విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీనే కారణమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఆరోపించారు. గురవారం విజయవాడలో జలీల్ఖాన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పుడు ఏపీకి సహాయం చేయడంలో కూడా బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆయన అభివర్ణించారు.
తలకిందులుగా తపస్సు చేసినా ఏపీలో మాత్రం బీజేపీ బలపడదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేయొచ్చుకానీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబును మాత్రం తిట్టోద్దు అని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. కేంద్రంలో మంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని జలీల్ఖాన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కొన్నాళ్లు వేచి చూస్తామని జలీల్ ఖాన్ వెల్లడించారు.