jaleel khan
-
కాన్వాయ్ అడ్డగింత.. కంగుతిన్న చంద్రబాబు
సాక్షి, విజయవాడ: విజయవాడలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెస్ట్ టికెట్ జలీల్‌ఖాన్‌కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్‌ను జలీల్‌ఖాన్ వర్గం అడ్డుకుంది. పొత్తులో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జలీల్‌ఖాన్ మద్దతుదారుల నిరసనతో చంద్రబాబు కంగుతిన్నారు. కాగా, తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ జలీల్ ఖాన్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ టికెట్ల చిచ్చు రగులుతూనే ఉంది. టీడీపీ శుక్రవారం.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకు షాక్ తగిలింది. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని)ని ప్రకటించడంతో పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా డబ్బు సంచులతో వచ్చిన వారికే టికెట్లు ఖరారు చేశారని అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దేవినేని ఉమాకు షాక్.. టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని మైలవరం, పెనమలూరు టికెట్లపై సందిగ్ధత తొలగింది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంతకృష్ణ ప్రసాద్, పెనమలూరు అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ను ఖరారు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 12 నియోజక వర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో దేవినేని ఉమా ఆశలు ఆవిరయ్యాయి. మైలవరం నియోజక టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఆయన్ను కాదని, ఇటీవల పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్ కేటాయించడంతో దేవినేని ఉమా వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. కృష్ణప్రసాద్, దేవినేని ఉమా మధ్య దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు చంద్రబాబు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసి పని చేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. మైలవరంలో టికెట్ ఇవ్వలేక పోతున్నాం.. పెనమలూరు టికెట్ ఇస్తామని దేవినేని ఉమాను మభ్యపెట్టారు. సర్వేల సాకు చూపి చివరకు అక్కడ మొండి చేయి చూపారు. దీంతో ఆయన రగిలిపోతున్నారు. తనకు జరిగిన అవమానం బయటికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీలో సీనియర్ల అడ్డు తొలగించుకోవటం, లోకేష్ నాయకత్వానికి ఇబ్బంది లేకుండా చేయడంలో భాగంగానే ఉమాకు చెక్ పెట్టినట్లు చర్చ సాగుతోంది. ఆయనకు కనీసం ఎమ్మెల్సీ హామీ కూడా ఇవ్వకపోడంతో, ఆయన రాజకీయ శకం ముగిసిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వసంతకు గట్టి బుద్ధి చెబుతామని దేవినేని వర్గీయులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఉమా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పెనమలూరులో అసంతృప్తి.. పెనమలూరు టికెట్‌పై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. సర్వేల పేరుతో పలుపేర్లు తెరపైకి వచ్చాయి. పెనమలూరు టికెట్ లేదని బోడె ప్రసాద్‌కు తొలుత చంద్రబాబు చెప్పారు. అయితే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బాబును బోడె బ్లాక్ మెయిల్ చేశారని తెలుస్తోంది. బోడె కొంతమంది ఎన్ఆర్ఐల ద్వారా కథ నడిపారు. చినబాబుకు ముడుపులు ముట్టడంతోపాటు, నియోజకవర్గంలో అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పడంతో చివరకు ఆయనకే టికెట్ కేటాయించారనే చర్చ సాగుతోంది. చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత గ్రామాల్లో బోడెకు పోటాపోటీగా ఇప్పటి వరకు ప్రచారం చేశారు. ఆ వర్గం బోడెకు సహకరించే అవకాశం లేదు. ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వర్గం కలిసి పని చేసే పరిస్థితి లేదు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వర్గం నుంచి బోడె ప్రసాద్ ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రూపుల గోల బోడెను పుట్టి ముంచుతుందని పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా మహేష్! పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ జనసేన నియోజక వర్గ ఇన్చార్జి టికెట్ తనకే ఖరారైందని పోతిన మహేష్ ఇంటింటికీ ప్రచారం చేశారు. అయితే పొత్తులో భాగంగా వెస్ట్ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. పవన్ తీరుపై పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. విజయవాడ పశి్చమంలో బీజేపీకి సంబంధించి రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించినా.. అక్కడ పార్టీ కోసం కష్ట పడిన నేతలను కాదని ఎన్ఆర్ఐల వైపు చూడటాన్ని జనసేన కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. -
టీడీపీలో వెస్ట్ ఫైట్: నోరు జారిన జలీల్ ఖాన్!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ వార్ ముదురుతోంది. టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో నోరు జారారాయన. విజయవాడ వెస్ట్‌లో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వార్ ముదురుతోంది. మైనారిటీలకు టికెట్‌ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అన్నారు. ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ఆపై ఓ అడుగు ముందుకేసి వెస్ట్ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు. ఇక.. చంద్రబాబుకు దరఖాస్తు సమర్పిస్తానంటూ గురువారం బుద్దా వెంకన్న విజయవాడలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ గనుక ఇవ్వడం కుదరకుంటే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో బుద్దా వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కోరేందుకు జనసేన సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుద్దా వెంకన్న ర్యాలీ పరిణామాలను ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏకపక్షంగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందో అనే ఆందోళనతో పవన కల్యాణ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. -
ఉంటది..ఉంటది..జలీల్ బాబు బైపీసీ ఇంజనీరింగ్
-
నాడు శిష్యుడు - నేడు గురువు
-
Chandrababu : జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్‌ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్‌తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్‌తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్‌ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్‌ఖాన్‌కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్‌ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..
సాక్షి, విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో పార్టీ ఫిరాయించిన వారిని, వారి వారసులను కూడా ప్రజలు తిరస్కరించారు. ఐదేళ్లు వైఎస్సార్ సీపీలోనే ఉండి, తరువాత ఎన్నికల బరిలోకి దిగిన వారికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అచ్చిరాని టీడీపీ ఉప్పులేటి కల్పన 2009లో పామర్రు నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే రెండేళ్లు గడిచిన తరువాత టీడీపీలోకి వెళ్లిపోయారు. తిరిగి 2019లో టీడీపీ తరఫున తిరిగి పామర్రు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాగా రాజకీయాల్లోకి నూతనంగా అడుగుపెట్టిన కైలే అనిల్ కుమార్ చేతిలో 30,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ కల్పనకు అచ్చిరాలేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయ పడుతున్నాయి. ఖాతూన్‌కు తప్పని ఓటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాజకీయ జీవితం ముగిసిపోతున్న దశలో 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అయితే ఏడాది దాటిన తరువాత ఆయన టీడీపీలోకి చేరారు. ఎన్నికల్లో ఆయనకు బదులుగా ఆయన కుమార్తె ఖాతూన్‌కు చంద్రబాబు నాయుడు సీటు కేటాయించారు. నియోజకవర్గ ప్రజలకు ఖాతూన్ కంటే జలీల్ఖాన్ను చూసి ఓటేయాలని కోరారు. అయితే ఖాతూన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో 7,671 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవంగా ఖాతూన్ ఓడిపోయిందనే దాని కంటే జలీల్‌ఖానే పరాజయం చెందారని నియోజకవర్గంలోనూ, టీడీపీలోనూ వినిపిస్తోంది. జనసేనలోకి వెళ్లి దెబ్బతిన్నారు... వైఎస్సార్ సీపీ నాయకుడు భాస్కరరావు భార్య రేవతి నూజివీడు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మేకా ప్రతాప్ అప్పారావుకు కుడిభజంగా ఉండేవారు. అటువంటి భాస్కరరావు వైఎస్సార్ సీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు కేవలం 5,464 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో జనసేన తుడిచిపెట్టుకుపోయింది. భాస్కరరావు స్వయంకృతాపరాధమే ఆయన కుటుంబ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిందని నియోజకవర్గంలో వినపడుతోంది. -
జలీల్‌ఖాన్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకుడు జలీల్‌ఖాన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ సమయంలో జలీల్‌ఖాన్ ప్రజలను భయాబ్రాంతులకు గురి చేసేలా దాడి చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు ఉన్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జలీల్‌ఖాన్ ప్రజలను మభ్యపెట్టాలని చూశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌పై దాడికి పాల్పడిన జలీల్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీని కోరినట్టు తెలిపారు. దాడికి పాల్పడ్డ జలీల్ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జలీల్‌ఖాన్ ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపినట్టు వెల్లడించారు. -
ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం
సాక్షి, విజయవాడ : నేడు ఏపీలో జరిగిన పోలింగ్‌లో కొన్నిచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడి పలుచోట్ల దాడులకు దిగింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ హల్చల్ చేశారు. వన్ టౌన్ పరిధిలో తన అనుచరులతో కలిసి జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ డివిజన్ అధ్యక్షుడు వాహబ్ కార్యాలయంపై ఆయన తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాహబ్కు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయంలోని ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేస్తావా అంటూ పంజా సెంటర్లో రెచ్చిపోయారు. ఈ దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం జలీల్ ఖాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను కేశినేని నాని పరామర్శించారు. -
జలీల్‌ఖాన్ కూతురి నామినేషన్ ఆమోదం..!
సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి నామపత్రాలు చూసి ఖరారు చేశారు. అమెరికా పౌరసత్వం ఉండడంతో తన నామినేషన్ రద్దు చేస్తారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు షబానా. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ కారణంగానే షబానాను చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిపారు. -
జలీల్‌ఖాన్ కుమార్తె నామినేషన్‌పై గందరగోళం
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ నామినేషన్‌పై గందరగోళం నెలకొంది. అమెరికా గ్రీన్ కార్డ్ రద్దు కాకపోవడంతో షబానా నామినేషన్‌పై టీడీపీ నేతలు డైలమాలో ఉన్నారు. గ్రీన్ కార్డు రద్దు కోసం టీడీపీ అభ్యర్థి షబానా ఇన్ని రోజులు నామినేషన్ వేయకుండా ఉన్నారు. షబానా నామినేషన్ చెల్లకపోతే ఎవరికి సీటివ్వాలన్న ఆలోచనలో టీడీపీ పడింది. జలీల్ ఖాన్, నాగూల్ మీరాల పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. నామినేషన్లకు కేవలం 2 గంటలే సమయం ఉండటంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. జలీల్‌ఖాన్ అమెరికాలో ఉన్న కుమార్తెను ఇటీవలే ఇండియాకు రప్పించారు. అయితే అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన కాలం పాటు అక్కడ ఉన్న వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తుంది. ఈ కార్డు పొందినవారు ఒక రకంగా అమెరికా పౌరులుగానే పరిగణింపబడతారు. ప్రస్తుతం షబానా సైతం గ్రీన్ కార్డు పొంది ఉన్నారు. దీంతో నామినేషన్ విషయంలో చిక్కులు ఎదురయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షబానా సీటు దక్కించుకున్న విషయం తెలిసిందే. -
జలీల్‌ఖాన్ కుమార్తె పోటీ నుంచి విరమించుకోవాలి
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని మాజీ మేయర్ మల్లికాబేగం డిమాండ్ చేశారు. పంజా సెంటర్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2009లో ముస్లిం మహిళలు రాజకీయాలలోకి రాకూడదని జలీల్‌ఖాన్ కొంతమంది మతపెద్దలను ప్రోత్సహించి తనపై ఫత్వా జారీ చేయించారన్నారు. దాని వల్ల తాను ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. జలీల్‌ఖాన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2009లో మల్లికాబేగం ఆ ఫత్వాను గౌరవించలేదని వ్యాఖ్యానించారని, అందువలన తన కుమార్తె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారని గుర్తు చేశారు. 2009లో తాను నామినేషన్ వేసిన తరువాత ఫత్వా జారీ చేశారన్నారు. అందువలన తాను ఎన్నికల్లో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. కనుక ఇప్పటివరకూ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు కనుక జలీల్‌ఖాన్ మత పెద్దల ఫత్వాను గౌరవించి తన కుమార్తెను రాజకీయాల నుంచి పశ్చిమ నియోజకవర్గం పోటీ నుంచి తప్పించాలని కోరారు. ఆనాడు ఫత్వా జారీ చేసిన మత పెద్దలు మహిళలందరికీ ఒకే విధమైన న్యాయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2009లో ఒక విధంగా 2019లో మరో విధంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులను కలిస్తానని, ముస్లిం పర్సనల్ లా బోర్డును, ఇతర సంఘాలను కలిస ఫత్వా గురించి వివరించి అమలు చేయాలని కోరుతానని వివరించారు. -
జలీల్ ఖాన్ కుమార్తె షబానాకు చుక్కెదురు!
సాక్షి, విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కు రాజకీయ ఆరంభంలోనే చుక్కెదురవుతోంది. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అడ్డగోలుగా పార్టీని ఫిరాయించి పచ్చ కండువా కప్పుకున్న జలీల్‌ఖాన్‌కు టీడీపీలో అనేక మంది వ్యతిరేకులు ఉన్నారు. ఖాతూన్‌ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఖాతూన్‌కు వ్యతిరేకంగా ఫత్వా... మాజీ మేయర్ మల్లికాబేగం 2009లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారు. అయితే బుర్కా ధరించకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదంటూ ముస్లిం మతపెద్దలపై ఒత్తిడి తెచ్చి జలీల్‌ఖాన్ ఫత్వా జారీ చేయించారు. ఈ ఫత్వా జారీ చేయడం వల్లనే తాను ఓడిపోయానని మల్లికా బేగం నమ్ముతున్నారు. ఇప్పుడు షబానా ఖాతూన్ ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తారంటూ.. ఫత్వా జారీ చేయాలంటూ మతపెద్దలపై ఒత్తిడి పెంచి విజయం సాధించారు. గతంలో అమలు చేసిన పత్వా ఇప్పుడు వర్తిస్తుందని మత గురువు మౌలానా ఖదీర్ రిజ్వీ స్పష్టం చేశారు. అయితే దీన్ని జలీల్‌ఖాన్, ఆయన కుమార్తె ఖాతూన్‌లు లెక్క చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఫత్వా గురించి మాట్లాడిన జలీల్‌ఖాన్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారని, దానికి మత పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటారని పలువురు ముస్లిం సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫత్వా జారీ చేసే సమయంలో జుమ్మా మసీదు వక్ఫ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనూ వ్యతిరేకత... షబానా ఖాతూన్‌కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా బలమైన నాయకుడు. ఖాతూన్‌కు సీటు ఇస్తున్నట్లు ప్రచారాన్ని తప్పుపడుతున్నారు. పార్టీకి పనిచేసిన తనను పక్కన పెట్టడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీని ప్రభావం ఖాతూన్ ఎంపికపై పడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తండ్రి అవినీతే తనకు శాపమా? ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అవినీతి ఖాతూన్‌కు శాపంగా మారుతుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ ఎదురుగా జమ్మా మసీదు వక్ఫ్ ఆస్తిని తన అనుచరులకు అప్పచెప్పందుకు ప్రయత్నించడం దాన్ని ప్రతిపక్షాలన్నీ అడ్డుకున్న విషయాన్ని ముస్లింలే గుర్తు చేస్తున్నారు. దీని ప్రభావం ఖాతూన్ ఎంపికపై పడుతుందని చెబుతున్నారు. రాజకీయాల కోసం ఫత్వా జారీ సరికాదు చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): రాజకీయాల కోసం ఫత్వాలను వాడుకోవడం ఇస్లాంకు విరుద్ధ్దమని ఆవాజ్ ముస్లిం ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మీరా హుస్సేన్ అన్నారు. పశ్చిమ నిÄæూజకవర్గంలో టీడీపీ తరçఫున పోటీ చేసే అంశంలో ఫత్వాలను జారీ చేసే అంశం తెరపైకి రావడంతో పలువురు ముస్లిం మత పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం చిట్టినగర్ మోతీ మసీదు వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2009 ఎన్నికలలో మాజీ మేయర్ మల్లికాబేగం పోటీచేసే అంశంపై ఫత్వా జారీ చేయడం. ఇప్పుడు జలీల్‌ఖాన్ కుమార్తెకు ఫత్వా జారీ చేయడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం ఫత్వాలను జారీ చేయడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇస్లాం మతాన్ని వాడుకోవడం ఇస్లాం విధానాలకు విరుద్ధమన్నారు. నిరసన కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు బేగ్, జవహార్, బాషా, సుభానీ, ఖాజ, సలీం, ఇమాం సాహెబ్ కరిముల్లా పాల్గొన్నారు. -
జలీల్ ఖాన్ కుమార్తెపై ఫత్వా
-
నాగూల్ మీరా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మైనార్టీ వర్గాలుగా ఉన్న నూర్ బాషా, దూదేకులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్, టీడీపీ నేత నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా నూర్ బాషాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్టీలో ముస్లింలకే అన్ని పదవులు ఇవ్వడం జరుగుతోందని విమర్శలు గుప్పించారు. ముస్లింలలో 20 లక్షల మేర నూర్ బాషాలు ఉన్నారని.. కాబట్టి తమ ప్రాధాన్యత గమనించి, వివిధ పదవుల్లో తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.(మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?) కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ టీడీపీలో టికెట్ల లొల్లి రాజుకుంటోంది. వైఎస్సార్ సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానాకు చంద్రబాబు.. విజయవాడ పశ్చిమ టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న నాగుల్ మీరా... పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇక జలీల్ ఖాన్‌తో పాటు ఆయన కూతురు షబానా కూడా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.(జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..) -
జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను గతం వెంటాడుతుంది. 2009 ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ అనుసరించిన వైఖరి.. ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌పై ఫత్వా జారీకి కారణమయింది. వివరాల్లోకి వెళితే.. అప్పటి ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ఆ స్థానంలో మాజీ మేయర్ మల్లికా బేగంను బరిలోకి దించింది. దీంతో జలీల్ ఖాన్ ఆమెపై ఫత్వా జారీ చేసేలా మతపెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే కారణంతో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారు. తనకు జరిగిన అన్యాయంపై మల్లికా బేగం తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫత్వా జారీ చేయడం వల్లే తాను అప్పటి ఎన్నికల్లో ఓడిపోయానని ఆరోపించారు. తనకులాగే షబానాపై కూడా ఫత్వా ఎందుకు జారీ చేయలేదని ముస్లిం మత పెద్దలను నిలదీశారు. ముస్లిం మహిళనని కూడా చూడకుండా జలీల్ ఖాన్ తనపై విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ముస్లిం ఓట్లు తనకు పడకుండా జలీల్ ఖాన్ మతంను అడ్డుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫత్వా జారీ చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించిన జలీల్ ఖాన్.. తన కుమార్తెను ఎలా రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మత పెద్దలు షబానాపై పత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన జలీల్ ఖాన్.. తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. -
‘జలీల్‌ఖాన్ నాపై ఫత్వా జారీ చేయించారు’
సాక్షి, విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలీల్‌ఖాన్ కుమార్తె షభానా ఖాతూన్‌ను ఖరారు చేయడంపై మాజీ మేయర్ మల్లికా బేగం అభ్యంతరం తెలిపారు. తాను 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం కాగా, తనకు ఓటేయరాదని జలీల్ ఖాన్ మతపెద్దల చేత ఫత్వా జారీ చేయించారని మల్లికాబేగం మండిపడ్డారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె వియవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతోందనీ, కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయాలని డిమాండ్ చేశారు. తనను రాజకీయాల్లో ఉండకూడదని 2009లో ఫత్వా జారీ చేసిన కుల పెద్ద మఫ్తి మౌలానా అబ్ధుల్ ఖదీర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు ఆమె ఇందాద్ ఘర్కు వెళ్లారు. మత పెద్ద అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలు రాజకీయాలలో ఉండకూడదని ఫత్వా జారీ చేసిన కుల పెద్దలు.. జలీల్‌ఖాన్ విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. -
మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?
సాక్షి, విజయవాడ: టీడీపీలో టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. ఒకరికి తెలియకుండా ఒకరు పెదబాబు చంద్రన్న, చినబాబు లోకేష్ దగ్గర టికెట్ల కోసం మంతనాలు చేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా.. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న నాగుల్ మీరా చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్‌కు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా టికెట్ ఇస్తానని హామినిచ్చి మోసం చేశారంటూ ఆయన చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. (అమరావతికి టికెట్ల వేడి!) -
సాక్షి విలేఖరిపై దౌర్జన్యం.. ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు
విజయవాడ: నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడియో జర్నలిస్ట్ బి.నానిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దాడి చేయడంపై మీడియా ప్రతినిధులు సూర్యారావుపేట పీఎస్‌లో సౌత్ ఏసీసీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. జలీల్ ఖాన్, ఏడీసీపీ నవాబ్ జాన్‌ల వ్యవహారశైలిని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ చలపతిరావు డిమాండ్ చేశారు. సాక్షి వీడియో జర్నలిస్ట్ నానిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు. ఈ దుశ్చర్యను ప్రింట్ & ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ జాప్) ఖండించింది. విజయవాడ సీపీ కార్యాలయ ప్రాంగణంలోనే ఇలాంటి సంఘటన జరగటం బాధాకరమని, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని పెన్ జాప్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
సాక్షి జర్నలిస్ట్‌పై జలీల్ ఖాన్ దౌర్జన్యం
-
సాక్షి జర్నలిస్ట్‌పై జలీల్ ఖాన్ వీరంగం
సాక్షి, విజయవాడ: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. సాక్షి వీడియో జర్నలిస్ట్ నానిపై జలీల్ ఖాన్ దౌర్జన్యం చేశారు. తన కోడలితో వివాదం జరుగుతుండటంతో జలీల్ ఖాన్ గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే తనకు న్యాయం జరపడంలేదని కోడలు మెహమూదా సీపీని ఆశ్రయించారు. దీనిపై సీపీ ఆదేశాల ప్రకారం డీసీపీ రాజకుమారి ఇరువర్గాలను పిలిపించారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయానికి వస్తుండగా జలీల్ ఖాన్‌ను సాక్షి కెమేరామెన్ నాని చిత్రీకరించారు. దీంతో జలీల్‌ఖాన్ బూతులతో దుర్బాషలాడుతూ నానిపై దౌర్జన్యానికి దిగారు. ఏడీసీపీ నవాబ్ జాన్, సీఐ ఉమా మహేశ్వరరావు సమక్షంలోనే కెమెరామెన్‌ను చేయి మెలిపెట్టి కెమెరా గుంజుకున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ఎమ్మెల్యేను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ఏడీసీపీ నవాబ్ జాన్ స్వయంగా కెమెరాలో చిత్రీకరించిన విజువల్స్‌ను డిలీట్ చేశారు. పాత్రికేయులు సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో కెమెరామెన్‌ను పోలీసులు విడిచిపెట్టారు. -
జలీల్ ఖాన్‌పై భగ్గుమంటున్న టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓవరాక్షన్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని జలీల్‌ఖాన్ ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కేటాయించినట్టు చంద్రబాబు చెప్పకుండానే జలీల్ ఖాన్ ప్రచారం చేసుకోవడం ఏమిటని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు కన్నెర్ర జేస్తున్నారు. ఈమేరకు జలీల్ ఖాన్‌పై వారు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జలీల్ ఖాన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల జలీల్‌ఖాన్ ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్‌ఖాన్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
జలీల్‌ఖాన్ కూతురికి టీడీపీ టికెట్..!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రకటించారు. జలీల్‌ఖాన్ మంగళవారం తన కుమార్తె షాబానాతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్‌ఖాన్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
ఉద్రిక్తం.. దర్గా స్వాధీన యత్నం
భవానీపురం: దర్గాను స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డు అధికారులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్న ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే భవానీపురంలో జాతీయ రహదారి పక్కనేగల హజరత్ సయ్యద్ గాలీబ్ షహీద్ వక్ఫ్‌బోర్డ్ అసిస్టెంట్ సెక్రటరీలు అబ్దుల్ ఖుద్దూస్, షంషుద్దీన్, ఆదాం షఫీ, డెప్యూటీ సెక్రటరీ షెకామత్ సాహెబ్, ఇనస్పెక్టర్లు అలీం, యుహూ అలీషాలు భవానీపురం తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. తొలుత దర్గా బయట ఉన్న దర్గా మేనేజ్మెంట్ కమిటీ ఆఫీస్‌కు తాళాలు వేసేందుకు యత్నించారు. దీంతో దర్గా ముజావర్ల కమిటీ సభ్యులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. పోలీసులు వారిని వారించినా ఆఫీస్‌కు తాళాలు వెయ్యటానికి వీల్లేదంటూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహిళలు ఆఫీస్‌కు అడ్డంగా నిలబడ్డారు. ముస్లింలందరూ గుమిగూడి ఆందోళన వ్యక్తం చేయటంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, వక్ఫ్‌బోర్డ్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో భవానీపురం సీఐ డీకేఎన్ మోహన్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు వచ్చి స్వాధీనం చేసుకుంటామంటే తాము చూస్తూ ఊరుకోమని కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. ముఖ్యంగా తాము ఆరాధించే బాబా సమాధిగల గదికి తాళాలు వేసేందుకు ప్రాణాలు పోయినా ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్పారు. సుధీర్ఘ చర్చల అనంతరం తమకు ఐదు రోజుల గడువు కావాలని కమిటీ కోరింది. దీంతో వక్ఫ్‌బోర్డ్ ఆదేశాలను అమలు చేయటమే తన డ్యూటీ అని, గడువు విషయం అధికారులు నిర్ణయించుకోవాలని తహసీల్దార్ ఇంతియాజ్ పాషా చెప్పారు. దీనిపై అధికారులు తర్జనభర్జనపడి చివరికి చేసేది లేక వెనుదిరిగారు. ఒకదశలో స్థానిక ముస్లింలు అధికారులను ఘోరావ్ చేశారు. పోలీసులు వారికి రక్షణగా నిలబడి పంపించివేశారు. జలీల్‌ఖాన్ ఆదేశాల మేరకే.. ! భవానీపురం: స్థానిక హజరత్ సయ్యద్ గాలీబ్ షహీద్ దర్గా ఆదాయంలో 30 శాతం వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ జలీల్‌ఖాన్ దర్గా ముజావర్ల కమిటీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దానికి కమిటీ సభ్యులు ఒప్పుకోనందునే శనివారం వక్ఫ్‌బోర్డు అధికారులను దర్గాపైకి పంపారని సమాచారం. వాస్తవానికి దర్గా భూములపై వచ్చే ఆదాయంలో 7 శాతం వక్ఫ్‌బోర్డ్‌కు ట్యాక్స్ కింద చెల్లించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా జలీల్‌ఖాన్ 30 శాతాన్ని డిమాండ్ చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటంటే 7 శాతాన్ని వక్ఫ్‌బోర్డుకు చెల్లించి మిగిలిన 23 శాతాన్ని తన జేబులోకి వేసుకునేందుకేనని దర్గా కమిటీ సభ్యులు కొందరు తెలిపారు. దర్గా భూములలో సోమా కంపెనీకి ఇచ్చిన లీజు కింద దాదాపు రూ.3 కోట్లు త్వరలో రానున్న నేపథ్యంలోనే 30 శాతం తమకు ఇవ్వాలని జలీల్‌ఖాన్ ఇటీవల తెరమీదకు తెచ్చినట్లు తెలిసింది. దర్గా కమిటీని దారిలోకి తెచ్చుకునేందుకే కమిటీని రద్దు చేసేశామని చెప్పటం, ఆ క్రమంలోనే శనివారం అధికారులను పంపించి హడావుడి చేశారని సమాచారం. జలీల్‌ఖాన్‌కు అక్షింతలు ! దర్గా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న తరుణంలో టీడీపీ నాయకులు ఫతావుల్లా, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ అక్కడి వచ్చి కమిటీకి మద్దతు పలికారు. దర్గా వద్ద హడావుడి తగ్గిన తరువాత కమిటీ సభ్యులు, స్థానికులు ఎంపీ కేశినేని శ్రీనివాస్ దగ్గరకు వెళ్లారు. వారితోపాటు టీడీపీ నాయకులుకూడా వెళ్లారు. సమస్య విన్న కేశినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి ముస్లిలకు వ్యతిరేకంగా ఏమీ చేయమని, ముఖ్యమంత్రి దృష్టికికూడా తీసుకువెళతానని హామీ ఇచ్చారని కమిటీ సభ్యులు చెప్పారు. కాగా కేశినేని ఈ విషయాన్ని ఎమ్మెల్సీ తొండెపు జనార్ధన్‌కు చెప్పటంతో ఆయన జలీల్‌ఖాన్‌పై సీరియసై అక్షింతలు వేసినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ పిచ్చి పనులేమిటని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. వక్ప్‌బోర్డ్ కుట్ర ఇది... వక్ప్బోర్డ్ను అడ్డంపెట్టుకుని దర్గాకు చెందిన ఆస్తులను కాజేయటానికి చైర్మన్ జలీల్‌ఖాన్, డైరెక్టర్లు కుట్ర పన్నారని దర్గా ముజావర్ల కమిటీ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ ఆరోపించారు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్దగల జుమా మసీదుకు చెందిన స్థలాన్ని ఒక వస్త్ర దుకాణ సంస్థకు అప్పగించి జలీల్‌ఖాన్, డైరెక్టర్లు లబ్ధి పొందుదామనుకున్నారని, అయితే అదికాస్తా బెడిసికొట్టేసరికి దర్గాపై కన్నేశారన్నారు. -
జలీల్ ఖాన్ మరో గ’లీజు’
-
జలీల్ ఖాన్‌కి వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన
విజయవాడ: నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులు మోహరించారు. జుమ్మామసీద్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ, ప్రజాసంఘాలు, ముస్లీం మైనారిటీలను అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థలాన్ని అక్రమంగా తక్కువ ధరకు కట్టబెట్టడం..ముస్లిం సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో జుమ్మా మసీద్ స్థలం లీజుపై వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ వెనక్కు తగ్గారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో జలీల్ ఖాన్ హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జుమ్మామసీద్ స్థలం లీజు టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
వక్ఫ్ బోర్డు భూముల లీజులో జలీల్‌ఖన్ పై మండిపాటు
-
‘జలీల్ ఖాన్ ప్రమేయంతోనే అక్కడ మటన్ షాప్’
సాక్షి, విజయవాడ : వించిపేట్లో జెండా చెట్టును తొలగించి మటన్ షాప్ ఏర్పాటు చేయడంలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పవిత్రమైన జెండాలను రోడ్డుపై పడేసి మటన్ షాపు ఏర్పాటు చేశారని విమర్శించారు. షాప్ ఏర్పాటును అడ్డుకున్న వారిపై జలీల్ ఖాన్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. మైనారిటీ ఆస్తులను కాపాడాల్సిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ షాప్ యజమానికి అండగా ఉండటం దారుణమన్నారు. జలీల్ ఖాన్, సలీం, అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ వించిపేటలో ఉద్రిక్తత
-
మహిళా కార్పొరేటర్‌పై నోరు పారేసుకున్న జలీల్‌ఖాన్
-
మహిళా కార్పొరేటర్‌పై జలీల్‌ఖాన్ దౌర్జన్యం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ జాన్ బీపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దౌర్జన్యానికి దిగారు. శనివారం నగరంలోని నైజాం గేట్ సెంటర్లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చారు. ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలతో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా టీడీపీ నాయకులతో ఎలా కొబ్బరికాయ కొట్టిస్తారని ఎమ్మెల్యేను వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జాన్‌బీ ప్రశ్నించారు. ఈ డివిజన్లో నువ్వు పని చేయొద్దు అని జలీల్ ఖాన్ జాన్ బీను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక డివిజన్లో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్‌ను ఎలా పని చేయొద్దని ఆదేశిస్తారని జాన్ బీ జలీల్ఖాన్ను పబ్లిగ్గా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన జలీల్ ఖాన్ జాన్ బీపైకి దూసుకొచ్చారు. కాళ్లు పట్టుకుని సీటు తెచ్చుకున్నావ్ అని ఎమ్మెల్యే జాన్ బీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం మహిళా కార్పొరేటర్‌పై విమర్శలకు దిగారు. దీంతో మహిళలన్న కనీస గౌరవం కూడా లేకుండా మాట్లాడతారా? అంటూ జాన్ బీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ప్రజల కోసం పని చేయొద్దని చెప్పడానికి ఎమ్మెల్యే ఎవరు? అని ప్రశ్నించారు. కార్పొరేటర్ రియాక్షన్‌తో అవాక్కైన జలీల్ ఖాన్ అక్కడి నుంచి జారుకున్నారు. పబ్లిగ్గా మహిళా కార్పొరేటర్‌పై తెలుగు తమ్ముళ్ళు, ఎమ్మెల్యే దౌర్జన్యంపై స్థానికులు నివ్వెరపోయారు. -
జఫ్పాల మాదిరి మాట్లాడొద్దు: జలీల్ ఖాన్
విజయవాడ: ‘బీకాంలో ఫిజిక్స్’ వ్యాఖ్యలతో పాపులరైపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి నోరు విప్పారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై ఆరోపణలు గుప్పిస్తున్న పవన్ కల్యాణ్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, ఈ విషయంలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ విధానాలు మనలేవు: ‘‘నిన్నటిదాకా చంద్రబాబును, లోకేశ్‌బాబును తెగపొడిగిన పవన్ కల్యాణ్.. ఇవాళ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? కొన్ని టీవీ చానెళ్లను చూడొద్దని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు అసలు మనలేవు. గతంలో చిరంజీవి చేసినట్లే పవన్ కాపులను మోసం చేస్తున్నారు’ అని జలీల్ ఖాన్ అన్నారు. జఫ్పాల మాదిరి మాట్లాడొద్దు: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని జలీల్ వెనకేసుకొచ్చారు. ‘ఈ విషయంలో చంద్రబాబుపై బీజేపీ నేతలు జఫ్ఫాల మాదిరి మాట్లాడుతున్నార’ని విచిత్రమైన పదాజాలాన్ని వాడారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయంపై మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు. మోదీకంటే చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అని, దమ్ము, ధైర్యంలో బాబును మించినవారు లేరని జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు. -
టీడీపీని నమ్ముకుంటే మోసం చేశారు
సాక్షి, అమరావతి: వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా జలీల్‌ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కడప జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న అమీర్‌బాబు వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అమీర్‌ను సోమవారం వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌గా సీఎం నియమించారు. 25 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకొని ఉంటే తనకు చైర్మన్ పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. జలీల్‌ఖాన్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రాజీనామా పత్రాన్ని ఇచ్చి ఆయన వెళ్లిపోయారు. అనంతరం సీఎం చంద్రబాబును కలసి తన అసంతృప్తిని తెలియజేశారు. సీఎం వారించినా పట్టించుకోకుండా అమీర్‌బాబు వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ పదవిని ఆశించిన ఆయన అది రాకపోవడంతో రాజీనామా పత్రాన్ని జలీల్‌ఖాన్‌కు అందజేశారు. ముఖ్యమంత్రికి కూడా లేఖ పంపారు. ప్రస్తుతం ఆయన జాయింట్ పార్లమెంటరీ పార్టీ వక్ఫ్‌బోర్డు సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన జలీల్ ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఎన్నికైన మరో ఎనిమిది మంది సభ్యులు సోమవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా జలీల్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు స్థలాల పరిరక్షణ కోసం నూతన విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. -
నన్ను అణగదొక్కాలని చూస్తున్నారు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ పెద్దలు తనను అణగదొక్కాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. న్యాయం చేయాలని కోరుతున్న తమపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం చేస్తామన్నారు. బీజేపీ తప్పుడు విధానాలు అనుసరిస్తోందన్నారు. మైనారిటీ కోటాలో జలీల్‌ఖాన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఈ సందర్భంగా ముస్లిం నేతలు చంద్రబాబును కోరారు.ఏపీకి హోదా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ కూడా ప్లీనరీలో చెప్పిందని, అలాంటప్పుడు కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యూ టర్న్ ఎందుకు తీసుకున్నాడో అందరికీ తెలుసన్నారు. -
పవన్‌కు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సవాల్
సాక్షి, అమరావతి: విజయవాడ దుర్గగుడి పార్కింగ్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు. ఆయన గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. దుర్గగుడి పార్కింగ్ వద్ద తాను డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు చేశారని.. వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా వైఖరి మార్చుకున్నారని ఆరోపించారు. మంత్రి లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఒకసారి రాజధాని ప్రాంతాన్ని చూస్తే అభివృద్ధి ఏం జరుగుతుందో కనిపిస్తుందన్నారు. పవన్ కల్యాణ్ సభ పెడుతున్నారంటే.. ప్రత్యేక హోదాపై గట్టి పోరాటం చేస్తారని ప్రజలంతా భావించారని, కానీ ఆయనేమో అసలు విషయం గాలికి వదిలేశారని తెలిపారు. ప్రధాని మోదీని ఒక్కమాట అనని పవన్.. జనసేన వల్లే టీడీపీ గెలిచినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన, బీజేపీ పార్టీలు లేనప్పుడే మెరుగైన ఫలితాలు సాధించామని, ఆ పార్టీలతో కలిసిన తర్వాతే తమ ఓటు బ్యాంక్ తగ్గిందని జలీల్ ఖాన్ వెల్లడించారు. -
ఎమ్యెల్యే జలీల్‌ఖాన్ తనయుడి వీరంగం!
సాక్షి, విజయవాడ: సిటీలో బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూమారుడు సాహుల్ ఖాన్ హంగామా సృష్టించాడు. వివరాలివి.. స్నేహితులతో కలిసి కారును అతివేగంతో నడిపారు. అంతేకాక పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్లో ఓ బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు సాహుల్ ఖాన్ ఉన్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. కాగా కారు నడుపుతున్న కృష్ణతేజా అనే యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతేకాక ఎమ్మెల్యే తనయుడు పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారును ఫొటోలు తీస్తున్న పోలీసులపై ఎమ్మెల్యే తనయుడు సాహుల్ ఖాన్ వీరంగం సృష్టించాడు. అయితే మీడియా కెమెరాలను చూసి అక్కడికి సైలెంట్ గా జారుకున్నాడు. కాగా కారు శాఖమూరి ప్రవీణ్ చౌదరి పేరుపై రిజిస్ట్రర్ అయివుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బీకాంలో ఫిజిక్స్ పుస్తకాలతో సినిమా పాట..
జలీల్ ఖాన్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు కాబోలు. బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పి వార్తల్లోకి ఎక్కారు. ఆ సమయంలో 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకున్నారు. బీకామ్ ఫిజిక్స్‌పై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటన జరిగి ఇటీవలే ఏడాది పూర్తైన దాని జోరు ఏమాత్రం తగ్గలేదు. ఎల్లప్పడు సరికొత్తగా వాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఓ సినిమా పాటలోను బీకామ్ ఫిజిక్స్‌ను వాడేశారు. ఊహలు గుసగుసలాడే ఫేమ్, యువహీరో నాగ శౌర్య తాజా చిత్రం ఛలో సినిమాలోని ఓపాటలో విద్యార్ధులు బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలు పట్టుకొని ఉంటారు. ఛలో సినిమా విషయానికొస్తే నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. రస్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఉషా మూల్పూరి నిర్మతగా వ్యహరిస్తున్నారు. స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. పాటలో నాగ శౌర్య, రస్మికను ఆటపట్టించే సన్నివేశంలో విద్యార్థులందరూ బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలను పట్టుకొని ఉంటారు. -
బి.కాంలో ఫిజిక్స్‌పై జలీల్‌ఖాన్ అవస్థలు
-
‘భయం లేదు.. పవన్‌పై పది ఓట్ల తేడాతో గెలుస్తా’
అమరావతి: ఎన్నికలంటే తనకు అస్సలు భయం లేదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని, తాను పోటీ చేస్తే.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మీద కూడా 10 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వచ్చే ఐడియాలు మరెవరికీ రావని, అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని కొనియాడారు. చంద్రబాబు ముందు మోదీ కూడా సరిపోడంటూ ఆకాశానికెత్తేశాడు. బీజేపీతో ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా అవసరాలు కూడా లేవని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందో లేదో తనకు తెలియదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవికంటే ఎమ్మెల్యేగా ఉండటమే చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. -
బెజవాడ పశ్చిమ టీడీపీలో కలకలం
విజయవాడ : బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి నాగుల్ మీరాను తొలగించింది. ఆయన స్థానంలో జలీల్ ఖాన్‌కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో మీరాను తొలగించడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే మోసం చేస్తారా అంటూ మీరా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే జలీల్ ఖాన్ చేరిక పట్ల పార్టీ నేతల నుంచే తీవ్ర అభ్యంతరాలు ఎదురైన విషయం తెలిసిందే. పార్టీ తాజా నిర్ణయంతో నాగుల్ మీరా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. -
బెజవాడలో అర్థరాత్రి చర్చి కూల్చివేత
విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రసిద్ధ ఆర్సీఎంకు చెందిన సెయింట్ పీటర్స్ కేథడ్రిల్ చర్చిను ఆదివారం అర్థరాత్రి సమయంలో అధికారులు కూల్చి వేశారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందంటూ భారీ యంత్రాలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చర్చి వద్దకు అధికారులు చేరుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న చర్చిని కూల్చవద్దంటూ క్రైస్తవులు అధికారులను వేడుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ నాయకులు ఎస్కే అసీఫ్, బొల్ల విజయ్‌కుమార్ తదితరులు వారికి మద్దతుగా నిలిచారు. చర్చిని కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులను వెనక్కి నెట్టి చర్చిని ధ్వంసం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను చూసి క్రైస్తవ సోదరులు ఆయనకు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
చర్చి తొలగింపు: విజయవాడలో ఉద్రిక్తత
-
'చంద్రబాబును తిట్టొద్దు'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీనే కారణమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆరోపించారు. గురవారం విజయవాడలో జలీల్‌ఖాన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పుడు ఏపీకి సహాయం చేయడంలో కూడా బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆయన అభివర్ణించారు. తలకిందులుగా తపస్సు చేసినా ఏపీలో మాత్రం బీజేపీ బలపడదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేయొచ్చుకానీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబును మాత్రం తిట్టోద్దు అని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. కేంద్రంలో మంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కొన్నాళ్లు వేచి చూస్తామని జలీల్ ఖాన్ వెల్లడించారు. -
చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం
‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గడికోట సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్న అవినీతిపై అమెరికాలో వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులుకు రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పేరుతో సాగుతున్న అవినీతిని, అక్రమాలను వివరిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం షెర్లాట్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రవాసుల మధ్య ‘ఎంపరర్ ఆఫ్ కర ప్షన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాషింగ్టన్ డీసీ, షికాగో, డల్లాస్, డెట్రాయిట్ నగరాల్లో కూడా పర్యటించి ప్రవాసుల మధ్య ఈ పుస్తకాన్ని విడుదల చేస్తామని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేశామని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నారని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని శ్రీకాంత్ విమర్శించారు. జలీల్‌ఖాన్ ఆరోపణలు ఓ మైండ్ గేమ్ అధికారపక్షంలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్ తాను కూడా వస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ మైండ్‌గేమ్‌లో భాగమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాను పదిరోజులుగా కనపడలేదని టీడీపీలోకి వెళతానని మీడియాకు చెప్పడం అభ్యంతరకరమని ఆయన అన్నారు. తాను ప్రతిరోజూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తల వద్ద హాజరు వేయించుకోవాలా? అని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్లమని, పదవులకో ప్రలోభాలకో పార్టీలు మారే వాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ జన్మ ఉన్నంత కాలం తాను వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని ఆయన అన్నారు. టీడీపీ వారు దురుద్దేశ్యంతో ఇలా బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగింది. -
'టీడీపీ కార్యాలయం ఎదుట కాపలాకుక్కలాంటివారు'
తిరుపతి : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. జలీల్ ఖాన్ టీడీపీ కార్యాలయం ఎదుట కాపలాకుక్కలాంటి వారని ఆయన అభివర్ణించారు. జలీల్‌ఖాన్ వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. జలీల్ ఖాన్ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
'జలీల్ ఖాన్‌పై చర్య తీసుకోవాలి'
విజయవాడ: విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి పత్రిక ఫొటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్‌పై దాడి చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ సోమవారం స్థానిక జర్నలిస్టులు తిరువురు తహసీల్దార్‌కు మెమొరాండం ఇచ్చారు. కాగా, విధి నిర్వహణలో ఉన్న ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మండిపడ్డారు. సమాజం మేలు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
'మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుంది'
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుందని ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. తాగునీటి ప్రాజెక్టులతో వస్తున్న కమీషన్లతో చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి వెళ్లామని.... కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, కె.పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ... కృష్ణానదిలో నీరు ఎలా ఎండిపోతుందో... రేపు టీడీపీ కూడా అలాగే ఎండిపోతుందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలోకి జలీల్‌ఖాన్ వెళ్లారన్నారు. ఆయన పార్టీని వీడినా... కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే వంగవీటి రాధా మాట్లాడుతూ... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ గెలవాలని జలీల్ ఖాన్‌కి వంగవీటి రాధా సవాల్ విసిరారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడి వెళ్లడం వల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ మంత్రి, కె.పార్థసారథి వ్యాఖ్యానించారు. గన్‌మాన్, డ్రైవర్, అతని పీఏ మాత్రమే జలీల్‌ఖాన్ వెంట వెళ్లారని... కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పార్థసారథి పేర్కొన్నారు. -
'పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దరిద్రం పోయింది'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. బుధవారం విజయవాడలో పశ్చిమ నియోజకర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావుతోపాటు పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, కె.పార్థసారథి, గౌతంరెడ్డి, నగర కార్పొరేటర్లు హాజరయ్యారు. కొడాలి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి... మళ్లీ ఎన్నికల్లో గెలివాలి అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై మండిపడ్డారు. జలీల్‌ఖాన్ పార్టీ మారడం వల్ల పశ్చిమ నియోజకర్గానికి ఉన్న దరిద్రం పోయిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. -
'ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించండి'
విజయవాడ: ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు విజయవాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. శనివారం ఆయన చంద్రబాబును కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కారించాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షించడంతో పాటు ముస్లింల సంక్షేమానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు జలీల్ ఖాన్ తెలిపారు. -
జలీల్ ఖాన్ కు వైఎస్ జగన్ పరామర్శ
విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు జలీల్ ఖాన్ సోదరుడు మున్వర్ ఖాన్(56) ఆకస్మిక మృతిపట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జలీల్ ఖాన్ ను ఫోన్ లో వైఎస్ జగన్ పరామర్శించి సంతాపం తెలిపారు. జలీల్‌ఖాన్ సోదరుడు మున్వర్‌ఖాన్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వన్‌టౌన్‌లోని తారాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం మున్వర్ఖాన్కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు మున్వర్ ఖాన్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా... ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జలీల్ ఖాన్
-
'వైఎస్ హయాంలో అలా.. బాబు పాలనలో ఇలా'
హైదరాబాద్: విజయవాడలో పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసేవారని జలీల్ ఖాన్ గుర్తుచేశారు. అప్పట్లో వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఉండేవికావని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చడం, పెన్షన్ల పంపిణీలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడంలో రెండు రోజుల క్రితం కూడా తోపులాట జరిగిందని జలీల్ ఖాన్ చెప్పారు. వృద్ధురాలు మరణించిన ఘటనపై చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. -
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత: జలీల్ ఖాన్
విజయవాడ: ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత అని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జలీల్ ఖాన్ అన్నారు. సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రిని జలీల్ ఖాన్ కలిశారు. విజయవాడ నియోజకవర్గంలో షాదిఖానా, రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. -
పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సాక్షి, హైదరాబాద్ : తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టంచేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిం చారు. ఏ పత్రికగాని, టీవీ చానల్ గాని తమపై ఒక వార్తను ఇచ్చే ముందు అందు లో వాస్తవం ఎంత ఉందో నిర్థారించుకోవడానికి తమను సంప్రదించాల్సి ఉందని.. కానీ తనపై వార్త ప్రచురించిన పత్రిక ఆ పని చేయలేదని ఆయన తప్పుపట్టారు. -
'నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా'
-
'నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా'
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు. మరోసారి తనపై నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జలీల్ ఖాన్ హెచ్చరించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ నా నియోజకవర్గానికి అవసరం. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత అని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో చేరనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. -
త్వరలోనే టీడీపీ సర్కార్ కుప్పకూలుతుంది
హైదరాబాద్ : అన్ని రంగాల్లో విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నిలబెట్టుకునే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆరోపించారు. బడ్జెట్లో దేనికీ కేటాయింపులు సరిగ్గా లేవని.. వాటికి సమాధానం చెప్పలేకే సభలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జలీల్‌ఖాన్ విమర్శించారు. -
సమయం కేటాయింపుపై సభలో గందరగోళం
వైఎస్ఆర్సీపీ సభ్యులకు సమయం కేటాయించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. కనీసం రెండు నిమిషాల సమయం ఇవ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. అయితే సమయం ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించడంతో సభలో గందరగోళం నెలకొంది. మొత్తం 175 సీట్లలో నాలుగు సీట్లను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనారిటీలకు ఇచ్చారని, ఆ నలుగురూ గెలిచి సభలోకి వచ్చామని జలీల్‌ఖాన్ అన్నారు. ఏపీలో వక్ఫ్ బోర్డు పెడతారా.. లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంచేయాలని వైఎస్ జగన్ కోరారు. దీనిపై తమ సభ్యులు ప్రశ్నలు అడిగేందుకు సమయం ఇవ్వాలన్నారు. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం ఇదేనని, గతంలో హైదరాబాద్‌లో హజ్ హౌస్ ఉందని, ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా ఎక్కడకు వెళ్లాలో అర్థం కావట్లేదని జలీల్ ఖాన్ అన్నారు. ఏపీలో వక్ఫ్ బోర్డు ఎప్పుడు పెడతారని ప్రశ్నించారు. అలాగే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలుచేస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. మైనారిటీల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, మైనార్టీ, బీసీ సబ్‌ప్లాన్‌పై ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఈ ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమాధానమిచ్చారు. -
'టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తున్నారు'
తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలీల్ ఖాన్ ఖండించారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ... టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు దక్కదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారని...తమ పార్టీలోకి వచ్చేందుకు వారంత సిద్ధంగా ఉన్నారని జలీల్ ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 67 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ వందకు పైగా స్థానాలను గెలుచుకుంది. జూన్ 8న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. కాగా అధికారంలోకి రానున్న టీడీపీలోకి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్‌పై విధంగా స్పందించారు. -
'పార్టీలన్నీ జగన్‌ను టార్గెట్ చేస్తున్నాయి'
రాష్ట్రంలో అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏకైక ఎజెండాగా పెట్టుకున్నాయని ఆ పార్టీ నేతలు కోనేరు ప్రసాద్, జలీల్‌ఖాన్ ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. బుధవారం విజయవాడలో కోనేరు ప్రసాద్, జలీల్‌ఖాన్ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని వారు జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించే సత్తా ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని పేర్కొన్నారు. -
'సీఎం సమైక్యవాదినంటూనే మోసం చేస్తున్నారు'
విజయవాడ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదినంటూనే ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఉద్యోగస్తులు చేస్తున్న సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి సీఎం యత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారా?లేక సమైక్యాంధ్రా ముసుగులో విభనకు సహకరిస్తున్నారా?అని ప్రశ్నించారు. సీమాంధ్రులు సమైక్యంగా ఉద్యమిస్తుంటే సీఎం మాత్రం దశల వారిగా అణదొక్కుతున్నారని తెలిపారు. సమైక్యత కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని జలీల్ ఖాన్ తెలిపారు.