సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకుడు జలీల్‌ఖాన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ సమయంలో జలీల్‌ఖాన్ ప్రజలను భయాబ్రాంతులకు గురి చేసేలా దాడి చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు ఉన్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జలీల్‌ఖాన్ ప్రజలను మభ్యపెట్టాలని చూశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌పై దాడికి పాల్పడిన జలీల్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీని కోరినట్టు తెలిపారు. దాడికి పాల్పడ్డ జలీల్‌ఖాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జలీల్‌ఖాన్ ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment