జలీల్‌ఖాన్‌తో కుమార్తె షబానా ఖాతూన్
సాక్షి, విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కు రాజకీయ ఆరంభంలోనే చుక్కెదురవుతోంది. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అడ్డగోలుగా పార్టీని ఫిరాయించి పచ్చ కండువా కప్పుకున్న జలీల్‌ఖాన్‌కు టీడీపీలో అనేక మంది వ్యతిరేకులు ఉన్నారు. ఖాతూన్‌ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు.
ఖాతూన్‌కు వ్యతిరేకంగా ఫత్వా...
మాజీ మేయర్ మల్లికాబేగం 2009లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. అయితే బుర్కా ధరించకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదంటూ ముస్లిం మతపెద్దలపై ఒత్తిడి తెచ్చి జలీల్‌ఖాన్ ఫత్వా జారీ చేయించారు. ఈ ఫత్వా జారీ చేయడం వల్లనే తాను ఓడిపోయానని మల్లికా బేగం నమ్ముతున్నారు. ఇప్పుడు షబానా ఖాతూన్ ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తారంటూ.. ఫత్వా జారీ చేయాలంటూ మతపెద్దలపై ఒత్తిడి పెంచి విజయం సాధించారు. గతంలో అమలు చేసిన పత్వా ఇప్పుడు వర్తిస్తుందని మత గురువు మౌలానా ఖదీర్ రిజ్వీ స్పష్టం చేశారు. అయితే దీన్ని జలీల్‌ఖాన్, ఆయన కుమార్తె ఖాతూన్‌లు లెక్క చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఫత్వా గురించి మాట్లాడిన జలీల్‌ఖాన్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారని, దానికి మత పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటారని పలువురు ముస్లిం సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫత్వా జారీ చేసే సమయంలో జుమ్మా మసీదు వక్ఫ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
సొంత పార్టీలోనూ వ్యతిరేకత...
షబానా ఖాతూన్‌కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా బలమైన నాయకుడు. ఖాతూన్‌కు సీటు ఇస్తున్నట్లు ప్రచారాన్ని తప్పుపడుతున్నారు. పార్టీకి పనిచేసిన తనను పక్కన పెట్టడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీని ప్రభావం ఖాతూన్ ఎంపికపై పడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
తండ్రి అవినీతే తనకు శాపమా?
ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అవినీతి ఖాతూన్‌కు శాపంగా మారుతుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ ఎదురుగా జమ్మా మసీదు వక్ఫ్ ఆస్తిని తన అనుచరులకు అప్పచెప్పందుకు ప్రయత్నించడం దాన్ని ప్రతిపక్షాలన్నీ అడ్డుకున్న విషయాన్ని ముస్లింలే గుర్తు చేస్తున్నారు. దీని ప్రభావం ఖాతూన్ ఎంపికపై పడుతుందని చెబుతున్నారు.
రాజకీయాల కోసం ఫత్వా జారీ సరికాదు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): రాజకీయాల కోసం ఫత్వాలను వాడుకోవడం ఇస్లాంకు విరుద్ధ్దమని ఆవాజ్ ముస్లిం ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మీరా హుస్సేన్ అన్నారు. పశ్చిమ నిÄæూజకవర్గంలో టీడీపీ తరçఫున పోటీ చేసే అంశంలో ఫత్వాలను జారీ చేసే అంశం తెరపైకి రావడంతో పలువురు ముస్లిం మత పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం చిట్టినగర్ మోతీ మసీదు వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2009 ఎన్నికలలో మాజీ మేయర్ మల్లికాబేగం పోటీచేసే అంశంపై ఫత్వా జారీ చేయడం. ఇప్పుడు జలీల్‌ఖాన్ కుమార్తెకు ఫత్వా జారీ చేయడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం ఫత్వాలను జారీ చేయడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇస్లాం మతాన్ని వాడుకోవడం ఇస్లాం విధానాలకు విరుద్ధమన్నారు. నిరసన కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు బేగ్, జవహార్, బాషా, సుభానీ, ఖాజ, సలీం, ఇమాం సాహెబ్ కరిముల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment