'నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా'
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు. మరోసారి తనపై నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జలీల్ ఖాన్ హెచ్చరించారు.
మెట్రో రైలు ప్రాజెక్ట్ నా నియోజకవర్గానికి అవసరం. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత అని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో చేరనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.