత్మ రక్షణ కళ ‘క్రావ్ మగా’ నేర్చుకున్నారు. ‘‘ఈ మూడు కళలు ఎందుకు నేర్చుకున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. రోజుకి రెండు గంటలు ఇవి నేర్చుకోవడం.. 12 గంటలు షూటింగ్ చేయడం.. ఫుల్ బిజీ’’ అని తాప్సీ పేర్కొన్నారు. -
వరకట్న దాహానికి అబల బలి
= హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం = తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో నేరం అంగీకారం = భర్త, అత్తపై కేసు నమోదు పులివెందుల(వైఎస్సార్ జిల్లా): అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్ కథనం ప్రకారం... వైఎస్సార్ జిల్లా ఇస్లాంపురానికి చెందిన ఆరిఫుల్లా బాషా, రమీజ దంపతుల మొదటి కుమారుడు షఫీ వివాహం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలాపురానికి చెందిన మహబూబ్ బాషా, షబీమున్నీసా దంపతుల కుమార్తె షబానా(25)తో ఆరేళ్ల కిందట అయింది. పెళ్లి సమయంలో ఆరు తులాల బంగారం, రూ.50 వేల నగదు కట్నంగా ఇచ్చారు. షఫీ, షబానా దంపతులకు ఆదిల్(5), అఫ్జల్(5) సహా అనిష్, అఫ్రానా అనే కవల పిల్లలు ఉన్నారు. షఫీ బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల నుంచి షబానాను షఫీ సహా అత్త రమీజా అదనపు కట్నం కోసం వేధించేవారు. వారి వేధింపులు తాళలేక గతంలో ఒకసారి షబాన పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు సర్దిచెప్పి మళ్లీ అత్తగారింటికి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మళ్లీ భర్త, అత్త కలసి షబానాను అదనపు కట్నం ఎందుకు తీసుకురాలేదంటూ వేధించారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వారి వేధింపులు తాళలేక రమీజా ఫోన్లో బంధువులకు విషయం తెలిపింది. వారొచ్చి మాట్లాడతామని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, అత్త కలసి షబానాను తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. షబానా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు షఫీ ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు షబాన బంధువులకు ఫోన్‌చేసి ‘మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని’ తెలిపాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి షబానా మృతదేహాన్ని తీసుకెళ్లి ఉరేసుకుని వైద్యులకు చెప్పగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఆదివారం ఉదయమే పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లొచ్చారు. ఆ తరువాత ఆస్పత్రిలోని షబానా మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించాడు. -
పోనీ భారత్ అమ్మీ అంటారా?
న్యూ ఢిల్లీః భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని నిరాకరిస్తున్న మజ్లిస్-ఇ-ఇతెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీపై ప్రముఖ నటి షబానా అజ్మి సూటి ప్రశ్నలు సంధించారు. భారత్ మాతా కీ జై అన్న నినాదాన్ని పలకడంలో అభ్యంతరం ఉంటే.... పోనీ భారత్ అమ్మీ అంటారా అంటూ ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. భర్త జావెద్ అఖ్తర్ అడుగుజాడల్లో నడిచే షబానా.. దేశ రాజధానిలో జరిగిన ఓ సమావేశం సందర్భంలో భారత్ మాతాజీ జై అన్న నినాదాన్ని నిరాకరిస్తున్న ఒవైసీని గురించి ప్రస్తావించారు. ఒవైసీ సాహెబ్ ను నేను ఒక్కటే అడగదల్చుకున్నానని, ఒకవేళ ఆయనకు 'మాతా' అని పలకడంలో అభ్యంతరం ఉంటే 'భారత్ మాతాకీ జై' బదులుగా 'భారత్ అమ్మీకి జై' అంటారా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఓ సందర్భంలో రచయిత, షబానా అజ్మీ భర్త జావేద్ అఖ్తర్... ఒవైసీ నామాన్ని ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టారు. హైదరాబాద్ ఎంపీ అని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ ఎంపీ భారత్ మాతాకీ జై అని పలకనంటున్నాడని, పైగా రాజ్యాంగంలో లేదంటున్నాడని... అయితే రాజ్యాంగంలో ఆయన్ను టోపీ, షార్వానీ ధరించమని కూడ లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనడం మన విధా, కాదా అన్నది ముఖ్యం కాదని అది మన హక్కు అని మరచిపోకూడదని ఆయన సూచించారు.